కొత్తగూడెం : స్థానిక ఎన్నికలతో పాటు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లావ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా కొత్తగూడెంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వారి సోదాల్లో ఓ వాహనంలో తరలిస్తున్న రూ.12 లక్షల నగదు బయటపడింది. ఆ నగదుకు సరైన ఆధారాలు లేకపోవటంతో పోలీసులు స్వాధీనం చేసుకుని, ఓ వ్యక్తిని విచారిస్తున్నారు.
మరోవైపు కొత్తగూడెం మండలం రామవరంలో 200 బస్తాల రంగురాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూడు లక్షల నగదును పట్టుకున్నారు. కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు.
రూ.15 లక్షల నగదు, రంగురాళ్లు స్వాధీనం
Published Sat, Mar 8 2014 9:50 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
Advertisement
Advertisement