
వారిని ఎర్రగడ్డ హాస్పిటల్‌కు పంపించాలి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్‌ఎస్ నేతలకు మెంటలెక్కింది. మైండ్ పనిచేయడంలేదు. వారిని ఎర్రగడ్డ హాస్పిటల్‌కు పంపించాలి’అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘పదేళ్లలో కేసీఆర్ చెప్పిన అబద్ధాలకు అసలు శిక్షలే సరిపోవు. కేసీఆర్ పదిలక్షల అబద్ధాలు ఆడారు. ఆయన మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలి. దళితుడిని సీఎం చేయకపోతే తల తీసుకుంటా అన్నారు. కేసీఆర్‌ను తలతీసి ఇవ్వమని అడగాలి.
లేదంటే రాజకీయాల నుంచి తప్పుకోమని చెప్పాలి’అని కోమటిరెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. సభలో హరీశ్‌రావు వేసిన ప్రశ్నే తప్పని, ఏడేళ్లపాటు నారపల్లి బ్రిడ్జి కట్టలేక పోయిన బీఆర్‌ఎస్ నేతలా తనపై విమర్శలు చేసేది అని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్నా పవర్ లేని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అని వ్యాఖ్యానించారు. ‘నల్లగొండలో రోడ్లు అభివృద్ధి చేశామన్న ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలు తప్పు.
మా ప్రభుత్వంలో చేసిన పనులు బీఆర్‌ఎస్ వాళ్లు తమ ప్రభుత్వంలో చేసినట్టు చెప్పుకుంటున్నారు’అని కోమటిరెడ్డి అన్నారు. ‘మామ చాటు అల్లుడు హరీశ్‌రావు. తండ్రి పేరు చెప్పి కేటీఆర్ వచ్చారు. మేము కష్టపడి వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చాము. నేను స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా పనిచేశాను. 1987లో నేను ఎన్‌ఎస్‌యూఐ లీడర్‌ను’అని పేర్కొన్నారు. ‘బీఆర్‌ఎస్ వాళ్లు హౌలాగాళ్లు.. వాళ్లకు ధరణితో దోచుకుతినడం తప్ప ఏమీ తెల్వదు’అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment