appolo Hospital
-
స్ట్రోక్ థ్రోంబోలిసిస్, థ్రోంబెక్టమీపై అపోలో హాస్పిటల్స్ సదస్సు
హైదరాబాద్, మార్చి 10, 2025: అపోలో హాస్పిటల్స్ మార్చి 8 ,9, తేదీలలో స్ట్రోక్ థ్రోంబోలిసిస్ అండ్ థ్రోంబెక్టమీపై ఎస్టీఏటీ-2025 సదస్సు విజయవంతంగా నిర్వహించింది. తీవ్రమైన స్ట్రోక్ నిర్వహణలో అత్యాధునిక పురోగతి, వినూత్న ఇమేజింగ్ పద్ధతులు , క్లిష్టమైన విధానపరమైన వ్యూహాలను చర్చించడానికి ప్రముఖ అంతర్జాతీయ , జాతీయ నిపుణులను సమావేశపరిచింది.ఈ సదస్సులను తెలంగాణ డీజీపీ డాక్టర్ జితేందర్, అపోలో హాస్పిటల్స్ తెలంగాణ ప్రాంత సీఈఓ శ్రీ వి తేజస్వి రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్య నిపుణులు, అపోలో హాస్పిటల్స్ అసోసియేట్ డీఎంఎస్ డాక్టర్ సుబ్బారెడ్డి, అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్-న్యూరాలజిస్ట్ డాక్టర్ అలోక్ రంజన్, సీనియర్ కన్సల్టెంట్-న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ హాజరయ్యారు.ప్రారంభోత్సవానికి హాజరైన ప్రఖ్యాత అంతర్జాతీయ వైద్య నిపుణులలో బాసెల్, స్విట్జర్లాండ్ కు చెందిన డాక్టర్ మారియోస్ సైకోగియోస్, బార్సిలోనా, స్పెయిన్‌కు చెందిన డాక్టర్ మార్క్ రిబో, అల్బానీ, న్యూయార్క్, యుఎస్ఏకు చెందిన డాక్టర్ నబీల్ హెరియల్, ఫిలడెల్ఫియా, యుఎస్ఏ కు చెందిన డాక్టర్ రీడ్ గూచ్, ఫిలడెల్ఫియా, యుఎస్ఏ కు చెందిన డాక్టర్ ఉస్మాన్ కోజాక్ మరియు ఇస్తాంబుల్, టర్కీ కు చెందిన డాక్టర్ యిల్మాజ్ ఓనాల్ ఉన్నారు.ఈ సందర్భంగా అపోలో గ్రూప్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ .. ప్రపంచవ్యాప్తంగా వైకల్యం , మరణాలకు ఒక ముఖ్యమైన కారణంగా తీవ్రమైన స్ట్రోక్ నిలుస్తుంది . ఎస్టీఏటీ-2025 వంటి సదస్సులు ప్రపంచ నాయకుల మధ్య విప్లవాత్మక ఆలోచనలు, పద్ధతులు, అనుభవాల మార్పిడిని సులభతరం చేయడం ద్వారా స్ట్రోక్ కేర్‌ను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అపోలో ఆస్పత్రిలో స్ట్రోక్ కేర్‌కు సంబంధించిన అన్నీ రకాల చికిత్సలను అందిస్తున్నట్లు తెలిపారు.అపోలో హాస్పిటల్స్ తెలంగాణ ప్రాంత సీఈఓ శ్రీ వి తేజస్వి రావు మాట్లాడుతూ, "అపోలో హాస్పిటల్స్ వద్ద , ఆవిష్కరణ , నైపుణ్యం ద్వారా తీవ్రమైన స్ట్రోక్ కేర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నాము. స్ట్రోక్ థ్రోంబోలిసిస్ థ్రోంబెక్టమీలో విప్లవాత్మక పురోగతిని చర్చించడానికి ప్రపంచ, జాతీయ నిపుణులను ఒకచోట చేర్చడానికి ఎస్టీఏటీ-2025 సమావేశం కీలకమైన వేదికగా పనిచేస్తుంది. రోగికి మెరుగైన ఫలితాలను అందించటానికి తోడ్పడనుంది’ అని అన్నారు. అపోలో హాస్పిటల్స్ తెలంగాణ ప్రాంత మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర బాబు మాట్లాడుతూ.. స్ట్రోక్ నిర్వహణలో సకాలంలో తగిన వైద్య సేవలను అందించడం చాలా కీలకం. ఎస్టీఏటీ-2025 సమావేశం ఈ రంగంలో అవగాహన మరియు క్లినికల్ నైపుణ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తాజా చికిత్సలు , సాంకేతికతలపై చర్చలను ప్రోత్సహించడం ద్వారా, తీవ్రమైన స్ట్రోక్ కేర్‌లో కొత్త ప్రమాణాలను నిర్దేశించటానికి మరియు రోగులకు మెరుగైన ఫలితాలను నిర్ధారించడానికి మేము కృషి చేస్తున్నాము’ అని అన్నారు.ఎస్టీఏటీ-2025 సమావేశంలో యుఎస్ఏ , స్పెయిన్, స్విట్జర్లాండ్, సింగపూర్, టర్కీ వంటి దేశాల నుండి హాజరైన అంతర్జాతీయ అధ్యాపకులతో పాటు 650 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. -
విటమిన్ డి లోపం.. మహిళల్లో ఈ సమస్యలకు కారణమవుతోందా?
భారతదేశంలో ప్రతీ 10 మంది మహిళల్లో 9 మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారనీ, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఫుడ్స్ అండ్ రిఫ్రెష్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివ కృష్ణమూర్తి తెలిపారు. ఇది ఎముకలను బలహీనపరిచడం, బోలు ఎముకల వ్యాధి వంటి తీవ్రమైన పరిస్థితులకు కూడా దారి తీస్తుందనీ, ఈ నేపథ్యంలోనే ఎముకల ఆరోగ్యం గురించి డ్రైవింగ్ అవగాహన తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. అపోలో హెల్త్ అండ్ లైఫ్ట్ స్టైల్ లిమిటెడ్ ద్వారా.. వరుసగా నాలుగో ఏడాది కూడా 30ఏళ్లకు పైబడిన మహిళల్లో ఎముకల ఆరోగ్య అవగాహనను కల్పించడం , పరీక్ష చేయించుకునేలా వారిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో దాదాపు 49.9శాతం మంది స్త్రీలు ఆస్టియోపెనియా , 18.3శాతం మంది బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నారన్నారు. మహిళలు తాత్కాలిక అనాల్జెసిక్స్పై ఆధారపడకుండా,అపోలో డయాగ్నోస్టిక్స్, హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ ద్వారా విటమిన్ డీ , కాల్షింయ లోపంపై అవగాహన కల్పించి, విటమిన్ డి స్క్రీనింగ్‌ను సరసమైన ధరలో అందుబాటులోకి తెచ్చామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ బ్రాండ్ అంబాసిడర్.. నటి తాప్సీ పన్నూ సైతం పాల్గొన్నారు.అపోలో హెల్త్ & లైఫ్‌స్టైల్ లిమిటెడ్‌తో ,హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ భారతదేశంలోని మహిళలకు డీ విటమిన్ టెస్టులను మరోసారి సరసమైన ధరల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ఇప్పుడు రూ. 1850కు బదులుగా కేవలం రూ. 199 కే విటమిన్ D పరీక్షను పొందవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 2023 నాటి మాంప్రెస్సో అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో 98శాతంమంది మహిళలు ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా వీరిలో 87శాతం మందికి ఈ పెయిన్స్, ఎముకల ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోలేరు. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ డీ ఒక ముఖ్యమైన పోషకం. ఈ లోపాన్ని గుర్తించడానికి క్రమం తప్పకుండా పర్యవేక్షణ అవసరం. -
మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్ ఇకలేరు..
హైదరాబాద్: మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్(77) తుదిశ్వాస విడిచారు. కొన్ని సంవత్సరాలుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న పీవీ సతీష్.. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా, సేంద్రీయ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు కోసం 4 దశాబ్దాలుగా కృషి చేసినందుకు గానూ ఈయనను మిల్లెట్ మ్యాన్‌గా పిలుస్తారు. అయితే, 1945 జూన్ 18న కర్ణాటకలో జన్మించిన పీవీ సతీష్.. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లోని దూరదర్శన్‌లో డైరెక్టర్‌గా పని చేశారు. అనంతరం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ స్థాపించారు. జహీరాబాద్ ప్రాంతంలో దళిత మహిళా సాధికారతకు పీవీ సతీశ్ కుమార్ విశేషంగా కృషి చేశారు. అలాగే, వాతావరణ మార్పుల నేపథ్యంలో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులకు ప్రత్యామ్నాయంగా.. సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున రైతుల్లో అవగాహన కల్పించారు. అంతేకాకుండా.. హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై తొలి మిల్లెట్స్ కేఫ్ ఏర్పాటుకు తన వంతు కృషి చేశారు. 30 సంవత్సరాల కిందట మొదటిసారిగా ప్రపంచవ్యాప్త చర్చలో.. చిరుధాన్యాలను ప్రవేశపెట్టడంలో సఫలీకృతమయ్యారు.సేంద్రీయ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు కోసం 4 దశాబ్దాలుగా కృషి చేశారు. ప్రత్యేకించి చిన్న కమతాల్లో పెట్టుబడి లేకుండా.. చిరుధాన్యాల పంటల సాగు, విస్తీర్ణం, వినియోగం పెంపు కోసం కృషి చేశారు. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలను చేర్చడంలో.. 2018 సంవత్సరాన్ని కేంద్రం జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వీరి కృషికి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఇక, సతీష్ మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జహీరాబాద్‌లో జరుగనున్నాయి. -
మరణానికి ముందు డాక్టర్లపై జయలలిత ఆగ్రహం.. ఆడియో క్లిప్ వైరల్
సాక్షి, చెన్నై: దాదాపు ఏడేళ్లు కావొస్తున్నా.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో అనుమానాలు మాత్రం తొలగడం లేదు. జయలలిత మరణంపై దర్యాప్తు చేసిన జస్టిస్ ఆర్ముగస్వామి కమిటీ.. ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక సైతం సంచలనంగా మారింది. తాజాగా జయలలిత మృతి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మరణానికి ముందు చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. నేను బాధ పడుతుంటే మీరు పట్టించుకోవడం లేదంటూ ఆపోలో సిబ్బందిపై జయలలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను పిలిచినపుడు మీరెందుకు రాలేదంటూ డాక్టర్లపై జయలలిత మండిపడ్డారు. చికిత్స సమయంలో ఆమె తీవ్రంగా దగ్గుతుండటం, డాక్టర్లపై చిరాకు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. జయలలిత ఆడియోను ఆస్పత్రి సిబ్బందిలోని ఓ వ్యక్తి రికార్డ్ చేశారు. జయలలిత మరణంపై దర్యాప్తు చేసిన జస్టిస్ ఆర్ముగస్వామి నివేదికతో ఆడియో బయటకు వచ్చింది. #Jayalalithaa's audio clip goes viral #JayalalithaaDeath pic.twitter.com/beG7zS3xCj — Janardhan Veluru (@JanaVeluru) October 20, 2022 విదేశాలకు అవసరమా? అదే విధంగా 2017లో చెన్నైలో తన ప్రెస్ మీట్ అనంతరం డాక్టర్ రిచర్డ్ బిల్ మాట్లాడిన వీడియో కూడా వైరల్‌గా మారింది. జయలలిత వైద్యం కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉందా? అని శశికళ ప్రశ్నించగా.. ఆమె తప్పక వెళ్లాలని డాక్టర్ చెప్పడంతో వారు అంగీకరించారు. కానీ ఆ తర్వాత జయలలితే స్వయంగా చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదని డాక్టర్ రిచర్డ్ బిల్ పేర్కొన్నారు. చదవండి: జయలలిత మరణం...శశికళను విచారణకు ఆదేశించాలన్న కమిషన్ ఆర్ముగస్వామి నివేదిక ఏం చెబుతోంది ఇదిలా ఉండగా జయలలిత మరణంపై జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ 608 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను మంగళవారం అసెంబ్లీ ముందుకొచ్చింది. ఇందులో కమిషన్ సూచించిన పలు కీలక అంశాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రస్తావించింది. ఈ నివేదికలోనూ పలు అంశాలు శేష ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మాజీ ముఖ్యమంత్రి మరణించిన సమయంలో తేడా ఉండటం, జయలలితకు లండన్, అమెరికా వైద్యులు యాంజియో చికిత్సకు సిఫార్సు చేసినా చివరి వరకు అందించకపోవడంపై ఆర్ముగస్వామి కమిషన్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. శశికళ విచారణకు ఆదేశం సమగ్ర సమాచారం కోసం చిన్నమ్మ శశికళతోపాటు ఏడుగురు కీలక వ్యక్తులను పూర్తి స్థాయిలో ప్రశ్నించాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం గమనార్హం. శశికళ, జయలలిత వ్యక్తిగత డాక్టర్ శివ కుమార్, మాజీ సీఎస్ రామ్మోహన్రావు, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్, మాజీ ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ వంటి పేర్లను ప్రత్యేకంగా సూచిస్తూ వీరిని విచారణ పరిధిలోకి తీసుకురావాలని కోరింది. ఇక జయలలిత, శశికళ మధ్య గతంలో నెలకొన్న గొడవల వివరాలను సైతం నివేదికలో పొందుపరిచింది. విచారణకు తనను ఆదేశించడంపై శశికళ స్పందించారు. నివేదికను ఊహాగానాలతో రూపొందించారని.. జయలలిత మరణాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఇక దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 2016న మృతి చెందిన విషయం తెలిసిందే. -
నిలకడగా ఈటల ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్/ హుజూరాబాద్/బంజారాహిల్స్: పాదయాత్ర సందర్భంగా తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మెరుగైన చికిత్స కోసం శనివారం హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో ఆయన ప్రజాదీవెన పాదయాత్ర చేస్తున్న క్రమంలో జ్వరం రావడంతోపాటు ఆక్సిజన్, బీపీ లెవల్స్‌తగ్గి తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఈటలను శనివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజుల్లో ఆయన కోలుకుంటారని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. ఈటలకు కోవిడ్ పరీక్ష నిర్వహించగా నెగెటివ్ వచ్చిందని, స్వల్పంగా జలుబు, మోకాళ్ల నొప్పుల తో బాధపడుతున్నారని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. ఓట్లు కొనుక్కోకూడదు: బండి సంజయ్ హుజూరాబాద్‌లో గెలిచేందుకు ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతున్నదని, వేల కోట్లు ఖర్చు చేస్తూ అబద్ధాలతో గెలిచే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దుయ్యబట్టారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈటలను శనివారం ఆయన పార్టీ నేతలు వివేక్, డీకే అరుణ తో కలసి పరామర్శించారు. ఈటల తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈటల ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ఈటలకు ఉన్న బలం ప్రజలేనని, ఫామ్‌హౌస్ రాజకీయాలు ఆయనకు చేతకావని రాజేందర్‌ను పరామర్శించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. జితేందర్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు ఈటలను పరామర్శించారు. -
‘మెరుగైన వైద్య సేవలందించండి’
తిరుమల: శ్రీవారి నిత్య కైంకర్యాల పర్యవేక్షకులకు అనారోగ్యంగా ఉండడంతో వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం అధికారులను ఆదేశించారు. మరింత మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైతే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించాలని సూచించారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. స్వామివారికి జరగాల్సిన నిత్య కైంకర్యాలకు సంబంధించి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై సమీక్షించనున్నట్లు తెలిపారు. -
ప్రముఖ నటి గీతాంజలి కన్నుమూత
ప్రముఖ నటి గీతాంజలి (72) ఇక లేరు. బుధవారం హఠాత్తుగా కడుపు నొప్పి అని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను రాత్రి 11.45 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం తెల్లవారు జామున ఆమె తుది శ్వాస విడిచారు. 1947లో కాకినాడలో జన్మించారు గీతాంజలి. ఆమె అసలు పేరు మణి. ఆమె తల్లిదండ్రులకు నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి అయితే మణి రెండో కుమార్తె. మూడేళ్ల వయసు నుంచే అక్క స్వర్ణతో కలిసి కాకినాడలోని గంధర్వ నాట్యమండలిలో నాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది. భర్త రామకృష్ణతో... పలు నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చింది. 1961లో ‘సీతారామ కల్యాణం’తో కథానాయికగా పరిచయమైంది మణి. ఆ సినిమాలోని ‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండీ...’ పాట నేటికీ శ్రీరామ నవమి పందిళ్లలో, పెళ్లి పందిళ్లలో వినిపిస్తుంటుంది.‘సీతారామ కల్యాణం’లో సీత పాత్ర ఒప్పుకున్నప్పుడు గీతాంజలి వయసు 14. ఎన్టీఆర్ రావణాసురుడు, రాముడేమో హరనాథ్. అంతకుముందు ‘రాణీ రత్నప్రభ’ అనే సినిమాలో గీతాంజలి చేసిన ఓ డ్యాన్స్ బిట్ చూసి, ‘సీతారామ కల్యాణం’లో సీత పాత్రకు తీసుకోవాలనుకున్నారు ఎన్టీఆర్. ‘నవరాత్రి’లో ఓ దృశ్యం ఆ చిత్రానికి ఆయనే దర్శకుడు. ‘‘ఏం భయపడొద్దు. మీరే సీత అనుకోండి.. చేయండి’’ అని భయపడుతున్న గీతాంజలితో అన్నారు. ఎన్టీఆర్ చెప్పింది చెప్పినట్లు చేశారామె. సినిమా రిలీజైంది. ఘనవిజయం సాధించింది. అప్పుడు గీతాంజలి ఎక్కడ కనిపించినా ‘అదిగో సీత’ అనేవారు. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయ్యారు గీతాంజలి. ఎన్టీఆర్ తిలకం దిద్దేవారని, ‘సీతారామ కల్యాణం’ వంద రోజుల వేడుక శ్రీరామ నవమి వేడుకలా జరగడం మరచిపోలేనని ఓ సందర్భంలో పేర్కొన్నారామె. ‘మణి’ పేరుతో పరిచయమైన ఆమె గీతాంజలిగా ఎలా మారారంటే? హిందీ చిత్రంతో పేరు మార్పు ఆ మార్పుకి కారణం హిందీ సినిమా ‘పారస్ మణి’ (1963). అందులో గీతాంజలిది రాజకుమారి పాత్ర. సినిమా పేరు ‘పారస్ మణి’, కథానాయిక నిజమైన పేరు ‘మణి’ అంటే కన్ఫ్యూజ్ అవుతారని చిత్రదర్శకుడు బాబూ భాయ్ మిస్త్రీ ‘గీతాంజలి’గా మార్చారు. అప్పటివరకూ దక్షిణాది తెరపై ‘మణి’ పేరుతో పాపులర్ అయిన గీతాంజలి ఆ తర్వాతి నుంచి మార్చిన పేరుతో కొనసాగడం విశేషం. మణి సార్థక నామధేయురాలు అనాలి. పేరుకి తగ్గట్టుగానే నటనలో ‘మణి’ అనిపించుకుని, మంచి ‘నటనామణి’గా తెలుగు చలన చరిత్రలో నిలిచిపోయారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించారు గీతాంజలి. మలయాళ సినిమా ‘స్వప్నంగళ్’లో ఆమె అంధురాలి పాత్ర చేశారు. అప్పుడు గీతాంజలికి 18 ఏళ్లు. ఆ సినిమాలో గీతాంజలి చిన్ననాటి పాత్రను శ్రీదేవి చేయడం విశేషం. అప్పుడు శ్రీదేవికి తొమ్మిదేళ్లు. తమిళంలో శారద, దైవత్తిన్ తాయ్, పనమ్ పడైత్తవన్.. ఇలా పలు చిత్రాల్లో నటించారు. హీరోయిన్ టు హాస్యం ఒకవైపు కథానాయికగా నటిస్తూనే చెల్లెలి పాత్రలూ చేసేవారు. ‘డా. చక్రవర్తి’లో చేసిన ఏయన్నార్ చెల్లెలి పాత్ర, ‘లేత మనసులు’లో చేసిన డ్యాన్స్ టీచర్ తదితర పాత్రలు గీతాంజలికి మంచి పేరు తెచ్చాయి. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో కథానాయికగా చేసిన ‘ఇల్లాలు’ సినిమా కూడా గీతాంజలి కెరీర్‌కి ప్లస్ అయింది. అందులో ఆమె కథానాయికగా, దొంగగా ద్విపాత్రాభినయం చేశారు. అయితే కథానాయికగా కొనసాగుతున్న సమయంలో ‘దేవత’ సినిమాలో హాస్యపాత్ర ఒప్పుకోవడం తాను చేసిన తప్పు అని, పద్మనాభం వల్లే తన కెరీర్ హాస్యం వైపు మళ్లిందని ఓ సందర్భంలో గీతాంజలి చెప్పారు. సినిమా పరిశ్రమలో ఏదైనా పాత్ర బాగా క్లిక్ అయితే ఆ తర్వాత ఆ ఆర్టిస్ట్‌ని ఆ తరహా పాత్రలకు పరిమితం చేయడం ఓ ఆనవాయితీ. అలా ‘దేవత’ చిత్రంలో గీతాంజలి చేసిన హాస్య పాత్రకు మంచి ప్రశంసలు రావడంతో దర్శకులు ఆమెని చూసే దృష్టి కోణం మారిపోయింది. అప్పటినుంచి ఆమెకు కామెడీ పాత్రలకే అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు. అలాగే ‘వ్యాంప్ క్యారెక్టర్స్’, ‘డ్యాన్స్ నంబర్స్’ కూడా చేశారామె. హీరోయిన్గా దాదాపు 50 చిత్రాలు చేసిన గీతాంజలి కెరీర్ కామెడీ ఆర్టిస్ట్‌కి మారింది. అయితే కామెడీ జంటల్లో పద్మనాభం, గీతాంజలిలది హిట్ పెయిర్. ‘మర్యాద రామన్న’, ‘పొట్టి ప్లీడరు’ వంటి చిత్రాల్లో జంటగా నటించారు. అది గీతాంజలి నిజాయతీకి నిదర్శనం మామూలుగా రీమేక్ సినిమాలు చేస్తున్నప్పుడు ‘నా స్టయిల్లో చేశాను. కాపీ కొట్టలేదు’ అని చెబుతుంటారు. కానీ గీతాంజలి మాత్రం ‘కాపీ కొట్టాను’ అని ఒప్పుకోవడం ఆమె నిజాయతీకి నిదర్శనం. తమిళంలో కె. బాలచందర్ తెరకెక్కించిన ‘ఎదిర్ నీచ్చల్’ సినిమాని ‘సంబరాల రాంబాబు’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. అందులో షావుకారు జానకి చేసిన పాత్రను తెలుగులో గీతాంజలి చేశారు. ‘‘తమిళ సినిమాలో షావుకారు జానకి పాత్ర చూశాను. ఆమెను కాపీ కొట్టాను’’ అని ఓ సందర్భంలో గీతాంజలి అన్నారు. బామ్మగా రీ–ఎంట్రీ కెరీర్ సజావుగా కొనసాగుతున్న సమయంలోనే ప్రముఖ నటుడు రామకృష్ణతో గీతాంజలి వివాహం జరిగింది. వాస్తవానికి వారిది ప్రేమ వివాహం అనుకుంటారు కానీ, పెద్దలు కుదిర్చిన పెళ్లే అని గీతాంజలి స్వయంగా పేర్కొన్నారు. పెళ్లి తర్వాత భర్త విశ్రాంతి తీసుకోమనడంతో గీతాంజలి సినిమాలకు దూరమయ్యారు. నటిగా రీ–ఎంట్రీలో ‘పెళ్లైన కొత్తలో’ చిత్రంలో చేసిన బామ్మ పాత్ర క్లిక్ అయింది. ఆ తర్వాత ఆమె ఈ తరహా పాత్రలు చేయడం మొదలుపెట్టారు. తనయుడిని నటుడిని చేయాలనుకున్నారు గీతాంజలి–రామకృష్ణ దంపతులకు ఓ కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్‌ని నటుడిని చేయాలనే ఆకాంక్ష ఇద్దరికీ ఉండేది. 2001లో రామకృష్ణ చనిపోయారు. అప్పటివరకూ చెన్నైలోనే ఉంటున్న గీతాంజలి భర్త దూరమయ్యాక హైదరాబాద్‌కి మకాం మార్చారు. శ్రీనివాస్ ఓ మూడు సినిమాలు కమిట్ అయినా, అవి విడుదల వరకూ రాలేదు. చిత్రప్రముఖుల నివాళి గీతాంజలి హఠాన్మరణం చిత్రపరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. గురువారం ఆస్పత్రి నుంచి ఆమె భౌతిక కాయాన్ని నందీ నగర్‌లోని ఆమె నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం ఫిలిం చాంబర్ ఆవరణలో ఉంచారు. ఆ తర్వాత మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణంరాజు, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్, జీవితా రాజశేఖర్, పరుచూరి గోపాలకృష్ణ, వీకే నరేష్.. ఇలా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గీతాంజలి మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినిమాల్లో గీతాంజలి చెరగని ముద్ర వేశారని ఆయన కొనియాడారు. ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించిన గీతాంజలి అక్కడ కూడా తన ప్రతిభ చూపారని పేర్కొన్నారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గీతాంజలి మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘సీతారామ కల్యాణం’తో పాటు అనేక తెలుగు చిత్రాల్లో ఆమె ప్రదర్శించిన నటన గుర్తుండిపోతుందన్నారు. చెమర్చిన కళ్లతో శ్రీనివాస్ -
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మృతి
సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ మాజీ మంత్రి ఎం.ముఖేశ్ గౌడ్(60) సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ముఖేష్ గౌడ్ సోమవారం మధ్యాహ్నం మరణించారు. 1959 జూలై 1న జన్మించిన ముఖేశ్ గౌడ్.. 1989, 2004లో మహారాజ్‌గంజ్ నుంచి, 2009లో గోషామహల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2007లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ముఖేశ్ గౌడ్ బాధ్యతలు నిర్వహించారు. 2009లో మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018 ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీ చేసిన ముఖేష్ గౌడ్, బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తీవ్ర అస్వస్థతకు గురైన ముఖేశ్ గౌడ్.. అంబులెన్స్‌లో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్న సంగతి తెలిసిందే. ముఖేశ్ గౌడ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వైఎస్ జగన్ సంతాపం.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేష్ గౌడ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ముఖేష్ గౌడ్ మృతి గురించి తెలిసిన వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ముఖేష్ గౌడ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఏఐసీసీ అధికార ప్రతినిథి దాసోజు శ్రవణ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ముఖేష్ గౌడ్ మృతదేహాన్ని జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని ఆయన స్వగృహానికి తరలించారు. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ, ఎమ్మెల్సీ బోడకంటి వెంకటేశ్వర్లు వంటి సీనియర్ నేతలు ముఖేష్ గౌడ్ ఇంటి వద్దకు చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. రేపు సాయంత్రం అంత్యక్రియలు.. మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ భౌతికకాయానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తొలుత రేపు ఉదయం 10-11గంటల వరకూ కార్యకర్తల దర్శనార్థం ముఖేష్ గౌడ్ మృతదేహాన్ని గాంధీభవన్‌లో ఉంచనున్నారు. ఆపై 11-12గంటల వరకూ మొజాంజాహి మార్కెట్లోని ఇంటి వద్ద ఉంచనున్నట్లు సమాచారం. సాయంత్రం 3గంటలకు షేక్‌పేటలోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ సమీపంలోని గౌడ సమాజ్‌లో దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు సమాచారం. -
జయ మృతి విచారణ కమిషన్‌పై స్టే
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మృతి మిస్టరీపై విచారణ జరుపుతున్న ఏకసభ్య ఆర్ముగస్వామి కమిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. అపోలో వైద్యులను కూడా విచారించేందుకు జస్టిస్ ఆర్ముగ స్వామి పూనుకోవడంతో అపోలో యాజమాన్యం మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆర్ముగ స్వామి ఒక్కరే కాకుండా స్వచ్ఛంద వైద్య నిపుణుల బృందం, ప్రత్యేక నిపుణుల బృందాలను ఏర్పాటు చేసి వైద్యులను విచారించాలని కోరింది. ఈ పిటిషన్‌ను విచారించిన మద్రాసు హైకోర్టు అపోలో అభ్యర్థనను తోసిపుచ్చడంతో అపోలో సుప్రీంను ఆశ్రయించింది. -
జయలలిత చికిత్స వీడియోలు లేవు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు తమ ఆస్పత్రిలో చికిత్సచేసినపుడు చిత్రీకరించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం లేవని, అవి చెరిగిపోయాయని చెన్నై అపోలో ఆస్పత్రి యాజమాన్యం స్పష్టంచేసిన విషయం తాజాగా వెల్లడైంది. జయ మరణంపై తమిళనాడు ప్రభుత్వం రిటైర్డు జడ్జి ఆర్ముగస్వామి చైర్మన్‌గా విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ విచారణ కమిషన్‌కు ఈనెల 11న ఆస్పత్రి యాజమాన్యం రాసిన లేఖ బుధవారం బహిర్గతమైంది. సీసీటీవీల్లో రికార్డయిన వీడియోలు నెలరోజులకు మించి ఉండవని, తాజా దృశ్యాలు నమోదు కాగానే పాతవి ఆటోమేటిక్‌గా చెరిగిపోతాయని, జయ చికిత్స దృశ్యాలు సైతం ఇలాగే చెరిగిపోయాయని లేఖలో ఆస్పత్రి వివరణ ఇచ్చింది. దీంతో ఆస్పత్రిలోని సర్వర్లను పరిశీలించి నిపుణుల బృందం సాయంతో చెరిగిపోయిన దృశ్యాలను రాబట్టాలని కమిషన్ నిర్ణయించింది. -
జయ వార్డులో సీసీ కెమెరాలు ఆపేశాం
టీ.నగర్ (చెన్నై): దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చికిత్స పొందిన సమయంలో.. ఒక ఐసీయూ యూని ట్ మొత్తాన్ని ఆమెకే కేటాయించామని, ముందు జాగ్రత్తగా ఆమె వార్డులోని సీసీ కెమెరాలను ఆపేశామని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి వెల్లడించారు. సంబంధం లేని వ్యక్తులు చూడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కొలొరెక్టల్ సర్జరీ, యూఎస్ఏ క్లీవ్‌ల్యాండ్ క్లినిక్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24, 25న నిర్వహించనున్న సదస్సు గురించి మీడియాతో మాట్లాడుతూ.. జయకు అందించిన చికిత్స వివరాల్ని వెల్లడించారు. ‘24 గదుల ఐసీయూ యూనిట్ మొత్తాన్ని జయకే కేటాయించినా.. ఒక గదిని మాత్రమే ఉపయోగించాం. చికిత్స పొందిన 75 రోజులు అన్ని సీసీటీవీల్ని ఆపుచేశాం. మిగతా రోగుల్ని వేరే ఐసీయూలోకి మార్చాం’ అని చెప్పారు. కొద్దికాలం సన్నిహిత బంధువులు తప్ప ఎవరినీ ఐసీయూలోకి అనుమతించలేదని, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్న వైద్యుడి సమ్మతి మేరకే అనుమతించేవారిమని తెలిపారు. జయలలితకు ఆస్పత్రిలో అత్యుత్తమ వైద్య చికిత్స అందించామని, విదేశీ వైద్యులు కూడా సాయపడ్డారని, ఆమె పూర్తిగా కోలుకున్నారని భావించిన తరుణంలో తీవ్ర గుండెపోటు రావడంతో ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయామన్నారు. -
జయ మృతి కేసులో ఊహించని మలుపు!
-
అమ్మ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది
సాక్షి, చెన్నై: అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత (అమ్మ) ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని ఆమె నెచ్చెలి శశికళ ఓ అఫిడవిట్లో తెలిపారు. జయ మరణానికి దారితీసిన పరిస్థితులను విచారిస్తున్న ఆరుముగసామి కమిషన్‌కు శశికళ తరఫు లాయర్ సమర్పించిన ఆ అఫిడవిట్ వివరాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి, బెయిల్ మీద బయటకు వచ్చాక జయలలిత తీవ్ర మనోవేదనకు గురయ్యారని శశికళ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించిందనీ, 2016 సెప్టెంబరు 22న రాత్రి బాత్రూంలో పడిపోవడంతో డాక్టర్ శివకుమార్‌ను పిలిపించానని తెలిపారు. అపోలో ఆస్పత్రికి వెళ్లే దారిలోనే జయ స్పృహలోకి వచ్చి, ఆస్పత్రికి వద్దే వద్దని కోప్పడ్డారని పేర్కొన్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి, చికిత్స జరిపిన వైద్యులు, డిసెంబరు ఐదు వరకు ఆమెను ఎవరెవరు పరామర్శించారు తదితర వివరాలను ప్రమాణ పత్రంలో పొందుపరిచారు. గవర్నర్ విద్యాసాగర్ రావు, భద్రత అధికారులు వీర పెరుమాళ్ స్వామి, పెరుమాళ్ స్వామి, అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న పన్నీరు సెల్వం, ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్, కార్మిక మంత్రి నిలోఫర్ కబిల్, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై తదితరులు జయలలితను పరామర్శించిన వారిలో ఉన్నట్లు వివరించారు. డిసెంబరు నాలుగో తేదీన ‘జై హనుమాన్’ సీరియల్ చూసిన కాసేపటికే ఆమెలో వణుకుడును పుట్టిందనీ ఆ మరుసటి రోజే చనిపోయారని తెలిపారు. -
మహమూద్ అలీకి అస్వస్థత!
-
ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీకి అస్వస్థత!
హైదరాబాద్: ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీకి గురువారం స్వల్ప గుండెనొప్పి రావడంతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు రెండురోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచాల్సిందిగా కుటుంబసభ్యులకు సూచించారు. ఆయనను ఐసీయూలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. -
చెన్నై అపోలో ఆస్పత్రికి బాంబు బెదిరింపు
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందిన చెన్నైలోని అపోలో ఆస్పత్రికి గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. కొందరు దుండగులు ఆస్పత్రిలో బాంబు పెట్టామని బెదిరించడంతో హుటాహుటిన బ్యాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఆస్పత్రి మొత్తాన్ని క్షుణ్ణంగా తనీఖీ చేస్తున్నది. తీవ్ర అనారోగ్యానికి గురైన జయలలిత 74 రోజులపాటు అపోలో ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. 74 రోజులు చికిత్స అందించిన జయలలిత మృత్యువుతో పోరాటంలో విజయం సాధించలేదు. ఒకదశలో ఆమె కోలుకున్నారని, ఇక త్వరలోనే ఇంటికి పంపిస్తారని కథనాలు వచ్చాయి. ఇంతలోనే కార్డియక్ అరెస్టుకు గురికావడంతో సోమవారం రాత్రి జయలలిత తుదిశ్వాస విడిచారని అపోలో ఆస్పత్రి ప్రకటించింది. అయితే, జయలలిత మృతి ప్రకటన, చికిత్స విషయంలో వ్యవహరించిన తీరుపై పలు అనుమానాలు వస్తున్న నేపథ్యంలో అపోలో ఆస్పత్రికి బాంబు బెదిరింపు రావడం గమనార్హం. -
జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి
-
జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి చెప్పారు. ఐసీయూ నుంచి ఆమెను త్వరలో స్పెషల్ రూమ్‌కు మారుస్తామని తెలిపారు. జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి చేస్తామని ప్రతాప్ సి రెడ్డి చెప్పారు. సెప్టెంబర్ 22 నుంచి జయలలిత అపోలోలో చికిత్స పొందుతున్నారు. మొదట్లో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చినా, క్రమేణా కోలుకున్నారు. పలువురు వీఐపీలు ఆపోలో ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. -
నేడు చెన్నైకి లండన్ వైద్యులు
-
వెంటనే జయ ఆరోగ్యం వివరాలు చెప్పండి
-
వెంటనే జయ ఆరోగ్యం వివరాలు చెప్పండి: హైకోర్టు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై తక్షణమే ప్రకటన చేసేలా ఆదేశించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు స్పందించింది. జయలలిత ఆరోగ్యంపై వైద్యులు వెంటనే వైద్య నివేదికను విడుదల చేయాలని ఆదేశించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆరోగ్య విషయంలో ఆందోళన మొదలైనప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేయడం ఆస్పత్రి బాధ్యత అంటూ అపోలో ఆస్పత్రి వైద్యులకు ఆదేశించింది. జ్వరంతోపాటు డీహైడ్రేషన్ కారణంగా సెప్టెంబర్ 22న జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు ఎలాంటి అధికారిక నివేదికను బయటపెట్టలేదు. దీంతో సీఎం జయలలిత ఆరోగ్యంపై తక్షణమే ప్రకటన చేయాలంటూ సోమవారం మద్రాస్ హైకోర్టులో సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈయన ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వెలిసే బోర్డులు, ఫ్లెక్సీలు తదితర ప్రచార సాధనలను తొలగించడం ద్వారా రాష్ట్రంలో బహుళ ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. కొనసాగుతున్న ప్రత్యేక పూజలు అమ్మ(జయలలిత) ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతుండగా మరోపక్క ఆమె అభిమానులు, కార్యకర్తలు ఆరోగ్యం బాగుపడాలని, సత్వరమే కోలుకోవాలని వినూత్న పూజలు చేస్తున్నారు. ఆలయాల్లోకి బారులు తీరి ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా మరికొందరు గత కొద్ది రోజులుగా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఇంకొందరైతే, అపోలో ఆస్పత్రి ఎదుట అమ్మకోసం ఎదురుచూడటమే కాకుండా ఆమె త్వరగా కోలుకోవాలని నేలపై అన్నం పెట్టించుకుని తింటున్నారు. ఇంకొందరు శూలాలు గుచ్చుకొని కూడా దీక్షలు చేస్తున్నారు. -
ఆగని వదంతులు.. అపోలో వద్ద ఉద్రిక్తత!
-
ఆగని వదంతులు.. అపోలో వద్ద ఉద్రిక్తత!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యంపై మళ్లీ వదంతులు రావడం కలకలం రేపుతోంది. ‘అమ్మ’ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఊహాగానాలు వస్తుండటంతో ఆమె అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళన బాట పట్టారు. జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆందోళనకు దిగారు. మరోవైపు తమిళనాడు మంత్రులు కూడా అపోలో ఆస్పత్రికి చేరుకుంటుండటంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జ్వరం, డీ హైడ్రేషన్‌తో సీఎం జయలలిత గత నెల 22న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలితకు వైద్య బృందం మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వారం రోజులపాటు అమ్మ ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేశారు. తదుపరి బులిటెన్లు ఆగడంతో అన్నాడీఎంకే వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో సీఎం జయలలితకు వ్యతిరేకంగా గత రెండు రోజులుగా వదంతులు వచ్చాయి. సీఎం ఆరోగ్యంపై అధికారిక ప్రకటన, ఫొటోతో సహా బహిర్గతం చేయాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే జయలలితను శనివారం రాత్రి పరామర్శించిన ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు.. ఆమె చికిత్స పొందుతున్న వార్డులోకి తాను వెళ్లినట్టు, అక్కడ అందిస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించినట్టు తెలిపారు. ఆమె కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ఆమె త్వరితగతిన కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ జయలలిత ఆరోగ్య పరిస్థితిపై తమిళనాడులో వదంతులు, ఊహాగానాలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్న అభిమానులు.. ఏక్షణంలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జయలలిత సమగ్ర హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని, ఆమె ఫొటోను విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు.