ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి హీరో ఉదయ్ కిరణ్ | hero uday kiran shifted to erragadda hospital | Sakshi
Sakshi News home page

ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి హీరో ఉదయ్ కిరణ్

Published Wed, May 11 2016 6:33 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి హీరో ఉదయ్ కిరణ్ - Sakshi

ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి హీరో ఉదయ్ కిరణ్

పబ్‌పై దాడి కేసులో అరెస్టయిన 'ఫేస్‌బుక్' సినిమా హీరో ఉదయ్‌కిరణ్‌ను ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో.. వెంటనే పిచ్చాసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించాలని జడ్జి ఆదేశించారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న ఉదయ్‌కిరణ్‌ బుధవారం కోర్టులో విచారణకు హాజరయ్యాడు. అయితే విచారణ సందర్భంగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా అతడు రోజుకో రకంగా ప్రవర్తిస్తున్నాడని జైలు అధికారులు తెలిపారు. దాంతో వెంటనే అతడిని మానసిక వైద్యులకు చూపించి.. వారి నుంచి సమగ్ర నివేదిక తీసుకోవాలని జడ్జి ఆదేశించారు.

తనను పబ్‌లోకి అనుమతించడం లేదన్న ఆగ్రహంతో అద్దాలు ధ్వంసం చేసి, లోపల నగ్నంగా నృత్యాలు చేసిన కేసులో ఉదయ్‌కిరణ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు గతంలో అరెస్టు చేశారు. మార్చి 23వ తేదీ రాత్రి అతడు ఓవర్ ద మూన్ పబ్‌కి వెళ్లగా.. గతంలో జరిగిన గొడవలు దృష్టిలో పెట్టుకొని బౌన్సర్లు అనుమతించలేదు. దీంతో అద్దాలు పగలగొట్టి కుర్చీలు విసిరేసి బీభత్సం సృష్టించాడు. అంతటితో ఆగకుండా పబ్‌లో బట్టలు విప్పేసి నగ్నంగా డ్యాన్స్ చేసి కలకలం సృష్టించాడు. ఈ ఘటనలో ఉదయ్‌కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement