cc footage
-
చైనాలో టెస్లా కారు బీభత్సం.. రెప్పపాటులో ఎంత ఘోరం
చైనాలో ప్రముఖ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టెస్లా వై మోడల్ కారు బీభత్సం సృష్టించింది. బ్రేకులు పనిచేయకపోవడంతో అదుపు తప్పిన కారు ఘోర ప్రమాదానికి కారణమైంది. నవంబర్ 5న దక్షిణ ప్రావిన్సీ గ్వాంగ్డ్వాంగ్లో జరిగిన ఈ ఘటనలో ఓ వాహనదారుడు, హైస్కూల్ బాలిక మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో కారు డ్రైవర్ కూడా ఉన్నాడు. కాగా టెస్లా కంపెనీకి చైనా రెండవ అతిపెద్ద మార్కెట్. ఐతే ఈ ప్రమాద ఘటనతో చైనా సోషల్ మీడియాలో టెస్లా కారులపై మిర్శలు ఒక్కసారిగా హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణాలను వెల్లడించాల్సి ఉంది. అంతేగాక చైనాలోని టెస్లా కంపెనీ ఏజెన్సీ నుంచి ప్రమాదంపై వివరణ కోరారు. దీనిపై ఎలెన్ మస్క్ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు మాట్లాడూతూ...దయచేసి ఎలాంటి పుకార్లను నమ్మవద్దు త్వరలోనే అసలు కారణం బయటపడుతుందన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఘోర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలో వాహనం నియంత్రణ కోల్పోవడంతో డ్రైవర్ కారుని అదుపుచేయలేకపోయినట్లు తెలుస్తోంది. అలాగే కారు వేగంగా వెళ్తున్నప్పుడూ బ్రేక్ లైట్లు ఆన్ అవ్వలేదని, పైగా డ్రైవర్ బ్రేక్ వేసేందుకు యత్నిస్తున్నట్లు కూడా అనిపించలేదని కొందరూ చెబుతున్నారు. అయితే డ్రైవర్ బంధువు వాదనలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. టెస్లా కంపెనీ కారులో బ్రేక్ సమస్య ఉంటుందని కారు డ్రైవర్ బంధువు ఒకరు చెప్పారు. ఈ మేరకు చైనీస్ కోర్టు టెస్లా కంపెనీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు ఉన్నాయని కారు డ్రైవర్‌కు చురకలు అంటించింది. మీడియా ఏమో బ్రేక్ ఫెలవ్వడం అని చెబితే తమరు మరోలా కథనం చెబుతున్నారని, వాస్తవాలకు విభిన్నంగా ఉందని మండిపడుతూ సదరు యజమానిని టెస్లా కంపెనీకి బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతోపాటు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. This video of a Tesla trying to park and instead taking off at high speed, killing two people seems to keep getting deleted, weird! pic.twitter.com/SGEcZcx6Zq — Read Jackson Rising by @CooperationJXN (@JoshuaPHilll) November 13, 2022 (చదవండి: వైట్‌హౌస్‌లో పెళ్లి సందడి... జోబైడెన్ మనవరాలు పెళ్లి) -
‘అరబిక్’లో అశ్లీలంపై కేసు
సాక్షి, కదిరి (శ్రీసత్యసాయి జిల్లా): పట్టణంలోని అరబిక్ రెస్టారెంట్లో జరిగిన రాసలీలలపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘రెస్టారెంట్లో రాసలీలలు’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై పట్టణ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఆ రెస్టారెంట్లో జరిగిన రాసలీలలకు సంబంధించిన సీసీ పుటేజ్‌ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆ ఇద్దరినీ ప్రేమ జంటగా నిర్ధారించారు. పట్టణంలో కదిరి–అనంతపురం రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. తనకు మాయమాటలు చెప్పి రెస్టారెంట్‌కు తీసుకెళ్లి తనకు తెలియకుండా సీసీ కెమెరాలో బంధించి, తనను మోసగించాడని ఆ యువతి పోలీసుల ఎదుట వాపోయినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పట్టణ నడిబొడ్డున రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలు ఇలాంటి ఘటన చోటు చేసుకుంటే పోలీసులు సదరు రెస్టారెంట్ నిర్వాహకుడిపై ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: (ఛీ..ఛీ..ఇదేం పాడు పని...ఫ్యామిలీ రెస్టారెంట్లో...) -
ఛీ..ఛీ..ఇదేం పాడు పని...ఫ్యామిలీ రెస్టారెంట్లో...
కదిరి: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషాకు గతంలో గన్‌మెన్‌గా పనిచేసిన షేక్షావలీకి చెందిన పట్టణంలోని అరబిక్ రెస్టారెంట్లో ఇటీవల జరిగిన రాసలీల వ్యవహారానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. షేక్షావలీ తన సమీప బంధువు ఇంతియాజ్‌తో కలిసి సుమారు రెండేళ్లుగా పట్టణంలోని బైపాస్ రోడ్డులో రెస్టారెంట్ నడుపుతున్నారు. ఇందులోని రిసెప్షన్‌కు ఎదురుగా వెయిటింగ్ హాల్లో కొద్దిరోజుల క్రితం 18 ఏళ్లలోపు యువతితో 30 ఏళ్ల వయసున్న యువకుడు జరిపిన రాసలీలల వ్యవహారం కాస్త ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. నిత్యం జన రద్దీ ఉండే బైపాస్‌రోడ్డులోని ఫ్యామిలీ రెస్టారెంట్లోనే ఈ వ్యవహారం జరగడంతో పట్టణంలోనే కాదు..ఉమ్మడి అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. రంగంలోకి పోలీసులు.. అరబిక్ రెస్టారెంట్లో ఇలాంటి వ్యవహారాలు తరచూ జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ రెస్టారెంట్లోనే పని చేసే ఓ వ్యక్తి ఈ దృశ్యాలను బయట పెట్టినట్లు హోటల్ యాజమాన్యం భావిస్తోంది. ఆరోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో రెస్టారెంట్లో రద్దీ లేని సమయంలో ఇది జరిగినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. విషయం పట్టణ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరా ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించి ఆ యువతి కదిరి పట్టణానికి చెందిన వ్యక్తిగా నిర్ధారణకు వచ్చారు. కందికుంటకు సన్నిహితుడు .. అరబిక్ రెస్టారెంట్ నిర్వహించే షేక్షావలీ అత్తార్ చాంద్‌బాషా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు గన్‌మెన్‌గా పనిచేశారు. షేక్షా వ్యవహారాలు నచ్చక అత్తార్ ఆయన్ను దూరం పెట్టారు. తర్వాత ఆయన విధులకు దీర్ఘకాలిక సెలవు పెట్టి కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ చెంత చేరారు. 2019 ఎన్నికల సమయంలో కందికుంటకు అన్నివిధాలా సహకరించారు. అలాగే ఆయన పట్టణంలో రూ.కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాం మా రెస్టారెంట్లో అది జరిగి చాలా రోజులైంది. దీనిపై ఈ మధ్యే పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. మా హోటల్లో పని చేస్తూ ఇటీవల వెళ్లిపోయిన ఓ వ్యక్తి కారణంగానే ఇది బయటకొచ్చినట్లు అనుమానంగా ఉంది. ఆ సీసీ ఫుటేజీ ఆధారంగా అది మా రెస్టారెంట్లోనే జరిగిందని ఒప్పుకుంటున్నాం. – ఇంతియాజ్, రెస్టారెంట్ ఓనర్ (చదవండి: హాయిగా సాగుతున్న కాపురంలో చిచ్చుపెట్టిన అనుమానం.. కాళ్ల పట్టుకుని ఈడ్చుకెళ్లి...) -
సింగర్ సిద్ధూ హత్య కేసు: కీలకంగా మారునున్న సెల్ఫీ!
చండీగఢ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇది ముమ్మాటికి పక్కా ప్లాన్ ప్రకారం చేసిన ప్రతికార హత్య అని దర్యాప్తులో తేలింది. అదీగాక అనుమానితుడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కూడా తన అన్నని మట్టుపెట్టినందుకు ప్రతీకారంగానే సిద్ధూని తన ముఠా సభ్యులు చంపినట్టు ఒప్పుకున్నాడు. ఈ తరుణంలో సిద్ధు హత్య జరిగిన రోజుకు సంబంధించిన సీసీఫుటేజ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ఫుటేజ్‌లో సిద్ధూ ఎస్యూవీ కారుకి సమీపంలో ఇద్దరూ వ్యక్తులు నిలుచుని ఉన్నారు. ఇద్దరిలో ఒక వ్యక్తి సెల్ఫీ కోసం సిద్ధూ వద్దకు వస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. ఆ వ్యక్తి డ్రైవర్ వైపుగా వచ్చి సిద్ధూతో సెల్ఫీ తీసుకున్నాడు. ఐతే ఆ వ్యక్తి సెల్ఫీ తీసుకున్న తర్వాతే.. సిద్ధూ పై జరిగింది. ఆ సమయంలోనే ‘దాడి చేయడానికి సిద్ధంకండి’ అంటూ షూటర్లకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. కానీ ఆ సీసీ ఫుటేజ్‌లో ఆ వ్యక్తుల ముఖాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు ఆ వీడియోలో కనిపించిన ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా పరిగణిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి.. ఈ సెల్ఫీనే కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సిద్ధూని హతమార్చిన ఎనిమిది మంది షూటర్లను పంజాబ్ పోలీసులు గుర్తించారు. ఆ షూటర్లంతా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్రాలకు చెందినవారు. నిందితుల ఆచూకి కోసం ఈ మూడు రాష్ట్రాల్లోనూ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. (చదవండి: యస్.. ఇది ప్రతీకార హత్యే!: సింగర్ సిద్ధూ హత్య కేసులో కీలక మలుపు) -
మెదక్ జిల్లా: ఘరానా దొంగలు.. చూస్తుండగానే రూ.6 లక్షలు మాయం!
-
సీసీటీవీ దృశ్యాలు: ఘరానా దొంగలు.. చూస్తుండగానే రూ.6 లక్షలు మాయం!
సాక్షి, మెదక్: జిల్లాలోని చేగుంట మండల కేంద్రంలో పట్టపగలే దొంగలు చెలరేగిపోయారు. మక్క రాజుపేట గ్రామానికి చెందిన చింతల రమేష్ వద్ద నుంచి రూ.6 లక్షల 70 వేలు కొట్టేశారు. ఎస్బీఐ బ్యాంకు నుంచి రమేష్ 6 లక్షల 70 వేల రూపాయలు తీసుకొని బయటకు వచ్చాడు. తన హోండా యాక్టీవా డిక్కీలో ఆ సొమ్ము పెట్టి లాక్ చేశాడు. అనంతరం సమీపంలోని హీరో షాప్‌లో పని ఉండటంతో అక్కడే రోడ్డు పక్కన బండి నిలిపి వెళ్లాడు. అప్పటికే రెక్కీ నిర్వహించిన దొంగలు నిముషాల వ్యవధిలో రమేష్ యాక్టీవా ఉన్న చోటుకి చేరుకున్నారు. సెకండ్ల వ్యవధిలో లాక్ ఓపెన్ చేసి డబ్బులున్న బ్యాగ్‌తో పరారయ్యారు. హీరో షాప్‌లోకి వెళ్లి వచ్చిన రమేష్ వాహనం లాక్ ఓపెన్ చేసి ఉండటంతో షాక్‌కు గురయ్యాడు. సొమ్ము కనిపించకపోవడంతో లోబోదిబోమన్నాడు. చదవండి👉 హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. అక్కడే ఉన్న కొందరి సూచనతో వెంటనే పోలీసులకు తన గోడువెళ్లబోసుకున్నాడు. బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించిన చేగుంట పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కేసు విచారిస్తున్నారు. గురువారం జరిగిన ఈ ఘరానా దోపిడీకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి👇 ఇద్దరికీ వేరువేరు పెళ్లిళ్లు.. ప్రియుడితో ఇంటి నుంచి పారిపోయి కోర్టును ఆశ్రయించిన ప్రజ్ఞారెడ్డి.. పుల్లారెడ్డి కొడుకు, మనవడికి నోటీసులు జారీ -
గురుకుల కళాశాలలో డిప్యూటీ వార్డెన్ దారుణం.. విద్యార్థిని తంతూ, కొడుతూ..
సాక్షి, జగిత్యాల: జిల్లాలోని కోరుట్ల మైనారిటీ గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థిపై డిప్యూటీ వార్డెన్ దాడి చేశాడు. డార్మేటరీ రూమ్‌కు వెళ్లాడని.. తాను చెప్పినట్టు వినడం లేదని ఆగ్రహంతో.. విద్యార్థి రాజును డిప్యూటీ వార్డెన్ కొట్టాడు. రాజును కిందపడేసి కాళ్లతో తంతు పిడిగద్దులు కురిపించాడు. విద్యార్థి ప్రాదేయపడ్డా కూడా కనికరించకుండా మరింతగా రెచ్చిపోయాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన దృశ్యాలు.. కాలేజీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. విషయం ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లడంతో... డిప్యూటీ వార్డెన్ నయీమ్‌పై విచారణ చేపట్టారు. విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌ను సస్పెండ్ చేశామని రీజినల్ లెవెల్ కోఆర్డినేటర్ సయ్యద్ హమీద్ తెలిపారు. బాధిత విద్యార్థి రాజు స్వస్థలం జమ్మికుంట అని పేర్కొన్నారు. చదవండి👇 లంచం డిమాండ్ చేసిన డాక్టర్.. హరీష్‌రావు రియాక్షన్ ఇది సవతి తల్లి కర్కశం...మేడపై నుంచి తోసి..గొంతు నులిమి -
రూ.3.5 లక్షలు చోరీ
మందస: మండలంలోని హరిపురం నుంచి బయల్దేరిన బొలేరో వాహనం నుంచి రూ.3.5 లక్షలు చోరీ జరిగినట్లు డ్రైవర్ రట్టి నవీన్ మందస పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. బాలాజీ కాజూ ఫ్యాక్టరీ యజమా ని కోరాడ సునీల్ జీడి పిక్కలు కొనుగోలు చేయడానికి డ్రైవర్ నవీన్‌కు రూ.3.5 లక్షలు ఇచ్చి పంపించారు. నవీన్ తన బొలేరో వాహనంలో హరిపురం నుంచి బయల్దేరి కమలాపురం సమీపంలోని పెట్రో ల్ బంకులో ఆయిల్ కొట్టించారు. అక్కడ ఎవరో ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగితే ఇచ్చారు. అతను కొర్రాయిగేటు సమీపంలోనే దిగిపోయాడు. తర్వాత నవీన్ నరసన్నపేట వరకు వెళ్లిపోయారు. అక్కడ టిఫిన్ చేసి వా హనాన్ని పరిశీలిస్తే నగదు కనిపించలేదు. దీంతో కంగారు పడి.. తిరిగి మందస వచ్చి పోలీసులకు ఫిర్యా దు చేశారు. అయితే పెట్రోల్ బంక్ వద్ద గుర్తు తెలి యని వ్యక్తి ఇదే బొలేరో వాహనంలో నుంచి ఏదో తీసుకుని వెళ్తున్నట్టు సీసీ కెమెరా పుటేజీలో కనిపిస్తోంది. దీనిపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నాలుగు సెక్షన్లతో పాలన) -
ఉత్తర కొరియాలో మూవీ.. హీరోగా కిమ్ జోంగ్ ఉన్
Kim Jong Un Guiding An Ballistic Missile: ఉత్తర కొరియా అధ్యక్షుడు అత్యంత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. అంతేకాదు నిషేధిత ఖండాంతర క్షిపణిని 2017 తర్వాత మళ్లీ ఇప్పుడే అలాంటి క్షిపణిని వినియోగించింది. ఈ మేరకు 2017 నాటి మిసైల్ ప్రయోగాన్నిహాలీవుడ్ మూవీ మాదిరి ఫుటేజ్‌ని విడుదల చేసింది. అందులో ఒక పాత స్కూల్‌కి సమీపంలో కిమ్ జోంగ్ లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరించి 2017 నాటి అతిపెద్ద ఖండాంతర బాలిస్టిక్ జెయింట్ హ్వాసాంగ్-17 క్షిపణిని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిచింది. ఉత్కంఠభరితమైన సంగీతంలో, ఇద్దరు జనరల్స్ మధ్య కెమరా యాక్షన్ అనగానే స్లో మోషన్లో కిమ్ వచ్చి తన సన్ గ్లాసెస్‌ని పగలుగొట్టి సైనికుల క్షిపణి ప్రయోగానికి ఆమోదం తెలుపుతున్నట్లు ఉంటుంది. పైగా ఆ క్షిపణి కౌంట్‌డౌన్ దృశ్యంలో సైనికులు అగ్ని అని అరుస్తున్నట్లు కనిపించింది. ప్యోంగ్యాంగ్ తన సైనిక సామర్థ్య గొప్పతనాన్ని తెలియజేస్తున్నట్లుగా ఆ వీడియో ఫుటేజ్ ఉంది. దీన్ని వారు ఒక చలన చిత్రంగా రూపొందించి మరీ సంబురాలు చేసుకున్నారు. అదీ కూడా ఖండాంతర క్షిపణిని విజయవంతం అయిన నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ హీరోగా క్షిపణి ప్రయోగానికి సంబంధించిన మూవీ మాదిరి వీడియోని రూపొందించారని సెజోంగ్ ఇన్స్టిట్యూట్లోని సెంటర్ ఫర్ నార్త్ కొరియా స్టడీస్‌కు చెందిన చియోంగ్ సియోంగ్-చాంగ్ తెలిపారు. కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ సినీ వీరాభిమాని. ఉత్తర కొరియా సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి 1978లో దక్షిణ కొరియా చిత్ర దర్శకుడు నటిని కిడ్నాప్ చేయాలని ఆదేశించిన ఘనుడు. ఇప్పుడు కూడా ఉత్తరకొరియా చలనచిత్రాల నిర్మాణం కోసం భారీగా వనరులను కేటాయిస్తుంది గానీ సినిమాలన్ని అధికార కిమ్ కుటుంబాన్ని కీర్తిస్తూ తీయాల్సిందే. శుక్రవారం విడుదల చేసిన మూవీ మాదిరి క్షిపణి వీడియోలో విదేశీ ప్రభావం కనిపిస్తోంది. అయితే ఉత్తర కొరియా తమ సినిమాల్లో ఎక్కడైన విదేశీ ప్రభావం కనిపిస్తే కఠినంగా శిక్షిస్తుంది. విదేశీ దుస్తులతో గానీ, విదేశీ చిత్రాలను అనుకరించి గానీ సినిమాలు నిర్మిస్తే శిక్షిస్తుంది. ఏది ఏమైన కిమ్ మాటతప్పి మరీ భారీ ఖండాంతర ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగిచండంతో యూఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా యూఎన్ భద్రతా మండలి శుక్రవారం ఈ ప్రయోగంపై అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే ఉత్తర కొరియా ఆయుధా ప్రయోగాలపై పలు ఆంక్షలు ఎదుర్కొంటునప్పటికీ వాటన్నింటిన పక్కన పెట్టి మరోసారి తన అత్యుత్సాహాన్ని బయటపెట్టుకుంది. (చదవండి: ఐదేళ్ల తర్వాత.. ఉత్తర కొరియా కిమ్ సంబురాలు, వణికిపోతున్న పొరుగు దేశాలు) -
పోలీసులు పనితీరుతో... నేరాల శాతం తగ్గుతోంది!!
గోల్కొండ: నిరంతరం సీసీ కెమెరాల నిఘా.. ఎక్కడ ఏ ఘటన జరిగినా నిముషాల్లో చేరుకుంటున్న పోలీసులు.. గంటల వ్యవధిలోనే కేసులను ఛేదిస్తుండటంతో రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి.. దీంతో రాష్ట్ర జీడీపీ గుజరాత్, మహారాష్ట్రలతో పాటు పోటీపడుతూ గణనీయంగా పెరిగిందని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. టోలిచౌకి టూంబ్స్ రోడ్డులోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో ఆసిఫ్‌నగర్ డివిజన్‌కు చెందిన 100 కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో భాగంగా పోలీసులు పనితీరులో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని, ఫలితంగా నేరాల శాతం గతంతో పోలిస్తే చాలా తగ్గిందన్నారు. (చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..) నేర విచారణలో కూడా సీసీ పుటేజీలను న్యాయస్థానంలో సాక్ష్యాలుగా చూపుతున్నట్లు ఆయన చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు రావాలని అన్నారు. దాతల సహకారంతోనే రూ.30 లక్షలతోనే హుమాయున్‌నగర్, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రధాన రహదారులు, వ్యాపార సముదాయాల్లో ఉన్న కెమెరాల వల్ల ఆ ప్రాంతాల్లో నేరాలు తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గాయని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు భావితరాలకు భద్రత కల్పిస్తుందన్నారు. ప్రతిపౌరుడు ఒక పోలీస్ అని, పోలీసులు సైతం పౌరులేనని ఆయన గుర్తు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల హైదరాబాద్ నగరానికి సేఫ్ సిటీ అని పేరు వచ్చిందని చెప్పారు. శాంతిభద్రతలు అదుపులో ఉండటం, నేరాలు తగ్గడం వల్ల పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారన్నారు. 5 సంవత్సరాల్లో హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అదుపులో ఉండటం వల్ల ఎన్నో కొత్త పరిశ్రమలు వచ్చాయని, దీనివల్ల యువతకు ఉపాధి కూడా లభించిందన్నారు. గతంలో ఒక్క కేసు ఛేదించడానికి, వ్యయప్రయాసలు ఉండేవని నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటయ్యేవని గుర్తు చేశారు. సీసీ కెమెరాలతో అతి కొద్ది సమయంలోనే నిందితులకు శిక్షపడేలా చేయడం సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో నగర జాయింట్ పోలీస్ కమిషనర్, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, అడిషనర్ డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖి, ఆసిఫ్‌నగర్ డివిజన్ ఏసీపీ శివమారుతి, ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పీస్ అండ్ మైత్రి కమిటీ సభ్యులు రాజు వస్తాద్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!) -
గోల్మాల్ ‘గ్యాంగ్’ ..సీబీఐ అధికారులమంటూ ఫ్లాట్‌లోకి
గచ్చిబౌలి: సూర్య కథానాయకుడిగా నటించిన ‘గ్యాంగ్’ సినిమా గుర్తుందా? అక్రమార్కులను కొల్లగొట్టడానికి కథానాయకుడి నేతృత్వంలోని ముఠా సీబీఐ అధికారుల మాదిరిగా రెచ్చిపోతుంది. అచ్చు అలాంటి ఉదంతమే మధ్యాహ్నం గచ్చిబౌలి ఠాణా పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీ జయభేరి ఆరెంజ్ కౌంటీలో జరిగింది. లాకర్లో ఉన్న 1.34 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదుతో పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఆ మాటే నేరగాళ్లకు కలిసొచ్చింది.. రియల్ ఎస్టేట్ సంస్థ భువన తేజ డెవలపర్స్ చైర్మన్ వెంకట సుబ్రహ్మణ్యం ఆరెంజ్ కౌంటీలోని సీ బ్లాక్‌లోని ఫ్లాట్ నంబర్ 110లో భార్య, పిల్లలతో నివసిస్తున్నారు. సీసీ కెమెరాలు, వాచ్‌మన్‌లతో ఈ గేటెడ్ కమ్యూనిటీ నిఘా నీడలో ఉంటుంది. విజిటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ప్రధాన గేటు వద్ద ఉండే వాచ్‌మన్ యజమానిని సంప్రదించిన తర్వాతే పంపిస్తుంటారు. సుబ్రహ్మణ్యం నగర శివార్లలో కొన్ని వెంచర్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిత్యం కొనుగోలుదారులు, బ్యాంకర్లు తదితరులు వచ్చిపోతుంటారు. ఇలా ఎవరు వచ్చినా వాచ్‌మన్ సంప్రదిస్తుండటంతో.. తన కోసం ఎవరైనా వస్తే నేరుగా పంపించాల్సిందిగా గతంలో చెప్పారు. దీంతో సుబ్రహ్మణ్యం కోసమంటూ ఎవరు వచ్చినా వారిని ఫ్లాట్ నం.110కు పంపడం పరిపాటిగా మారింది. పక్కా పథకం ప్రకారం.. సుబ్రహ్మణ్యం ఇంటిని కొల్లగొట్టాలని పథకం వేసుకున్న నేరగాళ్లకు ఇదే అంశం కలిసి వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కారులో వచ్చిన నలుగురు వాచ్‌మన్‌తో సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లాలని చెప్పారు. దీంతో అతడు వారిని లోపలకు పోనిచ్చాడు. 1.10 గంటలకు ఫ్లాట్ నం.110కు వెళ్లిన నేరగాళ్లు తలుపు కొట్టారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న డ్రైవర్ స్వామి నాయుడు వెళ్లి తలుపు తీశారు. తాము సీబీఐ ఏజెంట్లమని సుబ్రహ్మణ్యం భార్య భాగ్యలక్ష్మికి చెప్పిన నలుగురూ నకిలీ గుర్తింపుకార్డులు చూపిస్తూ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. ఆ వెంటనే భాగ్యలక్ష్మితో పాటు డ్రైవర్ వద్ద ఉన్న మూడు సెల్ఫోన్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. భాగ్యలక్ష్మితో పాటు ఆమె ముగ్గురు సంతానం, డ్రైవర్‌ను హాలులోనే కదలకుండా కూర్చోబెట్టారు. ఆదాయపు పన్ను బకాయిలంటూ... సీబీఐ అధికారుల పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు భాగ్యలక్ష్మితో ఆమె భర్త ఆదాయపు పన్ను శాఖకు రూ.18 కోట్లు బాకీ పడ్డారని, ఈ నేపథ్యంలోనే సోదాల కోసం వచ్చామంటూ చెప్పారు. ఇద్దరు దుండగులు హాలులోనే కాపలా ఉండగా.. మిగిలిన ఇద్దరూ నేరుగా పడక గదిలోకి వెళ్లారు. అక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్ నుంచి లాకర్ తాళాలు తీసుకున్నారు. వాటితో లాకర్ తెరిచి అందులో ఉన్న 1.34 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు తీసుకుని ఉడాయించారు. ఈ వ్యవహారం మొత్తం 25 నిమిషాల్లో పూర్తయింది. బాధితురాలు తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పగా... సీబీఐ ఏజెంట్లు అయితే బంగారు నగలు తీసుకొని ఎందుకు వెళతారంటూ ఆయన ప్రశ్నించారు. దీంతో జరిగిన వ్యవహారం గుర్తించి సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమవరంలో చిక్కిన నిందితులు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎంట్రీ వద్ద సుబ్రహ్మణ్యం పేరు చెప్పి వెళ్లడంతో పాటు తెలుగులో స్పష్టంగా మాట్లాడటంతో పరిచయస్తుల పనిగా అనుమానించారు. బాధితుల వివరాలు తెలిసిన వాళ్లే వెనుక ఉండి దుండగులతో కథనడిపి ఉంటారని అంచనా వేశారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన వివరాల ఆధారంగా దుండగులు కారులో వచ్చారని, నంబర్ ప్లేట్ లేదని తేల్చారు. దాని డ్రైవర్ రోడ్డు పైనే ఆగిపోగా నలుగురు మాత్రం కౌంటీలోని ప్రవేశించినట్లు నిర్ధారణైంది. పలు ప్రాంతాల్లోని సీసీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు ఆ కారు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడ వైపు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో పాటు సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్లిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నిందితులను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పట్టుకున్నారని తెలిసింది. (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కరోనా రావడంతో కోమాలోకెళ్లింది..! అప్పటికే..) -
నీ దొంగ బుద్ధి తగలెయ్య!
-
నీ దొంగ బుద్ధి తగలెయ్య!...మరీ ఆ వస్తువా! ఎక్స్పీరియన్స్ లేనట్టుందే....
ఇటీవల కాలంలో దొంగలు రకరకాలు వస్తువులను ఎత్తుకెళ్లుతున్న సంఘటనలు గురించి చాలానే విని ఉంటాం. కొన్ని రకాలు వస్తువులను సైతం దొంగతనం చేసినపుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంటుంది. అంతెందుకు కొన్ని వస్తువులు దొంగతనం చేసేందుకు కూడ సాధ్యం కానివి అయినప్పటికీ కొంతమంది వాటిని కూడా దొంగతనం చేసి నవ్వులు పాలువుతుంటారు. అచ్చం అలాంటి పనే ఇక్కడొక మహిళ చేసింది. (చదవండి: చేతల్లో చూపించగలగేవాడికి చేతులతో పని ఏమి ?) అసలు విషయంలోకెళ్లితే...ఐరన్ వస్తువులకు సంబంధించిన ఒక పెద్ద స్టోర్‌లో ఒక మహిళ చైన్ సా (కటింగ్ సాధనం(రంపం))ని దొంగలిస్తుంది. నిజానికి దాన్ని దొంగతనం చేయడం పైగా ఎవ్వరికి కనిపించకుండా దాచిపెట్టి తీసుకెళ్లడమనేదే అసాధ్యం. అలాంటి వస్తువును ఆమె దాచడానికి తెగ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఆ స్టోర్ సీసీపుటేజ్‌లో ఆమె ఆ వస్తువును దాచడానికీ ప్రయత్నించే క్రమంలో ఫ్యాంటు వెనుకవైపు లోపలకి దూర్చడమే కాకా పైన వేసుకున్న కోటుతో కవర్ చేయడానికీ ప్రయత్నిస్తుంది. కానీ ఆమె భుజానికి తగలించిన బ్యాగ్‌ల మూలంగా ఆ వస్తువు బయటకీ కనిపిస్తోంది. దీనికీ సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు "ఆమె ఈ వస్తువును దాచిపెట్టగలనా లేదా అని చూస్తోంది" అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: వ్యాక్సిన్ వేయించుకుంది.. రూ 7.4 కోట్లు గెలుచుకుంది) -
మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో ఘోర ప్రమాదం
-
గాంధీ హాస్పిటల్ సీసీ ఫుటేజీలో బయటపడ కీలక సాక్ష్యాలు
-
పంజాబ్ లోని మొహాలీలో పట్టపగలే దారుణ హత్య
-
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు
-
వైరల్: 12 ఏళ్ల నాటి సీసీటీవీ ఫుటేజీ.. వామ్మో ఆమె ఏం చేస్తోంది?!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా సీసీటీవీల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. గతంలో పోలిస్తే ప్రస్తుతం నేరాలను వీలైనంత తొందర్లోనే పోలీసులు చేధిస్తున్నారు. అయితే చాలా చోట్ల ఎవరికి వారు వ్యక్తిగత పర్యవేక్షణ కోసం ఇంట్లో, షాపుల్లో, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు చెప్పే విషయం ఇప్పటిది కాదు..12 ఏళ్ల క్రితం నాటిది. న్యూయార్క్‌కు చెందిన జో కమ్మింగ్స్ 2009 లో పంచుకున్న ఒక భయంకరమైన వీడియో మళ్ళీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్చల్ చేస్తోంది. కమ్మింగ్స్ తన ఇంట్లో వస్తువులను ఎవరు దొంగిలిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నాడు. అయితే అదే అపార్ట్మెంట్లో నివసించే తన ప్రేయసిపై అనుమానంతో..తనను ఆటపట్టించడానికి ఓ సీసీటీవీని ఏర్పాటు చేశాడు. కొన్ని రోజుల తర్వాత కమ్మింగ్స్ ఫుటేజీని చూసి షాక్ తిన్నాడు. ఓ మహిళ తన అల్మరాలో రహస్యంగా నివసిస్తున్నట్లు, తన ఆహారాన్ని దొంగిలించి, కిచెన్ సింక్‌లో మూత్ర విసర్జన చేస్తున్నట్లు సీసీ ఫుటేజీ ద్వారా తెలుసుకున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ మహిళను అరెస్ట్ చేశారు. అయితే 12 సంవత్సరాల తర్వాత సోషల్ మీడియాలో తిరిగి కనిపించిన ఈ వీడియో నెటిజన్లను భయభ్రాంతులకు గురిచేస్తోంది. (చదవండి: Viral: నేను పులిరాజును.. అయితే నాకేంటి!) -
హైక్లాస్ గురుకులాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు కొత్త అంశాలను ఒకేసారి బోధించేందుకు అత్యాధునికమైన వర్చ్యువల్ క్లాస్‌రూంల వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ వర్చ్యువల్ క్లాస్‌రూంల విధానంలో పాఠ్యాంశాలు బోధించడమే కాకుండా.. వివిధ జిల్లాల్లోని విద్యార్థులతో ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా మాట్లాడే అవకాశముంటుంది. అలాగే గురుకుల పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో.. తాడేపల్లిలోని కంట్రోల్ కేంద్రం నుంచే ఎప్పటికప్పుడు తనిఖీ చేసే అవకాశం ఏర్పడింది. 105 గురుకులాల్లో వర్చ్యువల్ క్లాస్రూంలు రాష్ట్రంలో గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో మొత్తం 189 విద్యాసంస్థల్ని నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం 105 గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో వర్చ్యువల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేశారు. గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయం నుంచి వర్చ్యువల్ క్లాస్ రూంలతో మాట్లాడేందుకు స్టూడియో నిర్మించారు. ఈ స్టూడియో నుంచే రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఒకేసారి పాఠాలు బోధించడంతో పాటు.. నేరుగా మాట్లాడవచ్చు. రాష్ట్రంలోని విశాఖపట్నం, యర్రగొండపాలెం, కురుపాం, పార్వతీపురం, శ్రీకాళహస్తి, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, తనకల్లు తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి, అధికారులు మాట్లాడారు. వసతులు, విద్యా బోధనపై మంత్రి స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ విద్యార్థుల రక్షణ, విద్యాసంస్థల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా పర్యవేక్షణ కోసం రాష్ట్రంలోని గిరిజన విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పాఠశాలల్లో నాలుగు కెమెరాలు అమర్చినట్లు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ పి.రంజిత్ బాషా వెల్లడించారు. ఈ కెమెరాల సాయంతో పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహారం, ఇతర వసతుల్ని, విద్యార్థుల భద్రతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది. సీసీ కెమెరాల ఏర్పాటుతో విద్యాసంస్థల్లోని బాలికలకు రక్షణ ఉంటుందని, క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడే అవకాశముంటుందని రంజిత్ బాషా పేర్కొన్నారు. ఈ కెమెరాలను క్షేత్రస్థాయిలో ఆపేందుకు వీలులేకుండా తాడేపల్లిలోని కమాండ్ కంట్రోల్ యూనిట్ ఎప్పటికప్పుడు నియంత్రిస్తుంది. విద్యాసంస్థల్లోని ఆర్థిక లావాదేవీలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేందుకు, టీచర్లు, విద్యార్థుల హాజరును నిర్ధారించుకొని ఆ మేరకు సరుకులు, ఇతర వస్తువులు విడుదల చేయడానికి ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. -
నిఘా నిద్ర.. జూదం దర్జా!
ఆళ్లగడ్డ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో పిచ్చలాట, పేకాట, బెట్టింగ్‌ల వంటి అసాంఘిక కార్యకలాపాలు జడలు విప్పి కరతాళ నృత్యం చేస్తున్నాయి. ఆయా గ్రామాల్లో పగలు, రాత్రి అన్న తేడా లేకుండా జూద క్రీడలను పలువురు దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు.. ముఖ్యంగా యువత జూదాలకు బానిసలై పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకుని అప్పులపాలవుతున్నారు. కొందరు ఇల్లు విడిచి వెళ్తుండగా, మరి కొందరు అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. నిరోధించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. – ఆళ్లగడ్డ సాక్షి, కర్నూలు : ఆళ్లగడ్డ నియోజవర్గంలోని రుద్రవరం మండలం ఆలమూరు, తువ్వపల్లె, గుట్టకొండ నరసింహస్వామి, డికొట్టాల, పెద్దకంబలూరు, చాగలమర్రి మండలం బైవరగుండాలు, తెలుగు గంగ కాల్వ, రాజోలి ఆనకట్ట, మండల కేంద్రం ఉయ్యలవాడ, జమ్ములదిన్నె తదితర ప్రదేశాల్లో పిచ్చలాట, మంగపత్త, మట్కా, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలపాలు కొన్ని మాసాలుగా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో జన సంచారం లేని ప్రదేశాల్లో ఈ జూదాలను విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. ఇక వారంతాల్లో, సెలవు దినాల్లో ఈ వికృత క్రీడల నిర్వహణ పతాక స్థాయికి చేరుతోంది. పలు ప్రదేశాల్లో రాత్రి సమయంలో కూడా ఈ జూదాలను నిర్వహిస్తున్నారు. ఆయా తోటలు, ప్రదేశాల్లో విద్యుద్దీపాలు, చార్జింగ్ లైట్లు ఏర్పాటు చేసుకుని జూదాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఇందులో నిర్వాహకులు డిక్కు (పర్సేంటేజి) కింద 10 నుంచి 30 శాతం వరకు వసూలు చేస్తున్నారు. పలు చోట్ల జూదం ఆడే ప్రదేశానికి మ«ధ్యాన్ని కూడా సరఫరా చేస్తుండటం విశేషం. చిత్తవుతున్న యువత.. యథేచ్ఛగా జరుగుతున్న ఈ జూద క్రీడల్లో పేద, మధ్యతరగతి యువత బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల ఆళ్లగడ్డ రూరల్ మండలం లింగందిన్నె గ్రామానికి చెందిన ఓ యువకడు పిచ్చలాట ఆడుతూ ఇంట్లో ఉన్న రూ.3 లక్షలు పోగొట్టుకోగా మరో రూ.2 లక్షలు అక్కడే అప్పు చేశాడు. అయినప్పటికీ చేయి తిరగకపోవడంతో అప్పిచ్చినవారు ఒత్తిడి చేయడంతో ఇల్లొదిలి పారిపోయాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో జూదం ఆడేందుకు డబ్బులు ఇచ్చిన వారే మా పిల్లోడిని ఏదైనా చేశారేమోనని రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జూదరులను విచారించారు. అప్పు చెల్లించలేక తిరుపతి పారిపోయినట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొన్ని మాసల క్రితం పిచ్చలాటలో రూ.లక్షలు పోగొట్టుకుని అధిక వడ్డీలు చెల్లించలేక రుద్రవరం మండలంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ పోలీసులు దృష్టిసారించడంలేదనే విమర్శలున్నాయి. వడ్డీ వ్యాపారుల కనుసన్నల్లో.. జూదాల్లో డబ్బులు పోగుట్టుకున్నవారిని కొందరు వడ్డీ వ్యాపారులు ఎంచుకుంటున్నారు. వారికి మరీ అప్పులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. ద్విచక్రవాహనాలను, పొలాల పాస్‌బుక్కులను, ఇంటి స్థలాల డాక్యుమెంట్లను, బంగారాన్ని, వెండిని కుదవకు పెట్టుకుని అధిక వడ్డీకి అప్పు ఇస్తున్నారు. దీంతో పాటు ఖాళీ పత్రాలు, స్టాంపులు, ప్రామిసరి నోట్లపై సంతకాలు, వేలి ముద్రలు తీసుకుంటున్నారు. ఇక్కడ వారం, రోజు వడ్డీతో పాటు గంటల వడ్డీ కూడా నడుస్తుండటం గమనార్హం. రోజుకు నూటికి రూ.10, వారానికి రూ.50 లెక్కన వడ్డీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రకమైన వడ్డీలను వసూలు చేసుకుంటున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. చెప్పిన సమయానికి వడ్డీ చెల్లించకపోతే తన అనుయాయుల ద్వారా బెదిరింపులకు పాల్పడటం, అప్పటికీ ఇవ్వక పోతే దాడులు చేయడం జరుగుతోంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి నిఘా ఏర్పాటు చేసి, అసాంఘిక కార్యకలాపాలకు కళ్లెం వేయాలని స్థానికలు కోరుతున్నారు. సరిహద్దు ప్రదేశాలే.. జూదరులు పోలీసుల కల్లుగప్పేందుకు రెండు మండాలల సరిహుద్దులు, జిల్లా సరిహద్దుల్లో జూద కేంద్రాలను ఏర్పాటు చేసుకుని కొనసాగిస్తున్నారు. అక్కడైతే పోలీసులు తమ పరిధి కాదన్నట్లు ఉంటారనే ధైర్యం. దీనికి తోడు వాహనాలు వెళ్లలేని ప్రదేశాన్ని జూదం ఆడేందుకు ఎంచుకుంటున్నారు. సమాచారం తెలిసినా పోలీసులు కాలినడకన వెళ్లేందుకు ఇష్టపడక, వదిలేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. చర్యలు తీసుకుంటాం వారం క్రితం లింగందిన్నె యువకుడు అదృశ్యమైన విషయం నా దృష్టికి వచ్చింది. సబ్‌డివిజన్ వ్యాప్తంగా గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం. అవసరమైతే ప్రత్యేక బలగాలతో గాలింపు చేపడతాం. జూదరులతో పాటు ఆడించేవారిపైనా కఠిన చర్యలు ఉంటాయి. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. – తిప్పేస్వామి, ఆళ్లగడ్డ డీఎస్పీ సరిహద్దు ప్రదేశాలే.. -
జసిత్ కోసం ముమ్మర గాలింపు
మండపేట: తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బ్యాంకు ఉద్యోగులు నూకా వెంకటరమణ, నాగావళి దంపతుల కుమారుడు నాలుగేళ్ల జసిత్ కిడ్నాప్ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. బాలుడిని దుండగులు ఎత్తుకెళ్లి రెండు రోజులవుతున్నా దీనిపై ఒక్క క్లూ దొరకలేదు. సోమవారం సాయంత్రం 7 గంటలకు నానమ్మ పార్వతితో కలిసి ఫ్లాట్‌లోకి వెళ్తున్న సమయంలో అపరిచిత వ్యక్తి దాడిచేసి జసిత్‌ను ఎత్తుకెళ్లిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన వెంకటరమణ, నాగావళి దంపతులు ఏడాది క్రితం బదిలీపై మండపేట వచ్చారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్పీ నయీంఅస్మీ కిడ్నాపర్ల కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు డీఎస్పీలు, 10 మంది సీఐల నేతృత్వంలో 500 మంది సిబ్బందితో 17 బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. కేసు పురోగతి సాధించే దిశగా సరైన ఆధారాలు ఏవీ ఇంకా లభ్యం కాలేదు. కిడ్నాపర్ల నుంచి ఎటువంటి ఫోన్‌కాల్స్ రాలేదు. కిడ్నాప్‌కు కారణాలు తెలియకపోవడంతో అనుమానితులందరినీ విచారిస్తున్నారు. ఎలా ఉన్నాడో.. ఎక్కడున్నాడో? తన బాబు ఎలా ఉన్నాడో.. ఎక్కడున్నాడో? అంటూ జసిత్ తల్లి రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టిస్తోంది. ప్రస్తుతం ఆమె తొమ్మిదో నెల గర్భిణి. జసిత్ రాక కోసం తల్లిదండ్రులు, నానమ్మ పార్వతి నిద్రాహారాలు మాని ఎదురు చూస్తున్నారు. ఎవరితోనూ తమకు విభేదాలు లేవని, బాబును క్షేమంగా అప్పగించండంటూ తల్లిదండ్రులు వెంకటరమణ, నాగావళి కన్నీటి పర్యంతమవుతున్నారు. ముసుగు ధరించిన వ్యక్తిపై అనుమానాలు కాగా, ఈనెల 3న ముసుగు ధరించిన అపరిచిత వ్యక్తి ఫ్లాట్ అద్దెకు కావాలంటూ రోజూ పిల్లలతో కలిసి జసిత్ ఆడుకునే ఇంటి వద్ద అడగడం అనుమానాలకు తావిస్తోంది. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజీని భవన యజమాని కురుపూడి రామకృష్ణ పోలీసులకు అందజేశారు. ఆగంతకుడికి తోడుగా వచ్చిన మరోవ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్నట్టు గుర్తించారు. పక్కాగా రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా అనుమానిత వ్యక్తులను కనుగొనేందుకు ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది. బుధవారం కలెక్టర్ మురళీధరరెడ్డి మండపేట వచ్చి జసిత్ తల్లిదండ్రులను సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తుపై ఎస్పీతో చర్చించారు. నిందితులను పట్టుకొని బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించేందకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. -
కిరీటాలు మాయంలో పురోగతి
-
గర్భాలయంలో అర్చకులు లేని సమయంలో..!
సాక్షి, తిరుపతి: భక్తుల ముసుగులో వచ్చిన బయటి వ్యక్తులే కిరీటాలను దొంగిలించుకెళ్లినట్టు గుర్తించారు. అర్చకులు గర్భాలయంలో లేని సమయంలో చోరీ జరిగినట్టు తేల్చారు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆలయంలోకి దొంగలు పడ్డారని పోలీసులు, టీటీడీ విజిలెన్స్ ప్రాథమిక విచారణలో తేల్చారు. కేసును మరింత లోతుగా విచారించేందుకు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. టీటీడీ పరిధిలోని ప్రధాన ఆలయాల్లో గోవిందరాజస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో శనివారం మూడు కిరీటాలు మాయమైన విషయం తెలిసిందే. చోరీ వెనుక అర్చకులు, సిబ్బంది ప్రమేయం ఉందనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే ప్రాథమిక విచారణలో వారి ప్రమేయం లేకపోవచ్చనే అంచనాకు వచ్చినట్టు తెలిసింది. అయినా కూడా ఆ రోజు ఆలయంలో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరి కాల్‌డేటాను పరిశీలిస్తున్నట్టు సమాచారం. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు కొంతమంది అనుమానితులను గుర్తించారు. అందులో భాగంగా ఒక ఆటో డ్రైవర్, సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరింత లోతుగా విచారించిన పోలీసులు, టీటీడీ విజిలెన్స్ బయటి వ్యక్తులే భక్తుల ముసుగులో ఆలయంలోకి చొరబడి కిరీటాలు ఎత్తుకెళ్లినట్టు నిర్థారణకు వచ్చారు. ఈ మేరకు సీసీ ఫుటేజిలను పరిశీలించి అనుమానితుడిని గుర్తించారు. అం దులో భాగంగా సోమవారం రాత్రి తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అనుమానితుడి ఫో టోను విడుదల చేశారు. చోరీకి పాల్పడ్డ వారి కోసం ఆరు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన ట్టు ఎస్పీ వెల్లడించారు. ఫోటోలోని వ్యక్తి ఆచూకీ తె లిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని వివరించారు. అయితే ఆటో డ్రైవర్‌తో పాటు తిరుపతిలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. కాల్‌డేటా ఆధారంగా విచారణ ముమ్మరం చోరీ జరిగిన రోజున ఆలయ పరిసర ప్రాంతాల్లోని సెల్ టవర్ ఆధారంగా కాల్‌డేటాను పరిశీలిస్తున్నా రు. దొంగతనానికి పాల్పడ్డ వారి ఆచూకీ కోసం పోలీ సు బృందాలు వివిధ రాష్ట్రాలకు బయలుదేరి వెళ్లా రు. కాల్‌డేటాను సేకరించిన పోలీసులు వాటి ఆధా రంగా గాలింపు చేపట్టారు. ఈ మేరకు పోలీసు బృం దాలు ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వెళ్లారు. దొంగల ను కాల్‌డేటా పట్టిస్తుందనే పోలీసులు భావిస్తున్నా రు. గర్భాలయం ముందు ఉన్న సీసీ కెమెరా గత కొన్ని రోజులుగా పనిచేయకపోవటానికి గల కారణా లపైనా కూపీ లాగుతున్నారు. అర్చకుల్లో రెండు వర్గా లు ఉండటంతో విచారణకు సహకరించటం లేదనే ప్రచారం జరుగుతోంది. విచారణకు సహకరించాలని జేఈఓ అర్చక బృందాలను కోరినట్టు తెలిసింది. అర్చకులు లేని సమయంలోనే.. గోవిందరాజస్వామి గర్భాలయం, సమీపంలో విధులు నిర్వహించాల్సిన అర్చకులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు పోలీసుల విచారణలో తేలింది. కిరీటాలు చోరీకి గురైన స మయంలో అర్చకులు గర్భాలయంలో లేరని తెలిసింది. ఇదే అదనుగా చూసి ఉత్సవమూర్తులకు అలంకరించి ఉన్న మూడు కిరీటాలను అపహరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది, అర్చకులపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. గోవిందరాజస్వామి గర్భాలయంలో విధులు నిర్వహించే అర్చకులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంపై తొ లుత పోలీసులు వారినే అనుమానించారు. అయి తే విచారణలో వీరికి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. అయినా గర్భాలయంలో విధులు నిర్వహించేవారి నిర్లక్ష్యమే చోరీకి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ మేరకు వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. -
మోజు
ఎవరి ప్రమేయం లేకుండా ఓ రోజు మొదలైంది. వీధిదీపాలు ఆర్పేసమయాన్ని కూడా వేగంగా దాటేసింది.మరుసటిరోజు దినపత్రికల్లో.. ‘‘ప్రముఖ నగల వ్యాపారి కశ్యప్చంద్ అదృశ్యం’’ అనే వార్త ప్రధానంగా అందరినీ ఆకర్షించింది. గత వారం రోజులుగా అతడు కనిపించకపోవడంతో పోలీసులకు ఆ కేసు సవాలుగా మారింది. ‘‘సార్..! మా కాకా(చిన్నాన్న) కశ్యప్ చంద్ విషయం ఏమైనా తెలిసిందా?’’ చాలా ఆందోళనగా అడిగాడు విశాల్ చంద్(కశ్యప్ చంద్ అన్నకొడుకు).‘‘మీరే చెప్పాలి..! కనిపించక ఇన్ని రోజులైతే మీరు నిన్నొచ్చి కేసు పెట్టారు. ఈ రోజు వచ్చి కేసు ఎంత వరకూ వచ్చిందంటున్నారు? అసలు ఇన్ని రోజులు మీరెందుకు కేసు పెట్టలేదు’’ అని అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రణయ్.‘‘సార్ మా కాకా వాళ్ల కొడుకు నిరాల్ చంద్ ఢిల్లీలో నగల వ్యాపారం చేస్తుంటాడు. అప్పుడప్పుడూ మా కాకా ఢిల్లీలో ఉన్న కొడుకు ఇంటికి వెళ్తుంటాడు. సో అలా వెళ్లి ఉంటాడని అనుకున్నాం. కానీ నిన్ననే ఢిల్లీకి ఫోన్ చేస్తే తెలిసింది మా కాకా అక్కడలేడని. వెంటనే బంధుమిత్రుల ఇళ్లల్లో వెతకడం మొదలుపెట్టాం. చివరికి మీకు కంప్లైంట్ ఇచ్చాం’’ అని చెప్పుకొచ్చాడు విశాల్ చంద్.విశాల్ పక్కనే ఉన్న అతడి భార్య కౌనికా చంద్ కళ్లను అప్రయత్నంగా గమనించాడు ఇన్స్పెక్టర్ ప్రణయ్. ముఖంలో ప్రత్యేకమైన ఆకర్షణ లేకున్నా ఆమె చూపుల్లో ఏదో గమ్మత్తుంది. ఎలాంటివారినైనా ఆ కళ్లు కట్టిపారేస్తాయి. కొన్ని క్షణాలపాటు ప్రణయ్‌ది కూడా అదే పరిస్థితి.‘‘మా కాకా చాలా మంచివాడు సార్. అందరితోనూ చాలా చనువుగా ఆప్యాయంగా మాట్లాడతాడు. మా చిన్నమ్మ చనిపోయి చాలా ఏళ్లు అయ్యింది. పనివాళ్ల సహకారంతో ఆయన ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. ప్లీజ్ సార్! ఆయన ఆచూకీని కనిపెట్టే ఏ అవకాశాన్ని వదిలిపెట్టకండి. ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మా నుంచి ఉంటుంది’’ అన్నాడు విశాల్.విశాల్ మాటలకి చూపు తిప్పిన ఇన్స్పెక్టర్.. ‘‘సరే విశాల్..! అవసరముంటే మిమ్మల్ని స్టేషన్‌కి పిలుస్తాను. మీరు వెళ్లొచ్చు’’ అన్నాడు గంభీరంగా. రోజులు గడుస్తున్నాయి. కేసు పరిశీలనలో భాగంగా కశ్యప్ చంద్ జ్యూయెలరీ షోరూమ్ వెళ్లాలనుకున్నాడు ఇన్స్పెక్టర్ ప్రణయ్. ఎందుకంటే అప్పటిదాకా కేసులో ఏ ఆధారమూ దొరకలేదు. పైగా ఎఫ్.ఐ.ఆర్‌లో కూడా ఎవరిమీద అనుమానం ఉన్నట్లుగా పేర్కొనలేదు. జ్యుయెలరీ షాప్ చాలా విశాలంగా ఉంది. చాలామంది పనివాళ్లున్నారు. దేశవ్యాప్తంగా చాలా బ్రాంచ్‌లు పెట్టినా హైదరాబాద్‌లో ఉన్న జ్యుయెలరీ షాప్ అంటేనే కశ్యప్ చంద్కి చాలా ఇష్టమని చెప్పాడు ఓ సిబ్బంది. ఎందుకని అడిగితే... ‘కశ్యప్ సారు మొదటిగా ప్రారంభించి షాప్ ఇదే’ బదులిచ్చాడు. షాప్ అంతా తిరిగి గమనించాడు ప్రణయ్. కశ్యప్ చంద్ కూచునే కౌంటర్ చాలా విశాలంగా ఉంది. పక్కనే కొంచెం చిన్న క్యాష్‌కౌంటర్‌లో ఓ పాతికేళ్ల అమ్మాయి ఉంది. ఆమె పేరు నీనా వైశాలి. ఇన్స్పెక్టర్ ప్రణయ్ ఒక్కొక్కటీ పరిశీలిస్తూ షాప్ మధ్యలోకి వచ్చి నిల్చున్నాడు. ఇంకా కశ్యప్ చంద్ అలవాట్లు, ఆసక్తులు, ఎవరెవరితో చనువుగా ఉంటాడనే విషయాలు అన్నీ తెలుసుకోవాలనుకున్నాడు.‘‘కశ్యప్ చంద్ పూర్తిగా శాకాహారి. సిగరెట్ కాల్చడు. యాలక్కాయలో ఒకే ఒక్క పలుకు గింజ, లేదా లవంగంలో సగం నోట్లో వేసుకుని అటూ ఇటూ ఆడిస్తుంటాడు. అంతకు మించి అతని ఆహారంలో మరే ప్రత్యేకత లేదు. రాత్రి నిద్రపోయే ముందు మాత్రం ఓ చల్లని ‘యాపిల్ ఫీజ్’ తాగుతుంటాడు. కస్టమర్లతో ఆహ్లాదకరంగా మాట్లాడుతుంటాడు. వచ్చేది ఎక్కువగా మహిళలే కనుక అందరితో సౌమ్యంగా, ఆత్మీయంగా సంభాషిస్తుంటాడు. అది అతనిలో ఉన్న ప్రత్యేకత’’ చెప్పుకొచ్చాడు మరో సిబ్బంది. అయితే చివరగా ఆ సిబ్బంది కొన్ని ముఖ్యమైన విషయాలనే చెప్పాడు. కశ్యప్ చంద్ స్త్రీలోలుడు. ఆడవాళ్లని అందులోనూ అందమైన ఆడవాళ్లని తన మాటలతో బురిడీ కొట్టించే మనస్తత్వం కలవాడనే అర్థమొచ్చేలా కొన్ని విషయాలను చాలా సాధారణంగా చెప్పాడు ఆ సిబ్బంది. స్టేషన్‌కి తిరిగి వచ్చిన ఇన్స్పెక్టర్ ప్రణయ్‌కి.. ఆ సిబ్బంది చెప్పిన చివరి మాటలు పదేపదే గుర్తుకొచ్చాయి. అంటే కశ్యప్ చంద్కి ఆడయావ ఎక్కువ. వయసు 60 దాటినా ఆడ పిచ్చిపోలేదు’’ అనుకుంటూ ఆలోచనల్లో పడిన ప్రణయ్‌కి... వారంరోజుల క్రితం స్టేషన్‌కి వచ్చిన విశాల్ చంద్(కశ్యప్ చంద్ అన్నకొడుకు) భార్య కౌనికా చంద్‌తో పాటు కశ్యప్ చంద్ జ్యుయెలరీ షాప్‌లో పనిచేస్తున్న నీనా వైశాలీ గుర్తుకొచ్చారు.వెంటనే వాళ్లని స్టేషన్‌కి పిలిపించాడు. ముందుగా కౌనికా చంద్‌ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు ప్రణయ్.‘‘మీరేం చేస్తుంటారు?’’‘‘జాబ్ అంటూ ఏం లేదు. మావారికి సహకరిస్తుంటాను.’’‘‘మీ చిన్న మావయ్య.. అదే కశ్యప్ చంద్ మీతో ఎలా ఉండేవారు.’’‘‘చాలా సరదాగా ఉండేవారు. అప్పుడప్పుడూ నేనే ఆయనకి డిన్నర్ తీసుకెళ్లేదాన్ని’’ చెప్పింది కౌనికా.‘‘మీరే ఎందుకు? పనివాళ్లు చాలా మంది ఉంటారుగా వాళ్ల చేత పంపొచ్చుగా?’’‘‘నేను వెళ్తే ఆయన చాలా సంతోషించేవారు. ‘ఆడ దిక్కులేని కొంప. అప్పుడప్పుడూ వచ్చిపోతుండు’ అనేవారు. అందుకే నాకు తీరిక దొరికినప్పుడు, పనివాళ్లు అందుబాటులో లేనప్పుడూ నేనే స్వయంగా డిన్నర్ తీసుకెళ్లి వడ్డించేదాన్ని’’‘‘మరి.. ఆయన స్త్రీలోలుడని విన్నాను నిజమేనా?’’‘ఆయనకు కాస్త సరసాలెక్కువే. కోడలినైనా నాతోనూ డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడేవారు.అవకాశం ఇస్తే అతడు ఎలాంటి సంబంధానికైనా సిద్ధమన్నట్లుగా ఉండేవాడు.’’‘‘మరి మీరెప్పుడూ అతడి ప్రవర్తనతో ఇబ్బంది పడలేదా?’’‘‘అంటే.. మొదట్లో కాస్త ఇబ్బంది పడేదాన్ని. తర్వాత ఆయన మనస్తత్వం అంతేనని సరిపెట్టుకోవడం మొదలుపెట్టాను. ఒంటరి ముసలివాడనే జాలి ఎక్కువగా ఉండేది నాకు. నా భర్త కూడా రెండుమూడు సార్లు అతడి ప్రవర్తన గురించి నన్ను హెచ్చరించారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించేదాన్ని.’’‘‘ఆయన్ని చివరగా ఎప్పుడు చూశారు?’’‘‘సుమారు పదిహేను రోజులవుతుంది. నేను మా పుట్టింటికి వెళ్లే ముందు రోజు అతడికి డిన్నర్ తీసుకెళ్లాను. నేను తిరిగి వచ్చేసరికి అతడు ఊర్లో లేడని తెలిసింది. ఢిల్లీ వెళ్లి ఉంటారనుకున్నాం. కానీ అతడు అక్కడ కూడా లేకపోయేసరికి మిమ్మల్ని ఆశ్రయించాం.’’ప్రణయ్ రెట్టించినా.. గర్దించినా.. అంతకు మించి ఏం రాలేదు ఆమె నుంచి. మొత్తానికి అదృశ్యమైన కశ్యప్ చంద్ ‘స్త్రీ లోలుడని’’ అర్థమైంది. నీనా వైశాలీ కూడా ఆ విషయాన్ని స్పష్టంగా ధ్రువీకరించింది. కశ్యప్ చంద్ ఇంట్లో వంటపని చేసే టిట్టూని ప్రశ్నించాడు. ఆమె కాస్త వణికింది. ఎందుకని ఆరా తీస్తే.. తన పట్ల కూడా కశ్యప్ అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఎక్కడ ఉద్యోగం పోతుందోననే భయంతో అతడి ఆగడాలను భరించానని చెప్పుకొచ్చింది. చివరగా షోరూమ్‌లో ఉన్న సీసీ పుటేజ్‌లను పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు ఇన్స్పెక్టర్ ప్రణయ్. కశ్యప్ చంద్ కనిపించకుండా పోయిన రోజు నుంచి వెనక్కి ఒక్కో రోజు ఒక్కో రోజూ సీసీ ఫుటేజ్‌లో గమనించాడు. ఆ ఫుటేజ్‌లో కొందరు ఆడవాళ్లు కశ్యప్‌తో చాలా చనువుగా ఉన్నారు. దాంతో వాళ్లందరినీ స్టేషన్‌కి పిలిపించి విచారించాడు. ఎక్కడా ఏ క్లూ దొరకలేదు. మళ్లీ మళ్లీ ఆ సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూనే ఉన్నాడు. రోజు, వారాలు, నెలలు వెనక్కి వెనక్కి వెళ్లి మరీ షోరూమ్ దృశ్యాలను సీసీ ఫుటేజ్‌లో చూస్తూనే ఉన్నాడు. ఈ సారి షోరూమ్‌కి వచ్చే ఆడవాళ్లని కాదు. షోరూమ్‌లో ఉన్న కశ్యప్ చంద్ హావభావాలపై దృష్టిపెట్టాడు. అలా చూస్తూ ఉండగా కశ్యప్ చంద్ ఎక్స్ప్రెషన్స్ ఓ చోటా కాస్త డిఫరెంట్‌గా తోచాయి. ఎదురుగా డోర్ తెరుచుకుని లోనికి వస్తున్న ఓ మహిళను చూసి ఎడమ కన్ను మీటుతున్నాడు. ఆమె నవ్వుకుంటోంది. ఆమెని మరింత జూమ్ చేసి చూశాడు ఇన్స్పెక్టర్ ప్రణయ్. చాలా అందంగా చురుగ్గా ఉన్న ఆమెకు వయసు ముప్ఫై దాటినట్లే ఉన్నాయి. ఎంక్వైరీలో భాగంగా మొత్తానికీ ఆమెను వెతికిపట్టుకున్నారు పోలీసులు.కాలింగ్ బెల్మోగుతోంది. పోలీసులను చూసి నిర్ఘాంతపోయింది ఆమె.‘‘మీ పేరు?’’ లోపలికి నడిచాడు ప్రణయ్.‘‘సుగుణ కుమారి’’‘‘కశ్యప్ చంద్ మీకు తెలుసా?’’ సోఫాలో కూర్చుంటూ అడిగాడు.‘‘ఏ కశ్యప్ చంద్?’’‘‘అదే జ్యుయెలరీ షాప్ ఓనర్ కశ్యప్ చంద్!?’’‘‘తెలీదు. ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు.’’‘‘అవునా? పోనీ.. ఆయన కన్నుగీటితే ముసిముసిగా నవ్వుకున్నారా?’’ అన్నాడు ప్రణయ్ చాలా వెటకారంగా.అతడి ప్రశ్నకి షాక్ అయ్యింది సుగుణ. ‘‘ఏమ్.. ఏం మాట్లాడుతున్నారు?’’ అంది వణుకుతున్న స్వరంతో.‘‘ఇప్పటికీ మించిపోయింది లేదు. కశ్యప్‌ని ఎక్కడ దాచారో చెబితే శిక్ష తగ్గుతుంది. కచ్చితంగా మీరే ఈ పని చేశారని నా ఎంక్వైరీలో తేలింది’’ గదమాయించాడు ప్రణయ్.‘‘కశ్యప్ చంద్ చనిపోయాడు. నేనే.. నేనే.. చంపేశాను’’ బాగా ఏడుస్తోంది సుగుణ.‘‘వాట్? ఎందుకు?’’‘‘నా స్నేహితురాలు జ్యుయెలరీ కొనడానికి ఒకరోజు కశ్యప్ చంద్ షాప్‌కి తీసుకెళ్లింది. అప్పుడే అతడు నాకు పరిచయం. ఆ తర్వాత చిన్న చిన్న జ్యుయెలరీలు నేనూ ఇక్కడే కొనేదాన్ని. అతడి మాట తీరు, అతడు చూపించే అభిమానం నాకు బాగా నచ్చేవి. మాటల సందర్భంలో నా భర్త బిజినెస్‌లో లాస్ అయ్యారని, అప్పులు తీర్చేందుకు గల్ఫ్ వెళ్లారని, ఏదో కేసు విషయంలో అక్కడే జైలు పాలైన నా భర్తను తిరిగి ఇండియాకు రప్పించేందుకు డబ్బులు సర్ధుబాటు కావట్లేదని అతడితో చెప్పుకున్నాను. డబ్బుపరంగా ఏ అవసరం ఉన్నా నేను సహకరిస్తానని మాటిచ్చాడు. పైగా అదే రోజు మా ఇంటికి వచ్చాడు. ‘నేను చేయబోయే డబ్బుసాయానికి కృతజ్ఞతగా ఏమిస్తావ’న్న అతడి కోరికకు నేను లొంగిపోయాను. ఆ రోజు నుంచీ డబ్బు సర్ధుబాటు చెయ్యమంటే ఇదిగో.. అదిగో.. అని జరిపేవాడు. కానీ రెగ్యులర్‌గా మా ఇంటికి వచ్చి ఆనందంగా గడిపి వెళ్లిపోయేవాడు. కొన్ని రోజులకి మేము కలిసి దిగిన కొన్ని అభ్యంతరకరమైన ఫొటోలను చూపించి నానుంచే డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టాడు. రెండు మూడు చోట్ల అప్పు చేసి కూడా అతడికి డబ్బులిచ్చాను. అతడి ఆగడాలకు విసిగిన నేను అతడిని మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నాను. ఒకరోజు రాత్రి మా ఇంటికి వచ్చాడు. నిద్రపోయే ముందు యాపిల్ ఫీజ్ తాగడం అతడికి అలవాటు.అందులో అప్పటికే నిద్రమాత్రలు కలిపి ఉంచాను. అది తాగి మైకంలోకి పోగానే గొంతు నులుమి చంపేశాను. ఆధారాలన్నీ కాల్చి బూడిద చేశాను. శవాన్ని ముక్కలు చేసి మూట కట్టి అర్ధరాత్రి సమయంలో స్కూటీపైన తీసుకెళ్లి మూసీ నదిలో పడేశాను’’ అని ఏడుస్తూ ముగించింది సుగుణ. సుగుణ వాంగ్మూలం తీసుకున్న ప్రణయ్.. అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకెళ్లాడు.పోగొట్టుకున్నచోటే వెతకాలనే నానుడి నమ్మి.. సీసీçఫుటేజ్ మళ్లీ మళ్లీ శోధించడం వల్లే కన్నుగీటుతున్న కశ్యప్ చంద్ స్టిల్ చూడగలిగాడు. లేదంటే కేసు ఎప్పటికి తేలేదో!!’ అనుకున్నాడు ఇన్స్పెక్టర్ ప్రణయ్. -
జయలలిత చికిత్స వీడియోలు లేవు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు తమ ఆస్పత్రిలో చికిత్సచేసినపుడు చిత్రీకరించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం లేవని, అవి చెరిగిపోయాయని చెన్నై అపోలో ఆస్పత్రి యాజమాన్యం స్పష్టంచేసిన విషయం తాజాగా వెల్లడైంది. జయ మరణంపై తమిళనాడు ప్రభుత్వం రిటైర్డు జడ్జి ఆర్ముగస్వామి చైర్మన్‌గా విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ విచారణ కమిషన్‌కు ఈనెల 11న ఆస్పత్రి యాజమాన్యం రాసిన లేఖ బుధవారం బహిర్గతమైంది. సీసీటీవీల్లో రికార్డయిన వీడియోలు నెలరోజులకు మించి ఉండవని, తాజా దృశ్యాలు నమోదు కాగానే పాతవి ఆటోమేటిక్‌గా చెరిగిపోతాయని, జయ చికిత్స దృశ్యాలు సైతం ఇలాగే చెరిగిపోయాయని లేఖలో ఆస్పత్రి వివరణ ఇచ్చింది. దీంతో ఆస్పత్రిలోని సర్వర్లను పరిశీలించి నిపుణుల బృందం సాయంతో చెరిగిపోయిన దృశ్యాలను రాబట్టాలని కమిషన్ నిర్ణయించింది.