కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ | Centre Green Signal For New Airports In Kothagudem And Ramagundam | Sakshi
Sakshi News home page

కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులకు గ్రీన్‌ సిగ్నల్‌

Published Mon, Nov 18 2024 5:05 PM | Last Updated on Mon, Nov 18 2024 5:14 PM

Centre Green Signal For New Airports In Kothagudem And Ramagundam

సాక్షి,హైదరాబాద్‌ : వరంగల్ రూ.4వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సెక్రటేరియట్‌ మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు.  

  • కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులకు గ్రీన్‌ సిగ్నల్‌

  • హైదరాబాద్‌- విజయవాడ రోడ్ల విస్తరణకు కేంద్రం అంగీకారం

  • నారపల్లి వరకు ఉన్న ఫ్లైఓవర్‌ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తాం

  • మూసీ ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు

  • మూసీ ప్రక్షాళనపై బీఆర్‌ఎస్‌,బీజేపీలు రాజకీయం చేస్తున్నాయి

  • రేపు వరంగల్ రూ.4వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌ శంకుస్థాపన చేస్తారు

  • వరంగల్‌కు ఎయిర్ పోర్ట్ 1999 నుంచి వింటున్నాం...కానీ ఏర్పాటు జరగలేదు. ఇప్పుడు ఆ కల సాకారం అయ్యింది

  • ఎయిర్ పోర్ట్ పనులను 8 నెలల్లోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాం

  • మొదటి ఏడాది లోపే విమానాల రాకపోకలు ప్రారంభమయ్యేలా పనులు పూర్తి చేస్తాం

  • ఏడాదిన్నర కాలంలోనే తిరుపతి, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ లాంటి పట్టణాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయబోతున్నాం.

  • భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

  • హైదరబాద్‌తో పాటు మరో మూడు ఎయిర్‌పోర్ట్‌లను వచ్చే నాలుగేళ్లలో సాధించుకుంటాం

  • హైదరాబాద్ - విజయవాడ 6 లైన్ రోడ్డు వచ్చే జనవరిలో డీపీఆర్‌ పనులు పూర్తి చేసి ఫిబ్రవరిలో పనులు మొదలు పెట్టే ప్రయత్నం చేస్తాం

  • ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు ఆలస్యంపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తి

  • ఫ్లైఓవర్‌ నిర్మాణాలు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా 30 శాతం పనులు మాత్రమే అయ్యాయి

  • కేంద్రంతో మాట్లాడి వచ్చే ఏడాదిన్నర లోపు ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం

  • వర్షాలు పడితే ఫ్లైఓవర్ కింద చాల మంది మరణించారు.. గత ప్రభుత్వం పట్టించుకోలేదు

  • రీజినల్ రింగ్ రోడ్డు పనులపై 2018లో బీఆర్‌ఎస్‌ ప్రకటన చేసింది. కానీ పనులు పూర్తి కాలేదు

  • రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణ పనులు వచ్చే నెలలో మొదలు పెడతాం

  • శ్రీశైలం ఏరియాలో ఎలివేటెడ్‌ కారిడార్‌ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తాం
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement