నూతనకల్ (సూర్యాపేట)/శాలిగౌరారం(నల్లగొండ): బీజేపీలో బీఆర్‌ఎస్ పార్టీ విలీన ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఎప్పుడైనా విలీనంకాక తప్పదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో పదవులు అనుభవించిన వారంతా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారన్నారు.
చత్తీస్‌గఢ్ నుంచి విద్యు త్ కొనుగోలులో, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలో రూ.10వేల కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నాయకులు తమ అవినీతి, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీలో బీజేపీ నాయకులతో అంటకాగుతూ చర్చలు జరుపుతున్నారని చెప్పారు.
బీఆర్‌ఎస్ మెడకు ఫోన్ ట్యాపింగ్ కేసు
బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్.. నేడు ఆ పార్టీ మెడకే చుట్టుకుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అంతకుముందు నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామంలో ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో శనివారం విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, నోటుబుక్స్ పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment