75 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం | 75 lakh cotton seed packets made available: Tummala Nageswara Rao | Sakshi
Sakshi News home page

75 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం

Published Sat, Jun 1 2024 3:36 AM | Last Updated on Sat, Jun 1 2024 3:36 AM

75 lakh cotton seed packets made available: Tummala Nageswara Rao

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

సాక్షి, హైదరాబాద్‌: విత్తనాల సరఫరాను పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్లు విస్తృతంగా పర్యటించా లని, రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. గత ఏడాది పచ్చిరొట్ట విత్తన విక్ర యాలు 26,997 క్వింటాళ్లు ఉండగా.. ఈ ఏడాది 58,565 క్వింటాళ్లు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది 75 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అందు బాటులో ఉంచామని స్పష్టం చేశారు.

శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా ల కలెక్టర్లతో మంత్రి మాట్లాడి విత్తన పంపిణీపై ఆరా తీశారు. గతేడాది 1,000 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు పంపిణీ అయితే.. ఈ ఏడాది 1,800 క్వింటాళ్ల విత్తనాలు అందు బాటులో ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. రైతులు కోరుతున్న ఓ కంపెనీ పత్తి విత్తనాల విషయంలో 30 వేల ప్యాకెట్లు అదనంగా ఇవ్వడానికి ఆ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపారు. ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు సకాలంలో విత్తనాలు అందేలా చూస్తామని మంత్రికి వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement