తూ.గో.లో వ్యాన్‌ బోల్తా.. కోట్లలో పట్టుబడిన డబ్బు | Road Accident Leads To Seize Crores Of Cash At Nallajarla Highway | Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరిలో వ్యాన్‌ బోల్తా.. కోట్లలో పట్టుబడిన డబ్బు

Published Sat, May 11 2024 10:46 AM | Last Updated on Sat, May 11 2024 1:40 PM

Road Accident Leads To Seize Crores Of Cash At Nallajarla Highway

సాక్షి తూర్పుగోదావరి జిల్లా: ఓ రోడ్డు ప్రమాదంతో అక్రమంగా తరలిస్తున్న డబ్బులు పట్టుబడ్డాయి. ఘటనా స్థలంలో పోలీసులు పరిశీలనలో భారీగా తరలిస్తున్న నగదు గుట్టు బయటపడింది. వివరాలు.. నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.  తౌడులో కలిపే కెమికల్‌ బస్తాలతో వెళ్తోన్న వ్యాన్‌ను వెనకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌ బోల్తా పడగా, క్లీనర్‌, డ్రైవర్‌కు గాయాలయ్యయి. వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ క్రమంలో వ్యాన్‌ అడుగు భాగంలో 7 అనుమానాస్పద బాక్స్‌లను పోలీసులు గుర్తించారు. ఉన్నతాధికారుల సమక్షంలో బాక్స్‌లను అనంతపల్లి టోల్‌ ప్లాజా వద్ద తెరిచి చూడగా భారీగా నగదు బయటపడింది.

 

బాక్స్‌లోని డబ్బులను అధికారులు,ఎలక్షన్‌ ఫ్లైయింగ్‌ స్వ్కాడ్‌ లెక్కిస్తోంది. నగదు మొత్తం రూ. 7 కోట్ల వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీటిని రాజమండ్రి నుంచి విజయవాడకు తరలిస్తున్నట్టుగా సమాచారం.ఆ సొమ్ము ఎవరిదై ఉంటుందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు భారీ గా నగదు లభ్యం కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement