cash seize
-
తూ.గో.లో వ్యాన్ బోల్తా.. కోట్లలో పట్టుబడిన డబ్బు
సాక్షి తూర్పుగోదావరి జిల్లా: ఓ రోడ్డు ప్రమాదంతో అక్రమంగా తరలిస్తున్న డబ్బులు పట్టుబడ్డాయి. ఘటనా స్థలంలో పోలీసులు పరిశీలనలో భారీగా తరలిస్తున్న నగదు గుట్టు బయటపడింది. వివరాలు.. నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తౌడులో కలిపే కెమికల్ బస్తాలతో వెళ్తోన్న వ్యాన్‌ను వెనకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడగా, క్లీనర్, డ్రైవర్‌కు గాయాలయ్యయి. వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ క్రమంలో వ్యాన్ అడుగు భాగంలో 7 అనుమానాస్పద బాక్స్‌లను పోలీసులు గుర్తించారు. ఉన్నతాధికారుల సమక్షంలో బాక్స్‌లను అనంతపల్లి టోల్ ప్లాజా వద్ద తెరిచి చూడగా భారీగా నగదు బయటపడింది.Cinematic: Accident leads to Rs 7 crore cash seizure packed in 7 cardboard boxes loaded in Tata Ace vehicle going from Vijayawada towards Vizag, that overturned after hitting a truck & one box fell out revealing currency hidden packed in between sacks #AndhraPradesh #EastGodavari pic.twitter.com/OXoy0oaRJI— Uma Sudhir (@umasudhir) May 11, 2024 బాక్స్‌లోని డబ్బులను అధికారులు,ఎలక్షన్ ఫ్లైయింగ్ స్వ్కాడ్ లెక్కిస్తోంది. నగదు మొత్తం రూ. 7 కోట్ల వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీటిని రాజమండ్రి నుంచి విజయవాడకు తరలిస్తున్నట్టుగా సమాచారం.ఆ సొమ్ము ఎవరిదై ఉంటుందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు భారీ గా నగదు లభ్యం కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
ఎన్నికల వేళ భారీగా సొత్తు సీజ్: సీబీడీటీ
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో లెక్కల్లో చూపించని నగదు భారీగా పట్టుబడుతున్నట్లు ఆదాయ పన్ను విభాగం సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్)తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో 2019లో జరిగిన లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా బుధవారం తెలిపారు. సోదా, నిఘా చర్యలను ఎన్నికల కమిషన్ సమన్వయంతో చేపడుతున్నామని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలున్న రాజస్తాన్‌లో పట్టుబడిన అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి తదితరాల మొత్తం విలువ మూడింతలయిందన్నారు. 2021లో సీజ్ చేసిన మొత్తం సొత్తు విలువ రూ.322 కోట్లు కాగా, 2022లో అది రూ.322 కోట్లకు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1,021 కోట్లకు పెరిగిందని గుప్తా పేర్కొన్నారు. -
మహా ఎన్నికలు : రూ 142 కోట్లు స్వాధీనం
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ రూ 142 కోట్ల నగదు, 975 అక్రమ ఆయుధాలను సీజ్ చేశామని అదనపు ఎన్నికల ప్రధానాధికారి దిలీప్ షిండే వెల్లడించారు. సెప్టెంబర్ 21న ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన అనంతరం పెద్ద ఎత్తున నగదు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరోవైపు మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం శనివారంతో ముగిసింది. ఇరు రాష్ట్రాల్లో ఈనెల 21న పోలింగ్ జరగనుండగా, 24న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉండగా మరోసారి పాలనాపగ్గాలు చేపట్టాలని కాషాయ పార్టీ చెమటోడుస్తుండగా, ఈ రాష్ట్రాల్లో పాగా వేయాలని విపక్ష కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. -
కోచింగ్ ఇన్స్టిట్యూట్లపై ఐటీ దాడులు
న్యూఢిల్లీ: తమిళనాడులోని ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఐటీ శాఖ రూ. 30 కోట్లు స్వాధీనం చేసుకుంది. నీట్‌లాంటి ప్రవేశ పరీక్షలకు ఈ ఇన్స్టిట్యూట్ శిక్షణ ఇస్తోందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) శనివారం వెల్లడించింది. నమక్కల్ కేంద్రంగా ఉన్న ఈ గ్రూపుకి సంబంధించిన 17 ప్రాంగణాలలో శుక్రవారం ఏకకాలంలో దాడులు జరిపామని, ప్రాథమిక అంచనాల ప్రకారం, ఆ గ్రూప్ ఆదాయం రూ. 150 కోట్ల రూపాయలకు పైగా ఉందని తెలిపింది. ఈ బృందం ప్రధానంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకోసం విద్యాసంస్థలు, కోచింగ్ ఇనిస్టిట్యూట్లను నడుపుతోంది. ఈ ట్రస్ట్ నియంత్రణలో అనేక భాగస్వామ్య సంస్థలు, వ్యక్తులు ఉన్నారని తెలిపింది. సీబీడీటీ ఆదాయపన్ను శాఖ కోసం వివిధ విధానాలను రూపొందిస్తుంది. శుక్రవారం నమక్కల్, పెరుండురై, కరూర్, చెన్నైలోని గ్రూప్ ప్రమోటర్ల ఇళ్లు, ప్రాంగణాలపై దాడులు జరిగాయి. ఫీజు రశీదులను విడివిడిగా రూపొందించడం ద్వారా సంస్థ గణనీయంగా పన్ను ఎగవేతలకు పాల్పడుతోందని వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు ఐటీ దాడులు చేశామని సీబీడీటీ వెల్లడించింది. ఫీజులో కొంత భాగాన్ని నగదు రూపంలో స్వీకరించడం, రశీదులను సైతం సాధారణ ఖాతాల పుస్తకాలలో నమోదు చేయకపోవడం లాంటి పనులకు సంస్థ పాల్పడిందని వెల్లడించింది. సోదాల సమయంలో డైరీలు, ఎలక్ట్రానిక్ స్టోరేజ్ పరికరాల్లో లెక్కలేనన్ని ఫీజు రశీదులను గుర్తించినట్లు తెలిపింది. బినామీ ఉద్యోగుల పేర్లతో లాకర్లు తెరిచారని, ప్రధాన బ్రాంచ్‌లోని లాకర్లో భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నామని బోర్డు తెలిపింది. ఉద్యోగులకు ఆదాయపన్నుకు అందకుండా నగదు రూపంలో జీతాలు చెల్లిస్తున్నారని తెలిపింది. -
రూ.3 కోట్ల నగదు స్వాధీనం
పరిగి: ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు లభ్యమైంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం లోని చిట్టెంపల్లిగేట్ సమీపంలో హైదరాబాద్–వికారాబాద్ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు వెళ్తున్న (ఏపీ 09 సీటీ6957) ఐ10 కారును తనిఖీ చేశారు. కారులో రూ.3 కోట్ల నగదు ఉన్నట్లు గుర్తించారు. తర్వాత కారుతో సహా కారులోని వారిని పరిగి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలించారు. ఈ డబ్బును హైదరాబాద్ జీడిమెట్ల షాపూర్‌లోని ఆదర్శ్ బ్యాంకు నుంచి వికారాబాద్, తాండూరులోని ఆదర్శ్ బ్యాంకులకు తరలిస్తున్నట్లు కారులోని వ్యక్తులు టి.వెంకటేశ్, అరుణ్‌కుమార్, రామనాగేశ్ తెలిపారు. వాటికి సంబంధించి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదు సీజ్ చేశారు. ఈ నగదు రంగారెడ్డి జిల్లా ట్రెజరీకి తరలించారు. పలు అనుమానాలు: ఎన్నికల నేపథ్యంలో భారీ మొత్తంలో నగదు లభ్యమవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాహనానికి ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే రూ.3 కోట్లు తరలిస్తుండటం, ఈ నగదుకు సంబంధించి ఆధారాలు లేకపోవటం అనుమానాలకు తావిచ్చినట్లైంది. బ్యాంకులకైనా పెద్దమొత్తంలో నగదును తరలించేటప్పుడు సెక్యూరిటీ ఉండాల్సిందేనని నిబంధనలు స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ఆ డబ్బులు ఎక్కడివన్న కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
పెద్ద ఎత్తున నగదు, డ్రగ్స్ పట్టివేత
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసుల దాడులు ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలో భారీ నగదుతో పాటు పెద్ద ఎత్తున మద్యం, మాదకద్రవ్యాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. వివిధ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్న వాటిని పరిశీలిస్తే .. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేడి ఏవిధంగా వుందో అర్థమవుతుంది. కర్ణాటక విజయంపై కన్నేసిన పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ఎవరికి వారే వ్యూహచరనలో మునిగితేలుతున్నారు. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున్న నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు పంచిపెడుతున్నారు. తాజాగా రూ. 31.55 కోట్లు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 4.58 కోట్ల రూపాయల విలువైన 1.15 లక్షల లీటర్ల మద్యాన్ని, 30.52 కిలోల నార్కోటిక్ డ్రగ్స్‌ను వివిధ ఏజెన్సీలు సీజ్ చేశాయి. ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.19.79 లక్షలుగా ఉండనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు 3.59 కోట్ల రూపాయల విలువైన 14.492 కిలోల బంగారాన్ని, 12.67 లక్షల రూపాయల విలువైన వెండిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఎన్ఎస్ఈ బ్రోకర్‌పై దాడి: రూ.11 కోట్లు సీజ్
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్ సంజయ్ గుప్తాకు చెందిన ఢిల్లీ నివాసంలో జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో రూ.11 కోట్ల నగదు పట్టుబడింది. ఓపీజీ గ్రూప్‌కు చెందిన కో-లొకేషన్ కేసులో భాగంగా ఐటీ అధికారులు ఈ తనిఖీలు చేపడుతున్నారు. సంజయ్ గుప్తా నివాసంలో జరిపిన దాడుల్లో శుక్రవారం రూ.11 కోట్లు సీజ్ చేసినట్టు ఐటీ అధికారులు తెలిపారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కత్తాల్లో ఓపీజీ గ్రూప్, ఇతరులకు చెందిన 50కి పైగా ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఐటీ దాడులు జరుపుతోంది. ఈ దాడుల్లో వందల కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి డాక్యుమెంట్లను, ఫారిన్ బ్యాంకు అకౌంట్లు, ఓవర్సీస్ ట్రేడింగ్ ఫండ్ల డాక్యుమెంట్లను సీజ్ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓపీజీ సెక్యురిటీస్ ఢిల్లీకి చెందిన స్టాక్ బ్రోకింగ్ సంస్థ. ఎన్ఎస్ఈ సర్వర్లకు అన్యాయపూర్వకమైన యాక్సస్‌ను కలిగి ఉందనే నెపంతో ఆరు నెలల పాటు ఈ బ్రోకింగ్ సంస్థపై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిషేధం విధించింది. గుప్తా నివాసంలో దొరికిన నగదు పలు బాక్స్‌లో దాచిపెట్టి ఉంచారని, ఫర్నీచర్ చెక్క మధ్యలో ఉంచినట్టు తెలిసింది. ఎన్ఎస్ఈ మాజీ సీఈవో, ఇతర అధికారుల ప్రాంతాల్లో కూడా ఇంతకముందు ఐటీ దాడులు జరిపింది. కో-లొకేషన్ సౌకర్యంతో ఎన్ఎస్ఈ ఎక్స్చేంజ్ నుంచి త్వరగా డేటాను ఓపెజీ సెక్యురిటీస్ పొందుతుందని వెల్లడైంది. ఈ సమాచారం ముందస్తుగా పొందడంతో ఎక్కువమొత్తంలో ట్రేడింగ్ లాభాలు పొందుతున్నట్టు తెలిసింది. -
రూ.15 లక్షల నగదు, రంగురాళ్లు స్వాధీనం
కొత్తగూడెం : స్థానిక ఎన్నికలతో పాటు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లావ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా కొత్తగూడెంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వారి సోదాల్లో ఓ వాహనంలో తరలిస్తున్న రూ.12 లక్షల నగదు బయటపడింది. ఆ నగదుకు సరైన ఆధారాలు లేకపోవటంతో పోలీసులు స్వాధీనం చేసుకుని, ఓ వ్యక్తిని విచారిస్తున్నారు. మరోవైపు కొత్తగూడెం మండలం రామవరంలో 200 బస్తాల రంగురాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూడు లక్షల నగదును పట్టుకున్నారు. కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. -
బస్సు ప్రయాణికుడి నుంచి 59 లక్షలు స్వాధీనం
చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఓ బస్సులో ప్రయాణికుడి నుంచి పోలీసులు దాదాపు 59 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తిరువళ్లూరు బస్టాండులో కాపు కాశారు. ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ తనిఖీ చేయగా, అబూ బకర్ (52) అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగులో ఏకంగా 59 లక్షల రూపాయలు దొరికాయి. అన్నీ వెయ్యి రూపాయల నోట్లేనని పోలీసులు తెలిపారు. కేరళలోని మళప్పురానికి చెందిన ఓ నగల వ్యాపారి చెన్నైలో వసూళ్లు చేసుకు రావాల్సిందిగా తనను పంపాడని, ఆ డబ్బునే తాను తీసుకెళ్తున్నానని అతడు పోలీసులకు విచారణలో తెలిపాడు. అయితే, ఇది హవాలా సొమ్ము కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో సదరు నగల వ్యాపారిని కూడా విచారణ నిమిత్తం చెన్నైకి పిలిపించారు.