విటమిన్‌ డి లోపం.. మహిళల్లో ఈ సమస్యలకు కారణమవుతోందా? | Horlicks Women Plus and Apollo Diagnostics support women bone health awareness in India | Sakshi
Sakshi News home page

విటమిన్‌ డి లోపం.. మహిళల్లో ఈ సమస్యలకు కారణమవుతోందా?

Published Tue, Dec 3 2024 5:32 PM | Last Updated on Tue, Dec 3 2024 8:33 PM

Horlicks Women Plus and Apollo Diagnostics support women bone health awareness in India

భారతదేశంలో ప్రతీ 10 మంది మహిళల్లో 9 మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారనీ, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఫుడ్స్ అండ్ రిఫ్రెష్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివ కృష్ణమూర్తి   తెలిపారు. ఇది ఎముకలను బలహీనపరిచడం, బోలు ఎముకల వ్యాధి వంటి తీవ్రమైన పరిస్థితులకు కూడా దారి తీస్తుందనీ,  ఈ నేపథ్యంలోనే ఎముకల ఆరోగ్యం గురించి డ్రైవింగ్ అవగాహన తప్పనిసరి అని  ఆయన పేర్కొన్నారు. 

అపోలో హెల్త్‌ అండ్‌ లైఫ్ట్‌ స్టైల్‌ లిమిటెడ్‌ ద్వారా.. వరుసగా నాలుగో ఏడాది కూడా 30ఏళ్లకు పైబడిన మహిళల్లో ఎముకల ఆరోగ్య అవగాహనను కల్పించడం , పరీక్ష చేయించుకునేలా వారిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి  మాట్లాడుతూ భారతదేశంలో దాదాపు 49.9శాతం మంది స్త్రీలు ఆస్టియోపెనియా , 18.3శాతం  మంది బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నారన్నారు. 

మహిళలు తాత్కాలిక అనాల్జెసిక్స్‌పై ఆధారపడకుండా,అపోలో డయాగ్నోస్టిక్స్, హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ ద్వారా విటమిన్‌ డీ , కాల్షింయ లోపంపై అవగాహన కల్పించి, విటమిన్ డి స్క్రీనింగ్‌ను సరసమైన ధరలో అందుబాటులోకి తెచ్చామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్  బ్రాండ్ అంబాసిడర్.. నటి తాప్సీ పన్నూ సైతం పాల్గొన్నారు.

అపోలో హెల్త్ & లైఫ్‌స్టైల్ లిమిటెడ్‌తో ,హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ భారతదేశంలోని మహిళలకు డీ  విటమిన్‌ టెస్టులను  మరోసారి సరసమైన ధరల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ఇప్పుడు రూ. 1850కు  బదులుగా  కేవలం రూ. 199 కే విటమిన్ D పరీక్షను పొందవచ్చని సంస్థ ఒక ప్రకటనలో  తెలిపింది. 

2023 నాటి మాంప్రెస్సో అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో 98శాతంమంది మహిళలు  ఒళ్ళు నొప్పులతో  బాధపడుతున్నారు. ముఖ్యంగా వీరిలో 87శాతం  మందికి  ఈ పెయిన్స్‌,  ఎముకల ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోలేరు. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ డీ ఒక ముఖ్యమైన పోషకం. ఈ లోపాన్ని గుర్తించడానికి క్రమం తప్పకుండా పర్యవేక్షణ అవసరం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement