సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు తమ ఆస్పత్రిలో చికిత్సచేసినపుడు చిత్రీకరించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం లేవని, అవి చెరిగిపోయాయని చెన్నై అపోలో ఆస్పత్రి యాజమాన్యం స్పష్టంచేసిన విషయం తాజాగా వెల్లడైంది. జయ మరణంపై తమిళనాడు ప్రభుత్వం రిటైర్డు జడ్జి ఆర్ముగస్వామి చైర్మన్‌గా విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ విచారణ కమిషన్‌కు ఈనెల 11న ఆస్పత్రి యాజమాన్యం రాసిన లేఖ బుధవారం బహిర్గతమైంది. సీసీటీవీల్లో రికార్డయిన వీడియోలు నెలరోజులకు మించి ఉండవని, తాజా దృశ్యాలు నమోదు కాగానే పాతవి ఆటోమేటిక్‌గా చెరిగిపోతాయని, జయ చికిత్స దృశ్యాలు సైతం ఇలాగే చెరిగిపోయాయని లేఖలో ఆస్పత్రి వివరణ ఇచ్చింది. దీంతో ఆస్పత్రిలోని సర్వర్లను పరిశీలించి నిపుణుల బృందం సాయంతో చెరిగిపోయిన దృశ్యాలను రాబట్టాలని కమిషన్ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment