bus passenger
-
బస్సులో యువకుల హంగామా.. మాస్క్‌లేకుండా.. ఉమ్ముతూ..
బెంగళూరు: దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, వైరస్ ఉధృతి మాత్రం ఇంకా తగ్గలేదు. అందుకే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన, కొవిడ్ ఆంక్షలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. కాగా, చాలా చోట్ల.. ప్రజలు కరోనా నిబంధనలను అతిక్రమిస్తున్న సంఘటనలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా, ఒక బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను మాస్క్ పెట్టుకొమ్మని అడిగినందుకు కండక్టర్‌ను చితకబాదారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచోసుకుంది. కెఎస్‌ఆర్‌టీసీకి చెందిన బస్సు గత గురువారం బెంగళూరు-హైద్రాబాద్ మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో చదాలపూర్ గేట్ వద్ద ఇద్దరు యువకులు బస్సు ఎక్కారు. వీరిద్దరు మాస్క్‌ను పెట్టుకోలేదు. పైగా బస్సులో ఎక్కడంటే అక్కడ ఉమ్మివేయసాగారు. దీంతో తోటి ప్రయాణికులు కండక్టర్‌ను పిలిచి చెప్పారు. దీంతో కండక్టర్ వారిని మాస్క్ ధరించమని చెప్పాడు. ఈ క్రమంలో ఆ యువకులిద్దరు కండక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా.. ఇష్టం వచ్చినట్టు దూషించి, దాడికి కూడా తెగబడ్డారు. కాసేపు బస్సులో నానా హంగామా సృష్టించారు. దీంతో బస్సులోని ప్రయాణికులు ఆ యువకులిద్దరిని పట్టుకుని, దేహశుద్ధి చేసి బస్సును నేరుగా చిక్కబల్లాపూర్‌లోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితులలో ఒకరిని కుప్పహల్లి గ్రామానికి చెందిన చిరంజీవిగా గుర్తించారు. మరో యువకుడు తప్పించుకున్నాడు. అయితే, నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడిన కండక్టర్ కృష్ణయ్యను చిక్కబల్లాపూర్‌లోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. కాగా, కేసును నమోదు చేసుకున్న పోలీసులు మరో నిందితుని కోసం గాలిస్తున్నారు. -
మాస్కు పెట్టుకోమన్నందుకు చాతి కొరికాడు
డబ్లిన్ : కరోనా నేపథ్యంలో ఇప్పుడు మాస్క్ అనివార్యంగా మారింది. ఎవరైనా సరే బయటకు వెళ్తే కచ్చితంగా మాస్క్ ధరించాలంటూ ప్రభుత్వాలు, వైద్యులు సూచిస్తున్నారు. ఇంతచెప్పినా కొందరు మాత్రం లెక్కచేయడంలేదు. చాలా మంది ఏదో మొక్కుబడిగా మాస్కును ధరిస్తున్నారే తప్ప నిజంగా తమ రక్షణకే అన్న విషయం మరిచిపోయారు. అయితే మాస్క్ ధరించమని చెప్పినందుకు ఎన్నోసార్లు భౌతిక దాడులతో పాటు వ్యక్తుల ప్రాణం కూడా తీసిన ఘటనలు చాలానే చూశాం. తాజాగా మాస్క్ పెట్టుకోమని సూచించిన వ్యక్తిని కొరికి బస్సులో నుంచి పారిపోయిన ఘటన ఐర్లాండ్‌లో చోటుచేసుకుంది.(మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష) వివరాలు.. బెల్జియంలో నివసించే రాబర్ట్ మర్ఫీ బస్సులో ప్రయాణిస్తుండగా, వెనుకనున్న వ్యక్తి అదే పనిగా ముక్కు చీదాడు. అయితే మర్ఫీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి మాస్కును ధరించాలని కోరాడు. అవతలి వ్యక్తి క్షమాపణ కోరుతూ మాస్కు ధరించాడు. కొద్దిసేపటికి అదే బస్సులోకి ఒక జంట ఎక్కింది. ఆ జంట వచ్చి మర్ఫీ ఎదుట కూర్చున్నారు. వారిలో యువకుడు మాస్క్ సరిగా ధరించకపోవడంతో మాస్క్ సరిగా పెట్టుకోవాలని మర్ఫీ సూచించాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. సదరు వ్యక్తి అకస్మాత్తుగా మర్ఫీపై దాడికి దిగాడు. మర్ఫీ చాతిపై తన పళ్లతో గట్టిగా కొరికి ప్రేయసితో కలిసి బస్సు దిగి పారిపోయాడు. వెంటనే మర్పీని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా ఆ జంటను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
బస్సు ప్రయాణికుడి నుంచి 59 లక్షలు స్వాధీనం
చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఓ బస్సులో ప్రయాణికుడి నుంచి పోలీసులు దాదాపు 59 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తిరువళ్లూరు బస్టాండులో కాపు కాశారు. ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ తనిఖీ చేయగా, అబూ బకర్ (52) అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగులో ఏకంగా 59 లక్షల రూపాయలు దొరికాయి. అన్నీ వెయ్యి రూపాయల నోట్లేనని పోలీసులు తెలిపారు. కేరళలోని మళప్పురానికి చెందిన ఓ నగల వ్యాపారి చెన్నైలో వసూళ్లు చేసుకు రావాల్సిందిగా తనను పంపాడని, ఆ డబ్బునే తాను తీసుకెళ్తున్నానని అతడు పోలీసులకు విచారణలో తెలిపాడు. అయితే, ఇది హవాలా సొమ్ము కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో సదరు నగల వ్యాపారిని కూడా విచారణ నిమిత్తం చెన్నైకి పిలిపించారు.