erragadda hospital
-
కరోనా మానసిక సమస్యలకు ఓపీ
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితుల మానసిక ఆరోగ్యంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారిలో తలెత్తే మానసిక సమస్యలను పరిష్కరించేందుకు అన్ని బోధనా, జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక ఓపీని నిర్వహిస్తున్నామని వెల్లడించింది. ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయాన్ని నోడల్ కేంద్రంగా ప్రకటించింది. మానసిక బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్, వైద్య సేవలందించడానికి వైద్యులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జనరల్ ఫిజీషియన్లు కూడా వీటిపై దృష్టిసారించారు. మెరుగైన సేవలందించాలని భావిస్తే మానసిక వైద్యులున్న ఆస్పత్రులకు తరలిస్తున్నారు. తొమ్మిది ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 21 మంది సైకియాట్రిస్టులు, 42 మంది సీనియర్ రెసిడెంట్లు బాధితులకు సేవలందించడంలో కృషిచేస్తున్నారని అధికారులు వెల్లడించారు. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ఆస్పత్రుల్లోనూ 21 మంది మానసిక వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా బాధితుడి అనారోగ్యం, మానసిక స్థితిగతుల గురించి ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా తెలియజేస్తున్న ట్లు అధికారులు తెలిపారు. కోలుకున్న తర్వాత ఇం టి వద్ద కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో రోగులకు, వారి కుటుంబ సభ్యులకు వివరిస్తున్నా రు. మద్యం అలవాటు ఉన్నవారిలో విపరీతమైన ఆందోళన, మళ్లీ మద్యం తీసుకోవాలనే బలమైన కోరికలున్నప్పుడు వాడాల్సిన మందులు, జాగ్రత్తల ను వివరిస్తున్నారు. లక్షణాలు తీవ్రమైతే సమీపం లోని మానసిక వైద్యుడిని కలవాల్సిన పరిస్థితులపై ముందే రోగికి, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మానసిక సమస్యలకు చికిత్స అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. -
ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఖైదీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: చంచల్‌గూడ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన కుమ్మరి సత్యం అలియాస్ చిన్న సత్యంకు ఓ హత్య కేసులో పూనె కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతనికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేర్చారు. ఈ క్రమంలో అతను బాత్రూంలో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. గత నెల 29న కూడా ఇతనికి ఇక్కడ చికిత్స చేయించారు. కాగా, గత ఏడాది మార్చి 9న మహారాష్ట్ర కోర్టు ఇతనికి జీవిత ఖైదు విధించింది. -
ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి హీరో ఉదయ్ కిరణ్
పబ్‌పై దాడి కేసులో అరెస్టయిన 'ఫేస్బుక్' సినిమా హీరో ఉదయ్‌కిరణ్‌ను ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో.. వెంటనే పిచ్చాసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించాలని జడ్జి ఆదేశించారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న ఉదయ్‌కిరణ్ బుధవారం కోర్టులో విచారణకు హాజరయ్యాడు. అయితే విచారణ సందర్భంగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా అతడు రోజుకో రకంగా ప్రవర్తిస్తున్నాడని జైలు అధికారులు తెలిపారు. దాంతో వెంటనే అతడిని మానసిక వైద్యులకు చూపించి.. వారి నుంచి సమగ్ర నివేదిక తీసుకోవాలని జడ్జి ఆదేశించారు. తనను పబ్‌లోకి అనుమతించడం లేదన్న ఆగ్రహంతో అద్దాలు ధ్వంసం చేసి, లోపల నగ్నంగా నృత్యాలు చేసిన కేసులో ఉదయ్‌కిరణ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు గతంలో అరెస్టు చేశారు. మార్చి 23వ తేదీ రాత్రి అతడు ఓవర్ ద మూన్ పబ్‌కి వెళ్లగా.. గతంలో జరిగిన గొడవలు దృష్టిలో పెట్టుకొని బౌన్సర్లు అనుమతించలేదు. దీంతో అద్దాలు పగలగొట్టి కుర్చీలు విసిరేసి బీభత్సం సృష్టించాడు. అంతటితో ఆగకుండా పబ్‌లో బట్టలు విప్పేసి నగ్నంగా డ్యాన్స్ చేసి కలకలం సృష్టించాడు. ఈ ఘటనలో ఉదయ్‌కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. -
ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి ఖైదీల పరారీ యత్నం
ఎర్రగడ్డ మానసిక రోగుల ఆస్పత్రి నుంచి పారిపోయేందుకు అక్కడ చికిత్స పొందుతున్న ఖైదీలు మరోసారి ప్రయత్నించారు. ఇటీవలే కొందరు కరడుగట్టిన ఖైదీలు సహా మరికొందరు పారిపోవడం, వారందరినీ మళ్లీ పోలీసులు పట్టుకోవడం తెలిసిందే. ఈసారి కూడా పారిపోయే ప్రయత్నం చేసినవారిని ఆస్పత్రి సిబ్బంది గమనించడంతో వారి ప్రయత్నం విఫలమైంది. తాజాగా మంగళవారం రాత్రి ప్రాంతంలో కిటికీ గ్రిల్స్ తొలగించి కొంతమంది ఖైదీలు పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే... ఈ వార్డులో సాధారణంగా అండర్ ట్రయల్ ఖైదీలతో పాటు, శిక్షపడిన వాళ్లు కూడా ఉంటారు. అయితే పారిపోయే ప్రయత్నం చేసినవాళ్లు ఎవరన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.