ఉదయ్ కిరణ్ కు రెస్ట్ ఇన్ పీస్ అంటూ మెసేజ్లు | Netizens share their grief on social media | Sakshi
Sakshi News home page

ఉదయ్ కిరణ్ కు రెస్ట్ ఇన్ పీస్ అంటూ మెసేజ్లు

Published Tue, Jan 7 2014 12:10 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

ఉదయ్ కిరణ్ కు రెస్ట్ ఇన్ పీస్ అంటూ మెసేజ్లు - Sakshi

ఉదయ్ కిరణ్ కు రెస్ట్ ఇన్ పీస్ అంటూ మెసేజ్లు

ఉదయ్ కిరణ్‌ చేసింది తప్పా రైటా? అనవసరంగా తొందరపడ్డాడా? ఇటువంటి మెసేజ్‌లతో ఫేస్‌బుక్‌ నిండిపోయింది. ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్న టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్‌ ఆత్మకు శాంతి చేకూరాలంటూ అందరూ పోస్ట్‌ చేశారు. ప్రతి ఒక్కరి స్టేటస్‌ ఇదే విషయంపై, అందరి ప్రొఫైల్స్‌లోనూ ఉదయ్ ఫొటోసే. చాలాకాలంగా సినిమాలు లేక ప్రేక్షకులకు దూరంగా ఉన్నా ... సోషల్ మీడియాలో సంతాపాలు వెల్లువెత్తాయి.  ట్విట్టర్, ఫేస్బుక్లో ఉదయ్ కిరణ్ రిప్ (RIP...rest in peace) అంటూ మెసేజ్లు ... అభిమనాన్ని, సానుభూతిని తెలియచేశారు. ఉదయ్ వి మిస్ యూ అంటూ ఫోటోలు, మెసేజ్లు పెట్టారు.

గత కొంత కాలంగా సినిమా అవకాశాలు లేక సతమతం అవుతున్న ఉదయ్ కిరణ్....ఆదివారం రాత్రి శ్రీనగర్ కాలనీనలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.   ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు, తన కెరీర్ ఆశాజనకంగా లేక పోవడమే కారణమని తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement