komati reddy venkat reddy
-
కేటీఆర్‌తో మాకేం పోలిక.. కేసీఆర్ లేకపోతే ఆయనెక్కడ?: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యేవాడా? అని అన్నారు. ఇదే సమయంలో ఒకవేళ భవిష్యత్‌లో కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా.. మేము విలువ ఇవ్వమంటూ ఘాటు విమర్శలు చేశారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్లో భట్టి, మంత్రి కోమటిరెడ్డి మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ.. బ్రమ్మనవెల్లి ప్రాజెక్టు వల్ల వచ్చే ఐదేళ్లలో నల్గొండ జిల్లా స్వరూపం మారబోతుంది. నల్గొండ జిల్లాలో కూడా గోదావరి తరహాలో నీళ్లు పారబోతున్నాయి. భూమి ధరలు భారీగా పెరగబోతున్నాయి. నాకు, తలా ఒక ఎకరం ఇవ్వాలని కోమటిరెడ్డిని అడుగుతున్నా. రాష్ట్రంలో డైట్ చార్జీలు పెంచడం వల్ల మంచి జరిగింది . ఈ నెల 15, 16వ తేదీల్లో అన్ని హాస్టల్స్‌లో జిల్లా కలెక్టర్లు లంచ్ కార్యక్రమం ఉంటుంది. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల డైట్ చార్జీలు పెంచలేదు. రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టి విద్యార్థులకు అందిస్తే చరిత్రలో నిల్చిపోతామన్నారు.అనంతరం, మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు ఏం అడిగినా ఒకే అంటున్నారు. సచివాలయానికి పని కోసం వస్తే పైసలు లేవు అంటున్నారు. వైఎస్సార్ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ ఉండేది.. మళ్ళీ ఇప్పుడు భట్టి దగ్గర కనిపిస్తోందన్నారు.అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ లేకుండా కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యేవాడా?. కేటీఆర్ మాకు పోలిక ఏంటి?. కేటీఆర్ భవిషత్లో ఒకవేళ ముఖ్యమంత్రి అయినా మేము ఆయనకు విలువ ఇవ్వం అంటూ కామెంట్స్ చేశారు. -
కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులకు గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరాబాద్ : వరంగల్ రూ.4వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సెక్రటేరియట్ మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులకు గ్రీన్ సిగ్నల్హైదరాబాద్- విజయవాడ రోడ్ల విస్తరణకు కేంద్రం అంగీకారంనారపల్లి వరకు ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తాంమూసీ ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారుమూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్,బీజేపీలు రాజకీయం చేస్తున్నాయిరేపు వరంగల్ రూ.4వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారువరంగల్కు ఎయిర్ పోర్ట్ 1999 నుంచి వింటున్నాం...కానీ ఏర్పాటు జరగలేదు. ఇప్పుడు ఆ కల సాకారం అయ్యిందిఎయిర్ పోర్ట్ పనులను 8 నెలల్లోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాంమొదటి ఏడాది లోపే విమానాల రాకపోకలు ప్రారంభమయ్యేలా పనులు పూర్తి చేస్తాంఏడాదిన్నర కాలంలోనే తిరుపతి, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ లాంటి పట్టణాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయబోతున్నాం.భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్హైదరబాద్తో పాటు మరో మూడు ఎయిర్‌పోర్ట్‌లను వచ్చే నాలుగేళ్లలో సాధించుకుంటాంహైదరాబాద్ - విజయవాడ 6 లైన్ రోడ్డు వచ్చే జనవరిలో డీపీఆర్ పనులు పూర్తి చేసి ఫిబ్రవరిలో పనులు మొదలు పెట్టే ప్రయత్నం చేస్తాంఉప్పల్ ఫ్లైఓవర్ పనులు ఆలస్యంపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తిఫ్లైఓవర్ నిర్మాణాలు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా 30 శాతం పనులు మాత్రమే అయ్యాయికేంద్రంతో మాట్లాడి వచ్చే ఏడాదిన్నర లోపు ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాంవర్షాలు పడితే ఫ్లైఓవర్ కింద చాల మంది మరణించారు.. గత ప్రభుత్వం పట్టించుకోలేదురీజినల్ రింగ్ రోడ్డు పనులపై 2018లో బీఆర్ఎస్ ప్రకటన చేసింది. కానీ పనులు పూర్తి కాలేదురీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణ పనులు వచ్చే నెలలో మొదలు పెడతాంశ్రీశైలం ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తాం -
కేటీఆర్ అలా మాట్లాడటం సిగ్గుచేటు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి,సంగారెడ్డి జిల్లా: ప్రజా ఆశీర్వాదంతో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జహీరాబాద్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పదేళ్లు పాలించి రాష్ట్రంలో వందేళ్ళ ఆర్థిక విధ్వంసం సృష్టించారు. అభివృద్ధిని విస్మరించి స్నో, పౌడర్ ఖర్చులకు 50 వేల కోట్లు అప్పులు చేశారు. అధికారం పోయిన రెండో రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని దుష్ప్రచారం మొదలు పెట్టారు. మాజీలమని మరిచి కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శిస్తున్నారు. లగచర్ల ప్రజాభిప్రాయ సేకరణ రణరంగం వెనక బీఆర్ఎస్ శ్రేణులు కుట్ర ఉంది. కలెక్టర్‌పై దాడి చేసిన సురేష్ తన మనిషేనని కేటీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటు. ప్రజా ఆశీర్వాదంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరు.పైసా పైసాకు కూడబెట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. జహీరాబాద్‌లో అధునాతన మోడల్ ప్రభుత్వ అతిథి గృహం నిర్మిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న అన్ని రహదారులకు మరమ్మత్తులు పూర్తి చేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. -
తెలంగాణలో కుల గణనపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కులగణనపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో తొలి సారి సమగ్ర కుల సర్వే జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నెల 6 నుంచి కుల గణన చేపట్టనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో సమగ్ర సర్వే సరిగ్గా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.సీఎం రేవంత్ రెడ్డి సూచన ప్రకారం త్వరలోనే అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు.. సర్వేలో పాల్గొనే అధికారులకు సహకరించాలని మంత్రి పొన్నం సూచించారు. పార్టీ పరంగా కూడా బాధ్యులను వేస్తామని, అధికారులకు ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు.కుల గణన చేయాలని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా బీఆర్ఎస్ నేతలు పెట్టుకున్నారని మండిపడ్డారు. ఏ కార్యక్రమం చేసినా విమర్శలు చేయడమే పనిగా ప్రతిపక్షం పెట్టుకుందని విమర్శించారు. ‘50 శాతం పైబడిన బీసీ వర్గాలకు మేలు జరుగబోతోంది. దీనిని అయిన మెచ్చుకుంటారు అనుకున్నాం. దీపావళికి దావత్ చేసుకుంటే తప్పేంది అంటున్నారు. మీరు అప్పులు చేస్తే మేము వడ్డీలు కడుతున్నాం. చెప్పని కార్యక్రమాలు చేస్తున్నాం. డీఎస్సీ నిర్వహించాం. వెనుకబడిన కులాల మీద బీఆర్ఎస్కు ప్రేమ లేదు. పార్టీ అధ్యక్షుడు, ఫ్లోర్ లీడర్, వర్కింగ్ ప్రెసిడెంట్లు మీరే ఉన్నారు. మా పీసీసీ చీఫ్ బలహీన వర్గాల నేత. కేిసీఆర్ ఫాం హౌస్ నుంచి ప్రెస్ నోట్ అయిన విడుదల చేయాలి. లేదంటే మీ పార్టీ కనుమరుగు అవుతుంది’ అని తెలిపారు. -
అధికారులు ఏం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు అటవీ అనుమతులివ్వడంలో నిర్లక్ష్యానికి తావు లేదని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆయా ప్రాజెక్ట్‌లకు అటవీ అనుమతుల సాధనలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకంగా మారిందని అన్నారు. శనివారం సచివాలయంలో రోడ్లు, భవనాలు, అటవీ శాఖల అధికారులతో ఇద్దరు మంత్రులు నిర్వహించిన సమీక్షలో పలు రహదారుల పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా 7 రోడ్డు ప్రాజెక్టుల పనులు, నాలుగేళ్లుగా ఒక ప్రాజెక్టు, మూడేళ్లుగా 20 ప్రాజెక్టులు, ఏడాది కాలంగా 31 ప్రాజెక్టులు అటవీ అనుమతులు లేక ఆగిపోయాయని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. గత ఐదేళ్లుగా ఇన్ని అనుమతులు పెండింగ్ లో ఉంటే రెండు శాఖల అధికారులు ఏం చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. కేంద్రం నుంచి అనేక రహదారులకు అనుమతులు సాధించినా ఒక్కడ అనుమతులు లేక కొత్త రోడ్ల మంజూరీ గురించి కేంద్రాన్ని అడగడం ఇబ్బందిగా మారిందన్నారు. అటవీ అనుమతుల కోసం ఉమ్మడి జిల్లాల వారీగా పర్యవేక్షణాధికారులను నియమించాలని ఈ సందర్భంగా అటవీశాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియల్లను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.డీఎఫ్ఓల స్థాయిలో 11 అటవీ అనుమతుల ఫైళ్ల ఆలస్యంపై అధికారులను ఆమె ప్రశ్నించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఫైళ్ల పరిష్కారంలో అనవసర జాప్యం లేకుండా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డికి హామీనిచ్చారు. కాగా, అటవీ అనుమతుల సాధన పర్యవేక్షణకు ఆర్అండ్బీ శాఖ పరిధిలో ఎస్ఈ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమిస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రీజనల్ ఆఫీసర్ తీరు సరికాదు..రాష్ట్ర రోడ్డు ప్రాజెక్టుల అటవీ అనుమతులను పర్యవేక్షించే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ రీజనల్ ఆఫీసర్ త్రినాథరావు చిన్న చిన్న అంశాలపై వివరణలతో కాలయాపన చేయడంపై ఇద్దరు మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి అండగా నిలబడాల్సిందిపోయి.. సాంకేతిక కారణాలతో ఫైళ్లను జాప్యం చేయడం తగదన్నారు. -
అలైన్‌మెంట్‌ను మార్చండి..
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులు ‘అవార్డు ఎంక్వైరీ’ని బహిష్కరించారు. మూడు రోజుల పాటు రెవెన్యూ గ్రామాల వారీగా నిర్వహించతలపెట్టిన అవార్డు ఎంక్వైరీని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వబోమన్నారు. బుధవారం మొదటి రోజు విచారణను బహిష్కరించిన నిర్వాసితులు, జాతీయ రహదారిపై ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దక్షిణ భాగంలో పాటిస్తున్న విధంగానే 40 కిలోమీటర్ల నిబంధన ఇక్కడ కూడా అమలు చేయాలన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం పలుమార్లు అలైన్‌మెంట్‌ను మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో గ్రామాలను నాశనం చేసే హక్కు పాలకులు, అధికారులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. వెంటనే అలైన్‌మెంట్‌ను మార్చాలని, లేదంటే బహిరంగ మార్కెట్లో ఉన్న ధర ప్రకారంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, నిర్వాసితులు గుజ్జుల సురేందర్‌రెడ్డి, మారుపాక రామలింగం, చింతల ప్రభాకర్‌రెడ్డి, సందగళ్ల మల్లేష్, సుర్కంటి రాజిరెడ్డి, బోరెం ప్రకాష్‌రెడ్డి, చింతల సుధాకర్‌రెడ్డి, దబ్బటి రాములు, ఏనుగు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చారిత్రక వైభవానికి ఇబ్బంది రావద్దు
సాక్షి, హైదరాబాద్: అసఫ్‌జాహీల నిర్మాణ కౌశలం కొనసా గాలని, పాత అసెంబ్లీ భవన చారిత్రక వైభవానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పునరుద్ధరించాలని రాష్ట్ర ఆర్ అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగాఖాన్ నిర్మాణ సంస్థ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. పాత అసెంబ్లీ భవన పునరుద్ధరణ పనులపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి మంగళవారం అసెంబ్లీ స్పీకర్ చాంబర్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, ఆర్అండ్బీ అధికారులు, ఆగాఖాన్ ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రాబోయే మూడు నెలల్లో ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, చారిత్రక వైభవానికి ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఆగాఖాన్ ట్రస్ట్ కు రూ.2 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్న విషయం తెలియడంతో వెంటనే స్పందించిన మంత్రి.. సమావేశం నుంచే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కతో మాట్లాడి నిధులు విడుదల చేయించారు.బిల్లుల కోసం ప్రజోపయోగ పనులను ఆపవద్దని అధికారులకు సూచించారు. ఏవైనా బిల్లులు పెండింగ్‌లో ఉన్నా, ఇతర సమస్యలేమి ఉన్నా తనకు లేదా మంత్రి శ్రీధర్‌బాబుకు చెప్పాలని కోరారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే కౌన్సిల్‌హాల్‌ను అసెంబ్లీ భవనంలోకి మార్చవచ్చన్నారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పాత అసెంబ్లీ భవన పునరుద్ధరణ పనుల పర్యవేక్షణ కోసం ఎస్ఈ స్థాయి అధికారిని నియమించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు.అదో పెద్ద జోక్: మంత్రి కోమటిరెడ్డిఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విద్యుత్ చార్జీల అంశంపై కేటీఆర్ ఈఆర్సీ దగ్గరకు వెళ్లడం పెద్ద జోక్ అని అన్నారు. ఆయనో జోకర్ అని, పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు రాకుండా ప్రజలు ఓడించినా వారికి బుద్ధి రాలేదన్నారు. 200 యూనిట్ల వరకు పేదలకు తమ ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందజేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
మీ పాలనలో మూసీని ఎందుకు శుద్ధి చేయలేదు?
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదిన్నరేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. మూసీని ఎందుకు శుద్ధి చేయలేదో ప్రజలకు తెలియజేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన సచివాలయంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో కలసి మీడియాతో మాట్లాడారు. మూడు జిల్లాల ప్రజల కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూసీ పునరుజ్జీవానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. మూసీ అభివృద్ధికి రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చెబుతున్నారని, మరి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని నిలదీశారు. కేటీఆర్, హరీశ్‌రావు.. ఇద్దరి నోటికి అదుపు లేకుండా ఉందని, అధికారం పోయినా అహంకారం మాత్రం తగ్గలేదని అన్నారు.ఎన్నికల్లో చిత్తుగా ఓడినప్పటికీ ఇంకా అధికారంలో ఉన్నట్లు ఊహించు కుంటున్నారని ఎద్దేవా చేశారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల ప్రజలు దాదాపు కోటి మందిపైన కాలుష్య ప్రభావం పడుతోందని అన్నారు. మూసీ నది, ఎస్టీపీలు ఏర్పాటు చేస్తే బాగుపడేది కాదన్నారు. ఇందులో విషపూరిత లవణాలను కూడా తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.మూసీ ప్రాజెక్టు పేరిట రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ పిచ్చి కూతలు కూస్తే జనాలు తంతారని, చాదర్‌ఘాట్, మలక్‌పేట్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఏముందో తనకు అర్థం కాలేవడం లేదన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని, మూసీ ప్రాజెక్టుకు అడ్డు పడితే జిల్లా ప్రజలు ఉద్యమిస్తారని హెచ్చరించారు. కేసీఆర్ మోసాలకు ఇప్పటికే నల్లగొండ నరకయాతన పడుతోందని, ఇప్పుడు ఆయన కొడుకు కూడా తయారయ్యారని ఆగ్రహించారు. కాగా, కేటీఆర్, హరీశ్‌రావు అమెరికాకు వెళ్లి ప్రభాకర్ రావును ఇండియాకు రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. -
పామాయిల్ సాగు చేయండి.. దర్జాగా బతకండి
నల్లగొండ: రైతులు పామాయిల్ సాగు చేస్తే.. మీసం మీద చేయి వేసుకుని దర్జాగా బతకొచ్చని వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. బుధవా రం నల్లగొండలోని ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కె ట్లో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. పామాయిల్ పంట తక్కువ నీటితో సాగవుతుందని చెప్పారు. తాను వంద ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నానని.. మీరు మంత్రి కోమటిరెడ్డిని వెంటబెట్టుకుని వచ్చి చూడవచ్చని రైతులకు సూచించారు. నల్లగొండ జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తే.. ఇక్కడే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని.. మిగిలిన రుణమాఫీని కూడా చేయా లని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం ఎటు పోయిందో.. ఎవరు తిన్నారో కూడా తెలియదని.. రూ.50 వేల కోట్ల అప్పులయితే ఉన్నాయని చెప్పా రు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినవారే ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని విమర్శించారు. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నా మని.. ఆ ధాన్యం కొనుగోలు చేసి రేషన్ కార్డు దారులకు, హాస్టళ్లకు బియ్యం సరఫరా చేస్తామ న్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మళ్లీ మంత్రిగా రావడంతోనే సొరంగ మార్గం పనులు మొద లయ్యాయని, ఆయన హయాంలోనే సొరంగ మార్గం పూర్తవుతుందని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేకపోయిందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని చెప్పారు. -
కేసీఆర్‌పై కారాలు మిర్యాలు నూరిన కోమటి రెడ్డి
-
నల్లగొండపై విషం చిమ్ముతున్న బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు నల్లగొండ జిల్లాపై విషం చిమ్ముతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మాది బుల్డోజర్ పాలన కాదు.. ప్రజాపాలన. మూసీ సుందరీకరణతోపాటు శుద్ధీకరణ చేస్తున్నాం. నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజలు నరకయాతన పడుతుంటే.. కేసీఆర్ కుటుంబసభ్యులు రాక్షసానందం పొందుతున్నారు. నల్లగొండ జిల్లా పోరాటాల గడ్డ. రజాకార్లు, సీమాంధ్రులతో పోరాడినట్టే మూసీ వ్యతిరేకులతో పోరాడాల్సి వస్తోంది. ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ వస్తే నల్లగొండ సమస్యలపై నిలదీస్తాం. మూసీ ప్రక్షాళన పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి, కాంగ్రెస్ శాసన సభ్యుడిని చైర్మన్ చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. నేను రెండు దశాబ్దాలుగా ఫ్లోరైడ్, మూసీ శుద్ధీకరణ మీద పోరాటం చేస్తున్నా. ప్రధానితోపాటు కేంద్రంలో ఎందరో మంత్రులను కలిసి మూసీ శుదీ్ధకరణకు నిధులు కేటాయించాలని వినతులు ఇచ్చా. వారు మూసీ బాధితులను తెలంగాణభవన్‌కు పిలిపించుకొని జనతా గ్యారేజీ అని సోషల్ మీడియాలో తిప్పుకుంటున్నారు. మీది జనతా గ్యారేజ్ కాదు.. జనాన్ని ముంచే గ్యారేజీ, జనాల్ని వంచించే గ్యారేజీ.. అందుకే మీ కారు గ్యారేజీకి పరిమితమైంది’అని ఆరోపించారు. ‘నల్లగొండ ఫ్లోరైడ్ కష్టం చెప్పుకుంటే తీరేది కాదు..ఇక్కడ భూగర్భ జలాలను కాకుండా భూఉపరితలంపై ప్రవహించే జలాలను మాత్రమే శుద్ధి చేసి వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర జలశక్తి సంస్థ చెప్పింది. కానీ గత ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. ఇది అత్యంత బాధాకరం. ఉమ్మడి ఏపీలోనే తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే.. ఈ పదేళ్లలోనూ నల్లగొండకు తీరని అన్యాయం జరిగింది. మూసీ పరీవాహక ప్రాంత పరిధిలో వివిధ కంపెనీలు రసాయన వ్యర్థాలను వదిలిపెడుతుండటంతో నది అంతా కాలుష్యంగా మారి నల్లగొండ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది’అని కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నిరాశ్రయులయ్యే వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది మూసీ శుద్ధిపేరు చెప్పి రూ.వెయ్యి కోట్లు మింగిన బీఆర్ఎస్ ఇప్పుడు నీతులు చెబుతోందని కోమటిరెడ్డి విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులలో ఒకరు మూసీనది ఒడ్డున నెల రోజుల పాటు నివాసం ఉంటే.. ఆ బాధ ఏంటో తెలుస్తుందన్నారు. మూసీ కాలకూట విషం మీద వాస్తవాలు కావాలనుకుంటే.. సీఎం కేసీఆర్‌కు ఓఎస్డీగా పనిచేసిన ప్రియాంక వర్గీస్‌ను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఆమె ఇటీవల మూసీపై పీహెచ్డీ చేసిందన్నారు. మూసీ అంటే.. ఒకప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు జీవనాడి, కానీ ఇప్పుడు మూసీ అంటే ఓ విషమని చెప్పారు. మూసీ ప్రక్షాళనకు కమిటీ వేస్తామని, అందులో బీఆర్ఎస్ నేతలకు కూడా చోటు కలి్పస్తామన్నారు. ఎస్టీపీలు కట్టామని ప్రచారం చేస్తున్నారు.. కానీ కేవలం ప్రతిపాదనలు మాత్రమే తయారు చేసి కాలక్షేపం చేశారని చెప్పారు. అగ్గిపెట్టె హరీశ్‌రావు మళ్లీ రెచ్చగొట్టే పనులకు దిగుతున్నాడని ఆరోపించారు. -
బీఆర్ఎస్కు కోమటిరెడ్డి సవాల్.. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్షాలకు మానవత్వం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మూసీ నది విషయంలో ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. తెలంగాణను పది సంవత్సరాలు పాలించి బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని ఘాగు విమర్శలు చేశారు.మంత్రి కోమటిరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మూసీలో పారేది విషపు నీరు. తెలంగాణ వచ్చాక మూసీ స్థితి మారుతుందని అనుకున్నాం. మూసీ కోసం కేటీఆర్ వెయ్యి కోట్లు అప్పు తెచ్చారు. మూసీ డెవలప్మెంట్ బోర్డు అన్నావ్ కదా ఏమైంది?. గుడిసె వేసుకుని నివాసం ఉంటున్న వాళ్లు మూసీ పక్కన ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. లక్షల కోట్లు సంపాదించుకున్నావు కాదా.. పేదలపై కొంచెం కూడా జాలి లేదా?. మూసీ ప్రక్షాళన చేస్తే కమీషన్ రాదని మొదలు పెట్టలేదా?. మూసీని ప్యూరిఫైర్ రివర్‌గా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది.ప్రతిపక్షాలకు కనీసం మానవత్వం లేదు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చి మూసీ ప్రక్షాళనపై మాట్లాడాలి. కేసీఆర్, కేటీఆర్ నాయకులు కాదు. కాళేశ్వరం ఒక తుగ్లక్ పని. మల్లన్న సాగర్ నిర్వాసితులను గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో చూశాం. మూసీ పరిస్థితి ఎలా ఉందో కేసీఆర్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన ప్రియాంక వర్గీస్‌ను అడగండి. మల్లన్న సాగర్ నిర్వాసితులను పోలీసులతో ఎందుకు కొట్టించారు?.నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్‌లో ఫ్లోరైడ్ ఎక్కువ. మూసీ ప్రక్షాళనలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. నేను నల్గొండ వ్యక్తిగా, మూసీ బాధితుడిగా మాట్లాడుతున్నాను. మమ్మల్ని చావామంటారా?. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ వాళ్లు గోదావరి జలాలతో సంతోషంగా ఉండాలి. మేము మాత్రం నల్గొండ మూసీ మురికితో చావాలా?. మూసీ నీళ్లను అమెరికా తీసుకెళ్లి టెస్ట్ చేయించండి. నల్గొండ వచ్చినా, వయా నల్గొండ వెళ్ళినా అక్కడి ప్రజలు ప్రతిపక్ష నేతలకు బుద్ధి చెప్తారు. జిల్లా పరిషత్ బడుల్లో చదివిన మాకే ఇంత తెలివి ఉంది. అమెరికాలో చదువుకున్న అని చెప్పుకుంటున్న నీకు తెలివి ఏమైంది?. నల్గొండలో మీ బంధువులు లేరా?. నల్గొండపై ఎందుకు కక్ష కట్టారు?.బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేస్తున్నా.. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా?. బస్సు పెడతాను, నేను మీతో పాటే వస్తాను. ప్రజలు ఏం చేస్తారో మీరే చూడండి. నేను 25ఏళ్ల కింద మూసీ నది కోసం దీక్ష చేశాను. జయశంకర్ అప్పుడు నాకు మద్దతు తెలిపారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు రెచ్చగొడుతున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బుల్డోజర్ను బొంద పెట్టండి: మూసీ నిర్వాసితులతో కేటీఆర్ -
సీఎంపై నిరాధార ఆరోపణలు
సాక్షి, యాదాద్రి/సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో వ్యవసాయ మా ర్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమృత్ స్కీం టెండర్లలో రూ.8,888 వేల కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించా రు. కేటీఆర్‌కు దమ్ముంటే, ఆరోపణలు రుజువు చేస్తే తాము దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారతుండడంతో అసహనానికి లోనై సీఎం రేవంత్‌రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే.. ‘ఖబడ్దార్ కేటీఆర్’అని కోమటిరెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు పార్టీ వదిలిపెట్టి పోతుండడంతో దిక్కుతోచని స్థితిలో కేటీఆర్ మాట్లాడుతున్నాడన్నారు. కేటీఆర్ పదేళ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేసి రూ.7 లక్షల కోట్లు అప్పులు చేశాడని అందులో రూ.2 లక్షల కోట్లు ఆయనకు టుంబమే దోచుకుందని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ చచ్చిపోతోందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. దోపిడీ దొంగలకు అలాగే కనిపిస్తుంది హైదరాబాద్‌లో ఆదివారం సీఎల్పీ సమావేశం అనంతరం కూడా ఈ అంశంపై కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు లాంటి దోపిడీ దొంగలకు తమ ప్రభుత్వం కూడా అవినీతి చేసినట్లుగా కనిపిస్తుందేమోనని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులలో కేటీఆర్ వేలకోట్ల రూపాయలు దోచుకున్నాడని ఆరోపించారు. సింగరేణి సంస్థలో కవిత ఏం చేసిందో త్వరలో బయటకు వస్తుందని అన్నారు. వారి దోపిడీ ప్రజలకు అర్థమైంది కనుకనే గత ఎన్నికల్లో ఓడించారని చెప్పారు. -
ఎన్ కన్వెన్షన్‌పై హైడ్రా కొరడా.. మంత్రి కోమటిరెడ్డి కీలక పాత్ర !
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా బృందం ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. ఈక్రమంలోనే ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూడా శనివారం హైడ్రా బృందం కూల్చివేసింది.కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా నేలమట్టం చేసింది. ఈనెల 21వ తేదీన ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై కోమటిరెడ్డి.. హైడ్రాకు లేఖ రాశారు. ఈ సందర్భంగా గూగుల్ మ్యాప్, ఎఫ్టీఎల్ ఆధారంగా ఎన్ కన్వెన్షన్ కట్టడం ఆక్రమిత భూమితో కట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా బృందం విచారణ చేపట్టింది. మంత్రి ఫిర్యాదు మేరకు అన్ని శాఖల అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకొని ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చి వేసింది. మరోవైపు.. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజాము నుంచే మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు.ఇక, ఎన్ కన్వేషన్ కూల్చివేతపై పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించిన చర్యలు తప్పవు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. వ్యవస్థలు తమ పని తాము చేస్తాయి. గత ప్రభుత్వాల తప్పిదాలను భవిష్యత్ తరాలకు ఇవ్వకుండా సరి చేస్తున్నాం అని అన్నారు. 👉: ‘హైడ్రా’ ఉక్కుపాదం.. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత (ఫొటోలు) -
సోదరీమణులతో రాఖీ పండుగను జరుపుకున్న కోమటి రెడ్డి, రేవంత్ రెడ్డి
-
ఐదేళ్లలో 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పనిచేస్తుంది. ఏటా 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించబోతున్నాం. ఈ ఐదేళ్లలో 35 లక్షల ఎకరాల్లో ఆయకట్టును సృష్టించి సాగునీరు అందించబోతున్నాం’అని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు, వరద కాలువకు శుక్రవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది సాగునీటికి బడ్జెట్ రూ.22500 కోట్లు పెట్టామని, దాంట్లో రూ.10,828 కోట్లు ఆన్ గోయింగ్ వర్క్స్ కింద, కొత్త ప్రాజెక్టులకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కేటాయించామన్నారు.మిగతా రూ.11వేల కోట్లు ఎస్టాబ్లి‹Ùమెంట్, అప్పుల కోసమని చెప్పారు. తెలంగాణ చరిత్రలో ఏ ఒక్క ఆరŠిథ్ధక సంవత్సరంలో కూడా ఈ స్థాయిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కేటాయించలేదని, ఇప్పుడు కేటాయించిన డబ్బంతా ఈ ఏడాది ప్రాజెక్టులపైనే ఖర్చు పెట్టబోతున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఎప్పుడూ ఇవ్వనివిధంగా సాగర్ ఎడమ కాలువకు తాము ఈసారి ముందుగా నీళ్లు ఇచ్చామని చెప్పారు.గత ఏడాది నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడ్డారని, సాగర్‌తోపాటు ఏఎంఆర్పీ పరిధిలోనూ పంటలు వేసుకోలేకపోయామన్నారు. నల్లగొండ జిల్లాకు ఎంతో కీలకమైన ఎస్ఎల్బీసీ టన్నెల్‌పై 1981లో అంజయ్య సీఎంగా ఉన్నప్పుడే గ్రావిటీ ద్వారా నీటిని తీసుకొచ్చేలా ఆలోచించారని, అయినా అప్పుడు కాలేదన్నారు.వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక, ఆయన్ను ఒప్పించి ప్రాజెక్టు తీసుకొచ్చామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నా పూర్తి చేయలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేట్ల ప్రకారం టన్నెల్ పనులను పూర్తి చేయడానికి నిధులు విడుదల చేసిందని చెప్పారు. వచ్చే రెండు మూడేళ్లలో సొరంగం పూర్తి చేస్తామని, దీంతో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.సాగర్ ఎడమకాల్వకు నీటి విడుదల నాగార్జునసాగర్: సాగర్ ఎడమకాల్వకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి చేతులమీదుగా శుక్రవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు బాలునాయక్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నాగార్జునసాగర్‌కు వచ్చారు. ఎర్త్ డ్యాం అంతర్భాగంలో గల హెడ్‌రెగ్యులేటర్ ప్యానల్‌బోర్డు వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం స్విచ్ ఆన్‌చేసి ఎడమ కాల్వకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గంటగంటకు నీటిని పెంచుతూ 11వేల క్యూసెక్కులు విడుదల చేయనున్నట్టు తెలిపారు.అనంతరం మంత్రులు వరదకాల్వ వద్దకు వెళ్లి అక్కడ నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.రేపో మాపో సాగర్ గేట్లు ఎత్తివేతసాక్షి, హైదరాబాద్/దోమలపెంట: నాగార్జునసాగర్‌లోకి కృష్ణా వరద ఉధృతి మరింత పెరిగింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సాగర్‌లోకి 3,99,159 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో నీటినిల్వ 550.6 అడుగుల వద్ద 211.1 టీఎంసీలకు చేరుకుంది. రోజుకు సగటున 30 టీఎంసీల రాకతో మరో రెండు రోజుల్లో సాగర్ ప్రాజెక్టు నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం నుంచి రోజుకు ఇన్‌ఫ్లో 40 టీఎంసీలకు పెరుగుతుందని..దీంతో రేపోమాపో గేట్లు ఎత్తివేసే వరదను కిందకు విడుదల చేసే అవకాశముందని అధికారవర్గాలు పేర్కొంటున్నారు.ఇటు సుంకేశుల నుంచి తుంగభద్ర, అటు జూరాల నుంచి కృష్ణా వరద ఉధృతి శ్రీశైలంలోకి మరింత పెరిగింది. ప్రాజెక్టులోకి 4,89,361 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. స్పిల్‌వే పది గేట్లు 20 అడుగు మేర ఎత్తి 4,66,650 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం నుంచి 23,904, ఎడమ కేంద్రం నుంచి 37,857 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వెరసి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5,28,411 క్యూసెక్కులు సాగర్ వైపు దూసుకెళ్తున్నాయి.మహారాష్ట్ర, కర్ణాటకలో పశి్చమ కనుమల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్ర నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1.90 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.82 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం స్థిరంగా వస్తున్న నేపథ్యంలో శ్రీశైలంలోకి వరద ఉధృతి శనివారం కూడా ఇదే రీతిలో కొనసాగుతుందని అధికారులు చెప్పారు. -
మీది హాఫ్ నాలెడ్జ్.. మీకు నాలెడ్జే లేదు
సాక్షి, హైదరాబాద్: శాసన సభలో శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య పరస్పరం మా టల తూటాలు పేలాయి. సభలో బడ్జెట్‌పై హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి భాషపై వ్యాఖ్యలు చేయడంతో మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసు కున్నారు. ‘టీఆర్ఎస్ ఆవిర్భావంలో దళితుడు సీఎం అవుతారన్నారు. బడ్జెట్‌పై చీల్చిచెండాడతానని కేసీఆర్ అన్నారు. దీంతో మేమంతా ఉదయం తొమ్మిదిన్నరకే వచ్చి కూర్చున్నాం. కానీ కేసీఆర్‌కు ముఖం చెల్లక హరీశ్‌రావుతో మాట్లాడిస్తున్నారు’ అని కోమటిరెడ్డి కామెంట్ చేశారు. దీంతో హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ‘టీపీసీసీ పదవిని రేవంత్ రూ. 50 కోట్లకు కొనుక్కున్నాడని అనలేదా? కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి హాఫ్ నాలెడ్జ్’ అంటూ విమర్శించారు.దీనిపై అధికారపక్ష సభ్యులు నిరసన తెలిపినా హరీశ్ ఆవేశంతో ‘అవును ఆయన హాఫ్ నాలెడ్జే’ అని పునరుద్ఘాటించారు. దీంతో స్పీకర్ వెంటనే జోక్యం చేసుకొని ఆ మాటలను విరమించుకోవాలని హరీశ్ రావును కోరారు. అనంతరం కోమటిరెడ్డి జోక్యం చేసుకొని ‘హరీశ్‌రావు హాఫ్ నాలెడ్జే కాదు... ఆయనకు ఆకారం పెరిగిందే కానీ నాలెడ్జ్ ఎక్కడుంది? ఆయన ఒక డమ్మీ మంత్రి, డమ్మీ అల్లుడు’ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.హరీశ్‌కు హాఫ్ నాలెడ్జ్.. కేసీఆర్‌కు ‘ఫుల్’ నాలెడ్జ్: సీఎంఈ తరుణంలో సీఎం రేవంత్ స్పందించారు. ‘వారికేమో (హరీశ్‌ను ఉద్దేశించి) హాఫ్ నాలెడ్జ్... పెద్దాయనకు (కేసీఆర్) ఫుల్ నాలెడ్జ్ (సైగలతో మోచేతిని చూపించారు). ఇలా ఉన్నప్పుడు మేమేం చేయగలం?’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై హరీశ్ కౌంటర్ ఇస్తూ మేము సరిగ్గా పనిచేయలేదనే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీరు కూడా తప్పులు చేసి ఇక్కడ కూర్చుంటారా? మేము అక్కడికి వస్తాం. మంత్రులు మీటింగ్‌లు పెడితే కరెంట్ ఉంటుందో లేదోనన్న భయంతో అధికారులు జనరేటర్లు పెడుతున్నారు’ అని విమర్శించారు.మరోవైపు హరీశ్‌రావు మాట్లాడుతున్నంత సేపు బీఆర్ఎస్ సభ్యులు ఆరు గ్యారంటీలపై ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు స్పీకర్‌ను కోరగా ప్లకార్డు లను మార్షల్స్‌కు ఇస్తేనే సభ నడుపుతానని స్పష్టం చేశారు. కాగా, ఉప ముఖ్యమంత్రి భట్టి స్పందిస్తూ తమ బడ్జెట్ చూసి హరీశ్‌రావుకు కంటగింపుగా ఉందని వ్యాఖ్యానించారు. హరీశ్‌రావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభినందనశాసనసభలో వార్షిక బడ్జెట్‌పై జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరఫున ప్రసంగించిన సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావును పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు. ప్రసంగం పూర్తి చేసిన అనంతరం లాబీలోని ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్‌కు వచ్చిన హరీశ్‌పై ప్రశంసలు కురిపించారు. పార్టీకి కేటాయించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు బడ్జెట్ ప్రతిపాదనల్లో లోపాలను సమర్థవంతంగా ఎత్తిచూపారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కితాబునిచ్చారు. ట్రెజరీ బెంచ్ (ప్రభుత్వ పక్షం) నుంచి సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మరో ముగ్గురు మంత్రులు జోక్యం చేసుకుని చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినా తిప్పికొట్టారని ప్రశంసించారు.ప్రభుత్వ పక్షాన్ని ఇరుకున పెట్టేలా ప్రసంగించారని, సీఎం, అధికార పక్షం నుంచి ఎదురైన విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టారని పార్టీ ఎమ్మెల్యేలు అభినందించారు. హరీశ్‌రావు ప్రసంగానికి సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందనే వాదనను బడ్జెట్ ప్రసంగంలో తిప్పికొట్టగలిగానని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
సచివాలయానికి ఉద్యోగులు ఆలస్యంగా రావడమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి గుండెకాయలాంటి సచివాలయానికి కొంత మంది ఉద్యోగులు ఆలస్యంగా రావడం భావ్యం కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసహనం వ్యక్తంచేశారు. మీరే ఇలా వస్తే జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులకు మీరిచ్చే సందేశం ఏంటని ప్రశ్నించారు. బుధవారం సచివాలయంలో ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన పేషీని, సెక్షన్లను మంత్రి తనిఖీ చేశారు. ఆ సమయంలో 50% ఉద్యోగులు కూడా ఆఫీసులకు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. గత పదేళ్లుగా మంత్రులను, ముఖ్యమంత్రులను కలిసే అవకాశం లేక ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. ప్రజలు మాకు ఎన్ని వినతులిచి్చనా, పరిష్కరించాల్సింది ఉద్యోగులేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, సచివాలయానికి ఉద్యోగులు ఇంత ఆలస్యంగా రావడం భావ్యం కాదని హెచ్చరించారు. సమయానికి ఆఫీసుకు వచ్చిన ఉద్యోగు ల కుర్చీల వద్దకు వెళ్లి అభినందించిన మంత్రి.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఒక రిద్దరు ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరి స్థితి బాగాలేద ని చెప్పగా.. వారితో కోమటిరెడ్డి మాట్లాడారు. మంత్రి తమ సెక్షన్‌కు రావడం మూలంగా సమస్యలు చెప్పుకునే అవకాశం దొరి కిందని ఉద్యోగులు ఆనందం వ్యక్తంచేశారు. -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తప్పదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నూతనకల్ (సూర్యాపేట)/శాలిగౌరారం(నల్లగొండ): బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీన ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఎప్పుడైనా విలీనంకాక తప్పదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో పదవులు అనుభవించిన వారంతా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారన్నారు.చత్తీస్‌గఢ్ నుంచి విద్యు త్ కొనుగోలులో, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలో రూ.10వేల కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు తమ అవినీతి, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీలో బీజేపీ నాయకులతో అంటకాగుతూ చర్చలు జరుపుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ మెడకు ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్.. నేడు ఆ పార్టీ మెడకే చుట్టుకుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అంతకుముందు నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామంలో ప్రభుత్వ మోడల్ స్కూల్లో శనివారం విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, నోటుబుక్స్ పంపిణీ చేశారు. -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో మంత్రి కొమటిరెట్టి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. బీజేపీలో బీఆర్ఎస్ను కలిపేందుకు కేటీఆర్, సంతోష్ రావులు ఢిల్లీ వేదికగా చర్చలు జరుపుతున్నారని వ్యాఖ్యానించారు. యాదాద్రి, చత్తీస్‌గఢ్ కరెంట్ విషయంలో అవకతవకలు జరిగాయి. విద్యుత్ అంశంలో 15 వేల కోట్ల అవినీతి జరిగింది. నిజాయితీ గల వ్యక్తితో కమిషన్ వేస్తే కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. కమిషన్‌పై నమ్మకం లేదని కేసీఆర్ అనడం దుర్మార్గమని అన్నారు. మీరు ఎన్ని అవకతవకలు చేసినా వదిలేయాలా? అని ప్రశ్నించిన కోమటి రెడ్డి.. గొర్రెల పంపిణీలో జరిగిన ఏడు వందల కోట్లు అవినీతిపై ఈడీ విచారణ జరుగుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించి డబ్బులు గుంజారు. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావును అమెరికాలో హరీష్ రావు కలిశారు. ఇండియాకు రావద్దని ఆయనకు హరీష్ రావు చెప్పారని తెలిపారు. కేసీఆర్ పదేళ్లలో లక్షల కోట్లు సంపాదించారు. బీఆర్ఎస్ అనేది లేకుండా పోయింది. కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరుతో దోచుకున్న ఆస్తిని పంచాడు. కేసీఆర్ గురించి మాట్లాడితే నోరు పాడవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ధ్వజమెత్తారు. -
ఏపీ సీఎంగా రెండోసారీ వైఎస్ జగనే
డిచ్పల్లి (నిజామాబాద్ రూరల్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి పదవి చేపట్టడం ఖాయమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దపూర్ శివారులోని హోటల్ కృష్ణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలోని తన స్నేహితులు, బంధువుల నుంచి అందిన సమాచారం మేరకు జగన్ మళ్లీ సీఎం అవుతారని, ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెబుతున్నాయన్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ గల్లంతు.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటూ రాదని, జూన్ 4న ఫలితాల తర్వాత తెలంగాణలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు కానుందని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో నిజామాబాద్‌తో పాటు కాంగ్రెస్ 13 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీగా కవితను గెలిపిస్తే లిక్కర్ దందాతో ఢిల్లీలో తెలంగాణ పరువు తీసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఆగస్ట్ 15 నాటికి రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. రాష్ట్ర చిహ్నం, గీతంపై ఎలాంటి వివాదం లేదని, దీనిపై పనిలేని వాళ్లు రాద్ధాంతం చేస్తున్నారని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతమంది జైలుకు వెళ్తారనేది త్వరలోనే తెలుస్తుందన్నారు. -
విజయవాడ రోడ్డును వెంటనే విస్తరించాలి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై 17 ప్రాంతాల్లో ఉన్న బ్లాక్ స్పాట్స్ కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటూ ప్రాణనష్టం జరుగుతున్నందున ఆ రోడ్డును వీలైనంత తొందరలో విస్తరించాల్సిన అవసరం ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రె డ్డి పేర్కొన్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న లోపాలను ముందుగా మరమ్మతు చేయాలని అధి కారులను ఆదేశించారు. మరమ్మతులతో వాహనా లకు ఇబ్బంది ఎదురుకాకుండా, ముందుగా ప్రత్యా మ్నాయ మార్గం ఏర్పాటు చేసి పనులు చేపట్టాలని సూచించారు. అధికారిక అనుమతుల పేరిట ఇంకా జాప్యం చేస్తే ప్రమాదాలు కొనసాగుతూనే ఉంటాయని, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని పేర్కొ న్నారు. శుక్రవారం ఆయన ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ రహæదారుల విభాగం అధికారులతో సమీక్షించారు. విజయవాడ రహæదారిపై ప్రమాదాలు జరుగు తున్న చోట్ల వాహనచోదకులు గమనించేలా హెచ్చరిక, సూచిక బోర్డుల ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అతివేగం నియంత్రణ చర్యలు చేపట్టడం, అవసరమైన ప్రాంతాల్లో ఆరు వరుసలకు రోడ్డును విస్తరించటం, కావాల్సిన చోట్ల వెహికిల్ అండర్ పాస్‌లు, రెండు వైపులా సర్వీసు రోడ్ల నిర్మాణం వంటి చేపట్టాలని తెలిపారు. 2021లో మంజూరైన రీజినల్ రింగ్ రోడ్డు పనులు ఈ పాటికే ప్రారంభమై ఉంటే అది ఆ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసి ఉండేదని మంత్రి అభిప్రాయపడ్డారు. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి 70 శాతం భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, అటవీ భూములు, కోర్టు కేసుల వల్ల మిగతా దానిలో జాప్యం జరుగుతోందని ఎన్హెచ్ఏఐ రీజినల్ అధికారి రజాక్ మంత్రి దృష్టికి తెచ్చారు. సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి విజేంద్రబోయీ, ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పదేళ్లు పీఎంగా చేసినాఓట్లకు రాముడే దిక్కా?
సాక్షి, హైదరాబాద్: పదేళ్లు ప్రధానిగా పనిచేసిన నరేంద్ర మోదీకి ఈసారి ఎన్నికల్లో చెప్పుకునేందుకు ఏమీ లేక రాముడే దిక్కయ్యాడని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ఈసారి మోదీ గెలిస్తే దేశంలో ఇకఎన్నికలు ఉండవని, చైనా, రష్యా తరహాలో నియంతృత్వ రాజరిక పాలన వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో మరో 20 ఏళ్ల వరకు కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి లేదని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏపీలో ఒక్కసీటు కూడా రాదన్నారు. అందరి ఆమోదంతోనే సీఎంగా రేవంత్‌రెడ్డి కొనసాగుతున్నారని, ఈ ఐదేళ్లే గాక మరో ఐదేళ్లు కూడా రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే...ప్రధానిగా ఉండి ఒక మతాన్ని టార్గెట్ చేస్తారా? దేశ జనాభాలో 25 కోట్ల మంది ఉన్న ముస్లిం జనాభాను ప్రధాని మోదీ టార్గెట్ చేశారు. ఈ ఎన్నికల్లో మోదీకి చెప్పుకునేందుకు ఏమీలేదు. అందుకే మతాన్ని, రామున్ని ముందుకు తెచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని భయపెడుతున్నారు. బీజేపీ ఓట్ల కోసం మతాల వారీగా జనాభాను విభజించి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. అక్కడ కాంగ్రెస్ నాశమవుతుందని తెలిసినాతెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నాశనమ వుతుందని తెలిసి కూడా ప్రజలకిచ్చిన మాట ప్రకా రం సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. అను కున్నట్టే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది. 20 ఏళ్ల వరకు అక్కడ కాంగ్రెస్ కోలుకోదు. 2014, 2019లో ఒక్కసీటు రాలేదు. ఈ సారి కూడా ఒక్కసీటూ అక్కడ కాంగ్రెస్ గెలవదు.నేను సీఎం పదవి అడగలేదునేను సీఎం పదవి అడగలేదు. నన్ను ఎమ్మెల్యేల క్యాంపులో ఉండమంటే మూడు రోజులు రూం నుంచి కూడా బయటకు రాలేదు. సీఎం రేవంత్.. ఉత్తమ్‌కుమార్ రెడ్డి వంటి సీనియర్లతో పాటు అందరి అభిప్రాయాలను గౌరవిస్తున్నారు. అందరం కలిసి అధ్వానంగా మారిన రాష్ట్రాన్ని బాగు చేసే పనిలో ఉన్నాం. ఈ ఎన్నికల్లో 15 సీట్లు మా టార్గెట్. 14 సీట్లు అయినా గెలుచుకుంటాం.జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ ఉండదుజూన్ 4 తరువాత తెలంగాణ భవన్ మూతపడు తుంది. జూన్ 5న 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజ కవర్గ పునర్విభజనలో రాష్ట్రంలో 154 సీట్లు ఉండబోతున్నాయి. అందులో 125 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. ఆగస్టు 15 నాటికి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. -
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
నల్లగొండ: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలవుతుందని.. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకోవడంతో కూతురు జైలుకెళ్లిందని, వారు కూడా జైలుకు వెళ్లకతప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్ వేసిన సందర్భంగా శుక్రవారం నల్లగొండలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. తీన్మార్ మల్లన్న కేసీఆర్ దోపిడీపై పోరాటం చేశాడని, ఆయన్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జీఓ 46తో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత దానిపై అసెంబ్లీ సమావేశాల్లో కమిటీ వేసి రద్దు చేస్తామని చెప్పారు. ప్రభుత్వానికి ఆస్తులు అప్పగించిన తీన్మార్ మల్లన్ననల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) తన కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. తన కుటుంబం పేర ఇప్పటివరకు రూ.కోటీ 50 లక్షల ఆస్తులు ఉన్నాయని చెప్పారు.తన భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నదని, ఆమె ఒప్పుకున్నాకే ఆమె పేరు మీద ఉన్న కోటిన్నర ఆస్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరున రాసి ఇస్తున్నట్టు ప్రకటించారు. రాజకీయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్న ఉద్దేశంతో ఆస్తులను అప్పగించినట్టు చెప్పారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే.. రాజకీయాల్లో సంచలన మార్పులు తీసుకొస్తానని ఆయన చెప్పారు. అంతకుముందు ఆయన నల్లగొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. తీన్మార్ మల్లన్నపై 56 కేసులు రాష్ట్రంలోని వివిధ పోలీస్స్టేషన్లలో తనపై 56 కేసులు ఉన్నాయని తన ఎన్నికల అఫిడవిట్లో తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. తన పేరుతో రూ.16.34 లక్షల విలువైన బంగారం, ఆస్తులు, నగదు ఉండగా, తన భార్య పేరుతో రూ.17.66 లక్షల విలువైన బంగారం, ఆస్తులు, నగదు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. మార్కెట్ విలువ ప్రకారం రూ.3 లక్షల విలువైన వ్యవసాయ భూమి, రూ.50 లక్షల విలువలైన వ్యవసాయేతర భూమి, రూ.50 లక్షల విలువైన నివాస గృహం ఉన్నట్లు తెలిపారు. రూ.31.29 లక్షల అప్పులు ఉన్నట్టు వివరించారు. -
బీఆర్ఎస్, బీజేపీకి ఓటేస్తే మూసీలో వేసినట్లే
నల్లగొండ: బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లేస్తే మూసీ నదిలో వేసినట్లేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే అని, ఆ పార్టీలను నమ్మవద్దని ప్రజ లను కోరారు. ఆగస్టు 15 నాటికి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని.. అమలు చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ అన్నట్లుగా మీ ముందుకు రాబోమని చెప్పారు. హరీశ్‌రావు దొంగ రాజీనామా లతో మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదన్నారు. ఈసారి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. బీజేపీ నల్లగొండ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కదన్నారు. సర్పంచ్‌గా కూడా గెలువలేని వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పెట్టిందని ఎద్దేవా చేశారు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేసిన తరహాలో నల్లగొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, మండలంలో వలంటీర్లను నియమిస్తా మని కోమటిరెడ్డి వెల్లడించారు. ఆయా గ్రామాల్లోని వలంటీర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి ప్రభుత్వ పథ కాలు అర్హులకు అందేలా చూస్తారని, ఎన్నికల తర్వాత దీనిని అమలు చేస్తామన్నారు. గుమ్మల మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి జానారెడ్డి, కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హరీశ్.. పేజీన్నర లేఖ రాసి రాజీనామానా?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావుపై రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజకీయాల్లో హరీశ్ రావు ఓ జోకర్లా మారారని, ఆయన అన్నీ హౌలా(పులిష్) పనులు చేస్తున్నారని అందుకే ఆయన్ను హౌవ్లేష్‌రావు అంటారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధపడితే.. ఆయన స్పీకర్ ఫార్మాట్లో లేఖ ఇవ్వాలే తప్ప.. సుదీర్ఘంగా పేజీన్నర లేఖ రాసి రాజీనామా చేస్తు న్నట్లు ప్రకటించడం ఏమిటని మంత్రి కోమటిరెడ్డి నిలదీశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియా తో మాట్లాడారు. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటిస్తే..ఆ ఒక్క హామీ కాదు.. మొత్తం 13 హామీలు నెరవేర్చాలని.. లేదంటే రాజీనామాకు సిద్ధం కావాలని హరీశ్ సవాల్ చేస్తూ.. ఓ డూప్లికేట్ రాజీనామా పట్టుకుని అమరవీరుల స్తూపం వద్ద రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే మెదక్‌లో బీఆర్ఎస్ అభ్యర్థికి డిపాజిట్ తెచ్చుకోవాలని హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. హరీశ్‌కు మతిభ్రమించింది అధికారం పోయాక హరీశ్‌కు మతిభ్రమించిందని మంత్రి విమర్శించారు. ఆర్థిక మంత్రిగా ఉండి ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడం చేతకాని ఈ దద్దమ్మ, ఇవ్వాళ తాము ఒకటో తారీఖు జీతాలు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నాడని నిందించారు. ఆయన, ఆయన మామ చేసిన రూ.లక్షల కోట్ల అప్పులకు ప్రతినెలా రూ.26 వేల కోట్ల వడ్డీలు కడుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. జూన్ 3 తరువాత బీఆర్ఎస్ మూతే... పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మూతపడుతుందని మంత్రి జోస్యం చెప్పారు. మీ మామ చేసిన పలు హామీలు అమలు చేయనప్పుడు ఆ రాజీనామా లేఖ తీసుకుని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. రుణమాఫీ కాంగ్రెస్ బ్రాండ్ అనీ.. అప్పటికే రుణం చెల్లించిన వారికి కూడా అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు ప్రోత్సాహం ఇచ్చిన విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. నష్టమని తెలిసినా.. తెలంగాణ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కి నష్టం జరుగుతుందని తెలిసినా.. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నేరవేర్చిన దేవత సోనియాగాంధీ అని మంత్రి కోమటిరెడ్డి కొనియాడారు. తెలంగాణ వస్తే దళితున్ని సీఎం చేస్తానని ఆ తరువాత తానే సీఎం అయిన కేసీఆర్ మోసగాడని నిందించారు. -
బీఆర్ఎస్కు 2 సీట్లు వస్తే రాజీనామా చేస్తా
నల్లగొండ: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్కు రెండు సీట్లు వస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ చేశారు. ఎన్నికల తరువాత ఆ పార్టీ ఉండదన్నారు. బుధవారం నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా నల్లగొండ వీటీకాలనీలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలతో పూజలు నిర్వహించారు.అనంతరం భారీ ర్యాలీగా గడియారం సెంటర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో కోమటిరెడ్డి మాట్లాడారు. సాగర్, శ్రీశైలంలను ఎండబెట్టిన ద్రోహి కేసీఆర్ అని, అలాంటిది ఏ మొహం పెట్టుకొని మిర్యాలగూడకు వస్తున్నారన్నారు. తాను తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేస్తే కేసీఆర్ మాత్రం దొంగదీక్ష చేశాడంటూ దుయ్యబట్టారు. రేవంత్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా: ఉత్తమ్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హతలున్నాయంటూ ఇటీవల భువనగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. బీజేపీ పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని చెప్పారు.రైతులను మోసం చేసిందంటూ ధ్వజమెత్తారు. అందుకే ఆ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. మంత్రిగా మాటిస్తున్నా. ఎస్ఎల్బీసీని, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, ఎన్నికల తర్వాత కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలునాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి, మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ పునాదులు లేకుండా చేస్తాం
నల్లగొండ: ‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ పునాదులు లేకుండా చేస్తాం. కాంగ్రెస్ కార్యకర్తలు పదేళ్ల పాటు కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మీరు మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటే చూస్తూ ఊరుకోరు’అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది.. రేవంత్ బీజేపీలోకి పోతాడు అని కేటీఆర్ అంటే.. రాజకీయాలు తెలియని బచ్చాగాడులే అనుకున్నాం. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నీవు.. ప్రజాస్వామ్య బద్ధంగా పూర్తి మెజారీ్టతో ఏర్పడిన ప్రభుత్వం సంవత్సరంలో పడిపోతుందని ఏ విధంగా అన్నావు’అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రశ్నించారు. ‘మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏం కుట్రలు చేస్తున్నావు. మేము గేట్లు తెరిస్తే 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక మిగిలేది కుటుంబంలోని మీ బంధువులైన ఎమ్మెల్యేలే’అని మంత్రి అన్నారు. ‘నీ కూతురు లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉంది. ఇంకా బుద్ధి రాలేదా’అని మండిపడ్డారు. అవినీతి కేసుల్లో తండ్రీ కొడుకులు జైలుకు పోక తప్పదన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి, భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు విన్న నీచులని విమర్శించారు. కేసీఆర్‌ది దొంగ దీక్ష.. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం సమయంలో డీ విటమిన్ టాబ్లెట్ వేసుకుని దొంగ దీక్ష చేసి.. చావు నోట్లో తలకాయ పెట్టానని ప్రజలను మోసం చేశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ‘నువ్వొక పాస్‌పోర్టు దొంగవు.. డబ్బులు దోచుకున్నవు. నీలాంటోడే సీఎం అయినప్పుడు. రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎంఎల్సీగా, ఎంపీగా పనిచేశారు. ఆయన సీఎం కాకూడదా’? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ సర్కార్‌ను కూల్చడంలో కేసీఆర్ పాత్ర ‘కేసీఆర్ మమ్మల్ని వెంటాడతా అంటుండు. ఆయన ముసలోడు. మాకు ఏ కట్టే అవసరం లేదు. మేముబలంగా ఉన్నాం. మేమే వెంటాడి వేటాడతాం’అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కేసీఆర్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. జూన్ 5 నుంచి పాలన స్పీడ్ చేస్తామని, ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రూ.2 లక్షల రుణమాఫీని కూడా అమలు చేస్తామని చెప్పారు. -
మెదక్‌లో బీఆర్ఎస్కు ఓటమి తప్పదు: కోమటిరెడ్డి
సాక్షి, నల్లగొండ: కల్వకుంట్ల కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాగే, మెదక్‌లో ఎన్ని కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ గెలవలేదని జోస్యం చెప్పారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి బుధవారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదం. మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఒక్కరు కూడా మిగలరు. మూడు నెలల్లో బీఆర్ఎస్ కనుమరుగవుతుంది. మెదక్‌లో వెయ్యి కోట్లు ఖర్చు చేసినా బీఆర్ఎస్ గెలవలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుస్తుంది. కేసీఆర్ కూతురు అవినీతి చేసి తీహార్ జైలులో ఉన్నారు. బిడ్డ చేసిన పనికి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జైలుకు వెళ్తారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అవినీతి విషయంలో జగదీష్ రెడ్డి జైలుకు పోతారు. జగదీష్ రెడ్డి వేల కోట్ల రూపాయాలు దోచుకున్నారు. శంషాబాద్‌లో ఫామ్ హౌస్ కూడా కొన్నాడు. జగదీష్ రెడ్డి అవినీతిని బయటకు తీస్తాం. నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
రేవంత్ నాయకత్వంలో ఒక్కటిగా ఉన్నాం
రామగిరి (నల్లగొండ): తెలంగాణలో రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ పారీ్టలో గ్రూపుల్లేవనీ, ఏక్నాథ్ షిండేలూ లేరని వ్యాఖ్యానించారు. రంజాన్ పండుగ సందర్భంగా గురువారం నల్లగొండ పట్టణంలోని ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనల సందర్భంగా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డితో కలసి మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. ఎవరెన్ని మాటలు చెప్పినా రేవంత్‌రెడ్డి ఇంకోసారి సీఎంగా కొనసాగుతారన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో 125 సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఐదు గ్రూపులు ఉన్నాయంటూ హరీశ్‌రావు, మహేశ్వర్‌రెడ్డి విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సీనియర్ నాయకుల సలహాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కటిగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇంకోసారి అలా మాట్లాడొద్దు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విషయాల గురించి కానీ, గ్రూపులు ఉన్నాయని కానీ ఇంకోసారి మాట్లాడొద్దని హరీశ్‌రావు, మహేశ్వర్‌రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. అలానే అకారణ విషయాల్లో తన పేరు ప్రస్తావించొద్దని సూచించారు. ప్రభుత్వాన్ని పడగొడతామని చెబుతున్న బీజేపీ, బీఆర్ఎస్లు లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలవాలని సవాల్ విసిరారు. షిండేల సృష్టి బీజేపీ పనే కాంగ్రెస్‌లో ఏక్నాథ్ షిండేలు ఉన్నారని మహేశ్వర్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందనీ... మహారాష్ట్రలో అధికారం కోసం ఏక్నాథ్ షిండేలను సృష్టించిన ఘనత బీజేపీదేనని ఆయన నిందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను దించి కిషన్‌రెడ్డిని ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో కులమతాల మధ్య ఘర్షణలు పెట్టి 370 నుంచి 400 ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీ కలలు కంటోందని ఆయన ఎద్దేవా చేశారు. నల్లగొండ ఎంపీగా కుందూరు రఘువీర్‌రెడ్డిని భారీ మెజారీ్టతో గెలిపించాలని పిలుపునిచ్చారు. -
కేసీఆర్‌కు అరెస్టు భయం.. అందుకే యాత్రలు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు భయంతో ప్రజల్లో సానుభూతి కోసమే కేసీఆర్ రాజకీయ యాత్రలు చేస్తున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆ కేసులో సంబంధిత చట్టం ప్రకారం మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రజాప్రాతి నిథ్య చట్టం ప్రకారం, వరుసగా రెండేళ్లు జైలు శిక్ష పడితే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే వీలుండదని, ఇక కేసీఆర్ రాజకీయాలు వదిలేస్తే మంచిదని సూచించారు. అరెస్టు భయంతోనే ఇప్పుడు కేసీఆర్ యాత్రలు చేస్తున్నారే తప్పించి ఏనాడూ ప్రజల గురించి చిత్తశుద్ధితో పనిచేయలేదని గుర్తు చేశారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాస్తవాలపై తాను కేసీఆర్‌ను నిలదీస్తే, కేసీఆర్ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తనకు వారిలా బూర్చుఖలీఫాలో ఇల్లు లేదనీ, ఇప్పటికీ కిరాయి ఇంట్లోనే ఉంటున్నానని వెల్లడించారు. ‘నాకు కంపెనీ ఉంటే నిరూపించాలని, గాలిమా టలతో తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదు. నీలా తప్పులు చేసే వ్యక్తిని కాదు, నా గురించి మాట్లాడేముందు ఓసారి ఆలోచించుకుని మాట్లాడాలి’ అని సూచించారు. వర్షాభావం కాంగ్రెస్ వైఫల్యమా: పొంగులేటి వర్షాభావ పరిస్థితులను, ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపేందుకు కేసీఆర్ శతవి ధాలా ప్రయత్నిస్తున్నారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. తొమ్మిదిన్న రేళ్లు సీఎంగా ఉండి, తన హయాంలో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతే ఏనాడూ పంటపొ లాలకు వెళ్లి రైతులను పరామర్శించని కేసీఆర్‌కు అధికారం పోగానే రైతులు గుర్తుకొచ్చారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ వరకు వచ్చిన కేసీఆర్, పక్కనే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని దెబ్బతిన్న పిల్లర్లను కూడా సందర్శించి ఉంటే బాగుండేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఐదేళ్లకోసారి పార్టీ మారే వ్యక్తా నా గురించి మాట్లాడేది?
సాక్షి, హైదరాబాద్: తనపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని.. ఐదేళ్లకోసారి పార్టీ మారే వ్యక్తి తన గురించి మాట్లాడటమేమిటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ‘కాంగ్రెస్‌లో చేరుతా.. సాయపడు అన్నా’అని మహేశ్వర్‌రెడ్డి తనను కోరారని.. అలాంటిది ఇప్పుడు తనను టార్గెట్ చేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన ఓ రాజకీయ జోకర్ అని వ్యాఖ్యానించారు. శనివారం తనపై మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. అందులోని వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్‌లోకి వస్తా.. మంత్రి పదవి కావాలన్నా అని అసెంబ్లీ సమావేశాల సమయంలో మహేశ్వర్‌రెడ్డి నన్ను అడిగారు. మాకే పూర్తి మెజారిటీ ఉంది. ఎవరినీ చేర్చుకునే ఉద్దేశం లేదని చెప్పాను. అది మనసులో పెట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. కేంద్రంతో ఆరుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారంటూనే.. తమకు అవసరం లేదనడం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డినే ఏక్నాథ్ షిండే పాత్ర పోషిస్తారనడం మహేశ్వర్‌రెడ్డికి మతిస్థిమితం లేదనడానికి నిదర్శనం. గడ్కరీ, అమిత్ షాలను తాను కలసి షిండే పాత్ర పోషిస్తానని చెప్పినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై భాగ్యలక్ష్మి ఆయానికి వారిని తీసుకుని వచ్చి ప్రమాణం చేయాలి. నేను కూడా ప్రమాణం చేస్తా.. బీజేపీతో లాభం లేదన్నారు.. ‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంటే తమ (బీజేపీ)వాళ్లు రామ మందిరాన్ని పట్టుకున్నారని... దానితో తెలంగాణలో ఓట్లు పడతాయా’అని మహేశ్వర్‌రెడ్డి నాతో చెప్పారు. తాను సొంత ఇమేజీతో ఎమ్మెల్యేగా గెలిచానని, బీజేపీతో లాభమేమీ లేదని కూడా అన్నారు. కాంగ్రెస్‌లోనే ఉండుంటే మంత్రిని అయ్యేవాడిననీ చెప్పారు. నేను షిండే అవునో, కాదో తెలియదుగానీ.. మహేశ్వర్‌రెడ్డి మాత్రం కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లకు వెన్నుపోటు పొడిచే నయా గాలి జనార్దనరెడ్డి లాంటివారు. మహేశ్వరరెడ్డి వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉంది. నేను కాంగ్రెస్‌లోనే పుట్టా.. కాంగ్రెస్‌లోనే పోతా... దిగజారుడు పార్టీ బీజేపీ.. ఈ దేశంలో పార్టీ చేరికల కమిటీ పెట్టిన దిగజారుడు పార్టీ బీజేపీ. చేరికల కమిటీకి చైర్మన్‌ను కూడా నియమించారు. అయినా ఒక్క కార్పొరేటర్ కూడా ఆ పారీ్టలో చేరలేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి డబ్బు పంపుతున్నారని ఇష్టమొచి్చనట్టు ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు మోదీకి, నడ్డాకు డబ్బు పంపుతున్నారా? దేశాన్ని అదానీ, అంబానీలకు దోచిపెట్టిన బీజేపీ ఇతరులను విమర్శించడం సిగ్గుచేటు. నిజానికి ఒక్క ఓటు రెండు రాష్ట్రాలంటూ ప్రజలను మోసం చేసిన పార్టీ బీజేపీ. ఆ పార్టీకి తెలంగాణ ఏర్పాటు ఏమాత్రం ఇష్టం లేదు. సోనియాగాంధీ పారీ్టకి నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చారు.’’అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. -
తెలంగాణ షిండే.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు మరో ఐదుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీల వద్దకు మంత్రి వెంకట్‌రెడ్డి వెళ్లి తెలంగాణలో షిండే పాత్ర పోషిస్తానని చెప్పారన్నారు. కానీ ఆయనపై ఎవరికీ నమ్మకం లేదని, అందుకే ఆయనకు షిండే పాత్ర ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ హైకమాండ్‌తో ఆయన టచ్‌లో ఉంటూ.. బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారనడం ఏమిటని పేర్కొన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని మాట్లాడుతున్నారు. వెంకట్‌రెడ్డితో ఆయన సోదరుడే టచ్‌లో లేరు. అలాంటిది బీజేపీ ఎమ్మెల్యేలు ఎలా టచ్‌లోకి వస్తారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో ఎవరికీ అలాంటి చరిత్ర లేదు. మా పార్టీ వారిని ముట్టుకునే సాహసం చేయొద్దు. మా పార్టీ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని ముట్టుకున్నా 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది. ప్రజలు ఇచి్చన తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా సహకరిస్తోంది. వెంకటరెడ్డికి దమ్ముంటే భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యరి్థని గెలిపించుకోవాలి. భయపెట్టి వసూళ్లు చేస్తున్నారు రేవంత్‌రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలోకి వచ్చాక మరో విధంగా మాట్లాడటం సమంజసం కాదు. కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులను విచారణల పేరుతో భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. రేవంత్ వసూళ్ల చిట్టా, ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్ పేరిట రూ.3 వేల కోట్లు వసూలు చేశారు. ఆ డబ్బును దేశవ్యాప్తంగా రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తోంది. తుగ్లక్ చేష్టలు చేస్తున్న రేవంత్‌రెడ్డిపై మా పోరా టం కొనసాగుతుంది. కాంగ్రెస్‌ది అసమర్థ ప్రభుత్వం. వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ఏదో ఒకఅంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. ఇతర పారీ్టల ఎమ్మెల్యేలు, ఎంపీలను రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేర్చుకుని టికెట్లు ఎలా ఇస్తున్నారు.’’అని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. రాజీనామాలు చేశాకే ఇతర పారీ్టల వారిని బీజేపీ చేర్చుకుంటోందన్నారు. వాళ్ల మంత్రులే కూల్చుతారు.. మేం గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి 48 గంటలు కూడా పట్టదు. కానీ మేం అలా చేయబోం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదు. వాళ్ల మంత్రులే కూల్చుతారు. ఇప్పటికే పది మంది మంత్రులు సీఎం పీఠంపై కన్నేశారు. ఓటుకు కోట్లు కేసుతోనో, ఇంకో అంశంతోనో తన సీటుకు ప్రమాదం వస్తుందన్న భయంతో సీఎం రేవంత్‌కు నిద్రపట్టడం లేదు. ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా పార్టీ మారితే వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా కొంటున్నారు? ఇప్పుడు దేనితో వారిని కొట్టాలి. గతంలో బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఆయనకు టికెట్ ఎలా ఇచ్చారు? ఆయన తరఫున ప్రచారం ఎలా చేస్తారు? వారి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో బయటపెట్టాలి. -
కేసీఆర్ పాపాల వల్లే కరువు
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ చేసిన పాపాలే ఇప్పుడు ఆయన్ను చుట్టుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో అన్నీ కుంభకోణాలే. గొర్రెలు, చేప పిల్లల పంపిణీలో కూడా అవినీతి చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లోనూ అవినీతే. దళితబంధుకూ కమీషన్లు తీసుకున్నారు. యాదగిరిగుట్ట పేరు మార్చడమే ఆయన చేసిన మొదటి తప్పు. దేవుడి పేరుపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సర్వనాశనం చేశారు. ఇలాంటి కేసీఆర్ పాపాల వల్లనే ఇప్పుడు కరువు వచ్చిది’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఒక్కో పెయింటింగ్ రూ. 3–4 కోట్లు ‘నేను ఎన్నో దేశాలు చూశా. కానీ ప్రగతిభవన్ లాంటి ఖరీదైన నిర్మాణం ఎక్కడా చూడలేదు. అక్కడ బాత్రూంను ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదు. ప్రగతిభవన్‌లోని ఒక్కో పెయింటింగ్ ఖర్చు రూ. 3–4 కోట్లుంటుంది. 20 ఏళ్లు అధికారంలో ఉంటామని అనుకొని కేసీఆర్ అలా కట్టించుకున్నారు. ఈ అవినీతి రావుల కోసం ఇప్పుడు జైళ్లు సరిపోవు. ప్రగతి భవన్‌ను జైలు చేసినా సరిపోదేమో. అధికారం పోయేసరికి కేసీఆర్ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. మాతో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తరచూ మాట్లాడుతున్నారు. కేసీఆర్ అవినీతి అంతా బయటకు తీయాలంటే మాకు 20 ఏళ్లు పట్టేట్టు ఉంది’అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీగా దానం పోటీ కష్టమే.. దానం నాగేందర్ ఒక పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి మరో పారీ్టలో ఎంపీగా పోటీ చేయడం కష్టమని, అ లా చేస్తే న్యాయ సమస్యలు వస్తాయని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో పడిపోతుందని గతంలో కడియం శ్రీహరి అన్నప్పటికీ ఆ తర్వాత వాస్తవాలు తెలుసుకున్నట్లు ఉన్నార ని చెప్పారు. తనతో కడియం మాట్లాడలేదని, కేకే మాత్రం మాట్లాడారని, ఆయన్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అభిప్రాయడ్డారు. ఫోన్ ట్యా పింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలని, ఆయనకు చట్టప్రకారం పదేళ్ల జైలు శిక్ష తప్పదని కోమటిరెడ్డి హెచ్చరించారు. వైఎస్ వల్లే వేగంగా హైదరాబాద్ అభివృద్ధి హైదరాబాద్‌కు కళ ఓఆర్ఆర్ అని... అది కట్టింది వైఎస్ హయాంలోనేనని కోమటిరెడ్డి తెలిపారు. వైఎస్సార్ ప్లానింగ్ వల్లే హైదరాబాద్ అభివృద్ధి వేగంగా జరిగిందన్నారు. దక్షిణాదిలోనే ఎక్కువ మెజారిటీ నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు వస్తుందని జోస్యం చెప్పారు. తనకు, తన సోదరుడు, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి మధ్య విభేదాలున్నాయన్న వార్తలను ఖండించారు. తమను విడదీయడం ఎవరి వల్లా కాదని... అయితే బ్రదర్స్ పేరు చెబితేనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అని, అందుకే తమపై రూమర్స్ పుడుతుంటాయని చెప్పారు. -
బీజేపీ నేతలతో టచ్‌లో హరీష్‌రావు: కోమటిరెడ్డి వ్యాఖ్యలు
సాక్షి, యాదాద్రి భువనగిరి: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు బీజేపీ చేరుతారని జోస్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ మేరకు హరీష్‌రావు బీజేపీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నాడని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కాగా, భువనగిరిలో మంత్రి కోమటిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్లో ప్రతిపక్ష నాయకుడి హోదా కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌కు ఇస్తే అల్లుడు హరీష్ పార్టీ నుంచి బయటకు వెళ్తాడు.. అలాగే, అల్లుడికి ఇస్తే కొడుకు బయటకు వెళ్లిపోతాడు. ఇందులో భాగంగానే హరీష్‌రావు బీజేపీ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు చేస్తున్నాడని తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే శక్తి మాజీ సీఎం కేసీఆర్‌కు లేదు. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదు. మీలాగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే బీఆర్ఎస్లో మిగిలేది నలుగురే. ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే ఆయనను కలిసి వినతి పత్రం ఇవ్వాలి. కానీ, కేసీఆర్ మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశాడని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఎల్ఆర్ఎస్పై కోమటిరెడ్డి స్పందిస్తూ ఎల్ఆర్ఎస్పై గైడ్ లైన్స్ ఇంకా పూర్తి కాలేదు. అలాగే, తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే మోదీ కంటే ఎక్కువ మోజార్టీ వస్తుంది’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హామీ ప్రకారం గ్యారంటీల అమలు
నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వ గృహజ్యోతి పథకం ఫేమస్ అని, కేసీఆర్ ప్రభుత్వ 24 గంటల కరెంట్ మొత్తం బోగస్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన నల్లగొండలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడారు. ఇ చ్చిన హామీ ప్రకారం 90 రోజుల్లోపే నాలుగు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తున్నామన్నారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని ధ్వజమెత్తారు. పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇవ్వని బీఆర్ఎస్.. నేతలు నేడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 25 వేల మంది నిరుద్యోగులకు ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చామని, డీఎస్సీ, గ్రూప్–1 నోటిఫికేషన్లు ఇచ్చామని వివరించారు. రాబోయే రెండేళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేసి నల్లగొండ జిల్లాకు తాగు, సాగు నీటి కష్టాలు లేకుండా చేస్తామన్నారు. 11 నుంచి ఇందిరమ్మ ఇళ్లు.. ఈనెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. సొంత స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు ఇస్తామని.. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వమే మామిల్లగూడెంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తుందని తెలిపారు. రూ. వేల కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నామని తెలిపారు. బైక్ నడిపిన మంత్రి కోమటిరెడ్డి.. నల్లగొండలో ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వయంగా బైక్ నడిపి హల్చల్ చేశారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డిని బైక్‌పై ఎక్కించుకుని పట్టణంలోని పలు వార్డుల్లో తిరిగారు. హైదర్‌ఖాన్‌గూడ అర్బన్ హెల్త్ సెంటర్లో కలెక్టర్ హరిచందనతో కలసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన తిప్పర్తి మండలం మర్రిగూడ, కనగల్ మండలాల్లోని పలువురు గృహజ్యోతి లబి్ధదారుల ఇళ్లకు వెళ్లి బిల్లుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ బచ్చా.. ఆయనతో పోటీ ఏంటి! ‘కేటీఆర్ ఒక బచ్చా.. ఆయన తండ్రి చాటు కొడుకు. ఆయనతో నాకు, సీఎం రేవంత్‌కు పోటీ ఏంటి’అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి నల్లగొండ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా.. కేటీఆర్‌పై పోటీ చేస్తున్నారా? అని మీడియా అడగ్గా పైవిధంగా స్పందించారు. ‘కేటీఆర్.. కేసీఆర్ సీఎం అయి, టికెట్ ఇస్తే అమెరికా నుంచి వచ్చి ఎమ్మెల్యే అయిండు. మా లెక్క కష్టపడి రాలేదు’అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జెడ్పీటీసీగా ఇండిపెండెంట్‌గా గెలిచి అక్కడ నుంచి ఎమ్మెల్యే, ఎంఎల్సీగా, ఎంపీగా అయి, ముఖ్యమంత్రి వరకు ఎదిగారన్నారు. తాను కూడా ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్‌లో కొట్లాడి ఎమ్మెల్యే అయ్యానని, తమది వ్యవసాయ కుటుంబమని.. కేటీఆర్ తండ్రి వ్యవసాయం చేయడం లేదని స్పష్టం చేశారు. అలాంటి బచ్చాతో మాకు పోటీయా? అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. పార్లమెంట్ టికెట్ల విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని, నల్లగొండ, భువనగిరిలో తమ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థులే మోదీ కంటే అత్యధిక మెజారీ్టతో విజయం సాధిస్తారని అన్నారు. -
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చెయ్..
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి కేటీ ఆర్ రాజీనామా చేసి నల్లగొండ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు. తాను సైతం నల్ల గొండ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. నల్లగొండలో కేటీఆర్ ఓటమి ఖాయమని, ఇక కారు షెడ్డు మూసుకోక తప్పదన్నారు. కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీని మూసివేస్తాం అని కేసీఆర్ ప్రకట న చేస్తారా? అని సవాల్ విసిరారు. తాను సిరిసి ల్లలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాన ని స్పష్టం చేశారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి శుక్రవారం సచివాల యంలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి మాట్లా డారు. కేటీఆర్‌కు క్యారెక్టర్ లేదని కానీ రూ. లక్షల కోట్లు ఉన్నాయని, తనకు క్యారెక్టర్ ఉందని కానీ డబ్బులు లేవన్నారు. కేటీఆర్ సిరిసిల్లలో రూ.200 కోట్లు ఖర్చు చేసి 30 వేల ఓట్లతో గెలిచాడని, తానై తే అలా గెలిస్తే రాజీనామా చేసేవాడినన్నారు. మాకు ప్రత్యర్థి బీజేపీనే... లోక్‌సభ ఎన్నికల్లో మాకు ప్రత్యర్థి బీఆర్ఎస్ కాదని, బీజేపీనే అని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పోటీలో లేదని, బీజేపీకి రెండు, మూడు సీట్లు వస్తాయో లేదో తెలియదన్నా రు. బీజేపీ ఎంపీ డి.అర్వింద్‌ను ప్రజలు ఎప్పు డో మరిచిపోయారని కోమటిరెడ్డి చెప్పారు. రాజకీ యాల వల్ల ఆస్తులు పోగొట్టుకున్నామని, తనతో పాటు ఉత్తమ్ ఆస్తులు తగ్గాయన్నారు. తన పేరు మీద ఆస్తులుంటే అర్వింద్‌కు ఇచ్చేస్తానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరిలలో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని రాహుల్ గాంధీకి ప్రతిపాదించామని తెలిపారు. -
పనుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను శనివారం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ విద్యుత్ ప్లాంట్‌కు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు అంచనా వ్యయాలు పెంచడంతో బడ్జెట్ భారీగా పెరిగిందని, ఫలితంగా రాష్ట్ర ఖజానాకు భారంగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయకపోతే మోయలేని భారంగా పరిణమిస్తుందన్నారు. ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వ సహకారం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని భట్టి విక్రమార్క హామీనిచ్చారు. ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉన్న స్కిల్డ్, అన్ స్కిల్డ్ నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై ఆలోచించాలన్నారు. బీహెచ్ఈఎల్ పేరున్న ప్రభుత్వ రంగ సంస్థ అని యాదాద్రి పనులు త్వరగా పూర్తి చేయకపోతే ఆ సంస్థకు చెడ్డపేరు వస్తుందన్న విషయాన్ని సంస్థ అధికారులు, ఇంజనీర్లు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. సెప్టెంబర్ నాటికి 1,600 మెగావాట్ల విద్యుత్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో రెండు యూనిట్ల ద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్ పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తామని అధికారులు వివరించారు. 2025 మార్చి నాటికి మొత్తం ఐదు యూనిట్ల ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెస్తామని అధికారులు మంత్రులకు చెప్పుకొచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న నేపథ్యంలో జీరో పర్సంట్ ధూళి బయటికి వెళ్లకుండా నిర్మాణం జరుగుతుందని అధికారులు వివరించారు. అలాగే స్థానికంగా వినియోగించే నీటిని తిరిగి శుద్ధి చేసి ప్రాజెక్టు అవసరాలకే వినియోగిస్తామని తెలిపారు. రుణాలపై ఆరా.. ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణాలు, వాటి వడ్డీ రేట్ల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. కమర్షియల్ బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ రేటు ఉంటే దానిని తగ్గించాలని కోరే అవకాశం ఉందని చెప్పా రు. స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, సబ్ కాంట్రాక్టులు, ఇతర చిన్నచిన్న పనుల్లో స్థానికులకు అవకాశం కల్పించడం ద్వారా చేయూతనివ్వాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను కోరారు. ప్రస్తుతం పవర్ ప్లాంట్‌లో జరుగుతున్న అన్ని రకాల అభివృద్ధి పనులను వీడియో ప్రజెంటేషన్ రూపంలో మంత్రుల బృందానికి వివరించారు. సమావేశంలో విద్యుత్ శాఖ సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, ట్రాన్స్‌కో డైరెక్టర్ అజయ్, పవర్ ప్లాంట్ సీఈ సమ్మయ్య పాల్గొన్నారు. -
ORR Accidents: విషాదం నింపుతున్న రోడ్డు ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని రోడ్లతో పాటు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) సైతం అనేక మంది ప్రముఖులను బలిగొన్నాయి. అక్కడ జరిగిన ఘోర ప్రమాదాల్లో వీఐపీలతో పాటు వారి కుటుంబీకులూ మృత్యువాతపడ్డారు. బాబూమోహన్ కుమారుడు పవన్ కుమార్ నుంచి ఎమ్మెల్యే లాస్య నందిత వరకు ఇలా అర్థాంతరంగా ఊపిరి ఆగిన వాళ్లు ఎందరో ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో కొందరు ప్రయాణిస్తున్న వాహనాలు మితిమీరిన వేగంతో ఉండటం, మరికొందరు సీటు బెల్ట్‌లు, హెల్మెట్లు ధరించకపోవడం వారి పాలిట శాపాలయ్యాయి. 2000 ఏప్రిల్ 22: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నుంచి తిరిగి వస్తూ శంషాబాద్ సమీపంలోని పాల్మాకుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాటి మంత్రి పి.ఇంద్రారెడ్డి అసువులు బాశారు. 2003 అక్టోబర్ 12: అప్పటి రాష్ట్ర కారి్మక శాఖ మంత్రి బాబూమోహన్ పెద్ద కుమారుడు పి.పవన్‌కుమార్ రసూల్‌పుర నుంచి జూబ్లీహిల్స్‌కు బైక్‌పై వస్తుండగా... జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద రోడ్ డివైడర్‌ను ఢీ కొట్టడంతో మృత్యువాతపడ్డాడు. 2010 జూన్ 20: ప్రముఖ సినీనటుడు, బీజేపీ నేత కోట శ్రీనివాసరావు కుమారుడు ప్రసాద్ హైదరాబాద్ శివార్లలోని ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో కన్నుమూశారు. ఈయన ప్రయాణిస్తున్న హైస్పీడ్ ద్విచక్ర వాహనం మరో వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2011 సెపె్టంబర్ 11: హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్రోడ్పైన పుప్పాలగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ కన్నుమూశాడు. 2011 డిసెంబర్ 20: మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. 2012 ఆగస్టు 21: మాజీ మంత్రి పులి వీరన్న కుమారుడు ప్రవీణ్ తేజ ఓఆర్ఆర్పై దుర్మరణం చెందాడు. ఈయన ప్రయాణిస్తున్న కారు టరి్నంగ్ తీసుకుంటూ అదుపుతప్పి బోల్తా పడింది. 2015 నవంబర్ 25: మాజీ డీజీపీ, ప్రభుత్వ సలహాదారు పేర్వారం రాములు మనుమడు వరుణ్ పవార్, బంధువు రాహుల్ పవార్ సహా ముగ్గురు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్పై ముందు వెళ్తున్న పాల వ్యాన్‌ను బలంగా ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. 2016 మే 17: మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ రెయిలింగ్‌ను (క్రాష్ బ్యారియర్) బోల్తా కొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణి, డ్రైవర్ స్వామిదాసు అక్కడిక్కడే కన్నుమూశారు. 2017 మే 10: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నారాయణ విద్యాసంస్థల అధినేత, అప్పటి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ కుమారుడు పి.నిశిత్ నారాయణ, అతడి స్నేహితుడు కామని రాజా రవిచంద్ర దుర్మరణం పాలయ్యారు. -
రెండేళ్లలోగా పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ), డిండి ప్రాజెక్టుల పనులను సత్వరంగా పునరుద్ధరించి, రెండేళ్లలోగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కానీ తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా తీసుకుందని స్పష్టం చేశారు. యుద్ధప్రాతిపదికన పనులు జరగాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలిపారు. నల్లగొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలసి గురువారం సచివాలయంలో ఆయన ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు సంబంధించి 44 కిలోమీటర్ల సొరంగ మార్గం పనుల్లో 9 కిలోమీటర్ల మేర తవ్వకం జరగాల్సి ఉందని, రెండు వైపులా నుంచి సొరంగం తవ్వకాల పనులు నిర్వహించాలని ఉత్తమ్ ఆదేశించారు. రెండేళ్లలో ఈ పనులు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థలు అంటున్నాయని, ఆ మేరకు గడువు పెట్టుకుని పనులు చేయాలని సూచించారు. సమస్యలను పరిష్కరించడం, పనులను వేగిరం చేయడానికి అధికారులతో కమిటీ వేయాలని ఆయన నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను కోరారు. అలాగే 95% పూర్తయిన డిండి ప్రాజెక్టుతో పాటు పెండ్లి పాకాల జలాశయం పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. భూసేకరణకు రూ.90 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. కొత్త ఆయకట్టుకు నీరిచ్చే పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. సమీక్షలో ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, జైవీర్ రెడ్డి, బి.లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఈఎన్సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ పాల్గొన్నారు. ‘జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్లు’ సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు రాష్ట్రంలోని జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఈ మేరకు 1000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి గురువారం రాత్రి ఆయన సచివాలయంలో సింగరేణి సంస్థ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల వల్ల మత్స్య సంపదకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని భట్టివిక్రమార్క సూచించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి నీటిపారుదల శాఖ ద్వారా సంపూర్ణ సహకారం అందిస్తామని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సింగరేణి సంస్థ ఇన్చార్జి సీఎండీ బలరామ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇది ప్రతిపక్షం కాదు.. ఫ్రస్టేషన్ పక్షం
సాక్షి, హైదరాబాద్: ‘వీళ్ళది ప్రతిపక్షం కాదు... ఫ్రస్టేషన్ పక్షం’అంటూ మంత్రి కోమటి రెడ్డి, ‘మా వల్ల ఏ ప్రమాదం లేదు... మీ వాళ్ళతోనే జాగ్రత్త’అంటూ సీఎంనుద్దేశించి బీఆర్ఎస్ సభ్యుడు కడి యం శ్రీహరి పరస్పర విమర్శనాస్త్రాలతో శాసనసభ గురువారం వేడెక్కింది. బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పిన అనంతరం అనుబంధ సందేహాలను కడియం శ్రీహరి లేవనెత్తేందుకు స్పీకర్ అనుమతించారు. ఈ దశలో బీఆర్ అంబేడ్కర్ దళిత బంధు పేరుతో ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కరికీ రూ.12 లక్షలు ఇస్తామన్నారని, బడ్జెట్లో ఇందుకు సంబంధించిన కేటాయింపులు లేవని విమర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకుని ‘ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చి, మోసం చేయడం బీఆర్ఎస్కే అలవా టు. వీళ్ళు ప్రతిపక్షం కాదు... ఫ్రస్టేషన్ పక్షం. అధికారం పోయిందనే అసహనంతో ఉన్నారు. హరీశ్ రావు నేనే సీఎం అయితే అంటున్నాడు. వీళ్ళకు ఏదో సమస్య వచ్చింది. వీళ్ళను దేవుడు కూడా కాపాడలేడు.’’అని వ్యాఖ్యానించారు. హోంగార్డు చనిపోతే పట్టించుకోలే: కోమటిరెడ్డి ’’ఇటీవల జరిగిన నల్లగొండ సభకు వీళ్ల ఎమ్మెల్యే కారణంగా ఓ హోంగార్డు చనిపోయాడు. అతనికి ఇద్దరు చిన్న పిల్లలున్నారు. కనీసం వీళ్ళు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడేనని, తన మాట అమలు కాకపోతే తల తీసుకుంటానన్నాడు దీన్ని అమలు చేశారా? మా పార్టీ నుంచి దళితుడు కాంగ్రెస్ ప్రతిపక్ష నేతయితే ఓర్వలేదు. మా ఎమ్మెల్యేలను కొనేశారు.’అని కోమటిరెడ్డి ఆరోపించారు. ఇందుకు కడియం అంతే ఘాటుగా బదులిచ్చారు. ‘అసహనంతో ఉన్నది మీరే. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, తాను పూర్వాశ్రమంలో ఒకే స్కూల్లో చదువుకున్నాం. నేను సీనియర్ స్టూడెంట్ను. ఆయన జూనియర్. రేవంత్ సీఎంగా ఉండాలని నా మనసులో ఉంది. కానీ రేవంత్ మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మా గురించి మీరు వర్రీ కాకండీ ... మీ వాళ్ళను జర జాగ్రత్తగా చూసుకోండి’అని మాట్లాడటంతో సభలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. 2 లక్షల ఉద్యోగాలెప్పుడిస్తారు?: కడియం బహిరంగ మార్కెట్లో రుణాలు రూ.59,625 కోట్లు వస్తుందని అంచనా వేశారని, పన్నుల రూపంలో అదనంగా రూ. 20 వేల కోట్లు వస్తుందని చెప్పారని, అయినా ఆర్థిక లోటు రూ.53 వేల కోట్లు రావడానికి కారణమేంటో చెప్పాలని కడియం శ్రీహరి నిలదీశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఇంత వరకూ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల్లో యువ వికాసం వదిలేసి, ఐదు హామీలకు బడ్జెట్లో రూ. 53,193 కోట్లు కేటాయించారని, ఏ హామీకి ఎంత ఖర్చు చేస్తారో చెప్పాలన్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చొప్పున, 4.16 లక్షల ఇళ్ళు అవసరమని, ఇంటికి రూ.5 లక్షలు లెక్కన. ఎస్సీ, ఎస్టీ అయితే మరో రూ. లక్ష ఇస్తామన్నారని, ఇవన్నీ కలిపితే, రూ.23 వేల కోట్లపైన అవుతుందన్నారు. కానీ బడ్జెట్లో కేటాయింపు మాత్రం రూ. 7,750 కోట్లు మాత్రమేనని, ఈ పధకాన్ని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ఎస్సీల రిజర్వేషన్ 18 శాతం పెంచుతామని ఇచ్చిన హామీపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఉద్యోగాల భర్తీ కొనసాగుతుంది: పొన్నం ఈ దశలో మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఉద్యోగ నియామకాలు జరగలేదని ఆరోపించారు. పబ్లిక్ సర్విస్ కమిషన్‌ను నియమించామని, ఉద్యోగాల భర్తీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
కేసీఆర్‌ను వ్యతిరేకించి బయటకు వస్తే మద్దతు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనలో మాజీమంత్రి హరీశ్‌రావు ఉన్నట్టున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్‌కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని చెప్పారు. తనను సీఎం చేస్తే మేడిగడ్డను పూర్తిచేసి చూపుతానన్న హరీశ్‌రావు వ్యాఖ్యల నేపథ్యంలో వెంకటరెడ్డి పైవిధంగా స్పందించారు. ఆయన గురువారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ను వ్యతిరేకించి హరీశ్ బయటికొస్తే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఇరవైమంది ఎమ్మెల్యేలతో ఆయన బీఆర్ఎస్ పార్టీ నేత కావాలని సూచించారు. బీఆర్ఎస్లోనే ఉంటే హరీశ్‌రావు ఫ్లోర్‌లీడర్ కూడా కాలేరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ కవిత, హరీశ్, కేటీఆర్ పేర్ల మీద మూడు గా విడిపోతుందని జోస్యం చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ కర్ర పట్టుకుని తిరుగుతున్నారని, అలాంటపుడు ఆయన పులి ఎట్లా అవుతారని ప్రశ్నించారు. 60 కేజీల బరువున్న కేసీఆర్ పులి అయితే.. 86కిలోల బరువున్న తానేం కావాలో చెప్పాలన్నారు. రాబోయే 20 ఏళ్లు కాంగ్రెస్ పారీ్టనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. -
నల్లగొండను నాశనం చేసిందే నువ్వు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాను నాశనం చేసిందే కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘పదేళ్ల పాటు జిల్లాలోని ప్రాజెక్టులను పడావు పెట్టారు. కనీసం జిల్లా ప్రజల వైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు తన ఏజెంట్లతో కృష్ణా ప్రాజెక్టుల వివాదాన్ని రగిలించి ఆ మంటల్లో చలి కాచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు..’ అని ఆరోపించారు. నల్లగొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం ఒక ప్రకటనలో వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల కోసమే కేసీఆర్ నాటకాలని, నాలుగు రోజుల్లో తన ఇంటికి కలవడానికి వచ్చేంత జనమే కేసీఆర్ మీటింగ్‌కు వచ్చి ఉంటారని ఎద్దేవా చేశారు. పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడేటప్పుడు పరిణతితో మాట్లాడాలన్న విజ్ఞతను మరిచి కల్లు కాంపౌండ్ దగ్గర తాగుబోతు కంటే అ ధ్వాన్నంగా మాట్లాడు తున్నాడని విమర్శించా రు. పిచ్చికూతలు కూ స్తే చూస్తూ ఊరుకునేది లేదని, దెబ్బకు దెబ్బ ను ప్రజాస్వామ్య యు తంగా కొట్టి తీరతా మని హెచ్చరించారు. నల్లగొండ ప్రజల రక్తంలోనే ఉద్యమం ‘నల్లగొండ బిడ్డ శ్రీకాంతాచారి త్యాగంతో తెలంగాణ వచ్చింది. శ్రీకాంతాచారి తల్లికి పదవి ఇస్తానని చెప్పి పదేళ్లు అవమానించాడు. నల్లగొండ సభలో ఏర్పాటు చేసిన బ్యానర్‌పై ఒక్క తెలంగాణ ఉద్యమకారుడి ఫోటో కూడా లేకుండా తన ఒక్కడి ఫోటో మాత్రమే పెట్టుకుని నియంతలా వ్యవహరించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ చరిత్ర ప్రజల ముందు పెట్టి ఆయన అహంకారానికి కళ్లెం వేస్తాం. నల్లగొండ ప్రజల రక్తంలోనే ఉద్య మం ఉంది. నియంతృత్వ భావ జాలాన్ని, నియంతలను ఇక్కడి ప్రజలు దగ్గరకు రానీయరు. రాయలసీమను రతనాల సీమ చేస్తానని శపథం చేసిన సీమాంధ్ర సానుభూతిపరుడు కేసీఆర్. ఇప్పుడు అధికారం పోగానే గజనీలా గతం మర్చిపో యాడు. ఆయన అక్కడకే వెళ్లి ఆంధ్ర రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టుకోవడం మంచిది. అసెంబ్లీని వదిలి నల్లగొండకు ఎందుకు? నేను రైతుబంధు రాలేదన్న బీఆర్ఎస్ నేతలను చెప్పుతో కొట్టాలంటే, ప్రజలను అన్నట్టుగా ఆపాదించారు. ఇది కేసీఆర్ కుటిల బుద్ధికి నిదర్శనం. నిజంగా కేసీఆర్‌కు చిత్తశుద్ధి, ప్రజలపై ప్రేమ ఉంటే ఐదు నిమిషాల్లో చేరుకునే అసెంబ్లీని వదిలిపెట్టి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లగొండకు ఎందుకు వచ్చారు? ఆయన కుమారుడి అనుంగు అనుచరుడైన ఓ అధికారిని విచారిస్తే వేల కోట్ల ఆస్తులు దొరుకుతుంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. మెదక్‌లో కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్తను నిలబెట్టి గెలిపిస్తాం. దమ్ముంటే కేసీఆర్ గెలవాలి.’ అని కోమటిరెడ్డి సవాల్ చేశారు. -
బీఆర్ఎస్ సభకు పోటీగా కాంగ్రెస్ సభ!
సాక్షి, హైదరాబాద్: నల్లగొండలో బీఆర్ఎస్నిర్వహించనున్న బహిరంగ సభకు పోటీగా 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. గాంధీ భవన్లో మంగళవారం ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ మేరకు ప్రతిపాదించగా అందుకు సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని విశ్వసనీయంగా తెలియవచ్చింది. సభకు ప్రియాంక గాం«దీని ఆహ్వనించడం ద్వారా బీఆర్ఎస్కు చెక్ పెట్టాలని, సభను విజయవంతం చేసే బాధ్యత తాను తీసుకుంటానని కోమటిరెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. ప్రియాంక సభలోనే మరో రెండు గ్యారంటీలైన గృహజ్యోతి కింద 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్సిలిండర్పథకాలను ప్రకటించాలని నిర్ణయించారని తెలిసింది. నేటి మధ్యాహ్నంలోగా ఎంపీ అభ్యర్థుల షార్ట్‌లిస్ట్.. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒకరి నుంచి ముగ్గురు ఆశావహుల పేర్లను ఎంపిక చేసి ఏఐసీసీకి పంపాలని ఎన్నికల కమిటీ నిర్ణయించింది. లోక్‌సభ అభ్యర్థిత్వాల కోసం వచ్చిన 306 దరఖాస్తులను పరిశీలించింది. వాటిలో సామాజిక న్యాయం, గెలుపు అవకాశాల ప్రాతిపదికన ఒక్కో నియోజకవర్గం నుంచి ఒకరి నుంచి ముగ్గురు పేర్లను టిక్ పెట్టనుంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి పీఈసీ సభ్యులు ఎంపిక చేసిన అభ్యర్థుల లిస్ట్‌ను సీల్డ్ కవర్లో సమర్పించనున్నారు. టికెట్ల ఖరారు ఎజెండాగా మరోసారి ఈ నెల 15న భేటీ కావాలని ఎన్నికల కమిటీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీశ్ చౌదరి, సభ్యులు జిగ్నేశ్ మేవానీ, విశ్వజిత్ కదం, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలతోపాటు పీఈసీ సభ్యులు విష్ణునాథ్, రోహిత్ చౌదరి, వి.హనుమంతరావు, కె. జానారెడ్డి, జీవన్‌రెడ్డి, జె. గీతారెడ్డి, మధుయాష్కీగౌడ్, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, షబ్బీర్ అలీ, మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్, రేణుకాచౌదరి, బలరాం నాయక్, అంజన్‌కుమార్ యాదవ్, సునీతారావు, అజహరుద్దీన్, శివసేనారెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో చర్చకొచ్చిన అంశాలివే.. ► సోనియాగాం«దీని ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేయించాలని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కోరగా ఆమె ఎక్కడ పోటీ చేయాలన్నది ఏఐసీసీ అభీష్టమని, వారి నిర్ణయం ప్రకారం ముందుకు వెళదామని రేవంత్ సూచించారు. ► లోక్‌సభ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలతోపాటు సామాజికవర్గాల వారీగా ఓట్ల వివరాలను పేర్కొంటూ ఓ నివేదికను పీఈసీ సభ్యులకు అందజేశారు. ఇందులో బీసీలను ఇత రుల కేటగిరీలో చేర్చడంపై సీనియర్ నేత వీ హెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ప్రత్యేక కేటగిరీ కింద పరిగణించాలని సూచించారు. క్లీన్‌స్వీప్ చేయబోతున్నాం: ఉత్తమ్ లోకసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేయబోతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పీఈసీ సమావేశం అనంతరం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ పదేళ్లు మోసం చేసినందుకు కేసీఆర్ ప్రజలకు ముందు క్షమాపణలు చెప్పాలన్నారు. సమావేశంలో సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ, ఉత్తమ్, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, వీహెచ్, జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, అంజన్ తదితరులు -
నల్లగొండ బరిలో కోమటిరెడ్డి కూతురు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూతురు శ్రీనిధిరెడ్డి పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఇటీవల ఏఐసీసీ.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోటీలో ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై ఏఐసీసీ సర్వేలు చేయించినట్లు సమాచారం. ఈ సర్వేల్లో మంత్రి కోమటిరెడ్డి కూతురు శ్రీనిధిరెడ్డివైపు కూడా ప్రజలు మొగ్గు చూపినట్లు తెలిసింది. దీంతో అనూహ్యంగా శ్రీనిధిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే నల్లగొండ ఎంపీ టికెట్ కోసం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు జయవీర్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆశీస్సులు కూడా ఆయనకే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో సూర్యాపేట టికెట్ విషయంలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి పోటీ పడ్డారు. టికెట్ దామోదర్‌రెడ్డికి దక్కడంతో పటేల్ రమేష్‌రెడ్డి వర్గమంతా ఆందోళనకు దిగింది. అసెంబ్లీ బరిలో తాను కూడా ఉంటానని రమేష్‌రెడ్డి ప్రకటించడంతో కాంగ్రెస్ అధిష్టానం నల్లగొండ లోక్‌సభ టికెట్ ఇస్తామని ఆయనకు సర్దిచెప్పింది. ప్రస్తుతం ఆయన కూడా లోక్‌సభకు పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా శ్రీనిధిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన శ్రీనిధిరెడ్డి తన తండ్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఇప్పటివరకు ఆమె ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. -
15 రోడ్లు అప్‌గ్రేడ్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని జిల్లా కేంద్రాలు, పారిశ్రామి క కారిడార్లు, పర్యాటక, తీర్థ స్థలాలు, సమీప రాష్ట్రాలను కలిపే ముఖ్యమైన 15 రాష్ట్ర రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన భేటీలో వినతిపత్రం సమరి్పంచారు. ఈ రహదారులపై ఇప్పటికే రాష్ట్రం ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కోమటిరెడ్డి కేంద్రమంత్రి గడ్కరీకి గుర్తుచేశారు. ఇందులో మొదటి ప్రాధాన్యతగా 780 కిలోమీటర్ల పొడవైన 6 రహదారులను జాతీయ రహదారులుగా 2024–25 వార్షిక ప్రణాళికలో పెట్టి అభివృద్ధి చేయాలని కోరారు. మొదటి ప్రాధాన్యంగా అభివృద్ధి చేయాలని కోరిన 6 రోడ్లు(780కి.మీ) ► చౌటుప్పల్–(ఎన్‌హెచ్65)–ఆమనగల్లు–షాద్‌నగర్ –సంగారెడ్డి (ఎన్‌హెచ్65) 182 కి.మీ ► మరికల్ (ఎన్‌హెచ్167)– నారాయటపేట–రామసముద్రం (ఎన్‌హెచ్150) 63 కి.మీ ► పెద్దపల్లి (ఎస్‌హెచ్1)– కాటారం (ఎన్‌హెచ్353సి) 66 కి.మీ ►పుల్లూరు (ఎన్‌హెచ్44)–అలంపూర్–జెట్‌ప్రోల్–పెంట్లవెల్లి–కొల్లాపూర్–లింగాల–అచ్చంపేట– డిండి (ఎన్‌హెచ్765)–దేవరకొండ(ఎన్‌హెచ్176)–మల్లేపల్లి (ఎన్‌హెచ్167)– నల్లగొండ (ఎన్‌హెచ్–565) 225 కి.మీ ► వనపర్తి –కొత్తకోట–గద్వాల – మంత్రాలయం (ఎన్‌హెచ్167) 110 కి.మీ ► మన్నెగూడ (ఎన్‌హెచ్163)–వికారాబాద్–తాండూరు–జహీరాబాద్–బీదర్ (ఎన్‌హెచ్–50) 134 కి.మీ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం జాతీయ రహదారి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలి భారతమాల పథకం ఫేజ్–1లో భాగంగా రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్–చౌటుప్పల్‘) గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ మాత్రమే మంజూరై ప్రస్తుతం భూసేకరణ కొనసాగుతోందని కేంద్రమంత్రి దృష్టికి కోమటిరెడ్డి తీసుకెళ్లారు. కాగా దక్షిణభాగానికి కూడా జాతీయ రహదారి హోదా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. నల్లగొండ జిల్లాలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌కు హై దరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్65) పక్కన 25 ఎకరాలు గుర్తించామని, దీని ఏర్పాటుకు రూ.65 కోట్లు వన్ టైం గ్రాంట్ క్రింద మంజూరు చేయాలని కోరారు. దీని ద్వారా నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్‌లో మెరుగైన ఉపాధి దొరుకుతుందని కోమటిరెడ్డి అన్నారు. మంత్రి వెంట తాండూరు, జడ్చర్ల ఎమ్మెల్యేలు బి.మనోహర్‌రెడ్డి, జనంపల్లి అనిరు«ద్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. -
15 రోడ్లు అప్‌గ్రేడ్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని జిల్లా కేంద్రాలు, పారిశ్రామి క కారిడార్లు, పర్యాటక, తీర్థ స్థలాలు, సమీప రాష్ట్రాలను కలిపే ముఖ్యమైన 15 రాష్ట్ర రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన భేటీలో వినతిపత్రం సమర్పించారు. ఈ రహదారులపై ఇప్పటికే రాష్ట్రం ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కోమటిరెడ్డి కేంద్రమంత్రి గడ్కరీకి గుర్తుచేశారు. ఇందులో మొదటి ప్రాధాన్యతగా 780 కిలోమీటర్ల పొడవైన 6 రహదారులను జాతీయ రహదారులుగా 2024–25 వార్షిక ప్రణాళికలో పెట్టి అభివృద్ధి చేయాలని కోరారు. మొదటి ప్రాధాన్యంగా అభివృద్ధి చేయాలని కోరిన 6 రోడ్లు(780కి.మీ) ♦ చౌటుప్పల్–(ఎన్‌హెచ్65)–ఆమనగల్లు–షాద్‌నగర్ –సంగారెడ్డి (ఎన్‌హెచ్65) 182 కి.మీ ♦ మరికల్ (ఎన్‌హెచ్167)– నారాయటపేట–రామసముద్రం (ఎన్‌హెచ్150) 63 కి.మీ ♦ పెద్దపల్లి (ఎస్‌హెచ్1)– కాటారం (ఎన్‌హెచ్353సి) 66 కి.మీ ♦ పుల్లూరు (ఎన్‌హెచ్44)–అలంపూర్–జెట్‌ప్రోల్–పెంట్లవెల్లి–కొల్లాపూర్–లింగాల–అచ్చంపేట– డిండి (ఎన్‌హెచ్765)–దేవరకొండ(ఎన్‌హెచ్176)–మల్లేపల్లి (ఎన్‌హెచ్167)– నల్లగొండ (ఎన్‌హెచ్–565) 225 కి.మీ ♦ వనపర్తి –కొత్తకోట–గద్వాల – మంత్రాలయం (ఎన్‌హెచ్167) 110 కి.మీ ♦ మన్నెగూడ (ఎన్‌హెచ్163)–వికారాబాద్–తాండూరు–జహీరాబాద్–బీదర్ (ఎన్‌హెచ్–50) 134 కి.మీ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం జాతీయ రహదారి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలి భారతమాల పథకం ఫేజ్–1లో భాగంగా రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్–చౌటుప్పల్‘) గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ మాత్రమే మంజూరై ప్రస్తుతం భూసేకరణ కొనసాగుతోందని కేంద్రమంత్రి దృష్టికి కోమటిరెడ్డి తీసుకెళ్లారు. కాగా దక్షిణభాగానికి కూడా జాతీయ రహదారి హోదా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. నల్లగొండ జిల్లాలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌కు హై దరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్65) పక్కన 25 ఎకరాలు గుర్తించామని, దీని ఏర్పాటుకు రూ.65 కోట్లు వన్ టైం గ్రాంట్ క్రింద మంజూరు చేయాలని కోరారు. దీని ద్వారా నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్‌లో మెరుగైన ఉపాధి దొరుకుతుందని కోమటిరెడ్డి అన్నారు. మంత్రి వెంట తాండూరు, జడ్చర్ల ఎమ్మెల్యేలు బి.మనోహర్‌రెడ్డి, జనంపల్లి అనిరుద్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. -
మంత్రి, జెడ్పీ చైర్మన్ మధ్య మాటల యుద్ధం
బీబీనగర్: గ్రామ పంచాయతీ భవన ప్రారంభో త్సవం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి జెడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డిల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. సోమ వారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామపంచా యతీ భవన ప్రారంబోత్సవ అనంతరం నిర్వ హించిన సమావేశంలో సందీప్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వారంలోపే రైతు భరోసాతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇవ్వలేదని, రైతుబంధు రాలేదని ఎవరైనా అడిగితే చెప్పుతో కొడ తాం అనడం సరికాదని, రైతుబంధు ఇచ్చింది మేమే అని అనడంతో వెంటనే కాంగ్రెస్ నాయకులు జెడ్పీ చైర్మన్‌తో వాగ్వాదం చేశారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకొని.. సందీప్‌రెడ్డి చిన్న పిల్లగాడు, అతనికి ఏమీ తెలియదని, తెలియక మాట్లాడుతున్నాడని అనడంతో సందీప్‌రెడ్డి జోక్యం చేసుకొని.. తాను అన్నీ తెలిసే మాట్లాడుతున్నానని అనడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన మంత్రి.. ‘వీన్ని ఎత్తి బయటపడేయండి’అని అనడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజీ మీదకు దూసుకొచ్చారు. సందీన్రెడ్డి డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సందీప్‌రెడ్డిని స్టేజీపై నుంచి వెళ్లిపోవాలని డీసీపీ, ఏసీపీ చెప్పగా తాను ఎందుకు వెళ్లాలి అంటూ జెడ్పీ చైర్మన్ పోలీసులను ప్రశ్నించారు. దీంతో మంత్రి మరింత ఆగ్రహంతో ‘వార్డు మెంబర్‌గా కూడా గెలవలేవు.. ఏదో నీ తండ్రి మాధవరెడ్డి పేరుతో పదవి వచ్చింది తప్ప నీలో ఏమీలేదు. నీ సొంత గ్రామానికి రోడ్డు వేయించలేకపోయావు బచ్చా’అని అన్నారు. పోలీసులు సందీప్‌రెడ్డిని స్టేజీ కిందకు తీసుకుపోతున్న సమయంలో ఒకరిద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు వెనుక నుంచి ఆయనను పిడుగుద్దులు గుద్దారు. సభాస్థలి నుంచి కొద్ది దూరం వెళ్లిన తర్వాత సందీప్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పలేక మంత్రి కోమటిరెడ్డి తనపై దాడి చేయించారని చెప్పారు. -
హైదరాబాద్‌లో కాస్మొటిక్ మాన్యుఫాక్చరింగ్ హబ్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత కాస్మొటిక్ తయారీ సంస్థ డూసన్ హైద రాబాద్‌లో కాస్మొటిక్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలి కాస్మొటిక్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌ను దాదాపు రూ. 5 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ఆ సంస్థకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. మంగళవారం సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో డూసన్ ప్రతినిధులు సమావేశమై తమ పెట్టుబడుల గురించి ప్రభుత్వా నికి సవివరమైన నివేదిక (డీపీఆర్)ను అందజే శారు. తాము కల్పించే ఉద్యోగాలు, పెట్టుబడుల ద్వారా స్థానికులకు కలిగే ప్రయోజనాల గురించి మంత్రికి విజువల్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తమ సంస్థ చైనా, వియత్నాం, కంబోడియా తదితర దేశాల్లో 46 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిందని, తమ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అవసర మైన అనుమతులు, కంపెనీ ఏర్పాటుకు భూకేటా యింపులు, రాయితీల గురించి మంత్రితో డూసన్ ప్రతినిధులు చర్చించారు. వేల మందికి ఉపాధి కల్పిస్తాం: డూసన్ ప్రతినిధి తమ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే కాస్మొటిక్ హబ్ ద్వారా ప్రత్యక్షంగా దాదాపు 3 వేల మందికి... పరోక్షంగా మరో 4 వేల మందికి ఉపాధి కల్పిస్తామని డూసన్ ప్రతినిధి మూన్ కీ జూ తెలిపారు. ఒరిజనల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈఎం), ఒరిజనల్ డిజైన్ మాన్యుఫాక్చరర్స్ (ఓడీఎం) పద్ధతిలో తమ సంస్థ కార్యకలాపాలు ఉంటాయన్నారు. సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలను ఉత్పత్తి చేసే రైతుల నుంచే కొనుగోళ్లు చేస్తామని... తద్వారా స్థానిక రైతులు, ఉత్పత్తిదారులకు మరింత ఉపాధి పెరుగుతుందని మంత్రికి వివరించారు. ఇక్కడ ఉత్పత్తి చేసిన వివిధ ఉత్పత్తులను స్థానికంగా వ్యాపారం చేయడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తామని తెలియజేశారు. అనుమతుల మంజూరుకు మంత్రిహామీ దేశంలోకెల్లా తెలంగాణ సులభతర వాణిజ్యంలో మొదటిస్థానంలో ఉందని, పరిశ్రమలకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులను మంజూరు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వారికి తెలియజేశారు. దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయని, హైదరాబాద్ పారిశ్రామిక వాతావరణం, పారిశ్రామిక విధానం ఇతర దేశాలు, వ్యాపార సంస్థలకు స్వర్గధామంగా ఉందని డూసన్ ప్రతినిధులకు వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సమావేశం ఏర్పాటు చేసి కంపెనీ ఏర్పాటు చేయడానికి కావల్సిన అనుమ తులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. -
జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుచేశారు. భూ దోపిడీదారుడు జగదీష్ రెడ్డికి తనను విమర్శించే స్థాయి లేదని అన్నారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే తనపై మాజీ మంత్రి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. జగదీష్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తామని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు పోయేవ్యక్తి జగదీష్రెడ్డేనని అన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ తర్వాత జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖామమని తెలిపారు. చదవండి: రాహుల్ యాత్రను అడ్డుకున్న పోలీసులు.. అస్సాంలో ఉద్రిక్తత -
TS: బరాబర్ బొంద పెడతాం
సాక్షి, యాదాద్రి: ‘ప్రభుత్వం ఆరు నెలల్లో పడిపోతుందని కేటీఆర్ కలలు కంటున్నాడు. కానీ బీఆర్ఎస్కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలను 39 ముక్కలుగా విభజిస్తాం.. మీ పార్టీని 14 ముక్కలు చేస్తాం.. మా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీని మేము బరాబర్ బొంద పెడతాం’ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తొలిసారి యాదాద్రి జిల్లా భువనగిరికి వచ్చిన కోమటిరెడ్డి, ఆదివారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్ అధికారం పోయిన షాక్‌లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకున్న అవినీతి సొమ్ముతో 20 సంవత్సరాలు సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆరు లక్షల కోట్లు అప్పులు చేసిందని, పేదల భూములు లాక్కుందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం తెలంగాణను గాడిలో పెడుతోందన్నారు. త్రిపుల్ఆర్ తెలంగాణకు మణిహారమని, రైతులు కోరుతున్నట్లు దీని అలైన్మెంట్ మార్చడానికి ప్రయత్నం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో 10 వేల కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి ఉన్నారు. -
పెండింగ్ పనులకు నిధులిస్తాం
సాక్షి, హైదరాబాద్: అవసరమైన రోడ్లను మెరుగు పరచటంతోపాటు రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్ పనులకు నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్య మంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సచివాలయంలో రోడ్లు భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆ శాఖ బడ్జెట్ సన్నాహక సమావేశంలో సమీక్షించారు. రాష్ట్ర వ్యా ప్తంగా జరుగుతున్న పనులు, వాటికి సంబంధించి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, ప్రస్తుత అవసరా ల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసు కున్నారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అధికారులు వారికి వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు ఆలైన్మెంట్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఇష్టం వచ్చినట్టు కాకుండా, క్రమ పద్ధతిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. ఆ ప్రాజెక్టు భూసేకరణతోపాటు కలెక్టరేట్ భవనాల నిర్మాణం, రోడ్లకు సంబంధించిన పనులకు నిధులు కేటాయించాలని అధికారులు కోరారు. సీఐఆర్ఎఫ్ పనులకు భూసేకరణ నిధుల కొరత లేకుండా బడ్జెట్లో నిధులు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేయగా, భట్టి విక్రమార్క అంగీకరించారు. చేప ప్రసాదం పంపిణీ, బోనాల ఉత్సవాలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కూడా కోరారు. సినీ భూములను కాపాడాలని ఆదేశాలు సినిమాటోగ్రఫీ అంశంపై జరిగిన చర్చలో, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూముల ను కాపాడాలని ఉపముఖ్యమంత్రి భట్టి ఆదేశించారు. సామాజిక బాధ్యతలో భాగంగా డ్రగ్స్ లాంటి మహమ్మారిలకు వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాల్లో సినీ సెలబ్రిటీలు పొల్గొనేలా చూడాలని సూచించారు. నంది అవార్డుల కార్యక్రమం నిర్వహణపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. చిన్న నిర్మాతల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సినిమా హాళ్లలో చిరుతిళ్ల ధరలను నియంత్రించాలని, ఆన్లైన్ టికెటింగ్ కోసం వేసిన కమిటీ నివేదిక వచ్చాక వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. చిత్రపురి కాలనీలో అవకతవకలపై దృష్టి పెట్టాలి: కోమటిరెడ్డి చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవ కలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నందున ఆ విష యంలో కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివా సరాజు, ఆర్థికశాఖ జాయింట్ సెక్రెటరి హరిత, ఉప ముఖ్యమంత్రి కార్యదర్శి కృష్ణ భాస్కర్, సమాచార శాఖ కమిషన్ అశోక్‌రెడ్డి, ఈఎన్సీలు రవీందర్ రావు, గణపతిరెడ్డితో పాటు సీఈలు మధుసూధన్ రెడ్డి, సతీష్, మోహన్ నాయక్ పాల్గొన్నారు. -
ఏటా 2 లక్షల మంది యువతకు ఉపాధి శిక్షణ
మాదాపూర్ (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లను అభివృద్ధి చేయనున్నట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మాదాపూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో శుక్రవారం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి న్యాక్ ప్రతినిధులతో కలసి సంస్థలో కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్‌లో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం 2 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నట్టు వివరించారు. మండల, జిల్లా స్థాయిలో ఒక్కో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి అనంతరం వాటిని విస్తరిస్తామని వివరించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరానికి సంబంధించిన న్యాక్ డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యాక్ డైరెక్టర్ జనరల్ కె.భిక్షపతి, న్యాక్ వైస్ చైర్మన్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ దోపిడీ పత్రాలను విడుదల చేస్తాం
నల్లగొండ: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు, దుబారా ఖర్చు, దోపిడీ పెద్ద ఎత్తున జరిగాయని, వాటన్నింటిపై దోపిడీ పత్రాలను విడుదల చేస్తామని రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం నల్లగొండలో జరిగిన ప్రజాపాలన సన్నాహక సమావేశం అనంతరం మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా చేసిందని, ప్రతి శాఖలోనూ అప్పులు పేరుకుపోయాయన్నారు. వాటన్నింటిపై తమ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తే.. వారు ఏదో చెమటోడ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లుగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శ్వేద పత్రం విడుదల చేశారని విమర్శించారు. అందుకే వారు పదేళ్లలో తెలంగాణలో చేసిన దోపిడీపై పత్రాలను విడుదల చేస్తామన్నారు. దేశమే సిగ్గుపడేలా రూ.6 లక్షల కోట్లు అప్పులు చేసి తామేదో సాధించినట్లు చెప్పుకుంటున్నారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. 1వ తేదీన కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిదన్నారు. రైస్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతాం: మంత్రి ఉత్తమ్ రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే రైస్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే తీవ్రమైన శిక్షలు ఉంటాయని చెప్పారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను కుర్చీలు వేసుకుని కట్టిస్తామని చెప్పిందని, కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టించలేదన్నారు. 28వ తేదీ నుంచి జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటామన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పది జాతీయ స్థాయి రోడ్లు వస్తే చాలు: మంత్రి తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో రోడ్లు తక్కువగా నిర్మించారని, తాను గతంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కొంత ముందుకు తీసుకుపోయానని, ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రోడ్డు భవనాల మంత్రి కావడంతో పది జాతీయ స్థాయి రోడ్లను మంజూరు చేయిస్తే తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటుందన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెడ్ల మాదిరిగా ముందుకు తీసుకుపోతామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు బాలునాయక్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, కుందూరు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, పద్మావతిరెడ్డి, మందుల సామేల్, బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. -
ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగానే ఆరు గ్యాంటీలు అమలు అవుతాయి: మంత్రి ఉత్తమ్
నల్లగొండ: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు జరుగనున్న ప్రజాపాలన కార్యక్రమ సన్నాహకాల్లో భాగంగా నల్లగొండలోని ఎంఎన్ఆర్ కన్వెన్షన్‌లో మంగళవారం నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రామ, వార్డు సభల సందర్భంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రజలు ఇచ్చే దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. దరఖాస్తులు నింపేందుకు.. స్వీకరణకు హెల్ప్ డెస్క్‌లు, ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే బృందాల సంఖ్య పెంచాలన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం : మంత్రి ఉత్తమ్ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్దేశాలను నెరవేర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రూ.పది లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేశామన్నారు. రూ.500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం త్వరలో మొదలు పెడతామన్నారు. ప్రజా పాలనలో స్వీకరించే దరఖాస్తుల ఆధారంగానే ఆరు గ్యారంటీల అమలు అవుతాయని చెప్పారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో జిల్లాకు అన్యాయం జరిగిందని పదేళ్లలో ఒక్క ఎకరాకు కూడా అదనంగా నీరందలేదన్నారు. ఈ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తుందన్నారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియాను కఠినంగా శిక్షిస్తామన్నారు. రేషన్ సరఫరాను ప్రక్షాళన చేస్తామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలి : మంత్రి కోమటిరెడ్డి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాలసీలను పేదలకు అందే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. ప్రజాపాలన సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా టెంట్లు, మంచినీటి సౌకర్యం, కుర్చీలు, ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అధికారులు బాధ్యతాయుతంగా పని చేసి తెలంగాణ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలన్నారు. బెల్టు షాపులు, గంజాయి అమ్మకాలపై పోలీసులు శ్రద్ధ పెట్టాలని, ఇసుక, గంజాయి, వైన్ మాఫియాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నల్లగొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్‌పాటిల్ మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి జరిగే ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి గ్రామాలు, పట్టణాల్లో 151 బృందాలను ఏర్పాటు చేశామని, సూర్యాపేట జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సీహెచ్.ప్రియాంక మాట్లాడుతూ జిల్లాలో 58 టీమ్‌లు ఏర్పాటు చేసామని, దరఖాస్తుల స్వీకరణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతు కె.జెండగే మాట్లాడుతూ జిల్లాలో పక్కా ఏర్పాట్లతో ప్రజా పాలన విజయవంతానికి సిద్ధంగా ఉన్నామని, మొత్తం 51 టీమ్‌లతో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బాలునాయక్, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్‌రెడ్డి, మందుల సామేల్, నలమాద పద్మావతి, నల్లగొండ ఎస్పీ అపూర్వరావు, యాదాద్రి డీసీపీ రాజేష్‌చంద్ర, సూర్యాపేట ఏఎస్పీ నాగేశ్వర్రావు, అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, భాస్కర్‌రావు, వెంకట్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పదేళ్లు ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘గత పదేళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం..’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంత్రి అయ్యాక మొదటి సారి ఆయన సోమవారం నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. అంతకుముందు ఆయన ఆంథోల్ మైసమ్మగుడి వద్ద, నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. మూడేళ్లలోనే ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేస్తామని, ఆరు నెలల్లో బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నా రు. నల్లగొండ జిల్లాను సుభిక్షంగా మారుస్తామని పేర్కొన్నారు. అక్రమ ఇసుక దందా, బెల్టు షాపుల ఆట కట్టిస్తామన్నారు. గత పాలకుల్లాగా అధికారు లను తాము ఇబ్బంది పెట్టబోమని, అంతా కలిసి పనిచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. కలెక్టరేట్లో కలెక్టర్ కర్ణన్ అధ్యక్షతన మిషన్ భగీరథ, నీటిపారుదల, రోడ్డు భవనాలు, ఇతర శాఖల ఈఎన్సీలతో సమీక్షించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ భగీరథ చేపట్టినా ఇంకా చాలా గ్రామాలకు నీరందడం లేదని, సంబంధిత ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు విద్యుత్ సర ఫరాలో అంతరాయం లేకుండా అవసరమైన సబ్ స్టేషన్లు, ఇతర విస్తరణ పనులు చేయించాలని, దీనిపై నివేదికలు ఇస్తే ప్రభుత్వంతో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో విద్యు త్ ప్రమాదాల్లో 32 మంది చనిపోయినా వారికి గత ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోవడం బాధాకర మని చెప్పారు. వెంటనే వారికి న్యాయం చేయాల న్నారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు అనిల్‌రెడ్డి, బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, జైవీర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆరు లేన్లు అయ్యేనా?
చౌటుప్పల్: త్వరలో హైవే విస్తరణకు చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల ప్రకటన చేశారు. దీంతో హైదరాబాద్– విజయవాడ 65వ నంబరు జాతీయరహదారి ఆరు లేన్ల విస్తరణకు మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రెండున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. మంత్రి ప్రకటనతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వాహనదారులు, ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. బీఓటీ పద్ధతిన నాలుగు లేన్లుగా విస్తరణ హైదరాబాద్ – విజయవాడ మధ్య 275 కిలోమీటర్ల దూరం ఉంది. ఇందులో హైదరాబాద్ నుంచి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వరకు, ఏపీలోని విజయవాడ నుంచి నందిగామ వరకు నాలుగు లేన్ల రోడ్డుగా వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో విస్తరించారు. మిగిలిన 180 కిలోమీటర్లు మాత్రం బీఓటీ పద్ధతిన నాలుగులేన్లుగా నిర్మించారు. ఈ పనులను జీఎంఆర్ సంస్థ చేపట్టింది. ఈ పనులకు అప్పటి సీఎం రోశయ్య 2010 మార్చిలో నార్కట్‌పల్లి వద్ద శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేసి మూడు ప్రాంతాల్లో టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుము వసూలు చేస్తోంది. కోర్టును ఆశ్రయించిన జీఎంఆర్ సంస్థ ఈ హైవేను ఆరులేన్లుగా విస్తరించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే హైవే విస్తరణ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్ ముందస్తుగా కోర్టును ఆశ్రయించింది. తాము బీఓటీ పద్ధతిలో రోడ్డు నిర్మాణ పనులు చేశామని, టోల్ వసూలు చేసుకునేందుకు తమకు ఇంకా గడువు ఉందని, పెట్టుబడి కింద టోల్ వసూళ్లు అనుకున్న మేరకు రానందున మరికొంత కాలం అనుమతి ఇప్పించాలని కోర్టుకు వెళ్లింది. దీంతో విస్తరణ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. అత్యంత రద్దీ రహదారిగా గుర్తింపు హైదరాబాద్– విజయవాడ హైవే దేశంలోనే అత్యంత రద్దీ రహదారిగా గుర్తింపు పొందింది. టోల్‌ప్లాజాల లెక్కల ప్రకారం రోజూ సగటున 40వేల నుంచి 50వేల వాహనాలు ఈ మార్గంలో వెళుతున్నాయి. దీనిపై ఏ చిన్నపాటి ప్రమాదం జరిగినా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. అన్ని విధాలుగా ప్రయోజనం హైవేను ఆరు వరుసలుగా విస్తరిస్తే ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. వాహనదారులు, ప్రయాణికులకు సమయం కూడా కలిసివస్తుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ఆశిస్తున్నాం. – చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, చౌటుప్పల్ జెడ్పీటీసీ సభ్యుడు సర్విస్ రోడ్లు ఏర్పాటు చేయాలి ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న హైవేపై నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. దీనిని తగ్గించడానికి ఆరు వరుస లు అవసరం. విస్తరణతోపాటు హైవే వెంట ఉన్న అన్ని గ్రామాల వద్ద సర్వీసు రోడ్లు నిర్మించాలి. – బాతరాజు సత్యం, పంతంగి సర్పంచ్ -
ఏపీ ప్రత్యేక హోదా బాధ్యత కేంద్రానిదే!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. 2014 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని, ఆ విషయాన్ని మోదీ మర్చిపోద్దని సూచించారు. మంగళవారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విదార్థి యువజన ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ ఈ పోరాటానికి తన సంపూర్ణ సహకారం, మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రాన్ని ఆదుకుంటామని విభజన సమయంలో పార్లమెంటు ఉభయ సభల్లో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఢిల్లీలోని తెలంగాణభవన్ ఆస్తులు, భూములపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్హెచ్ఏఐ చైర్మన్‌తో భేటీ రాష్ట్రంలోని పలు రోడ్ల ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలంటూ మంత్రి కోమటిరెడ్డి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతో‹Ùకుమార్‌యాదవ్‌ను కోరారు. నల్లగొండ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు, ఆర్మూరు–మంచిర్యాల రోడ్డు, మల్కాపూర్–విజయవాడ వరకు ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు అనుమతులు ఇవ్వాలని కోమటిరెడ్డి వినతిపత్రాలు సమర్పించారు. మంత్రి కోమటిరెడ్డికి స్వల్ప అస్వస్థత సాక్షి, నల్లగొండ ప్రతినిధి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్తో ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. స్కానింగ్ చేసిన యశోద ఆస్పత్రి వైద్యులు.. రెండు రోజులు ఆస్పత్రిలో ఉండి చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలోనూ ఆయన గొంతునొప్పితో ఇబ్బంది పడ్డారు. ఇటీవల కాలంలో తరచుగా కోమటిరెడ్డి ఢిల్లీ వెళ్లిరావడం, అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించకే అస్వస్థతకు లోనైనట్టు తెలిసింది. అన్నదాతల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము తొలిరోజు ఎకరాలోపు రైతులకు అందజేత! సాక్షి, హైదరాబాద్: రైతుబంధు సొమ్ము అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ప్రారంభమైంది. ఎకరంలోపు భూమి ఉన్న దాదాపు 22 లక్షలమంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో సుమారు రూ.640 కోట్ల మేర డబ్బులను మంగళవారం జమ చేసినట్టు వ్యవసాయశాఖ వర్గాలు అనధికారికంగా తెలిపాయి. వానాకాలం సీజన్ మాదిరిగానే యాసంగిలో కూడా అదే పద్ధతిలో నగదును రైతులకు అందజేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, ప్రభుత్వం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని వ్యవసాయ అధికారులు అంటున్నారు. వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేషీ కూడా రైతుబంధు సొమ్ము సమాచారం వెల్లడించలేదు. -
ఆ రహదారిని ఆరు వరుసలకు విస్తరిస్తాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని త్వరలోనే ఆరు వరుసలుగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును రెండేళ్లలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడకు అతి తక్కువ సమయంలోనే చేరుకునే అవకాశముందని కోమటిరెడ్డి వెల్లడించారు. తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో, కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో భేటీ అయి పెండింగ్‌లో ఉన్న 14 జాతీయ రహదారుల ప్రతిపాదనలపై చర్చించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఆదివారం ఆయన సచివాలయంలోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వారంలో మూడు రోజులు సచివాలయంలో, మూడు రోజులు జిల్లా పర్యటనలో ఉంటానన్నారు. రాష్ట్రంలోని రోడ్లను మెరుగుపరిచి దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. నాలుగు వరుసలకు విస్తరిస్తాం నల్గొండ నుంచి ముషంపల్లి మీదుగా ధర్మాపురం వరకు సింగిల్ రోడ్డుగా ఉండి ఎన్నో ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డును రూ.100 కోట్లతో నాలుగు వరుసలకు విస్తరిస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. కొడంగల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే లింగంపల్లి– దుగ్యాల రోడ్డును రూ.4.15 కోట్లతో మెరుగుపరుస్తామన్నారు. వారం రోజులు కూడా కాకముందే తమ ప్రభుత్వం రైతుబంధు నిధులు ఇవ్వటం లేదని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించటం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీనివాసరాజు, ప్రత్యేక కార్యదర్శి విజేంద్రబోయి, ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్రావు, న్యాక్ డీజీ భిక్షపతి, ఈఈ శశిధర్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కేసీఆర్‌ను పరామర్శించిన మంత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోమటిరెడ్డి ఆదివారం పరామర్శించారు. అనంతరం అక్కడే ఉన్న కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, హరీశ్‌రావును కలిసి కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయా..!
నల్గొండ: ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్నగర్ నుంచి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరు ఎమ్మెల్యేలుగా కొనసాగాలంటే ఎంపీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంది. అయితే, వీరి రాజీనామాతో రెండు ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయా అనే చర్చ జరుగుతోంది. రిప్రజేంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951, సెక్షన్ 151–ఎ ప్రకారం.. ఖాళీ అయిన పార్లమెంట్ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆరు నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, 17వ పార్లమెంట్ సాధారణ ఎన్నికలు 2024 మేలో జరుగనున్నాయి. వీరిద్దరు ఇప్పుడు రాజీనామా చేసినా.. పార్లమెంట్ ఎన్నికలకు ఐదు నెలలే గడువు ఉండడంతో ఉప ఎన్నికలు దాదాపు లేనట్లేనని తెలుస్తోంది. ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ స్థానాలు ఖాళీగానే ఉండనున్నాయి. -
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రి పదవి, పీసీసీ పీఠం?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కొత్తగా ఏర్పడనున్న రాష్ట్ర కేబినెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అధిక ప్రాధాన్యం దక్కనుంది. అత్యధికంగా మంత్రి పదవులతో పాటు పార్టీ పదవుల్లోనూ నల్లగొండకే ప్రాధాన్యం ఇచ్చేలా కాంగ్రెస్ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మహబూబ్‌నగర్ తరువాత అత్యధిక స్థానాలను ఇక్కడి నుంచి గెలిచిన నేపథ్యంలో నల్లగొండ జిల్లాకు పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కూడా కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా సీఎం పదవి ఆశించారు. అయితే, ఆ పదవిని రేవంత్‌రెడ్డికి ఇవ్వడంతో ఉత్తమ్‌కు మంత్రివర్గంలో కీలక పదవి అప్పగించే అవకాశం ఉంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రి పదవితో పాటు పీసీసీ పీఠం దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు కంచుకోటగా నల్లగొండ నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట. గత 30 ఏళ్లలో అత్యధిక శాతం ప్రజలు కాంగ్రెస్ వైపే నిలిచారు. ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు గాను 11 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఇందులో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లాంటి సీనియర్ నేతలు ఉన్నారు. మహబూబ్‌నగర్ తరువాత అత్యధిక స్థానాలను గెలిపించి ఇచ్చింది నల్లగొండ జిల్లానే. మహబూబ్‌నగర్ నుంచి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో మంత్రి పదవుల్లో అగ్ర తాంబూలం నల్లగొండ జిల్లాకే ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోంది. మంత్రి పదవులతో పాటు పార్టీ పదవుల్లోనూ సముచిత ప్రాధాన్యం దక్కనుంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రి పదవి, పీసీసీ పీఠం? నల్లగొండ నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలోనే సీనియర్ నాయకుడు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించడంతో పాటు, టీడీపీ ప్రభుత్వ హయాంలో నల్లగొండ నియోజకవర్గంలో ఫ్లోరైడ్ రహిత తాగునీరు అందించాలని ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆయన.. తెలంగాణ సాధన కోసం సొంత ప్రభుత్వం మీదనే పోరాడారు. మంత్రి పదవికి రాజీనామా చేసి నల్లగొండ పట్టణంలో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అంతేకాదు తెలంగాణ కోసం రెండు పర్యాయాలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించలేదు. ఆ తర్వాత ఆయన నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డిప్యూటీ ప్లోర్ లీడర్‌గా పనిచేశారు. సోనియా గాంధీ ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అవుతానని ఆయన గతంలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మారిన సమీకరణల్లో భాగంగా వెంకట్‌రెడ్డికి మంత్రి పదవితో పాటు పీసీసీ పీఠాన్ని అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం కాకపోయినా కీలక బాధ్యతలే.. ఉమ్మడి జిల్లాలో మరో సీనియర్ నాయకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించడంతో పాటు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో చర్చలు జరిపారు. అఽధిష్టానం అన్ని విధాల చర్చించి రేవంత్‌రెడ్డినే ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక పదవి ఇవ్వాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజగోపాల్‌రెడ్డికి కూడా.. మునుగోడు నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతే. ఆయన ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయనకు చీఫ్ విప్ లేదా ప్రభుత్వంలో మరో కీలక పదవి దక్కుతుందనే చర్చ సాగుతోంది. -
ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కొత్తగా ఏర్పడబోయే రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ఉమ్మడి జిల్లాలో తమదైన ముద్రవేసిన కీలక నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సామాజిక సమీకరణల ఆధారంగా జిల్లాకు మరో పదవి కూడా దక్కే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ములుగులో ఆదివాసి గిరిజనురాలైన అయిన సీతక్కకు క్యాబినెట్లో అవకాశం కల్పిస్తే, లంబాడా సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు కూడా చాన్స్ వచ్చే అవకాశం ఉందన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా సీనియర్లే నాగార్జునసాగర్‌లో, అంతకుముందు 2009లో రద్దయిన చలకుర్తి నియోజకవర్గం నుంచి మొత్తంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ఈసారి పోటీ చేయలేదు. ఆయన గతంలో హోంశాఖ మంత్రిగానే కాకుండా 12 శాఖలకు మంత్రిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆయన పోటీ నుంచి తప్పుకొని తన కుమారుడు కుందూరు జయవీర్‌రెడ్డి అవకాశం ఇచ్చారు. సూర్యాపేట నుంచి ప్రస్తుతం పోటీ చేసి ఓడిపోయిన రాంరెడ్డి దామోదర్‌రెడ్డి గతంలో తుంగతుర్తి నుంచి నాలుగుసార్లు, సూర్యాపేట నుంచి ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు హుజూర్‌నగర్‌లో మూడుసార్లు, కోదాడలో రెండుసార్లు మొత్తంగా ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు హూజూర్నగర్నుంచి ఆరోసారి గెలుపొందారు. ఇక నల్లగొండ నియోజకవర్గం నుంచి ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పుడు ఐదోసారి నల్లగొండ నుంచే గొలుపొందారు. వీరంతా ఇన్నాళ్లు జిల్లాలో పార్టీ పట్టు కోల్పోకుండా కాడాడటంలో కీలకంగా వ్యవహరించారు. ఇలా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నలుగురైదుగురు ఉండగా, అందులో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నలమాద ఉత్తమ్‌మార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఐటీ శాఖ మంత్రిగా సేవలందించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ఉమ్మడి జిల్లా నుంచి ఈ ఇద్దరికి మంత్రి పదవులు దక్కుతాయన్న నమ్మకంతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. రెండోసారి గెలుపొందిన ముగ్గురు ఈ ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి, దేవరకొండ నుంచి బాలూనాయక్ కూడా రెండోసారి విజయం సాధించారు. మిగిలిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లో జూనియర్లే. ఉమ్మడి జిల్లాలో పార్టీ నడిపిన నేతలు ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజక వర్గాలకుగాను 11 స్థానాల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. అయితే, గత పదేళ్లుగా జిల్లాలో పార్టీ ఉనికికి ప్రమాదం రాకుండా సీనియర్ నేతలు కీలకంగా వ్యవహరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కోల్పోయినా, 2019 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు పార్లమెంట్ స్థానాలను దక్కించుకొని పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. సీనియర్ నేతలు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో పాటు భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఎప్పటికప్పుడు ధైర్యం నింపుతూ అండగా నిలిచారు. -
నల్లగొండలో కోమటిరెడ్డి, భూపాల్‌రెడ్డి మధ్యే కీలక పోరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్‌కు గడువు దగ్గరపడింది. 30న ఉదయం నుంచే పోలింగ్ జరగనుండగా.. అభ్యర్థుల పోల్ మేనేజ్మెంట్కు సమయం రెండు రోజులు ఉంది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. 29వ తేదీన కూడా సభలు సమావేశాలు మినహా ఇంటింటి ప్రచారం చేసుకునే వీలు ఉంది. అయితే ఇప్పటివరకు నిర్వహించిన ప్రచారం ఆధారంగా ఇంకా తాము ఏయే పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో బలహీనంగా ఉన్నామో తెలుసుకొని పార్టీ శ్రేణులను రంగంలోకి దింపాయి. కొన్ని చోట్ల నువ్వా నేనా అన్నట్లుగా, మరికొన్ని చోట్ల త్రిముఖ పోటీ ఉంది. నల్లగొండ జిల్లాలో మూడింట సై అంటే సై ►నల్లగొండ నియోజకవర్గంలో ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులైన కంచర్ల భూపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్యే కీలక పోరు సాగుతోంది. బీజేపీ నుంచి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) పార్టీ నుంచి పిల్లి రామరాజుయాదవ్ బరిలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ సంప్రదాయ ఓట్లు బీజేపీకే పడనుండగా, ఆయన అదనంగా ఏ మేరకు ఓట్లను సాధిస్తారన్నది పోలింగ్ రోజే తేలనుంది. మరోవైపు పిల్లి రామరాజుయాదవ్ యాదవ సామాజికవర్గంతోపాటు బీసీల ఓట్లు తనకు పడేలా ప్రయత్నిస్తున్నారు. ఈయన చీల్చే ఓట్లు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటముల్లో ప్రధానం కానున్నాయి. ► నకిరేకల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం మధ్య హోరాహోరీగా పోటీ సాగుతోంది. ఇక్కడ చేసిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని బీఆర్ఎస్ అభ్యర్థి ధీమాగా ఉండగా, కాంగ్రెస్ పార్టీకి ఉన్న జోష్, మాజీ ఎమ్మెల్యేగా తనకున్న వ్యక్తిగత అనుచరవర్గ బలంతో గెలుపు సాధిస్తానన్న ధీమాతో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. ► నాగార్జునసాగర్‌లోనూ ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జైవీర్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ కేడర్, తన తండ్రి జానారెడ్డి చరిష్మా తనను కచ్చితంగా గెలిపిస్తుందన్న ధీమాలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ నియోజవర్గ అభివృద్ధికి తాను తీసుకుకొచి్చన నిధులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బీజేపీ, ఇతర పార్టీలు భారీ ప్రభావం చూపుతాయన్న అంచనాలు లేవు. మిర్యాలగూడ, మునుగోడు,దేవరకొండలో ట్రయాంగిల్ ► మిర్యాలగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వ్యక్తిగతంగా తమకున్న పట్టుతో గెలుస్తానని భావిస్తుండగా, కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి కూడా తన వ్యక్తిగత చరిష్మా, పార్టీ వేవ్ పైనే ఆధార పడ్డారు. ఇదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే, సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి తన వ్యక్తిగత చరిష్మాతోపాటు పార్టీకి ఉన్న బలంతో గెలుస్తానన్న ధీమాలో ఉన్నారు. ► మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి మధ్య పోరు నెలకొంది. ఉప ఎన్నికల తరువాత సీఎం ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో చేపట్టిన చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని బీఆర్ఎస్ అభ్యర్థి భావిస్తుండగా, నియోజకవర్గంలో తనకున్న వ్యక్తిగత చరిష్మా, కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రేజ్ తనను గెలిపిస్తుందని కాంగ్రెస్ అభ్యర్థి భావిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సంప్రదాయ ఓట్లతోపాటు ఆయన చీల్చే ఇతర ఓట్లే ఈ ఎన్నికల్లో అక్కడ ప్రధానం కాబోతున్నాయి. ► దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి బాలునాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్రకుమార్ మధ్య ప్రధాన పోటీ ఉండగా, బీజేపీ అభ్యర్థి కేతావత్ లాలూ నాయక్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. యాదాద్రిలో ముక్కోణం ► భువనగిరి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే ఆశ పెట్టుకోగా, కాంగ్రెస్ పార్టీ నుంచి కుంభం అనిల్ కుమార్‌రెడ్డి తమ పార్టీకి ఉన్న వేవ్ పైనే ఆశ పెట్టుకున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళుతూ గెలుపొందాలని భావిస్తున్నారు. ► ఆలేరు నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే గత పదేళ్లలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తనను మూడోసారి గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్య.. పార్టీ జోష్, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి పడాల శ్రీనివాస్ కూడా ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను తనను గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. -
కాంగ్రెస్ నేస్తం కాదు.. భస్మాసుర హస్తం
సాక్షి, యాదాద్రి, మిర్యాలగూడ, ఎల్బీనగర్/మన్సూరాబాద్: ‘కాంగ్రెస్ నేస్తం కాదు.. భస్మాసుర హస్తం’అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని 55 సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఇవ్వమనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, వలి గొండ, నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌లలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ రావడం లేదంటున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కరెంట్ వైర్లు పట్టుకుంటే రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగుకు అర్ధరాత్రి కరెంట్ ఇస్తే భార్యాపిల్లలను వదిలి పాములు, తేళ్లు, విష పురుగుల భయంతో పొలానికి మోటారు పెట్టడాని కి వెళ్లేవారని చెప్పారు. చీకట్లో కరెంట్ షాక్‌కు గురై అనేక మంది రైతన్నలు ప్రాణాలు వదిలారని.. ఆ రైతుల ఉసురు తగిలే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైందన్నారు. వారి హయాంలో విత్తనాలు, ఎరువు ల కోసం రైతులు గంటల కొద్దీ పడిగాపులు కాయా ల్సి వచ్చేదని.. కానీ, స్వరాష్ట్రంలో రైతులకు అలాంటి అవస్థలు లేవన్నారు. తెలంగాణ అభివృద్ధితో పాటు సుభిక్షంగా ఉండాలంటే మరోసారి కేసీఆర్‌ను గెలిపించాలని కేటీఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాహుల్‌గాందీకి వ్యవసాయం తెలియదు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాందీకి వ్యవసాయం గురించి తెలియదని, పబ్బులు క్లబ్బులు మాత్రమే తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే పింఛన్ రూ.4 వేలు ఇస్తామని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అందరూ ప్రియమైన ప్రధాని అని అంటున్నారు.. కానీ ప్రధాని మోదీ పిరమైన ప్రధానిగా మారారని ఎద్దేవా చేశారు. బీజేపికి ఓట్లు వేస్తే మూసీలో వేసినట్లే అన్నారు. టీఎస్పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి జాబ్ కేలెండర్‌ను విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎల్బీనగర్ అభ్యర్థి దేవిరెడ్డి సుదీర్‌రెడ్డికి మద్దతుగా ఎల్బీనగర్లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి రోడ్ షో నిర్వహించారు. మన్సూరాబాద్, బీఎస్‌రెడ్డినగర్ చౌరస్తాలలో మంత్రి మాట్లాడుతూ, టీఎస్పీఎస్సీలోని తప్పులను సవరించి శాశ్వత ప్రతిపాదికన ఉద్యోగులను నియమిస్తామన్నారు. కొత్తపేట ప్రూట్‌మార్కెట్ స్థలంలో అధునాతన వెయ్యి పడకల టిమ్స్ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వస్తామని కలలు కంటూ సీఎం కుర్చీ కోసం 11 మంది కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి అన్యాయం అయ్యారని, మళ్లీ అలాంటి తప్పు చేయవద్దని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలపై కేటీఆర్ పరుష పదజాలం ప్రతిపక్ష పార్టీల నేతలపై కేటీఆర్ నిప్పులు చెరి గారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో రోడ్‌షో సందర్భంగా.. ‘ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎక్కడ, ఇంటికో ఉద్యోగం ఎక్కడ, కేజీ టు పీజీ ఉచిత విద్య ఎక్కడ’అని కొందరు యువకులు ప్లకార్డులు పట్టుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన కేటీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘55 ఏళ్లు పరిపాలించిన వాళ్లు ఏం పీకారు. అడగడానికి ఇజ్జత్ లేదు, మానం లేదు. ఆ సన్నాసులు అడుగుతున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని, వీపు పగులగొట్టే వాళ్లు లేకనా’అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. -
అమరుల కుటుంబాలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు..?
నల్లగొండ: తెలంగాణ కోసం 1,200 మంది అమరులైతే ఆ కుటుంబాలందరికీ కేసీఆర్ ఎందుకు ఉద్యోగం కల్పించలేదని నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన నాడు కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ సోనియా గాంధీ కాళ్లు మొక్కారని, నేడు ఆమెను బలి దేవత అంటున్నాడని, 1,200 మంది విద్యార్థులు చనిపోయిన తర్వాతనే తెలంగాణ ఇచ్చిందనడం దురదృష్టకరమన్నారు. మంగళవారం ఆయన వేలాది మంది కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లికి ఎలాంటి పదవి ఇవ్వలేదని విమర్శించారు. నిధులు, నీరు, నియామకాలు పేరిట ఏర్పడ్డ తెలంగాణలో ఉద్యోగ కల్పనలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ చేస్తారనుకుంటే బాధల తెలంగాణ చేశాడని, ఒకటో తేదీ జీతాలు రావడం లేదని, కట్టిన ప్రాజెక్టులు నాణ్యత లేక కూలిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు గ్యారంటీ స్కీమ్‌లను కచ్చితంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్, అదే రోజు కేసీఆర్ రాజీనామా చేస్తాడని చెప్పారు. ‘డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటించిన రోజే కాదు.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టినరోజు కూడా. అదే రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తోంది. ప్రతి హామీని నెరవేరుస్తుంది’అని చెప్పారు. ఏదో ఒక రోజు మీ కోరిక నెరవేరుతుంది.. ‘ఏదో ఒక రోజు మీ కోరిక నెరవేరుతుంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం అవుతాడు. మీకున్న తొందర నాకు ఇప్పుడు లేదు. ఇప్పుడు నాకు సీఎం కావల్సిన అవసరం లేదు’అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సభలో ప్రజలంతా సీఎం.. సీఎం అని నినాదాలు చేయగా కోమటిరెడ్డి పైవిధంగా స్పందించారు. ‘నా చర్మం వలిచి మీకు చెప్పులు కుట్టిచ్చి నా తక్కువే. 20 ఏళ్లుగా నన్ను ఎంతో పెద్ద నాయకుడిని చేసి గుర్తింపు తెచ్చారు. ఒక్క పిలుపుతోనే నా నామినే షన్‌కు వేలాదిగా తరలి వచ్చారు. నా జన్మ ధన్యమైంది. మీ కోసం ఏ త్యాగాల కైనా సిద్ధమే’అని కోమటిరెడ్డి భావోద్యేగానికి గురైయ్యారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం
నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం నల్ల గొండ పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభు త్వం వస్తే ఇక కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండరని, అందరూ ప్రభుత్వ ఉద్యోగులే అవుతారని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉద్యోగ అర్హత పరీక్షలు నిర్వహించడంలో విఫలం కావడం వల్ల అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని, నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొ న్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులన్నీ నాణ్యతలేక కూలిపోతున్నాయని, వాటి మీద విచారణ జరిపించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంద ని కోమటిరెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద విచారణ జరిపిస్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మిత్రపక్షాలు అయినందునే విచారణ చేపట్టడంలేదని ఆరోపించారు. రూ.9 లక్షల కోట్ల అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే, దానిలో భాగమైన మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. -
మంత్రి పదవులు ఖాళీగా ఉంటాయోమో సార్!
మంత్రి పదవులు ఖాళీగా ఉంటాయోమో సార్! -
నగరంలో ఐటీ దాడుల కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులు, వారి బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు గురువారం విస్తృత సోదాలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో జరిగిన తనిఖీలు నగరంలో కలకలం రేపుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేక బృందాలు దాడులు ప్రారంభించాయి. కోకాపేటలోని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు, రియల్ ఎస్టేల్ వ్యాపారి గిరిధర్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేశాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)కి చెందిన ఇళ్లు, విల్లా, ఫామ్‌హౌసుల్లో తనిఖీలు చేపట్టాయి. బాలాపూర్‌లోని బడంగ్పేట్ మేయర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, వారి బంధువులు, అనుచరుల ఇళ్లలో, బాలాపూర్ గణపతి లడ్డూను వేలంలో కొనుగోలు చేసిన వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. సీఆర్పిఎఫ్ బలగాల బందోబస్తు మధ్య దాదాపు 14 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి. ఇవి శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏకకాలంలో ఇద్దరి ఇళ్లపై దాడి తుక్కుగూడ సమీపంలో కేఎల్ఆర్ అక్బర్ ఫాం హౌస్‌లోని ఇంట్లో, ఆయన సొంత గ్రామమైన రంగారెడ్డి జిల్లా మాసానిగూడ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో, చర్లపల్లి, మొయినాబాద్ ఫామ్ హౌసుల్లో, గచ్చిబౌలి ఎన్సీసీలోని విల్లాలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం ఐదు గంటలకు మూడు ప్రైవేటు వాహనాల్లో ఐటీ అధికారులు కేఎల్ఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి. కొద్దిపాటి నగదు సహా కీలక డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది. కేఎల్ఆర్ పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం అందడంతో పాటు, ఆదాయం, పన్ను చెల్లింపుల్లో భారీ వ్యత్యాసం కనిపించడం, ఆయన వ్యాపార లావాదేవీలకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. ఆ సమయంలో పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి ఇంట్లో లేరు. పారిజాత తిరుపతికి వెళ్లగా, నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నట్టు తెలిసింది. ఇంట్లో ఉన్న కుమార్తె నుంచి మొబైల్ ఫోన్‌ను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. పారిజాత, నర్సింహారెడ్డికి సమాచారం ఇచ్చారు. ఇంట్లో లభించిన బ్యాంక్ పాస్‌బుక్కులు, డాక్యుమెంట్లను పరిశీలించారు. మరోవైపు కొందరు అధికారులు మేయర్‌ను తిరుపతిలో అదుపులోకి తీసుకుని చెన్నై మీదుగా సాయంత్రానికి నగరానికి తీసుకొచ్చారు. సాయంత్రం 4.56కు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన నర్సింహారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని ఇంటికి తీసుకువచ్చి విచారణ మొదలుపెట్టారు. గత కొంతకాలంగా వారు చేసిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంత నగదుతో పాటు కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్లు సమాచారం. కాగా మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారిలో పారిజాత కూడా ఉన్నారు. మహేశ్వరం టికెట్ కోసం భారీ ఎత్తున లాబీయింగ్ జరగడంతో కేఎల్ఆర్, పారిజాతల ఆర్థిక లావాదేవీలపై ఐటీ నిఘా పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కోకాపేట హిడెన్ గార్డెన్లో.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎంపీపీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ గిరిధర్‌రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. హైదరాబాద్ కోకాపేటలోని హిడెన్ గార్డెన్లో ఆయన నివాసం ఉంటున్నారు. గిరిధర్ రెడ్డి గత కొంతకాలంగా చేసిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలిసింది. మరోవైపు బాలాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు కొనసాగాయి. ఈ సమయంలో లక్ష్మారెడ్డితో పాటు కుటుంబసభ్యులు.. లక్ష్మారెడ్డి అన్న కొడుకు 3 రోజుల క్రితం మరణించడంతో అస్తికలు గంగలో కలిపేందుకు బయలుదేరుతున్నారు. దీంతో లక్ష్మారెడ్డితో కొద్దిసేపు మాట్లాడిన అధికారులు ఓ కాగితంపై సంతకం తీసుకుని ఆయన బయటకు వెళ్లేందుకు అనుమతించినట్లు తెలిసింది. రాజకీయ కక్షలో భాగంగానే..: కేఎల్ఆర్ ♦ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన ఇల్లు, కార్యాలయాలు, తన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని కేఎల్ఆర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి కుట్రపన్ని ఐటీ దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ తనకు కేటాయించిన తరువాత, ఉద్దేశపూర్వకంగా ఈ సోదాలు చేస్తున్నారని చెప్పారు. మంత్రి సబిత ప్రోద్బలంతోనే..: మేయర్ పారిజాత కాంగ్రెస్ పార్టీ బీ ఫాం కోసం ఎదురు చూస్తున్నా. ఈ సమయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ఐటీ రైడ్స్ చేస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోంది. మంత్రిగా ఆమె వేల కోట్లు సంపాదించారు. ఎన్నో ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. ఆమె ఇంటిపై దాడులు చేయకుండా కేవలం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నాపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం?. -
మహామహులకు పట్టంకట్టిన నల్లగొండ
నల్లగొండ: ఉద్యమాలకు పురిటిగడ్డ నల్లగొండ. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకుని.. తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించిన చరిత్ర నల్లగొండది. కాకతీయుల కాలం నాటి శిల్ప సంపదతో పానగల్ దేవాలయాలు ప్రసిద్ధిచెందాయి. ప్రస్తుతం విద్య, వైద్య రంగాల్లో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ ద్వారా వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. నాగార్జున డిగ్రీ కళాశాలకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల ఏర్పాటు చేసింది. ధాన్య భాండాగారంగా.. నల్లగొండ ధాన్య భాండాగారంగా మారింది. ఒక నాడు తాగునీటికే ఇబ్బందులు ఉండేవి. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నప్పటికీ స్థానికంగా నివాసం ఉండేందుకు ఇష్టపడకపోయేవారు. కృష్ణా జలాలు నల్లగొండకు రావడం, ఆ పరిసర గ్రామాల్లో చెరువులు నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగాయి. పానగల్ ఉదయ సముద్రం నుంచి నల్లగొండ పట్టణంతో పాటు ఉమ్మడి జిల్లాలోని పలు మండలాలకు కృష్ణా జలాలు అందుతున్నాయి. చెరువులను నింపడం వల్ల భూగర్భ జలాలు పెరిగి సాగు కూడా పెరిగింది. వరి దిగుబడిలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా మొదటిస్థానంలో ఉండగా.. అందులో నల్లగొండ నియోజకవర్గంలోనే అత్యధిక వరి సాగైంది. ఈ నల్లగొండ నియోజకవర్గంలో బత్తాయి సాగు కూడా అధికంగానే ఉంది. ఏడుసార్లు కాంగ్రెస్ విజయం.. నల్లగొండ నియోజక వర్గం 1952లో ఏర్పడింది. ఆనాటి నుంచి ఒక ఉప ఎన్నికతో పాటు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ మూడుసార్లు, పీడీఎఫ్ రెండుసార్లు గెలుపొందాయి. సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కోసారి గెలిచారు. నల్లగొండ నియోజకవర్గం గతంలో ఐదు మండలాలతో కలిపి ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో నల్లగొండ పట్టణంతో పాటు నల్లగొండ, కనగల్, తిప్పర్తి మండలాలతో నియోజకవర్గం ఏర్పడింది. కోమటిరెడ్డిదే రికార్డు.. నల్లగొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. ఈ సెగ్మెంట్ నుంచి ఈయన ఒక్కరే హ్యాట్రిక్ సాధించారు. 1999 నుంచి 2014 వరకు వరుసగా గెలిచి రికార్డు నెలకొల్పారు. చకిలం శ్రీనివాసరావు, గుత్తా మోహన్‌రెడ్డిలు రెండు పర్యాయాల చొప్పున విజయం సాధించారు. ఇద్దరు మంత్రులు నల్లగొండ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారిలో ఇద్దరు మంత్రులుగా పనిచేశారు. ఒకరు గుత్తా మోహన్‌రెడ్డి, మరొకరు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. నాదెండ్ల భాస్కర్‌రావు కేబినేట్లో గుత్తా మోహన్‌రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వైఎస్సార్ మంత్రివర్గంలో, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో కూడా పనిచేశారు. ఎన్టీ రామారావు గెలుపు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కూడా నల్లగొండ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1985 ఎన్నికల్లో ఎన్టీఆర్ రాష్ట్రంలో మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. అందులో నల్లగొండ కూడా ఉంది. మూడు చోట్ల నుంచి కూడా గెలుపొందిన ఎన్టీఆర్.. నల్లగొండ స్థానానికి రాజీనామా చేశారు. అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ నుంచి గడ్డం రుద్రమదేవి పోటీచేసి గెలుపొందారు. నల్లగొండ నియోజకవర్గంలో గెలుపొందిన ఎమ్మెల్యేలు వీరే.. -
ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనం
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనమని టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ పేర్కొన్నారు. నల్లగొండ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు. దొరల తెలంగాణ కోసం బీఆర్ఎస్, ప్రజల తెలంగాణ కోసం కాంగ్రెస్ అని పైకి చెబుతున్నప్పటికీ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న భూస్వామ్య పోకడలకు ఇటీవలి పరిణామాలు అద్దం పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి పదవి ఇచ్చి గౌరవం ఇచ్చినప్పటికీ నల్లగొండ జిల్లాలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విపరీత ప్రవర్తనను నిలువరించడంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని తెలిపారు. ఉత్తమ్, జానారెడ్డి కూడా ఈ ప్రయత్నం చేయకపోవడంతో కోమటిరెడ్డి మరింత చెలరేగిపోయారని ఇలాంటి పరిస్థితుల్లో మెరుగ్గా ఉన్న రాజకీయ వేదిక వెతుకులాటలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న దాడిని నిలువరించకపోగా నల్లగొండలో జరిగిన సభలో కోమటిరెడ్డిని కొండా లక్ష్మణ్ బాపూజీ వారసుడిగా పోల్చడం ద్వారా తమను అవమానపరిచారని పేర్కొన్నారు. వెక్కిరించినట్లు మాట్లాడారు: ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 55 మంది అభ్యర్థుల్లో 12 బీసీలకు కేటాయించారని, అయినా కోమటిరెడ్డి 12 సీట్లు ఇచ్చామంటూ వెక్కిరించినట్లుగా మాట్లాడు తున్నారని సుధాకర్ తన రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా నేపథ్యంలో ఆయనను ఉద్దేశించి మాట్లాడిన తీరు యావత్ తెలంగాణను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. తనతో కలిసి ప్రయాణించిన వారికి ఈ లేఖలో కృతజ్ఞతలు తెలిపారు. కాగా, చెరకు సుధాకర్‌తో ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డిలు చర్చలు జరిపారని, శని, ఆది వారాల్లో ఆయన బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఎమ్మెల్యేలయ్యారు.. ఎంపీలూ అయ్యారు!
నల్గొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొందరు నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా విజయం సాధించి పదవులకు వన్నె తెచ్చారు. ఏ పదవిలో ఉన్నా తమను ఎన్నుకున్న ప్రజలకు సేవే లక్ష్యంగా ముందుకు సాగారు. కొందరు నాయకులు ముందు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ఎంపీలుగా గెలిచారు. మరికొందరు ముందు ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా విజయం సాధించారు. రావి నారాయణరెడ్డి మాత్రం తొలి ఎన్నికల్లోనే ఎంపీగా, ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు సృష్టించారు రావి నారాయణరెడ్డి : 1952 ఎన్నికల్లో పీడీఎఫ్ తరఫున భువనగిరి ఆసెంబ్లీ, నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి రావి నారాయణరెడ్డి రెండు చోట్ల విజయం సాధించారు. ఆ వెంటనే భువనగిరి ఆసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. అనంతరం 1957లో భువనగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1962లో మరోసారి నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. మొదటిసారి ఎంపీగా గెలిచినప్పుడు దేశంలో అత్యధిక మెజార్టీ సాధించడంతో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రావి నారాయణరెడ్డికి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. పార్లమెంట్ నూతన భవనాన్ని రావినారాయణరెడ్డి చేత ప్రారంభించారు. బొమ్మగాని ధర్మభిక్షం : సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1952లో ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మభిక్షం, 1962లో నల్లగొండ నుంచి, 1967లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1991, 1996లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. పేదవర్గాల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడే నాయకునిగా ఆయనకు జనం మదిలో నిలిచిపోయారు. భీంరెడ్డి నర్సింహారెడ్డి : 1957లో సూర్యాపేట, 1967లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన భీంరెడ్డి నర్సింహారెడ్డి.. 1984, 1991లో రెండు సార్లు మిర్యాలగూడ ఎంపీగా ఎన్నికయ్యారు. పీడిత ప్రజల సమస్యలు, భూపోరాటలతో ఆయన జీవితం ప్రజాసేవకే అంకితమైంది. చకిలం శ్రీనివాసరావు : నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన చకిలం శ్రీనివాసరావు 1967, 1972 నల్లగొండ నుంచి రెండు సార్లు, 1983లో మిర్యాలగూడెం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. ఎం.రఘుమారెడ్డి : టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చిన మల్రెడ్డి రఘుమారెడ్డి 1984లో నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. అనంతరం 1989లో నల్లగొండ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం ప్రభంజనంలో గెలిచిన ఆయన ప్రజలకు చేరువయ్యారు. రవీంద్రనాయక్ : గిరిజన నాయకుడు రవీంద్రనాయక్ 1978, 1983లో దేవరకొండ ఎమ్మెల్యేగా గెలిచారు. భవనం వెంకట్రామ్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఈయన కొంతకాలం క్రియాశీలక రాజకీయలకు దూరంగా ఉన్నారు. 2004లో వరంగల్ ఎంపీగా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి : నల్లగొండ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు విజయం సాధించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆ వెంటనే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సా«ధించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి : కోదాడ, హూజూర్నగర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేసిన కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా విజయం సాధించారు. పాల్వాయి గోవర్దన్‌రెడ్డి : మునుగోడు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు 1967, 1972, 1978, 1983, 1999లో ఎమ్మెల్యేగా గెలిచిన పాల్వాయి గోవర్దన్‌రెడ్డి రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. -
24 గంటల కరెంటు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ మోసం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టాడని, ఆయన హామీ నమ్మి లక్షల ఎకరాల్లో పంటలు వేస్తే ఎండిపోతున్నాయని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతాంగానికి 14 గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు తాను సవాల్ విసురుతున్నానని, ఏ సబ్‌స్టేషన్ వద్దకు రమ్మంటారో చెపితే వస్తానని, అక్కడ 24 గంటలు కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా, వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయనన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉండే ఈ నెలరోజుల పాటైనా రైతులకు 24 గంటల పాటు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఎన్ని స్కీములు పెట్టినా జనం నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో తమ కాంగ్రెస్ పథకాలు ఎలా అమలవుతున్నాయో చూసేందుకు బీఆర్ఎస్ నేతలు వస్తానంటే ప్రత్యేక విమానం పెట్టి తీసుకెళ్తామని, మంత్రివర్గం వచి్చనా ఫర్వాలేదన్నారు. పథకాల అమలును వివరించేందుకు సీఎం కేసీఆర్ రావాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఆహా్వ నించాలని కోరుతానని చెప్పారు. తుంగతుర్తి ఎమ్మెల్యే అకౌంట్లోకే రూ.60 కోట్లు దళిత బంధు పథకానికి సంబంధించిన ఒక్క తుంగతుర్తి ఎమ్మెల్యే అకౌంట్లోకే రూ. 60 కోట్లు వెళ్లాయని కోమటిరెడ్డి ఆరోపించారు. దళితబంధులో బీఆర్ఎస్ నేతలు దోచుకున్న సొమ్ముతోనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయవచ్చని చెప్పారు. అధికారంలోకి వచి్చన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీ స్కీంలను అమలు చేస్తామనీ, అమలు చేయలేకపోతే దిగిపోతామన్నారు. బాబు అరెస్టు ఎపిసోడ్ ఫాలో కావడం లేదు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్‌ను తాను ఫాలో కావడం లేదని కోమటిరెడ్డి వ్యాఖ్యా నించారు. టీవీ చూస్తున్నప్పుడు ఆ వార్తలు వస్తు న్నా చానల్ మారుస్తున్నానని, తమ బాధలు తమకున్నాయని, తెలంగాణలో అధికారం దక్కించుకోవడమెలా అనే దానిపైనే దృష్టి పెట్టినట్లు చెప్పా రు. తాను 30 స్థానాల్లో గెలిపించడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు ఎలా తీసుకురావాలన్న దానిపైనే ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌లోకి చేరికలపై మాట్లాడుతూ పార్టీ అంతర్గత వ్యవహారాలను బయట మాట్లాడబోనని, వచ్చే నెల 1న ఢిల్లీలో జరిగే సమావేశంలోనే అన్ని విషయాలను మాట్లాడుతానని వెల్లడించారు. -
35 మందితో కాంగ్రెస్ తొలి జాబితా!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం వేగంగా సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ నెలాఖరులోగా అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తొలి విడతలో బలమైన, ముఖ్యమైన అభ్యర్థులతో ఏకాభిప్రాయం ఉన్న 30–35 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తొలి జాబితాలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీతక్క, పొదెం వీరయ్య, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, జీవన్‌రెడ్డి, జి.వినోద్, షబ్బీర్‌అలీ, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, ఫిరోజ్‌ఖాన్, ప్రేమ్‌సాగర్‌రావు, అంజన్‌కుమార్ యాదవ్, పద్మావతిరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వంశీకృష్ణ తదితరులు పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అక్టోబర్ రెండో వారానికి పూర్తి జాబితా... అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌లో తొలి భేటీ జరిపిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ వార్‌రూమ్‌లో రెండో భేటీ నిర్వహించింది. కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఇతర కార్యదర్శులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా 8 గంటల పాటు జరిగిన ఈ భేటీలో 119 నియోజకవర్గాల నుంచి షార్ట్‌లిస్ట్ చేసిన 300 పేర్లపై చర్చించారు. అందులో ఒకే అభ్యర్థి ఉన్న స్థానాలు 30–35 వరకు ఉండగా.. రెండేసి పేర్లున్న స్థానాలు 20–30, ముగ్గురి చొప్పున ఉన్నవి 30–35, నలుగురు, ఆపైన పోటీపడుతున్న స్థానాలు 10–15 వరకు ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో ఒకే అభ్యర్థి ఉన్న జాబితాకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తీసుకుని.. ఈ నెలాఖరులోగా ప్రకటించాలని నిర్ణయించినట్టు సమాచారం. అక్టోబర్ తొలివారంలో రెండో జాబితా, రెండో వారంలో తుది జాబితా ప్రకటించాలని యోచనకు వచ్చినట్టు తెలిసింది. వరుసగా మూడుసార్లు ఓడిన నేతలకు టికెట్లు ఇవ్వకూడదని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. ఇలాంటి నియోజకవర్గాలు 6 నుంచి 8 వరకు ఉన్నట్టు సమాచారం. సర్వేల ఆధారంగా.. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తాము చేసిన సర్వేల నివేదికను అందజేసినట్టు తెలిసింది. ఇద్దరు, ముగ్గురు, అంతకన్నా ఎక్కువ మంది పోటీపడుతున్న స్థానాల్లో ఎవరెవరికి ఎంత శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయ న్న వివరాలను అందజేసినట్టు సమాచారం. దీనిని పరిగణనలోకి తీసుకున్న కమిటీ నేతలు.. అందులో నియోజకవర్గాల వారీగా 35 శాతానికిపైగా గెలుపు అవకాశాలున్న నేతల పేర్లను పరిగణనలోకి తీసుకుంటూ షార్ట్ లిస్ట్ సిద్ధం చేసినట్టు తెలిసింది. మరోవైపు బీజేపీ నుంచి చేరికలు ఉంటాయన్న అంశం కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చింది. అలా చేరే అవకాశమున్న స్థానాలకు అభ్యర్థుల ప్రకటనను వారం పాటు పెండింగ్‌లో పెట్టాలని అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. టికెట్ దక్కని నేతలకు హామీలు! టికెట్ ఆశించి దక్కని నేతలకు వారి ప్రాధాన్యాన్ని బట్టి నేరుగా హైకమాండ్ పెద్దలతో పార్టీ, ప్రభుత్వ పదవులపై హామీలు ఇప్పించాలని స్క్రీనింగ్ కమిటీ భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ పదవులతోపాటు పారీ్టలో ప్రాధాన్యం కలి్పంచే విషయాన్ని పార్టీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీలతో చెప్పించనున్నారని సమాచారం. కాగా, టికెట్ ఆశిస్తున్న కొందరు నేతలు ఢిల్లీకి వెళ్లి అక్కడే మకాం వేసి ముఖ్య నేతలను ప్రస న్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 6 చోట్ల ప్రాధాన్యత కోరిన పొంగులేటి! స్క్రీనింగ్ కమిటీ భేటీ ముందు ఠాక్రే, రేవంత్, ఉత్తమ్, భట్టిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై తన అభి ప్రాయాలను నేతలకు పొంగు లేటి వివరించి నట్టు తెలిసింది. ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక నియోజ కవర్గాల్లో తన వర్గం నేతలకు అవకాశం ఇవ్వా లని ఆయన కోరినట్టు సమాచారం. తనతో పాటు పార్టీలో చేరిన తుడి మేఘారెడ్డికి వన పర్తిలో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదించి నట్టు తెలిసింది. సర్వేలతో పోల్చి చూసి ఖరారు చేస్తామని ఠాక్రే హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
కేసీఆర్ మాటలన్నీ అబద్ధాలే
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాల పేరిట సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. పథకాల విషయంలో కేసీఆర్ చెప్తున్నవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. ‘‘రైతుబంధు అందరికీ ఇవ్వలేదు.. 24 గంటల కరెంటు అంతా ఉత్తిమాటే.. అందరికీ ఇళ్లు కూడా వట్టిమాటలే.. దళితులకు మూడెకరాల భూమి అని మోసం చేశారు. ఇక ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావ్ కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చినప్పుడే కేసీఆర్ దుకాణం బంద్ అయింది. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు సరిగా నిర్వహించలేని ప్రభుత్వం, ఉద్యోగ అర్హత పరీక్షల పేపర్లు లీక్ చేసే ప్రభుత్వం ఉంది. ఈ కుంభకోణాల ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది..’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు కావస్తోందని గుర్తు చేశారు. 2014లో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి స్వాతంత్య్రం ఇస్తే.. ఇప్పుడు కేసీఆర్ అవినీతి పాలననుంచి విముక్తి కల్పించేందుకు మరోసారి తెలంగాణ గడ్డకు వచ్చారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని.. అందుకోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి ఆమెకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో వంద సీట్లలో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. -
కాంగ్రెస్ గెలిస్తే.. 4కోట్ల మంది విజయం
నల్లగొండ రూరల్/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో 4కోట్ల మంది ప్రజలు గెలిచినట్లని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం నల్లగొండలో నియోజకవర్గ బూత్ ఇన్చార్జిలు, ముఖ్యనాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సమావేశానంతరం వెంకట్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. 76 నుంచి 80 సీట్లలో విజయం సాధించి మరో 90 రోజుల్లో అధికారంలోకి రాబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో కొత్తగా ఎవరినీ కాంగ్రెస్‌లో చేర్చుకోవడం లేదని, ఉన్న వారికే సీట్లు లేవని స్పష్టం చేశారు. వచ్చే నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామన్నారు. దళిత బంధుపై హైకోర్టులో పిటిషన్ వేశామని, గురువారం రిజిస్టర్ అవుతుందని తెలిపారు. హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని కోరారు. తాను నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కోమటిరెడ్డి చెప్పారు. ఒకటో తేదీనే జీతాలిస్తాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండే ఈ కొద్దినెలలైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలివ్వాలని కోరుతూ ఆయన బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. -
తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర ఒక్క శాతమే..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయని తెలిసే తెలంగాణ ప్రకటించారని, సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారంటే భారతదేశానికి బ్రిటిష్ వారు స్వాతంత్య్రం ఇచ్చారని చెప్పినంత దరిద్రంగా ఉంటుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడారో కేటీఆర్ తెలుసుకుని మాట్లాడాలని, పనికిమాలిన మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు. సోనియా లేకపోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదని, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజమని నాడు కేసీఆర్ ఆన్ రికార్డు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఎంపీ కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే తెలంగాణ కావాలని.. ‘మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ. వైఎస్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నాతో సహా 41 మంది ఎమ్మెల్యేలం తెలంగాణ కావాలని అడిగినందుకే ప్రణబ్‌ముఖర్జీ కమిటీ వేశారు. అప్పుడు కేటీఆర్ రాజకీయాల్లో లేడు. అమెరికాలో ఉన్నాడు. ఆ తర్వాత కేసీఆర్‌కు చంద్రబాబు మంత్రిపదవి ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తగదు. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఊరుకోం.’ అని కోమటిరెడ్డి హెచ్చరించారు. వాళ్లకు టికెట్లు క్యాన్సిల్ చేయండి కట్టె పట్టుకుని తెలంగాణ ఉద్యమకారులను కొట్టిన దానం నాగేందర్, కేసీఆర్‌ను ఫుట్బాల్లా తంతానన్న తలసాని శ్రీనివాస్‌యాదవ్, పట్నం మహేందర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ... ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టా చాలా ఉందని, ఈ మంత్రులను ముందు కేబినెట్ నుంచి తొలగించి, తెలంగాణ ఉద్యమ ద్రోహులకు ఇచ్చిన టికెట్లను క్యాన్సిల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బానిసత్వ పార్టీ ఎవరిదో అందరికీ తెలుసునని, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి మహమూద్‌అలీలు ప్రగతిభవన్ వరకు వస్తే 100 కిలోమీటర్ల స్పీడ్‌తో వెనక్కు పంపింది ఎవరని ప్రశ్నించారు. ప్రగతిభవన్ లోపలికి రానివ్వకపోతే ఏడ్చానని రాజేందర్ చెప్పారని గుర్తు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు సర్పంచ్ కూడా ఆయనను సులువుగా కలవగలిగేవారని చెప్పారు. ఎన్నికల ఆలస్యంపై కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం రాష్ట్రంలో ఎన్నికలు ఆలస్యమవుతాయని, ఫిబ్రవరి వరకు తీసుకెళ్తారని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పద మని కోమటిరెడ్డి చెప్పారు. బీజేపీతో అమిత్‌షాతో భేటీ అయి కవితను జైలుకు పంపవద్దని ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇప్పుడు ఆయన ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తాయని చెప్పకపోతే తమకు తెలియదా? అని వ్యాఖ్యానించారు. -
15– 20 గంటల కరెంట్ నిరూపిస్తే రాజీనామా
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): రాష్ట్రమంతటా విద్యుత్ కోతలు ఉన్నాయని, ఎక్కడైనా 15–20 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ చేశారు. విద్యుత్ కోతలపై వివరాలు తెలుసుకునేందుకు తాము భువనగిరి పరిధిలోని ఓ సబ్‌స్టేషన్‌లో లాగ్‌బుక్‌ను తీసుకుంటే, ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఉన్న అన్ని సబ్స్టేషన్లలోని లాగ్ బుక్‌లను తీసేసుకుందని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులను నమ్ముకున్నారని, తాము మాత్రం ప్రజలను నమ్ముకున్నామని చెప్పారు. శుక్రవారం సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలలో రహదారులు మాత్రమే అభివృద్ధి చెందాయని, ప్రజలు మాత్రం అభివృద్ధి చెందలేదని కోమటిరెడ్డి విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని బతకలేని తెలంగాణగా మార్చారన్నారు. ఎన్నికల కోసం దళితబంధు, బీసీ బంధులను ప్రకటిస్తూ సొంత పారీ్టకి చెందిన వారి కుటుంబసభ్యులకే లబ్ధి చేకూరుస్తున్నారని, ఈ బంధులతో కేసీఆర్ దుకాణం బంద్ అవుతుందని చెప్పారు. హోంగార్డు రవీందర్ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. కాంగ్రెస్‌లో అసంతృప్తి లేదు కాంగ్రెస్‌లో ఎలాంటి అసంతృప్తి లేదని కోమటిరెడ్డి అన్నారు. పదవులు తనకు కొత్తకాదని వ్యాఖ్యానించారు. 17న కొంగరకలాన్‌లో జరిగే కాంగ్రెస్ సభలో కర్ణాటక తరహాలో ఐదు గ్యారంటీ పథకాలను సోనియాగాంధీ ప్రకటించనున్నట్లు తెలిపారు. -
రూ.2 లక్షల రుణమాఫీపైనే మొదటి సంతకం
నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు సంబంధించిన రూ.2 లక్షల రుణమాఫీపైనే మొదటి సంతకం పెడతామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరు సీఎంగా ఉన్నా.. తాను కీలకంగా వ్యవహరించి రుణమాఫీ చేయిస్తానని హామీఇచ్చారు. నల్లగొండ మండలం వెలుగుపల్లి గ్రామంలో వివిధ పార్టీ లకు చెందిన 200 మంది శనివారం ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గతంలో నల్లగొండను దత్తత తీసుకుంటానని చెప్పి ఎలాంటి అభివృద్ధి పనులూ చేయలేదని విమర్శించారు. నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప కొత్తగా ఏమీ కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం ఎక్కడ కూడా 14 గంటల కన్నా ఎక్కువ విద్యుత్ సరఫరా కావడం లేదని చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయని రాష్ట్రంలో భూములు అమ్మడంతో పాటు వైన్‌షాపులకు ముందస్తుగానే టెండర్లు వేసి వచ్చిన డబ్బులను సీఎం కేసీఆర్ తమ ఖాతాలో జమ చేసుకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తనను నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లను గెలుచుకుంటామని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కోమటిరెడ్డి స్పష్టంచేశారు. కార్యక్రమంలో నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, వెలుగుపల్లి మాజీ సర్పంచ్ జూలకంటి వెంకట్‌రెడ్డి, నాయకులు చెల్ల పద్మారెడ్డి, బ్రహ్మచారి, చెలక సైదిరెడ్డి, ఎం.రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ 115 మంది ఆస్తుల లెక్కలు తీయండి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల ఆస్తుల లెక్కలు తీయాలని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ వివరాలను సేకరించి ప్రజల ముందుంచాలని చెప్పారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ టూర్లో భాగంగా కర్ణాటకలోని కూర్గ్‌లో ఉన్న ఆయన మంగళవారం ఈమేరకు స్పందించారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ ప్రశి్నస్తున్నారని, కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్ నుంచి అని గుర్తుచేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, కల్వకుర్తి, శ్రీరాంసాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సేనని, 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో పింఛన్లు ఒకటో తేదీకల్లా ఇచ్చామని, బీఆర్ఎస్ హయాంలో మాత్రం 15వ తేదీకి కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. విశ్వవిద్యాలయాల్లో కనీసం బాత్రూంలు కట్టించలేని ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని అని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టిన కేసీఆర్‌కు కాంగ్రెస్ గురించి ప్రశ్నించే హక్కు లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో 32 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఓట్ల కోసం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేస్తోందని చెప్పారు.