చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఓ బస్సులో ప్రయాణికుడి నుంచి పోలీసులు దాదాపు 59 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తిరువళ్లూరు బస్టాండులో కాపు కాశారు.
ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ తనిఖీ చేయగా, అబూ బకర్ (52) అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగులో ఏకంగా 59 లక్షల రూపాయలు దొరికాయి. అన్నీ వెయ్యి రూపాయల నోట్లేనని పోలీసులు తెలిపారు. కేరళలోని మళప్పురానికి చెందిన ఓ నగల వ్యాపారి చెన్నైలో వసూళ్లు చేసుకు రావాల్సిందిగా తనను పంపాడని, ఆ డబ్బునే తాను తీసుకెళ్తున్నానని అతడు పోలీసులకు విచారణలో తెలిపాడు. అయితే, ఇది హవాలా సొమ్ము కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో సదరు నగల వ్యాపారిని కూడా విచారణ నిమిత్తం చెన్నైకి పిలిపించారు.
బస్సు ప్రయాణికుడి నుంచి 59 లక్షలు స్వాధీనం
Published Tue, Sep 3 2013 4:20 PM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement
Advertisement