నల్లగొండ రూరల్: సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, ఎన్నికల సమయంలో దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు పథకాలు పెడుతున్నాడని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ‘బంధు’పథకాలతో బీఆర్‌ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో బంద్ అవుతుందని చెప్పారు. నల్లగొండ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు శనివారం ఆయన కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు ప్రకటించి మాట్లాడారు.
భూ మండలం తలకిందులైనా ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్.. నేడు ఎన్నికల కోసం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంటున్నాడని విమర్శించారు. కేసీఆర్ మాట లకు, ఉత్తుత్తి జీవో కాపీలకు మోసపోవద్దని సూచించారు. గ్రామపంచాయతీ కారి్మకులు 30 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పారిశుధ్య పనులు చేపడితే వారికి సమాజం పాదాభివందనం చేసిందని, అలాంటి వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు.
మీరు పోరాటం ఆపొద్దని సమస్య పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటామని రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కారి్మకులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు కోమటిరెడ్డి చెప్పారు. ఏపీ సీఎం జగన్ అక్కడి ప్రజలకు వైద్యం ఖర్చు రూ.వెయ్యి దా టితే పెద్ద ఆస్పత్రిలో పూర్తి స్థాయి వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నారని కోమటిరెడ్డి చెప్పారు. వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment