high way
-
రూ. 1.93 లక్షల కోట్లు.. ఐదేళ్ల టోల్ ట్యాక్స్
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల(Toll plazas) నుంచి ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో ఎంత టోల్ వసూలు చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అక్షరాలా రూ.1.93 లక్షల కోట్లు ప్రభుత్వానికి టోల్ ట్యాక్స్ రూపంలో అందింది. దీనికి సంబంధించిన వివరాలను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) లోక్‌సభలో వెల్లడించింది.ప్రభుత్వం అందించిన డేటా ప్రకారం దేశంలోనే అత్యధిక టోల్ ట్యాక్స్‌ను గుజరాత్‌లోని ఎన్‌హెచ్-48లోని వడోదర-భరూచ్ సెక్షన్(Vadodara-Bharuch section)లో ఉన్న టోల్ ప్లాజా వసూలు చేసింది. గడచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2019-20 నుండి 2023-24 వరకు) రూ.2,043.81 కోట్ల టోల్ వసూలు చేసింది. టోల్ ఆదాయాల జాబితాలో రాజస్థాన్‌లోని షాజహాన్‌పూర్ టోల్ ప్లాజా రెండవ స్థానంలో నిలిచింది. ఇది ఎన్‌హెచ్-48లోని గుర్గావ్-కోట్‌పుట్లి-జైపూర్ విభాగంలో ఉంది. గత ఐదేళ్లలోఈ ప్లాజాలో రూ.1,884.46 కోట్ల విలువైన టోల్ వసూలు చేసినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్‌లోని జల్ధులగోరి టోల్ ప్లాజా ఉంది. 2019-20 నుండి 2023-24 వరకు ఐదు సంవత్సరాలలో ఇది రూ.1,538.91 కోట్ల టోల్ వసూలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బారజోధ టోల్ ప్లాజా గత ఐదు సంవత్సరాలలో రూ.1,480.75 కోట్ల టోల్ వసూలు చేసి జాబితాలో 4వ స్థానంలో ఉంది. టాప్ 10 ఆదాయాన్ని ఆర్జించే టోల్ ప్లాజాల జాబితాలో రెండు ప్లాజాలు గుజరాత్లో, రెండు రాజస్థాన్‌లో రెండు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. హర్యానా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బీహార్లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. గత ఐదేళ్లలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే 10 టోల్ ప్లాజాలు రూ.13,988.51 కోట్ల విలువైన టోల్ వసూలు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 1,063 టోల్ ప్లాజాలు ఉన్నాయి. వీటిలో 457 టోల్ ప్లాజాలను గత ఐదేళ్లలో ఏర్పాటు చేశారు.ఇది కూడా చదవండి: ఐపీఎస్ అధికారి మహంతికి హైకోర్టులో ఊరట -
హైవే మధ్యలో రెండంతస్తుల ఇల్లు..! ఎక్కడంటే..
డెవలప్మెంట్లో భాగంగా నేషనల్ హైవేలను నిర్మిస్తుంటారు. ఒక్కోసారి వాటి కారణంగా ప్రదేశంలో మన బిల్డింగ్లు ఉంటే కోల్పోక తప్పదు. ప్రభుత్వం ఎంతోకొంత నష్టపరిహారం ఇచ్చి..తరలించడం జరగుతుంది. అయితే ఇక్కడొ తాత ప్రభుత్వం తరలి వెళ్లిపోయేందుకు ఎన్ని కోట్లు ఆఫర్ అందించినా సేమిరా అన్నడు ఫలితంగా ఏం జరిగిందో తెలిస్తే అవాక్కవ్వుతారు. పాపం ఆ తాత అలా మంకుపట్టు పట్టి ఉండకుండా బాగుండనని ఇప్పుడు బాధపడుతున్నాడు.అసలేం జరిగిందంటే..చైనాలోని జిన్క్సీలో ఉన్న హువాంగ్ పింగ్ రెండంతస్తులి ఇల్లు ప్రదేశంలో హైవే నిర్మిస్తున్నానరు. దాంతో చైన ప్రభుత్వం ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయేలా డబ్బు ఆఫర్ చేసింది. ఎంతలా నచ్చచెప్పిన వినలేదు. ఏకంగా రెండు కోట్లు ఆఫర్ చేసినా తగ్గేదే లే..అన్నాడు. దాంతో ప్రభుత్వం అతడి ఇల్లు మినహా ఇరువైపులా హైవే నిర్మించేసింది. దీంతో అతడికి నిత్యం దుమ్ము, రణగొణధ్వనుల మద్య నెలకొన్న ఇల్లులా చికాకు తెప్పిస్తుంది. అబ్బా ఆ రోజు ఎందుకంతా పట్టు పట్టానా అని బాధపడుతున్నాడు. ఒక్కసారి టైమ్ వెనక్కెళ్లితే..చైనా ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ని హాయిగా అందుకుంటానని బాధగా చెబుతున్నాడు. ప్రస్తుతం అతడి ఇల్లు ఎలా ఉందండి సరిగ్గా హైవే మధ్యలోఉన్న ఇల్లులా ప్రధాన ఆకర్షణగా ఉంది. పైగా చుట్టపక్కల నివాసితులు ఆ తాత ఇంటి వద్దకు వచ్చి పోటోలు తీసుకునే ఓ విచిత్రమైన ఇల్లులా అయిపోయింది. అంతేగాదు ఆ తాతను చైనాలో "స్ట్రాంగ్ నెయిల్ హౌస్ యజమాని" అని పిలుస్తారు. ఎందుకంటే నెయిల్ హౌస్ అనేది ఆక్రమిత ఇంటికి చైనీస్ పదం. అభివృద్ధికి ఆటంకం కలిగించే తమ ఆస్తి కోసం పోరాడే యజమానులను చైనాలో ఇలా పిలుస్తారు. కాగా, 2017లో, షాంఘైలో దాదాపు 14 సంవత్సరాలుగా ఒక ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన ఒక ప్రసిద్ధ "నెయిల్ హౌస్" చివరకు కూల్చివేశారు. తగినంత పరిహారం లేదని పేర్కొంటూ ఆ ఇంటి యజమానులు 2003 నుంచి తరలింపు ఆఫర్లను తిరస్కరించారు. కానీ చివరకు రూ. 3 కోట్ల పరిహారంతో మకాం మర్చాడానికి అంగీకరించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లుకొడుతోంది. The stubborn old Chinese man who refused to sell his house for a government project now regrets his decision.Huang Ping, from Hunan province, hoped for more money but lost everything. The government built a road around his house, leaving it in the middle of a busy street. Now,… pic.twitter.com/it0rYe2fhd— Ibra ❄️ (@IbraHasan_) January 25, 2025 (చదవండి: ఇప్పుడు పుట్టి ఉంటే కచ్చితంగా ఆటిజం నిర్ధారణ అయ్యేది: బిల్‌గేట్స్) -
శంభు సరిహద్దులో హైవేల మూసివేత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ
న్యూఢిల్లీ: శంభు సరిహద్దులో హైవేల మూసివేతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంతోపాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. హర్యానా, పంజాబ్ రైతులు ఢిల్లీ చలో కార్యక్రమం చేపట్టారు. సంయుక్త కిసాన్ మోర్చ నేతృత్వంలో వందలాది మంది రైతులు శంభు సరిహద్దు గుండా రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు శంభు సరిహద్దు హైవేలను నిర్బందించారు. రాకపోకల్ని నిలిపివేశారు. హైవేల నిర్బందం, రైతులు చేపట్టిన ఢిల్లీ చలో కార్యక్రమంపై పంజాబ్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో రైతుల నిరసనలతో మూతపడ్డ శంభు సరిహద్దు సహా హైవేలను తిరిగి తెరవాలని, నిరసన తెలుపుతున్న రైతులను హైవేపై నుంచి తొలగించాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని పిటిషన్లో పేర్కొన్నారు. శాంతిభద్రతలను కాపాడేలా నిరసన తెలిపే రైతులను కూడా కోర్టు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా హైవేలను అడ్డుకోవడం ప్రజల ప్రాథమిక హక్కులకు విరుద్ధమని, జాతీయ రహదారి చట్టం భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరమని, హైవేలను దిగ్బంధించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ పేర్కొన్నారు. -
చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. అమెరికన్ సమాజంలో సామాజిక బాధ్యతను విద్యార్ధులకు అలవర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టింది. నాట్స్ చికాగో విభాగం నిర్వహించిన ఈ హైవే దత్త కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, వాలంటీర్లు, విద్యార్ధులు పాల్గొని హైవేను శుభ్రం చేశారు. అమెరికాలో సామాజిక సంస్థలు రోడ్లను, పబ్లిక్ ప్లేస్‌లను దత్తత తీసుకుని వాటిని శుభ్రం చేస్తుంటాయి. నాట్స్ కూడా ఇందులో నేనుసైతం అంటూ రంగంలోకి దిగింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అడాప్ట్ హైవే కార్యక్రమాన్ని నాట్స్ నిర్వహిస్తూ వస్తుంది. చికాగోలో నిర్వహించిన ఈ హైవే దత్తత కార్యక్రమంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు పాల్కని సమాజం కోసం స్వచ్ఛందంగా పనిచేసేలా భావితరాన్ని ప్రోత్సాహించారు. ఇలా సమాజం కోసం విద్యార్ధులు వెచ్చించిన సమయాన్ని అక్కడ కాలేజీలు కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. నాట్స్ హైవే దత్తత కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలరందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు. చికాగో చాప్టర్ కోఆర్డినేటర్లు నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, వీర తక్కెళ్లపాటిలు చక్కటి ప్రణాళిక, సమన్వయంతో హైవేను పరిశుభ్రం చేయడంలో కీలక పాత్ర పోషించారు. చికాగో చాప్టర్ సభ్యులు ఈశ్వర్ వడ్లమన్నాటి, మహేష్ కిలారు, శ్రీనివాస్ ఎక్కుర్తి, రమేష్ జంగాల, దివాకర్ ప్రతాపుల, సునీల్ ఎస్, నిపున్ శర్మలు ఈ హైవే దత్తతకు చక్కటి మద్దతు, సహకారం అందించారు.భావితరాలకు ఎంతో ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమం కోసం చికాగో చాప్టర్‌కి దిశా నిర్థేశం చేసిన నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్కే బాలినేని, హరీష్ జమ్ముల, ఇమ్మాన్యుయేల్ నీల, మాజీ బోర్డు సభ్యులు మూర్తి కొప్పాక, శ్రీని అరసాడ, శ్రీనివాస్ బొప్పనలకు నాట్స్ చికాగో విభాగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచే ఎంతో ఉపయుక్తమైన హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టిన నాట్స్ చికాగో విభాగాన్ని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: -
తూ.గో.లో వ్యాన్ బోల్తా.. కోట్లలో పట్టుబడిన డబ్బు
సాక్షి తూర్పుగోదావరి జిల్లా: ఓ రోడ్డు ప్రమాదంతో అక్రమంగా తరలిస్తున్న డబ్బులు పట్టుబడ్డాయి. ఘటనా స్థలంలో పోలీసులు పరిశీలనలో భారీగా తరలిస్తున్న నగదు గుట్టు బయటపడింది. వివరాలు.. నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తౌడులో కలిపే కెమికల్ బస్తాలతో వెళ్తోన్న వ్యాన్‌ను వెనకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడగా, క్లీనర్, డ్రైవర్‌కు గాయాలయ్యయి. వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ క్రమంలో వ్యాన్ అడుగు భాగంలో 7 అనుమానాస్పద బాక్స్‌లను పోలీసులు గుర్తించారు. ఉన్నతాధికారుల సమక్షంలో బాక్స్‌లను అనంతపల్లి టోల్ ప్లాజా వద్ద తెరిచి చూడగా భారీగా నగదు బయటపడింది.Cinematic: Accident leads to Rs 7 crore cash seizure packed in 7 cardboard boxes loaded in Tata Ace vehicle going from Vijayawada towards Vizag, that overturned after hitting a truck & one box fell out revealing currency hidden packed in between sacks #AndhraPradesh #EastGodavari pic.twitter.com/OXoy0oaRJI— Uma Sudhir (@umasudhir) May 11, 2024 బాక్స్‌లోని డబ్బులను అధికారులు,ఎలక్షన్ ఫ్లైయింగ్ స్వ్కాడ్ లెక్కిస్తోంది. నగదు మొత్తం రూ. 7 కోట్ల వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీటిని రాజమండ్రి నుంచి విజయవాడకు తరలిస్తున్నట్టుగా సమాచారం.ఆ సొమ్ము ఎవరిదై ఉంటుందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు భారీ గా నగదు లభ్యం కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
అరుణాచల్: కొట్టుకుపోయిన చైనా సరిహద్దు హైవే
ఈటానగర్: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ కొండచరియాలు విరిగిపడ్డాయి. బుధవారం కురిసిన భారీ వర్షాలతో దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని జాతీయ రహదారి-33పై మున్లీ, అనిని ప్రాంతాల మధ్య భారీగా కొండచరియాలు విరిగిపడినట్లు అధికారులు వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడటంతో నేషనల్ హైవేపై కొంత భాగం కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడింది. దీంతో చైనా బోర్డర్లోని దిబాంగ్ వ్యాలీ జిల్లాకు భారత్‌లోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఇక.. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి దిబాంగ్ వ్యాలీ వెళ్లేందుకు ఇదొక్కటే మార్గం కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 🚨🚨🚨Arunachal Pradesh hit by massive landslides. Highway linking China border washed away#ArunachalPradesh pic.twitter.com/96eiVRcPkI— Rosy (@rose_k01) April 25, 2024 దీంతో వేంటనే రంగంలోకి దిగిన నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ సిబ్బంది హైవే మరమత్తులకు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ద్వారా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అత్యవసర సేవలు, వస్తువులకు ప్రస్తుతం ఎటువంటి అంతరాయం లేదని అధికారులు పేర్కొన్నారు.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది. హైవే పునరుద్ధరణ పనుల కోసం మూడు రోజుల సమయం పడుతుందని పేర్కొంది. ఇక.. నేషనల్ హైవే-33 దిబాంగ్ వ్యాలీ జిల్లా ప్రజలకు, ఆర్మీకి చాలా కీలకం. -
ఘోర ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. అయిదుగురి మృతి
చెన్నై: తమిళనాడులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురై సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. విరుధ్ నగర్-మధురై జాతీయ రహదారిపై అతివేగంతో దూసుకొచ్చిన ఎస్యూవీ కారు తొలుత నెమ్మదిగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి అదుపుతప్పింది. అనంతరం ఎడమ వైపున్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టి గాల్లో పలుమార్లు పల్టీలు కొట్టింది. దెబ్బకు ఏకారు కంగా నాలుగు లేన్ల హైవేకు అవతలి వైపు సర్వీస్ లైన్లో ఎగిరిపడింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రమాదం దాటికి సంఘటనా స్థలంలో భారీగా దుమ్ము పేరుకుపోయింది. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా ముధురైలోని విల్లుపురానికి చెందినవారుగా గుర్తించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. #WATCH | Tamil Nadu: Five people, including four members of the same family from Madurai's Villapuram, were killed when a speeding SUV collided with a moped at Sivarakottai near Tirumangalam on the Virudhunagar-Madurai highway: Madurai district SP Arvind (CCTV footage source:… pic.twitter.com/kFCzEvttJW — ANI (@ANI) April 10, 2024 -
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం
జైపూర్: రాజస్థాన్‌లో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వస్తున్న ట్రక్కు రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సు మీదకు దూసుకెళ్లడంతో 11 మంది దుర్మరణం చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. భరత్‌పూర్‌లోని హంత్రా సమీపంలో జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం వెలుగుచూసింది. రాజస్థాన్‌లోని పుష్కర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా బృందావన్‌కు బస్సు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో తెల్లవారుజామున లఖన్‌పూర్ ప్రాంతంలోని అంత్రా ఫ్లైఓవర్ వద్ద బస్సు బ్రేక్‌డౌన్ అయ్యింది. డీజిల్ అయిపోవడంతో డ్రైవర్‌తో పాటు కొంతమంది ప్రయాణికులు బస్సు వెనకాల నిల్చొని ఉన్నారు. అదే సమయంలో వెనకనుంచి వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు వెనకాల వేచి ఉన్న 11 మంది (అయిదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 12 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను అంతు, నంద్రం, లల్లు, భరత్, లాల్జీ, అతని భార్య మధుబెన్, అంబాబెన్, కంబుబెన్, రాముబెన్, అంజుబెన్, మధుబెన్‌గా గుర్తించారు. ఈ ఘనటలో అయిదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక రాజస్థాన్‌లో మంగళవారం సాయంత్రం హనుమాన్‌గఢ్ జిల్లాలో జరిగిన మరో ప్రమాదం జరిగింది. జీపును బస్సు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించగా.. ఒకరికి గాయలయ్యాయి. చదవండి: పరీక్ష రాసి తిరిగివస్తూ.. ముగ్గురు బీటెక్ విద్యార్థుల దుర్మరణం -
హైవే పక్కన భోజనం చేసిన జగపతి బాబు..ఫోటో వైరల్
చెన్నై : ఒకప్పుడు స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న జగపతి బాబు ప్రస్తుతం విలన్ పాత్రలతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ర్టీల నుంచి జగ్గూబాయ్‌కి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉండగా జగపతి బాబు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటారాయన. తాజాగా తమిళనాడులోని ఓ హైవే పక్కన ధాబాలో తన అసిస్టెంట్, డ్రైవర్‌తో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా అక్కడ తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'చాలా రోజుల తర్వాత ఇలా హైవే పక్కన నా డ్రైవర్ రాజు, అసిస్టెంట్ చిరూతో ఫుడ్‌ని ఆరగించాను' అంటూ జగపతి బాబు షేర్చేసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ సంప్లిసిటీకి హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) -
ఘోరం: కిటికీలోంచి వాంతులు.. తెగిపడిన తల
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర ఘటన జరిగింది. వాంతులు రావడంతో బస్సు కిటికీలో తల పెట్టగా అటు వైపు నుంచి ట్రక్కు దూసుకొచ్చింది. దీంతో ఆ పాప తల మొండెం తెగిపడింది. ఈ హఠాత్పరిణామానికి బస్సులో ఉన్న ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. కళ్ల ముందు కుమార్తె మృతదేహం చూసీ ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఖంద్వా జిల్లాలోని రోషియా ఫేట్ వద్ద ఇండోర్-ఇచ్చాపూర్ రహదారి మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తన తల్లి, సోదరితో కలిసి బాలిక (13) ఇండోర్‌కు వెళ్లేందుకు బస్సు ఎక్కింది. మంగళవారం 9.30 సమయంలో రోషియా ఫేట్‌కు చేరుకోగానే వాంతులు వచ్చాయి. దీంతో తల్లి వెంటనే బాలికను బస్సు కిటికీలో తల పెట్టించింది. అయితే ఈలోపు అవతలి వైపు నుంచి దూసుకుంటూ వచ్చిన టక్కు పాప తలను వేగంగా ఢీకొట్టింది. దీంతో పాప మొండెం, తల వేరుపడింది. బంతి మాదిరిగా ఎగిరిపడడంతో ఈ ఘటన చూసిన వారంతా దిగ్ర్భాంతికి గురయ్యారు. బస్సులో కూర్చున్న తల్లి, సోదరి నిర్ఘాంతపోయి షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని లబోదిబోమని రోదించారు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులతో పాటు స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. వెంటనే పోలీసులు వచ్చి బాలిక తల, బాడీని ఒక్కచోటకు చేర్చి ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
హైవేపై దారి దోపిడీ..రైతు నుంచి దోచేశారు
శాలిగౌరారం/నల్గొండ: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను వెంబడించిన దుండగులు రూ.6.40 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మండలంలోని పెర్కకొండారం సమీపంలో జాతీయ రహదారి–365పై సోమవారం మధ్యాహ్నం జరిగింది. ఎస్ఐ హరి బా బు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన చెరుకు నర్సయ్య నకిరేకల్ ఐసీఐసీఐ బ్యాంకులో తన పొలాన్ని కుదువబెట్టి పైపులైన్ నిర్మాణానికి రుణం తీసుకున్నాడు. సన్నిహితుడితో కలిసి బ్యాంకుకు వెళ్లిన నర్సయ్య బ్యాంకులో నగదును తీసుకుని తన బ్యాగ్‌లో పెట్టుకొని ద్విచక్ర వాహనంపై నకిరేకల్ నుంచి 365వ నంబర్ జాతీయ రహదారి మీదుగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో పెర్కకొండారం సమీపంలో జాతీయ రహదారిపై వంతెన నిర్మాణం జరుగుతుండడంతో పక్కనుంచి వేసిన మట్టిరోడ్డు నుంచి ద్విచక్ర వాహనాన్ని నెట్టుకుంటూ వెళ్తేందుకు బండి దిగారు. ఇంతలో వెనుకనుంచి మరో ద్విచక్ర వాహనంలో వచ్చిన ఇద్దరు దుండగులు నర్సయ్యను నెట్టివేసి అతని వద్ద రూ.6.40 లక్షల నగదుతో ఉన్న బ్యాగ్‌ను లాక్కొని తిరిగి నకిరేకల్‌వైపు పారిపోయారు. దీంతో కిందపడిపోయిన నర్సయ్య వెంటనే లేచి లబోదిబోమంటూ కేకలు వేశాడు. అదే సమయంలో రహదారిపై వెళ్తున్న కొందరు విషయం తెలుసుకుని వెంబడించినా.. దుండగుల ఆచూకీ లభించలేదు. బాధితుడు చెరుకు నర్సయ్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాపు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన నల్లగొండ డీఎస్పీజాతీయ రహదారి–365పై దోపిడీ జరిగిన స్థలాన్ని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి సోమవారం సాయంత్రం పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును బాధితుడిని అడిగి తెలుసుకున్నారు. బ్యాంకునుంచి పొందిన నగదుకు సంబంధించిన వివరాలు సేకరించారు. బ్యాంకు వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలతోపాటు నకిరేకల్ పట్టణంలో ఉన్న సీసీ ఫుటేజీల ద్వారా సమాచారాన్ని సేకరించి దర్యాప్తు చేపట్టారు. నకిరేకల్‌రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. -
తవేరా ఢీకొని ఒకరి మృతి
రేగొండ(భూపాలపల్లి): సైకిల్‌పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని తవేరా వాహనం ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందగా, బాలుడికి గాయాలపాలైన సంఘటన మండల కేంద్రంలోని పరకాల–భూపాలపల్లి ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. చిట్యాల మండలం తిర్మలాపురం గ్రామానికి చెందిన అంకం మల్లయ్య(55) సంక్రాంతికి ఇదే మండలంలోని గోరికొత్తపల్లిలోని కూతురు ఇంటికి వెళ్లాడు. తిరిగి శుక్రవారం తన మనవడు చిన్నబాబును సైకిల్‌పై ఎక్కించుకుని తిర్ములాపురానికి బయల్దేరి మండల కేంద్రానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో డీబీఎం–38 కాల్వ వద్ద పరకాల–భూపాలపల్లి ప్రధాన ర«హదారిని సైకిల్‌పై దాటుతుండగా పరకాల వైపు నుంచి వస్తున్న తవేరా వాహనం ఢీకొంది. దీంతో మల్లయ్య రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతిచెందగా, మనవడు తలకు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. తవేరా వాహనాన్ని అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ రేగొండకు చెందిన చల్ల భరత్‌గా గుర్తించారు. కాగా మృతుడి వద్ద బాబు రోదిస్తున్న తీరును చూసి ప్రయాణికులు కంటతడి పెట్టారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
రెండు ఇన్నోవా కార్లు ఢీ..ఇద్దరి పరిస్థితి విషమం
సాక్షి, నల్గొండ: జిల్లాలోని నకిరేకల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నకిరేకలు హైవేపై బుధవారం రాత్రి రెండు ఇన్నోవా కార్లు ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యినట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. క్షతగాత్రులను జిల్లాలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి
శిరివెళ్ల: 18వ జాతీయ రహదారిపై శిరివెళ్ల మెట్ట గ్యాస్ గోడౌన్ వద్ద సోమవారం సాయంత్రం కారు అదుపుతప్పి బోలా్త పడింది. ఈఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఆదోనికి చెందిన బలిజ మహేంద్రనా«థ్ (38), ఉమాలు ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లుగా పనిచేస్తున్నారు. వీరు కారులో తిరుపతికి పోయి తిరిగి వస్తుండగా గ్యాస్‌గోడౌన్ వద్ద వీరి వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్థంభానికి ఢీకొని బోల్తాపడింది. గమనించిన చుట్టుపక్కల వారు కారులో ఇరుక్కున ఇరువురిని బయటకు తీసి 108 అంబులెన్స్‌లో నంద్యాలకు తరలించారు. తీవ్ర గాయాలైన మహేంద్రనాథ్ కోలుకోలేక ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందాడు. ఉమా అనే మహిళ చికిత్స పొందుతుంది. మృతుడు మహేంద్రనాథ్ ఆదోనిలోని నారాయణ ఈ–టెక్నో స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుండగా గాయపడిన ఉమ తిరుపతిలోని శ్రీ చైతన్య స్కూల్లో పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడికి వివాహమైందని, కుటుంబసభ్యుల వివరాలు తెలియాల్సి ఉందని వారు తెలిపారు -
జాతీయరహదారిపై నిలిచిన రాకపోకలు
నిజాంసాగర్: నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై భారీగా చేరిన వరదనీరు చేరింది. మధ్యాహ్నం నుంచి వరద నీరు నల్లవాగు వంతెనపైకి చేరటంతో సంగారెడ్డి- నాందేడ్ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మరో 3 గంటల వరకు వరద ఉధృతి ఇలాగే కొనసాగే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. కాగా, ట్రాఫిక్ నిలిచిపోవటంతో బస్సులు, జీపులు, కార్లలో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
25 కి.మీ.లకు హైవే పెట్రోలింగ్ వాహనం
డీజీపీ సాంబశివరావు వెల్లడి కాకినాడ సిటీ : జాతీయ రహదారుల్లో ప్రతి 25 కి.మీ.లకు ఓ హైవే పోలీసు పెట్రోలింగ్ వాహనం ఉండేలా చర్యలు తీసుకుంటామని డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం కాకినాడలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. అలాగే నూతనంగా నిర్మించిన పోలీసు కల్యాణ మండపాన్ని సందర్శించారు. అనంతరం పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హైవేల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైవే పెట్రోలింగ్ వాహనాలు తక్కువగా ఉన్నాయని, వాటిని పెంచడం ద్వారా ప్రమాద స్థలికి త్వరితగతిన చేరుకుని, సహాయక చర్యలు చేపట్టేలా చూస్తామని వివరించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పోలీసు సిబ్బంది టెక్నాలజీని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలతో మమేకమై వారితో సత్సంబంధాలు మరింత పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి సిబ్బందికి హెల్త్ చెకప్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రవిప్రకాష్, అడిషనల్ ఎస్పీ దామోదర్, ఓఎస్డీ రవిశంకర్‌రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలీసు అసోసియేషన్ నాయకులు బలరామ్, బ్రహ్మాజీ పాల్గొన్నారు. ఆర్టీసీ డిపో సందర్శన: డీజీపీ, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సాంబశివరావు కాకినాడ ఆర్టీసీ డిపోను సందర్శించారు. నూతనంగా ప్రారంభించిన పార్శిల్ సర్వీస్ విధానాన్ని పరిశీలించారు. పలువురు ప్రయాణికులతో సౌకర్యాలపై ఆరా తీశారు. విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ, జిల్లా రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఆర్వీఎస్ నాగేశ్వరరావు, డిపో మేనేజర్ టీవీఎస్ సుధాకర్ పాల్గొన్నారు. -
ఇదీ హైవే
గోతులతో అధ్వానంగా జాతీయ రహదారి 216 కనీస మరమ్మతులు లేవు పెద్దపెద్ద గోతులు.. ప్రమాద భరితంగా ఉన్న మార్జిన్లు.. రాళ్లు తేలి అధ్వానంగా కనిపిస్తున్న ఈ రహదారి ఏదో మారుమూల గ్రామంలోదో కాదు. ఇది జాతీయ రహదారి 216. మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా గుర్తించిన పోర్టుల కనెక్టవిటీ కీలక రహదారుల్లో ఇది ఒకటి. అంతటి ప్రాధాన్యమున్న ఈ రహదారి కొన్నేళ్లుగాకనీస మరమ్మతులకు సైతం నోచుకోలేదు. దాంతో అమలాపురం – కాకినాడ– కత్తిపూడి ప్రయాణం నరకప్రాయంగా మారింది. అమలాపురం : జిల్లాలోని కత్తిపూడి నుంచి కృష్ణా జిల్లాలోని పామర్రు వరకు 216 జాతీయ రహదారి 240 కి.మీ. మేర ఉంది. ఈ రహదారిని త్వరలో నాలుగు లైన్లుగా విస్తరించే తొలి దశ పనులు మొదలు కానున్నాయి. ఆ పనులు జరుగుతాయని చెప్పి ధ్వంసమైన ఈ రహదారికి కనీస మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. దాంతో ముమ్మిడివరం మండలం అనాతవరం, గాడిలంక, అన్నంపల్లి, పిఠాపురం నియోజకవర్గ పరిధిలో పిఠాపురం బైపాస్ రోడ్డు, కత్తిపూడి సమీపంలో గోతులమయంగా మారింది. రెండు,మూడు అడుగుల వైశాల్యంలో ఏర్పడిన గోతులతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళల్లో ద్విచక్రవాహనాలు గోతుల్లో పడడంతో ప్రమాదాల పాలవుతున్నారు. కత్తిపూడి నుంచి కాకినాడ వరకు రహదారి అధ్వానంగా మారింది. అసలే ఇరుకుగా ఉండే ఈ రోడ్డు ధ్వంసం కావడంతో ప్రయాణం సాఫీగా సాగడం లేదు. కాకినాడ నుంచి కత్తిపూడి చేరడానికి సాధారణంగా గంట సమయం ఎక్కువ. కానీ ఇప్పుడు రెండు గంటలకు పైగా పడుతోంది. గత ఏడాది అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఈ రహదారికి ఆధునికీకరణ పనులు చేపట్టారు. అనాతవరం నుంచి మురమళ్ల వరకు పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. కీలక రహదారిపై ఇంత అశ్రద్ధా? త్వరలో రహదారిని విస్తరిస్తారనే సాకుతో ఇప్పుడు కనీసం మరమ్మతులు సైతం చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోడసకుర్రు వంతెన ఆరంభమైన తరువాత పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా రాజోలు పరిసర ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి ఈ రహదారి మీదుగా రవాణా పెరిగింది. గతంలో భీమవరం, నర్సాపురం నుంచి సిద్ధాంతం, రావులపాలెం, రాజమహేంద్రవం, కత్తిపూడి మీదుగా ఎన్‌హెచ్–16 మీద లారీలు, ఇతర వాహనాల రాకపోకలు ఎక్కువగా సాగేవి. ఒడిశా, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌కు ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చేపలలోడు లారీలు రాకపోకలు సాగిస్తాయి. ఇప్పుడు ఈ కొత్తమార్గంలో దూరం తగ్గడంతో వాహనాల రాకపోకలు దీనిపై ఎక్కువగా ఉన్నాయి. అయితే గోతులమయమైన ఈ దారిలో ప్రయాణకాలం ఎక్కువ అవుతుండడంతో తిరిగి పాతరహదారినే వినియోగిస్తున్నారు. ఈ జాతీయ రహదారిపైS అమలాపురం నుంచి విశాఖ, కాకినాడ వెళ్లే ప్రయాణికులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. గమ్యం చేరడం ఆలస్యం కావడంతోపాటు కుదుపులకు ఒళ్లు హూనమైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌హెచ్ అధికారులు ఈ జాతీయ రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
పండుగకు వచ్చి తిరిగి వెళ్తూ...
-
రహదారిపై ‘గేదె’ బీభత్సం
రొంపిచర్ల: గుంటూరు జిల్లాలోని అద్దంకి రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. వివరాలు.. జిల్లాలోని రొంపిచర్ల మండలం సంతగుడిపాడు వద్ద ఉన్న అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారి పై ఈ సంఘటన చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీకి గేదె అడ్డం రావడంతో లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో లారీ వెనక ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇది గుర్తించక లారీని ఢీకొట్టాడు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సు వెనక గేదెల లోడుతో వెళ్తున్న మరో లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనతో రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.లారీ ఢీకొట్టిన ఆర్టీసీ బస్సులో ప్రయాణికులెవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. లారీ డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు . -
హైవేపై కారు బీభత్సం
చెన్నెకొత్తపల్లి (అనంతపురం) : రోడ్డు దాటుతున్న మహిళను తప్పించడానికి ప్రయత్నించిన కారు అదుపుతప్పి మందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న మహిళతోపాటు కారులో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా చెన్నెకొత్తపల్లి మండలం ఎర్రంపల్లి సమీపంలోని 44 జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగింది. చెన్నెకొత్తపల్లి నుంచి అనంతపురం వెళ్తున్న సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చెందిన కారు ఎర్రంపల్లి సమీపంలోకి రాగానే గ్రామానికి చెందిన మహిళ రోడ్డు దాటుతుంది. ఆమెను తప్పించడానికి ప్రయత్నించడంతో.. కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరితోపాటు రోడ్డు దాటుతున్న మహిళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
మద్యంపై పోరుబాట
నెల్లూరు (టౌన్): సారా వ్యతిరేక ఉద్యమ పురిటిగడ్డ అయిన సింహపురిలో మద్యం మహమ్మారిపై మరో పోరు పురుడు పోసుకుంది. జిల్లాలో విచ్చలవిడి అమ్మకాలపై మహిళాలోకం దండెత్తింది. అన్నారెడ్డిపాలెం, నరుకూరు ప్రాంతాల్లో ప్రారంభమైన ఈపోరు జిల్లా అంతటా విస్తరించి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. మద్యం వ్యాపారంతో అందిన కాడికి కాసులు దండుకుందామని లాటరీలో షాపులు దక్కించుకున్న తెలుగు తమ్ముళ్లు, వ్యాపారులు తాజా పరిణామాలతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయోనని ఎక్సైజ్ అధికారులు కలవరపడుతున్నారు. బుధవారం నుంచి మద్యానికి సంబంధించి కొత్త పాలసీ అమలులోకి తీసుకువచ్చారు. మద్యం షాపులకు రాత్రి 11 గంటల వరకు అనుమతులు జారీ చేశారు. దుకాణాలకు సమీపంలో దేవాలయాలు, పాఠశాలలు, హైవేకి 150 మీటర్ల దూరంలో ఉండకూడదన్న నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. చాలా ప్రాంతాల్లో అధికారులు కన్నుసన్నుల్లోనే నిబంధనలుకు విరుద్ధంగా మద్యం షాపులు ఏర్పాటు చేశార న్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం బాటిళ్లను ఎంఆర్పీ ధరకే విక్రయించాలన్న నిబంధనను వ్యాపారులు పక్కనబెట్టారు. వ్యాపారులను నియంత్రించాల్సిన అధికారు లు తమ్ముళ్లు, వ్యాపారుల మత్తులో తూలుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామస్తుల పోరుబాటు: మద్యం దుకాణాల ఏర్పాటుపై పోరు ప్రారంభమైంది. సంగం మండలం అన్నారెడ్డిపాలెంలో మద్యం దుకాణం వద్దంటూ రోడ్డెక్కారు. దీంతో మద్యం వ్యాపారి తొలిరోజు మిన్నకుండిపోయారు. అదేవిధంగా నరుకూరు సెంటరులో నిత్యం విద్యార్థులు, మహిళలు, స్థానికులు అధికంగా ఉంటారని, ఈ ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చేస్తే ఊరుకోబోమని గ్రామస్తులు గళమెత్తారు. దీంతో వ్యాపారుల్లో గుబులు పట్టుకుంది. షాపు నిర్వహణకు లక్షలు వెచ్చించి లాటరీలో దక్కించుకుంటే మద్యం అమ్మకంపై జనం ఉద్యమించడమేమిటని లోలోన మదనపడుతున్నారు. ఈరెండు గ్రామాలతో పాటు మరిన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటుపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వమే దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం అమ్మడంపై కూడా మహిళాలోకం మండిపడుతోంది. మద్యంతో ఇప్పటికే పేద, మధ్యతరగతి కుటుంబాలు రోడ్డునపడి అల్లాడుతుంటే, కొత్తగా ఈ విధానాన్ని తీసుకురావడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు మద్యం అమ్మకాలపై రాత్రి సమయంలో 11 గంటల దాక అనుమతి ఇవ్వడంపైనా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి రాత్రులు నిద్రలేకుండా ఇబ్బందులు పడుతుంటే రాత్రి 11దాకా అనుమతిస్తే ఇళ్లు వదిలిపెట్టి పోవాల్సిందేనని పలువురు మండిపడుతున్నారు. -
మహా నగరానికి బారులు...
-
టోల్‌ప్లాజా దాటాలంటే.. అరగంట పైనే..!