హైవే మధ్యలో రెండంతస్తుల ఇల్లు..! ఎక్కడంటే.. | Strong Nail House Owner: Stubborn Grandfather In China Refuses Rs 2 Crore | Sakshi
Sakshi News home page

తాత మొండి పట్టుదల ఎంత పనిచేసింది..! ఏకంగా ఇంటి చుట్టూ..

Published Sun, Jan 26 2025 5:13 PM | Last Updated on Sun, Jan 26 2025 5:27 PM

Strong Nail House Owner: Stubborn Grandfather In China Refuses Rs 2 Crore

డెవలప్‌మెంట్‌లో భాగంగా నేషనల్‌ హైవేలను నిర్మిస్తుంటారు. ఒక్కోసారి వాటి కారణంగా ప్రదేశంలో మన బిల్డింగ్‌లు ఉంటే కోల్పోక తప్పదు. ప్రభుత్వం ఎంతోకొంత నష్టపరిహారం ఇచ్చి..తరలించడం జరగుతుంది. అయితే ఇక్కడొ తాత ప్రభుత్వం తరలి వెళ్లిపోయేందుకు ఎన్ని కోట్లు ఆఫర్‌ అందించినా సేమిరా అన్నడు ఫలితంగా ఏం జరిగిందో  తెలిస్తే అవాక్కవ్వుతారు. పాపం ఆ తాత అలా మంకుపట్టు పట్టి ఉండకుండా బాగుండనని ఇప్పుడు బాధపడుతున్నాడు.

అసలేం జరిగిందంటే..చైనాలోని జిన్క్సీలో ఉన్న హువాంగ్ పింగ్ రెండంతస్తులి ఇల్లు ప్రదేశంలో హైవే నిర్మిస్తున్నానరు. దాంతో చైన ప్రభుత్వం ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయేలా డబ్బు ఆఫర్‌ చేసింది. ఎంతలా నచ్చచెప్పిన వినలేదు. ఏకంగా రెండు కోట్లు ఆఫర్‌ చేసినా తగ్గేదే లే..అన్నాడు. దాంతో ప్రభుత్వం అతడి ఇల్లు మినహా ఇరువైపులా హైవే నిర్మించేసింది. దీంతో అతడికి నిత్యం దుమ్ము, రణగొణధ్వనుల మద్య నెలకొన్న ఇల్లులా చికాకు తెప్పిస్తుంది. అబ్బా ఆ రోజు ఎందుకంతా పట్టు పట్టానా అని బాధపడుతున్నాడు. ఒక్కసారి టైమ్‌ వెనక్కెళ్లితే..చైనా ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ని హాయిగా అందుకుంటానని బాధగా చెబుతున్నాడు. 

ప్రస్తుతం అతడి ఇల్లు ఎలా ఉందండి సరిగ్గా హైవే మధ్యలోఉన్న ఇల్లులా ప్రధాన ఆకర్షణగా ఉంది. పైగా చుట్టపక్కల నివాసితులు ఆ తాత ఇంటి వద్దకు వచ్చి పోటోలు తీసుకునే ఓ విచిత్రమైన ఇల్లులా అయిపోయింది. అంతేగాదు ఆ తాతను చైనాలో "స్ట్రాంగ్‌ నెయిల్‌ హౌస్‌ యజమాని" అని పిలుస్తారు. ఎందుకంటే నెయిల్ హౌస్ అనేది ఆక్రమిత ఇంటికి చైనీస్ పదం. అభివృద్ధికి ఆటంకం కలిగించే తమ ఆస్తి కోసం పోరాడే యజమానులను చైనాలో ఇలా పిలుస్తారు. 

కాగా, 2017లో, షాంఘైలో దాదాపు 14 సంవత్సరాలుగా ఒక ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన ఒక ప్రసిద్ధ "నెయిల్ హౌస్" చివరకు కూల్చివేశారు. తగినంత పరిహారం లేదని పేర్కొంటూ ఆ ఇంటి యజమానులు 2003 నుంచి తరలింపు ఆఫర్‌లను తిరస్కరించారు. కానీ చివరకు రూ. 3 కోట్ల పరిహారంతో మకాం మర్చాడానికి అంగీకరించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లుకొడుతోంది. 

 

(చదవండి: ఇప్పుడు పుట్టి ఉంటే కచ్చితంగా ఆటిజం నిర్ధారణ అయ్యేది: బిల్‌గేట్స్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement