గద్వాల, న్యూస్‌లైన్: జూరాల జలవిద్యుత్ కేంద్రంలో సాంకేతికలోపం కారణంగా కాలిపోయిన టర్బయిన్ల మరమ్మతులకు అవసరమైన కార్బన్ బుష్‌లను పంపేందు కు చైనా కంపెనీ అంగీకరించింది. ఎట్టకేలకు దిగొచ్చిన సీఎంఈసీ కంపెనీ 40 రోజుల తరువాత విమానం ద్వారా కా ర్బన్‌బుష్‌లను హైదరాబాద్‌లోని శం షాబాద్ ఎయిర్‌పోర్టుకు శనివారం పం పించినట్లు జెన్‌కో అధికారులు వెల్లడిం చారు. వీలైనంత త్వరగా కార్బన్‌బుష్‌లను టర్బయిన్లకు అమర్చి విద్యుదుత్పత్తికి సిద్ధం చేస్తే నష్టాలబాట నుంచి జెన్‌కో కొంతమేర గట్టెక్కినట్లే.. జూరా ల జలవిద్యుత్ కేంద్రంలో ఆగస్టు 27న సాంకేతికలోపంతో మూడు టర్బయిన్లలో కార్బన్‌బుష్‌లు కాలిపోయాయి.
మరో యూనిట్‌లో కేవలం ఫ్యూజులు మాత్రమే కాలిపోగా, మనదేశంలో ల భ్యమయ్యే ఫ్యూజులను జెన్‌కో అధికారులు అమర్చి ఆ యూనిట్‌ను విద్యుదుత్పత్తికి సిద్ధం చేశారు. కార్బన్‌బుష్‌లు కాలిపోయిన మూడు యూనిట్ల టర్బయిన్లను చైనాకు చెందిన సీఎంఈసీ కం పెనీ పంపించాల్సి ఉంది. ఈ మేరకు జెన్‌కో ఉన్నతాధికారులు కార్బన్‌బుష్‌లను పంపాల్సిందిగా సెప్టెంబర్ మొద టి వారంలోనే కంపెనీని కోరారు.
కార్బన్‌బుష్‌లను పంపేందుకు పలు రకాల కొర్రీలు పెట్టిన కంపెనీ ఎట్టకేలకు జెన్ కో అధికారుల ప్రయత్నాలకు స్పందిం చింది. వాస్తవానికి 15 రోజుల క్రితమే కార్బన్‌బుష్‌లను పంపుతున్నట్లు చెప్పి న సీఎంఈసీ కంపెనీ, పంపడంలోనూ ఆలస్యం చేసి మూడురోజుల క్రితం హైదరాబాద్‌కు విమానం ద్వారా పంపింది. శంషాబాద్‌లో ఉన్న కార్బన్‌బుష్‌ల బిల్లులు, బీమాకు సంబంధించిన క్లియరెన్స్ తీసుకుని మంగళవారం నాటికి జూరాల జెన్‌కోకు చేర్చేలా అధికారులు యత్నిస్తున్నారు.
కార్బన్‌బుష్‌లు చేరినా కాలయాపన!
కార్బన్‌బుష్‌లు జూరాల జెన్‌కోకు చేరి న వెంటనే మరమ్మతులను ప్రారంభిం చే అవకాశం లేదు. చైనా సీఎంఈసీ కం పెనీ పంపిన కార్బన్‌బుష్‌లను టర్బయి న్లలో అమర్చేందుకు హైదరాబాద్‌లో ఉన్న కంపెనీ ప్రతినిధులను పిలచాల్సి ఉంది. వారు వచ్చిన తరువాతనే మరమ్మతులు ప్రారంభమవుతాయి. ఇలా కనీసం 45రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇలా నవంబర్ చివరి వర కు మరమ్మతులు పూర్తికాకపోతే, మరమ్మతులు పూర్తయ్యే నాటికి నదిలో ఇన్ ఫ్లో తగ్గిపోతుంది.
డిసెంబర్ మొదటి వారానికి ఇన్‌ఫ్లో తగ్గితే టర్బయిన్లు సిద్ధమైనప్పటికీ జెన్‌కోకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఒక్కో టర్బయిన్ నుంచి విద్యుదుత్పత్తి జరిగేందుకు ఆరువేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండాల్సి ఉంటుంది. ఆరు టర్బయిన్లు పనిచేయాలంటే 40వేల క్యూసెక్కులకు తగ్గకుండా జూరాల రిజర్వాయర్‌కు వరద ఉండాలి. కాలయాపన చేయకుండా వీలైనంత త్వరగా టర్బయిన్లను అమర్చితేనే మేలు..లేదంటే జెన్‌కోకు మరింత నష్టం తప్పదు.
హమ్మయ్య.. గట్టెక్కాం!
Published Mon, Oct 7 2013 3:20 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement