చైనాలో ప్రముఖ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టెస్లా వై మోడల్ కారు బీభత్సం సృష్టించింది. బ్రేకులు పనిచేయకపోవడంతో అదుపు తప్పిన కారు ఘోర ప్రమాదానికి కారణమైంది. నవంబర్ 5న దక్షిణ ప్రావిన్సీ గ్వాంగ్‌డ్వాంగ్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ వాహనదారుడు, హైస్కూల్ బాలిక మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో కారు డ్రైవర్ కూడా ఉన్నాడు.
కాగా టెస్లా కంపెనీకి చైనా రెండవ అతిపెద్ద మార్కెట్. ఐతే ఈ ప్రమాద ఘటనతో చైనా సోషల్ మీడియాలో టెస్లా కారులపై మిర్శలు ఒక్కసారిగా హల్‌చల్ చేస్తున్నాయి. మరోవైపు పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణాలను వెల్లడించాల్సి ఉంది. అంతేగాక చైనాలోని టెస్లా కంపెనీ ఏజెన్సీ నుంచి ప్రమాదంపై వివరణ కోరారు. దీనిపై ఎలెన్ మస్క్ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు మాట్లాడూతూ...దయచేసి ఎలాంటి పుకార్లను నమ్మవద్దు త్వరలోనే అసలు కారణం బయటపడుతుందన్నారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన ఘోర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలో వాహనం నియంత్రణ కోల్పోవడంతో డ్రైవర్ కారుని అదుపుచేయలేకపోయినట్లు తెలుస్తోంది. అలాగే కారు వేగంగా వెళ్తున్నప్పుడూ బ్రేక్ లైట్లు ఆన్ అవ్వలేదని, పైగా డ్రైవర్ బ్రేక్ వేసేందుకు యత్నిస్తున్నట్లు కూడా అనిపించలేదని కొందరూ చెబుతున్నారు. అయితే డ్రైవర్ బంధువు వాదనలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. టెస్లా కంపెనీ కారులో బ్రేక్ సమస్య ఉంటుందని కారు డ్రైవర్ బంధువు ఒకరు చెప్పారు.
ఈ మేరకు చైనీస్ కోర్టు టెస్లా కంపెనీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు ఉన్నాయని కారు డ్రైవర్‌కు చురకలు అంటించింది. మీడియా ఏమో బ్రేక్ ఫెలవ్వడం అని చెబితే తమరు మరోలా కథనం చెబుతున్నారని, వాస్తవాలకు విభిన్నంగా ఉందని మండిపడుతూ సదరు యజమానిని టెస్లా కంపెనీకి బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతోపాటు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
This video of a Tesla trying to park and instead taking off at high speed, killing two people seems to keep getting deleted, weird!
— Read Jackson Rising by @CooperationJXN (@JoshuaPHilll) November 13, 2022
pic.twitter.com/SGEcZcx6Zq
(చదవండి: వైట్‌హౌస్‌లో పెళ్లి సందడి... జోబైడెన్ మనవరాలు పెళ్లి)
Comments
Please login to add a commentAdd a comment