మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నాం: కోమటిరెడ్డి
నల్లగొండ: రైతులు పామాయిల్ సాగు చేస్తే.. మీసం మీద చేయి వేసుకుని దర్జాగా బతకొచ్చని వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. బుధవా రం నల్లగొండలోని ఎస్‌ఎల్‌బీసీ బత్తాయి మార్కె ట్‌లో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. పామాయిల్ పంట తక్కువ నీటితో సాగవుతుందని చెప్పారు. తాను వంద ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నానని.. మీరు మంత్రి కోమటిరెడ్డిని వెంటబెట్టుకుని వచ్చి
చూడవచ్చని రైతులకు సూచించారు. నల్లగొండ జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తే.. ఇక్కడే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని.. మిగిలిన రుణమాఫీని కూడా చేయా లని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం ఎటు పోయిందో.. ఎవరు తిన్నారో కూడా తెలియదని.. రూ.50 వేల కోట్ల అప్పులయితే ఉన్నాయని చెప్పా రు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినవారే ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని విమర్శించారు. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నా మని.. ఆ ధాన్యం కొనుగోలు చేసి రేషన్ కార్డు దారులకు, హాస్టళ్లకు బియ్యం సరఫరా చేస్తామ న్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మళ్లీ మంత్రిగా రావడంతోనే సొరంగ మార్గం పనులు మొద లయ్యాయని, ఆయన హయాంలోనే సొరంగ మార్గం పూర్తవుతుందని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేకపోయిందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment