
నల్లగొండ: సీఎం కేసీఆర్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం పట్టుకుందని, అందుకే అడ్డదారిన అధికారంలోకి వచ్చేందుకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఎలాగైనా గెలిచేందుకు సీఎం, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఎక్కడ ఓడితే అక్కడి మంత్రులను తొలగిస్తానని, ఎమ్మెల్యేలకు వచ్చేసారి టికెట్ ఇవ్వనంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండలో ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేశారని, అయితే ప్రజలు తేరుకొని పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇవే ఫలితాలు రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో రాబోతున్నాయని పేర్కొన్నారు. నల్లగొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment