Air ports
-
జీఐఎల్, ఏడీపీ డీల్‌కు సీసీఐ ఆమోదం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (జీఐఎల్), ఏరోపోర్ట్స్ డి ప్యారిస్ (ఏడీపీ) ప్రతిపాదిత ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. ఈ డీల్ ప్రకారం జీఐఎల్ జారీ చేసే విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లను ఏడీపీ కొనుగోలు చేయనుంది. అటు జీఐఎల్‌లో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్(జీఏఎల్) , జీఎంఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ (జీఐడీఎల్) విలీ న ప్రతిపాదనకు కూడా సీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్రాన్స్ ప్రభుత్వ నిర్వహణలోని ఏడీపీ అంతర్జాతీయంగా ఎయిర్పోర్ట్ ఆపరేటరుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. లిస్టెడ్ కంపెనీ అయిన జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.. తన అనుబంధ సంస్థ జీఏఎల్ ద్వారా విమానాశ్ర యాల నిర్వహణ తదితర కార్యకలాపాలు సాగిస్తోంది. జీఐఎల్‌కు జీఐడీఎల్ అనుబంధ సంస్థ. -
విమానాశ్రయాల్లో వాటాల విక్రయం!
న్యూఢిల్లీ: ఇప్పటికే ప్రయివేటైజ్ చేసిన విమానాశ్రయాల్లో ప్రభుత్వానికి మిగిలిన వాటాలను విక్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జాబితాలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నాలుగు విమానాశ్రయాలలో ఎయిర్పోర్ట్ అథారిటీ(ఏఏఐ)కున్న వాటాలను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశాయి. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం(2021–22)లో మరో 13 ఎయిర్‌పోర్టులను ప్రయివేటైజ్ చేసే ప్రణాళికల్లో ప్రభుత్వమున్నట్లు వివరించాయి. ఆస్తుల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 2.5 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని చూస్తున్న విషయం విదితమే. గత నెలలో అత్యున్నత కార్యదర్శుల కమిటీ ఈ మేరకు ప్రణాళికలు వసినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో నాలుగు ఎయిర్‌పోర్టుల భాగస్వామ్య సంస్థ(జేవీ)లలో ఏఏఐకుగల వాటాల విక్రయంపై పౌర విమానయాన శాఖ తగిన అనుమతులను పొందనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. రానున్న కొద్ది రోజుల్లో అనుమతుల అంశం కేబినెట్‌కు చేరనున్నట్లు తెలియజేశాయి. కాగా.. వచ్చే ఏడాదిలో ప్రయివేటైజ్ చేయనున్న జాబితాలోని లాభదాయకం, లాభదాయకంకాని 13 ఎయిర్‌పోర్టులను మిక్స్ చేయడం ద్వారా ఆకర్షణీయమైన ప్యాకేజీకి మార్గమేర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి రౌండ్ ప్రయివేటైజేషన్‌లో భాగంగా అదానీ గ్రూప్ లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఏఏఐ నిర్వహణలో దేశవ్యాప్తంగా 100కుపైగా విమానాశ్రయాలున్నాయి. వివరాలివీ ►నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలలో వివిధ సంస్థలకున్న వివరాలు ఎలా ఉన్నాయంటే.. ముంబై ఎయిర్‌పోర్టులో అదానీ గ్రూప్ 74 శాతం వాటాను కలిగి ఉంది. ఏఏఐకు 26 శాతం వాటా ఉంది. ►ఢిల్లీ విమానాశ్రయంలో జీఎంఆర్ గ్రూప్ వాటా 54 శాతంకాగా.. ఏఏఐ 26 శాతం వాటాను పొందింది. ఫ్రాపోర్ట్, ఎరమన్ మలేషియా 10 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి. ►హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు, ఏఏఐ 26 శాతం వాటాను పొందాయి. ఇదేవిధంగా కర్ణాటక ప్రభుత్వంతో కలసి బెంగళూరు ఎయిర్‌పోర్టులోనూ వాటాను కలిగి ఉంది. -
వీడి తెలివికి ఆస్కార్, నోబెల్ కూడా తక్కువే..!
స్మగ్లింగ్ నుంచి నియంత్రించడానికి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్న మాట వాస్తవం. ముఖ్యంగా విమానాశ్రయల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. మనం కూడా నిత్యం ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత వంటి వార్తల్ని అనేకం చూస్తూనే ఉంటాం. అయితే కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పడానికి జనాలు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారో చెప్పుకొచ్చారు ఓ సీనియర్ కస్టమ్స్ అధికారి. ఓ వ్యక్తి ఏకంగా వేరు శనకాయల్లో డ్రగ్స్‌ని కుక్కి స్మగుల్ చేయడానికి ప్రయత్నించాడని గుర్తు చేసుకున్నారు నార్బర్ట్ అల్మేడియా అనే వ్యక్తి 2000 - 2005 వరకూ కస్టమ్స్ అధికారిగా విధులు నిర్వహించాడు. అయితే ఏ దేశంలో అనే వివరాలు పేర్కొనలేదు. ఈ క్రమంలో జనాలు ఎలాంటి వస్తువులను ఎక్కువగా స్మగుల్ చేయడానికి ప్రయత్నించేవారు.. అందుకు ఏలాంటి మార్గాన్ని ఎంచుకునేవారో తెలిపారు. స్మగ్లింగ్‌కు గురయ్యే వాటిల్లో ఎక్కువగా తాబేళు పిల్లలు, తేళ్లు, ఆహార పదార్థలతో పాటు డ్రగ్స్‌ను కూడా ఉండేవని తెలిపారు. అయితే వీటన్నింటిలో డ్రగ్స్‌ని తరలించడం కోసం జనాలు రకరకాల ప్రయత్నాలు చేసేవారని గుర్తు చేసుకున్నారు. కార్పెట్‌ను డ్రగ్స్‌లో ముంచి తీసుకురావడం.. కంప్యూటర్లలో డ్రగ్స్‌ను నింపి పైన ఉత్త గ్లాస్‌ను అంటించడం.. ఆఖరికి సూట్‌కేస్‌లు, వీల్ చైర్లలో కూడా డ్రగ్స్‌ను తరలించడానికి ప్రయత్నించేవారు అని తెలిపారు. అయితే వీటన్నింటికి కన్నా ఆసక్తికర సంఘటన ఒకసారి చోటు చేసుకుందని తెలిపారు. ఒక వ్యక్తి వేరు శనక్కాయల లోపల డ్రగ్స్‌ను కుక్కి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించాడు. అతన్ని అరెస్ట్ చేసినప్పటికి కూడా అతని సృజనాత్మక ఆలోచనని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాను అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. డ్రగ్స్‌ని వేరు శనక్కాయల్లో తరలించే ఆలోచన వచ్చినందుకు సదరు వ్యక్తికి ఆస్కార్, నోబల్ కన్నా ఉత్తమ అవార్డు ఇవ్వాలి అని.. ఇలాంటి పనుల కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం బుర్రను వాడితే మంచిదని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
జక్రాన్‌పల్లిలోనే ఎయిర్‌పోర్టు ఏర్పాటు
జక్రాన్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జక్రాన్‌పల్లిలోనే ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని నిజామాబాద్ జేసీ రవీందర్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం శుక్రవారం జక్రాన్‌పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని జేసీ సందర్శించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడారు. ఎయిర్ పోర్టు ఏర్పాటు కోసం అవసరమైన భూమిని సిద్ధంగా ఉంచామన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘ధరణి’ ద్వారా పాస్బుక్లందించాలి వివిధ కారణాలతో నిలిచిన పట్టాదారు పాస్‌బుక్‌లు ధరణి వెబ్సైట్ ద్వారా తహసీల్దార్ డిజిటల్ సంతకంతో త్వరగా పూర్తి చేసి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించాలని జేసీ సూచించారు. జిల్లాలో ఐదు విడుతలుగా రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు అందించామన్నారు. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యల కారణంగా పాస్‌బుక్‌లు నిలిచిపోయాయన్నారు. వాటిని వెంటనే పరిశీలించి రైతులకు పాస్‌బుక్‌లు అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా కొత్త రేషన్‌కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు వారం రోజుల్లో జిల్లా కార్యాలయానికి పంపించాలన్నారు. కులం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులను కార్యాలయం చుట్టూ తిప్పుకోవద్దని సూచించారు. ముఖ్యంగా కల్యాణ లక్ష్మి దరఖాస్తులకు గెజిటెడ్ సంతకం కోసం దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురి చేయవద్దని చెప్పారు. గెజిటెడ్ సంతకం లేకుండానే విచారణ చేసి దరఖాస్తులను ఉన్నతాధికారులకు పంపించాలన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలలో దొర్లిన తప్పొప్పులను సరి చేయాలన్నారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ సతీష్‌రెడ్డి, ఆర్ఐ అరుణ ఉన్నారు. -
బెంగళూరు ఎయిర్పోర్ట్ నెంబర్ 1 ..!
బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఇపుడొక అరుదైన ఘనతను సాంతం చేసుకుంది. విమానాశ్రయాల్లో దిగే (అరైవల్స్) ప్రయాణీకులకు అందిస్తున్న నాణ్యమైన సేవలపై ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ తొలిసారిగా నిర్వహించిన గ్లోబల్ సర్వేలో ప్రథమస్థానాన్ని దక్కించుకుంది. ఏఎస్ఐఏఎస్క్యూ అరైవల్ త్రైమాసిక సర్వేలో (2018 ఏప్రిల్జూన్ నెలల్లో) భాగంగా అయిదు పాయింట్ల సూచిలో 4.67 పాయింట్లు సాధించి ఈ సేవల్లో అగ్రస్థానాన్ని సాధించింది. ఈ సేవల్లో అబూదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 4.53 పాయింట్లతో రెండోస్థానంలో, టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 4.44 పాయింట్లతో మూడోస్థానం పొందింది. మనదేశం నుంచి ఈ సర్వేలో పాల్గొన్న ఏకైక విమానాశ్రయం బెంగళూరే. ప్రపంచవ్యాప్తంగా 358 ఎయిర్‌పోర్టుల నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణీకులకు సంబంధించి ఇప్పటికే నిర్వహిస్తున్న సర్వేలో ఇతర దేశాల నుంచి విమానాల్లోంచి దిగుతున్న (అరైవల్) ప్రయాణీకుల సేవలకు సంబంధించి కూడా ఈ అధ్యయనంలో మొదటిసారిగా ప్రవేశపెట్టారు. ప్రధానంగా ఎయిర్‌పోర్టులలో దిగడం, ఇమ్మిగ్రేషన్ (అంతర్జాతీయ ప్రయాణీకులకు మాత్రమే), బ్యాగేజీ తీసుకోవడం, కస్టమ్‌్స, విమానాశ్రయ మౌలికసదుపాయాలపై ప్రయాణీకుల అభిప్రాయాలతో ఏఎస్‌క్యూ అరైవల్స్ సర్వే నిర్వహించారు. ప్రస్తుతం బెంగళూరు ఎయిర్పోర్ట్ దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీ అయిన విమానాశ్రయమే కాకుండా దేశంలోనే మూడో అతిపెద్దదిగా పేరుగాంచింది. ప్రాంతీయ కేటగిరిలో భారత్, సెంట్రల్ ఆసియాలోనే అత్యుత్తమ మైనదిగా ఈ ఎయిర్పోర్ట్ గత మార్చి నెలలోనే అవార్డు గెలుచుకుంది.యావత్ ఎయిర్పోర్ట్ యాజమాన్యం, సిబ్బంది నిబద్ధతతో కూడిన అసాథారణ సేవలకు ఇది గుర్తింపుగా భావిస్తున్నామని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ హరి మరార్ తెలిపారు. నాణ్యతాపరంగా మరింత మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని, వచ్చే 9 నెలల పాటు కూడా ఉత్తమమైన సేవలందించి ’బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
గాల్లో దూసుకెళ్తున్నాం..
సాక్షి, హైదరాబాద్: ‘స్వాతంత్ర్యం వచ్చిన 60 ఏళ్లలో దేశంలోని 75 ఎయిర్ పోర్టులు డెవలప్ చేశాం. ప్రతీ ప్రధాన పట్టణానికి ఎయిర్ కనెక్టివిటీ ఉంద’ ని సివిల్ ఏవియేషన్ సెక్రటరీ రాజీవ్ నారాయణ్ చౌబే అన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ప్రారంభమైన ఏవియేషన్ షో లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఏవియేషన్ ఇండస్ట్రీ ప్రతి ఏడాది 26 శాతం వృద్ధితో దూసుకెళ్తోందని తెలిపారు. సివిల్ ఏవియేషన్‌లో ఈ ఏడాది 17.5 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం మన దేశంలో 395 ఎయిర్ క్రాఫ్ట్‌లు ఉండేవి.. ప్రస్తుతం వాటి సంఖ్య 900కి చేరిందన్నారు. ఉడాన్ పథకంలో భాగంగా 51 ఎయిర్ పోర్టులను డెవలప్ చేస్తున్నామని అన్నారు.వీటిలో18 ఎయిర్ పోర్టులు ఇప్పటికే తమ ఆపరేషన్స్ ప్రారంభించాయని వెల్లడించారు. వచ్చే నాలుగేళ్లలోమరో వంద పట్టణాలకు ఎయిర్ కనెక్టివిటీని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇంధన ధరలు స్థిరంగా ఉంటే వచ్చే 20 ఏళ్లలో 15 శాతం వృద్ధితో ఏవియేషన్ ఇండస్ట్రీ పరుగులు పెడుతుందని ఆకాక్షించారు. కేంద్రం ఎయిర్ పోర్ట్ ఆఫ్ ఇండియా యాక్ట్‌లో మార్పులు తెచ్చే అవకాశం ఉందన్నారు. టికెట్ ధరలు తగ్గిస్తేనే సామాన్యుడు విమాన ప్రయాణం చేయగలడని స్పష్టం చేశారు. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల విమానయాన కంపెనీలు భారాన్ని మోస్తున్నాయని.. జీఎస్టీ లోకి విమానయాన సర్వీసులను తీసుకురావడం వల్ల ఏవియేషన్ ఇండస్ట్రీ వృద్ధి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా భారత ఏవియేషన్ రంగం ప్రపంచ వ్యాప్తంగా మూడవ స్థానంలో ఉండటం గమనార్హం. -
ఇక పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోవచ్చు
ఒకరిని విడిచి ఒకరు వెళ్లేటపుడు అందరికి బాధగా ఉంటుంది. ఆ సమయంలో ప్రేమతో అక్కున చేర్చుకొని ఒకరినొకరు ముద్దు పెట్టుకోవాలని అనుకుంటారు. కానీ, చుట్టు ఉన్నవారు చూస్తారన్న భయంతో ఇబ్బంది పడుతుంటారు. ఈ భయానికి చెక్ పెట్టేందుకు చాలా దేశాలు పబ్లిక్‌గా ముద్దు పెట్లుకునేందుకు అనుమతి ఇస్తున్నాయి. ముద్దులు పెట్టుకునేందుకు కొన్ని దేశాలు ఏకంగా ఎయిర్‌పోర్టులలో ప్రత్యేక కిస్సింగ్ జోన్లను ఏర్పాటు చేసి, దానికి కొంత సమయాన్ని కేటాయించారు. ఆ సమయాన్ని మూడు నిమిషాలకు నిర్ణయించారు. అంతకు మించి కిస్ చేసుకోవడానికి అనుమతి లేదు. సాధారణంగా ఉద్యోగ రిత్యా మనసుకు నచ్చిన వారో, బంధువులో విదేశాలకు వెళ్లే సమయంలో భావోద్వేగానికి గురవుతారు. దానిని వ్యక్త పరచడానికి ప్రయతిస్తుంటారు. దీనిని గుర్తించిన కొన్ని ఎయిర్ పోర్టులు కిస్సింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సింగపూర్, డెన్మార్క్, పారిస్, హాంకాంగ్, రోమ్, శాన్ఫ్రాన్సిస్కో మొదలైన దేశాల్లోని ఎయిర్ పోర్టులలో కిస్సింగ్ జోన్లు ఉన్నాయి. పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకోవడం చాలా దేశాల్లో అనుమతి లేదు. -
హైదరాబాద్‌లో మరో రెండు ఎయిర్‌పోర్టులు
హైదరాబాద్:నగరంలో మరో రెండు ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో సర్పంచ్ నుంచి ఎంపీ వరకూ అందర్నీ భాగస్వామ్యం చేయాలన్నారు.ఇప్పటికే నెలరోజుల పాటు అన్ని శాఖలపై సమీక్ష జరిపానని తెలిపారు. అయినా కూడా ఏం చేశారని కొందరు విమర్శిస్తున్నారన్నారు. మరో నెల రోజుల పాటు ఇలానే ఉంటానని కేసీఆర్ తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ లో వ్యవస్థ సక్రమంగా లేదన్నారు. ప్రస్తుతం నగరంలోని వ్యవస్థను సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లో 10 డంప్ యార్డ్లు ఏర్పాటుచేస్తామని, ఇందులో భాగంగానే జిల్లాలో జాయింట్ కలెక్టర్ల సంఖ్య పెంచుతామన్నారు. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను కూడా దశల వారీగా పెంచుతామన్నారు. త్వరలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకూ అందరికీ శిక్షణా తరగతులు ఇచ్చి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామన్నారు. వెయ్యికోట్లతో మైనర్ ఇరిగేషన్‌ను అభివృద్ధిపరుస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖ రాజకీయాలకు కేంద్రంగా మారుతోందని, దానిని సమూలంగా మారుస్తామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో విద్యుత్ కొరత ఉన్న కారణంగా 6వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరం తమపై ఉందన్నారు. -
త్వరలో ఎయిర్ పోర్ట్ ల్లో కొత్త కస్టమ్స్ నిబంధనలు!
న్యూఢిల్లీ: త్వరలో ఎయిర్పోర్ట్ ల్లో కొత్త కస్టమ్స్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దేశం విడిచి వెళ్లే భారతీయులు ఎయిర్ పోర్ట్ ల్లో కొత్తగా ప్రవేశపెట్టనున్నకస్టమ్స్ దరఖాస్తును పూరించాల్సి ఉంటుంది. వారు ఎంతకాలం విదేశాల్లో ఉండదలుచుకున్నారు, ఎప్పుడు తిరిగి స్వదేశానికి చేరుకుంటారు తదితర వివరాలను అందులో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ విధానం అమల్లోకి వస్తే విదేశాల నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఎటువంటి ఇమ్మిగ్రేషన్ దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాగా విదేశాల నుంచి తిరిగి వచ్చే సమయంలో మాత్రం దేశీయ ఎయిర్ పోర్ట్ ల్లో కస్టమ్స్ కు సంబంధించిన దరఖాస్తులో ప్రయాణికుల పూర్తి వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. దేశం లో కరెన్సీ బెడద, నిషేధిత వస్తువులను నిషేధించే క్రమంలో భాగంగానే కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది మరో రెండు నెలల్లో దేశంలోని ఎయిర్ పోర్ట్ ల్లో అమలు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. జనవరి 1 వ తేదీ నుంచి ఈ విధానాలపై కసరత్తు ఆరంభించామన్నారు. కాగా అమల్లోకి రావడానికి మరో రెండు నెలలు సమయం పడుతుందని హోం శాఖ వెల్లడించింది. మార్చి తొలి వారం నుంచి ఈ విధానాన్ని సమర్ధవంతంగా అన్ని ఎయిర్ పోర్ట్ ల్లో అమలు చేస్తామని పేర్కొంది. -
హమ్మయ్య.. గట్టెక్కాం!
గద్వాల, న్యూస్‌లైన్: జూరాల జలవిద్యుత్ కేంద్రంలో సాంకేతికలోపం కారణంగా కాలిపోయిన టర్బయిన్ల మరమ్మతులకు అవసరమైన కార్బన్ బుష్లను పంపేందు కు చైనా కంపెనీ అంగీకరించింది. ఎట్టకేలకు దిగొచ్చిన సీఎంఈసీ కంపెనీ 40 రోజుల తరువాత విమానం ద్వారా కా ర్బన్బుష్లను హైదరాబాద్‌లోని శం షాబాద్ ఎయిర్‌పోర్టుకు శనివారం పం పించినట్లు జెన్కో అధికారులు వెల్లడిం చారు. వీలైనంత త్వరగా కార్బన్బుష్లను టర్బయిన్లకు అమర్చి విద్యుదుత్పత్తికి సిద్ధం చేస్తే నష్టాలబాట నుంచి జెన్కో కొంతమేర గట్టెక్కినట్లే.. జూరా ల జలవిద్యుత్ కేంద్రంలో ఆగస్టు 27న సాంకేతికలోపంతో మూడు టర్బయిన్లలో కార్బన్బుష్లు కాలిపోయాయి. మరో యూనిట్లో కేవలం ఫ్యూజులు మాత్రమే కాలిపోగా, మనదేశంలో ల భ్యమయ్యే ఫ్యూజులను జెన్కో అధికారులు అమర్చి ఆ యూనిట్‌ను విద్యుదుత్పత్తికి సిద్ధం చేశారు. కార్బన్బుష్లు కాలిపోయిన మూడు యూనిట్ల టర్బయిన్లను చైనాకు చెందిన సీఎంఈసీ కం పెనీ పంపించాల్సి ఉంది. ఈ మేరకు జెన్కో ఉన్నతాధికారులు కార్బన్బుష్లను పంపాల్సిందిగా సెప్టెంబర్ మొద టి వారంలోనే కంపెనీని కోరారు. కార్బన్బుష్లను పంపేందుకు పలు రకాల కొర్రీలు పెట్టిన కంపెనీ ఎట్టకేలకు జెన్ కో అధికారుల ప్రయత్నాలకు స్పందిం చింది. వాస్తవానికి 15 రోజుల క్రితమే కార్బన్బుష్లను పంపుతున్నట్లు చెప్పి న సీఎంఈసీ కంపెనీ, పంపడంలోనూ ఆలస్యం చేసి మూడురోజుల క్రితం హైదరాబాద్‌కు విమానం ద్వారా పంపింది. శంషాబాద్‌లో ఉన్న కార్బన్బుష్ల బిల్లులు, బీమాకు సంబంధించిన క్లియరెన్స్ తీసుకుని మంగళవారం నాటికి జూరాల జెన్కోకు చేర్చేలా అధికారులు యత్నిస్తున్నారు. కార్బన్బుష్లు చేరినా కాలయాపన! కార్బన్బుష్లు జూరాల జెన్కోకు చేరి న వెంటనే మరమ్మతులను ప్రారంభిం చే అవకాశం లేదు. చైనా సీఎంఈసీ కం పెనీ పంపిన కార్బన్బుష్లను టర్బయి న్లలో అమర్చేందుకు హైదరాబాద్‌లో ఉన్న కంపెనీ ప్రతినిధులను పిలచాల్సి ఉంది. వారు వచ్చిన తరువాతనే మరమ్మతులు ప్రారంభమవుతాయి. ఇలా కనీసం 45రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇలా నవంబర్ చివరి వర కు మరమ్మతులు పూర్తికాకపోతే, మరమ్మతులు పూర్తయ్యే నాటికి నదిలో ఇన్ ఫ్లో తగ్గిపోతుంది. డిసెంబర్ మొదటి వారానికి ఇన్‌ఫ్లో తగ్గితే టర్బయిన్లు సిద్ధమైనప్పటికీ జెన్కోకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఒక్కో టర్బయిన్ నుంచి విద్యుదుత్పత్తి జరిగేందుకు ఆరువేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండాల్సి ఉంటుంది. ఆరు టర్బయిన్లు పనిచేయాలంటే 40వేల క్యూసెక్కులకు తగ్గకుండా జూరాల రిజర్వాయర్‌కు వరద ఉండాలి. కాలయాపన చేయకుండా వీలైనంత త్వరగా టర్బయిన్లను అమర్చితేనే మేలు..లేదంటే జెన్కోకు మరింత నష్టం తప్పదు.