Dalit Bandhu
-
HYD: ప్రజాభవన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రజాభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణలో దళితబంధుకు ఎంపికై డబ్బులు జమ కాని బాధితులు ప్రజావాణిలో భాగంగా ప్రజాభవన్ వద్ద చేరుకున్నారు. దాదాపు 500 మంది లబ్ధిదారులు తమకు న్యాయం చేయాలని ప్రజాభవన్ వద్ద ధర్నకు దిగారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. దళితబంధు నిధుల విడుదల జాప్యంపై లబ్ధిదారులు పోరుబాటపట్టారు. రెండో విడుత దళితబంధుకు ఎంపికైనవారి ఖాతాల్లో డబ్బులు వెంటనే జమచేయాలని డిమాండ్ చేశారు. ప్రజావాణిలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. ఈ సందర్బంగా దాదాపు 500 మంది లబ్ధిదారులు పంజాగుట్ట నుంచి ప్రజాభవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం, ప్రజాభవన్ వద్ద ధర్నకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్‌ను లబ్ధిదారులు హెచ్చరించారు. దళితబంధు నిధులు వెంటనే విడుదల చేయాలని లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో దళితులపై ముఖ్యమంత్రి రేవంత్ వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమను కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. -
‘దళితబంధు’ ఉంటుందా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని దాదాపు 11,108 మంది లబ్ధిదారులు తమ ఖాతాల్లో ఆరునెలలుగా ఉన్న సుమారు రూ.436.27 కోట్ల డబ్బును విత్ డ్రా చేసుకోలేని స్థితిలో ఉన్నారు. మరోవైపు రెండో జాబితాలో ప్రతీ నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారుల చొప్పున ఎన్నికలకు ముందు 1.31 లక్షల మంది దళితులతో జాబితాను నాటి ప్రభుత్వం రూపొందించింది. ఈలోపు ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా కొలువుదీరిన ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ పథకంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వీరందరిలోనూ పథకం అమలుపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. 11వేలమందికి చెందిన.. రూ.436.27 కోట్లు ! పథకంలో ఎంపికైన కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం, లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో నైపుణ్య శిక్షణ, వారి చేత వ్యాపారాలు ప్రారంభించే లక్ష్యంతో 2021 ఆగస్టు 16న అప్పటి సీఎం కేసీఆర్ ఆ పథకానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం శాలపల్లి వేదికగా ఈ పథకాన్ని ఆరంభించారు. హుజురాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకుని 18వేలమంది దళితులను పథకాన్ని ఎంపిక చేశారు. వీరిలో 11,315 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పు న ఇవ్వగా.. మిగిలిన వారికి రూ.10 లక్షలలోపు ఆర్థిక సాయం అందజేశారు. దళితబంధు పథకాన్ని ప్రభుత్వం తొలిదశలో తొలుత రెండురకాలుగా అమలు చేసింది. ఒకటి సాచురేషన్ (ఎంపిక చేసుకున్న ప్రాంతంలో) మోడ్, రెండోది టార్గెట్ మోడ్ (నియోజకవర్గాల వారీగా) విధానం. ఇందు లో టార్గెట్ మోడ్‌లో 11,387 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. వారిలో 1413 మందికి రూ.126.66 కోట్లను అప్పటి ప్రభుత్వం ఖాతాల్లో వేసింది. సాచురేషన్ పద్ధతిలో మొత్తం 26,395 మందికి పథకాన్ని వర్తింపజేసింది. అందులో 9695 మందికి 309 కోట్లను విడుదల చేసింది. ఈ రెండు విధానాల్లో కలిపి 11,108 మంది ఖాతాల్లో మొత్తం రూ.436.27 కోట్లను ప్రభుత్వం ఖాతాల్లో వేసినా.. వారికి విత్‌డ్రా చేసుకునే వీలు మాత్రం ఇవ్వలేదు. రెండో జాబితాలో దయనీయం.. టార్గెట్ మోడల్లో పథకం ప్రారంభించిన ప్రభుత్వం మొత్తంగా 33 జిల్లాల్లో 119 మంది నియోజకవర్గాల్లో 1,31,500 మంది లబ్ధిదారులను రెండోదశలో ఎంపిక చేసింది. వారికి పథకం కోసం అన్ని అర్హతలు ఉన్నాయని తేల్చింది. లబ్ధిదారులకు జారీ చేసేందుకు హార్డ్ కాపీలు కూడా సిద్ధం చేసింది. వీరి కోసం రూ.749 కోట్లు కూడా ఇచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. కానీ, ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో ఎంపికైన 1,31,500 మంది లబ్ధిదారులకు ఆఖరునిమిషంలో డబ్బులు రాకుండా నిలిచిపోయాయి. దాంతో ఈ పథకం అమలుపై కలవరం నెలకొంది. సలహాదారులకు రాజభోగాలు వివిధ విభాగాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన రిటైర్డ్ ఉద్యోగులను, నాయకులను రాజీనామా చేయిస్తోన్న కొత్త ప్రభుత్వం దళితబంధులో నామినేటెడ్ పోస్టుల వంక కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. దళిత బంధు కోసం ఇద్దరిని నామినేటెడ్ విధానంలో నెలకు రూ.2.50లక్షల చొప్పున వేతనాలు, వారికి ఐదుగురు సెర్ఫ్ సిబ్బందిని రిసోర్స్ పర్సన్ల (ఆరీ్ప)లుగా నియమించింది. వీరికి రూ.60 వేల నుంచి రూ.70వేల వరకు ఇస్తున్నారని సమాచారం. వీరు రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకం అమలు తీరును పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేస్తేనే నిధులు విడుదలవుతాయి. ఆరునెలలుగా దళితబంధు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినా వీరిని కొత్త ప్రభుత్వం కూడా ఇంకా కొనసాగిస్తోంది. వీరు జిల్లాల్లో పర్యటించిన సందర్భాల్లో.. ఆయా జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు ఖర్చుల పేరిట చుక్కలు చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. వీరికి కారు, డ్రైవర్, ఆఫీస్ బాయ్, ట్రావెల్ అలవెన్సు తదితరాలు అదనం కావడం కొసమెరుపు. వెంటనే జమ చేయాలి మొదటి విడతగా విడుదలైన నిధులతో వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని నిర్వహించుకుంటున్నాం. ఏడాదిన్నర అవుతున్నా రెండో విడుత ఇవ్వాల్సిన మిగతా మొత్తం మా ఖాతాల్లో జమ చేయలేదు. అధికారులను అడిగితే దాటవేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రెండో విడుత నిధులను విడుదల చేసి మా ఖాతాల్లో జమ చేయాలి. – పర్లపల్లి రాజు, దళితబంధు లబ్ధిదారుడు, హుజూరాబాద్ నిధుల కోసం ఎదురుచూస్తున్నాం దళితబంధు పథకంలో మొదటి విడతలో వచి్చన నిధులతో మినీ సూపర్‌మార్కెట్ నిర్వహిస్తున్నాం. రెండో విడుత నిధులు ఇవ్వకపోవడంతో అప్పులు తెచ్చి దుకాణాన్ని నడిపించాల్సి వస్తోంది. రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మలి విడత డబ్బులు విడుదల చేసి ఆదుకోవాలి. – గజ్జల అంజయ్య, లబ్దిదారుడు, హుజూరాబాద్ -
ఆ నిధులు ఇవ్వాలా.. వద్దా?
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పెండింగ్ చెల్లింపులపై రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సహకార సంస్థ తర్జనభర్జన పడుతోంది. దళితబంధు పథకం రెండో విడతలో భాగంగా ఎంపికైన పలువురు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం చేయలేదు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరగడం... తీరా అరకొర ‡గా అర్హులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చే నాటికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ తొలగిపోయినా.. ఆ యా లబ్ధిదారులకు పూర్తి స్థాయి సాయం పంపిణీపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడం, గత ప్రభుత్వ ప్రాధాన్యత ల కంటే మెరుగైన విధంగా కొత్త పథకాల రూ పకల్పనకు సన్నద్ధమవుతుండడంతో ఈ పరిస్థి తి ఏర్పడింది. దీంతో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ వద్ద నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి ని అర్హులకు ఇవ్వాలా? వద్దా? అనే అయో మయం అధికారులను కలవరపెడుతోంది. అన్నీ పక్కన పెట్టినా గ్రేటర్‌కు మాత్రం మినహాయింపు తెలంగాణ దళితబంధు పథకం రెండో విడత కింద అప్పటి ప్రభుత్వం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి వెయ్యి చొప్పున యూనిట్లు మంజూరు చేసింది. ఈమేరకు క్షేత్రస్థాయి నుంచి శాసనసభ్యులు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌కు ప్రతి పాదనలను పంపారు. అప్పట్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో వా టన్నింటినీ పక్కన పెట్టారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మురుగు వ్యర్థాల సేకరణ(సిల్ట్ కార్టింగ్ వెహికల్స్) వాహనాలకు డిమాండ్ ఉండడంతో 2023–24 వార్షిక సంవత్సరంలో 162 యూనిట్లను మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన లబ్దిదారులకు అందించారు. ఈ వాహనాలను జీహెచ్ఎంసీలో వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించి జలమండలి(హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా ఇవ్వాల్సింది 230 యూనిట్లకు మాత్రమే..: అదేవిధంగా హైదరాబాద్ పరిధిలో ఇతర కేటగిరీలకు సంబంధించి మరో 230 యూనిట్లకు మంజూరు తెలిపిన ప్రభు త్వం అర్హుల ఖాతాల్లో తొలివిడతలో భాగంగా రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు నిధిని జమ చేసింది. మిగతా నిధులను జమచేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఆ నిధులు ఎస్సీ కార్పొరేషన్ వద్దే ఉండిపోయాయి. ప్రస్తుతం కోడ్ పూర్తి కాగా... నిధులను మాత్రం అధికారులు లబ్దిదారుల ఖాతాకు విడుదల చేయడం లేదు. ఈమేరకు అనుమతి కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ అధికా రులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ సమర్పించినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. మరోవైపు కొంత మేర ఆర్థిక సాయం పొందిన లబి్ధదారులు మిగతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తిస్థాయిలో సాయం అందితే నిర్దేశించుకున్న యూనిట్లు తెరవాలని ఆశపడుతున్నారు. -
దళితబంధు రావడం లేదని బలవన్మరణం?
సాక్షి, ఆదిలాబాద్: దళిత బందు పథకం కోసం ఓ యువకుడి అత్మహత్య చేసుకున్న ఉదంతం జిల్లాలో చోటు చేసుకుంది. జైనథ్ మండలం బోరజ్కు చెందిన రమాకాంత్ అనే యువకుడు పురుగుల మందు త్రాగి అత్మహత్య చేసుకున్నాడు. స్పాట్లో ఓ లేఖ దొరికింది. తాను దళితబంధు కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని రమాకాంత్ పేరిట ఆ లేఖ ఉంది. కుటుంబ సభ్యుల ప్రస్తావనతో పాటు తన ఆత్మహత్యకు సీఎం కేసీఆర్ కారణమంటూ లేఖలో ప్రస్తావించాడు రమాకాంత్. కొడుకు కోల్పోయిన దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు తమను ఆదుకోవాలని సర్కార్‌ను కోరుతున్నారు. అయితే ఈ ఘటనపై ఇంకా పోలీసులకు ఫిర్యాదు అందలేదని సమాచారం. -
కరెంటు మాయం..దళితబంధు ఆగం
సాక్షి, యాదాద్రి: ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో కరెంటు మాయమవుతుందని.. దళిత బంధు ఆగమవుతుందని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అన్నీ పోయి మళ్లీ దళారుల రాజ్యం వస్తుందన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘రైతులను పైరవీకారుల పాలుచేసిన కాంగ్రెస్ రాజ్యం మళ్లీ రావాలా?.. మళ్లీ అదే పాట పాడాలా? రైతు సోదరులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రైతుల భూముల మీద రైతులకే హక్కులుండాలని ధరణి పోర్టల్‌ను తెచ్చాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామంటున్నది. పొరపాటున అదే జరిగితే.. రైతులపై రాబందులు పడతారు. మళ్లీ కౌలు రైతులు, వీఆర్వోలు, మళ్లీ రికార్డుల కెక్కియ్యడం వంటి వాటితో రైతుల భూములన్నీ ఆగమైపోతయ్. అదే జరిగితే ఒకరి భూమి మరొకరి పేర్ల మీదకు వస్తుంది. మళ్లీ తహసీల్ ఆఫీసులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుంది. మూడు గంటల కరెంటు చాలంటున్నరు నేనూ రైతు బిడ్డనే.. వ్యవసాయం చేస్తా. ఒకప్పుడు కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు. ఇవ్వాళ 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 24 గంటల కరెంటు ఎందుకు? మూడు గంటలు చాలు అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ఓటు వేయాలి..’’ అని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రణాళికలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించామని చెప్పారు. ఈ సభలో కేసీఆర్ 12 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, చిరుమర్తి లింగయ్య తదితరులు సభలో పాల్గొన్నారు. సభలో గుండెపోటుతో వ్యక్తి మృతి భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్ పోచంపల్లి మండలం జూలూరుకు చెందిన మెట్టు సత్తయ్య (55) బీఆర్ఎస్ కార్యకర్తలతో కలసి ఈ సభకు వచ్చారు. ఈ క్రమంలో ఆకస్మికంగా కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న వారు గమనించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సత్తయ్య వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నారని, ఆయన భార్య ఇప్పటికే మృతిచెందారని, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారని స్థానికులు తెలిపారు. -
పులిని ఎలా బంధించాలో మాకు తెలుసు
మధిర: అనారోగ్యంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి పులి బయటకు వస్తోందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నా రని, అయితే ఆ పులిని బంధించి రాష్ట్ర ప్రజలు, ఆస్తులను ఎలా కాపాడుకోవాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలుకు బడ్జెట్లో కేటాయించిన రూ.17,700 కోట్ల నిధులు ఏమయ్యాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిరలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ బంధు, గృహలక్ష్మి, రుణమాఫీ, దళితబంధు వంటి ఏ పథకాన్నీ సంపూర్ణంగా అ మలు చేయని బీఆర్ఎస్కు మళ్లీ ఎందుకు ఓటు వేయాలో కేసీఆర్, కేటీఆర్ చెప్పా లని భట్టి అన్నారు. బ్యాంకు ఖాతాలో రుణమాఫీ నగదు జమ చేయకుండానే అయినట్లు మెసేజ్‌లు పంపిస్తూ ప్రజలను మోసం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇలాంటి మోసాల ప్రభుత్వానికి ప్రజలు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురా వాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. -
హైదరాబాద్ లో 162 సిల్ట్ కార్టింగ్ వాహనాలు అందజేత
-
‘దళిత బంధు’కు ఆదరణ కరువు
సాక్షి,సిటీబ్యూరో: దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి ఆదరణ కరువైంది. రెండో విడతలో యూనిట్ల సంఖ్య పెరిగినా... నిరుద్యోగ యువత ఆసక్తి కరువైంది. దరఖాస్తులు ఆహా్వనిస్తే కనీసం కేటాయించిన యూనిట్లకు సరిపడ దరఖాస్తులు కూడా రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. మొదటి విడతలో అసెంబ్లీ నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేసి యూనిట్లను మంజూరు చేయడంతో గ్రౌండింగ్ కూడా పూర్తైంది. నియోజవకవర్గానికి 1,100 యూనిట్లు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండో విడతలో ఒక్కో నియోజకవర్గంలో 1,100 చొప్పున యూనిట్లు కేటాయించారు. గత మూడు, నాలుగు నెలలుగా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలకు గాను 16, 500 యూనిట్లు కేటాయించగా, ఇప్పటి వరకు కేవలం 13 వేల దరఖాస్తులకు మించి రాలేదని తెలుస్తోంది. కొన్ని దరఖాస్తులు నేరుగా రాగా, మరికొన్నింటిని ఎమ్మెల్యేలు సిఫార్సు చేశారు. అయినప్పటికీ యూనిట్ల కేటాయింపునకు అనుగుణంగా దరఖాస్తుల సంఖ్య పెరగలేదు. విచారణ అంతంతే... రెండో విడత దరఖాస్తుల విచారణ సైతం అంతంత మాత్రంగా తయారైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ అధికారులతో సమీక్ష సమావేశాలు జరిపిన ప్రతిసారీ దళిత బంధు దరఖాస్తులపై విచారణ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నా.. ప్రక్రియ మాత్రం ముందుకు మాత్రం సాగడం లేదు. ఈ పథకం కింద యూనిట్‌కు రూ.10 లక్షల అందిస్తారు. అయినప్పటికీ దరఖాస్తుల తాకిడి లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. -
దళితబంధు అర్హుల ఎంపిక ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన దళితులకు ఇచ్చే దళితబంధు పథకం కింద అర్హులను ఎలా ఎంపిక చేస్తున్నారో...ఆ వివరాలు వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేలు, అధికారులే వీరిని ఎంపిక చేస్తున్నారా? లేదా ఇతర ప్రక్రియ ఏదైనా పాటిస్తున్నారా? చెప్పాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ వాయిదా వేసింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 1,100 మందిని దళితబంధుకు అర్హులుగా గుర్తించాలని జూన్ 24న ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి గతంలోనే ఇచ్చి ఉండటంతో దానికి మినహాయింపు ఇచ్చారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి వీరిని ఎంపిక చేయాలని పేర్కొన్నారు. ఇలా అయితే నియోజకవర్గాల్లో అర్హులకు కాకుండా, ఎమ్మెల్యేలు చెప్పిన వారికే రూ.10 లక్షలు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన కేతినీడి అఖిల్‌శ్రీ గురుతేజ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జారీచేసిన జీఓ నంబర్ 8ని రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా అర్హులకు లబ్ధి చేకూరదని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని, ఇదే పద్ధతిని దళితబంధుకు అనుసరించేలా ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది. -
సీఎం జగన్ ముమ్మాటికీ దళిత బంధువే
సాక్షి, అమరావతి: ఈనాడు అధినేత రామోజీరావు తెలుగు రాష్ట్రాల మధ్య శకుని పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్‌రావు విమర్శించారు. దేశ స్వాతంత్య్రమంత వయసు కలిగిన రామోజీరావు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నంత మాత్రాన మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా దళిత వ్యతిరేకులని రామోజీ భావిస్తున్నారా? అని ప్రశ్నిచారు. అసైన్డ్ భూములను ఆక్రమించి ఫిలింసిటీని నిర్మించుకున్నది రామోజీరావు అయితే అసైన్డ్ భూములపై బడుగు, బలహీన వర్గాలకు హక్కులు కల్పించిన ధీరోదాత్తుడు వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. దళితులు కళ్లు తెరిస్తే ఫిల్మ్‌సిటీని దున్నేస్తారని హెచ్చరించారు. పేదోడి బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం చదువులను అడ్డుకున్న దురహంకారి రామోజీ అని మండిపడ్డారు. ఏపీలో అమలవుతున్న అమ్మ ఒడి తెలంగాణలో ఉందా? అని ప్రశ్నిచారు. సీఎం జగన్ పట్ల దళితులకున్న ప్రేమను చంద్రబాబు బృందం ఎప్పటికీ కొనలేదని స్పష్టం చేశారు. దళితుల కష్టాలు టీడీపీ నేతలకు, ఈనాడు రామోజీరావుకు తెలియవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై తప్పుడు కథనాలు ప్రచురించటాన్ని ఖండించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవేమిటి మరి? పేదల జీవన ప్రమాణాలను పెంపొందిస్తూ నాలుగేళ్లలో పారదర్శకంగా రూ.2.31 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించిన సీఎం జగన్ ఖచ్చితంగా దళిత బంధువు అవుతారని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ 31 లక్షల ఇళ్ల స్థలాలిస్తే లబ్ధిదారుల్లో దళిత కుటుంబాలే అధికంగా ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఐదు లక్షల కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలా మెరుగైన స్థితికి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఇటీవల సర్వే ద్వారా కేంద్రమే గుర్తించిందని తెలిపారు. దళితుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడి»ొడ్డులో ఏర్పాటు చేస్తున్న సీఎం జగన్ ముమ్మాటికీ దళిత బంధువేనని స్పష్టంచేశారు. -
మోత్కుపల్లికి పోటీ చేసే అవకాశం కల్పించాలి
యాదగిరిగుట్ట: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మ డి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆయన అనుచరులు సీఎం కేసీఆర్‌ను కోరారు. భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో గురువారం మోత్కుపల్లి నర్సింహులు అభిమానులు, అనుచరులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోత్కుపల్లి నర్సింహులు 5 సార్లు ఆలేరు నుంచి, ఒక సారి తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే గెలిచారన్నారు. రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్న మోత్కుపల్లి నర్సింహులును సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభ సమయంలో పిలిచి, బీఆర్ఎస్లోకి ఆహ్వనించారని తెలిపారు. ఆ సమయంలోనే రాష్ట్ర స్థాయిలో మంచి పదవి ఇచ్చి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు మోత్కుపల్లికి ఎలాంటి పదవులు ఇవ్వలేదని ఆవేద అభివాదం చేస్తున్న మోత్కుపల్లి అనుచరులున వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ నాయకుడికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించాలన్నారు. -
నేనంటే కేసీఆర్‌కు భయం
సాక్షి, హైదరాబాద్: తనను చూసి కేసీఆర్ భయపడుతున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గంలో దళిత బంధు అక్రమాలపై నిరసన తెలపడానికి బయలుదేరిన ఆమెను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయంటూ జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామస్తులు ఇటీవల ఆందోళన చేశారు.ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్న షర్మిలను, అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల పోలీసులకు హారతి ఇచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. గజ్వేల్‌లో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. పోలీసులు సీఎం కేసీఆర్ తొత్తుల్లా పని చేయడం మానుకోవాలన్నారు. తనను అడ్డుకున్నందుకు నిరసనగా లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద షర్మిల దీక్షకు దిగారు. సాయంత్రం వరకు కొనసాగిన ఆమె దీక్షను తీగుల్ గ్రామస్తులు వచ్చి నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. షర్మిల నిరాహార దీక్షకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మద్దతు తెలిపారు తొమ్మిదేళ్లుగా గుడిసెల్లోనే.. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తాను వెళ్లాలనుకున్న తీగుల్ గ్రామంలో దళితులు తమ ఇళ్ల ఫొటోలు పంపి, వారి కోసం కొట్లాడాలని వినతి పత్రం పంపించారన్నారు. రెండు సార్లు కేసీఆర్‌కు ఓట్లేసి గెలిపించినా.. తొమ్మిదేళ్లుగా ఈ ప్రజలు ఇంకా గుడిసెల్లోనే ఉంటున్నారన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్‌లోనే దళిత బంధు ఇంత దరిద్రంగా అమలవుతుంటే ఇతర నియోజకవర్గాల్లో ఎలా అమలవుతుందో ఊహించుకోవచ్చన్నా రు. రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలుంటే.. ఇప్పటి వరకు 38 వేల కుటుంబాలకే దళిత బంధు అమలైందన్నారు. ప్రతి ఒక్కరికీ దళితబంధు పథకం అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. -
గజ్వేల్ నియోజకవర్గంలో ‘దళితబంధు’ కోసం రోడ్డెక్కిన దళితులు
జగదేవ్‌పూర్(గజ్వేల్): సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళితులు రోడెక్కారు. దళితబంధును అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం దళితులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దళితబంధు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తిగుల్, నిర్మల్‌నగర్, బస్వాపూర్, అలిరాజ్‌పేట గ్రామాల దళితులు ఆందోళన చేశారు. జగదేవ్‌పూర్ –భువనగిరి ప్రధాన రహదారిపై గంటసేపు నిర్మల్ నగర్ దళితులు రాస్తారోకో చేపట్టారు. ధర్నా కారణంగా రహదారిపై కిలోమీటర్ల మేర అటుఇటు వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ చంద్రమోహన్ దళితులతో మాట్లాడి సముదాయించి ధర్నాను విరవింపజేశారు. అనంతరం గ్రామపంచాయతీ ఎదుట సర్పంచ్‌కు వ్యతిరేకంగా దళితులు నిరసన చేపట్టారు. తిగుల్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చౌరస్తాలో దళితులు బైఠాయించి సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. బస్వాపూర్‌లోనూ దళితులు నిరసన తెలిపారు. అలిరాజ్‌పేటలో దళితులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల దళితులు మాట్లాడుతూ దళితబంధును అర్హులందరికీ ఇవ్వాలని, లేదంటే ఎవరికీ ఇవ్వకూడదని అన్నారు. -
కేసీఆర్‌కు ఓటమి భయం
నల్లగొండ రూరల్: సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, ఎన్నికల సమయంలో దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు పథకాలు పెడుతున్నాడని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ‘బంధు’పథకాలతో బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో బంద్ అవుతుందని చెప్పారు. నల్లగొండ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు శనివారం ఆయన కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు ప్రకటించి మాట్లాడారు. భూ మండలం తలకిందులైనా ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్.. నేడు ఎన్నికల కోసం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంటున్నాడని విమర్శించారు. కేసీఆర్ మాట లకు, ఉత్తుత్తి జీవో కాపీలకు మోసపోవద్దని సూచించారు. గ్రామపంచాయతీ కారి్మకులు 30 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పారిశుధ్య పనులు చేపడితే వారికి సమాజం పాదాభివందనం చేసిందని, అలాంటి వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. మీరు పోరాటం ఆపొద్దని సమస్య పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటామని రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కారి్మకులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు కోమటిరెడ్డి చెప్పారు. ఏపీ సీఎం జగన్ అక్కడి ప్రజలకు వైద్యం ఖర్చు రూ.వెయ్యి దా టితే పెద్ద ఆస్పత్రిలో పూర్తి స్థాయి వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నారని కోమటిరెడ్డి చెప్పారు. వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. -
దళిత, గిరిజనులను మోసం చేసిన కేసీఆర్
కడెం: సీఎం కేసీఆర్ దళిత, గిరిజనులను మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకెట అన్వేశ్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని కొండుకూర్ గ్రామంలోని ఓ ఫంక్షన్హాల్లో ఉట్నూర్ జెడ్పీటీసీ, పీసీసీ సభ్యురాలు రాథోడ్ చారులత ఆధ్వర్యంలో సోమవారం దళిత, గిరిజన ఆత్మ గౌరవసభ నిర్వహించారు. ముఖ్య అథితిగా అన్వేశ్‌రెడ్డి హాజరయ్యారు. దళితబంధు పేరుతో లబ్ధిదారుల నుంచి కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు మూడు లక్షల వరకు వసూలు చేశారన్నారు. దళితులకు మూడెకరాల భూమి అని కొంతమందికి ఇచ్చి హామీని మరిచారన్నారు. ఇప్పటి వరకు ఖానాపూర్ నియోజవర్గంలో ఒక్క డబుల్బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ హాయంలో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టి గూడులేని ఎంతో మంది నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి సాయం అందించారని అన్నారు. గతేడాది కడెం ప్రాజెక్ట్ నుంచి వచ్చిన భారీ వరదలతో ఎంతో మంది రైతుల భూములు, పంటలు నష్టపోయినా ప్రభుత్వం సాయం అందించకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, ధరణి పోర్టల్ రద్దు, కిసాన్ కమిషన్ ఏర్పాటు, వ్యవసాయానికి ఉపాధిహామీ పథకం వర్తింపు, పోడు, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు, కౌలు రైతులకు రూ.15 వేలు, భూమిలేని ఉపాధిహామీ కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం, భూమిలేని రైతులకు రైతుబీమా వర్తింపు, రూ.500లకే సిలిండర్, తదితర పథకాలను అమలు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భరత్‌చౌహాన్, ఎల్డీఎం(లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్) పార్లమెంట్ ఇన్చార్జి రఘునాథరెడ్డి, నియోజవర్గ ఇన్చార్జి సత్యనారయణ, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రమేశ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, మహిళ విభాగం జిల్లా ఉపాధ్యాక్షురాలు గీతారెడ్డి, జిల్లా నాయకులు మల్లారెడ్డి, శంతన్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి, ప్రభాకర్, బాపురావు, సత్యం, వెంకటేశ్, సలీం, రహీం, శంకర్ తదితరులు ఉన్నారు. -
దళితబంధుకు దరఖాస్తు ఎలా?
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం రెండో విడత అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆశావహుల్లో ఉత్సాహం రెట్టించింది. ఈ పథకం కింద 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.17,700 కోట్లు బడ్జెట్లో కేటాయించినప్పటికీ.. పథకం అమలుకు మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో ఎంపిక ప్రక్రియ ముందుకు సాగలేదు. కాగా, ఈ ఏడాది కూడా ప్రభుత్వం బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో తాజాగా నియోజకవర్గస్థాయిలో పథకం అమలు, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ.. తదితరాలకు సంబంధించి అనుమతులిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలంటూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఈ పథకానికి ఎస్సీ కుటుంబాలను గుర్తించి వారి అర్హతను నిర్ధారించాలని ఉత్తర్వుల్లో తెలిపినప్పటికీ అధికారుల్లో మాత్రం స్పష్టత లేదని తెలుస్తోంది. ఎంపికపై స్పష్టత కరువు..! ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ.. ప్రత్యేకంగా దళితబంధు పోర్టల్‌ను రూపొందించింది. దీంతోపాటు మొబైల్ యాప్‌ను కూడా త యారు చేయించిన ప్రభుత్వం.. పథకం అమలులో పారదర్శ కత కోసం లబ్దిదారుల వివరాలు, యూనిట్ల ఏర్పాటు, పథ కం పురోగతి తదితరాలన్నీ పోర్టల్, యాప్‌ల ద్వారానే నిర్వ హించనుంది. ఈ అంశాలన్నీ తాజాగా జారీ చేసిన ఉత్తర్వు ల్లో పేర్కొన్నప్పటికీ లబ్దిదారుల ఎంపికపైన మాత్రం ఉత్తర్వుల్లో వివరణ ఏమీ లేదని చెపుతున్నారు. నియోజకవర్గస్థాయిలో ప్రజాప్రతినిధి సహకారంతో ఎస్సీ కుటుంబాలను గు ర్తించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే ఉండడంతో ఆయన సహకారంతో అర్హులను ఎంపిక చేసే వీలుంటుంది. కానీ క్షేత్రస్థా యి నుంచి దరఖాస్తులు స్వీకరించాలా? లేక ఎమ్మెల్యే సూ చించిన పేర్లతో కూడిన జాబితాను ఆమోదించాలా? అనే అంశాన్ని అధికారులు తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. వసూళ్లపర్వం బహిరంగమే.. దళితబంధు పథకంలో పెద్ద ఎత్తున వసూళ్లు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో లబ్దిదారు నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తన వద్ద ఉందంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సైతం హెచ్చరించారు. ఇలాంటివి సహించబోనని ఆయన స్పష్టంచేశారు. మరోవైపు ఈ పథకం అమలులో పక్షపాత వైఖరి ఉందంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా.. అర్హుల ఎంపికలో ఎమ్మెల్యే జోక్యం ఉండకూదని తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో కొత్తగా మార్గదర్శకాలు వస్తాయని ఎస్సీ కార్పొరేషన్ భావించింది. ఇందులో భాగంగానే గతేడాది ఈ పథకాన్ని అమలు చేయలేదని తెలుస్తోంది. తాజాగా ఎస్సీ అభివృద్ధి శాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ ఈ అంశంపై స్పష్టత లేకపోవడం.. పాత విధానాన్నే అమలు చేసేలా సూచనలు ఇవ్వడం పట్ల క్షేత్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలకే లబ్దిదారుల ఎంపిక బాధ్యతలు ఇవ్వడంవల్ల అక్రమాలు మరింత ఎక్కువగా జరుగుతాయని పలువురు ఆక్షేపిస్తున్నారు. -
కేంద్ర పథకాల అమలులో నిర్లక్ష్యం
ఖమ్మంమామిళ్లగూడెం: పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలుకాకుండా ఇక్కడి ప్రభుత్వం అడ్డుకుంటోందని జమ్మూ కశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్ విమర్శించారు. ఖమ్మంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం యువత బలిదానాలు చేసి తెలంగాణ కోసం పోరాడగా రాష్ట్ర ఏర్పాటుకు నాడు బీజేపీ పార్లమెంట్లో కృషి చేసిందని గుర్తుచేశారు. అయితే, రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆరోపించారు. దళితబంధు అంటున్న సీఎం కేసీఆర్ ప్రజలకు అన్ని బంద్ పెట్టారని పేర్కొన్నారు. ఖమ్మంలో జాతీయ రహదారుల కోసం కేంద్రం రూ.1,200 కోట్ల నిధులు ఇచ్చిందని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ మార్కెట్లను బలోపేతం చేస్తుండగా, ఖమ్మం మార్కెట్లో మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజన్ కూడా అందుబాటులో లేదని చెప్పారు. అలాగే, ఖమ్మంలో బీజేపీ కార్పొరేటర్ ఉన్న డివిజన్‌కు నిధులు కేటాయించడంలో వివక్ష చూపిస్తున్నారని తెలిపారు. కాగా, గురువారం ఖమ్మంలో జరగాల్సిన సభకు కేంద్ర హోమంత్రి అమిత్‌షా హాజరు కావాల్సి ఉన్నా, వివిధ రాష్ట్రాల్లో తుపాన్ కారణంగా వాయిదా పడిందని నిర్మల్‌సింగ్ చెప్పారు. త్వరలోనే ఖమ్మంలో అమిత్‌షా సభ ఉంటుందని తెలిపారు. అనంతరం ఆయన ఖమ్మం సారథినగర్‌లోని రైల్వే అండర్ బ్రిడ్జిని పరిశీలించగా, రోడ్డుకు లింక్ చేయకపోవడంతో నిరుపయోగంగా మారిందని బీజేపీ నాయకులు తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, కార్పొరేటర్ దొంగరి సత్యనారాయణ, నాయకులు నున్నా రవికుమార్, దేవకి వాసుదేవరావు, నకిరికంటి వీరభద్రం, చావా కిరణ్, గంటెల విద్యాసాగర్, శ్యాంరాథోడ్, రుద్ర ప్రదీప్, వీరెల్లి లక్ష్మయ్య, అల్లిక అంజయ్య, దొడ్డ అరుణ తదితరులు పాల్గొన్నారు. పత్తిపై జీఎస్టీ సమస్య పరిష్కరించాలి ఖమ్మంవ్యవసాయం: పత్తి కొనుగోళ్లపై వస్తు సేవా పన్ను (జీఎస్టీ) సమస్యను పరిష్కరించాలని ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ నిర్మల్‌సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఇటీవల మార్కెట్లో పత్తి కాలిపోయిన ప్రదేశాన్ని పరిశీలించిన ఆయన చాంబర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా చాంబర్ బాధ్యులు మాట్లాడుతూ తొలుత పత్తి కొనుగోళ్లపై జీఎస్టీ వసూలు చేయగా, ఆ తర్వాత అమ్మకంపై కూడా జీఎస్టీని విధించడంతో భారం పడిందని తెలిపారు. బీజేపీ నాయకులతో పాటు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, బాధ్యులు సోమా నర్సింహారావు, మన్నెం కృష్ణ, తల్లాడ రమేశ్, నల్లమ ల ఆనంద్, చెరుకూరి సంతోష్‌కుమార్, పాండురంగారావు, సత్యంబాబు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
KNR: దళితబంధు కోసం కొత్త షరతులు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో అధికారులు కొత్త షరతు విధించారు. నిధులు దుర్వినియోగం కాకుండా కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. రెండో విడత దళితబంధు కోసం దరఖాస్తు చేసుకునే వారంతా కొటేషన్, వ్యాపారి జారీచేసే అఫిడవిట్ కలిగి ఉండాలని నిబంధన పెట్టారు. హుజూరాబాద్‌లో లబ్ధిదారులకు నిధుల మంజూరులో సమస్యలు తలెత్తాయన్న విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారని సమాచారం. అందుకే, యూనిట్లకు సంబంధించి విస్తరణ, వ్యాపారవృద్ధిలో పారదర్శకతను మరింత పెంచేలా చర్యలు చేపట్టారు. ఇకపై రెండో విడత కోసం దరఖాస్తు చేసుకునే ప్రతీ లబ్ధిదారుడు తాను సామగ్రి తీసుకునే వ్యాపారి నిజాయితీని చాటేలా అఫిడవిట్ ఇవ్వాల్సిందేనన్న రూల్ అమల్లోకి తీసుకువచ్చారు. క్షేత్రస్థాయిలో అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దళితబంధు పథకం అమలులో కొందరు నేతలు కమీషన్లు తీసుకుంటున్నారన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో కలెక్టర్ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నేపథ్యమిదీ.. హుజరాబాద్ ఉప ఎన్నికకు ముందు దళితుల సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు ప్రారంభించింది. పథకంలో భాగంగా అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది. ఆర్థిక అసమానతలను రూపుమాపడం ద్వారా దళితులంతా సామాజిక సమానత్వం సాధించాలన్న లక్ష్యంతో ఈ పథకానికి సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారు. నియోజకవర్గంలోని శాలపల్లి వేదికగా పథకాన్ని ముఖ్యమంత్రి లబ్ధిదారులకు స్వయంగా చెక్కులు అందజేసి ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు రెండేళ్లకాలంలో హుజూరాబాద్, ఇల్లందకుంట, వీణవంక, జమ్మికుంట, కమలాపూర్ (హన్మకొండ జిల్లా) మండలాల్లో లబ్ధిదారులను గుర్తించి మొత్తం 18,021 దళిత కుటుంబాలకు యూనిట్లు మంజూరు చేశారు. ఇందులో 14,080 కుటుంబాలు కరీంనగర్ జిల్లాలో ఉండగా.. మిగిలిన 3,941 కుటుంబాలు కమలాపూర్ మండలంలో ఉన్నాయి. గోల్‌మాల్‌కు యత్నం? జిల్లాలో మొత్తం 18,021 మంది దళితబంధు కోసం దరఖాస్తు చేసుకోగా 14,080 మంది అర్హులని అధికారులు తేల్చారు. వీరిలో 10,970 కుటుంబాలకు పూర్తిస్థాయిలో రూ.10 లక్షల (రూ.9.80 లక్షల, రూ. 20 వేలు బీమా) మేర ఆర్థిక సాయం అందించారు. ఇందులో వివిధ వ్యాపారాలతోపాటు, తయారీ, ఉత్పత్తి, డెయిరీ, పౌల్ట్రీ మోటారు వాహనయూనిట్లు , మిగిలిన 3,100 మంది మాత్రం రిటైల్ యూనిట్లు ఎంచుకున్నారు. తొలివిడతగా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నిధులు డ్రాచేసుకుని వ్యాపారాలు ప్రారంభించారు. వీరిలో కొందరు రెండో విడత కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో భాగంగా యూనిట్‌కు సంబంధించిన సామగ్రి కొటేషన్ కూడా దళితబంధు యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కొందరు గుర్తింపులేని సంస్థల నుంచి కొటేషన్స్ తీసుకున్న విషయాన్ని మండలాల్లోని క్లస్టర్ ఆఫీసర్లు గుర్తించారు. అలాంటి కొటేషన్లు మంజూరు చేస్తే.. నిధులు దారి మళ్లే ప్రమాదముంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే అనుమానాస్పద దరఖాస్తులను తిరస్కరించారు. దీనికితోడు కొందరు దళారులు తాము కొటేషన్లు ఇస్తామంటూ నిరక్షరాస్యులైన లబ్ధిదారుల వద్ద డబ్బులు కూడా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు పెరిగిపోయాయి. మరోవైపు గుర్తింపులేని చాలా సంస్థల వద్ద సరుకు కోసం డబ్బులు కట్టినవారు మోసపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ లీగల్ అఫిడవిట్ నిబంధనను ప్రవేశపెట్టారు. ఇవీ నిబంధనలు ♦ అఫిడవిట్ జారీ చేసే వ్యాపారి తప్పనిసరిగా జీఎస్టీ నెంబరును కలిగి ఉండాలి. ♦ సదరు జీఎస్టీ నెంబరు కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే తీసుకున్నది అయి ఉండాలి. తద్వారా నకిలీ ఇన్వాయిస్లకు అడ్డుకట్ట వేయవచ్చు. ♦ లబ్ధిదారులు హుజూరాబాద్ మండలాలైన హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట వ్యాపారుల నుంచి రా మెటీరియల్ సప్లై కోసం ఇచ్చే కొటేషన్లు ♦ తీసుకోరు. ఇటీవల ములుగు నుంచి గుర్తింపు లేని ఓ సంస్థ కొటేషన్‌ను అధికారులు గుర్తించడమే ఇందుకు కారణం. ♦ లీగల్ అఫిడవిట్ మీద వ్యాపారి వివరాలు, దళితబంధు లబ్ధిదారులకు సరఫరా చేసే సామాగ్రి వివరాలు పొందుపరిచి ఉండాలి. అంతేకాదు, తానేమైనా తప్పుడు ♦ సమాచారం ఇచ్చి ఉంటే కలెక్టర్ తీసుకునే చట్టపరమైన చర్యలకు బద్ధుడినై ఉంటానంటూ సంతకం కూడా చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ♦ లబ్ధిదారులు హుజూరాబాద్ కాకుండా హైదరాబాద్, కరీంనగర్, రాష్ట్రంలో జీఎస్టీ గుర్తింపు పొందిన ఏ వ్యాపారి వద్ద నుంచైనా కొటేషన్ తీసుకురావచ్చు. వాటిని ఎంపీడీవోలు వెరిఫై చేసి, ఉన్నతాధికారులకు పంపుతారు. పారదర్శకత కోసమే దళితబంధు ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం. నిధుల మంజూరులో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా కొత్తగా లీగల్ అఫిడవిట్ విధానాన్ని ప్రవేశపెట్టాం. దీంతో లబ్ధిదారులకు నాణ్యమైన ముడిసరుకు లభిస్తుంది. తప్పుడు కొటేషన్లతో అటు ప్రభుత్వ అధికారులు, ఇటు లబ్ధిదారులను మోసం చేసే వీలు లేకుండా ఉంటుంది. దళారీ వ్యవస్థకు చెక్ పడనుంది. పథకం అమలులో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకత అమలు అయ్యేలా చూడటమే ప్రభుత్వ బాధ్యత. – ఆర్వీ కర్ణన్, కలెక్టర్, కరీంనగర్ -
ఇది.. సారు– కారు–60% సర్కారు
సాక్షి, హైదరాబాద్: ‘దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్లు తీసుకుంటే.. మరో 30 శాతం కమీషన్ సీఎం కుటుంబానికి పోతోంది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సచివాలయ నిర్మాణంతోపాటు భూ దందాల్లోనూ 60 శాతం కమీషన్లు వెళ్తున్నాయి. ఇది అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు. సారు–కారు–60 పర్సంట్ భ్రష్టాచార్ సర్కార్’అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ 60 పర్సంట్ సర్కార్‌ను సాగనంపేదాకా తాము పోరాడతామని చెప్పారు. సోమవారమిక్కడ జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో సంజయ్ మాట్లాడారు. ‘111 జీవో రద్దు అనేది మహా కుట్ర, బీఆర్ఎస్ కార్యాలయానికి కోకాపేట భూముల కేటాయింపు వెనుక కూడా కుట్ర ఉంది. వీటిపై న్యాయపోరాటం చేస్తాం’అని ప్రకటించారు. ‘రాష్ట్ర ప్రజలకు ప్రధాన విలన్ కేసీఆరే. కాంగ్రెస్ సైడ్ విలన్ పాత్ర పోషిస్తోంది. బీఆర్ఎస్–కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీల చీకటి ఒప్పందాలను బయటపెడతామని పేర్కొన్నారు. ఈ భేటీలో జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్సీ కేవీఎన్ రెడ్డి, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌రెడ్డి, ఈటల, వివేక్ పాల్గొన్నారు. జూన్ 30 దాకా ‘మహాజన సంపర్క్ అభియాన్’ కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, తెలంగాణకు చేకూర్చిన ప్రయోజనాలను ఇంటింటికీ తెలియజేసేలా ఈనెల 30 నుంచి జూన్ 30 దాకా ‘మహాజన సంపర్క్ అభియాన్’ నిర్వహిస్తా మని బండి సంజయ్ చెప్పారు. ‘ఒకనాడు ప్రధాని మోదీని విశ్వగురుగా, నిజాయితీపరుడిగా కీర్తించిన కేసీఆరే ఇప్పుడు ఆయనను అవినీతిపరుడు, రాక్షసుడంటూ తిడుతున్నారు. ఇలాంటి విశ్వాస ఘాతకుడిని నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదు’అని సంజయ్ మండిపడ్డారు. పదేళ్ల పాలనలో ఏం సాధించారని వందలకోట్లు ఖర్చుతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని నిలదీశారు. కాగా, బండి, బన్సల్ సమక్షంలో బీఆర్ఎస్ నేతలు గోవింద్ రాఠీ, మనోజ్, మాజీ మంత్రి శంకర్ రావు కుమార్తె సుస్మిత బీజేపీలో చేరారు. పనిచేసేవారికే టికెట్లు: సునీల్‌బన్సల్ ‘ఫ్లెక్సీలు పెట్టి, సొంత ఫొటోలతో వ్యక్తిగత ప్రచారం చేసుకునే వాళ్లు లీడర్లు కారు, ప్రజల్లోకి వెళ్లి పనిచేసే వారే నాయకులు. పార్టీ, ప్రజల కోసం పనిచేసే వారికే టికెట్లు ఇస్తాం. పార్టీ క్రమశిక్షణను అందరూ విధిగా పాటించాలి. గీత దాటితే కఠినచర్యలు తప్పవు’అని జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ చెప్పారు. ‘బీజేపీ ముఖ్యనేతలు పార్టీ మారుతున్నట్టు, వారిలో ఈటల, వివేక్, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి వంటి నేతలున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారాన్ని విశ్వసించకండి. మన ప్రత్యర్థులు రేవంత్‌రెడ్డి వర్గానికి చెందిన వారు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు’అని పార్టీ జాతీయ సంస్థాగత సహ ప్రధానకార్యదర్శి శివప్రకాష్ పేర్కొన్నట్టు సమాచారం. -
ఆర్థిక ఇబ్బందులు.. ‘బలగం’ మొగిలయ్యకు ‘దళితబంధు’
దుగ్గొండి (వరంగల్): ‘బలగం’సినిమా లో పాడిన పాటతో అందరి దృష్టినీ ఆకర్షించిన వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన పస్తం మొగిలయ్య– కొంరమ్మ దంపతులకు దళితబంధు పథకం మంజూరైంది. మొగిలయ్య రెండు కిడ్నీలు ఫెయిలై డయాలసిస్‌పై ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆయన కుటుంబాన్ని ఆదుకుని చేయూతనివ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడి దళితబంధును మంజూరు చేయించారు. ఈ మేరకు మొగిలయ్యకు కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం దళితబంధు మంజూరు పత్రాలు అందించారు. జిల్లా యంత్రాంగం తరఫున ఎల్లప్పుడూ మొగిలి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. (గాజుల రామారంలో ఇళ్ల కూల్చివేతలు: ఈ పాపమెవరిది? పేదలే సమిధలు) -
నిరుపేదల ఉపాధిపై రాబందులు వాలిపోయే..'దళితబంధు విందాయే'!
తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన ఇటికాల లచ్చయ్యకు రూ.8.40 లక్షలతో 8 గేదెలు ఇచ్చినట్టు చూపి.. నాలుగు మాత్రమే ఇచ్చారు. మిగతా గేదెల కోసం ఆయన సూర్యాపేట జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ..రాష్ట్రంలో దళిత బంధు పథకంలో జరుగుతున్న అక్రమాలకు చిన్న ఉదాహరణలివి. 2021 ఆగస్టులో మొదలైన ఈ పథకంలో కొందరు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కక్కుర్తితో భారీగా జరిగిన అవినీతి వెలుగుచూస్తోంది. కొన్నిచోట్ల సామగ్రి ఇప్పిస్తామంటూ, జీఎస్టీ అంటూ కొన్నిచోట్ల దోచేస్తే.. మరికొన్నిచోట్ల నేరుగానే అక్రమాలకు పాల్పడటం, కొందరు లబ్ధిదారుల విషయంలో అయితే పథకం సొమ్ములో ఏకంగా సగం దాకా కాజేయడం విస్మయం కలిగిస్తోంది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దళితబంధు.. రాష్ట్రంలో దళితుల సంక్షేమం, సమగ్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వినూత్న పథకం. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయంతో శాశ్వత ఉపాధి మార్గాన్ని చూపడం దీని లక్ష్యం. దళితుల స్థితిగతులను మార్చేందుకు వాసాలమర్రిలో పురుడుపోసుకున్న ఈ పథకం.. హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికతో విస్తరించింది. రాష్ట్రవ్యాప్తంగా అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి (తుంగతుర్తి నియోజకవర్గం), చారకొండ (అచ్చంపేట), చింతకాని (మధిర), నిజాంసాగర్ (జుక్కల్) మండలాల్లో దళితులందరికీ.. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 మందికి చొప్పున తొలి విడతగా దళిత బంధును అమలు చేశారు. అయితే వాసాలమర్రి, హుజూరాబాద్ వరకుబాగానే సాగిన పథకం.. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి మండలాల్లో అడ్డదారులు తొక్కింది. విచ్చలవిడిగా అక్రమాలు.. దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన తిరుమలగిరి మండలంలో 2,223 కుటుంబాల కోసం రూ.230 కోట్లు వ్యయం చేశారు. కానీ ఇక్కడ నాయకులే అన్నీ తామై వ్యవహరించి భారీగా అక్రమాలకు పాల్పడినట్టు ఫిర్యాదులున్నాయి. ఉదాహరణకు ఒక్క తొండ (తిరుమలగిరి) గ్రామాన్నే తీసుకుంటే.. ఇక్కడ డెయిరీని ఉపాధిగా ఎంచుకున్న వారికి ఇప్పటికీ గేదెలు ఇవ్వలేదు. మొత్తం రూ.10 లక్షల సొమ్ములో.. రూ.1.50 లక్షలను గేదెల షెడ్డుకు వినియోగించినట్టు చూపారు. నిజానికి షెడ్డు వేసింది అధికార పార్టీ నాయకుడి అనుచరుడే. కేవలం రూ.50 వేలలో దాన్ని పూర్తిచేసి లక్షన్నర బిల్లు చెక్కులపై సంతకాలు చేయించుకున్నారు. మిగతా సొమ్ములో కనీసం ఏడు నుంచి తొమ్మిది గేదెలు ఇవ్వాల్సి ఉండగా.. లబ్ధిదారులను పశ్చిమగోదావరి జిల్లా తణుకు తీసుకువెళ్లి ఓ కాంట్రాక్టర్‌కు చెందిన షెడ్డులో గేదెలతో ఫొటోలు తీయించారు. వాటిని అప్లోడ్ చేసి చెక్కులపై సంతకాలు చేయించుకున్నారు. కానీ రైతులకు ఇచ్చినది ఒకట్రెండు గేదెలు మాత్రమే. మిగతా గేదెల కోసం నాయకులు, అధికారులను అడిగితే.. ఇంకెక్కడి గేదెలు అంటూ ఎదురుప్రశ్నలే వచ్చాయి. ఒకరిద్దరు కాదు చాలా మంది లబ్ధిదారులది ఇదే పరిస్థితి. తణుకు నుంచి 13 డీసీఎం వాహనాల నిండా గేదెలను రవాణా చేయాల్సి ఉండగా.. మూడే వాహనాల మేర మాత్రమే తెచ్చారు. కానీ నంబరు ప్లేట్లు మార్చి పదమూడు వాహనాలుగా చూపెట్టి దళితబంధు నిధులను పక్కదారి పట్టించారు. జీఎస్టీ పేరుతోనూ ముంచేశారు పలుచోట్ల అంతగా ప్రాచుర్యం కానీ నాసిరకం బ్రాండ్ల వాహనాలు, పనిముట్లు కొనుగోలు చేశారు. అదీగాక కొందరు నాయకులు, అధికారులు కుమ్మక్కై జీఎస్టీ పేరుతోనూ అక్రమాలకు తెరలేపారు. లబ్ధిదారులు పెట్టుకునే యూనిట్లకు సరుకులు, వస్తువులు తామే సరఫరా చేస్తామని చెప్పారు. కిరాణ, క్లాత్ స్టోర్, ఫుట్‌వేర్, స్టీల్ సామగ్రి, హార్డ్‌వేర్ పరికరాలను పంపిస్తామని చెప్పి.. ఆనక వస్తువులు ఇవ్వకుండా రూ.6 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకే సొమ్ము ఇచ్చినట్లు లబ్ధిదారులు చెప్తున్నారు. మిగతా సొమ్ములో కొంత జీఎస్టీ కింద కట్ అయిందని, మరికొంత కొందరు ప్రజా ప్రతినిధులు, అధికారులకు ముడుపులుగా ఇవ్వాల్సి ఉందని చెప్పారని వాపోయారు. కాంట్రాక్టర్ ఫోన్ ఎత్తడం లేదు నా భార్య పల్లెర్ల జానమ్మ పేరు మీద డెయిరీ యూనిట్ మంజూరైంది. కాంట్రాక్టర్ మొదట నాలుగు గేదెలు ఇచ్చాడు. మిగతా గేదెలు ఇవ్వకుండా.. మమ్మల్ని తణుకు తీసుకెళ్లి ఫొటోలు తీసుకొని పంపించాడు. మిగతా నాలుగు గేదెలకు డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వడం లేదు. కాంట్రాక్టర్ వర్మకు ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. మా గేదెలు మాకు ఇవ్వాలి. – పల్లెర్ల గోపాల్, తొండ గ్రామం, సూర్యాపేట జిల్లా ఇలా చేస్తే.. పక్కా నిర్వహణ! దళితబంధు మెరుగైన నిర్వహణ కోసం దళితుల అభివృద్ధి, సంక్షేమంపై పనిచేస్తున్న ఓ ఎన్జీఓ పలు సిఫారసులు చేసింది. ► లబ్ధిదారుల ఎంపిక రాజకీయ నిర్ణయం కాకుండా గ్రామం, మండలం యూనిట్‌గా జీవనోపాధి (లైవ్లీవుడ్) ప్రాజెక్టు రూపొందించినట్టుగా చేపట్టాలి. ► లబ్ధిదారుల ఇష్టం ప్రకారం కాకుండా అక్కడి అవసరాలు, మున్ముందు కొనసాగే అవకాశమున్న యూనిట్లను ఎంచుకునే దిశగా కృషి చేయాలి. ► సాంకేతిక నైపుణ్యమున్న వారికి అవే యూనిట్లు, లేని వారికి అక్కడ అవసరమైన యూనిట్లు కేటాయించి శిక్షణ ఇవ్వాలి. ► యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాక వారికి చేతి నిండా పనికల్పించే కార్యాచరణను రూపొందించాలి. దీని అమలు కోసం ప్రత్యేక యంత్రాంగం ఐదేళ్లపాటు కృషి చేయాలి. బహిరంగంగానే అవినీతి దళితబంధు పథకం రూపకల్పనే బాగా లేదు. సరైన విధివిధానాలు లేకే ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఆడింది ఆట, పాడింది పాటలా మారింది. అందుకే చాలాచోట్ల లబ్ధిదారుల ఎంపికలో అవినీతి చోటుచేసుకుంది. పైలట్ మండలాలు సహా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగిన ఎంపికలో భారీగా ముడుపులు చేతులు మారాయి. అవినీతి అక్రమాలు, బహిరంగంగానే జరిగాయి. నిరుపేద దళితుల ఇళ్లలో సంపద సృష్టించాల్సిన పథకం చాలాచోట్ల దారి తప్పింది. – ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐఏఎస్ -
‘దళితబంధు’కు లంచం ఇవ్వొద్దు: కేటీఆర్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/సాక్షి, పెద్దపల్లి: దళితబంధు లబ్ధిదారులు ఆ మొత్తం పొందేందుకు ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వొద్దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. దళితులు ధనికులు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి రూ.10 లక్షలు ఇస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తోందని, తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ ఏం చేశారని అడిగితే.. ప్రతి ప్రజాప్రతినిధి గంటసేపు చెప్పగలరని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో 19 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, ఉద్యోగ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచిందని గుర్తు చేశారు. నల్లధనం వెనక్కి తెస్తానని, జన్‌ధన్ ఖాతా తెరిపించి ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇస్తామని చెప్పిన గడ్డం తాత (పీఎం మోదీ) తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల చొప్పున 18 కోట్ల ఉద్యోగాలు ఇస్తే బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ టూ జెడ్ స్కామ్‌లు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకగాంధీ తెలంగాణకు వచ్చి అవినీతి గురించి మాట్లాడుతున్నారని, వారిని నమ్మొద్దని కోరారు. కేటీఆర్ సోమవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్‌లో ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ పనులకు శంకుస్థాపన, బెల్లంపల్లిలో పుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్, అర్బన్ మిషన్ భగీరథలకు ప్రారంభోత్సవం చేశారు. సింగరేణి స్థలాల్లో నివాసముంటున్న ఏడు వేల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండంలో పోలీస్ కమిషనరేట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లిలో ప్రజా ఆశీర్వాద సభలో, రామగుండంలో నిర్వహించిన ‘రామగుండం నవనిర్మాణ’సభలో ఆయన మాట్లాడారు. ఆ బొగ్గు గనులు సింగరేణికి కేటాయించాలి ‘ప్రధాని, అదానీ అవిభక్త కవలు. ఆ దోస్తును ధనవంతుల్లో 603వ స్థానం నుంచి రెండో స్థానానికి తీసుకువచ్చారు. ప్రస్తుతం సింగరేణి బొగ్గు గనులను అదానీకి కట్టబెట్టేందుకే వేలం పాట నిర్వహిస్తున్నారు. గాలి మోటరులో రామగుండం వచ్చిన మోదీ సింగరేణిని అమ్మబోమని గాలిమాటలు చెప్పారు. ఆ తెల్లారే నాలుగు బొగ్గు గనులను వేలానికి పెట్టారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు నామినేషన్ పద్ధతిలో ఇచ్చేస్తున్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వాటిని సింగరేణికి కేటాయించాలి. పొరపాటున సింగరేణిని అమ్మే ప్రయత్నం చేస్తే రామగుండం అగ్నిగుండం అవుతుంది.’ అని మంత్రి హెచ్చరించారు. బీజేపీ డిపాజిట్లు గల్లంతు చేయాలి: ‘బొగ్గు గనులను కాపాడుకోవాలంటే బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయాలి. మోదీ వచ్చాక గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో నెర్రెలు, నెత్తురు పారిన తెలంగాణలో నేడు కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు పారుతున్నాయి. కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కావాలి. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కథానాయకులు కావాలి.’ అని కేటీఆర్ పి లుపునిచ్చారు. ఆకాశంలో స్పెక్ట్రమ్ నుంచి పాతా ళంలో బొగ్గును విడిచిపెట్టని కాంగ్రెస్ నేతలు ఒక్క చాన్స్ అంటూ అడుగుతున్నారని, మరి పదిసార్లు అవకాశం ఇస్తే ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని మంత్రి ఎద్దేవా చేశారు. పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన సమావేశంలోనూ కేటీఆర్ మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమ్మతోడు ఇక్కడ ఐటీ కంపెనీలంటే నమ్మలే..! ‘బెల్లంపల్లిలో ఐటీ కంపెనీలు ఉన్నాయంటే అమ్మతోడు నేనసలు నమ్మలేదు. ఎమ్మెల్యే చిన్నయ్య తీసుకెళ్లి చూపిస్తే, వాళ్లని చూసి ఎంతో స్ఫూర్తి పొందా. రంగనాథరాజు, శ్రీనాథరాజు, సాయినాథరాజు అనే యువకులు అమెరికా, యూరప్ లాంటి ప్రాంతాల్లో స్థిరపడకుండా పుట్టిన గడ్డకు ఎంతో కొంత చేయాలని అనలటిక్స్ ఐటీ కంపెనీతో 100 మందికి, వెంకటరమణ వాల్యూ పిచ్ కంపెనీతో 200 మందికి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం తరఫున ప్రపంచంతో పోటీ పడేలా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తాం..’అని కేటీఆర్ తెలిపారు. చదవండి: ఇంఫాల్ నుంచి ఇంటికి వచ్చిన తెలంగాణ విద్యార్థులు.. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు -
సంపద సృష్టిస్తున్నాం.. పేదలకు పంచుతున్నాం: కేటీఆర్
సిరిసిల్ల: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సంపదను సృష్టిస్తున్నామని, తిరిగి ఆ సంపదను పేదలకు పంచుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహాలను ఆయన సోమవారం ఆవిష్కరించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పుడు భూముల ధరలు ఎంత ఉన్నాయని, ఇప్పుడు ఎంత ఉన్నాయో తేడాను ప్రజలు గమనించాలన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ రైతులకు రైతుబంధు ఇవ్వడంతోనే భూముల ధరలు పెరిగాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 13,117 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగ్గా ఇప్పుడు తెలంగాణలో విద్యుత్ వినియోగం 16 వేల మెగావాట్లకు చేరిందన్నారు. ఏటా విద్యుత్ కొనుగోలుకు రూ. 10 వేల కోట్లు వెచి్చస్తున్నామని... రూ. 50 వేల కోట్లు వెచ్చించి రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తున్నామన్నారు. రూ. 200 నుంచి రూ. 2,016కు పెన్షన్ పెంచాం.. పేదరికమే గీటురాయిగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఒకప్పుడు రూ. 200గా ఉన్న పెన్షన్‌ను రూ. 2,016కు పెంచామని గుర్తుచేశారు. తెలంగాణలో ఉన్న సౌకర్యాలు ఏ రాష్ట్రంలోనూ లేవని స్పష్టం చేశారు. ఏ ఊరికి వెళ్లినా వైకుంఠధామాలు, డంప్‌యార్డులు, పల్లె ప్రకృతివనాలు, ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఇలా ఎక్కడాలేని సౌలత్లు కలి్పంచిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. నిత్యం తమ ప్రభుత్వాన్ని నిందించే ప్రతిపక్షాలకు చెందిన నాయకులకు సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి గృహలక్ష్మి పథకం కింద రూ. 3 లక్షలు అందిస్తామన్నారు. అర్హులందరికీ డబ్బులిస్తామని కేటీఆర్ తెలిపారు. అంబేడ్కర్ చలవతోనే తెలంగాణ... దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చలవతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజ్యాంగంలో నాడు ఆరి్టకల్–3ని పొందుపరచడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కంటివెలుగు పథకం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని వివరించారు. సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని కుటుంబాలేమైనా ఉంటే ఏదో ఒక రూపంలో ప్రభుత్వ సాయాన్ని ఆయా కుటుంబాలకు అందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, రాష్ట్ర పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ‘సెస్’చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన ఎంపీ సక్కంగ లేడు... మన ఎంపీ (కరీంనగర్) బండి సంజయ్ సక్కంగ లేడని, ఆయన సక్కంగ ఉంటే ఇప్పటికే సిరిసిల్ల జిల్లాకు రైలు సౌకర్యం వచ్చేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆయన హిందూ, ముస్లింల చిచ్చుపెట్టేలా మసీదులను కూలుస్తామని చెప్పడంతోపాటు పేపర్ లీక్‌లు చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీగా వినోద్‌కుమార్‌ను గెలిపిస్తే ఈపాటికి జిల్లాకు రైలు వచ్చేదన్నారు. చదవండి: సుప్రీంకు వెళితే తప్ప బిల్లులు పాస్ చేయరా? -
దళితబంధు.. బీఆర్ఎస్ కార్యకర్తలకు విందు
జన్నారం (ఖానాపూర్): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం బీఆర్ఎస్ కార్యకర్తలకు విందుగా మారిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. మంగళవారం బీఎస్పీ రాజ్యాధికార యాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా జన్నా రం మండలం ధర్మారం, కామన్పల్లి, ఇందన్పల్లి, జన్నారం గ్రామాల్లో పర్యటించారు. జన్నారంలో ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. దళితబంధు పథకం ప్రకటనకే పరిమితమైందని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులతోపాటు గిరిజనేతరులు కూడా అటవీ హక్కు పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు. టైగర్‌జోన్ పేరుతో అడవిలో ఉన్న గిరిజనులు, గిరిజన గ్రామాలను తరలించడం సరికాదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సర్పంచ్ల ఆత్మహత్యలకు కారణమవుతున్న ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రవీణ్ పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు రమేశ్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాథోడ్ బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘సంక్షేమం’ కాస్త మెరుగు !
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖలకు 2023–24 వార్షిక బడ్జెట్లో కేటాయింపులు మెరుగుపడ్డాయి. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి నిధులు కాస్త పెరిగాయి. నూతన నియామకాలు, ఇతరత్రా ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను పెంచింది. అయితే పెరిగిన కేటాయింపులతో మాత్రం క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాలకు పెద్దగా ప్రయోజనం లేదు. గత బడ్జెట్లో సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలకు జరిగినట్లుగానే ఈదఫా అటుఇటుగా కేటాయింపులు చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖ (ఎస్సీడీడీ)కు గత బడ్జెట్ కంటే దాదాపు రూ.400 కోట్లు పెరిగాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న దళితబంధు పథకానికి ఈసారి కూడా రూ.17,700 కోట్లు కేటాయించారు. అయితే ఈ పథకం కింద 2022–23లో ఎలాంటి ఖర్చులు చేయలేదు. ఆ నిధులనే ఈసారి క్యారీఫార్వర్డ్ చేశారు. బీసీలకు అంతంతే...! బడ్జెట్ వెనుకబడిన తరగతుల్లో పెద్దగా ఉత్సాహం నింపలేదు. ఈసారి బీసీ సంక్షేమ శాఖకు రూ.6,229 కోట్లు కేటాయించగా, గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.531 కోట్లు పెరిగాయి. తాజాగా బీసీ కార్పొరేషన్‌కు రూ.300 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.300 కోట్లు చొప్పున కేటాయించారు. గత బడ్జెట్లో ఎంబీసీ కార్పొరేషన్లకు రూ.400 కోట్లు కేటాయించగా... ఈసారి రూ.100 కోట్లు తగ్గింది. 2022–23లో ఈ రెండు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధికి సంబంధించిన పథకాలేవీ అమలు కాలేదు. దీంతో గత కేటాయింపులే ఈసారీ జరిపినట్లు చెప్పొచ్చు. ఇక రజక, నాయూ బ్రాహ్మణ ఫెడరేషన్లకు గత బడ్జెట్ మాదిరిగానే ఈసారీ రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. కల్లుగీత కార్మికుల ఫెడరేషన్‌కు కూడా గతంలో మాదిరిగానే రూ.30 కోట్లు కేటాయించగా... మిగతా ఫెడరేషన్లకు నామమాత్రపు నిధులే కేటాయించడంతో ఆయా వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసినట్లైంది. బీసీ, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలో 2023–24 సంవత్సరంలో కొత్త విద్యా సంస్థల ఏర్పాటు, ప్రస్తుత సంస్థల అప్‌గ్రెడేషన్, తరగతుల పెరుగుదల, కొత్తగా ఉద్యోగుల నియామకాలు తదితరాలకు నిధుల ఆవశ్యకత పెరగడంతో కేటాయింపుల్లో పెరుగుదల కనిపిస్తోంది. అదేవిధంగా క్రిస్టియన్ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్లకు ఆర్థిక చేకూర్పు పథకాల కింద 270 కోట్లు కేటాయించారు. కార్మిక సంక్షేమ శాఖకు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలకు కూడా కేటాయింపులు కాస్త మెరుగుపడ్డట్లు బడ్జెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ శాఖల పరిధిలో కొత్త పథకాల ఊసులేదు. -
3న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
ముషీరాబాద్ (హైదరాబాద్): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత సంక్షేమానికి తీసుకొచ్చిన దళితబంధు పథకం విధివిధానాలు ప్రకటించాలని అందుకోసం ఫిబ్రవరి 3న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ దళిత సంక్షేమానికి కృషి చేస్తూ దళితబంధు పథకం తీసుకొచ్చారని, ఈ పథకం లక్ష్యం నెరవేరకుండా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. నిరుపేదలకి ఈ పథకం చేరే విధంగా విధివిధానాలను ప్రకటించాలన్నారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకటేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ చందు, రాష్ట్ర ప్రధా న కార్యదర్శి తిరుమలేశ్, శ్రీకాంత్, ఓయూ అధ్యక్షుడు ఎల్.నాగరాజు పాల్గొన్నారు. -
‘దళితబంధు’ ఇక బడ్జెట్ తర్వాతే!
సాక్షి, హైదరాబాద్: ప్రతీ నియోజకవర్గంలో 500 మంది ‘దళితబంధు’లబ్ధిదారుల ఎంపికపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో భారీ మొత్తంలో నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పథకం కింద నయాపైసా కూడా విడుదల చేయలేదు. లబ్ధిదారుల ఎంపికపై నెలకొన్న సందిగ్ధంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. దళితబంధు పథకం కింద లబ్ధిదారుల ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలను ప్రకటించలేదు. కేవలం ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారినే అర్హులుగా నిర్ధారిస్తూ వారికి దళితబంధు సాయాన్ని అందిస్తూ వచ్చింది. అయితే ఎమ్మెల్యేల సిఫారసు వ్యవహారం అంతా పక్షపాతధోరణితో జరుగుతోందని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎమ్మెల్యేల సిఫారసుతో సంబంధం లేకుండా అర్హులను గుర్తించాలని హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించిన ఎస్సీ కార్పొరేషన్.. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తోంది. అయితే మరో రెండు నెలల్లో 2022–23 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో ఈ పథకం అమలుపై అధికారవర్గాలు దిక్కులు చూస్తున్నాయి. వచ్చే బడ్జెట్‌తో కలిపేలా.. : 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించింది. ఇందులో ఒక్కో నియోజకవర్గానికి 1,500 యూనిట్ల చొప్పున నిధులు కేటాయించగా.. ఆమేరకు అమలుపై దృష్టిపెట్టింది. అయితే ఒకేసారి 1,500 మంది ఎంపిక బదులుగా తొలివిడతలో ఒక్కో నియోజకవర్గం నుంచి 500 చొప్పున లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఇంతలోనే లబ్ధిదారుల ఎంపిక విధానంపై హైకోర్టు ఆక్షేపణ చెప్పడంతో అధికారులు ఎంపిక ప్రక్రియను నిలిపివేశారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన తర్వాతే ఎంపిక మొదలు పెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్, ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోంది. కాగా, మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ దరఖాస్తుల స్వీకరణ, అర్హుల నిర్ధారణ కష్టమని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత నిధులను వచ్చే బడ్జెట్‌కు క్యారీఫార్వర్డ్ చేస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈమేరకు 2023–24 వార్షిక బడ్జెట్లో ప్రస్తుత ఏడాది దళితబంధు నిధులను కలిపి ప్రతిపాదనలు తయారు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. సోమవారం ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశంలో ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు భావిస్తున్నారు. -
దళితబంధు: ఎమ్మెల్యేల సిఫారసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం అమలు మార్గదర్శకాలపై సందిగ్ధత వీడలేదు. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి దశకు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల ఎంపికకు సంబంధించి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్లో అయోమయం నెలకొంది. వీలైనంత త్వరగా మార్గదర్శకాలు జారీ చేయాలని ఇప్పటికే ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం 2022–23 బడ్జెట్లో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించింది. ఈ లెక్కన ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 1,500 యూనిట్లు చొప్పున మంజూరు చేస్తూ కేటాయింపులు చూపింది. కానీ తొలుత ఒక్కో నియోజకవర్గానికి 500 యూనిట్లు మంజూరు చేయాలంటూ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపిక చేపట్టేందుకు ఎస్సీ కార్పొరేషన్ చర్యలు మొదలుపెట్టగా న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో ప్రక్రియ నిలిచిపోయింది. లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సిఫారసును హైకోర్టు ఆక్షేపించింది. ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా అర్హులైన వారిని ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేయాలని సూచించడంతో లబ్దిదారుల ఎంపికకు ఇప్పటివరకు అనుసరించిన విధానాన్ని నిలిపివేయాలని స్పష్టం చేసింది. జాడలేని మార్గదర్శకాలు ఎమ్మెల్యేల సిఫారసు ద్వారా కాకుండా లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తామని ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు సూచించింది. ఈ క్రమంలో ఎంపిక విధానానికి సంబంధించిన పలు సూచనలను అధికారులు ప్రతిపాదించారు. ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ, అర్హతలు, ఎంపిక ప్రక్రియ తదితర అంశాలతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. మరోవైపు దళితబంధు అమలుకు ప్రత్యేకంగా యాప్, వెబ్‌పోర్టల్‌ను సైతం అధికారులు రూపొందించారు. పథకం అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన వెంటనే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయలేదు. ప్రస్తుతం 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం కొనసాగుతోంది. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఆలోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి నిధులు విడుదల చేయాలి. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ లబ్దిదారుల ఎంపికకు కనిష్టంగా 2 నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈక్రమంలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకుంటే ఈ ఏడాది దళితబంధు లబ్దిదారుల ఎంపిక కష్టమని అంటున్నారు. -
‘వీహబ్’తోడుగా.. విజయం దిశగా..
సాక్షి, హైదరాబాద్: వారు సాధారణ దళిత మహిళలు.. వ్యాపారం చేయాలన్న తపన ఉన్నా ఏం చేయాలనే స్పష్టత లేనివారు.. కానీ ఇప్పుడు వారు ఉపాధి పొందడమేకాదు.. మరికొందరికి ఉపాధినిచ్చే దశకూ చేరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’ ఆర్థికసాయం.. మహిళలు వ్యాపార, వాణిజ్యవేత్తలుగా ఎదిగేలా తోడ్పడేందుకు ఏర్పాటైన ‘వీహబ్’ భాగస్వామ్యం.. కలిసి దీనిని సాకారం చేశాయి. కేవలం మూడు నెలల వ్యవధిలో హుజూరాబాద్ ప్రాంతంలో 343 మంది ఎస్సీ మహిళలు వీహబ్ తోడ్పాటుతో ఎంట్రప్రెన్యూర్లుగా ప్రస్థానం ప్రారంభించడం గమనార్హం. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన వీహబ్ ఇప్పటికే సుమారు 4 వేల మంది గ్రామీణ మహిళల్లో వ్యాపార దక్షత పెరిగేందుకు తోడ్పాటును అందించింది కూడా. ప్రత్యేకంగా అవగాహన కల్పించి.. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వీహబ్ చేస్తున్న కృషిని గుర్తించిన అధికారులు.. హుజూరాబాద్‌లో దళితబంధు పథకం అమల్లో భాగస్వామ్యం కావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన వీహబ్.. మూడు నెలల పాటు దళితబంధు లబ్ధిదారులతో కలిసి పనిచేసింది. వారి అవసరాలు తెలుసుకోవడంతోపాటు ఉపాధి పొందడానికి అవసరమైన తోడ్పాటును అందించింది. మొదట ఉపాధి మార్గం,దానిని ఆచరణలో పెట్టడానికి అవసరమైన వనరులు తదితర అంశాలపై ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను (ఈడీపీ) నిర్వహించింది. దళితబంధు పథకం కింద స్థానికంగా అధికారులు ఎంపికచేసిన 790 మంది లబ్ధిదారులు హాజరయ్యారు. అందులో 343మంది మహిళలు సొంతంగా ఉపాధి యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపారు. అన్ని అంశాల్లో తోడుగా.. మహిళల వ్యాపార ఆలోచన, దాని వెనుకుండే లాభనష్టాలు, ప్రాజెక్టు నివేదిక తయారీ వంటి అంశాలపై వీహబ్ అవగాహన కల్పించింది. లబ్ధిదారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవసరమైన ఏడు అంశాలపై లోతుగా శిక్షణ ఇచ్చింది. వారికి అవసరమైన డాక్యుమెంట్లు, రిజిస్ట్రేష¯] ్లు, లైసెన్సులు, యంత్రాల కొనుగోలుకు అమ్మకందారులతో పరిచయాలు, కొటేషన్లు, స్కీమ్ డబ్బులను అధికారులు విడుదల చేయడం దాకా తోడుగా నిలిచింది. దీంతో 343 మంది మహిళలు 3 నెలల వ్యవధిలోనే వ్యాపారాలను ప్రారంభించగలిగారు. వారి తపన అభినందనీయం తొలుత మేం దళితబంధు లబ్ధిదారులతో సమావేశమై వారి ఆలోచనలను తెలుసుకున్నాం. వాటిని ఆచరణలోకి ఎలా తేవాలనే దానిపై మార్గదర్శనం చేశాం. వారిలో పట్టుదలను నింపేందుకు ఇప్పటికే సక్సెస్ అయిన మహిళా ఎంట్రప్రెన్యూర్ల విజయగాథలను వీడియోల ద్వారా చూపించాం. దళిత మహిళలు లింగ, కుల, సామాజిక, ఆర్థిక అడ్డంకులను దాటుకుని ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేందుకు పడుతున్న తపన అభినందనీయం. – దీప్తి రావుల, సీఈవో, వీహబ్ రెండు నెలల్లోనే సంపాదన మార్గంలోకి.. ఇంటర్ వరకు చదువుకున్న నేను పెళ్లయిన తర్వాత డిగ్రీ పూర్తి చేశా. హోమ్ ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాను. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన చాలా కాలం నుంచి ఉంది. దళిత బంధు కింద ఎంపిక కావడంతో ఏ వ్యాపారమైతే బాగుంటుందనేది తెలుసుకునేందుకు ఎన్నో ప్రాంతాలు తిరిగి, ఎంతో మందిని కలిశాను. నా భర్తకు డ్రైవింగ్ తెలుసు కాబట్టి కారు కొందామనుకున్నా. వీహబ్ ప్రతినిధులను కలిశాక స్పష్టతకు వచ్చా. వారి తోడ్పాటుతో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, స్టేషనరీ షాప్ పెట్టి.. రెండు నెలల్లోనే నెలకు రూ.10వేలకుపైగా సంపాదించే దశకు చేరుకున్నా. – నీరటి మౌనిక, దళితబంధు లబ్ధిదారు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థితిలో ఉన్నా.. చాన్నాళ్లు ఇంటికే పరిమితమైన నేను ఇప్పుడు ఎంట్రప్రెన్యూర్‌గా మారాను. ఇంట్లోనే ఏర్పాటు చేసిన క్యారీబ్యాగ్స్ తయారీ యూనిట్‌తో నెలకు రూ.50వేల దాకా ఆదాయం వస్తోంది. నిజానికి దళితబంధు పథకానికి ఎంపికైన తర్వాత శారీ సెంటర్‌గానీ, కిరాణా దుకాణంగానీ ఏర్పాటు చేయాలనుకున్నాను. వీ హబ్ భేటీ తర్వాత చేతి సంచుల తయారీ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాను. గతంలో ఉపాధి వెతుక్కునే దశ నుంచి ఇప్పుడు వేరేవాళ్లకు ఉపాధి కల్పించే దశకు చేరుకోవడం ఆనందాన్నిస్తోంది. – వేల్పుల శారద, దళితబంధు లబ్ధిదారు, హుజూరాబాద్ -
అనాథ ఆడపిల్లలం.. ఆదుకోండి ..‘దళితబంధు’ ఇస్తే చెల్లి పెళ్లి చేస్తా!
స్టేషన్‌ఘన్‌పూర్: ‘నిరుపేద కుటుంబానికి చెందిన అనాథలం.. ‘దళిత బంధు పథకం మంజూరు చేసి ఆదుకుంటే చెల్లి వివాహం చేస్తాను’.. అంటూ లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి చెందిన తిప్పారపు అనూష అనే యువతి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కాళ్లు మొక్కి వేడుకుంది. సోమవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. తిప్పారపు అనూష, అశ్విని అక్కా చెల్లెళ్లు. పదేళ్ల క్రితం తల్లిదండ్రులు పరశురాములు, పుష్ప అనారోగ్యంతో మృతి చెందాక.. నానమ్మ వద్దే ఉంటున్నారు. పదో తరగతి వరకు చదివిన అనూష కూలి పనిచేస్తూ నానమ్మకు తోడుగా ఉండేది. మూడేళ్ల క్రితం అనూషకు జనగామకు చెందిన కార్తీక్‌తో వివాహమైంది. ఆరునెలల తర్వాత విభేదాలతో వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి అనూష నానమ్మ వద్దే ఉంటోంది. డిగ్రీ ఫస్టియర్ వరకు చదివిన అశ్విని ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువు ఆపేసింది. ‘కూలి పనులు చేస్తే వచ్చే డబ్బులతో కుటుంబం గడుస్తోంది.. చెల్లికి వివాహం చేయాలి.. ప్రభుత్వం అందిస్తున్న దళితబంధు పథకం మంజూరు చేసి ఆదుకోవాలి’.. అంటూ అనూష.. ఘన్‌పూర్‌లో ఒక కార్యక్రమానికి వచ్చి వెళ్తున్న ఎమ్మెల్యే కాళ్లపై పడి వేడుకుంది. -
Dalit Bandhu: అత్యంత పేదలకు జాబితాలో ముందు చోటు!
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపిక విధానంలో మార్పులు చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యే సిఫార్సు చేసిన జాబితా ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసి.. ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. అయితే ఈ విధానంతో ఎమ్మెల్యే అనుచరులు మాత్రమే లబ్ధి పొందుతున్నారని, మిగతా వారికి ప్రాధాన్యం దక్కడం లేదని క్షేత్రస్థాయిలో ఆరోపణలున్నాయి. ఆర్థిక అసమానతలను తొలగించే క్రమంలో నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రభుత్వ స్ఫూర్తికి విఘాతం కలుగుతోందని దళిత కుటుంబాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇటీవల కొందరు ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఎమ్మెల్యే సిఫార్సుతో సంబంధం లేకుండా లబ్ధి చేకూర్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. దీంతో లబ్ధిదారుల ఎంపిక నిబంధనల్లో మార్పులపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ప్రత్యేక కమిటీ ద్వారా ఎంపిక చేస్తే... లబ్ధిదారులను ఎమ్మెల్యే సూచించిన జాబితా ఆధారంగా కాకుండా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈమేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ సూచనలతోపాటు, ఎమ్మెల్యేల సూచనలు సైతం కోరింది. ఈ క్రమంలో అసెంబ్లీ స్థానం పరిధిలో జిల్లా అధికారి లేదా ఆర్డీఓ, సమానస్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు సూచించారు. ఈ కమిటీలో ఎమ్మెల్యేను సైతం భాగస్వామ్యం చేయాలని శాసనసభ్యులు సైతం కోరినట్లు తెలిసింది. నియోజకవర్గంలోని గ్రామాలన్నీ కవర్ అయ్యేలా ఎంపిక ప్రక్రియ ఉండాలనే సూచనలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాక ఎంపిక ప్రక్రియ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం దళితబంధు కింద ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 500 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం ఆమోదించినప్పటికీ కోర్టు సూచనలతో నిలిచిపోయింది. -
దళితబంధుపై హైకోర్టు తీర్పు భేష్
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం కింద లబ్ధిదారుల ఎంపికకు ఎమ్మెల్యేల సిఫారసు అక్కర్లేదంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ను స్వాగతిస్తున్నామని ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ నాగరిగారి ప్రీతంతో శుక్రవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దళిత బంధు కోసం ఏర్పాటు చేసే కమిటీల్లో అధికారులే ఉండాలని, టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలను నియమించవద్దని, లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారా జరగాలని ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు పాదాభివందనం చేసిన హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు లాంటి అధికారులు నిజాయతీగా పని చేయలేరని ఆ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. రేవంత్‌ను కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ (తెలంగాణ–ఏపీ) గారెత్ విన్ ఒవెన్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రేవంత్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఒవెన్ పలు అంశాలపై చర్చించారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి -
దళితబంధులో ఎమ్మెల్యేల జోక్యమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేద దళితులకు ఇస్తున్న దళితబంధు పథకంలో ఎమ్మెల్యే సిఫార్సు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. లబ్ధిదారుడి అర్హత మేరకు పథకానికి ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ పథకాల్లో రాజకీయ జోక్యం కూడదని తేల్చిచెప్పింది. అసలు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి వారెవరని ప్రశ్నించింది. తమకు దళితబంధు ఇప్పించాలంటూ కొందరు వరంగల్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎమ్మెల్యే సిఫార్సు లేకుండా దరఖాస్తు స్వీకరించలేమని తిరస్కరించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే పథకాన్ని అందజేస్తున్నారని.. ఇతరులు అర్హులైనా వారి దరఖాస్తును తిరస్కరిస్తున్నారని వరంగల్‌కు చెందిన జన్ను నూతన్‌బాబు సహా పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్, వరంగల్ జిల్లా కలెక్టర్, వరంగల్ ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ పి.మాధవిదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్ వాదనలు వినిపించారు. ప్రజల డబ్బుతోనే పథకాలు నిర్వహణ జరుగుతోందని.. అర్హులైన వారికి వాటిని వర్తింపజేయాల్సి ఉందన్నారు. అయితే కొన్నిచోట్ల ఎమ్మెల్యేల సిఫార్సు ఉంటే తప్ప.. దరఖాస్తులు స్వీకరించమని అధికారులు చెబుతున్నారని వెల్లడించారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే దళితబంధు అందుతోందని.. ఇతర అర్హులకు నిరాశే ఎదురవుతోందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ ఈ ఏడాది మార్చి 17న, ఏప్రిల్ 20న విడుదల చేసిన ఆదేశాలను తప్పుబడుతూ కొట్టివేసింది. పిటిషనర్ల దరఖాస్తులను ఎంపిక కమిటీకి పంపాలని ఆదేశించింది. పథకం మార్గదర్శకాల మేరకు అర్హులైతే వారిని ఎంపిక చేయాలంది. రాజకీయ నాయకుల జోక్యం లేకుండా అర్హులను ఎంపిక చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
Dalit Bandhu: దళిత బంధు యూనిట్లకు డెడ్‌లైన్
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం కింద మంజూరు చేసిన యూనిట్ల ప్రారంభంపై ఎస్సీ అభివృద్ధి శాఖ దృష్టి సారించింది. ఈ పథకం కింద అర్హుల ఎంపిక, నిధుల విడుదలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన ప్రభుత్వం.. నిర్దిష్ట గడువు విధించడం ద్వారా మంజూరు చేసిన యూనిట్లన్నీ పూర్తిస్థాయిలో ప్రారంభించి ఆయా ఎస్సీ కుటుంబాల జీవనోపాధిని మెరుగుపర్చాలని స్పష్టం చేసింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన యంత్రాంగం యూనిట్ల ప్రారంభానికి డెడ్‌లైన్ నిర్దేశించుకుంది. డిసెంబర్ 31 కల్లా ఇప్పటివరకు యూనిట్లన్నీ పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యేలా కసరత్తు మొదలుపెట్టింది. వివిధ దశల్లో యూనిట్లు రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో దళితబంధు పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం.. తాజాగా నాలుగో విడతకు కూడా శ్రీకారం చుట్టింది. అయితే మూడు విడతల్లో 38,476 కుటుంబాలను ఎంపిక చేసిన ప్రభుత్వం.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.3,847.6 కోట్లు జమ చేసింది. ఇప్పటివరకు కేవలం 15,650 యూనిట్లు మాత్రమే గ్రౌండింగ్ కాగా.. మిగతావి వివిధ దశల్లో ఉన్నట్లు సంబంధిత శాఖాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని యూనిట్ల ప్రారంభానికి ఎస్సీ కార్పొరేషన్ కసరత్తు వేగవంతం చేస్తోంది. జిల్లాల వారీ సమీక్షకు ఆదేశం రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇటీవల దళితబంధు పథకం పురోగతిపై సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. మంజూరు చేసిన యూనిట్లు.. ప్రారంభించిన యూనిట్ల మధ్య భారీ అంతరం ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రారంభం కాని యూనిట్లపై దృష్టి సారించాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ సమీక్షల తర్వాత యూనిట్ల ప్రారంభానికి ఏయే చర్యలు తీసుకోవాలనే అంశంపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు లాభసాటిగా ఉన్న వ్యాపార యూనిట్లను క్షేత్రస్థాయిలో సందర్శించాలని భావిస్తున్నారు. చదవండి: జాతీయ బరిలో బీఆర్ఎస్.. ‘ఫామ్‌హౌస్’ ఫైల్స్‌పై దేశవ్యాప్తంగా ప్రచారం -
రాష్ట్రాన్ని మీరే సంతోషంగా ఏలుకోండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో అన్ని కులాలవారికి దళితబంధు తరహాలో బంధు పథకాలు ప్రకటించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యుల్లోనూ నిరుపేదలున్నారని..రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందికి ఈ బంధు పథకాన్ని అమలు చేసి..రాష్ట్రాన్ని సంతోషంగా ఏలుకోవాలన్నారు. మంగళవారం సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. ముస్లింలకు 12% రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ అమలుకు నోచుకోలేదన్నారు. ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు ఎన్నికలోపు అమలు చేయకపోతే ప్రశ్నిస్తామన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం మంచి నిర్ణయమని అదేవిధంగా పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని కోరారు. ఏఐసీసీ అధ్యక్షపదవి కోసం అశోక్ గెహ్లోట్, శశిథరూర్ పేర్లు విన్పిస్తున్నాయని, సోనియా, రాహుల్ నిర్ణయాన్ని కాదనలేమని చెప్పారు. -
Telangana: దళితబంధు @ 600కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలు వేగం పుంజుకుంది. నిధుల విడుదలలో జాప్యంతో గత కొంత కాలంగా నెమ్మదించిన ఈ పథకానికి ప్రభుత్వం తాజాగా రూ.600 కోట్లు విడుదల చేసింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన ఎస్సీ కార్పొరేషన్.. ఈ పథకం కింద ఇప్పటివరకు ఎంపికైన లబ్ధిదారులందరికీ ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఇప్పటివరకు 38,476 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఎంపికయ్యారు. ప్రస్తుతం ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.3,847.6 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. హుజూరాబాద్‌తో షురూ దళితబంధు పథకం ఇప్పటివరకు నాలుగు కేటగిరీల్లో అమలైంది. తొలుత కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ మేరకు లబ్ధిదారుల ఎంపిక మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలో మొత్తం 18,211 కుటుంబాలను గుర్తించిన యంత్రాంగం.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అర్హులందరి ఖాతాల్లో నిధులను జమ చేసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలో ఉన్న 75 దళిత కుటుంబాలను ఎంపిక చేసి వారి బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు. ఆ తర్వాత చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్ మండలాలను ఎంపిక చేసిన ప్రభుత్వం ఆయా మండలాల్లోని దళిత కుటుంబాలన్నింటికీ సాయం అందించాలని నిర్ణయించి ఆ మేరకు అర్హులను ఎంపిక చేశారు. అనంతరం దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే క్రమంలో నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వంద యూనిట్లు మంజూరు చేశారు. ఆ మేరకు స్థానిక ఎమ్మెల్యేలు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను ఎస్సీ కార్పొరేషన్‌కు సమర్పించగా.. ప్రస్తుతం అందరి ఖాతాల్లో అధికారులు నిధులను జమ చేశారు. యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణ ఇప్పటివరకు పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసిన ప్రభుత్వం.. ఇక యూనిట్ల ప్రారంభంపై దృష్టి పెట్టాలని ఎస్సీ కార్పొరేషన్‌ను ఆదేశించింది. జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా లబ్ధిదారులతో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి.. వారికి ఆసక్తి ఉన్న యూనిట్ల ఏర్పాటు, వాటి నిర్వహణపై ఎస్సీ కార్పొరేషన్ శిక్షణ ఇవ్వనుంది. యూనిట్లు గ్రౌండింగ్ అయ్యే విధంగా నియోజకవర్గ స్థాయిలో అధికారులకు లక్ష్యాలను నిర్దేశించి, నూరుశాతం పురోగతి వచ్చేలా చర్యలు చేపడుతోంది. కొత్తగా నియోజకవర్గానికి 500 యూనిట్లు.. 2022–23 వార్షిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 1,500 యూనిట్ల చొప్పున ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. అయితే తొలి విడత కింద ప్రతి సెగ్మెంట్‌కు 500 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఎమ్మెల్యేలకు సూచించింది. -
దళితబంధుపై సమగ్ర నివేదిక సమర్పించండి
సాక్షి, సిటీబ్యూరో: దళిత బంధు యూనిట్ల పనితీరుపై సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతగా దళిత బంధు కింద లబ్ధి పొందిన వారి వివరాలు, యూనిట్ ప్రస్తుత పనితీరు, సాధించిన ఫలితాలు తదితర వివరాలతో ఫోటో, వీడియో గ్రఫీని సేకరించి నివేదిక రూపంలో ఈ నెల 20 వ తేదీ లోగా అందజేయాలని సూచించారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో దళితబందు పథకం అమలు జరుగుతున్న తీరుపై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమం అమలులో ఎలాంటి విమర్శలకు, ఫిర్యాదులకు అవకాశం లేకుండా నిబంధనల ప్రకారం అమలు చేయాలని ఆదేశించారు. అర్హులైన దళితులందరికీ.. ►అర్హులైన దళితులందరికి దశల వారిగా ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి వెల్లడించారు. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేసి ఆర్ధిక సహాయం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు ►హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాలలో 1476 మంది దరఖాస్తు చేసుకోగా, 1462 మంది ఖాతాలలో 10 లక్షల రూపాయలు చొప్పున నిధులు జమ చేసినట్లు మంత్రి వివరించారు. వీరిలో 1200 మంది లబ్ధిదారులకు వారి యూనిట్ లను అందజేయడం జరిగిందని చెప్పారు. ►మొదటి విడతలో మంజూరై గ్రౌండింగ్కానీ యూనిట్లను ఈ నెలాఖరులోగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ప్రభాకర్ రావు, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సాయన్న, ముఠా గోపాల్, జాఫర్ హుస్సేన్, పాషా ఖాద్రి, కలెక్టర్ అమయ్ కుమార్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
దళితబంధుతో నిరుపేదల జీవితాల్లో వెలుగు
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం మరిన్ని కుటుంబాలకు వర్తించేలా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం.. నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ ఎల్.రమణతో కలసి మీడియాతో మాట్లాడారు. దళితబంధు పథకం అమలుకోసం ఇప్పటి వరకు రూ. 3,249 కోట్లను వెచ్చించామని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న దళితబంధును దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని, దేశంలోని దళితులందరికీ ఈ పథకాన్ని అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితబంధుపై దుష్ప్రచారం చేయడం సరికాదని, బీజేపీ ఉచితాల రద్దు పేరుతో దళితబంధును కూడా లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తమ మేనిఫెస్టోలో దళితబంధు పథకాన్ని పెట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్న హామీ ఇవ్వాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగి పోయాయని, సామాజిక బహిష్కరణలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో దళితులపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. -
‘దళితబంధు’ విస్తరణ.. ఒక్కో నియోజకవర్గంలో 1,500 మంది చొప్పున
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గానికి 100 మంది చొప్పున అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాన్ని అమలు చేసిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గంలో 1,500 మంది చొప్పున లబ్ధిదారులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. తొలి దశలో ఒక్కో నియోజకవర్గానికి 500 మంది చొప్పున 118 నియోజకవర్గాల్లో (హుజూరాబాద్ మినహా) అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి పథకం అమలు చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం ప్రగతి భవన్లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు.. సుంకిశాల నుంచి హైదరాబాద్‌కు అదనంగా 33 టీఎంసీల నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు రూ. 2,214.79 కోట్లు మంజూరు. ∙పోడు భూముల సమస్య పరిష్కారానికి ఆయా జిల్లాల మంత్రుల ఆధ్వర్యంలో రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖలతో ప్రతి జిల్లాలో సమన్వయ సమావేశాల నిర్వహణకు నిర్ణయం. ∙జీహెచ్ ఎంసీలో 5 నుంచి 15 వరకు.. ఇతర కార్పొరేషన్లలో 5 నుంచి 10 వరకు కో–ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంచాలని తీర్మానం. ∙రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఫారెస్టు వర్సిటీకి కొత్త పోస్టుల మంజూరుకు ఆమోదం. ∙కొత్త జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణాలకు 21 జిల్లా కేంద్రాల్లో స్థలాల కేటాయింపునకు తీర్మానం. ∙భద్రాచలంలో ముంపు ప్రాంతాల్లోని 2,016 కు టుంబాలకు కాలనీలు నిర్మించాలని నిర్ణయం. -
వాసాలమర్రిలో వడివడి.. హుజూరాబాద్‌లో తడబడి..
హుజూరాబాద్ నుండి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దళితబంధు.. తెలంగాణ దళితుల సంక్షేమం, అభివృద్ధిలో ఓ విప్లవం. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయంతో ఉపాధి మార్గాన్ని చూపే ఓ కొత్త వెలుగు. ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తి మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ దళితుల స్థితిగతులను మార్చేందుకు వాసాలమర్రిలో పురుడుపోసుకున్న ఈ పథకం హుజూర్బాద్లో విస్తరించి ఏడాదిని పూర్తి చేసు కుంటోంది. అయితే లక్ష్యాలు, నిబంధనలు ఒక్కటే అయినా, యాదాద్రి జిల్లా వాసాలమర్రి లబ్ధిదారుల్లో వెలుగులు నింపుతున్న ఈ పథకం..హుజూరాబాద్‌లో మాత్రం తడబడుతోంది. తక్కువ సంఖ్యలో లబ్ధిదారులు, సరైన యూనిట్ల ఎంపిక, అధికారుల పర్యవేక్షణ, మెరుగైన అమలు తీరు వాసాలమర్రి దళితులను విజయపథంలో నడిపిస్తుంటే..యూనిట్ల ఎంపికలో అవగాహన లోపం, సరైన మార్గదర్శకత్వ లేమి కారణంగా హుజూరాబాద్‌లో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రత్యేక సర్వే.. పకడ్బందీగా అమలు వాసాలమర్రిలో స్థానిక మార్కెట్ పరిస్థితి, లబ్ధిదారుల అభిరుచులు, వారి సాంకేతిక సామర్థ్యాల పరిశీలన అనంతరం యూనిట్లను మంజూరు చేశారు. ఆపై వారు నిలదొ క్కుకునేందుకు ప్రత్యేక శిక్షణ, పరిశీలనతో ముందుకు వెళ్తుండటంతో ఇక్కడ సక్సెస్ రేటు ఊహించినదానికంటే అధికంగా ఉంది. మెజారిటీ లబ్ధిదారుల పరిస్థితి ప్రభుత్వం ఆశించిన విధంగా మెరుగుపడుతోంది. స్థానిక అవసరాల మేరకు యూనిట్లు ‘వాసాలమర్రిలో తొలుత ప్రత్యేకంగా సర్వే చేసి స్థానిక పరిస్థితులు, అవసరాలను గుర్తించాం. ఇదే సమయంలో లబ్ధిదారుల్లో సామర్థ్యాన్ని పరిశీలించి వారు కోరుకున్నవి కాకుండా అక్కడ అవసరం ఉన్న యూనిట్లు పెట్టించాం. 75 మందికి 19 రకాల పనులు అప్పగించి చేయూతనిస్తున్నాం. మెజారిటీ లబ్ధిదారుల ఆర్థికస్థితి ఇప్పుడిప్పుడే మారుతోంది..’ అని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ చెప్పారు. ఇక్కడ కోరుకున్న వారికి కోరుకున్నట్టుగా..! హుజూరాబాద్‌లో 15,710 కుటుంబాలకు దళితబంధు అందజేయాలన్న లక్ష్యంతో ఇప్పటికి 12,007 మందికి అందజేశారు. అయితే ఇక్కడ స్థానిక పరిస్థితులు, లబ్ధిదారుల సామర్ధ్యం, మార్కెట్లో డిమాండ్ – సప్లయితో సంబంధం లేకుండా యూనిట్ల పంపిణీ సాగుతోంది. దీంతో లబ్ధిదారుల్లో తమకు రూ.10 లక్షల సహాయం అందుతుందన్న సంతోషం ఉన్నా, ఆశించిన ఆదాయం రావటం లేదన్న అసంతృప్తి వెంటాడుతోంది. హుజూరాబాద్ మండలం చిల్పూరులో 324 కుటుంబాలకు యూనిట్లు మంజూరు చేస్తే అందులో 142 యూనిట్లు వాహనాలే కావటం విశేషం. ఇక ఎక్కువ సంఖ్యలో బర్రెలు తీసుకున్నవారూ సంతృప్తిగా లేరు. హరియాణాæ నుండి తెచ్చిన బర్రెలు ఆశించిన విధంగా పాలు ఇవ్వకపోగా, అనారోగ్యం పాలవున్న తీరు లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. లబ్ధిదారుల అవగాహన లోపం, సరైన చర్యలు తీసుకోవడంలో అధికారుల వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాసాలమర్రిలో ‘లక్ష్మీ’ కటాక్షం దళితబంధు పథకంతో తన పేరు నిజంగా సార్ధకమైందని అంటోంది..వాసాలమర్రికి చెందిన చెన్నూరి లక్ష్మి. నలుగురు పిల్లల తల్లయిన లక్ష్మి గతంలో అద్దెకు తీసుకున్న ఆటోలో భర్తతో కలిసి ఊరూరూ తిరుగుతూ కూరగాయల వ్యాపారం చేసేది. కానీ వచ్చిన లాభంలో 75 శాతం ఆటో అద్దెకే పోయేది. ఈ నేపథ్యంలో దళితబంధు కింద లక్ష్మి ఆటో ట్రాలీ తీసుకుంది. కూరగాయలు కొని అమ్మితే లాభం ఉండదని భావించింది. తనకున్న భూమిలో బోరు వేసి తాను కూడా కాయగూరల సాగు మొదలుపెట్టింది. ఇప్పటికే నలుగురు కూతుళ్లలో ఇద్దరి వివాహాలు చేయగా, బీటెక్, ఎంబీఏ చదువుతున్న ఇంకో ఇద్దరు అమ్మాయిలున్నారు. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్న కుమార్తె మానసతో కలిసి లక్ష్మి చుట్టుపక్కల పల్లెలకు ఆటోలో వెళ్లి వస్తూ వ్యాపారం చేస్తోంది. సొంత ఆటో, వ్యవసాయ పంటలతో ప్రస్తుతం లక్ష్మిఆదాయం నెలకు రూ.50 వేల వరకు చేరింది. ఇక దీపం వత్తులు చేస్తున్న బొల్లారం లావణ్య, పేపర్ గ్లాస్లు తయారు చేసి విక్రయిస్తున్న బొల్లారం రేఖలు చిన్నపాటి పారిశ్రామికవేత్తలుగా మారిపోయారు. తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నారు. ఈ తరహా మార్పు వాసాలమర్రిలోని 80 శాతం లబ్ధిదారుల్లో కనిపిస్తోంది. వరినాటు మెషీన్ తీసుకున్నాం కానీ.. గతంలో కూలీ పనులు చేసుకొని బతికేటోళ్లం. దళితబంధులో మా చిన్నాన్న అయిలయ్యతో కలిసి వరి నాటు వేసే మెషీన్ తీసుకున్నం. ఇప్పటివరకు 80 ఎకరాల్లో నాట్లు వేసినం. గంటకు ఎకరం వరకు నాటు వేస్తుంది. అయితే ఆ యంత్రాన్ని నడపడం మాకు రాకపోవడంతో బాపట్ల నుంచి డ్రైవర్, టెక్నీషియన్లను తీసుకొచ్చాం. వచ్చిన ఆదాయంలో అత్యధికం డ్రైవర్, టెక్నీషియన్‌తో పాటు డీజిల్‌కే పోయింది. మాకు సరిపడా మిగిలే పరిస్థితి ఉంటే బాగుంటుంది. –పాంకుంట అనిల్, ధర్మరాజుపల్లి (హుజూరాబాద్) కేసీఆర్‌కు రుణపడి ఉంటాం మాకు ఎకరన్నర పొలం ఉంది. మా ఆయన వ్యవసాయం చేస్తోంటే నేను ఊళ్లోనే కూలి పనికి పోయి బతికేది. మాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. దళితబంధులో నెల క్రితం 4 బర్రెలు వచ్చినై. రెండు బర్లు పాలిస్తున్నై. 15 రోజులకు రూ.6 వేల వరకు వచ్చినయి. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. అయితే పాల దిగుబడి ఊహించినట్టుగా లేదు. – పుల్ల సరోజని, చెల్పూరు (హుజూరాబాద్) అడ్డా మీద పెట్టనివ్వలేదు.. రెండు నెలల క్రితం మాకు మా నాన్న పేరుమీద ఆటో ట్రాలీ ఇచ్చారు. ఊరిలో సరిపడా గిరాకీ దొరకటం లేదు. జమ్మికుంట అటో అడ్డాకు పోతే.. సభ్యత్వం కోసం 7 వేలు కట్టమన్నారు. అంతమొత్తం లేక ఆటో ఊరిలోనే పెట్టా. ఇక్కడ గిరాకీ దొరికితే పోతున్న. – గోపీచంద్, చెల్పూరు (హుజూరాబాద్) చేయి విడువని వ్యవస్థ కావాలి దళితబంధు అనేది సంక్షేమ రంగంలోనే అత్యద్భుతం. అయితే యూనిట్ ఎంపిక, నిర్వహణ, భవిష్యత్తులో వచ్చే సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ అవసరం. ఇది ప్రభుత్వంతో పాటు దళిత ప్రజాస్వామిక సంఘాల బాధ్యత. వచ్చే ఐదేళ్ల పాటు లబ్ధిదారులకు అన్నివిధాలా సహాయకారిగా ఉండేలా చేయి విడువని వ్యవస్థ ఏర్పాటు చేస్తేనే పథకం లక్ష్యం నెరవేరుతుంది. – మల్లేపల్లి లక్ష్మయ్య, చైర్మన్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అన్నివిధాలా అండగా ఉండాలి రాష్ట్రంలో 19 లక్షల దళిత కుటుంబాలున్నాయి. రూ.3,100 కోట్లతో 29 వేల మంది లబ్ధిదారులకు పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఈ పథకంతో దళితుల జీవితాల్లో మార్పులు రావాలంటే ప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సిన పలు చర్యలను నిపుణులు సూచిస్తున్నారు. ►యూనిట్ల మంజూరుతోనే సరి పెట్టుకోకుండా లబ్ధిదారులకు అన్నివిధాలా అండగా నిలవాలి. అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. ►లబ్ధిదారులు స్థానిక పరిస్థితులు, వారి సామర్థ్యానికి అనుగుణంగా యూనిట్లు ఎంపిక చేసుకునేలా చూడాలి. యూనిట్ల పంపిణీ కంటే ముందుగానే వాటిపై పూర్తి అవగాహన కల్పించాలి. అవసరమైన సాంకేతిక శిక్షణ ఇవ్వాలి. మార్కెట్ మెలకువలు కూడా వివరించాలి. ►దళితబంధు లబ్ధిదారుల పర్యవేక్షణ కోసం ప్రతి మండలానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించి యూనిట్లు లాభాల బాట పట్టేలా మిగతా విభాగాలతో సమన్వయం చేయాలి. ►ప్రతి నెలా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి, లోపాలు సరిదిద్దడంతో పాటు లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. ►ప్రభుత్వ విభాగాల్లో ప్రైవేటు వాహనాల వినియోగం స్థానే.. దళితబంధు యూనిట్లకు ప్రాధాన్యవ్వాలి. ►జిల్లా స్థాయిలో గ్రీవెన్స్‌సెల్ పెట్టి వచ్చే ఫిర్యాదులపై తక్షణ పరిష్కారం చూపాలి. -
దళితబంధుతో 17లక్షల కుటుంబాల్లో వెలుగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధుతో రాష్ట్రంలోని 17 లక్షల కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళితబంధు లాంటి బృహత్తరమైన, విప్లవాత్మకమైన పథకం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదన్నారు. ఈ పథకం అమలు విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని, ఎవరూ కూడా అయోమయానికి, గందరగోళానికి గురి కావొద్దని సూచించారు. దళితబంధును ముఖ్యమంత్రి కేసీఆర్ యజ్ఞంలా దృఢ సంకల్పంతో అమలు చేస్తున్నారన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 యూనిట్లకు సంబంధించి మొత్తం 11 వేల 500 పూర్తి కాగా, మిగిలిన 335 యూనిట్ల గ్రౌండింగ్ నాలుగైదు రోజుల్లో పూర్తవుతుందని, అసెంబ్లీ నియోజకవర్గానికి 1,500 యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని కొప్పుల తెలిపారు. వచ్చే ఎనిమిదేళ్లలో మొత్తం 17 లక్షల ఎస్సీ కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని, వారి జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయని ఆకాంక్షించారు. -
దళితబంధులో సామాజిక న్యాయం పాటించాలి
మెదక్‌జోన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంలో సామాజిక న్యా యం పాటించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన వంగపల్లి మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 22శాతం ఉన్న మాదిగలకు మొదట ప్రాధాన్యం ఇవ్వా లన్నారు. జనాభా దామాషా ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మాదిగలు అలుపెరుగని పోరాటం చేశారని గుర్తుచేశారు. డప్పు దరువు, గూటం దెబ్బతో ఉద్యమాన్ని ఉధృతం చేసి, కేంద్రం మెడలు వంచిన ఘనత మాదిగలకు ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, జాతీయ కార్యదర్శి యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రం పాల్గొన్నారు. -
దళితబంధు యూనిట్లపై పర్యవేక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం అమలులో మరిన్ని సంస్కరణలు చేయాలని భావిస్తోంది. ఈ పథకం లబ్ధిదారుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంతో అమలు చేస్తుండగా... వారికి నిత్యం సహాయ, సహకారాలను అందించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులు ఏర్పాటు చేసిన యూనిట్‌ను దళితబంధు వెబ్సైట్లో ఎంట్రీ చేసి, నిర్వహణ తీరును క్రమం తప్పకుండా రికార్డు చేసేందుకు ఈ ప్రత్యేక విభాగం పనిచేయనుంది. లబ్ధిదారులు, జిల్లా సంక్షేమాధికారులతో సమన్వయానికి ఈ విభాగం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో ఈ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే దళితబంధు అమలుకు ఏడుగురు అధికారులతో ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ సంక్షేమ శాఖలు, రెవెన్యూ అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీ... క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా పథకంలో సవరణలకు సూచనలిస్తోంది. తాజాగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విభాగం రాష్ట్రస్థాయి కమిటీతో సమన్వయం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిర్వహణపై పర్యవేక్షణ... దళితబంధు సాయంతో ఏర్పాటు చేసిన వ్యాపార యూనిట్ల తీరును ఈ ప్రత్యేక విభాగం క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంది. నెలకోసారి యూనిట్ నిర్వహణ తీరుపై సంబంధిత లబ్ధిదారుతో మాట్లాడి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుంది. అంతేకాకుండా ఏవైనా సమస్యలెదురైతే... సంబంధిత కేటగిరీకి చెందిన నిపుణులతో సమన్వయపర్చి లబ్ధిదారులకు సలహాలు, సూచనలు ఇవ్వనుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 34వేల మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఎంపికయ్యారు. వీరి ఖాతాల్లో రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం జమ చేసింది. ఇందులో ఇప్పటికే 8వేల మంది లబ్ధిదారులు వారి ఖాతా నుంచి నగదును ఉపసంహరించి వివిధ రకాల యూనిట్లను తెరిచారు. మరో రెండు నెలల్లో 50శాతానికి పైగా లబ్ధిదారులు యూనిట్లు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
దళితబంధు కాదు.. దగా బంధు: ఆర్ఎస్పీ
జూలూరుపాడు: దళితుల అభ్యున్నతి కోసమే దళితబంధు పథ కాన్ని ప్రవేశపెట్టామని టీఆర్ఎస్ సర్కార్ గొప్పలు చెబుతున్నా.. అది దళి తులను దగా చేసేందుకేనని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపిం చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి అను చరులకే తప్ప నిరుపేదలకు దళిత బంధు అందడం లేదన్నారు. ప్రవీణ్ చేపట్టిన బహుజ న రాజ్యాధికార యాత్ర మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లోని అనంతారం, కాకర్ల, పడమట నర్సాపు రం, బేతాళపాడు, గుండ్లరేవు, అన్నారుపాడు, పాపకొల్లు, జూలూరుపాడు గ్రామాల్లో కొనసాగింది. ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నా పేదలు మాత్రం ఇంకా దుఃఖంలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. -
హరితహారం లక్ష్యం 19.5 కోట్ల మొక్కలు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది హరితహారం కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 19.5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.సోమేశ్‌కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది హరితహారాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల 7.70 శాతం అటవీ విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఎనిమిదో విడత హరితహారం కింద సాగునీటి ప్రాజెక్టుల వద్ద, కాల్వ గట్లపై పచ్చదనం పెంచడాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని వారంలోగా కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హరితహారం, దళితబంధు, యాసంగి వరిధాన్యం సేకరణ తదితర అంశాలపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో శుక్రవారం సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 10 శాతం కన్నా తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి పెద్దఎత్తున పచ్చదనం పెంచాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,400 ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామని, మిగిలిన గ్రామాల్లో వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి మండలంలో కనీసం నాలుగు బృహత్ పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేయాలని, పచ్చదనం పెంపునకు ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. దళితబంధు గురించి మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మంజూరు చేసిన యూనిట్లకుగాను లబ్ధిదారులను గుర్తించాలని, ఇప్పటికే గుర్తించినవారికి వెంటనే లబ్ధి చేకూర్చాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కలి్పంచాలి ధాన్యం సేకరణ గురించి సోమేశ్ కుమార్ మాట్లాడుతూరాష్ట్రంలో ఏడు కోట్ల గన్నీబ్యాగులు అందుబాటులో ఉన్నాయని, మరో 4.5 కోట్ల బ్యాగులు త్వరలో వస్తాయని చెప్పారు. అన్ని రైతు వేదికల్లో సమావేశాలు జరిగేలా చూడాలని, వ్యవసాయ విస్తరణ అధికారులతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ డోబ్రియల్, పురపాలక శాఖ, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరి్వంద్‌కుమార్, రామకృష్ణారావు, రజత్‌కుమార్, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
దళితబంధు: మళ్లీ ఎమ్మెల్యేలకే పగ్గాలు!
సాక్షి, హైదరాబాద్: దళితబంధు లబ్ధిదారుల ఎంపికను ఈసారి కూడా ఎమ్మెల్యేలకే అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. 2021–22 సంవత్సరంలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు 100 యూనిట్లు మంజూరు చేయగా సంబంధిత శాసనసభ్యులే ప్రత్యేక చొరవతో లబ్ధిదారుల ఎంపిక చేపట్టారు. ఈసారి ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 1,500 యూనిట్లు మంజూరు చేయడంతో ఈ దఫా కూడా ఎమ్మెల్యేలకు ఎంపిక బాధ్యత అప్పగిస్తే బాగుంటుందని ప్రభుత్వానికి ఎస్సీ కార్పొరేషన్ సూచిస్తోంది. కార్యాచరణ ప్రణాళికలో ఎమ్మెల్యేల ద్వారా ఎంపికకు ప్రాధాన్యం ఇవ్వాలంటోంది. అయితే ఎమ్మెల్యేలకు ఎంపిక బాధ్యతపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పథకానికి అనూహ్య స్పందన రావడంతో.. 2021–22లో తొలుత హుజూరాబాద్‌లో, ఆ తర్వాత మరో 4 మండలాల్లో దళితబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 చొప్పున యూనిట్లు మం జూరు చేసి లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించింది. యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఆదేశించారు. దీంతో దాదాపు నెల వ్యవధిలో అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్యను 100 నుంచి 1,500కు పెంచింది. ఈ బడ్జెట్లో పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించింది. హుజూరాబాద్ మినహా మిగతా 118 అసెంబ్లీ సెగ్మెంట్లలో పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఉన్నతాధికారులకు బాధ్యతలు ఇవ్వాలంటూ.. వాస్తవానికి ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఎమ్మెల్యేలు సైతం పేర్లను ఎంపిక చేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉంటున్న వ్యక్తులకే దళితబంధు కట్టబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యేలకు కాకుండా ప్రభుత్వ అధికారులకే బాధ్యతలు ఇవ్వాలని కొందరు సూచనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
తెలంగాణ దళితులు దేశానికి దిక్సూచి కావాలి
సిరిసిల్ల: ఆర్థికంగా అట్టడుగున ఉన్న దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయంతోనే దళితబంధు అమలవుతోందని, మన రాష్ట్రంలో ఇది విజయవంతమైతే దేశం మనవైపు చూస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. గురువారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ రూ.17,500 కోట్లతో దళితబంధు పథకాన్ని అమలు చే స్తున్నారని తెలిపారు. లబ్ధిదారులు స్వయం ఉపాధితోపాటు పది మందికి పనికల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ దళితులు దేశానికి దిక్సూచిలా మారాలన్నారు. 75 ఏళ్లలో ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధును ప్రారంభించారన్నారు. కేసీఆర్ 1987–88 ప్రాంతంలోనే సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉండగా.. దళిత చైతన్య జ్యోతి పథకాన్ని ప్రారంభించి దళితులను చైతన్యవంతులను చేశారని గుర్తుచేశారు. తెలంగాణ చిన్న రాష్ట్రం అయినా ఎంతో అభివృద్ధి సాధించి దేశానికి మార్గదర్శి అయిందన్నారు. సీఎం కేసీఆర్ అంటే పరివర్తనకు, మార్పునకు చిహ్నమన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిందే.. కానీ.. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలనే నినాదంతో ఏకీభవిస్తున్నానని, కానీ రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కేం ద్రం అరాచకపాలన సాగిస్తోందని విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడు తూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో ప్రపంచం అబ్బురపడేలా 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. దళిత పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచేందుకు రూ.200 కోట్లతో 3 వేల మందికి టీప్రైడ్ ద్వారా రాయితీలు అందించినట్లు తెలిపారు. భవిష్యత్ తరాలు బాగుండాలంటే చదువు ఒక్కటే మార్గమని, సంపదను సృష్టించి పది మందికి పంచగలిగితే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని అన్నారు. అంబేడ్కర్ ఆలోచనలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని వివరించారు. దళితులతో సహపంక్తి భోజనం సిరిసిల్లలో రూ.2.5 కోట్లతో నిర్మించిన అంబేడ్కర్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. దళితబంధు లబ్ధిదారుల తో సహపంక్తి భోజనం చేశారు. అం తకుముందు తంగళ్లపల్లిలో అంబేడ్కర్ భవ నానికి భూమి పూజ చేశారు. సారంపల్లి, మల్లాపూర్, లక్ష్మీపూర్, అంకుసాపూర్ గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అలాగే సిరిసిల్లలో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ప్రసంగించారు. -
Dalit Bandhu: ఎమ్మెల్యే తమ్ముడికి దళితబంధు
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్: పేద దళితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళితబంధు పథకంలో లబ్ధిదారుడిగా జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సోదరుడు, స్టేషన్‌ఘన్‌పూర్ సర్పంచ్ తాటికొండ సురేశ్ కుమార్ ఉండటంతో స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈయనతో పాటుగా ఘన్పూర్ ఎంపీపీ భర్త, కొందరు ప్రజాప్రతినిధులున్నారు. మండలంలో పేదవారిని కాదని, ఆర్థికంగా ఉన్న వారికి, ఎమ్మెల్యే అనుచరులనే ఎంపిక చేశారని కాంగ్రెస్, బీజేపీ తదితర ప్రతిపక్షపార్టీల నాయకులు, యువకులు సోమవారం సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. కాగా, ఎమ్మెల్యేపై వస్తున్న విమర్శలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చదవండి: (Hyderabad: రోడ్లపై వాహనాలను వదిలేస్తున్నారా.. అయితే ఇక కష్టమే..) -
దళితబంధుపై కేసీఆర్ డ్రామా
తిరుమలగిరి(తుంగతుర్తి): ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ఎలాంటి మార్గదర్శకాలు లేకుండానే ప్రవేశపెట్టారని, ఇది దళితులను మభ్యపెట్టడానికి ఆడుతున్న డ్రామా అని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే దళితబంధు పథకం దక్కుతోందని ఆరోపించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాధికార యాత్ర శుక్రవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సాగింది. ఉదయం స్థానిక రైతులతో ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. అనంతరం గ్రామంలోని డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలు మోసానికి గురయ్యారన్నారు. రైతుబంధు పథకం భూస్వాములకు బంధుగా మారిందని ఆరోపించారు. ఎరువుల ధరలు రెట్టింపయ్యాయని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర మాత్రం రావడం లేదని మండిపడ్డారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామన్న హామీని అమలు చేయలేదని ఆయన విమర్శించారు. దళితబంధు పథకం ఇప్పిస్తామని దళారులు తయారయ్యారని, ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు దండుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సదుపాయాలు లేక ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి అప్పులు చేసి ఆర్థికంగా నష్టపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పోయిందని విమర్శించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో బిక్కేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలించడంతో రైతుల బోర్లు ఎండి పోతున్నా పాలకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బీఎస్పీకి అధికారం ఇస్తే ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. పాలక వర్గాలు ప్రచారం చేస్తున్నట్లు ఎలాంటి అభివృద్ధీ జరగలేదన్నారు. జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం సిద్ధించినప్పుడే అన్ని సామాజిక వర్గాల పేదరికం రూపుమాపడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, నియోజకవర్గ ఇన్చార్జి బల్గూరి స్నేహ, జిల్లా అధ్యక్షుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకే ‘దళిత బంధు’: ప్రవీణ్‌కుమార్
తొర్రూరు/నాగారం: దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకే సీఎం కేసీఆర్ ‘దళితబంధు’కుట్ర పన్నారని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులకే ‘దళిత బంధు’పథకం ద్వారా లబ్ధి జరుగుతోందని ఆరోపించారు. బీఎస్పీ రాజ్యాధికార యాత్ర మంగళవారం తొర్రూరు పట్టణానికి చేరుకుంది. అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నిర్వహించిన కాన్షీరాం జయంతి వేడుకల్లో ప్రవీనమార్ ప్రసంగించారు. రైతుబంధు పథకం కింద పంపిణీ చేసిన రూ.50వేల కోట్లలో రూ.10వేల కోట్లు మాత్రమే చిన్న, సన్నకారు రైతులకు అందాయని అన్నారు. రూ.2.50లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో బలహీన వర్గాలు, దళిత, గిరిజనుల వాటా స్వల్పమన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారి ప్రజలను బలిగొంటోందని, గ్రామాల్లో ఐదు ఇళ్లకు ఒక వితంతువు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు... సూర్యాపేట జిల్లా, నాగారం మండలం, ఫణిగిరిలోని బౌద్ధక్షేత్రం వద్ద స్వేరోస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన భీమ్ దీక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జ్ఞానసమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, పవిత్ర జీవన విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, ఓటును వజ్రాయుధంగా భావించాలని, రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని స్వేరోలకు పిలుపునిచ్చారు. -
17 లక్షల కుటుంబాలకు దళితబంధు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోని దాదాపు 17 లక్షల కుటుంబాలకు దళితబంధు పథకం అందుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని అంబేద్కర్ మైదానంలో 393 మంది దళితబంధు లబ్ధిదారులకు 202 వాహనాల (202 యూనిట్లుగా, 76 హార్వెస్టర్లు, 12 జేసీబీలు, 15 డీసీఎం వ్యాన్లు, 10 వరినాటు యంత్రాలు, 4 టిప్పర్లు, 3 మినీ బస్సులు, 2 టాటా హిటాచీ ఎక్స్కెవేటర్లు, 1 మహీంద్రా స్కార్పియో, 79 గూడ్స్ వాహనాలు)ను మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ దళితుడు లక్షాధికారి కావాలన్న కేసీఆర్ సంకల్పానికి ఈ పథకం నిదర్శనమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రూ.38 కోట్లకుపైగా విలువైన వాహనాలను కానుకగా ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Dalit Bandhu: ‘గులాబీ’లకే దళితబంధు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీకి చెందిన వారికే ప్రాధాన్యం దక్కిందని పలువురు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారం ఎమ్మెల్యేలకు ఇవ్వడంతో వారి అనుయాయులకే యూనిట్లు కేటాయించినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి వంద యూనిట్లను కేటాయించింది. వీటిలో దాదాపు 90 శాతానికి పైగా అధికార పార్టీ వారికి కేటాయించినట్లు తెలుస్తోంది. చదవండి: రహస్య సర్వే: హస్తం కేడర్‌పై.. అధిష్టానం నజర్.. ఎంపిక చేసిన జాబితాలో టీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్నారు. కొన్ని మండలాల్లో సదరు కార్యకర్తలు తమ సమీప బంధువుల పేర్లమీద ఏకంగా రెండు నుంచి మూడు వరకు యూనిట్లు పెట్టుకున్నారు. ఇందులో గతంలో హార్వెస్టర్లు, ట్రాక్టర్లు పొందిన వారు సైతం ఉండడం గమనార్హం. దీంతో నిరుపేద దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 100 యూనిట్లే కావడంతో మొదట ఇబ్బందులు పడిన ఎమ్మెల్యేలు తరువాత ఏదైతే అదైంది అన్న రీతిలో తమ అనుయాయులకే ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా లబ్ధిదారుల ఎంపిక విషయంలో మొదట ఇబ్బంది పడినట్లు తెలిసింది. లబ్ధిదారుల ఎంపిక జాబితాను వెంటవెంటనే మూడు సార్లు మార్పు చేయడం గమనార్హం. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్పల్లి మండలం సాంపల్లిలో 15, నిజామాబాద్ రూరల్ మండలం ముత్తకుంటలో 14, సిరికొండ మండల కేంద్రంలో 1, ముషీర్‌నగర్‌లో 15, జక్రాన్‌పల్లి మండలం మాదాపూర్‌లో 5, ధర్పల్లి మండలం వాడిలో 15, ఇందల్వాయి మండలం లోలంలో 15, మోపాల్ మండలం ముదక్‌పల్లిలో 15 కుటుంబాలను ఎంపిక చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక చేసిన జాబితాను గోప్యంగా ఉంచారు. ఈ నియోజకవర్గంలో ఇతర పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్లో చేర్చుకుని వారికి సంబంధించిన వారిని సైతం ఎంపిక చేసినట్లు తెలిసింది. బోధన్ నియోజకవర్గంలో సైతం ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో దాదాపుగా టీఆర్ఎస్ కార్యకర్తలనే ఎంపిక చేసినట్లు సమాచారం. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించి అధికారుల పరిశీలన నామమాత్రంగానే సాగినట్లు సమాచారం. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన జాబితాను ఆన్లైన్ చేయడమే అధికారుల పని అన్నట్లుగా ఉంది. కాగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల రుణాల కోసం ఎదురు చూస్తున్న దళిత నిరుద్యోగులు ఈ పథకం అమల్లోకి రావడంతో ఆ రుణాలపై ఆశలు వదులుకుంటున్నారు. అయితే తాజా పథకంలో తమకు ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆయా జాబితాలకు సంబంధించి అధికారులతో వెరిఫికేషన్ చేయించామన్నారు. లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమం పూర్తి చేసినట్లు చెప్పారు. -
దళితబంధులో అన్యాయం చేశారు
జూలూరుపాడు: దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అన్యాయం జరిగిందంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో దళితులు, యువకులు ఆందోళనకు దిగారు. అర్హులైన వారికి కాకుండా భూములు, భవనాలు, ఉద్యోగాలు ఉన్నవారికి, గతంలో ప్రభుత్వ రుణాలు పొందిన వారికి దళితబంధు జాబితాలో చోటు కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జూలూరుపాడు, వెంగన్నపాలెం, పెద్దహరిజనవాడ, చిన్నహరిజనవాడ గ్రామాల దళిత మహిళలు, యువత మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యాలయాన్ని ముట్టడించారు. ఖమ్మం–కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాబితాలోని అనర్హుల పేర్లు ఇస్తే పరిశీలించి ప్రభుత్వానికి నివేదికిస్తామని తహసీల్దార్ చెప్పడంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు. అనర్హుల పేర్లు తొలగించి అర్హుల ఎంపిక కోసం గ్రామసభ నిర్వహించాలని, ఎమ్మెల్యే అనుచరుల పేర్లు తొలగించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. -
Dalit Bandhu: ‘నియోజకవర్గానికి 100 మంది ఎంపిక’ ఓకే.. మరి మా పరిస్థితి ఏమిటి?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మండలాల్లో పథకం అమలులో ప్రతిష్టంభన నెలకొంది. రాష్ట్రంలోని నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఆరు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు లబ్ధిదారుల జాబితా సిద్ధం కాలేదు. ఆయా మండలాలకు రూ.250 కోట్లు విడుదల చేసినా ఇప్పటివరకు అతీగతీ లేకుండా పోయింది. మరోవైపు ఈ మండలాలను మినహాయించి ఆయా నియోజకవర్గాల్లో వంద మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక మాత్రం శరవేగంగా పూర్తి కావొస్తోంది. దీంతో తమకు లబ్ధి ఎప్పుడు కల్పిస్తారని పైలట్ మండలాల్లోని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. గత ఏడాది ఆగస్టు 16న హుజూరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1న రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాలు పైలట్ మండలాలుగా ఎంపికయ్యాయి. చింతకాని మండలానికి రూ.100 కోట్లు, మిగతా మూడు మండలాలు ఒక్కో దానికి రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.250 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇదంతా జరిగి ఐదు నెలలవుతున్నా పథకం అమలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మధ్యలోనే ఆగిన అమలు ప్రక్రియ ప్రభుత్వం పైలట్ మండలాల ప్రకటన చేయగానే ఆయా జిల్లాల అధికార యంత్రాంగం మండలాల్లో ఎస్సీ కుటుంబాల లెక్కలు తీశారు. చింతకాని మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో 4,312 కుటుంబాలు, చారకొండ మండలంలోని 14 గ్రామపంచాయతీల్లో 1,267 కుటుంబాలు, తిరుమలగిరి మండలంలోని మున్సిపాలిటీ, 16 గ్రామపంచాయతీల్లో 2,382 కుటుంబాలు, నిజాంసాగర్ మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో 1,933 కుటుంబాలను గుర్తించారు. జిల్లా స్థాయి అధికారులు ఒక్కొక్కరికీ మండలాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించేశారు. పథకం అమలు తీరు, యూనిట్ల ఎంపిక తదితర అంశాలపై ఈ అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు అవగాహన కల్పించలేదు. అంతేకాదు మూడు నెలలు గడిచినా క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు లేకపోవడంతో పథకం అమలు ప్రక్రియ నిలిచిపోయినట్లయింది. చింతకాని మండలంలో తొలి విడతలో వెయ్యి కుటుంబాలు, మిగతా మూడు మండలాల్లో 500 చొప్పున కుటుంబాలకు దళితబంధు ద్వారా లబ్ధి చేకూరాల్సి ఉంది. ఇందులో భాగంగా 200కు పైగా యూనిట్లను గుర్తించారు. వీటిపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఏది ఎంచుకుంటే ఆ యూనిట్‌ను అధికార యంత్రాంగం గ్రౌండింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. మా పరిస్థితి ఏమిటి? పైలట్ మండలాల పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం తదుపరి దశలో ప్రకటించిన నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక మాత్రం చివరి దశకు చేరింది. ఒక్కో నియోజకవర్గంలో రెండు నుంచి పది వరకు గ్రామాల్లో ఎమ్మెల్యేలు లబ్ధిదారులను ఎంపిక చేసి అధికార యంత్రాంగానికి జాబితాలు పంపించారు. అంతేకాకుండా అధికార యంత్రాంగం కూడా ఆయా గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులకు యూనిట్లపై అవగాహన కల్పిస్తోంది. దీంతో పైలట్ మండలాల్లోని లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ మండలాలను పథకం అమలుకు ముందుగా ఎంపిక చేసి ఊరించారని, కానీ అవగాహన, యూనిట్ల మంజూరులో జాప్యం చేస్తున్నారని వాపోతున్నారు. ఎదురుచూస్తున్నాం.. దళితబం«ధు పథకానికి చింతకాని మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయటంతో ఎంతో సంబరపడిపోయాం. ఐదు నెలలు గడిచిపోయాయి. ఏం జరుగుతోందో తెలియదు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా యూనిట్ల మంజూరు ప్రక్రియ వెంటనే చేపట్టాలి. – మామిళ్ల బాబు, మత్కేపల్లి, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా పైసలు ఎప్పుడిస్తరో చెబుతలేరు దళితబంధు కింద రూ.10 లక్షలు ఇస్తమన్నరు. సార్లు వచ్చి పేర్లు రాసుకున్నరు. పైసలు వస్తే ఊరిలో కిరాణ షాపు పెట్టుకుందామనుకున్నా. కానీ ఇంకా పైసలు ఇయ్యలేదు. ఎప్పుడిస్తారో కూడా చెబుతలేరు. – మాడుగుల సైదమ్మ, చంద్రాయన్పల్లి, చారకొండ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా ఎటువంటి ఆదేశాలు రాలేదు.. చింతకాని మండలానికి మొదటి విడతగా ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల మంజూరు వంటి అంశాలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించారు. కానీ పథకం అమలును ముందుకు తీసుకెళ్లడంపై అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. – బి.రవికుమార్, ఎంపీడీఓ, చింతకాని మండలం, ఖమ్మంజిల్లా -
దళిత కాలనీలోనే కలెక్టర్ భోజనం, నిద్ర
మధిర: ఎస్సీల సాధికారతకు ప్రవేశపెట్టిన దళితబంధు లబ్ధిదారుల ఎంపిక కోసం ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ మధిర నియోజకవర్గంలో రొంపిమళ్ల గ్రామంలో పర్యటిస్తున్నారు. దళితబంధు పథకానికి ఎంపిక చేసిన మాతంగి రమణ, రాజ్‌కిరణ్, గొల్ల మందల శ్రీనివాసరావుతోపాటు పలువురి ఇళ్లకు గురువారం రాత్రి అధికారులతో కలిసి వెళ్లిన కలెక్టర్.. వారి అర్హతలపై ఆరా తీశారు. స్వేచ్ఛగా యూనిట్లను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. నిర్దేశిత యూనిట్లపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. అనంతరం లబ్ధిదారుడైన గొల్లమందల శ్రీనివాసరావు ఇంట్లోనే కలెక్టర్ సహా అధికారులందరూ రాత్రి 10గంటలకు భోజనం చేశారు. అంతకుముందు హోటల్ నుంచి తెప్పించిన చపాతీ, ఇడ్లీ తిన్నారు. అనంతరం లబ్ధిదారుడైన శ్రీనివాసరావు భార్య సునీతను ఇంట్లో ఏం చేశారని కలెక్టర్ అడిగారు. అన్నం, టమాటా – పచ్చిమిర్చి చట్నీ, పెరుగు అని చెప్పగా, అవే తనకు వడ్డించాలన్న కలెక్టర్... వారితోపాటు భోజనం చేశారు. శ్రీనివాసరావు ఇంట్లోనే కలెక్టర్ సహా అధికారులు నిద్రించారు. శుక్రవారం ఉదయం కూడా దళితబంధు లబ్ధిదారులతో సమావేశమై అవగాహన కల్పించనున్నారు. -
దళితబంధును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి: మంత్రులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. అరణ్యభవన్‌లో ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల అధికారులతో ఆయన గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గానికి దళితబంధు పథకం కింద వంద యూనిట్లు మంజూరు చేశామన్నారు. ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక వేగంగా పూర్తి చేసి, జాబితాలను ఉన్నతాధికారులకు ఇవ్వాలన్నారు. పథకం పురోగతిపై రాష్ట్రస్థాయిలో, జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని, లబ్ధిదారుల పరిస్థితి, యూనిట్ల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. మార్చి నెలాఖరు నాటికి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వక్ఫ్ బోర్డ్, ఎస్సీ కార్పొరేషన్ల చైర్మన్లు మహ్మద్ సలీం, బండా శ్రీనివాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, కమిషనర్ యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు. -
ఎలాంటి యూనిట్లు పెట్టుకున్నారు
తుర్కపల్లి: ఐకమత్యంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ వాసాలమర్రి ప్రజలకు సూచించారు. సీఎం కేసీఆర్ విప్లవాత్మక ఆలోచన వల్లే దళితబంధు పథకం వచ్చిందని, ఆ పథకాన్ని సది్వనియోగం చేసుకొని, అర్థికంగా ఎదిగి పది మందికి ఉపాధి చూపే స్థాయికి చేరుకోవాలని అన్నారు. బుధవారం ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాలమర్రిలోని దళితవాడలో సీఎం కార్యదర్శి రాహుల్»ొజ్జ, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలసి పర్యటించారు. అనంతరం రైతు వేదిక భవనంలో దళితబంధు లబ్ధిదారులతో సమీక్ష నిర్వహించారు. లాబ్ధిదారులు ఏయే యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు, నెలకు ఎంత సంపాదిస్తున్నారు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆమె మాట్లాడుతూ.. ఎర్రవల్లి గ్రామం తరహాలో వాసాలమర్రిని కూడా అభివృద్ధి చేసుకోవాలని వారికి సూచించారు. గ్రామంలో కొత్తగా పాఠశాల భవనాలు, అంగన్వాడీ భవనాలు ఏర్పాటు చేస్తామని, చిన్న పరిశ్రమల ద్వారా పది మందికి ఉపాధి కల్పించాలని అన్నారు. ప్రభుత్వ విప్ సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ. వాసాలమర్రి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, ఇతర కులాల్లో ఉన్న యువకులకు కూడా వారి నైపుణ్యాన్ని బట్టి ఉపాధి కలి్పంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసాలమర్రి సర్పంచ్ పోగుల ఆంజనేయులు, జెడ్పీ వైస్ చైర్మన్ బీకునాయక్, అదనపు కలెక్టర్ దీపక్‌తివారి తదితరులు పాల్గొన్నారు. -
Dalit Bandhu: దేశమంతా దళితబంధు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని కేంద్రం దేశవ్యాప్తంగా అమలుచేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో దళితబంధుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్నారు. ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్లో ఈ పథకం అమలుపై సన్నాహక సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న మిషన్ భగీరథ, రైతుబంధు వంటి పథకాలను ఆదర్శంగా తీసుకున్న కేంద్రం.. హర్‌ఘర్ జల్, కిసాన్ సమ్మాన్ యోజన వంటి వాటిని తెచ్చిందని, అలాగే దళితబంధును కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. నిధులు తేలేరుగానీ.. విమర్శలా.. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్‌తోపాటు నలుగురు బీజేపీ ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలకు కేంద్రం నుంచి నిధులు తేవడం చేతగాదుగానీ.. పేదల కోసం ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాత్రం వచ్చని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. బీజేపీ ఎంపీలకు చేతనైతే కేంద్రాన్ని ఒప్పించి జిల్లాకొక నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయించాలని, ట్రైబల్, మైనింగ్ యూనివర్సిటీలను మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఎల్ఐసీ, రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ సర్కారు కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కకుండా చేస్తోందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డిపై విమర్శలు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరును కూడా హరీశ్‌రావు తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ, ఎస్టీలు, బీసీల కోసం పదేళ్లలో రూ.6,995 కోట్లు కేటాయిస్తే.. తాము అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలోనే రూ.24 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లు 134 ఉంటే.. వాటిని 268కి పెంచామన్నారు. 53 ఎస్సీ రెసిడెన్షియల్ గురుకులాలను కొత్తగా ఏర్పాటు చేశామని వివరించారు. నిరుపేద చిన్నారులకు ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పించేందుకు రూ.7,280 కోట్లతో మనఊరు–మనబడి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉలికిపాటుపడుతున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కొండాపురం శివకుమార్ పాల్గొన్నారు. -
118 నియోజకవర్గాల్లోనూ ‘దళితబంధు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 118 శాసనసభ నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు చేయాలని నిర్ణయించామని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబమే యూనిట్‌గా 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని, మార్చి నెలాఖరు కల్లా నూరుశాతం యూనిట్లు గ్రౌండింగ్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వాసాలమర్రి గ్రామంతోపాటు హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ పథకాన్ని నూరు శాతం అమలు చేశామన్నారు. దళితబంధుపై శనివారం జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.స్థానిక ఎమ్మెల్యేల సలహాతో లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ జాబితాను సంబంధిత జిల్లా ఇన్చార్జి మంత్రులతో ఆమోదింపచేయాలని సూచించారు. ప్రతి లబ్ధిదారుకూ ఏ విధమైన బ్యాంకు లింకేజీ లేకుండా రూ.10 లక్షలను ఈ పథకం కింద ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారు కోరుకున్న యూనిట్నే ఎంపిక చేయాలని, ఒక్కో లబ్ధిదారుకు మంజూరైన రూ.10 లక్షల నుంచి పదివేల రూపాయలతో ప్రత్యేకంగా దళితబంధు రక్షణనిధి ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దళితబంధుకు రూ.1,200 కోట్లు కేటాయించామని, ఇప్పటికే రూ.100 కోట్లను విడుదల చేశామని చెప్పారు. విడతలవారీగా మిగతా నిధుల విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాలోని చారగొండ, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలాల్లో కూడా నూరు శాతం అమలు చేస్తున్నామని, విడతలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ పథకం అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాన్ఫరెన్స్‌లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, కార్పొరేషన్ ఎం.డి.కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు రథం.. సంక్షేమ పథం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ‘తెలంగాణ దళితబంధు పథకం’సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకంతో శ్రీకారం చుట్టింది. దేశంలోనే పెద్ద మొత్తంలో ఆర్థిక సాయాన్ని అత్యధిక కుటుంబాలకు అందించే పథకం ఇదే. దీనికింద రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున లబ్ధి కలగనుంది. ముందుగా ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గంతోపాటు వాసాలమర్రి గ్రామంలో మొత్తంగా 18,064 మందిని ఎంపిక చేసిన ప్రభుత్వం.. ఒక్కో లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో రూ.10లక్షల చొప్పున జమ చేసింది. భారీ మొత్తంలో సాయం అందించే ఈ పథకం 2021 సంవత్సరంలో రాజకీయరంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ పథకాన్ని తెస్తున్నారనే అంశంపై వివిధ పార్టీలు దుమారం రేపాయి. కానీ దళితుల సంక్షేమమే ముఖ్యమంటూ చెప్పిన ప్రభుత్వం హుజూరాబాద్‌లో సంతృప్తికరస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేసింది. లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. ఈ పథకాన్ని మరో నాలుగు మండలాల్లో సంతృప్తికరస్థాయిలో అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులోభాగంగా తిరుమలగిరి, చింతకాని, చారగొండ, నిజాంసాగర్ మండలాల్లో జాబితాను పూర్తి చేసిన ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. ప్రాథమికంగా ఎంపికైన లబ్ధిదారులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్సీ కార్పొరేషన్ సిద్ధమయ్యాయి. ఇదిలావుండగా, ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే ఉద్దేశంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వంద మంది లబ్ధిదారుల ఎంపికకు ఉపక్రమించింది. ఎంపిక బాధ్యతలను స్థానిక శాసనసభ్యులకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారీ సాయం రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్యానిధి పేరిట విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున సాయం అందిస్తోంది. ఒక లబ్ధిదారుకు అత్యంత ఎక్కువ సాయాన్ని అందించే పథకం విద్యానిధి అయినప్పటికీ... ఏటా లబ్ధిదారుల సంఖ్య వెయ్యికి మించడం లేదు. అయితే దళితబంధు కింద అందించే సాయం రెండో పెద్దది కాగా, వేల సంఖ్యల లబ్ధిదారులకు సాయం అందించడంతో ఈ పథకం రికార్డు సృష్టించడం విశేషం. -
గుడ్‌న్యూస్: ఆ నాలుగు జిల్లాలకు దళితబంధు నిధుల విడుదల
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం అమలు కోసం ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో ఈ పథకం అమలుకు మొత్తం రూ.250 కోట్లను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాలో మంగళవారం జమ చేసింది. సూర్యాపేట జిల్లా తుం గతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరికి రూ.50 కోట్లు, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకానికి రూ.100 కోట్లు, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండకు రూ.50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గానికి చెందిన నిజాంసాగర్‌కు రూ.50 కోట్ల చొప్పున కలెక్టర్ల ఖాతాలో జమ అయినట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. (చదవండి: తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు) -
ప్రారంభం పదుల్లోనే...!
సాక్షి, హైదరాబాద్: దళితబంధు ఉపాధి యూనిట్ల ప్రారంభం నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అమలు చేసింది. దళిత కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుని స్థిరపడాలనే లక్ష్యంతో యు ద్ధప్రాతిపదికన అమలుకు ఉపక్రమించింది. ఈ క్రమంలో సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రితోపాటు హుజూరాబాద్‌లో 20వేల దళిత కుటుంబాలకు సాయం అందించేలా నిర్ణయించగా, ఇప్పటివరకు 18,064 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమచేసింది. ఒక్కో లబ్ధిదారు నుంచి దళిత రక్షణ నిధి కింద రూ.10వేల చొప్పున వెనక్కు తీసుకోవడంతో ఒక్కొక్కరి ఖాతాలో రూ.9.90 లక్షలు నిల్వ ఉన్నాయి. లబ్ధిదారు ఏర్పాటుచేసే యూనిట్‌కు కలెక్టర్ అనుమతితో నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల్లో ఇప్పటివరకు యాభైలోపు యూనిట్లు మాత్రమే ప్రారంభమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎంపికలో జాప్యం... ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భారీగా ఆర్థిక లబ్ధి కలిగే కేటగిరీలో దళితబంధు రెండోది. ఓవర్సీ స్ విద్యానిధి పథకం కింద ఎంపికైన విద్యార్థికి రూ.20 లక్షలు ఆర్థిక సాయం చేస్తుండగా... దళితబంధు కింద రూ.10 లక్షలు ఇస్తున్నారు. అయితే దళితబంధు లబ్ధిదారుల సంఖ్య విద్యానిధి లబ్ధిదారుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. దళితబంధు లబ్ధిదారుడు ఆర్థిక వనరుల అభివృద్ధిలో భాగంగా ఒక ఉపాధిని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఎస్సీ కార్పొరేషన్ 120 రకాల ఆలోచనలతో లబ్ధిదారులకు అవగాహన కల్పించింది. అయినా చాలామంది ఇప్పటికీ ఉపాధి యూనిట్‌ను ఖరారు చేసుకోలేదు. కేవలం 6 వేల మంది మాత్రమే కార్లు, ట్రాక్టర్లు, డెయిరీ, పౌల్ట్రీ యూనిట్లను ఎంచుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలను సైతం అధికారులకు ఇవ్వలేదు. ఆయా యూనిట్లు, వాటి నిర్వహణ తదితరాలపై స్పష్టత ఉన్నప్పుడే కలెక్టర్ ఆమోదంతో ఖాతాలోని నిధులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికీ ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉంది. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్‌తో... హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఆ తర్వాత శాసన మండలి ఎన్నికలు రావడంతో దాదాపు రెండున్నర నెలలు ఎన్నికల కోడ్ అమలైంది. అందువల్ల దళితబంధు యూనిట్ల ఏర్పాటులో జాప్యం జరిగినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కోడ్ తొలగిపోవడంతో నెలాఖరులోగా యూనిట్లను ప్రారంభించే ప్రక్రియను వేగవంతం చేస్తామని అంటున్నాయి. అయితే, మెజార్టీ లబ్ధిదారులు ఇంకా యూనిట్లను ఎంపిక చేసుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రౌండింగ్ ప్రక్రియ మరింత ఆలస్యంకానుంది. -
బీజేపీతో చావో రేవో తేల్చుకుందాం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేపథ్యంలో ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేంద్ర వైఖరిని నిలదీస్తూ బీజేపీ, కేంద్రం దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మంత్రులంతా కార్యక్రమాలు రద్దు చేసుకొని ఢిల్లీ వెళ్లాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రిని కలవాలని మంత్రులను సీఎం ఆదేశించారు. కేంద్ర మంత్రులు సమయం ఇవ్వకపోతే అక్కడే కూర్చోని తేల్చుకొని రావాలని పేర్కొన్నారు. తాను కూడా 19వ తేదిన పర్యటనలు రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో శుక్రవారం టీఆర్ఎస్ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీజపీతో చావో రేవో తేల్చుకుందామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ తెలిపారు. నేతలు జనంలో ఉండకుంటే ఎవరూ ఏం చేయాలని అన్నారు. నాయకులంతా చురుగ్గా పని చేయాలని, ఎమ్మెల్యేలను, ఎంపీలను మళ్లీ గెలిపించే బాధ్యత తనదేనని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించాలని తెలిపారు. చదవండి: రైతు బంధుపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం చేతులెత్తేసిందని, ఈ విషయాన్ని రైతులకు వివరించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. వరికి బదులుగా ఇతర పంటలు వేసేలారైతులను ప్రోత్సాహించాలని కేసీఆర్ సూచించారు. ఈ నెల 18న రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర మంత్రిని కలవనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. అలాగే త్వరలోనే టీఆర్ఎస్ కొత్త రాష్ట్ర కమిటీ ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడా.. లేదా కన్వీనర్‌ను నియమించాలా అనేది నిర్ణయం తీసుకుంటామన్నారు. వారం రోజుల్లో కొత్త కమిటీ ఏర్పాటుపై ప్రకటిస్తామని పేర్కొన్నారు. -
రైతు బంధు, దళిత బంధుపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు అమలు చేస్తామని శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. వరివేస్తే రైతులకు రైతు బంధు ఆపాలని తెలిపిన అధికారుల సూచనలను కేసీఆర్ తిరస్కరించారు. అధికారుల సూచనలపై తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించిన సీఎం.. రైతు బంధు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు దళిత బంధు పథకాన్ని దశల వారీగా రాష్ట్రమంతా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. దళితబంధుపై విపక్షాల రాద్ధాంతం చేస్తున్నాయని, వాటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కేసీఆర్ స్పష్టంచేశారు. మొదట హుజురాబాద్‌తో పాటు నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో పూర్తిస్థాయిలో దళితబంధు అమలు చేస్తామని, తరువాత రాష్ట్ర వాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. -
కేసీఆర్ టక్కుటమార విద్యలు పనిచేయవ్
వనపర్తి: సాధారణ, ఉపఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రదర్శించే టక్కుటమార విద్యలను ఇకముందు ప్రజలు విశ్వసించచోరని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురంలో బీజేపీ జిల్లా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్‌లో 46 వేల ఓట్ల కోసం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చి ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతామని రాష్ట్ర ఏర్పాటు తొలినాళ్లలో గొప్పలు చెప్పిన సీఎం.. ఏడేళ్లలో ఎన్ని దళిత కుటుంబాలకు న్యాయం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తే.. కేసీఆర్‌కు పూలవర్షం కురిపిస్తామని, లేదంటే ప్రగతిభవన్ ఎదుట చావు డబ్బు కొడతామని ఈటల హెచ్చరించారు. గొర్రెల పంపిణీలో బ్రోకర్లకు ప్రజాధనం కట్టబెట్టినట్లుగా గేదెల పంపిణీ చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కేంద్రప్రభుత్వం ఇన్నాళ్లు ధాన్యం కొనుగోలు చేస్తే.. కేసీఆర్ తానే రాష్ట్రప్రభుత్వం తరఫున రైతులపై ప్రేమతో ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రకటనలు చేశారని మండిపడ్డారు. -
దళితబంధుపై సంపూర్ణ అధికారం ఉండాలి
తిరుమలగిరి (తుంగతుర్తి): దళితబంధు పథకం కింద రాష్ట్రప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలపై దళితులకు సంపూర్ణ అధికారం ఉండాలని మాజీమంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోరారు. శనివారం హైదరాబాద్ నుంచి ఇల్లందుకు వెళ్తూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ రూ.10 లక్షలతో దళితులు ఏ బిజినెస్ చేసుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండాలని, దీనిపై రాష్ట్రప్రభుత్వ పెత్తనం ఉండొద్దని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని విమర్శించారు. దళితబంధు పథకంలో భాగంగా గేదెల స్కీం పెట్టి ఇక్కడి వారిని హరియాణాకు పంపిస్తే అక్కడ రూ.2 లక్షల విలువైన గేదెకు రూ.4.50 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో గొర్రెల పథకంలో భాగంగా ఇక్కడి రైతులు కర్నూలు, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలకు వెళ్లి గొర్రెలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయా న్ని ఈటల గుర్తుచేశారు. తిరుమలగిరి మండ లంలో ప్రతీఒక్క దళిత కుటుంబానికి వెంటనే రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. సమావేశంలో బీజేపీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి రామచంద్రయ్య, జిల్లా అధికార ప్రతినిధి దీన్‌దయాళ్ పాల్గొన్నార -
Dalit Bandhu: కేసీఆర్‌కు షాకిచ్చిన శాలపల్లి ఓటర్లు.. ఈటలకే మద్ధతు
సాక్షి, కరీంనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకం హుజురాబాద్‌లో పెద్దగా ప్రభావం చూపించలేదు. దళిత బంధును తమకు భారీ విజయాన్ని కట్టబెడుతుందని భావించిన కారు పార్టీకి ఎన్నికల ఫలితాల్లో ప్రతికూల పరిస్థితే ఎదురైంది. ఒక్క 8వ రౌండ్, 11వ రౌండ్ మినహా మిగతా అన్నింటిలోనూ బీజేపీ అభ్యర్థి ఈటలకే ఓటర్లు మద్దతు పలికారు. దళిత బంధుతో గెలుపు తమదేనని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేయగా.. అంచనాలకు విరుద్ధంగా ఓటర్లను ఈ పథకం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలోని ఓటర్లు టీఆర్ఎస్కు బిగ్ షాకిచ్చారు. శాలపల్లిలో టీఆర్ఎస్పై బీజేపీ 129 ఓట్లు ఆధిక్యత సాధించింది. మొత్తం గ్రామంలో బీజేపీకి 311 ఓట్లు పడగా, టీఆర్ఎస్కు 182 ఓట్లు పడ్డాయి. దీంతో టీఆర్ఎస్ ప్రయోగించిన దళితబంధు అస్త్రం ఈ ఎన్నికల్లో ఫలించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 22 రౌండ్ల ఫలితాలకు గాను మెజార్టీ రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబరిచింది. 20 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధించగా, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 2 రౌండ్లలో మాత్రమే ఆధిక్యం సాధించారు. ఫలితంగా ఈటల 24వేల పైగా ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. చదవండి: హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగరబోతోంది: బండి సంజయ్ -
మరో 4 మండలాల్లో దళితబంధు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దళితబంధు పథకాన్ని నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో అమలు చేసేందుకు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ సమాయత్తమవుతోంది. ఇప్పటికే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఈ పథకాన్ని నూరుశాతం అమలు చేశారు. మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతకాని, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలంలో దళితబంధు అమలు నిమిత్తం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. ముందు ఎంపిక... ఆ తర్వాత అవగాహన...: దళితబంధు పథకం అమలు చేసే గ్రామాల్లో ముందుగా సమగ్ర కుటుంబ సర్వే(ఎస్కేఎస్) లెక్కల ఆధారంగా దళిత కుటుంబాల గణన చేపడతారు. అనంతరం జాబితాను రూపొందించి లబ్ధిదారులను ఖరారు చేస్తారు. లబ్ధిదారుల ఎంపికలో భాగంగా కుటుంబంలో మహిళకు ప్రాధాన్యత ఇస్తారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యాక స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుపై వారికి అవగాహన కల్పిస్తారు. అవసరమైతే స్వల్పకాలిక శిక్షణ తరగతులు సైతం నిర్వహించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన నగదుతో ఎలాంటి ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చనేదానిపై లబ్ధిదారులకు ప్రయోగాత్మకంగా వివరిస్తారు. ఇప్పటికే హుజూరాబాద్‌లో ఈ పథకం అమలు, స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను సైతం అధికారులు తయారుచేశారు. ఉపాధి యూనిట్ల ఏర్పాటుపై లబ్ధిదారులు అంచనాకు వచ్చిన తర్వాత నగదును విడుదల చేయనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. -
ఈసీ ఉత్తర్వులు సబబే
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ‘దళితబంధు’అమలును నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. మరో మూడు రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఈ దశలో ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘దళితబంధు’ను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. ఎన్నిక పూర్తయ్యే వరకు ‘దళితబంధు’ను నిలిపివేస్తూ సీఈసీ ఈనెల 18న జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ నేత జడ్సన్‌తోపాటు దళితబంధును ఆపాలంటూ వాచ్ వాయిస్ ఆఫ్ ది పీపుల్ స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే అధికారం ఈసీకి ఉంది. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చింది. దళితబంధు పథకంతో నేరుగా ఓటర్ల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ పథకం ఆపాలన్న ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టలేం’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. -
దళిత బంధుపై దాఖలైన 4 పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: దళిత బంధుపై దాఖలైన నాలుగు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులను రద్దు చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈసీ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ దళితబంధును ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయగా.. ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ నేత జడ్సన్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: హుజురాబాద్:అసలీ పోలింగ్ కేంద్రమేంటి? ఎవరెవరి పాత్ర ఎంత? ఓటు వేయడమెలా? అలాగే ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలను నిలిపివేయాలంటూ వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను కూడా కలిపి విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం.. గురువారం నాలుగు పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. నిష్పక్షపాత ఎన్నికల కోసం తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు మల్లేపల్లి లక్ష్మయ్య, జడ్సన్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: 2 రోజులు..రూ.3 కోట్ల కిక్కు -
దళితబంధుపై తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: దళితబంధును ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పరిధి దాటి ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ ఉత్తర్వులను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని రాష్ట్ర హైకోర్టును పిటిషనర్లు కోరారు. ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లతో పాటు ఉపఎన్నిక అయ్యే వరకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే పథకాలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. దళితబంధుపై ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ నేత జడ్సన్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలను నిలిపివేయాలంటూ వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను కూడా కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. దళితబంధును నిలిపివేయాలన్న ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని లక్ష్మయ్య, జడ్సన్ న్యాయవాదులు రఘునాథ్, శరత్‌కుమార్ నివేదించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కంటే ముందే ఈ పథకం అమలులో ఉందని, ఈ పథకాన్ని ఆపడంతో వెనుకబడిన వర్గాలు ఇబ్బందిపడే అవకాశం ఉందని తెలిపారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వరదలతో నష్టపోయిన వారిలో కొందరికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారని, ఎన్నికల తర్వాత నిలిపివేశారని వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్స్ సంస్థ తరఫు న్యాయవాది శశికిరణ్ నివేదించారు. హుజూరాబాద్ ఎన్నిక తర్వాత ఈ పథకాన్ని అమలు చేయడం అనుమానమేనన్నారు. హుజూరాబాద్‌లో పైలె ట్ ప్రాజెక్టు కింద ఈ పథకాన్ని ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు ఈ పథకాన్ని వర్తింప చేస్తామని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు నివేదించారు. ఇదిలాఉండగా పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని, ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నిక ముగిసే వరకూ పథకం అమలును ఆపాలని ఉత్తర్వులు జారీచేశామని ఈసీ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఇలా నిలిపివేసే అధికారం ఈసీకి ఉందని నివేదించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. -
దళితబంధును అడ్డుకున్నాయి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ–టీఆర్ఎస్లు కలిసే దళితబంధును అడ్డుకున్నాయని, తాను గాడ్సే కాదని అసలైన గాడ్సే అమిత్‌షానే అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఇంతకాలం బీజేపీ–టీఆర్ఎస్లు ఢిల్లీలో దోస్తీ చేసి, ఇక్కడ కుస్తీలు పట్టేవారని, ఇప్పుడు మాత్రం రెండు చోట్లా కలిసిపోయారని ఆరోపించారు. పెట్రోలు, గ్యాస్, వంటనూనె ధర లు పెరుగుతున్నా కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నిం చడం లేదని టీఆర్ఎస్ను నిలదీశారు. భూపంచాయతీల్లో విభేదాలు రావడం వల్లే రాజేందర్ రాజీనామా, హుజూరాబాద్‌లో ఉపఎన్నిక వచ్చిందని చెప్పారు. 20 ఏళ్లు స్నేహితుడిగా ఉన్న రాజేందర్ ఇప్పుడు దొంగ ఎలా అయ్యారని మంత్రి హరీశ్‌ను ప్రశ్నిం చారు. కరీంనగర్ జిల్లాకు హుజూరాబాద్‌కు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. ఎస్సారెస్పీ కాలువలు, ఇం దిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. నిరుద్యోగుల పక్షాన పోరాడిన బల్మూరి వెంకట్ సరైన అభ్యర్థి అన్నారు. ప్రజలు తమ వైపే ఉన్నారని 30న హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు. రాజేందర్‌ను బీజేపీలోకి పంపింది కేసీఆరే.. వీణవంకలో జరిగిన సభలో రేవంత్ మాట్లాడుతూ‘గోల్కొండ రిసార్ట్స్‌లో ఈటల, రేవంత్ రహస్యంగా భేటీ అయ్యారని ఓ సన్నాసి అంటుండు. మేం కలుసుకుంది మే 7న. వేం నరేందర్‌రెడ్డి కొడుకు లగ్గం కోటు సందర్భంగా చాలా మంది వచ్చిండ్రు. అక్కడ ఈటలను కలుసుకున్నది వాస్తవమే’అని అన్నారు. రాజేందర్‌ను బీజేపీలోకి పంపించిందే కేసీఆర్ అని సంచలన ఆరోపణలు చేశారు. సభకు హాజరైన జనం. (ఇన్సెట్లో) మాట్లాడుతున్న రేవంత్. చిత్రంలో బల్మూరి -
దళిత బంధు నిలుపుదలపై తెలంగాణ హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం నిలుపుదలపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య కోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. కాగా హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ లక్ష్మయ్య పిల్ వేశారు. పిల్లో.. ప్రభుత్వ పథకాలు అన్ని అమలు అవుతున్నప్పుడు కేవలం దళిత బంధును మాత్రమే ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిందని, కనుక దళిత బంధు పథకాన్ని యధావిధిగా అమలయ్యేలా చూడాలని పిటిషనర్ పేర్కొన్నారు. చదవండి: వెలుగులోకి మాజీ ఎమ్మెల్యే కొడుకు, ట్రైనీ ఐఏఎస్ నిర్వాకం.. -
దళిత బంధు రాజకీయం
-
ఆపింది.. మీరంటే మీరే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళితబంధు పథకం నిలిపివేత రాజకీయ రగడకు దారితీసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక ముగిసే వరకు ఆ పథకాన్ని ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆదేశించడంతో స్థానికంగా ఉన్న ప్రధాన పార్టీల నేతలు, దళితులు ఆందోళనలకు దిగారు. పథకం నిలిచిపోవడానికి కారణం ‘మీరంటే.. మీరు’అంటూ పోటాపోటీ నిరసనలకు దిగారు. సోమవారంరాత్రి సీఈసీ నుంచి ప్రకటన వెలువడగానే హుజూరాబాద్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అర్ధరాత్రి దాటాక మొదలైన ఈ నిరసనలు మంగళవారం కూడా కొనసాగాయి. ఇటు గులాబీ శ్రేణులు, అటు కాషాయదళాలు పరస్పరం సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. సోమవారం అర్ధరాత్రి దాటాక హుజూరాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్–బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నిరసనలకు దిగారు. ►జమ్మికుంటలో బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ►జమ్మికుంట అంబేడ్కర్ చౌరస్తాలో కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ విజయ ఆధ్వర్యంలో ఈటలదహనానికి వచ్చారు. అక్కడ బీజేపీ నేతలు ఎదురుపడటంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ►జమ్మికుంట మండలం కోరపల్లిలోనూ బీజేపీ–టీఆర్ఎస్ నాయకులు దిష్టిబొమ్మ దహనాలకు యత్నించడంతో తోపులాట జరిగింది. ►వీణవంక మండలం వలబాపూర్ రహదారిపై ఈటలకు వ్యతిరేకంగా దళితులు ధర్నా చేశారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశా రు. వీణవంక బస్టాండ్ వద్ద మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. 15 గ్రామా ల్లో ఈటల దిష్టిబొమ్మలను తగలబెట్టారు. జమ్మికుంటలో పోలీసులు, బీజేపీ నేతల వాగ్వాదం -
‘ఈటల మేలు చేస్తడు.. కీడు చెయ్యడు’
హుజూరాబాద్: ‘దళితబంధు వెంటనే అమలు చేయాలని నేనే డిమాండ్ చేశాను. కలెక్టర్ల పెత్తనం, బ్యాంకుల పెత్తనం ఉండొద్దని కోరింది నేనే. హుజూరాబాద్ ప్రజలపై ప్రేమతో ఇచ్చావో, ఓట్లపై ప్రేమతో ఇచ్చావోగానీ, తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలని డిమాండ్ చేశాను. ఎప్పటిలోగా ఇస్తావో చెప్పాలని కోరాను. అన్ని కులాల్లోని పేదలకు కూడా ఇలాంటి స్కీం పెట్టాలని కోరింది నేనే. ఈటల రాజేందర్ మేలు చేస్తాడు తప్ప కీడు చెయ్యడు’ అని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి, చెల్పూర్, రాజపల్లి, రంగాపూర్, రాంపూర్, కనుకులగిద్ద, చిన్నపాపయ్యపల్లిల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళితబంధు ఆపాలని తానే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం చేస్తున్నారని.. తాను వద్దని లేఖ రాసినట్టు నిరూపిస్తారా అని సవాల్ విసిరారు. ‘70 రోజులు అమలు కాని దళితబంధు ఏడు రోజుల్లో అమలవుతుందా? దళితుల మీద ప్రేమ ఉంటే దళితులకు సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదు? మూడు ఎకరాల భూమి ఎవరు అడ్డుకున్నారు?’ అని ఈటల ప్రశ్నిం చారు. కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఈటల ఆరోపించారు. ఓటుకు రూ.20 వేలు, రూ.30 వేలతో బేరం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ గెలిస్తే బానిసత్వంలో మగ్గిపోతామని, హుజూరాబాద్‌లో జరుగుతున్న యుద్ధంలో ధర్మం వైపు నిలబడాలని ప్రజలను కోరారు. -
‘దళిత బంధు’ పథకానికి రూ.250 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశాలతో ‘దళిత బంధు’ పథకానికి రూ.250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిధుల విడుదల ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మ జిల్లా చింతకాని మండలానికి రూ.100 కోట్లు, సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండలానికి రూ.50 కోట్లు, నాగర్‌కర్నూలు జిల్లా చారగొండ మండలానికి రూ.50 కోట్లు, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలానికి రూ.50 కోట్లు విడుదల చేశారు. (చదవండి: Dalit Bandhu: హుజురాబాద్‌లో దళిత బంధుకు బ్రేక్) కాగా, ఉప ఎన్నిక నేపథ్యంలో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని సీఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఉపఎన్నిక తర్వాత దళితబంధును యధావిథిగా కొనసాగించవచ్చని సూచించింది. చదవండి: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్! -
హుజూరాబాద్‌లో దళితబంధుకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక ముగిసే వరకు నియోజకవర్గ పరిధిలో దళితబంధు పథకం అమలును వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పథకం కింద అన్ని దశలలోని నగదు బదిలీ ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలోగా తమకు నివేదించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) శశాంక్ గోయల్‌ను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్ని కల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాశ్‌కుమార్ సోమవారం సీఈఓకు లేఖ రాశారు. దళితబంధు పథకంపై ఈ నెల 8న సీఈఓ పంపిన లేఖ ఆధా రంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తాజా లేఖలో పేర్కొన్నారు. ఈసీఐ నుంచి వచ్చిన ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్టు సీఈఓ శశాంక్ గోయల్ ‘సాక్షి’కి తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని నాలుగు మండలాలు, వాసాలమర్రి గ్రామంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దళితబంధుకు రూ.250 కోట్లు విడుదల ఇదిలా ఉంటే... రాష్ట్రంలోని 4 మండలాల్లో దళితబంధు పైలట్ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారమే రూ.250 కోట్లను మంజూరు చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఈ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి రూ.100 కోట్లు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి చెరో రూ.50 కోట్లను విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
దళిత బంధు ఘనత సీఎందే: గజ్జెల కాంతం
ఖైరతాబాద్(హైదరాబాద్): సీఎం కేసీఆర్ దళితబంధు తీసుకువచ్చినందుకు దళిత, గిరిజన సంఘాలు రుణపడి ఉంటాయని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. ఆదివారం లక్డీకాపూల్‌లో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం, దళిత కులాల సంఘాల అత్యవసర రాష్ట్ర స్థాయి సమావేశంలో గజ్జెల కాంతం మాట్లాడారు. అంబేడ్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేరుస్తున్నారని, ప్రతిపక్షాలు దళితబంధు పథకాన్ని చూసి ఓర్వలేక ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ దళితులకు ఏం చేసిందో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు చెప్పాలని పేర్కొన్నారు. ఈనెల 12 నుంచి అన్ని జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద ప్రతిజ్ఞలు చేయించడంతో పాటు బీజేపీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. దళితబంధులాగే గిరిజన, బీసీబంధు అమలు చేసేలా ముఖ్యమంత్రిని కోరుతామన్నారు. -
మూడెకరాలపై కేసీఆర్ అబద్ధాలు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దళితులకు సీఎం పదవి, మూడెకరాల భూమిని ఇస్తా మని చెప్పి ఆయా వర్గాల ఓట్లు వేయించుకుని రెండుసార్లు సీఎం అయిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చడం హాస్యాస్పదమని మాజీ ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని 15వ పేజీ లోని 5వ అంశంగా దళితులకు మూడెకరాల భూమి ఉందని వెల్లడించారు. మేనిఫెస్టో తనకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్న కేసీఆర్ పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఓ ప్రకటనలో తెలి పారు. దళితబంధు, నిరుద్యోగభృతి, డబుల్బెడ్రూం ఇళ్లపై కేసీఆర్ ఏదో ఒకరోజు అదేమాట అంటారని ఎద్దేవా చేశా రు. దళితులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి వారికి మేలు చేసింది కాంగ్రెస్‌నేనని అన్నారు. -
Dalit Bandhu: కారు... లేకుంటే ట్రాక్టరు!
సాక్షి, హైదరాబాద్: దళితబంధు యూనిట్ ఏర్పాటుపై లబ్ధిదారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకేసారి రూ.10 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ కాగా, ఆ నిధితో ఎలాంటి వ్యాపారం చేయాలనే దానిపై స్పష్టత లేక అయోమయంలో పడ్డారు. యూనిట్ ప్రతిపాదనలు సంబంధిత కమిటీల ద్వారా జిల్లా కలెక్టర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. కలెక్టర్ ఆమోదించిన తర్వాత యూనిట్ సంబంధిత వస్తువులు, పరికరాల కొనుగోలుకు అనుమతి లభిస్తుంది. అనంతరం లబ్ధిదారు ఖాతా నుంచి నగదును చెక్కురూపంలో విక్రేత ఖాతాకు బదిలీచేస్తారు. పథకాన్ని పారదర్శకంగా, పక్కాగా అమలు చేసేవిధంగా ప్రభుత్వం ఈ మేరకు నిబంధనలు విధించింది. దళితబంధు కింద హూజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంతోపాటు ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఇప్పటివరకు 18,064 మంది బ్యాంకుఖాతాల్లో నగదు జమచేశారు. ఈ క్రమంలో సగానికిపైగా లబ్ధిదారులు కొత్త యూనిట్లకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించగా, ఇందులో అత్యధికులు కార్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. దాదాపు 8 వేల ప్రతిపాదనల్లో 5,440 మంది కారుగానీ, ట్రాక్టర్గానీ కొనుగోలు చేస్తామని చెప్పారు. కొందరు కార్లు కొని అద్దెకు ఇచ్చుకుంటామని తెలపగా, మరికొందరు క్యాబ్రంగంలో పనిచేస్తామని వివరించారు. వ్యవసాయపనుల కోసం ట్రాక్టర్లు కొనుగోలు చేసుకుని సొంతంగా నడిపిస్తామని వివరించారు. కార్లు, ట్రాక్టర్లకు డిమాండ్ ఉన్నప్పటికీ, ఒకేచోట పెద్దసంఖ్యలో వాహనాలుంటే వాటికి పనిదొరికే అవకాశాలు తగ్గుతాయనే అభిప్రాయం అధికార వర్గాల్లో కనిపిస్తోంది. దీంతో పరిమితసంఖ్యలోనే ఇలాంటి యూనిట్లకు అవకాశం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కార్లు, ట్రాక్టర్లు మాత్రమే కాకుండా ఇతర డిమాండ్ ఉన్న రంగాలపై అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు దళితబంధు నోడల్ అధికారులు సూచనలు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్‌లో భారీ వర్షం.. హై అలర్ట్ -
పైలట్ ప్రాజెక్టుకే పరిమితమా?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలున్న హుజూరాబాద్‌లో దళితబంధు అమలుకు నిధులు పంపించారని, ఇతర నాలుగు మండలాల్లో ఈ పథకం అమలుకు నిధులు ఇచ్చారా? పైలట్ ప్రాజెక్టు అమలుకే పథ కం ఉంటుందా? అని అసెంబ్లీలో బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు బాగా ఉన్నా అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోందన్నారు. రాష్ట్ర జనాభాలో 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు దామాషా ప్రకారం కేబినెట్లో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల్లోని పేదలకు, గిరిజనులకు, బీసీలకు.. దళితబంధు లాంటి పథకాన్ని తీసుకొచ్చే ఆలోచన ఉంటే తెలియజేయాలన్నారు. దళితబంధుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉంటే .. కేంద్ర నిధుల కోసం అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని సీఎంని రఘునందన్‌రావు కోరారు. దళితబంధు అవసరం ఉండేది కాదు.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ సబ్ ప్లాన్ అమలు సరిగ్గా జరిగి ఉంటే దళితబంధు అమలు చేయాల్సిన అవసరం ఉండేది కాదని టీఆర్ఎస్ సభ్యుడు మెతుకు ఆనంద్ విమర్శించారు. విశ్వం ఉన్నంత వరకు కేసీఆర్‌ను దళితులు గుర్తు పెట్టుకునే పథకం ఇది అన్నారు. దళితబంధు కింద ల్యాబ్‌లు, మెడికల్ షాపులు పెట్టుకోవడానికి అనుభవం అవసరమా? లేక అనుభవం ఉన్న వారిని ఉద్యోగస్తులుగా పెట్టుకుని ఏర్పాటు చేసుకోవచ్చా? అన్న విషయంపై స్పష్టత కల్పించాలన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే చిరిగిపోయిన విస్తారిని కుట్టడానికి ఇంత కాలం పట్టింది. అందుకే తొలి టర్మ్‌లో దళితబంధు అమలు చేయలేకపోయాం అని ఆనంద్ పేర్కొనగా, కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. దళితబంధు చట్టం తీసుకురావాలి.. దళితబంధు పథకాన్ని భవిష్యత్తులో పక్కాగా అమలు చేసేలా చట్టబద్ధత కల్పించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శాసనసభలో ప్రస్తావించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల కంటే మైనార్టీ అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. సభ్యులు కోరితే దళితబంధు చట్టం తీసుకొద్దామన్నారు. మైనార్టీల సంక్షేమంపై త్వరలో ప్రత్యేక చర్చ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సభను గురువారం ఉదయం 10గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. -
నిధులు లేకుండా దళితబంధు ఎలా?
సాక్షి, హైదరాబాద్: ‘దళితబంధు పథకాన్ని నిధులు లేకుండా ఒట్టిగా అమలు చేస్తామంటున్నారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో సీఎం దళిత సాధికారత పథకం కోసం రూ.వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలకు రూ.లక్షా 70 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తామని దళిత ప్రజాప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మీరు చెప్పినట్టు దీనికి నిధులు ఎలా సమకూరుస్తారో స్పష్టత ఇవ్వాలి’అని కాంగ్రెస్ శాసనసభాపక్షనేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దళితబంధుపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆలోచనలు గొప్పగా ఉన్నా, వాటి అమలుపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ పథకం అమలు కావాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని చెప్పారు. ఈ పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని కోరారు. ముస్లింలు, బీసీలు, ఈబీసీలకు సైతం ఇలాంటి పథకాన్ని అమలు చేయాలని సూచించారు. స్పష్టత ఇవ్వాలి... దళితబంధు కింద లబ్ధిదారులకు రూ.10 లక్షలు ఇస్తే వాళ్లు రెండు, మూడు వ్యాపారాలు చేసుకోవచ్చా.. వారికి నచ్చే వ్యాపారం చేసుకోవచ్చా.. అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని భట్టివిక్రమార్క కోరారు. పెద్దఎత్తున వ్యాపారం చేసుకోవాలని అనుకుంటే పదిమంది కలుసుకుని చేసుకోవచ్చా.. అని ప్రశ్నించారు. ఉన్న మండలంలోనే వ్యాపారాలు చేసుకోవాలా? నచ్చిన ప్రాంతాల్లో చేసుకునే అవకాశం ఉందా? అని అడిగారు. రేషన్‌కార్డు లేనివారిని కుటుంబంగా పరిగణించరా? పెళ్లి అయినవారిని పరిగణనలోకి తీసుకుంటారా అన్న అంశంపై స్పష్టత కోరారు. -
బడ్జెట్లో దళితబంధుకు రూ.20 వేల కోట్లు
వచ్చే మార్చిలోగా హుజురాబాద్ నియోజకవర్గంతోపాటు మరో 4 మండలాల్లో పూర్తి సాచురేషన్ స్థాయిలో దళిత బంధు అమలు చేస్తాం. దీనితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాల చొప్పున ఎంపిక చేసి పథకాన్ని అందిస్తాం. ఆయా నియోజకవర్గాల్లో ఒకే గ్రామం నుంచి ఆ వంద కుటుంబాలను ఎంపిక చేస్తారా? రెండు మండలాల నుంచి ఎంపిక చేస్తారా? మున్సిపాలిటీల నుంచి తీసుకుంటారా? అన్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలకు వదిలేస్తాం.’’ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీనే. ఇక కేంద్రంలోనూ సత్తా చాటుతాం. యూపీఏ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో టీఆర్ఎస్కు ఐదుగురు ఎంపీలు ఉన్నా కీలకమయ్యాం. త్వరలో కేంద్రాన్ని శాసించే స్థాయికి ఎదుగుతాం. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నాం. బీసీలకు మరిన్ని అవకాశాలు దక్కాలంటే కులాల వారీగా జనగణన చేపట్టాలి. ఈ డిమాండ్ న్యాయమైనదే. కానీ కేంద్రం అలా జనగణన చేపట్టలేమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. దీనిపై శాసనసభలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపుతాం. మూడు నెలల్లో 70–80 వేల ఉద్యోగాలు.. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 1.5 లక్షల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చాం. ఇప్పటివరకు 1.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. కావాలంటే వాళ్ల ఫోన్ నంబర్లతో సహా సభకు ఇస్తాం. దసరా తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చించి కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన పూర్తి చేస్తాం. తర్వాత ఒకటి రెండు నెలల్లో కొత్తగా 70 వేల నుంచి 80వేల ఉద్యోగాలు వస్తాయి. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కొత్త జోనల్ విధానం తెచ్చాం. సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది రాష్ట్ర బడ్జెట్లో దళితబంధు పథకానికి రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని.. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 2 వేల కుటుంబాలకు చొప్పున మొత్తం 2 లక్షల కుటుంబాలకు పథకం వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకం అమలు కోసం ఇప్పటికే నిధులు విడుదల చేశామని.. మరో నాలుగు మండలాల్లోనూ అమలు చేసేందుకు మరో రూ.వెయ్యి నుంచి రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులందరికీ పథకం అమలుపై అవగాహన ఏర్పడాలని పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని.. తర్వాత పథకాన్ని పూర్తి స్థాయిలో అద్భుతంగా, సాఫీగా అమలు చేస్తామని చెప్పారు. దళితబంధుపై మంగళవారం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో అధికార, విపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలకు సీఎం కేసీఆర్ బదులిచ్చారు. సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ప్రతి ఎస్సీ కుటుంబానికి దళిత బంధు రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ కుటుంబానికి దళిత బంధు అమలు చేస్తాం. లబ్ధిదారులు తమకు నచ్చిన, అనుభవమున్న పని చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి చేయదు. విడతల వారీగా ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం అందుతుంది. సంతృప్త స్థాయిలో ఉద్యోగులు, వ్యాపారులనే తేడా లేకుండా అందరికీ వర్తింపజేస్తాం. కొందరు పథకం వద్దని వెనక్కి ఇచ్చే వాళ్లుకూడా ఉన్నారు. హుజూరాబాద్‌లో ఇప్పటికే ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మగౌరవ సాక్షిగా తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయడం నిజంగా గొప్ప విషయం. రాష్ట్రంలో 17.53 లక్షల దళిత కుటుంబాలున్నట్టు అంచనా. గణాంకాలు పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా రూ.1.80 లక్షల కోట్లతో దళితబంధు అమలు చేయాలని అంచనా వేశాం. కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తే మరింత వేగంగా లబ్ధిదారులకు ఆర్థిక సాయాన్ని అందించే ఏర్పాట్లు చేస్తాం. హుజూరాబాద్ ఎన్నిక చిన్న విషయం దళితబంధు సాయాన్ని వెనక్కి తీసుకుంటారని కొన్నిచోట్ల చిల్లర ప్రచారం చేస్తున్నారు. మా ప్రభుత్వం ప్రజలకు సాయం చేసేది మాత్రమే. వెనక్కి గుంజుకునేది కాదు. ఉప ఎన్నిక కోసం ఈ పథకం ద్వారా డబ్బులు పంచుతున్నారనే ప్రచారం సరికాదు. హుజూరాబాద్ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి చాలా చిన్న విషయం. ఎన్నికలతో సంబంధం లేకుండా అంతటా ఈ పథకాన్ని అమలు చేస్తాం. వ్యాపార లైసెన్సుల జారీలో రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలని నిర్ణయించాం. బార్లు, వైన్స్‌లు, మెడికల్ కాంట్రాక్టర్లు, ఫర్టిలైజర్ షాపులు, సరుకుల పంపిణీ కాంట్రాక్టుల్లో ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఎస్సీల కోటా పెంచాలి అంబేడ్కర్ స్పూర్తిని కొనసాగించాలంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎస్సీల కోటా పెంచాల్సిన అవసరం ఉంది. పదేళ్ల కిందటి జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 15 శాతం ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. ఇప్పుడు వారి జనాభా శాతం పెరిగింది. మంచిర్యాలలో అత్యధికంగా 25.64 శాతం, జనగామ, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, వికారాబాద్ తదితర జిల్లాల్లో 20శాతం కంటే ఎక్కువ ఎస్సీ జనాభా ఉన్నట్టు ఏడేళ్ల కిందటి సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. ఎస్సీ వర్గీకరణ చేయాలని కేంద్రానికి రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపింది. పలుమార్లు ప్రధానికి స్వయంగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. మీరు (బీజేపీ ఎమ్మెల్యేలు) పెద్దవాళ్లు కదా.. ప్రధానిని ఒప్పించి తీసుకుని వర్గీకరణ తీసుకురండి. విమానాశ్రయంలో పెద్ద పెద్ద పూలమాలలతో ఘనస్వాగతం పలుకుతాం. మళ్లీ ఢిల్లీకి అఖిలపక్షం ఎందుకు? అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం.. మాది అందరి ప్రభుత్వం. ప్రస్తుతం అత్యంత వెనుకబడిన వాళ్లు దళితులు కావడంతో వారికి ముందుగా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాం. ఎస్టీల్లో కూడా పేదలున్నారు. వాళ్లకు న్యాయం చేస్తాం. బీసీలు, మైనారిటీలు, ఓబీసీల్లో పేదలకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. అన్ని వర్గాలతో చర్చించి కొత్త పథకాలను ప్రవేశపెడతాం. కోవిడ్–19తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ప్రస్తుతం ఆ కష్టాల నుంచి గట్టెక్కుతున్నాం. కొందరికి ఈస్ట్‌మన్ కలర్ డ్రీమ్స్ ఉండొచ్చు ‘‘ఒక్క హుజూరాబాద్‌కే నిధులు విడుదల చేశారా? ఇతర ప్రాంతాలకు కూడా విడుదల చేస్తారా? అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పెద్ద అనుమానం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం రఘునందన్‌రావు గారు! రాష్ట్రం తెచ్చిన వాళ్లం. మాకు చాలా బాధ్యత ఉంది. మేమే ముందు నిలుస్తాం.. మీరు ఉండేదా? సచ్చేదా? నాకు అర్థంకాదు. మాకు అన్ని అంచనాలున్నాయి. కొద్దిమందికి ఈస్ట్‌మన్ కలర్ డ్రీమ్స్ ఉండొచ్చు. ప్రజలు ఎవర్ని ఉంచుతరో? ఉంచరో మాకు తెలియదా? మాది రాజకీయ పార్టీ కాదా? మాదేమైనా మఠమా? కచ్చితంగా మున్ముందు కూడా మా ప్రభుత్వమే కొనసాగుతుంది. ఇన్ని మంచి పనులు చేస్తుంటే ప్రజలు ఏ కారణంతో పక్కనపెడ్తరు? రూ.1.80 లక్షల కోట్లు ఓ లెక్కా..? స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా దేశవ్యాప్తంగా దళితులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలు దళితుల కోసం చేసినదేమిటి? కాంగ్రెస్ ప్రభుత్వం భూపంపిణీ చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్తున్నారు. రాష్ట్రంలో 75 లక్షల మంది దళిత జనాభా ఉంటే.. వారి వద్ద 13 వేల ఎకరాల భూములే ఉన్నాయి. అతి తక్కువగా రైతుబంధు డబ్బులు అందుతున్న దళిత రైతులకే. రూ.15 వేల కోట్ల రైతుబంధు సాయంలో వారికి వెళ్తున్నది రూ.1,400 కోట్లే. అందుకే దళితబంధు మొదలుపెట్టుకున్నాం. గత ఏడేళ్లలో రాష్ట్ర ఆదాయం రాకపోక రూ.10 లక్షల కోట్లుగా ఉంది. వచ్చే ఏడేళ్లలో ఇది రూ.23 లక్షల కోట్లకు చేరుతుంది. ఇందులో రూ.1.80 లక్షల కోట్లు ఒక లెక్కా.. గత ఏడాదే దళిత బంధు అమలు చేయాలనుకున్నాం. కరోనాతో ఆలస్యమైంది. పోడు పట్టాల కోసం త్వరలో దరఖాస్తులు! రాష్ట్రంలో పోడుభూముల సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతాం. గిరిజనేతరుల ఆక్రమణలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అటవీ భూమినే నమ్ముకుని సాగు చేసుకుంటున్న వారికి తప్పకుండా పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తా. గిరిజనేతరుల అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాం. ఈనెల మూడో వారంలో కొత్తగా క్లెయిమ్స్ పిలుద్దాం. దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించే చర్యలే కాకుండా అటవీ పరిరక్షణకు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఇకపై అటవీ ఆక్రమణలు జరగవనే స్పష్టత తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుందాం. గురువారానికి అసెంబ్లీ వాయిదా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, చెత్తను వేరు చేసే షెడ్ల నిర్మాణం, ఆరోగ్య లక్ష్మి, వాగులపై చెక్‌డ్యామ్‌లు, ఆరోగ్య రికార్డుల వివరాలు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సంబంధించిన ప్రశ్నలపై సంబంధిత శాఖల మంత్రులు సమాధానాలు ఇచ్చారు. తర్వాత విద్యుత్ శాఖకు చెందిన నివేదికలను మంత్రి జి.జగదీశ్‌రెడ్డి శాసనసభకు సమర్పించారు. జీరో అవర్‌లో 32 మంది సభ్యులు తమ నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్రంలో పోడు వ్యవసాయం, అటవీ భూములపై హక్కుల చట్టంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మద్యం బెల్టు షాపులపై బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు వాయిదా తీర్మానాలు ఇవ్వగా స్పీకర్ తిరస్కరించారు. తర్వాత దళితబంధుపై స్వల్పకాలిక చర్చను ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ ప్రారంభించగా.. ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా, భట్టి విక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ చర్చలో పాల్గొన్నారు. వారు సుమారు రెండు గంటల పాటు ప్రసంగించి పలు అంశాలను లేవనెత్తారు. తర్వాత సుమారు గంటన్నర పాటు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు. -
రాబోయే రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్లు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దళిత బంధు హుజూరాబాద్ కోసం పెట్టలేదు. కరోనా కన్నా ముందే దళిత బంధు ఆలోచన చేశాం. కానీ కోవిడ్ వల్ల ఆలస్యమయ్యింది. దీనిపై విపక్షాలు అర్థం లేని విమర్శలు చేస్తున్నాయి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబబ్లీలో అసహనం వ్యక్తం చేశారు. ఐదో రోజు అసెంబ్లీ సమావేశంలో సీఎం కేసీఆర్ దళిత బంధు సహా పలు అంశాలపై మాట్లాడారు. దళితబంధు గురించి... ‘‘ఈ దేశంలో నేటికి కూడా వెనకబడిన సామాజిక వర్గం దళితులే. వారు దయనీయ స్థితిలో ఉన్నారు. సామాజిక వివక్ష కారణంగానే దళితులు పేదరికంలో ఉన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దళితులందరి పరిస్థితి ఇలానే ఉంది. వారిని అభివృద్ధి చేయడం కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొస్తున్నాం. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు’’ అని కేసీఆర్ తెలిపారు. (చదవండి: కేంద్రంతో గలాటానే.. అందుకు సిద్ధంగా ఉన్నాం: సీఎం కేసీఆర్) ‘‘దళిత బంధు పథకంపై చర్చకు అన్ని పార్టీలను ఆహ్వానించాం. మా పాటికి మేము చేయలేదు. ప్రగతి భవన్లో దళిత బంధు పథకం అమలుపై పదిన్నర గంటలు చర్చించాం. 119 నియోజకవర్గాల్లో అమలు చెయ్యాలనే ఆలోచన ఉండే. 100 నియోజకవర్గాలకు ఈ మార్చ్ లోపు 100మందికి అమలు చేస్తాం. హుజురాబాద్‌తో పాటు మిగిలిన నాలుగు మండలాల్లో పూర్తిగా మార్చ్ వరకు అమలు చేస్తాం. దళిత బంధు కోసం వచ్చే బడ్జెట్ లో 20వేల కోట్ల రూపాయలు పెడుతాం. ’’ అని తెలిపారు. ‘‘దళిత బంధు కింద 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. అందులో 1,400 కోట్ల రూపాయలు మాత్రమే దళితులకు వెళ్తున్నాయి. దళిత ఎంపవర్మెంట్ కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించాం. ఈ నేపథ్యంలో వారి అభివృద్ధి కోసం దళితబంధు తీసుకొచ్చాం. ఈ పథకాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నాయి’’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: మంత్రి మల్లారెడ్డి తీరుపై ఆగ్రహం.. సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు ‘‘హుజురాబాద్ ఎన్నికల తరువాత టీఆరెస్ ప్రభుత్వం మారుతుందా. టీఆర్ఎస్కు హుజురాబాద్ ఒక్కటే ఎన్నిక ఉందా.. ఇంకా ఎన్నికలు రావా. భవిష్యత్తులో మా ప్రభుత్వమే వస్తది. కొంతమంది ఈస్మార్ట్ కలలు కంటున్నారు. కానీ అవి నెరవేరవు’’ అన్నారు కేసీఆర్. కుల గణన చేయడానికి కేంద్రం ఎందుకు నిరాకరిస్తోంది దళితుల శాతం దేశంలో పెరిగింది. దళితుల రిజర్వేషన్ల శాతం పెంచాలి. కేంద్రం దాన్ని గుర్తించాలి. కేంద్రం బీసీ కులగణన చెయ్యడానికి ఎందుకు నిరాకరిస్తోంది. బీసీల కులగణన చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి పంపుతాం. ఎస్సీ రిజర్వేషన్లపై శాసనసభలో తీర్మానం చేసి పంపినా కేంద్రం పక్కన పెట్టింది. రఘునందన్ రావు కేంద్రం నుంచి రిజర్వేషన్లు అమలు చేసుకోని తెస్తే ఘనంగా సన్మానం చేసి స్వాగతం పలుకుతాం’’ అని కేసీఆర్ తెలిపారు. రాబోయే రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్లు కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్లను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు 1, 51,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాము. 1,31,000 ఉద్యోగాలు ఇచ్చాము. త్వరలోనే ఉద్యోగాలు పొందిన వారి లిస్ట్ అసెంబ్లీకి ఇస్తాం. రాబోయే రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్లు స్టార్ట్ అవుతాయి. నాకున్న అంచనా మేరకు 70వేల వరకు ఉద్యోగాలు రాబోతున్నాయి. రాష్ట్రంలో ఎన్ని దళిత కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకు దళితబంధు వర్తింపచేస్తాం’’ అన్నారు కేసీఆర్. చదవండి: హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఉత్సాహవంతులకు ఊహించని దెబ్బ -
TS Assembly Sessions: వ్యవసాయ రంగాన్ని దేశంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాం
► రాష్ట్రంలో ఉచిత నీరు, విద్యుత్ అందిస్తున్నాం. ఫలితంగా రైతులకు ధైర్యం పెరిగింది. తెలంగాణ భూములకు డిమాండ్ పెరిగింది. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దేశంలోనే నంబర్-1 స్థానానికి తీసుకెళ్లాం అన్నారు సీఎం కేసీఆర్. ► పోడు భూములపై చర్చకు కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సమావేశాల పొడగింపుపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాక్షి, హైదరాబాద్: ఐదోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దళిత బంధుపై శాసనసభలో స్వల్ప కాలిక చర్చ జరగనుంది. బీఏసీ నిర్ణయించిన ప్రకారం నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అసెంబ్లీకి మూడు రోజుల విరామంతో ఈ నెల 8 వరకూ అసెంబ్లీ సమావేశాలు పొడగించే అవకాశం ఉంది. -
పక్కా నిర్వహణ, నిఘా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితబంధు పథకం లబ్ధిదారులు ఏర్పాటు చేసే యూనిట్ల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రూ.10 లక్షల విలువైన యూనిట్ల ఏర్పాటుతో ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేలా అమలుచేస్తున్న ఈ కార్యక్రమంపై పక్కా నిర్వహణ, నిఘాను ఏర్పాటు చేస్తోంది. ప్రతి లబ్ధిదారుకు సరైన అవగాహన కల్పించడంతో పాటు వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు లబ్ధిదారులకు అందుబాటులో ఉంటూ అవగాహన కల్పిస్తాయి. యూనిట్ నిర్వహణలో మెళకువలపై చైతన్యపర్చడం, సందేహాలను నివృత్తి చేయడంతో పాటు యూనిట్లను విజయవంతంగా ముందు కు తీసుకెళ్లేందుకు తోడ్పాటు అందిస్తాయి. ఇవీ మార్గదర్శకాలు... ►దళితబంధు కింద ఎంపికైన లబ్ధిదారుకు ప్రభుత్వం నిర్దేశించిన బ్యాంకులో ప్రత్యేక ఖాతాను తెరుస్తారు. పాసు పుస్తకం, చెక్ పుస్తకం ఇస్తారు. ►ఒక్కో ఖాతాలో రూ.10 లక్షలు జమచేస్తారు. దళిత రక్షణ నిధి కింద ఈ ఖాతా నుంచి రూ.10 వేలు వెనక్కి తీసుకుంటారు. ►వ్యవసాయ అనుబంధ రంగాలు, రవాణా రంగం, తయారీ పరిశ్రమ, రిటైల్ దుకాణాలు, సేవలు–సరఫరా కేటగిరీల్లో యూనిట్లను ఎంచుకోవచ్చు. ►నిర్దేశించిన రంగాల్లో సీనియర్ అధికారులతో పాటు నిపుణులను గుర్తించి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో రిసోర్స్ పర్సన్లను, కమిటీలను ఎంపిక చేస్తారు. ►అవసరమైతే ఇతర జిల్లాల నుంచి కూడా రిసోర్స్ పర్సన్లను లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ఎంపిక చేసుకోవచ్చు. ►యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత నిధుల విడుదలకు కమిటీ అనుమతి ఇస్తుంది. అనంతరం కలెక్టర్ ఆమోదంతో ఆ మేరకు చెక్కును బ్యాంకు మేనేజర్ ఆమోదిస్తారు. ►లబ్ధిదారులు ఏర్పాటు చేస్తున్న యూనిట్లకు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టును రిసోర్స్ పర్సన్లు తయారు చేయాలి. ►యూనిట్ ఏర్పాటుపై లబ్ధిదారుకు శిక్షణ, అవగాహనతో పాటు చైతన్యపర్చేందుకు కమిటీలు పనిచేస్తాయి. ►యూనిట్ ఏర్పాటుకు నిర్దేశించిన సాయం సరిపోకుంటే ఇద్దరు సంయుక్తంగా యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కొక్కరు రూ.10 లక్షల విలువ చేసే రెండు యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ►రిసోర్స్ పర్సన్లు, కమిటీలు దళితవాడలు, గ్రామాలు, ఆవాసాలను నిరంతరం సందర్శించి పరిస్థితిని సమీక్షించాలి. లబ్ధిదారుల ప్రాధాన్యతలను గుర్తించి వివరించాలి. ►లబ్ధిదారులకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు జిల్లా ఉన్నతాధికారితో సమగ్ర శిక్షణ మాడ్యూళ్లను స్థానిక పరిస్థితులకు తగినట్లుగా రూపొందించాలి. ►ఈ మాడ్యూళ్ల తయారీలో నిపుణులు, ప్రభుత్వేతర సంస్థలు, ఎన్జీఓల సహకారం తీసుకోవచ్చు. ►లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా శిక్షణ తరగతులను నిర్వహించాలి. ఈ మేరకు ప్రత్యేక షెడ్యూల్‌ను ఖరారు చేసుకోవాలి. 2 నుంచి 6 వారాల్లో ఈ శిక్షణలు పూర్తిచేయాలి. ►ఇప్పటికే ఆయా రంగాల్లో విజయవంతంగా యూనిట్లు నిర్వహిస్తున్న వారి సహకారాన్ని తీసుకోవాలి. ►లబ్ధిదారు ప్రారంభించతలచిన యూనిట్లను ప్రతి దశలో విజయవంతంగా పూర్తిచేసేందుకు కమిటీలు, రిసోర్స్ పర్సన్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. -
హుజూరాబాద్‌లో జరిగేది కురుక్షేత్రం: ఈటల
సిద్ధిపేట: అక్టోబర్ 30న హుజురాబాద్‌లో జరిగేది కురుక్షేత్రం యుద్ధం.. దీనిలో ధర్మం, ప్రజలే గెలుస్తారు అని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హుజురాబాద్ ఎన్నికలో 75 శాతం ఓట్లు బీజేపీకి పడితే, 25 శాతం ఓట్లు మాత్రమే టీఆర్ఎస్కు పడతాయి. ఐదు నెలలుగా హుజురాబాద్‌లో కేసీఆర్ రచించిన రాజ్యాంగం తప్ప అంబేద్కర్ రాజ్యాంగం అమలవడం లేదు’’ అన్నారు. (చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు) ‘‘దళిత బంధు పథకం హుజురాబాద్‌తో పాటు 33 జిల్లాల్లో వెంటనే అమలు చేయాలి. దళిత బంధు లాంటి పథకం రాష్ట్రంలో కుల మత భేదాలు లేకుండా పేద ప్రజలందరికీ వర్తింపజేయాలి’’ అని ఈటల డిమాండ్ చేశారు. చదవండి: నేను గెలిస్తే కేసీఆర్ రోడ్డుమీదకు: ఈటల రాజేందర్ -
‘దళితబంధు’ పేరుతో వంచన
సాక్షి, కామారెడ్డి: దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు దళితబంధు పేరుతో మరోసారి వారిని వంచిస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరో పించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం ఖండేబల్లూర్‌లో శుక్రవారం నిర్వహించిన ‘జుక్కల్ దళితభేరి’సభలో ఆమె మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకపోవడం మూలంగా ఎకరాకు రూ.10 లక్షల చొప్పున రూ.30 లక్షలు ప్రభుత్వం బాకీ పడిందని, భూమి ఇచ్చి ఉంటే గడచిన ఏడేళ్లలో కనీసం రూ.20 లక్షల ఆదాయం వచ్చేదని, వీటన్నింటిని కలిపితే ప్రభుత్వం రూ.50 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యం లో ప్రభుత్వం ఇచ్చే రూ.పది లక్షలు తీసుకుని మిగతాడబ్బుల కోసం పోరాడాలని ఆమె పిలుపునిచ్చా రు. తాతల కాలం నుంచి దళితులు సాగు చేసుకుం టున్న భూములకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టాలు ఇచ్చారని, కేసీఆర్ ప్రభుత్వం వాళ్లకు పాసుపుస్తకాలు ఇవ్వకుండా భూములు గుంజుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దళితులంటే సీఎంకు పట్టింపు లేదు... సీఎం కేసీఆర్‌కు దళితులంటే పట్టింపులేదని, ఇసుక అక్రమరవాణాపై ప్రశ్నించిన పాపానికి దళిత యువకులను చితకబాది జైల్లో వేశారని, దళితమహిళలను చంటి బిడ్డలతోసహా జైలుకు పంపించార ని షర్మిల విమర్శించారు. రాష్ట్రమంతటా రూ.వందల కోట్ల ఇసుక దందా నడుస్తోందని ఆరోపించా రు. మంజీరలో ఇసుకను అడ్డగోలుగా తవ్వడం వ ల్లే నలుగురు ప్రాణాలు కోల్పోయారని, ఇసుక మా ఫియాలో టీఆర్ఎస్ నేతలకు వాటాలున్నాయని ఆరోపించారు. ఇసుక మాఫియాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు బిచ్కుంద మండలంలోని షెట్లూర్‌లో ఇటీవల నీటమునిగి చనిపోయినవారి కుటుంబాలను ఆమె పరామర్శించారు. -
రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు
హుజూరాబాద్/వీణవంక: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. గురువారం ఆయన హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేసిన తనమీదే అబద్ధపు ప్రచారం చేస్తున్నారని.. దొంగ లేఖలు సృష్టించారని అన్నారు. దళితబంధు అందరికీ ఇవ్వాలని తాను మరోసారి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇతర కులాలు, మతాల్లో ఉన్న పేదలందరికీ రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘దూప అయినప్పుడే బాయి తవ్వుకునే వాడివి నువ్వు కేసీఆర్.. ఎన్నికలప్పుడే నీకు ప్రజలు, అంబేడ్కర్ గుర్తుకు వస్తారు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 నెలలుగా హుజూరాబాద్ తప్ప ఇంకేమీ పట్టించుకోవడం లేదని.. వరదల గురించి అసలు మాట్లాడడం లేదని దుయ్యబట్టారు. ప్రగతి భవన్లో కూర్చొని ప్రజల కోసం పనిచేయకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్, ఆయన బిడ్డ, కొడుకు కూలి పనిచేసి, వ్యాపారం చేసి డబ్బులు సంపాదించలేదని, వారి అక్రమ సంపాదన తీసుకొని తనకే ఓటు వే యాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, బొడిగె శోభ పాల్గొన్నారు. అబద్ధపు లేఖ సృష్టించిన వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, దానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈటల ప్రశ్నించారు. -
ముస్లింలకూ లబ్ధి చేకూర్చండి
సాక్షి, హైదరాబాద్: దళిత బంధు తరహాలో పేద ముస్లిం కుటుంబాలకు కూడా నగదు బదిలీ లబ్ధి చేకూర్చాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో ‘తెలంగాణలో ముస్లిం‘లు అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రం మొత్తం మీద 8.8 లక్షల ముస్లిం కుటుంబాలు ఉండగా, అందులో రెండు శాతం మంది అత్యంత దుర్భర జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో కనీసం ఒక శాతం కుటుంబాలకైనా దళిత బంధు తరహా పథకం వర్తింపజేయాలని కోరారు. కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందిస్తే రూ.900 కోట్లు దాటదని, బడ్జెట్లో సైతం 0.8 శాతం మించదని చెప్పారు. ఒకే విడతగా సాధ్యం కాని పక్షంలో రెండు విడతలుగా నగదు బదిలీ చేయవచ్చని సూచించారు. అసెంబ్లీలో సీఎంను కోరతాం.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో దళిత బంధు పథకం చర్చకు వచ్చినప్పుడు పేద ముస్లిం వర్గాలకు కూడా ఆర్థిక చేయూత అమలు కోసం సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తామని అసదుద్దీన్ చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని వర్గాలతో పాటు ముస్లిం కుటుంబాల ఆర్థిక పరిస్థితి మరింత ఛిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింల ఆర్థిక స్థితిగతులపై సుధీర్ కమిషన్ సమర్పించిన నివేదిక సైతం దళితుల కంటే ముస్లింలు వెనుకబడి ఉన్నారని పేర్కొందని గుర్తుచేశారు. ముస్లిం వర్గాలు అక్షరాస్యతలో సైతం వెనుకబడ్డారని, పై తరగతులకు వెళ్తున్న కొద్దీ డ్రాప్ అవుట్ శాతం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నాలుగు శాతం మించి ముస్లింలు లేరని, భూములు కలిగిన వారు 9 శాతం మాత్రమే ఉన్నారని పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ చర్చా వేదికలో ముస్లిం ఆర్థిక సామాజిక స్థితిగతుల విచారణ కమిషన్ చైర్మన్ జి.సుధీర్, ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్ తదితరులు పాల్కొన్నారు. -
స్పీకర్‌దే తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశానికి ముగ్గురు సభ్యులున్న బీజేపీని పిలవాలా వద్దా అనేది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బీఏసీ సమావేశానికి హాజరు కావాలనుకుంటే బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. సోమవారానికి అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ కమిటీహాల్లో శుక్రవారం మీడియాతో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు అసెంబ్లీ వేదికగా చెప్పుకుంటామని సీఎం కేసీఆర్ బీఏసీ భేటీలో వెల్లడించారన్నారు. ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుత సమావేశాల్లో హరితహారం, దళితబంధు, ఐటీ, పరిశ్రమలు వంటి పది అంశాలను చర్చించాలని కోరుతూ స్పీకర్‌కు ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. 12 అంశాలపై చర్చకు కాంగ్రెస్ ప్రతిపాదనలు ఈ సమావేశాల్లోనే నాలుగైదు బిల్లులతో పాటు రెండు ఆర్డినెన్స్‌లు కూడా సభ ముందుకు వస్తా యని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 12 అంశాలపై చర్చించాలని ప్రతిపాదనలు ఇచ్చిందని, హైదరాబాద్ ఓల్డ్‌సిటీ అభివృద్ధిపై చర్చించాలని ఎంఐఎం పార్టీ కోరిందని పేర్కొన్నారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం కానిస్టిట్యూషన్ క్లబ్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. టీఆర్ఎస్పై ఈటల రాజేందర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీయే తమకు ప్రధాన ప్రత్యర్థి అని, ఈ నెల 21,22,23 తేదీల్లో నిర్వహించిన సర్వేలో బీజేపీ కంటే టీఆర్ఎస్ పార్టీ 15% ఎక్కువ ఓట్లు సాధిస్తుందని వెల్లడైనట్లు మంత్రి తెలిపారు. -
రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు ఇవ్వాలి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సిరిసిల్ల: రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాల్సిందేనని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు, ఇందుకోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఉద్యమాలు ప్రారంభిస్తామని చెప్పారు. సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర గురువారం 27వ రోజు సిరిసిల్ల జిల్లాలో ప్రవేశించింది. ఈ సందర్భంగా గంభీరావుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉఫ్‌మని ఊదితే కొట్టుకుపోయే ప్రభుత్వమిదని ఎద్దేవా చేశారు. బీజేపీకి భయపడి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. కేసులకు తాము భయపడబోమని, ఇకపై కేసులు పెడితే తానే నేరుగా పోలీస్స్టేషన్లకు వస్తానని అన్నారు. అప్పుడు అక్కడికి ఏకంగా సీఎం రావాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కాక సర్పంచులు ఆత్మహత్య లకు పాల్పడే పరిస్థితి తలెత్తిందని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. ఏడున్నరేళ్లలో మంత్రి కేటీఆర్ సిరిసిల్లకు ఏం చేశారని ప్రశ్నించారు. అన్ని విషయాల్లో పైసలు కేంద్రానివి.. ప్రచారం మాత్రం కేసీఆర్ చేసుకుంటారన్నారు. మాట్లాడితే పెట్రోలు చార్జీలు పెంచామంటున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో రూ.40 వివిధ పన్నుల కింద తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. ఇదే అదనుగా ఆర్టీసీ, విద్యుత్తు చార్జీలు పెంచాలని చూస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
దళితబంధును వదులుకున్న సిసలైన శ్రీమంతులు..
సాక్షి, కరీంనగర్: లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.10 లక్షలు. తిరిగి ఇచ్చేయాలన్న నియమమేమీ లేదు. అయినా.. వారు ఆ డబ్బును తిరస్కరించారు. తాము మంచి స్థితిలోనే ఉన్నామని, దళితబంధు కింద వచ్చే ఆ డబ్బు పేద సోదరులకు ఉపయోగపడాలంటూ ఆ ఐదుగురు పెద్ద మనసు చాటుకున్నారు. సమాజంలో సిసలైన శ్రీమంతులు అనిపించుకున్నారు. తాము ఆర్థికంగా ఉన్నతస్థితిలోనే ఉన్నామని, తమకు రూ.10 లక్షల సాయం అవసరం లేదని స్పష్టంచేశారు. గివ్ ఇట్ అప్ (వదులుకోవడం) కింద వీరు తమకు వచ్చే భారీ ఆర్థికసాయాన్ని వదులుకుని సమాజానికి ఆదర్శంగా నిలిచారు. దీంతో ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ ఐదుగురి గురించే చర్చించుకుంటున్నారు. వీరిలో ముగ్గు రు వ్యక్తులు తండ్రీకొడుకులు కావడం గమనార్హం. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన దళితుల పురోభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హు జూరాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా సర్వే చేసి 5 మండలాల్లో దాదాపు 23 వేలకుపైగా దళితులను గుర్తించింది. వీరికోసం రూ.2,000 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకూ హు జూరాబాద్ నియోజకవర్గంలో 14,421 మంది లబ్ధిదారుల ఖాతాలలో ప్రభుత్వం దళితబంధు నిధులు జమచేసింది. తాజాగా ఐదుగురు వ్యక్తులు తామెందుకు దళితబంధు సాయాన్ని వద్దనుకుంటున్నారో తెలుసుకుందాం..! పేదలకు ఉపయోగపడాలి నేను గెజిటెడ్ ప్రాధానోపాధ్యాయునిగా పదవీవిరమణ పొందాను. నా భార్య కూడా ప్రభుత్వ టీచర్‌గా రిటైరయ్యారు. నేను అంబేడ్కర్ వాదిని. ఆయన కల్పించిన రిజర్వేషన్లను ఆసరా చేసుకొని ఉన్నత స్థితికి చేరుకున్నా. ఇప్పటికీ ఇంకా ఎందరో దళితులు అట్టడుగు స్థితిలో ఉన్నారు. అందుకే.. నాకు వచ్చిన రూ.10 లక్షలను ఇతర పేద కుటుంబాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాపస్ ఇచ్చా. – కర్రె నరసింహస్వామి, హుజూరాబాద్ పేదల కోసం వదులుకున్నా ప్రస్తుతం రైల్వేలో డిప్యూటీ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ మంచి జీతంతో ఉన్నత స్థితిలో ఉన్నా. మా తండ్రి, తల్లి ప్రభుత్వ టీచర్లుగా పదవీవిరమణ పొందారు. వారికి పెన్షన్ కూడా వస్తోంది. అందుకే.. రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం కింద మంజూరు చేసిన 10 లక్షల రూపాయలను పేద దళిత కుటుంబాలకు ఉపయోగపడాలని గివిట్ అప్ కింద ప్రభుత్వానికి తిరిగి ఇచ్చా. – కర్రె కిరణ్ కుమార్, రైల్వే ఇంజనీర్, హుజూరాబాద్ నా పెన్షన్ చాలు పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా రిటైరయ్యాను. ఇప్పటికీ చాలా దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాయి. నాకు మంజూరైన దళితబంధు డబ్బులు పేద దళిత కుటుంబానికి ఇస్తే వారు అభివృద్ధి చెందుతారు. అదే నాకు తృప్తి. నాకు వచ్చే పెన్షన్ సరిపోతుంది. అందుకే.. నాకు వచ్చిన రూ.10 లక్షలను వదులుకున్నా. – సోటాల మోహన్‌రావు, రిటైర్డ్ ఇంజనీర్, హుజూరాబాద్ చదవండి: కంటోన్మెంట్ విలీనంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ -
అర్హులందరికీ దళితబంధు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వం కరీంనగర్ జిల్లా లోని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళితబంధు పథకాన్ని అర్హులైన కుటుంబాలందరికీ అమలు చేస్తామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళితబంధుపై మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్, క్లస్టర్ అధికారులు, బ్యాంకర్లతో హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. వివాహమైన ప్రతి దళిత కుటుంబానికీ పథకం డబ్బులు జమ అవుతాయని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. దళితబంధు డబ్బులతో స్వయంఉపాధి కోసం ఎంపిక చేసుకున్న యూనిట్లు స్థాపించుకోవాలని సూచిం చారు. దళితబంధు ద్వారా వచ్చే రూ.10 లక్షలతో లబ్ధిదారులు 4 యూనిట్లు కూడా స్థాపించుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, 65 ఏళ్లలోపు వయసు ఉన్న దళితులందరికీ పథకం అందుతుందని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో డబ్బులు అందని దళిత కుటుంబాలందరికీ మూడురోజులలోపు వారి ఖాతాలో జమ చేయాలని మంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు. యూనిట్లు స్థాపించుకునే వరకు ఖాతాలో నిల్వఉండే డబ్బులకు బ్యాంకులు వడ్డీ ఇస్తాయన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ ఈ నెల 21న నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో దళితబంధు రాని వారి వివరాలు సేకరించి, అర్హులకు వెంటనే డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ఇల్లందకుంట మండలానికి చెందిన కొత్తూరి జయ, ఆమె భర్త మొగిలి, హుజూరాబాద్ మండ లం కనుకులగిద్దెకి చెందిన కొత్తూరి రాధ, భర్త మొగిలి, కమలాపూర్ మండలం, శనిగరం గ్రామానికి చెందిన రాజేందర్‌ను కరీంనగర్ డెయిరీ పశువుల డాక్టర్ రహీం అక్తర్, మండల పంచాయతీ అధికారి రవి హరియాణాకు తీసుకెళ్లారని, రోహతక్ జిల్లాలో పాడి గేదెలు కొనుగోలు చేశారని కలెక్టర్ వెల్లడించారు. -
ప్రగతిభవన్‌లో దళితబంధు పథకం అమలుపై కేసీఆర్ సమీక్ష
-
Huzurabad: ఓట్ల కోసం కుట్రలు చేయడం సిగ్గుచేటు
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్‌లో అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని మంత్రులు తమ నియోజకవర్గాల్లో అమలు చేయించుకునే దమ్ము, ధైర్యం ఉంటే స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. మంత్రులు తమ నియోజకవర్గాలు, మంత్రిత్వశాఖలను గాలికి వదిలి హుజూరాబాద్ రాజకీయం కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారని, ఓటర్లను మభ్యపెట్టడానికి అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా మంత్రులు గంగుల కమలాకర్, హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ నియోజకవర్గాల్లోని దళితులకు మూడెకరాల భూమి, అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఎస్సీసబ్ ప్లాన్ నిధులతో ఎంతమందిని ఆదుకున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఒక్క ఈటల రాజేందర్‌ను ఓడించడానికి టీఆర్ఎస్ యంత్రాంగం, ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతున్నా నేటికీ ఆశించిన ఫలితం రాలేదన్నారు. సర్వేలన్నీ ఈటల రాజేందర్‌కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మత రాజకీయాలకు అలవాటు పడిపోయి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేని దుస్థితిలో ఉందని దుయ్యబట్టారు. మజ్లిస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని, నాటి నిజాం సర్కారుకు నేటి కేసీఆర్ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమీ లేదని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్కు కౌంట్‌డౌన్ మొదలవుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షుడు కన్న కృష్ణ, జిల్లా కార్యదర్శి రాపర్తి ప్రసాద్, కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, రాపర్తి విజయ, కచ్చు రవి, పెద్దపల్లి జితేందర్, మీడియా ఇన్చార్జి కటకం లోకేశ్, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. చదవండి: ప్రజల దృష్టిలో చిల్లర కావద్దు -
ఏ వర్గాన్నీ విస్మరించలేదు
సాక్షి, హైదరాబాద్: దళితుల కోసం చాలా పథకాలు పెట్టి, వారినే అభివృద్ధి చేస్తున్నారని సమాజంలో జరుగుతున్న చర్చ కేవలం దుష్ప్రచారమేననని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్క కులాన్నీ, మతాన్నీ, వర్గాన్నీ విస్మరించ లేదని, నిర్లక్ష్యం చేయలేదని.. బ్రాహ్మణులు, ఇతర అగ్రకులాల్లోని పేదలను గుర్తించి వారిని అభివృద్ధి పరిచే కార్యక్రమాలను అమలు పరు స్తున్నామని చెప్పారు. రాష్ట్రం నలుదిక్కుల్లో ఉన్న చింతకాని, తిర్మలగిరి, చార గొండ, నిజాం సాగర్ మండలాల్లో దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు అమలుపై సోమవారం ఆయన ప్రగతిభవన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నాలుగు మండ లాల్లో దళిత బంధు అమలుకు దశల వారీగా 2,3 వారాల్లోగా నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఈ మండలాల అధికా రులు గ్రామాలకు తరలాలని ఆదేశించారు. ఇప్పటివరకు అరకొరగానే ‘కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వివక్ష, ఆర్తి, బాధతో వున్న వర్గం ఏదైనా ఉందంటే అది దళిత జాతేననే విషయాన్ని అనేక జాతీయ, అంతర్జాతీయ తులనాత్మక అధ్యయనాలు స్పష్టం చేశాయి. స్వాతంత్య్రానంతరం అరకొర అభి వృద్ధి తప్పితే, దళిత గూడాల్లో గుణాత్మకమైన మార్పు రాలేదు. ఒక కుటుంబంలో ఎవరిౖకైనా ఆపద వస్తే ఎలాగైతే ఆదుకుంటామో అదే స్ఫూర్తితో దళితులను బాగు చేసుకోవాల్సిన బాధ్యత యావత్ సమాజంపై ఉంది. దశల వారీగా రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించుకుని పథకాన్ని అమలు చేస్తాం. తల్లిదండ్రుల మాదిరి వ్యవహరించాలి దళితుల అభ్యున్నతికి అధికారులు తల్లిదండ్రుల మాదిరి (పేరంటల్ అప్రోచ్) పనిచేయాలి. అధికార దర్పంతో కాకుండా. తమ కన్నబిడ్డ ఆలనా పాలనా తల్లిదండ్రులు ఎలాగైతే చూస్తారో ఆ పద్ధతిలో దళితులతో వ్యవహరించాలి. సమన్వయకర్తల్లాగా కలిసి పనిచేయాలి. దళితుల్లో ఒక విశ్వాసాన్ని పాదుకొల్పాలి. దళితుబంధు పథకాన్ని తమ భుజాల మీద మోయాల్సిన సమయం విద్యావంతులైన దళిత యువతకు ఆసన్నమయ్యింది. దళిత యువతను అధికారులు ఈ పథకంలో భాగస్వాములను చేయాలి..’ అని సీఎం చెప్పారు. వ్యాపార, ఉపాధి రంగాల్లో దళితులకు కోటా ‘ప్రభుత్వం లైసెన్సులు కేటాయించే వివిధ రంగాలను గుర్తించి అందులో అర్హులైన దళితులకు రిజర్వేషన్ ఏర్పాటు చేస్తాం. మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, మీసేవా కేంద్రాలు, గ్యాస్ డీలర్‌షిప్పులు, ట్రాన్స్‌పోర్టు పర్మిట్స్, మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్టులు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులు, బార్లు.. వైన్ షాపులు తదితరాల ద్వారా ఉపాధి పొందే విధంగా, దళితబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అన్ని విధాలుగా దళిత కుటుంబం బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం’ అని స్పష్టం చేశారు. దళితబంధు ప్రత్యేక ఖాతా ‘ప్రతి లబ్ధిదారుని కుటుంబానికి ప్రత్యేకంగా దళితబంధు బ్యాంక్ ఖాతా తెరిపిస్తాం. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో దళితబంధు కమిటీలు ఉంటాయి. ఈ కమిటీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా దళిత బిడ్డలు.. దళిత జాతి సంరక్షణను తమ భుజాలమీద వేసుకొని నిర్వహించనున్నారు. ఈ కమిటీల నుంచి ఎన్నికైన వారే రీసోర్స్ పర్సన్లుగా పనిచేస్తారు..’ అని సీఎం తెలిపారు. దళితబంధులో డెయిరీ యూనిట్లను ప్రోత్సహించడానికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ కుమార్, జి.జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, భట్టి విక్రమార్క, హనుమంతు షిండే, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు రాజకీయాలకు అతీతంగా నా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. – మల్లు భట్టి విక్రమార్క ఇంత మంచి పథకం ఎవరూ పెట్టలేదు : దళితుల అభ్యున్నతికి ఇంత మంచి పథకాన్ని ఎవరూ పెట్టలేదు. ఒక చరితార్థుడే ఇలాంటివి చేయగలుగుతాడు. ఆయనే సీఎం కేసీఆర్. – మోత్కుపల్లి నర్సింహులు ‘‘పాతిన వెలిశిల పాదులో ప్రగతి లిపి మొలిసింది నరకబడ్డ చెట్ల వేర్లు నడక నేర్చుకుంటున్నవి ఏ జాతుల జ్ఞానంతో భరత జాతి వెలిగిందో ఏ చేతుల సలువ వల్ల ధరణి మైల తొలగిందో ఆ వెలివాడల త్యాగాలకు ప్రతిరూపం అంబేడ్కర్ మలి వేకువ యాగానికి శ్రీకారం కేసీఆర్ ’’ అంటూ గోరటి వెంకన్న కవితాత్మకంగా స్పందించారు. దళిత గిరిజన బంధుగా మార్చండి: భట్టి ఈ సందర్భంగా దళితబంధు పథకం అమలుపై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని వివరిస్తూ.. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఒక లేఖను సీఎం కేసీఆర్‌కు సమర్పించారు. ‘రాష్ట్రంలోని ఈ వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికీ పథకాన్ని వర్తింపజేస్తామని మీరు చెప్పారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని దళిత కుటుంబాలకు పథకాన్ని అమలు చేయాలి. అలాగే గిరిజన బంధు పథకాన్ని ఇదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి. పేదరికంలో ఉన్న ఇతర వర్గాల వారికి కూడా వర్తింప చేయాలి. దళిత బంధు పథకాన్ని దళిత – గిరిజన బంధుగా మార్చి తక్షణం రాష్ట్రంలోని ప్రతి దళిత – గిరిజన కుటుంబానికి అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది..’ అని లేఖలో తెలిపారు. దళితబంధు ఉత్తుత్తి పథకంగా మిగిలి పోకూడదని పేర్కొన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను భట్టి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి విడిగా వినతిపత్రం అందజేశారు. -
ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌కు దళితులు గిరిజనులు గుర్తుకు వస్తారు
-
వాసాలమర్రికి పండగొచ్చింది
తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలోఎంపిక చేసిన దళిత కుటుంబాల ఖాతాల్లో దళితబంధు డబ్బులు జమ అయ్యాయి. దీంతో ఆయా కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దళితులందరూ అర్థికంగా ఎదగాలని, మొట్టమొదటిగా దళితబంధు పథకాన్ని ఇక్కడినుంచే ప్రారంభిస్తున్నానని ఆగస్టు 4న సీఎం కేసీఆర్ చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు మరుసటి రోజున ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున 76 దళిత కుటుంబాలకు సంబంధించి కలెక్టర్ పమేలా సత్పతి ఖాతాలోకి నిధులు ప్రభుత్వం జమ చేసింది. అనంతరం నిధులను దేనికి, ఎలా ఖర్చు చేస్తారు? ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలపై వివిధ శాఖల అధికారులు పలుమార్లు ఆయా దళిత కుటుంబాలతో సమావేశమై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాలు పూర్తి కావడంతో 8వ తేదీ రాత్రి 8 గంటలకు నేరుగా 66 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఆ నిధులను ప్రభుత్వం జమ చేసింది. మరో 10 మందికి జమ కావాల్సి ఉంది. సాంకేతిక సమస్యల వల్ల 10 మందికి డబ్బులు జమ కాలేదని, వారికి కూడా త్వరలోనే వస్తాయని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ తెలిపారు. ఆనందోత్సవాలు వాసాలమర్రి దళితులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. తమ బతుకులు మారబోతున్నాయంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిధుల జమ ఖాయమైనా, నిన్న మొన్నటి వరకు కొంత సంశయంతో ఉన్న సమయంలో తమ ఖాతాల్లోకి రూ.10 లక్షలు వచ్చి చేరడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. లబ్ధిదారుల క్షేత్ర పర్యటన పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, మేకలు, గొర్ల పెంపకంపై ఆసక్తి ఉన్న 30 మంది రైతులను గురువారం జిల్లా అధికారం యంత్రాంగం ధర్మారెడ్డి గూడెం, చిన్నకందుకూర్, రాయగిరి, కూనూర్ గ్రామాల్లో క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లారు. వారికున్న అనుమానాలను నివృత్తి చేశారు. పశు పోషణ, కోళ్ల పెంపకం, గొర్లు, మేకల పెంపకం ఏ విధంగా చేపట్టాలి, లాభాలు ఏవిధంగా గడించాలన్న విషయాలను వారికి తెలియజేశారు. -
బీసీబంధు ఇవ్వకుంటే మహాఉద్యమం
కవాడిగూడ (హైదరాబాద్): బీసీబంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా మహాఉద్యమాన్ని చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. దళితబంధు పథకాన్ని తాము ఆహ్వానిస్తున్నామని, అయితే బీసీబంధు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద బీసీ సంక్షేమ సంఘం నేత గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో బీసీల సమర శంఖారావం నిర్వహించారు. దీనికి 76 కులసంఘాలు మద్దతు తెలుపగా.. మాజీ ఎంపీలు హనుమంతరావు, అజీజ్‌పాషా, ఆనందభాస్కర్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ హాజరై సంఘీభావం ప్రకటించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ హుజూరాబాద్ ఎన్నిక ముందే బీసీబంధును ప్రకటించకపోతే బీసీలెవరూ టీఆర్ఎస్కు ఓటు వేయరని చెప్పారు. హనుమంతరావు మాట్లాడుతూ హుజూరాబాద్‌లో దళితులు 42 వేల మంది మాత్రమే ఉన్నారని, బీసీలు లక్షా 20 వేల మంది ఉన్న విషయాన్ని మరిచిపోవద్దని హెచ్చరించారు. -
దళితబంధు సర్వే..భేష్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు సర్వేను సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, అధికారులకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తన్నీరు హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన గంగుల, హరీశ్‌రావు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా దళితబంధు సర్వే, దళితబంధు అమలుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 12,521 మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు మంత్రులు తెలిపారు. మిగిలిన లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. డబ్బులు ఖాతాలో జమయిన వెంటనే అందరికీ మొబైల్ఫోన్లో తెలుగులో సందేశాలు పంపించాలన్నారు. దళితబంధు సర్వేలో డోర్ లాక్, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, తప్పిపోయిన దళిత కుటుంబాల ఇళ్లను కూడా ఈ నెల 12 నుంచి వారం రోజుల్లో మరోసారి సందర్శించాలని నిర్ణయించారు. దళితబంధు కింద మంజూరైన డబ్బులను ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు తమకు వద్దని, ఈ డబ్బుల్ని ఇతర పేద దళిత కుటుంబాలకు సహాయం అందించాలని ‘‘గివ్ ఇట్ అప్’’అని స్వచ్ఛందంగా ఇచ్చినందుకు ఆ ఉద్యోగులను మంత్రులు అభినందించారు. 18 ఏళ్లలోపు తల్లిదండ్రులు లేని 14 మంది అనాథ పిల్లలకు మానవతా దృక్పథంతో వెంటనే దళితబంధు మంజూరు చేసివారి ఖాతాల్లో డబ్బులు జమచేయాలని నిర్ణయించారు. త్వరలోనే మిగిలిన వారికి..! దళితబంధు పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా మంజూరు చేసిన 15 మంది లబ్ధిదారులలో ఇంతవరకు ఆరుగురు లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ చేశామని మిగిలిన వారికి కూడా స్కీముల ఎంపిక పూర్తి చేసి వారం రోజుల్లో గ్రౌండింగ్ చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నగర మేయర్ వై.సునీల్ రావు, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్ రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
ఆర్నెల్లు అధికారం అప్పగిస్తే..అందరికీ ‘బంధు’ ఇస్తారా?: లక్ష్మారెడ్డి
జడ్చర్ల: ‘కాంగ్రెస్, బీజేపీలకు ఆరు నెలలపాటు అధికారాన్ని అప్పగిస్తే రాష్ట్రంలో దళితబంధు వంటి పథకాలను బీసీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీలందరికీ ఏకకాలంలో అందజేస్తారా.. ఇంటింటికీ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారా.. అది సాధ్యమయ్యేనా..’ అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ఆయా పార్టీలకు సవాల్ విసిరారు. శనివారం జడ్చర్లలోని తాలుకా క్లబ్ కార్యాలయం ఆవరణలో టీఆర్ఎస్ వార్డు కమిటీల ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ కమిటీల నుంచి ఆయా పథకాలు రాష్ట్రవాప్తంగా ఒకేసారి అమలు చేసేలా తీర్మానించి లెటర్ తీసుకొస్తే ఓ ఆరు నెలల పాటు వారికి అధికారం అప్పజెబుతామన్నారు. సీఎం కేసీఆర్ అట్టడుగున ఉన్న దళితుల సంక్షేమం కోసం దశలవారీగా ‘దళితబంధు’ను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో బీసీ, ఎస్టీ, మైనార్టీ తదితరులకు వర్తింపజేస్తారన్నారు. అయితే విపక్ష నేతలు హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే ‘దళితబంధు’తెచ్చారని, రాష్ట్రమంతా ఎందుకు అమలు చేయడంలేదని, ఇతర వర్గాలకు ఆయా పథకం ఎందుకు ఇవ్వరని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం సరైందికాదన్నారు. -
16,800 మందికి దళితబంధు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళితబంధు అమలులో తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. గతనెల 16న హుజూరాబాద్ మండలం శాలపల్లిలో నిర్వహించిన దళితబంధు సభ మొదలు ప్రభుత్వం ఈ పథకం అమలుకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తోంది. గత నెల 15 మందికి రూ.10 లక్షల చొప్పున అందజేసిన ప్రభుత్వం తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 16,800 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేసింది. అంటే.. మొత్తంగా రూ.1,680 కోట్ల నగదు వారి ఖాతాల్లోకి బదిలీ అయింది. ఈ మేరకు శనివారం ఉదయానికి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమయ్యాయి. ఇప్పటికే ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.2,000 కోట్లను కరీంనగర్ కలెక్టరుకు బదిలీ చేసింది. వాటినుంచి తొలి 15 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.10 లక్షల చొప్పున జమ చేశారు. వారిలో మోటారు వాహనాలపై ఆసక్తి చూపిన నాలుగు కుటుంబాలకు ఇప్పటికే వాహనాలను అందజేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. నియోజకవర్గంలో మొత్తం 20,900 దళిత కుటుంబాలు ఉన్నాయి. తాజాగా పూర్తయిన దళితబంధు సర్వేతో అదనంగా మరో మూడువేల కుటుంబాలు చేరడంతో ఈ సంఖ్య 23,183 చేరింది. వీరందరికీ ప్రాధాన్యతాక్రమంలో దళితబంధు పథకం వర్తింపజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. వాట్సాప్ గ్రూపు దళితుల జీవన స్థితిగతులను మార్చే ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకం 100 శాతం విజయవంతం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. అందుకే ఈ పథకం అమలు కోసం ప్రత్యేకంగా మండలానికి ఒక రిసోర్స్‌పర్సన్ (ఆర్పీ)ను నియమించింది. ఈ పథకం ద్వారా అందజేసే రూ.10 లక్షల నగదును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా వారికి మార్గనిర్దేశనం చేసే వ్యూహంలో భాగంగా దళిత విశ్రాంత ఉద్యోగులను రంగంలోకి దించుతున్నారు. దళితబంధు అమలుకు నియోజకవర్గాన్ని ఏడు యూనిట్లు (హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లందకుంట మండలాలు, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ)గా విభజించారు. ఈ ఏడు యూనిట్లలో ప్రతి యూనిట్‌కు ఐదుగురు విశ్రాంత ఉద్యోగులు పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా వారికి దిశానిర్దేశం చేస్తారు. ఇదే సమయంలో హుజూరాబాద్ గ్రామాల్లో ఆదర్శభావాలు కలిగి, సామాజిక చైతన్యం ఉన్న యువకులను ఏడు యూనిట్ల నుంచి ప్రతి గ్రామానికి 10 మంది చొప్పున ఎంపిక చేస్తారు. వీరికి వివిధ రంగాల్లో నిపుణులైన వారితో హైదరాబాద్‌లో ప్రత్యేక తరగతులు ఇప్పిస్తారు. ప్రతి మండలానికి బాధ్యులుగా ఉన్న ఐదుగురు విశ్రాంత దళిత ఉద్యోగులు, ప్రతీ గ్రామానికి 10 మంది యువకులతో ఓ వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేస్తారు. ఈ గ్రూపునకు ఆయా మండలాల రిసోర్స్ పర్సన్లు అడ్మిన్లుగా ఉంటారు. ప్రభుత్వ అధికారులు చేస్తున్న ప్రచారానికి అదనంగా వీరు కూడా పథకం ప్రయోజనాలను వివరించనున్నారు. -
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం: ఇక నలుదిశలా ‘దళిత బంధు’
-
కోపంతో చేతిలోని ఫోన్ విసిరిన మంత్రి కొప్పుల ఈశ్వర్
హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 21వ వార్డులో సోమవారం దళితబంధు సర్వే పర్యవేక్షణకు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓ అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మంత్రుల కన్నా మీరే బిజీగా ఉంటున్నారా..? మంత్రి రాకపై ముందే సమాచారం ఇచ్చినా.. కనీస ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటారా’అని అసహనం వ్యక్తం చేశారు. ముందుగానే సమాచారం ఇచ్చి, దళితబంధు గురించి మాట్లాడడానికి వస్తున్నానని తెలిపినా.. పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. అధికారులు ఇచ్చిన వివరణ సరిగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ఏర్పాట్లు సరిగా చేయలేదని ఒకవైపు కొప్పుల నిలదీస్తుండగానే ఆ అధికారి మంత్రి మాటలను పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతుండడంతో కొప్పుల మరింత సీరియస్ అయ్యారు. చేతిలోని సెల్‌ఫోన్‌ను విసిరి సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మంత్రి కొప్పుల ఒక్కసారిగా అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేతిలోని ఫోన్ విసిరివేయడం చర్చనీయాంశంగా మారింది. (చదవండి: ఉద్రిక్తతకు దారితీసిన ‘జెండా గద్దె పంచాయితీ’) (చదవండి: ‘దళితబంధు’ను అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటా) -
జోష్ ఇంకా పెరగాలి
సాక్షి, హైదరాబాద్: ‘పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత గత రెండు నెలల కాలంగా పార్టీ కేడర్‌లో ఉత్సాహంతో కూడిన కదలిక కనిపిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఆ పార్టీ నేతల అవినీతిపై క్షేత్రస్థాయిలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ గ్రాఫ్ నానాటికీ పడిపోతోంది. ఇంకోవైపు బీజేపీలో వర్గపోరు తీవ్రమైంది. పాదయాత్రల కోసం ఆ పార్టీ నేతలు పోటీలు పడుతున్నారు. ఈ విధంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న పరిస్థితు ల్లో ఈ ఊపు, ఉత్సాహం మరింత పెరగాలి’అని టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం అభి ప్రాయపడింది. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూ ర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మ య్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల నిర్వహణ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్లు దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జెట్టి కుసుమకుమార్, పొన్నం ప్రభాకర్లతో పాటు ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్లు హాజరయ్యారు. 17లోపు హుజూరాబాద్ అభ్యర్థి ప్రకటన మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ సమావేశానికి హాజరైన కీలక నేతలందరూ హుజూరాబాద్ అభ్య ర్థిగా ఒక్క పేరునే సూచిస్తే ఆ పేరును అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి ఓకే చేయిస్తానని చెప్పారు. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతల నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని, పరిశీలించిన దరఖాస్తులను అధిష్టానానికి పంపి వచ్చేనెల 17లోపు అభ్యర్థిని ప్రకటించాలని తీర్మానించారు. మరో రెండుచోట్ల దండోరా సభలు దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు మం చి స్పందన వచ్చిందని, క్షేత్రస్థాయి కార్యక్రమాల వల్ల దళితులు, గిరిజనుల్లో అవగాహన పెంచగలిగామని కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 17లోగా మరో రెండుచోట్ల సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 8 లేదా 9వ తేదీల్లో గజ్వేల్ లేదా మెదక్ పార్లమెంటు స్థానం పరిధిలోనికి వచ్చే మరోచోట సభ నిర్వహించాలని తీర్మానించారు. 17న నిర్వహించే ముగింపుసభకు రాహుల్ రాకపోతే ఏఐసీసీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేను ఆహ్వానించాలని నిర్ణయించారు. దళితబంధుతో వ్యతిరేకత దళితబంధు వల్ల దళితుల్లోనూ, ఇతర సామాజికవర్గాల్లోనూ టీఆర్ఎస్పై వ్యతిరేకత వస్తోందని సీనియర్ నేతలు చెప్పారు. ఈ నేపథ్యం లో దళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్ని వర్గాలకు దాన్ని వర్తింప చేయాలంటూ ప్రభు త్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలే తమ పని అయిపోయినట్టేనని వ్యాఖ్యానిస్తున్నారని చెప్పినట్టు సమాచారం. పార్లమెంటు స్థానాల వారీ సమీక్షా సమావేశాలు డిసెంబర్ 31 కల్లా పూర్తి చేస్తానని మాణిక్యం ఠాగూర్ చెప్పారు. అప్పటికి మండల స్థాయి, బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయించి సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. సీనియర్ల సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళతానని రేవంత్ అన్నారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డి గైర్హాజరయ్యారు. కాగా టీపీసీసీ అధ్యక్షులుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జెట్టి కుసుమకుమార్‌లు పార్టీకి చేసిన సేవలను అభినందిస్తూ సమావేశం తీర్మానించింది. ‘ఆ లోటు కనిపించింది’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో సీనియర్ నాయకులు కొందరు లేని లోటు కనిపించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, కోదండరెడ్డి, వీహెచ్ లాంటి సీనియర్లు లేని లోటు స్పష్టంగా ఉందని మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ అన్నా రు. గతంలో వైఎస్సార్ సీఎం హోదాలో ఉన్న ప్పుడు కూడా కాకా, వీహెచ్‌లాంటి నేతలను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేశారని, సభలు సక్సెస్ చేయడం ఎంత ముఖ్యమో సీనియర్ నేతలను గాంధీభవన్‌కు రప్పించుకోవడం కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని పీసీసీ గ్రహించాలని జగ్గారెడ్డి అన్నారు. -
మాట నిలబెట్టుకోలేదనే కవితను ఓడించారు
బోధన్/కుత్బుల్లాపూర్: ప్రజలను మాటలతో మభ్యపెడితే ఓటుతో ఓడిస్తారని, మూతబడిన నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడం వల్లే రైతులు సీఎం కేసీఆర్ కూమార్తె కవితను ఓడగొట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని పీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ బోధన్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో రేవంత్ మాట్లాడారు. కోటి ఎకరాలకు నీళ్లిస్తామని కేసీఆర్ చెబుతున్నారని, కానీ జలయజ్ఞం ద్వారా అప్పట్లోనే 60–70 లక్షల ఎకరాలకు నీరందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. హుజూరాబాద్‌లో దళితబంధు అమలు తీరుపై కాంగ్రెస్ ప్రశ్నిస్తుంటే, ఓడిపోతామనే భయంతో తెలంగాణ–ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలనుకుంటున్నారని విమర్శించారు. ఎంపీ అర్వింద్.. సోనియాగాంధీ గురించి విమర్శించడం మానుకోవాలని సూచించారు. కుమారుడిని అదుపులో పెట్టుకోకపోవడం డి.శ్రీనివాస్ తప్పేనన్నారు. తాను త్వరలో గజ్వేల్, నిజామాబాద్‌లో భారీసభలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ప్రభుత్వ విప్ అనిల్, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘దళితబంధు’ను అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటా
అమీర్‌పేట(హైదరాబాద్): దళితులపాలిట వరంగా మారనున్న దళితబంధు పథకాన్ని విపక్షాలు అడ్డుకుంటే యాదగిరిగుట్టలో ఆత్మహత్య చేసుకుంటానని మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. దళితబంధుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఒకరోజు నిరసనదీక్ష చేపట్టారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మోత్కుపల్లికి పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు. నర్సింహులు మాట్లాడుతూ అగ్రవర్ణాలకు దీటుగా దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాహసోపేత నిర్ణయం తీసుకుని దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను పెట్టి అమలు చేస్తున్నారని, ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారనే అపార నమ్మకం తనకుందని తెలిపారు. రేవంత్‌రెడ్డివి బ్లాక్మెయిల్ రాజకీయాలు ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ‘రేవంత్‌రెడ్డిది ఐరన్ లెగ్, టీటీడీపీని పత్తాలేకుండా చేయించి కాంగ్రెస్ పార్టీలో దూకిన వ్యక్తికి టీపీసీసీ కట్టబెట్టడం సిగ్గుచేట’న్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు అర్థం లేదని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను కప్పిపుచ్చుకోవటానికే యాత్రను చేపట్టారని విమర్శించారు. దళితుల సంక్షేమం కోసం పాటుపడుతున్న కేసీఆర్‌కు దళితులందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. -
ముగిసిన మోత్కుపల్లి దీక్ష.. రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు
సాక్షి, హైదరాబాద్: దళిత బంధుపై విపక్షాల కుట్రలకు నిరసనగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం చేపట్టిన ఒక రోజు దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని రాజకీయ బ్రోకర్‌గా అభివర్ణించారు. రేవంత్‌కు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. తమకు అడ్డమొస్తే రేవంత్‌ను తొక్కేస్తామని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. ‘‘కుల వివక్షకు గురై దళితులు మానసిక క్షోభకు గురయ్యారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు దళితులవి. గ్రామాల్లో తల రుమాలు చేత పట్టుకొని, చెప్పులు చేత పట్టుకొని నడవాల్సిన దుస్థితి. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేసింది. సీఎం కేసీఆర్ ఒక మహోన్నతమైన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో నామమాత్రంగా దళితులకు పథకాలు పెట్టారు తప్ప.. ఇంతటి పెద్ద నిర్ణయం ఏ ప్రభుత్వం తీసుకోలేదు’ అని మోత్కుపల్లి అన్నారు. రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మోత్కుపల్లి.. వందకు వంద శాతం ఈ పథకం అమలు చేస్తాం. ఈ పథకం అమలు కాకపోతే యాదగిరిగుట్ట దగ్గర తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ’’ వ్యాఖ్యానించారు. -
ప్రారంభమైన మోత్కుపల్లి దళిత బంధు దీక్ష
-
మమ్మల్ని ఇప్పటికీ బానిసలుగానే చూస్తున్నారు: మాజీ మంత్రి
సాక్షి, హైదరాబాద్: రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు దళితులవని మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. వివక్ష గురై దళితులు ఎంతో మానసిక క్షోభ అనుభివించారని తెలిపారు. గ్రామాల్లో తల రుమాలు, చెప్పులు చేత పట్టుకొని నడవాల్సిన దుస్థితి ఉందని పేర్కొన్నారు. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేసిందని కొనియాడారు. దళిత బంధు వంటి మహోన్నతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. దేశంలో నామమాత్రంగా దళితులకు పథకాలు పెట్టారే తప్ప ఇంతటి పెద్ద నిర్ణయం ఏ ప్రభుత్వం తీసుకోలేదని తెలిపారు. కాగా గత జూలైలో బీజేపీకి మోత్కుపల్లి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, నర్సింహులు టీఆర్ఎస్లో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆదివారం మోత్కుపల్లి బేగంపేటలోని తన నివాసంలో మాట్లాడుతూ.. ‘ఒక పార్టీకి రాజీనామా చేసి వచ్చిన తరువాత కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బందుకు మద్దతు ఇవ్వడం అంటే సాహసోపేతమైన నిర్ణయం. ఎంత ఖర్చైన భరిస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. అది చాలా గొప్ప నిర్ణయం. కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది సీఎంలుగా చేశారు. కానీ ఎవ్వరూ కూడా దళితుల సంక్షేమం కోసం పాటుపడలేదు. మమ్మల్ని ఇప్పటికి బానిసలుగానే చూస్తున్నారు. ఇన్ని రోజులు సీఎం కేసీఆర్ గురించి మాట్లాడని మోత్కుపల్లి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటున్నారు. మంచి పని చేస్తే ఎవరికైనా మద్దతిస్తాం. దళిత బంధుకు కాంగ్రెస్ బీజేపీ ఎందుకు అడ్డుపడుతుంది. టీడీపీని నిలువునా ముంచింది రేవంత్ రెడ్డి. అతని వల్లే చంద్రబాబు నాశనం అయ్యారు. రేవంత్ రెడ్డిది శని పాదం. రేవంత్ రెడ్డి జీవితం అంత మోసమే, బ్లాక్ మెయిలింగే. ఆర్టీఐని వాడుకుంది మొత్తం రేవంత్ రెడ్డే’ అని మండిపడ్డారు. చదవండి: బురదలో కూరుకుపోయిన మంత్రి అజయ్ కారు ఈ ఏడాది ఘనంగా గణేష్ ఉత్సవాలు.. ముస్తాబవుతున్న ఖైరతాబాద్ -
సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రసమయి జోలపాడుతున్నారు..
సాక్షి, శంకరపట్నం(కరీంనగర్): దళిత బంధును హుజూరాబాద్‌కే పరిమితం చేసిన సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జోలపాడుతున్నారని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు. శంకరపట్నం మండలం ముత్తారం, మక్త, మొలంగూర్, కొత్తగట్టు గ్రామాల్లో శనివారం దళిత, గిరిజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానకొండూర్ ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గానికి దళిత బంధు తీసుకురాకుండా కేసీఆర్ మెప్పు కోసం పాటలు పాడుతూ కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని దళిత, గిరిజనులందరికీ ఈ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, నాయకలు పద్మ, మధుకర్, శ్రీనివాస్, చంద్రమౌళి, జహంగీర్, మల్లారెడ్డి, సాంబయ్య, బుచ్చయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘డబుల్’ ఇళ్ల పంపిణీ: సీఎం ఇంట్లో లిఫ్ట్ మాదిరే ఇక్కడ కూడా -
‘దళితబంధు’ సర్వే చకచకా..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళితబంధు పథకం లబ్ధిదారుల గుర్తింపు కోసం చేపట్టిన సర్వే చురుకుగా సాగుతోంది. శుక్రవారం ప్రారంభమైన ఇంటింటి సర్వే శనివారానికి ఊపందుకుంది. సర్వేలో దాదాపు 400 మంది జిల్లా అధికారులు పాలుపంచుకుంటున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్, ఇల్లందకుంట మండలాలు, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీలను మొత్తం ఏడు యూనిట్లుగా విభజించారు. ప్రతి యూనిట్‌ను ఐదు క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్ల బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు ‘దళితబంధు’యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. అందులో లబ్ధిదారుల పేరు, వయసు, ఫోన్, రేషన్‌కార్డు, ఆధార్ నంబర్లు, సమగ్ర కుటుంబసర్వే నంబరు, చిరునామా, కుటుంబసభ్యులు ఎందరు? వారి వయసు, ఆధార్, ఫోన్ తదితర వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం ప్రతివ్యక్తి ఫొటోను ట్యాబ్‌లో పొందుపర్చి అప్లోడ్ చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ సాఫ్ట్వేర్, యాప్‌లను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ సాఫ్ట్వేర్ తెలుగు, ఇంగ్లిష్ రెండుభాషల్లోనూ అందుబాటులో ఉంది. సర్వే సమయంలోనే ఏ యూనిట్ అంటే ఆసక్తి ఉంది? అన్న వివరాలు కూడా తీసుకుంటున్నారు. 2014లో సమగ్ర కుటుంబసర్వేనే దళితబంధు సర్వేకు ప్రామాణికంగా తీసుకున్నారు. సమగ్ర కుటుంబసర్వే గణాంకాల ప్రకారం... రాష్ట్రంలో 20,900 దళిత కుటుంబాలున్నాయి. సమగ్ర కుటుంబసర్వే తర్వాత మరో రెండు, మూడు వేల వరకు కొత్త కుటుంబాలు పెరిగాయి. ఆ కొత్త కుటుంబాల కోసం ఖాళీ దరఖాస్తులు (లబ్ధిదారుల సమాచార పత్రం) ఇచ్చి వివరాలు నమోదు చేస్తున్నారు. అందరి వివరాలు ఏ రోజుకారోజు కరీంనగర్ కలెక్టరేట్లో పొందుపరుస్తున్నారు. సీఎంసభకు ముందురోజు అంటే ఈ నెల 26వ తేదీ నుంచి కలెక్టరేట్, ఇతర ప్రభుత్వవిభాగాల సిబ్బంది ఉరుకులు, పరుగులు పెడుతూ ఇంటింటి సర్వే పనులు చేస్తుండటం గమనార్హం. -
CM KCR Tour: అడుగడుగునా పలకరింపులు.. ఆలింగనాలు
సాక్షి, కరీంనగర్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కరీంనగర్ పర్యటన మొత్తం బిజీబిజీగా గడిచింది. గురువారం రాత్రి కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని తన సొంత నివాసాని(ఉత్తర తెలంగాణభవన్)కి చేరుకున్న ఆయనకు మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ కర్ణన్, ఐజీ నాగిరెడ్డి, సీపీ సత్యనారాయణ, మేయర్ సునీల్‌రావులు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. గతంలో కేసీఆర్ ఎప్పుడు కరీంనగర్ వచ్చినా.. రాత్రిపూట సమావేశాలు నిర్వహించలేదు. తొలిసారిగా జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులతో ముచ్చటించారు. వారితో భేటీ అనంతరం కేసీఆర్ ఇక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయం నుంచి తెలంగాణ భవన్ వద్ద హడావుడి మొదలైంది. కరీంనగర్‌లోని కేసీఆర్ బాల్యమిత్రులు, 2001లో ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి పార్టీలో పనిచేస్తోన్న నాయకులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఆయన నివాసానికి పోటెత్తారు. రాజకీయాలతో సంబంధం లేకుండా కేసీఆర్ ప్రతీ ఒక్కరిని పేరుపేరునా పలకరిస్తూ ఆలింగనాలు చేసుకున్నారు. 2001 పార్టీ స్థాపించినపుడు, 2006, 2008 ఉపఎన్నికలు, 2009 ఉద్యమసమయం నాటిరోజులను ఆయన నెమరువేసుకున్నారు. ఈసారి ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో పోలీసులు మునుపెన్నడూ లేనంత భారీగా భద్రత కల్పించారు. ఈ క్రమంలో కొందరు సీనియర్ నేతలకు సీఎంను కలిసే అవకాశం దక్కకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. భారీ కాన్వాయ్‌తో అలుగునూరుకు ఉదయం 10.45 గంటల ప్రాంతంలో తన నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో సీఎం అలుగునూరు బయల్దేరారు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్ కూతురు హరిలావణ్య–కిశోర్‌బాబుల వివాహానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి తప్పకుండా వస్తానని కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని స్థానిక నేతలు సంతోషం వ్యక్తంచేశారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్‌కుమార్, కే.విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీమంత్రులు కడియం శ్రీహరి, ఇనుగాల పెద్దిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ సునీల్‌రావు, సుడా చైర్మన్ జి.వి. రామక్రిష్ణారావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, ఫుడ్ కమిషన్ డైరెక్టర్ ఆనంద్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి కరీంనగర్‌కు వచ్చారు. కలెక్టరేట్లో జరిగిన దళితబంధు సమీక్షలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పథకం అమలు, నిర్వహణ విషయంలో పలు కీలకసూచనలు చేశారు. ఎటుచూసినా పోలీసులే..! నగరంలో సీఎం పర్యటనతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిఘా వర్గాల హెచ్చరికలతో నగరంలోని అలుగునూరు, కమాన్ చౌరస్తా, బస్టాండ్, గీతాభవన్ చౌరస్తా, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, రైల్వేస్టేషన్ పరిసరాల్లో అడగుడుగునా పోలీసులు మోహరించారు. సీఎం భద్రతావిభాగంతోపాటు, స్థానిక పోలీసులు, ఏఆర్ పోలీసులను విధుల్లో ఉంచారు. ముఖ్యంగా సీఎం నివాసమైన తీగలగుట్టపల్లిలో ఆయన నివాసం వరకు భారీగా ప్రత్యేక బలగాలు మోహరించారు. హెలిప్యాడ్ వద్ద సీఎం సెక్యూరిటీతోపాటు టీఎస్ఎస్పీ, డిజాస్టర్ రెస్పాన్స్‌ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది పహారా కాశారు. మధ్యాహ్నం దాదాపు 3.15 గంటలకు హెలిప్యాడ్‌కు చేరిన సీఎం కేసీఆర్ అక్కడ నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు. కలెక్టరేట్ వద్ద మూడంచెల తనిఖీ వ్యవస్థ సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్ ఖాకీల నీడన చేరింది. శుక్రవారం సీఎం కలెక్టరేట్లో దళితబంధుపై సమీక్షించగా ఉదయం నుంచే పోలీసులు మోహరించారు. ప్రతి సముదాయాన్ని ఆధీనంలోకి తీసుకోగా మూడంచెల తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఐజీ స్థాయిలో భద్రత ఏర్పాట్లను చేయగా సుమారు 200లకు పైగా పోలీసులు పహారా కాశారు. కలెక్టరేట్‌కు సంబంధించిన రెండు ద్వారాలను మూసివేయగా గుర్తింపు కార్డులున్న ఉద్యోగులను మాత్రమే లోనికి అనుమతించారు. ఉద్యోగి, అధికారి అయినా గుర్తింపు కార్డు లేకుంటే అనుమతించలేదు. అత్యంత పకడ్బందీగా రక్షణ ఏర్పాట్లు చేశారు. ఇక సీఎం నిర్వహించిన సమావేశమందిరానికి అధికారులను తప్పా ఎవరిని అనుమతించలేదు. కలెక్టర్ పోర్ట్‌కో, కలెక్టరేట్ ఇన్‌వార్డు, ఆర్డీవో కార్యాలయం వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరూ మీటింగ్ వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. మొత్తంగా ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలీసుల చెరలో కలెక్టరేట్ ఉండగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉన్నతాధికారులను కలువలేక నిరాశగా వెనుదిరిగారు. చదవండి: నేటి నుంచే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర -
చివరి రక్తపు బొట్టు వరకు దళితుల కోసం పోరాడతా: సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘మొన్నీ మధ్య టీవీలో చూసిన.. ఉత్తరభారతంలో ఓ దళిత యువకుడు పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కిం డని కొందరు అతన్ని కొట్టి చంపారు. ఎవడు పెట్టిండో, ఎప్పట్నుంచి పెట్టిండోగానీ ఈ దుర్మార్గమైన ఆచారం ఇంకా పోలేదు. సమాజంలో ఇప్పటికీ దళితులంటే చిన్నచూపే, అంటరానితనం పోయినా వివక్ష పోలేదు. ఆ వివక్షను రూపుమాపడమే మా ప్రభుత్వ లక్ష్యం. దళితుల జీవితాలు పూర్తిగా మారాలి. అందుకోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నామని, ఈ ఏడేండ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. కునారిల్లుతున్న కులవృత్తుల వారికోసం కోట్ల రూపాయలు వెచ్చించి ఆర్థికంగా నిలబెట్టుకున్నామని తెలిపారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో ‘దళితబంధు’ పథకంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. సమీక్షలో సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. అన్ని వర్గాలకు అండగా.. ‘‘తెలంగాణలో సాగునీటి రంగాన్ని పునరుజ్జీవనం చేసుకున్నాం. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసుకున్నాం. నిరంతరాయంగా కరెంటు ఇచ్చుకుంటున్నాం. ఒకనాడు కూలీ పనులకు పోయిన రాష్ట్రంలో ఇప్పుడు.. 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించుకుంటున్నాం. గొర్రెల పెంపకం, చేపల పెంపకం, చేనేతకు ఆసరా, ఎంబీసీలకు అండగా మా ప్రభుత్వం నిలబడింది. అన్ని రంగాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సహా అన్ని వర్గాలకు అండదండలు అందిస్తూ నేనున్నాననే ధీమాను ప్రభుత్వం అందిస్తోంది. నేను ఎప్పటినుంచో అనుకుంటున్న దళిత అభివృద్ధి కార్యాచరణకు ఇప్పుడు సమయం వచ్చింది. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలుపరుస్తున్న దళితబంధు కార్యక్రమాన్ని అందరి సహకారంతో తప్పకుండా విజయవంతం చేస్తాం. దేశానికే పాఠం నేర్పే విధంగా దళిత బంధును నిలబెడదాం చదవండి: 27 ఏళ్లుగా పనిచేస్తున్నా జీతం రూ.22 వేలే.. ఇది ఓట్ల కోసం కాదు.. సబాల్ట్రన్ స్టడీస్ సెంటర్ ఏర్పాటు చేసి దళితుల సామాజిక, ఆర్థిక స్థితిగతుల పట్ల అధ్యయనం చేశాం. ప్రపంచవ్యాప్తంగా 165 జాతులు ఆర్థిక, సామాజిక వివక్షకు గురవుతున్నయనే విషయాన్ని గుర్తించాం. భారతదేశ దళితుల పరిస్థితి కూడా ఆ 165 జాతుల మాదిరిగానే ఉందనే విషయం నిర్ధారణ అయింది. అందుకే దళితుల అభివృద్ధి కోసం పథకం తెస్తున్నాం. ఇది చిల్లర మల్లర ఓట్ల కోసం చేపట్టిన కార్యక్రమం కాదు, ఆదరాబాదరా అవసరం లేదు. ప్రతి దళిత కుటుంబాన్ని పేరు పేరునా అభివృద్ధిపరిచే దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రైతుబంధు ఆర్థిక సాయాన్ని ఎలాంటి పరిమితులు లేకుండా ఎలా అందిస్తున్నామో.. అదే పద్ధతిలో దళితబంధుకు కూడా పరిమితులు ఉండవు. దళితబస్తీల్లోని దరిద్రాన్ని బద్దలుకొట్టాలంటే ఉద్యోగస్తులకు కూడా దళితబంధు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ వర్గాల్లోని అన్ని ఉప కులాలకు దళిత బంధు వర్తిస్తుంది. హుజూరాబాద్ నుంచి ప్రారంభమయ్యే దళిత చైతన్య జ్యోతి తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి దేశానికే వెలుగులు పంచుతుంది. అణగారిన దళితవర్గాల్లో చైతన్యాన్ని తీసుకువస్తుంది. భిన్నమైన పనులు ఎంచుకోండి అందరూ ఒకే పని కాకుండా భిన్నమైన పనులను ఎంచుకోవడం ద్వారా ఆర్థికంగా మరింత లబ్ధి పొందవచ్చు. అధికారులు దళితబంధు పథకం ద్వారా అమలుపరుస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలున్న కరపత్రాన్ని వెంట తీసుకెళ్లి.. ఆయా వ్యాపార, ఉపాధి మార్గాలను లబ్ధిదారులకు వివరించాలి. లబ్ధిదారులు స్వయంగా వారి పనిని ఎంచుకునేందుకు సహకరించాలి. ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే ఫర్టిలైజర్, మెడికల్, వైన్స్ తదితర రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తాం. హాస్టళ్లు, హాస్పిటళ్లు, విద్యుత్ రంగ సంస్థలకు వివిధ మెటీరియల్ సరఫరా, సివిల్ సప్లయ్స్ రంగాల్లో కూడా దళితులకు అవకాశాలను మెరుగుపరుస్తాం. కాంట్రాక్టుల విషయంలోనూ కొంత రిజర్వేషన్ కోసం ఆలోచన చేస్తాం’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. చదవండి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..! హుజూరాబాద్‌లో డెయిరీ ఏర్పాటు చేయండి ఎస్సీ వెల్ఫేర్ మంత్రి, బీసీ వెల్ఫేర్ మంత్రి, కరీంనగర్ జిల్లా వారే కావడం, ఆర్థికమంత్రిది కూడా పక్క నియోజకవర్గమే కావడంతో.. హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టు విజయవంతానికి మార్గం మరింత సుగమమైందని సీఎం కేసీఆర్ అన్నారు. పాల ఉత్పత్తి రంగంలో కరీంనగర్ డెయిరీ విజయం గర్వకారణమని చెప్పారు. దళితబంధు పథకంలో భాగంగా ఔత్సాహికులు డెయిరీ ఫారాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. హుజూరాబాద్‌లో డెయిరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన కరీంనగర్ డెయిరీ నిర్వాహకులు.. ‘అవసరమైతే లక్ష లీటర్ల వరకు పాలను అదనంగా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు’ తెలిపారు. దీనిపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, మేయర్ సునీల్‌రావు, అధికారులు పాల్గొన్నారు. సీఎం ఎత్తుకున్న శిశువుకు కేటీఆర్ పేరు కలెక్టరేట్లో సమీక్ష అనంతరం రామగుడు ఎంపీపీ ఎలిగేటి కవిత–లక్ష్మణ్ దంపతులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. తమకు కుమారుడు జన్మించాడని, ఆశీర్వాదించాలని కోరారు. కేసీఆర్ ఆ చిన్నారిని ఎత్తుకుని ఆశీర్వదించారు. తర్వాత కవిత–లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. తమ కుమారుడికి కేటీఆర్ అని పేరు పెట్టుకుంటున్నామని తెలిపారు. ‘దళితబంధు’తో పునరుత్పాదకత రాష్ట్రంలో పరిశ్రమలకోసం ఇప్పటివరకు 2 లక్షల 20 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 15 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కాయి. అలాగే మేం 1.75 లక్షల కోట్ల రూపాయలను దళితులకు పెట్టుబడిగా పెట్టడం ద్వారా.. అది తిరిగి పునరుత్పాదకతను సాధిస్తుంది. లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిస్తుంది. రిజర్వేషన్లు పెంచుకుందాం రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. రాష్ట్ర జనాభాలో సుమారు 18 శాతం మేర.. అంటే సుమారు 75 లక్షల దళిత జనాభా ఉంది. వారి జనాభా పెరుగుతున్నది. దానికి తగ్గట్టు రాబోయే కాలంలో దళిత రిజర్వేషన్ల శాతం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఏం నర్సయ్యా.. హైదరాబాద్ రా.. మొగ్ధంపూర్ సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఆహ్వానం కరీంనగర్ రూరల్: కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా తీగలగుట్టపల్లిలోని తెలంగాణభవన్‌లో బస చేసిన సీఎం కేసీఆర్‌ను.. కరీంనగర్ మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా మొగ్ధుంపూర్ సర్పంచ్ జక్కం నర్సయ్యను కేసీఆర్ పలకరించారు. ‘పిల్లలు బాగున్నారా.. అంతా మంచిదేనా.. ఒకసారి హైదరాబాద్ రా..’ అని ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నర్సయ్య సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేశారు. ఇప్పుడు కేసీఆర్ ఇలా నర్సయ్యను ప్రత్యేకంగా పలకరించడం, హైదరాబాద్‌కు ఆహ్వానించడం అందరికీ ఆసక్తి కలిగించింది. చదవండి: అక్కడ తప్పించుకున్నాడు.. ఇక్కడ దొరికిపోయాడు -
కేసీఆర్.. మరో అంబేడ్కర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళితబంధు పథకం ప్రకటించడమే కాకుండా నిధులు విడుదల చేసి లబ్ధిదారులకు అందజేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దళితులకు మరో అంబేడ్కర్ అయ్యారని మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం దళితబంధు పథకం నిధులతో నలుగురు లబ్ధిదారుల కుటుంబాలకు మంత్రుల చేతుల మీదుగా వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ..అన్నమాట ప్రకారం దళితబంధు నిధులు రూ. 2000 కోట్లు మంజూరు చేసి దళితుల అభ్యున్నతిపై సీఎం కేసీఆర్ తన చిత్తశుద్ధిని చాటుకున్నారన్నారు. అణగారినవర్గాల సంక్షేమం, అభివృద్ధి మాటల్లోనే కాదని, లబ్ధిదారులకు వాహనాలు అందజేసి సీఎం కేసీఆర్ తన చేతల్లోనూ చాటుకున్నారని కొనియాడారు. అనంతరం గంగుల మాటాడుతూ..దళితబంధు ద్వారా వారి ఆర్థిక స్థితిగతులు మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలేరును.. యజమానినయ్యాను నేను వ్యవసాయ పాలేరుగా ఉండేవాడిని. నాకు ఇద్దరు బిడ్డలు, ఒక్క కొడుకు. దంపతులిద్దరం పనిచేస్తేనే పూటగడిచేది. దళితబంధులో ఇచ్చిన ఈ ట్రాక్టర్‌తో నా జీవితం బాగు చేసుకుంటా. పాలేరుగా ఉన్న నేను యజమానినైతనని జిందగీల ఎప్పుడు అనుకోలే. – దాసారపు స్వరూప–రాజయ్య, వీణవంక కేసీఆర్ మా దేవుడు.. మా ఆయన ఆటో డ్రైవర్. కేసీఆర్ మా జీవితాల్లో కొత్త వెలుగులు నింపి మాకు దేవుడు అయిండు. అధికారులిచ్చిన అశోక్ లేలాండ్ ట్రాలీతో మా బతుకులు బాగుపడతయి. – జి.సుగుణ–మొగలి, జమ్మికుంట అంబేడ్కర్ నగర్ సీఎం సర్ సల్లగుండాలె.. మాకు స్వరాజ్ ట్రాక్టర్ ఇచ్చిర్రు. నా కొడుకు రాజశేఖర్ మూడునాలుగేళ్లుగా డ్రైవర్‌గా చేస్తుం డు. గందుకే, మాకు ట్రాక్టర్ గావాలన్నం. ఇంకా ట్రాలర్, గడ్డి చుట్టే బేలర్ కూడా తీసుకుంటం. వ్యవసాయ పనులు, పొలంకోతలు, మట్టితరలింపులతో బిజీగా ఉండాలనుకుంటున్నం. – ఎలుకపెల్లి కొమురమ్మ, చల్లూరు, వీణవంక -
‘సీఎం కేసీఆర్ వాసాలమర్రికి వస్తే అడ్డుకుంటాం’
సాక్షి, యాదాద్రి జిల్లా: హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. తుర్కపల్లి మండలం రాంపూర్ తండా దళిత - గిరిజన దండోరా దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ వాసాలమర్రికి వస్తే అడ్డుకుంటామన్నారు. ఫాం హౌస్ రోడ్డు కోసమే వాసాలమర్రి దళితులకు కేసీఆర్ ఎర వేశారని ధ్వజమెత్తారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారంటూ కోమటిరెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఆలేరు నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవాలన్నారు. కేసీఆర్ కాళ్ల కింద ఉన్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని విడిపించాలన్నారు. దళిత బంధుతో పాటు గిరిజన బంధు కూడా ఇవ్వాలని కోమటి రెడ్డి డిమాండ్ చేశారు. ఇవీ చదవండి: గ్రామాభివృద్ధి కమిటీ అరాచకం.. 70 దళిత కుటుంబాల బహిష్కరణ హుజురాబాద్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు: హరీశ్ రావు -
దళిత బంధు పథకానికి మరో రూ.500 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళిత బంధు పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం గురువారం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు నేడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ విడుదల చేసింది. కాగా ఇటీవల దళితబంధు పథకం అమలుకు రూ. 2 వేల కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ శాలపల్లిలో దళితబంధు పథకం ప్రారంభోత్సవ సభా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ. 1,500 కోట్లు విడుదల చేయగా.. నేడు విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది. మొత్తం రూ. 2 వేల కోట్లతో నియోజకవర్గంలోని దళితులందరికీ ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నది. ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పూర్తిచేసుకుంది. చదవండి: Telangana: జీవో 111 పై హైకోర్టులో విచారణ -
దళితబంధుకు మరో రూ. 200 కోట్లు
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వం మరో రూ.200 కోట్లు మంగళవారం విడుదలచేసింది. మొత్తం మూడు దఫాలుగా ఇప్పటివరకు రూ.1,200 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గానికి దాదాపు రూ.2,000 కోట్లు అవసరమని ప్రభుత్వ అంచనా. -
స్మార్ట్‌కార్డులు సిద్ధం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు కార్యక్రమంలో కీలక అడుగుపడింది. పథకం అమలుకు దిక్సూచిలా భావిం చేస్మార్ట్కార్డులు సిద్ధమవుతున్నాయి. ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రత్యేకంగా స్మార్ట్‌కార్డులు అందజేస్తానని ఇప్పటికే ప్రకటించింది. వాస్తవానికి వీటిని ఈనెల 17వ తేదీన లబ్ధిదారులకు అందజేయాల్సి ఉన్నప్పటికీ, కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాలన్న యోచనతో ఆలస్యంగా జరిగింది. 24వ తేదీ వరకు గడు వు అనుకున్నా.. ఇంకా స్పష్టత రాకపోవడం తో 28వ తేదీ వరకు కార్డులను పంపిణీ చే యాలని లక్ష్యంగా పెట్టుకుంది. దళితబంధు అమలు కోసం ప్రత్యేక వెబ్సైట్, సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందు కోసం ప్రత్యేకమైన బయోమెట్రిక్ కార్డులు కూడా సిద్ధమవుతున్నాయి. ఇందులో సెల్‌ఫోన్ సిమ్ కార్డు తరహాలో ఉన్న ప్రత్యేకమైన చిప్‌లో దళితబంధు లబ్ధిదారుల సమాచారం ఉంటుంది. లబ్ధిదారునితోపాటు అతని భార్యాపిల్లలు, ఎంచుకున్న ఉపాధి/వ్యాపారం/యూనిట్ వివరాలు, వాటికి అయిన ఖర్చు, బ్యాంక్ బ్యాలెన్సు, రోజువారీ లావాదేవీలు, పొదు పు, నిర్వహణ, బీమా/నామినీ ఇలా మొత్తం అతను ఎంచుకున్న వ్యాపారానికి సంబంధించిన సమస్త సమాచారం పొందుపరిచి ఉం టుంది. ఒక్కమాటలో చెప్పాలంటే లబ్ధిదారులకు ఇది ఆధార్‌కార్డుతో సమానం. ఈ కార్డు ల ద్వారా ప్రతి లబ్ధిదారుని ఖాతాలో రూ.10 లక్షలు జమ అయిన దగ్గర నుంచి వాటిని ఖర్చు చేస్తున్న తీరు, బిల్లుల చెల్లింపు, లాభనష్టాలు అన్నింటినీ అధికారులు పర్యవేక్షిస్తారు. వారి వ్యాపారస్థితిని బట్టి అప్రమత్తం చేస్తుంటారు. ప్రత్యేక యాప్‌లో వివరాలు.. త్వరలోనే దళితబంధు యాప్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో లబ్ధిదారులకు కావాల్సిన సమాచారం. అధికారుల ఫోన్‌నెంబర్లు, వ్యాపారం వివరాలు, తోటి వ్యాపారుల పురోగతి, మార్కెట్ ట్రెండ్స్, వివిధ వ్యాపారాల సమాచారం తదితర కీలకమైన విషయాలు అందుబాటులో ఉంచుతారు. దీనికితోడుగా దళితబంధుకు ప్రత్యేక పోర్టల్ కూడా వేగంగా రూపుదిద్దుకుంటోంది. కాగా, దేశంలోనే ఇంతటి భారీ ఆర్థిక ప్యాకేజీతో రూపొందించిన పథకం కావడంతో దీని అధ్యయనానికి వివిధ పరిశోధక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ నుంచి పలువురు హుజూరాబాద్‌ను సందర్శించారు. పలు స్వచ్ఛంద సంస్థలు, పరిశోధక సంస్థలు కూడా ఈ పథకం అమలు అధ్యయనంపై ఆసక్తి చూపిస్తున్నాయి. -
హుజురాబాద్‌కు మరో రూ.500 కోట్ల నిధులు
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో దళితబంధు పథకం పైలెట్ ప్రాజెక్టు అమలుకు మరో రూ.500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలెట్ ప్రాజెక్టు అమలుకు రూ.2,000 కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా మొదటి విడతలో ఇప్పటికే రూ. 500 కోట్లను విడుదల చేయగా, తాజాగా విడుదల చేసిన రూ.500 కోట్లతో కలిపి మొత్తం రూ.1,000 కోట్లను పథకం కోసం అందుబాటులోకి తెచ్చారు. కాగా.. వారం రోజుల్లోపు మరో రూ.1,000 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. -
ప్రజలు ఏమంటున్రు?.. దళితబంధు అమలుపై సీఎం ఆరా
సాక్షి , కరీంనగర్: ‘దళితబంధు పథకం గొప్పది. దీని ఫలాలు లబ్ధిదారులకు అందాలి. హుజూరాబాద్‌లో మళ్లీ గులాబీ జెండా ఎగరాలి. ప్రచారంలో ఎక్కడా తగ్గకూడదు. మన గెలుపు ఖా యం, మెజార్టీపైనే దృష్టి సారించండి. త్వరలోనే హుజూరాబాద్‌లో కలుద్దాం..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతలకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం దళితబంధు అమలు, హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయాలపై ప్రజా స్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రగతిభవన్‌లో హుజూరా బాద్ ఉపఎన్నిక ఇన్చారీ్జలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మేయర్ సునీల్ రావు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళితబంధు అమలుకు మంచి స్పందన వస్తోందని ఇన్చార్జీలు సీఎంకు వివరించారు. దీనికితోడు నియోజకవర్గంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, టీఆర్ఎస్ పార్టీ ప్రచారం, ప్రత్యర్థులపై రాజకీయదాడి, రాజకీయ వ్యూహాలు, కదలికలు, వేస్తున్న అడుగులపై సీఎంకు రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది. చదవండి: క్వశ్చన్ పేపర్ లీకేజీ ఆధారాలు ధ్వంసం శాలపల్లి సభతో మారిన సీన్..! విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హుజూరాబాద్‌లో జరుగుతున్న రాజకీయ, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రస్తుతం జనం నాడిని సీఎంకు మంత్రులు వివరించారు. ఈనెల 16న హుజూరాబాద్‌లోని శాలపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో నియోజకవర్గానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు దళితబంధు చెక్కులు అందజేయడంతో అమలుపై అపోహలు తగ్గాయన్నారు. ఆ వెంటనే వారికి నైపుణ్య శిక్షణ ప్రారంభించడంతో ప్రజల్లో నమ్మకం పెరిగిందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పైగా దళితుల్లోని పేదలతోపాటు, ప్రభుత్వ ఉద్యోగులకు సైతం పథకం వర్తింపజేస్తానన్న హామీ జనాల్లోకి బాగా వెళ్లిందని వివరించారు. అందుకే.. గత శుక్ర, శని, ఆదివారాల్లో దళితబంధు అమలుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చెలరేగిన ఆందోనళలు సోమవారం నాటికి ఆగిపోయాయని, లబ్ధిదారుల్లో తగ్గిన అసంతృప్తికి సంకేతమని ఉదహరించారు. శాలపల్లి సభ తరువాత కార్యకర్తల్లో జోష్ పెరిగిందని, ప్రభుత్వ ఉద్యోగులకు పథకం అమలు చేస్తామన్న హామీని దళితుల్లోని అన్నివర్గాలు ఆహ్వానిస్తున్నాయని అన్నారు. గత సోమవారం సభలో రాష్ట్రంలో ఉన్న 17 లక్షల మంది దళిత ఉద్యోగులకు పథకం వర్తింపజేస్తానని సీఎం స్వయంగా ప్రకటించడం చాలా పథకంపై జనాల దృష్టిని ఒక్కసారిగా మార్చివేసిందని ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. -
సీఎం కేసీఆర్ దళిత బంధు పేరుతో నాటకం ఆడుతున్నారు..
సాక్షి, దహెగాం(ఆదిలాబాద్): ప్రజలను మోసం చేయడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని, హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే మరోసారి మోసం చేసేందుకు దళితబంధు పథకం తీసుకొచ్చారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరి హారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయ కులు పాల్వాయి హరీశ్‌బాబు ఆధ్వర్యంలో దహెగాంలో బుధవారం రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీకే అరుణ ముఖ్య అతిథిగా రాగా, ఎంపీ సోయం బాపూరావ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ భారీ వర్షాలతో పెద్దవాగు పరివాహక ప్రాంతాల్లో పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.30వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల బాధలను అర్థం చేసుకోవడం కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమా పథకంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.120 కోట్లు చెల్లిస్తే పంటలు దెబ్బతిన్న వారికి రూ.800 కోట్లు వచ్చేవని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌కు ఎన్నికలప్పుడే పథకాలు గుర్తుకొస్తాయని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ అనంతరం దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని, మూడెకరాల భూపంపిణీ చేస్తానని మభ్యపెట్టారని మండిపడ్డారు. ప్రస్తుతం దళితబంధు పేరుతో నాటకం ఆడుతున్నారని అన్నారు. బతుకులు బాగుపడతాయని ఆత్మబలిదానాలు చేసుకుని తెలంగాణ సాధిస్తే రూ.4లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు రైతులు తగిన బుద్ధిచెప్పాలని సూచించారు. పోడు జోలికి వస్తే ఖబడ్దార్: ఎంపీ సోయం పోడు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న ఆదివాసీ రైతుల జోలికి వస్తే ఖబడ్దార్ కేసీఆర్ అని ఎంపీ సోయం బాపూరావ్ హెచ్చరించారు. దగ్గరుండి పోడు సమస్య పరిష్కరిస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన కేసీఆర్ ఎంత మంది రైతుల సమస్యలు పరిష్కరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో పోడు రైతులపక్షాన పోరాడితే నాయకులు, రైతులపై కేసులు బనాయించి జైలుకు పంపిస్తారా అని ప్రశ్నించారు. పోడు కోసం కుమురం భీం తరహాలో పోరాటాలు చేయాల్సి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోనే టీఆర్ఎస్ను బీజేపీ గద్దెదించుతుందని పేర్కొన్నారు. ఈ ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడెల్, నియోజకవర్గ నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, పాల్వాయి హరీశ్‌బాబు, కొంగ సత్యనారాయణ, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పుల్గం నారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ, నాయకులు రాంటెంకి సురేష్, రాపర్తి ధనుంజయ్, షాకీర్, సురేష్, నాయకులు, రైతులు పాల్గొన్నారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. అంతకు ముందు డీకే అరుణతో పాటు నాయకులు ట్రాక్టర్‌పై వేదిక వద్దకు వచ్చారు. స్థానిక ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
దళిత బంధు అమలుపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: వాసాలమర్రిలో దళిత బంధు అమలుపై హైకోర్టులో విచారణకు వచ్చింది. నిబంధనలు ఖరారు చేయకుండానే నిధులు విడుదల చేశారని పిటిషన్లో కోర్టుకు తెలిపారు. దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు వర్తిస్తుందని ఏజీ పేర్కొంది. అయితే నిబంధనలకు సంబంధించిన జీవో వెబ్సైట్లో లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బందేంటని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జీవోలన్నీ 24 గంటల్లో వెబ్సైట్లో పెట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులే.. దళితబంధు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా చేసిందేమీ లేదని, ఏడేళ్లుగా ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లించి, ఇప్పుడు తెరపైకి దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్సీ తాటికొండ జీవన్‌రెడ్డి అన్నారు. 75 ఏళ్లుగా దేశాన్ని పాలించిన వారు ఈ ఆలోచన ఎందుకు చేయలేదన్న సీఎం కేసీఆర్ ప్రశ్నకు సమాధానంగా మంగళవారం కరీంనగర్‌లోని ఇందిరాభవన్‌లో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ టౌన్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో కలిసి జీవన్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో దళితులకు ఇచి్చన హామీలేవీ కేసీఆర్ నెరవేర్చలేదని, దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూపంపిణీ విషయంలో మాట తప్పారన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న టి.రాజయ్యను ఆకస్మికంగా తప్పించారని, కడియంను ఆ స్థానంలో కూర్చోబెట్టినా.. రెండోసారి అయనను కేబినెట్లోనే లేకుండా చేశారన్నారు. -
హుజూరాబాద్ ఎఫెక్ట్.. సీఎంఓలో ఎస్సీ సామాజిక వర్గ ఐఏఎస్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను ముఖ్యమంత్రి కార్యదర్శిగా బదిలీ చేస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశా రు. ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అద నపు బాధ్యతలను సైతం రాహుల్ బొజ్జాకు అప్ప గించారు. ప్రతిష్టాత్మక దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో సీఎంవోలో ఎస్సీ సామాజికవర్గ ఐఏఎస్ అధికారిని నియమించడం గమనార్హం. -
ఏడాదిలో ఆదాయం రెట్టింపవ్వాలి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అనుభవం, వృత్తి నైపుణ్యత ఆధారంగా ఏడాదిలోగా రెట్టింపు ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని దళితబంధు లబ్ధిదారులకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. హుజూరాబాద్‌లో దళితబంధు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా ఆర్థిక సాయం పొందిన 15 మంది లబ్ధిదారులకు మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో కర్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు కింద యూనిట్ల ఎంపికకు తొందరపడొద్దని, వారంపాటు సమయం ఇస్తామని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు కొత్తగా దళితబంధు ఖాతాలు తెరవాలని సూచించారు. యూనిట్ స్థాపించుకునేందుకు కుటుంబ సభ్యులతో చర్చించి ఎంపిక చేసుకోవాలన్నారు. యూనిట్ల ఎంపికపై జిల్లా అధికారులతో పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ల నిర్వాహణకు 10–15 రోజులు పూర్తి స్థాయిలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఉచితంగా వృత్తి నైపుణ్యత శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. అవగాహన సమావేశానికి హాజరైన 15 మంది లబ్ధిదారుల్లో కొందరు పాడి గేదెలు (డెయిరీ యూనిట్లు), గూడ్స్ ట్రెయిలర్, ట్రాక్టర్ ట్రెయిలర్, కారు, సూపర్ బజార్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, లేడీస్ ఎంపోరియం యూనిట్ ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. వాహనాలు ఎంపిక చేసుకున్న వారికి బుధవారం లెర్నింగ్ లైసెన్సు జారీ చేయాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమాధికారి నేతనియల్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా.నరేందర్, ఎల్డీఎం లక్ష్మణ్, ఆర్సెటీ మేనేజర్ దత్తాత్రేయ, నాబార్డు ఏజీఎం అనంత్ పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులను కరీంనగర్‌లోని విజయపాల డెయిరీకి తీసుకెళ్లారు. పాల శీతలీకరణ, పెరుగు, నెయ్యి తయారీ, మజ్జిగ, బట్టర్ మిల్క్, బాదాం మిల్క్ తయారీలు, దాణా, గడ్డి పెంపకం, శిలీంద్ర మొక్కలు పెంపకం, గడ్డి కత్తిరించే యంత్రాలు ఆవుల షెడ్ వాటి నిర్వహణ తదితర విషయాలపై అవగాహన కల్పించారు. -
కరీంనగర్ జిల్లా నాకు ప్రత్యేక సెంటిమెంటు: సీఎం కేసీఆర్
సాక్షి, కరీంనగర్: తెలంగాణ సాధనలో తొలి సింహగర్జన నుంచి నేటి వరకూ కరీంనగర్ జిల్లా తెలంగాణ ప్రజలకు విజయం చేకూరుస్తున్న వేదికగా మారిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ మండలంలోని శాలపల్లిలో జరిగిన భారీ బహిరంగసభలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు కరీంనగర్‌తో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని, సెంటిమెంటును, ఆత్మీయతను నెమరువేసుకున్నారు. 2018 మే 10వ తేదీన ఇదే వేదికగా తాను రైతుబంధు పథకాన్ని ప్రారంభించానని గుర్తుచేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రానికి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. అదే మాదిరి దళితబంధు పథకంతో దళితులకు ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుబంధు పథకంతో తెలంగాణ రైతుల్లో ధీమా పెరిగిందని, కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించిన రైతుబీమా పథకం విజయవంతంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినప్పుడు తమను కొందరు ఎద్దేవా చేశారని, కానీ.. నేడు రాష్ట్రంలో ధాన్యంరాశులు పొంగిపొర్లుతున్నాయన్నారు. 3.40 కోట్ల టన్నుల దిగుబడితో ఎఫ్‌సీఐ గోదాములు నిండిపోతున్నాయని, హమాలీలు ధాన్యాన్ని మోయలేకపోతున్నారని వివరించారు. రాష్ట్రమంతా హుజూరాబాద్ వైపే.. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఈ దళితబంధును హుజూరాబాద్‌లోని 21,000 కుటుంబాలకు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ పథకం విజయవంతం చేయడం మీపైనే ఉందని హుజూరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపడుతున్న ఈ పథకం అమలుపై రాష్ట్రమంతా ఆసక్తిగా గమనిస్తోందన్నారు. అందుకే.. ఇక్కడి దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలన్నారు. పథకం ప్రారంభం అనగానే, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ శాలపల్లికి వచ్చారని తెలిపారు. అంతకుముందు మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వాగత ఉపన్యాసం చేశారు. పథకం అమలు చారిత్రక అవసరం అన్నారు. మంచి పథకం ప్రారంభం అవుతున్న వేళ ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. అనంతరం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. ఈ పథకం దేశానికే ఆదర్శమన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన దళితుల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన ఈ పథకానికి అధికారులపరంగా 100 శాతం తమ సహకారం ఉంటుందన్నారు. అదే విధంగా లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి కటింగ్ల పేచీ లేకుండా కొత్త ఖాతాలు ఇవ్వాలని కోరారు. బందోబస్తు.. విజయవంతం.. సీఎం సభకు పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ జితేందర్ (లా అండ్ ఆర్డర్) బందోబస్తును పర్యవేక్షించారు. నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో రక్షణ ఏర్పాట్లు చేశారు. వీఐపీల రాకపోకలు, వేదిక బాధ్యతలను ఖమ్మం సీపీ విష్ణువారియర్ పర్యవేక్షించారు. హెలిప్యాడ్ బాధ్యతలను సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే చూసుకున్నారు. అదే విధంగా సభకు వచ్చే వీఐపీలు, ట్రాఫిక్, సీఎం వ్యక్తిగత భద్రత సిబ్బందితో సీపీ సత్యనారాయణ నిరంతరం సమన్వయం చేసుకున్నారు. సభావేదిక వద్ద ఫీల్డ్అసిస్టెంట్లు, వీఆర్వోలు, ప్రతిపక్ష నాయకులు కొందరు ఆందోళన చేస్తారన్న నిఘా వర్గాల సమాచారంతో ప్రతీ ఒక్కరిని క్షుణ్నంగా తనిఖీలు చేసి లోపలికి అనుమతించారు. ముఖ్యంగా సీఎం భద్రతా సిబ్బంది ఫేస్ రికగ్నైజేషన్, డ్రోన్ కెమెరాలతో సభా ప్రాంగణాన్ని డేగ కళ్లతో పర్యవేక్షించారు. లక్షకుపైగా హాజరైన జనాలు.. శాలపల్లి సభా ప్రాంగణానికి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి దాదాపుగా 60 వేల మంది వరకు రాగా, రాష్ట్ర నలుమూలల నుంచీ భారీగా హాజరయ్యారు. 825 ప్రత్యేక బస్సుల్లో నిర్దేశించిన ప్రకారంగా.. దళితబంధువులను అధికారులు సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. సభ ప్రారంభమయ్యే ముందు, ముగిసిన అనంతరం సుమారు మూడు గంటలపాటు దాదాపు ఆరు కి.మీ.ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సభ ప్రారంభయ్యే ముందు, తిరుగు ప్రయాణంలో సీఎం హెలికాప్టర్ సభా వేదిక చుట్టూ పలుమార్లు చక్కర్లు కొట్టింది. దారులన్నీ శాలపల్లి వైపే.. హుజూరాబాద్/హుజూరాబాద్‌రూరల్/ఇల్లందకుంట/వీణవంక:శాలపల్లి గ్రామం మరోసారి చరిత్రకు వేదికగా మారింది. 2018 మే 10న రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించగా.. మళ్లీ ఇదే వేదికపై ‘దళితబంధు’కు శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్దమొత్తంలో దళితులు శాలపల్లికి కదలివచ్చారు. ఊరూవాడ నుంచి ప్రజలు తరలిరావడంతో హుజూరాబాద్‌లో సందడి నెలకొంది. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం గులాబీమయంగా మారింది.హుజూ రాబాద్, జమ్మికుంట పట్టణాల్లో భారీ హోర్డింగులు, ఫెక్ల్సీలు, తోరణాలతో ఆకట్టుకున్నాయి. కరుణించిన వరుణుడు జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం వేకువజామున వరకు భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో సభ నిర్వహణపై ఆందోళన నెలకొంది. ఉదయం నుంచి వాతావరణం చల్లబడినా.. వర్షం కురవకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు సమీక్షించారు. సభ కొనసాగినంతసేపు వాతావరణం అనుకూలించడంతో అధికారులు, మంత్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
Dalit Bandhu: రాధమ్మ మీ ఇంటికొచ్చి చాయ్ తాగుతా..
రాజే తలచుకుంటే దెబ్బలకు కొదువా..? ప్రభుత్వమే తలచుకుంటే పథకం ఇవ్వలేదా? పథకం కేవలం 15 మందికేనా అని కొందరు ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో ఉన్న 21,000 దళిత కుటుంబాలకు రెండు నెలల్లో పథకం అమలు చేస్తాం. నియోజకవర్గానికి ఇచ్చిన రూ. 500 కోట్లకు అదనంగా 15 రోజుల్లో మరో రూ. 2,000 కోట్లు మంజూరు చేస్తాం. రూ. 1.75 లక్షల కోట్లు.. నాయకుడికి చేసే పనిమీద వాక్శుద్ధి, చిత్తశుద్ధి, అవగాహన ఉంటే పనులు అవే సాగుతాయి. దళితబంధు పథకాన్ని ముమ్మాటికీ 100 శాతం విజయవంతం చేసి తీరుతాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. వీరందరి కోసం రూ.1.75 లక్షల కోట్లను మూడు, నాలుగేళ్లలో ఖర్చు చేస్తాం. అయితే నిరుపేదలకు ముందు ఇస్తాం, తర్వాత మిగతా కుటుంబాలకు ఇస్తాం. ఇప్పటికీ పేదరికంలోనే.. రిజర్వేషన్ల వల్ల విద్య, ఉపాధి రం గాల్లో దళితులకు కొన్ని అవకాశాలు చిక్కాయి. అయినా 95% మంది ఇప్పటికీ పేదరికంలోనే ఉన్నారు. అందుకే ఆఖరి దశలో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ‘దళితబంధు’అందజేయాలని అనుకుంటున్నాం. దీని లబ్ధిదారులకు ఇతర పథకాలేవీ రద్దు కావు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘రాష్ట్రంలో దళితుల సామాజిక ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు.. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకే ‘దళితబంధు’పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. దళితవాడలు బంగారు మేడలవ్వాలి.. దళిత జాతి రత్నాలను, దళిత శక్తిని బయటికి తీయాలన్నది మా సంకల్పం..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పేదరికం, ఆకలి, వివక్ష, అవమానాలతో వెనుకబడిన దళిత సమాజం అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి వేదికగా సీఎం కేసీఆర్ సోమవారం దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సభా వేదికపై అంబేడ్కర్, జగ్జీవన్రామ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి మాట్లాడారు. చివరిలో జైభీమ్, జై దళితబంధు అంటూ ముగించా రు. ఈ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా.. ‘‘సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ‘దళితబంధు’పథకానికి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఎనిమిదేళ్ల నాటి సర్వే కావడంతో ఇప్పుడు అదనంగా రెండుమూడు వేల మంది లబ్ధిదారులు పెరిగినా నష్టమేమీ లేదు. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ అమలు చేసి తీరుతాం. హుజూరాబాద్ ఒక ప్రయోగశాల. గతంలో ఇక్కడే రైతు బంధును ప్రారంభించాం. ఇప్పుడు అదే సెంటిమెంటుతో దళిత బంధును ప్రారంభిస్తున్నాం. దీనిని నూటికి నూరుపాళ్లు విజయవంతం చేసితీరుతాం. ఈ పథకాన్ని ప్రకటించాక కొందరు చిల్లరమల్లర విమర్శలు చేశారు. నేను స్పందించలేదు. స్పందించి మొత్తం వివరాలు చెప్పి ఉంటే.. ఆనాడే ఆ నాయకుల గుండెలు ఆగి మరణించేవారు. అలాంటి వారిని చూసి ఆగం కావొద్దు. సోమవారం హుజూరాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, దళితబంధు లబ్ధిదారులు 25 ఏళ్లనాటి ఆలోచన.. ఈ పథకం ద్వారా దళిత వాడలను బంగారు మేడలు చేయడమే మా లక్ష్యం. వాస్తవానికి దళితబంధు ఆలోచన ఈనాటిది కాదు. 25ఏళ్ల క్రితం నేను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే సిద్దిపేటలో దళిత చైతన్య జ్యోతి పేరిట వారి అభ్యున్నతికి పాటుపడ్డాం. గత ఏడాదే ఈ పథకం ప్రారంభించాల్సి ఉంది. కరోనా కారణంగా ఏడాది వాయిదా పడింది. దళితబంధు పథకం నిధులతో మీకు నచ్చిన, వచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు. వాహనాలు, సూపర్ మార్కెట్లు, హార్వెస్టర్లు, బార్లు, వైన్‌షాపులు, ఎలక్ట్రిక్ వ్యాపారాలు ఏది చేసినా.. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు మీకు మార్కెటింగ్ కల్పిస్తాయి. ఈ మేరకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తాం. పొరపాటున లబ్ధిదారులు మరణిస్తే వారి కుటుంబం ఆపదకు లోనుకాకుండా దళిత రక్షణనిధి నుంచి సాయం అందిస్తాం. కొత్తగా ‘దళిత బంధు’ఖాతాలు దళితబంధు పథకం కింద ఇచ్చే సొమ్ముకు బ్యాంకుల నుంచి కిస్తీల బాధ ఉండదు. మీ డబ్బుకు మీరే యజమానులు. బ్యాంకు వారు పాత బకాయిలు కట్ చేసుకోకుండా కొత్తగా దళితబంధు పేరుతో ఖాతాలు తెరిపించే బాధ్యతలను జిల్లా కలెక్టర్లు తీసుకుంటారు. దళితబంధు పథకం కాదు.. ఇదొక మహా ఉద్యమం. దేశమంతా ఈ ఉద్యమం పాకాలి. అందుకు హుజూరాబాద్ పునాది రాయి కావాలి. పథకం అమలుకోసమే కర్ణన్‌ను కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా నియమించాం. దళిత జాతి అభ్యున్నతికి, ఉద్యమకారులకు అండగా నిలిచిన బొజ్జా తారకం కుమారుడు ఐఏఎస్ అ«ధికారి, ఎస్సీ వెల్ఫేర్ సెక్రెటరీ రాహుల్ బొజ్జాను సీఎంవో సెక్రటరీగా ప్రకటించాం. సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గం శాలపల్లిలో దళితబంధు ప్రారంభోత్సవ సభకు హాజరైన ప్రజలు విద్యార్థులు గ్రామాలకు వెళ్లాలి దళితబంధు పథకం విజయవంతం అయ్యేలా దళిత మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు చైతన్యం కల్పించాలి. ముఖ్యంగా విద్యార్థులు ప్రతీ గ్రామానికి వెళ్లి ‘గో టు విలేజేస్ అండ్ ఎడ్యుకేటెడ్ అవర్ మాసెస్’అన్న నినాదంతో కార్యక్రమాన్ని చేపట్టాలి. ఎక్కడా లేని స్థాయిలో సంక్షేమ పథకాలు కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతులకు రూ.లక్ష కోట్లకుపైగా, యాదవులకు రూ.11 వేల కోట్లకుపైగా కేటాయించాం. మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వృద్ధాప్య పింఛన్లు తదితర విజయవంతమైన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు..’’ మీ ఇంటికొచ్చి చాయ్ తాగుతా.. సభలో ప్రసంగం అనంతరం సీఎం కేసీఆర్ 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. తొలి చెక్కును రాధమ్మ అనే మహిళకు ఇచ్చారు. ఈ డబ్బుతో ఏం చేస్తావని కేసీఆర్ ఆమెను అడగ్గా.. తనకు డెయిరీ అంటే ఆసక్తి ఉందని రాధమ్మ చెప్పింది. దీనిపై స్పందించిన సీఎం.. ‘‘అయితే.. మళ్లీ వచ్చినప్పుడు మీ ఇంట్లో చాయ్ తాగుతా’ అని పేర్కొన్నారు. జంబో వేదిక.. శాలపల్లి సభలో విశాల వేదికను ఏర్పాటు చేశారు. కీలక మంత్రులు, ఎమ్మెల్యేలంతా వేదికపై ఆసీనులు కావడం గమనార్హం. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు కె.కేశవరావు, లక్ష్మీకాంతరావు, సురేశ్‌రెడ్డి, మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, చల్లా ధర్మారెడ్డి, సుంకె రవిశంకర్, దానం నాగేందర్, తాటికొండ రాజయ్య, శంకర్‌నాయక్, రసమయి బాలకిషన్, బాల్క సుమన్, రేఖానాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చెన్నమనేని రమేశ్‌బాబు, ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, కోరుకంటి చందర్, సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, తాజా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి వేదికపై కూర్చున్నారు. గోప్యంగా లబ్ధిదారుల తరలింపు – చివరి నిమిషం దాకా బయటపెట్టని వైనం – వేదిక వెనుక నుంచి తీసుకువచ్చిన అధికారులు సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హుజూరాబాద్: సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ‘దళితబంధు’ పథకాన్ని అందుకునే లబ్ధిదారుల పేర్లను అధికారులు చివరివరకు గోప్యంగా ఉంచారు. వారికి ఆదివారం రాత్రే సమాచారం ఇచ్చారు. సోమవారం ఉదయమే వెళ్లి లబ్ధిదారులను, వారి కుటంబసభ్యులను ప్రత్యేక వాహనాల్లో సభ వద్దకు తీసుకువచ్చారు. సభ వద్ద కూడా వారు ఎవరికంటా పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. వెనుకవైపు వీఐపీ మార్గం ద్వారా వేదికపైకి పంపించారు. సభ వద్ద ఆయా లబ్ధిదారులు ‘సాక్షి’ ప్రతినిధులతో మాట్లాడారు. డెయిరీ పెట్టుకుంటా.. మేం కూలి పనిచేసుకొని బతుకున్నాం. ఈ 10 లక్షలతో పాడి పశువులు కొని డెయిరీ పెట్టాలనుకుంటున్నాం. సాయం రావడం కలలో కూడా ఊహించలేదు. కేసీఆర్ సార్.. మా బతుకుల్లో వెలుగులు నింపిండు. -కొత్తూరిరాధ–మొగిలి, కనుకులగిద్ద, హుజూరాబాద్, తొలి లబ్ధిదారు ట్రాక్టర్ తీసుకుంటం అధికారులు వచ్చేంత వరకూ నా పేరు ఎంపికయిందని తెలియదు. ఆర్థిక సాయంతో ట్రాక్టర్ కొనుక్కోవాలని అనుకుంటున్నా. నా కుమారుడికి ట్రాక్టర్ అప్పజెబుతా. మాకున్న ఎకరం భూమికి మరింత భూమి కౌలు తీసుకుని, దున్నుకోవాలని ఆలోచిస్తున్నం. -రవీందర్, కన్నూరు, కమలాపూర్ భూమి కొనుక్కుంటా.. మాకు భూమి లేదు. మేమిద్దరం కూలీలమే. ప్రభుత్వం అందించిన రూ.10 లక్షలతో 20 గుంటల భూమి కొనుక్కుంటాం. సీఎం చేసిన ఈ సాయాన్ని ఎన్నటికీ మరువలేం. మాకు వస్తదనుకోలే.. - రాధిక, శనిగరం, కమలాపూర్ మండలం అధికారులు సూచించినట్టు చేస్తా.. నేను దినసరి కూలీని. దళిత బంధు సాయానికి ఎంపికైనట్టు ఉదయం దాకా తెలియదు. ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. అధికారులు ఎట్ల చెప్తే అట్ల చేసుకుంటా. -బాజాల సంధ్య, హుజూరాబాద్ మండలం సీఎం చేతుల మీదుగా చెక్కులు అందుకున్నది వీరే.. 1. కొత్తూరి రాధ–మొగిలి, హుజూరాబాద్ రూరల్ 2. రొంటల రజిత– సరిత, హుజూరాబాద్ అర్బన్ 3. కొత్తూరి స్రవంతి – కనకం 4. శనిగరపు సరోజన – రవీందర్ 5. చెరువు ఎల్లమ్మ – రాజయ్య, జమ్మికుంట మండలం నగరం గ్రామం 6. రాచపల్లి శంకర్– మౌనిక, జమ్మికుంట టౌన్ 7. పిల్లి సుగుణ– మొగిలి, జమ్మికుంట రూరల్ 8. సంధ్య బాజాల– గంగయ్య 9. కడెం రాజు– వినోద, ఇల్లందకుంట 10. కసరపు స్వరూప– రాజయ్య, వీణవంక 11. ఎలుకుపల్లి కొమురమ్మ– రాజయ్య, చల్లూరు 12. కనకం రవీందర్– హరిత, కమలాపూర్ 13. నామపెల్లి రాజేందర్ 14. మాట్ల సుభాష్– మనెమ్మ 15. రాజేందర్, కమలాపూర్ -
కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే...
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక తెరపైకి వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ కొంగ జపం చేస్తున్నారని, ఒక్క అసెంబ్లీ స్థానం గెలవడానికి ఆయన దిగజారి వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్, మల్కాజ్గిరి ఎంపీ ఎ. రేవంత్‌రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్ దళితబంధు సభలో సీఎం అన్నీ అబద్ధాలు చెప్పారని, ఆయన మాటల్లో పిరికితనం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అబద్ధాల పునాదులపై బీటలు వారుతున్న గులాబీ కోటను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బెల్లయ్య నాయక్, సిరిసిల్ల రాజయ్య, అనిల్‌కుమార్ యాదవ్, మెట్టు సాయికుమార్, నర్సారెడ్డి తదితరులతో కలసి రేవంత్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో దళితులను పాచికలా వాడుకున్న కేసీఆర్... ఏడున్నరేళ్లలో ఎప్పుడూ అంబేడ్కర్, జగజ్జీవన్‌రాంల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించలేదని విమర్శించారు. నెక్లెస్ రోడ్డులో అంబేడ్కర్ భారీ విగ్రహం పెడతానని చెప్పి ఇప్పటివరకు తట్టెడు మట్టి కూడా తీయలేదని దుయ్యబట్టారు. దళితులకు మూడెకరాల చొప్పున భూపంపిణీ, దళిత విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిలిపివేత, 4 వేల సింగిల్ టీచర్ స్కూళ్ల మూసివేత, 9.50 లక్షల మంది దళితుల ఉపాధి దరఖాస్తుల తిరస్కృతి, ఇసుక మాఫియాను అడ్డుకున్న దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగం, దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ వంటి ఉదంతాలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వ ‘ఘనత’లేనని చురకలంటించారు. దళితులకు అన్యాయం చేసిన వారిలో మొదటి ముద్దాయి కేసీఆరేనని రేవంత్ ఆక్షేపించారు. ఒక్క శాసనసభ ఎన్నికలో గెలవడం కోసం కేసీఆర్ తన భార్య శోభను కూడా రాజకీయాల్లోకి తెచ్చారని, ఆయన పాపాలను కడుక్కోవడానికి శోభమ్మను ముందుకు తెస్తున్నారని దుయ్యబట్టారు. 6 నెలల్లోగా ఇస్తారా? రాష్ట్రంలోని 30 లక్షల కుటుంబాలకు దళితబంధు కింద రూ. 10 లక్షలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వాలని, ఇందుకోసం శాసనసభను సమావేశపరిచి ఒక రోజంతా చర్చ చేసి తీర్మానం చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. దళిత కుటుంబాలకు ఆరు నెలల్లోపు రూ. 10 లక్షలు ఇస్తామంటే కాంగ్రెస్ పక్షాన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతామన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో వచ్చే తుపానుకు కేసీఆర్ కొట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. దళితులను మోసం చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు మోగిస్తామని, రావిర్యాల సభ తర్వాత హుజూరాబాద్‌పై దండెత్తుతామని రేవంత్ చెప్పారు. -
దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది: కేసీఆర్
-
దళిత బంధు: 15 మందికి చెక్కులు అందజేత
సాక్షి, కరీంనగర్ జిల్లా: ప్రతిష్టాత్మక తెలంగాణ దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించారు. శాలపల్లి బహిరంగసభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. అనంతరం దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులతో పాటు దళితబంధు ఎలక్ట్రానిక్ కార్డులను సీఎం అందజేశారు. దీనిలో భాగంగా ముందుగా కేసీఆర్ తన ప్రసంగాన్ని జై భీమ్ అంటూ మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దళితబంధు పథకంతో దళితులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుబంధు పథకంతో వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు వస్తాయన్నారు. రైతుబంధు పథకంతో తెలంగాణ రైతుల్లో ధీమా పెరిగిందని, రైతు బీమా పథకం కూడా విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. తెలంగాణ సాధనలో తొలి నుంచి కరీంనగర్ జిల్లా ముందుందన్న కేసీఆర్ దళితబంధు ప్రభుత్వ కార్యక్రమం కాదని ఇది మహా ఉద్యమమని వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వల్ల దళితబంధు ఆలస్యమైందని, దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. తెలంగాణ సాకారమైనట్లే దళితుల అభివృద్ధి కూడా జరగాలని కోరారు. -
దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది: కేసీఆర్
సాక్షి, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ప్రారంభమైంది. శాలపల్లిలో దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. శాలపల్లిలోని దళిత బంధు ప్రారంభోత్సవ సభకు చేరుకున్న సీఎం కేసీఆర్.. జై భీమ్ అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దళితబంధు పథకంతో దళితులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుల్లో ధీమా పెరిగింది రైతుబంధు పథకంతో వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు వస్తాయన్నారు. రైతుబంధు పథకంతో తెలంగాణ రైతుల్లో ధీమా పెరిగిందని, రైతు బీమా పథకం కూడా విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. తెలంగాణ సాధనలో తొలి నుంచి కరీంనగర్ జిల్లా ముందుందన్న కేసీఆర్ దళితబంధు ప్రభుత్వ కార్యక్రమం కాదని ఇది మహా ఉద్యమమని వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వల్ల దళితబంధు ఆలస్యమైందని, దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. తెలంగాణ సాకారమైనట్లే దళితుల అభివృద్ధి కూడా జరగాలని కోరారు. 21 వేల దళిత కుటుంబాలు ఇంకా మాట్లాడుతూ.. ‘దళితబంధుకు మొత్తం 22 వేల కోట్లు ఇస్తాం. నేను హుజురాబాద్‌లో స్వయంగా తిరిగి దళితబంధు అమలును పరిశీలిస్తా. దళిత బంధుకు కిస్తీలు కట్టే కిరికిరి అవసరం లేదు. దళితులు కూడా దనవంతులుగా మారి చూపించాలి. హుజురాబాద్‌లో 21 వేల దళిత కుటుంబాలు ఉన్నట్లుసమగ్ర సర్వేలో తేలింది. ఏ పథకం ప్రారంభించినా విపక్షాలకు అనమానులు, అపోహలే. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న దళిత కుటుంబానికి కూడా దళిత బంధు వస్తుంది. రాబోయే 15 రోజుల్లో మరో రూ.2వేల కోట్లు విడుదల చేస్తాం: నూటికి నూరుశాతం అమలు దళితబంధు వచ్చినా రేషన్, పెన్షన్లు కొనసాగుతోంది. వచ్చే నెల, రెండు నెలల్లో అందరికి దళితబంధు వస్తుంది. ప్రభుత్వ పథకాల్లో, కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్లు ఇస్తాం. నూటికి నూరుశాతం దళితబంధు అమలు చేస్తాం. దళితబంధును విజయవంతం చేసే బాధ్యత విద్యార్థులపై ఉంది. ఎస్సీల్లో పేదలకు ముందుగా దళితబంధు వర్తిస్తుంది.’ అని పేర్కొన్నారు. అనంతరం 15 మంది లబ్ధిదారులకు రూ. 10 లక్షల చొప్పున చెక్కులు అందించారు. -
జర్మన్ హంగర్ టెక్నాలజీతో కేసీఆర్ సభ.. ఎందుకంటే?
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితబంధు పథకం ప్రారంభోత్సవానికి హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి సభా ప్రాంగణం ముస్తాబైంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2018 మేలో ఇదే ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని సైతం ఇదే శాలపల్లి వేదికగా ప్రారంభించడం గమనార్హం. ఇప్పటివరకూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాల కంటే ఈ పథకం ఆది నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే.. సభను అనుకున్నదాని కంటే ఎక్కువరెట్లు విజయవంతం చేసేలా సర్వం సిద్ధం చేశారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శాలపల్లికి చేరుకుంటారు. అక్కడి నుంచి సభాస్థలికి వస్తారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే సభ మొదలవుతుంది. సభా ఏర్పాట్లను ఆదివారం మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సభకు నియోజకవర్గంతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు లక్షా ఇరవై వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకుగాను అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. జర్మన్ హంగర్ టెక్నాలజీతో సభ.. జర్మన్ హంగర్ టెక్నాలజీతో సభ ఏర్పాట్ల పూర్తి చేశారు. ఎంత భారీవర్షం పడినా, గాలులు వీచినా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినా ప్రమాదం జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. 15 మంది ఎంపిక ఇలా జరిగింది..! నియోజకవర్గం నుంచి ఎంపికైన 15 మంది దళిత కుటుంబాల ఎంపికపై సంఖ్యాపరమైన సమాచారాన్ని అధికారులు అందజేశారు. అందులో జమ్మికుంట మండలం గ్రామీణ ప్రాంతం నుంచి ఇద్దరు, టౌన్ నుంచి ఇద్దరు, హుజూరాబాద్ మండలం టౌన్ నుంచి ఇద్దరు, రూరల్ నుంచి ఇద్దరు, వీణవంక మండలం నుంచి ఇద్దరు, ఇల్లందకుంట నుంచి ఇద్దరు, కమలాపూర్ నుంచి ముగ్గురు లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరంతా కుటంబ సభ్యులతో కలిసి వస్తున్నారు. అధికారులు వీరి వివరాలు వెల్లడించకపోయినా.. ఈ కుటుంబాలను సభాస్థలికి రప్పించేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లు చేశారు. వీరికి సభాప్రాంగణంపై కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. 200 మంది కూర్చుండేలా పెద్ద డయాస్ ఈ సభలో 200 మంది కూర్చుండేలా పెద్ద డయాస్ ఏర్పాటు చేశారు. ప్రధాన డయాస్ పక్కనే మరో డయాస్ కళాకారుల కోసం ఏర్పాటు చేశారు. ప్రధాన డయాస్‌లో వెనుక కూర్చున్న వారు కనిపించేలా నిర్మాణం చేశారు. ఈ సభలో మొత్తంగా 10 బ్లాకులు ఏర్పాట్లు చేశారు. 5 బ్లాకుల్లో మహిళలు, మరో 5 బ్లాకుల్లో పురుషులు కూర్చుండేలా కుర్చీలను సమకూర్చారు. లక్షా 20 వేల మంది హాజరయ్యే అవకాశం.. దళితబంధు సభకు లక్షా 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకు గాను అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 825 బస్సుల్లో దళితబంధువులు హాజరవుతారని సమాచారం. బస్సులు సభా వేదికకు దాదాపు 500 మీటర్ల దూరంలో నిలుపుతారు. అక్కడ వారు దిగిన తర్వాత సభా వేదికకు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 25 ఎకరాల స్థలంలో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. గులాబీమయంగా హుజూరాబాద్ ప్రతిష్టాత్మకమైన దళితబంధు పథకం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి శాలపల్లి వరకు టీఆర్ఎస్ శ్రేణులు గులాబీ తోరణాలను కట్టారు. వరంగల్–కరీంనగర్ రహదారి, జమ్మికుంట రోడ్ రహదారి గులాబీమయంగా మారింది. సభా వేదికకు సమీపంలో సీఎం కేసీఆర్ భారీ కటౌట్లను ఏర్పాటుచేశారు. 20 మంది ఐపీఎస్.. 4,600 మందికిపైగా పోలీసులు దళితబంధు సభా సజావుగా సాగేందుకు 4,600 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. దళితబంధు ఎంపికపై ఇప్పటికే పలుచోట్ల ప్రజలు, పార్టీలు వరుసగా నిరసనలు చేస్తుండటంతో ముందుజాగ్రత్తగా భారీ రక్షణ ఏర్పాట్లు చేశారు. ఆందోళనలు జరగవచ్చన్న నిఘావర్గాల సమాచారంతో డేగ కళ్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఒక అడిషనల్ డీజీ అధికారి హైదరాబాద్ నుంచి వస్తున్నారు. నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ సీపీ సత్యనారాయణ, రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి, ఖమ్మం సీపీ విష్ణువారియర్, వరంగల్ సీపీ తరుణ్‌జోషితోపాటు పలువురు ఎస్పీలు, ట్రైనీ ఐపీఎస్‌లతో కలిపి మొత్తం 20 మంది ఐపీఎస్ అధికారులు బందోబస్తులో పాల్గొంటున్నారు. దాదాపు 60 మంది డీఎస్పీలు, 200 సీఐలు బందోబస్తును దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. వీరికితోడు ఆర్మ్డ్ ఫోర్సెస్, ఫైర్‌సిబ్బంది అదనం. -
రాబందు నోట్లో నుండి ‘దళితబంధు’.. ఎవరూ నమ్మరు: బండి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాబందు అని, అలాంటి రాబందు నోట్లో నుండి ‘దళితబంధు’మాట వస్తే ఎవరూ నమ్మరని, హుజూరాబాద్ ఎన్నికల తరువాత మళ్లీ దళితబంధు ఊసే ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్, జీహెచ్ఎంసీ, దుబ్బాక ఎన్నికల సందర్భంగా ఎన్ని హామీలు ఇచ్చారో, ఆ తరువాత వాటిని ఎట్లా మర్చిపోయారో ప్రజలందరికీ తెలుసునన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సినీనటి కరాటే కళ్యాణి యాదవ్, జల్పల్లి కౌన్సిలర్ ఉడుమల్ల యాదయ్య సహా పలువురు సినీ నటులు, జైన్సమాజ్కు చెందిన 200 మందితో పాటు ఇతర పార్టీల నాయకులు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారికి బండి సంజయ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
దళితబంధు లబ్ధిదారులు: ఆ 15 మంది ఎవరు?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న దళితబంధు పథకాన్ని సోమవారం(నేడు) ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలుత ఎంపిక చేసిన 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులు అందజేయనున్నారు. అయితే ఈ లబ్ధిదారుల వివరాలను అధికారులు, నేతలు వెల్లడించడంలేదు. పాత్రికేయులు ఎంత ప్రశ్నించినా ఎవరూ నోరు మెదపడం లేదు. అనర్హులను జాబితాలో చేర్చారంటూ పలువురు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా లబ్ధిదారుల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. లబ్ధిదారుల పేరిట కొందరు ప్రభుత్వ ఉద్యోగులను పథకానికి ఎంపిక చేశారంటూ శుక్రవారం ప్రజలు ఆగ్రహంతో రోడ్ల మీదకు వచ్చి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై కలెక్టర్ కర్ణన్, సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇంతవరకూ ఎలాంటి జాబితా ఖరారు కాలేదని అధికారులు చెబుతున్నారు. అయితే శనివారం నాటికే 15 మంది లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారని తెలిసింది. ఈ విషయాన్ని లబ్ధిదారులకు కూడా తెలియపరచకపోవడం గమనార్హం. సోమవారం ఉదయమే వారికి ఈ విషయం వెల్లడిస్తారని సమాచారం. దళితుల జీవనప్రమాణాలను మెరుగుపరిచేందుకు, వారిని ఎంటర్‌ప్రెన్యూయర్లుగా తీర్చిదిద్దేందుకు హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘దళితబంధు’పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేసింది. పథకంపై ఎలాంటి అపోహలు వద్దని, క్రమంగా అర్హులందరికీ అందజేస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. -
పైసల్ ఇవ్వడమే కాదు.. తోడూనీడలా దళితబంధు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినబోతున్న దళితబంధు పథకం అమలుకు రంగం సిద్ధమైంది. 16న (నేడు) సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి సభ ద్వారా ప్రారంభించనున్నారు. కేసీఆర్ ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ పథకం అమలులో ఎలాంటి పొరబాట్లు జరగకుండా నూటికి నూరుపాళ్లు విజయవంతం చేయాలన్న సంకల్పంతో అధికారులు విధివిధానాలు, అమలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే ముసాయిదా నివేదిక సిద్ధం చేశారు. ఈ నివేదిక రూపకల్పనలో మంత్రులు, ఐఏఎస్‌లు, దళిత మేధావులు, రాజకీయ నాయకులను కూడా భాగస్వాములను చేశారు. (చదవండి: దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు: కేసీఆర్) ఈ పథకం కింద దాదాపు 30 వరకు వివిధ స్వయం ఉపాధి, వ్యాపార యూనిట్ల జాబితాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక సాయంతోనే ఆగిపోకుండా వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేలా ఈ పథకం రూపొందించామని అధికారులు తెలిపారు. వారు తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యేలా నైపుణ్య కల్పన, మార్కెటింగ్ సదుపాయం, శిక్షణ, ఆర్థిక క్రమశిక్షణపై నిరంతరం పర్యవేక్షణ జరుపుతారు. దీనికోసం పలు ప్రభుత్వ–ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వం ముందుగానే ఒప్పందం చేసుకోవడం గమనార్హం. వారి వ్యాపారంలో ఇబ్బందులు, సమస్యలు గుర్తించి పరిష్కరించే బాధ్యత రెండేళ్ల వరకు తీసుకుంటారు. అంతా సమగ్ర సర్వే ఆధారంగానే.. 2014లో సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా లబ్ధిదారుల జాబితా రూపొందించారు. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం సామాజిక, ఆర్థిక స్థితిగతులు, వారికి అందుతున్న సంక్షేమ పథకాలు తదితరాలపై పెద్ద డేటాబేస్‌నే ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రభుత్వం అమలు చేస్తూ వస్తున్న ప్రతీ పథకానికి ఇదే మూలం. ►లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యాక.. వారికి ఏ వ్యాపారం, స్వయం ఉపాధి యూనిట్ లేదా వాహన రంగాల్లో పూర్వానుభవం ఉందా? లాంటి వివరాలు తెలుసుకుంటారు. ఆ మేరకు వారికి వ్యాపారం/ యూనిట్/ వాహనాలను కేటాయిస్తారు. పూర్వానుభవం లేనివారికి ప్రభుత్వ–ప్రైవేట్ సంస్థలతో నైపుణ్యాభివృద్ధి కల్పిస్తారు. ఉదా: పాడి గేదెలతో మినీ డైయిరీ యూనిట్‌కు కొందరు ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారికి కేటాయించిన రూ.10 లక్షలు ఒకేసారి ఖర్చు చేయించరు. అవసరం మేరకు నిధులు ఖర్చు చేయించి యూనిట్ పెట్టిస్తారు. విజయ డెయిరీ సిబ్బందితో శిక్షణ ఇప్పిస్తారు. పాలను విజయ డెయిరీ వారే కొనేలా మార్కెటింగ్ కల్పిస్తారు. అలాగే ప్రతీనెలా వారికి డెయిరీ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడేలా చూస్తారు. అందులోనూ పొదుపు, నిర్వహణ పోను.. ఖర్చులకు వాడుకునేలా లబ్ధిదారులకు అధికారులు సూచనలిస్తారు. ►వాహన రంగంపై ఆసక్తి ఉన్నవారికి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన వాహనాలు అవసరముంటే అందులో దళితబంధు పథకం నిధులతో కొనుగోలు చేసిన వాహనాలనే తీసుకునేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ►సూపర్ మార్కెట్ పెట్టుకుందామనుకునే 10 మందిని ఒక గ్రూపుగా కలుపుతారు. వారి నిధులను కలిపి రూ.కోటితో మోర్ లేదా డీమార్ట్లతో ఒప్పందం చేయిస్తారు. ఆయా సూపర్మార్కెట్ల ఫ్రాంచైజీలు ఇప్పిస్తారు. వీటి నిర్వహణలో శిక్షణ కూడా ఇప్పిస్తారు. ►ప్రొక్లెయినర్లు, లారీలు వంటి భారీ వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పనుల్లో అవకాశమిస్తారు. ►వ్యవసాయం, ఎలక్ట్రానిక్, పారిశ్రామిక, మెడికల్, హార్డ్‌వేర్, సిమెంట్ ఇటుకలు, రెడిమిక్స్ తదితర సంబంధిత వ్యాపారాలకు మార్కెటింగ్ కల్పించే బాధ్యత ఆయా శాఖలు తీసుకుంటాయి. ►ప్రతీ వ్యాపారం/ యూనిట్‌పై ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ జరుపుతారు. నష్టాలు, లాభాల ఆధారంగా నిపుణులతో సలహాలు సూచనలిస్తుంటారు. ►ఒకవేళ లబ్ధిదారుడు ఆకస్మికంగా మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా.. వ్యాపారం/యూనిట్ నష్టపోకుండా వారికి దళిత రక్షణ నిధి ద్వారా బీమా సౌకర్యం కల్పించనున్నారు. -
రేపు హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ
కరీంనగర్: రేపు(సోమవారం) హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కడ సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించనున్నారు. కాగా శనివారం హుజూరాబాద్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఈనెల 16న హుజూరాబాద్ మండలంలోని శాలపల్లిలో సీఎం ప్రారంభించనున్నట్లు చెప్పారు. హుజూరాబాద్‌లోని ప్రతి దళిత కుటుంబానికీ ఈ పథకాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. దళిత బంధును ఇక్కడ అమలు చేయడానికి రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నిధులతో 20 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతు బంధు ఇక్కడినుంచి ప్రారంభించినప్పుడు కూడా.. కొందరికే వస్తుందని, ఎన్నికల కోసమే ఇస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. రైతు బంధు ఇదే నియోజకవర్గంలో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన కొందరు నాయకులు, ఇవాళ దళిత బంధు ప్రారంభిస్తుంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారని అన్నారు. ఎన్నికల కోసం ఈ పథకం తెచ్చారంటున్నారని, కానీ బడ్జెట్ సమావేశాల సందర్భంగానే ఈ పథకం గురించి చెప్పామని హరీశ్ గుర్తుచేశారు. మార్చిలోనే ఈ కొత్త పథకాన్ని సీఎం ప్రకటించారని చెప్పారు. -
అపోహలొద్దు.. అందరికీ దళితబంధు
హుజూరాబాద్ /సాక్షి, కరీంనగర్: అర్హులైన వారందరికీ దళితబంధు అందజేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఈ పథకంపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని కోరారు. శనివారం హుజూరాబాద్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఈనెల 16న హుజూరాబాద్ మండలంలోని శాలపల్లిలో సీఎం ప్రారంభించనున్నట్లు చెప్పారు. హుజూరాబాద్‌లోని ప్రతి దళిత కుటుంబానికీ ఈ పథకాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. దళిత బంధును ఇక్కడ అమలు చేయడానికి రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నిధులతో 20 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతు బంధు ఇక్కడినుంచి ప్రారంభించినప్పుడు కూడా.. కొందరికే వస్తుందని, ఎన్నికల కోసమే ఇస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. రైతు బంధు ఇదే నియోజకవర్గంలో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన కొందరు నాయకులు, ఇవాళ దళిత బంధు ప్రారంభిస్తుంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారని అన్నారు. ఎన్నికల కోసం ఈ పథకం తెచ్చారంటున్నారని, కానీ బడ్జెట్ సమావేశాల సందర్భంగానే ఈ పథకం గురించి చెప్పామని హరీశ్ గుర్తుచేశారు. మార్చిలోనే ఈ కొత్త పథకాన్ని సీఎం ప్రకటించారని చెప్పారు. కేంద్రం రూ.40 లక్షలు ఇస్తే సంతోషిస్తాం ‘ఎంపీ బండి సంజయ్ రూ.50 లక్షలు ఇవ్వాలంటున్నారు. మాకు చేతనైనంత మట్టుకు రూ.10 లక్షలు ఇస్తున్నాం. మరో రూ.40 లక్షలు అదనంగా కేంద్రం నుండి తెచ్చిస్తే మీకు, మోదీకి ప్రజలు పాలాభిషేకం చేస్తారు. మొత్తంగా ప్రజలకు రూ.50 లక్షలు అందితే మేమెంతో సంతోషిస్తాం..’అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సీఎం చేతుల మీదుగా 15 కుటుంబాలకు చెక్కులు 16న జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి 15 కుటుంబాలకు చెక్కులు అందజేస్తారని మంత్రి తెలిపారు. 16న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం శాలపల్లికి వస్తారని, 4 గంటల వరకు సభ ఉంటుందని చెప్పారు. గ్రామసభలు నిర్వహించి.. సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల సమక్షంలో ప్రజల మధ్యే అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మేయర్ సునీల్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అత్యంత బీదలు తొలి లబ్ధిదారులు: సీఎస్ దళితబంధు అమలుపై శనివారం కలెక్టరేట్లో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సీఎస్ సోమేశ్‌కుమార్, ఎస్సీ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, కలెక్టర్ కర్ణన్ తదితరులు సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎస్ విలేకరులతో మాట్లాడారు. అత్యంత బీదలైన దళితులను దళిత బంధు తొలి లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని చెప్పారు. అత్యంత పేదరికంలో ఉన్నవారితో మొదలుపెట్టి, అర్హులైన అందరికీ అందేలా చర్యలు చేపడతామన్నారు. సీఎం సభకు ఏర్పాట్ల పరిశీలన శాలపల్లిలో సీఎం సభ ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ శనివారం పరిశీలించారు. ఐజీ నాగిరెడ్డి, సీపీ సత్యనారాయణకు పలు సూచనలు చేశారు. ఈ సభకు లక్షా 20 వేల మంది హాజరుకానున్నారు. సభకు దళితులను తీసుకురావడానికి 825 బస్సులను ఏర్పాటు చేశారు. -
దళితబంధు అందరికీ ఇవ్వాలి
హుజూరాబాద్/ సాక్షి ప్రతినిధి, వరంగల్: దళితబంధు పథకానికి అనర్హులను ఎంపిక చేస్తున్నారని.. ఒకేసారి అందరికీ వర్తించేలా పథకాన్ని అమలు చేయాలని హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులు ఆందోళనలకు దిగారు. శనివారం పలుచోట్ల రహదారులపై బైఠాయించి రాస్తారోకోలు చేశారు. అధికార పార్టీకి చెందినవారికే పథకం వచ్చేలా చేస్తున్నారని ఆరోపించారు. దీంతో హుజూరాబాద్ సహా పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనలు విరమింపజేశారు. హుజూరాబాద్ పట్టణంలో.. దళితులందరికీ ‘దళితబంధు’ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోతిరెడ్డిపేట, ఇప్పల్‌నర్సింగాపూర్ గ్రామాలకు చెందిన దళితులు హుజూరాబాద్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందినవారు పరకాల క్రాస్‌రోడ్డు వద్ద.. కందుగుల గ్రామ ఎస్సీ కాలనీకి చెందినవారు పరకాల–హుజూరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనలు చేశారు. అనర్హులను ‘దళితబంధు’ పథకానికి ఎంపిక చేశారని మండిపడ్డారు. వారిని ఏ అర్హత ప్రకారం ఎంపిక చేశారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, జెడ్పీటీసీ బక్కారెడ్డి వచ్చి ఆందోళన చేస్తున్నవారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ దళితులు వెనక్కి తగ్గలేదు. అర్హులను వదిలేసి అనర్హులను ఏ విధంగా ఎంపిక చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఆందోళనతో హుజూరాబాద్ పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చివరికి పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. జమ్మికుంట, ఇల్లందకుంటల్లోనూ.. ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళితులు నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన వారికే పథ కం వచ్చేలా చేస్తున్నారంటూ తహసీల్దార్ సురేఖతో వాదన కు దిగారు. జెడ్పీ చైర్పర్సన్ ఫోన్లో వారితో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదు. ఇక కనగర్తి గ్రామంలో దళితులు రోడ్డుపై బైఠాయించారు, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లిలోనూ దళితులు ఆందోళన చేశారు. కలెక్టర్లకు మంత్రి హరీశ్‌రావు ఫోన్.. దళితుల ఆందోళనల నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితిపై మంత్రి హరీశ్‌రావు ఆరా తీశారు. కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు కర్ణన్, రాజీవ్‌గాంధీ హనుమంతులతో ఫోన్లో మాట్లాడారు. పథకం కోసం ఎంపిక చేస్తున్న దళితుల వివరా లు, ప్రాధాన్యతలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా అవకతవకలకు తావు లేకుండా, అపోహలకు అవకాశం లేకుండా ఎంపిక ప్రక్రియ జరగాలని ఆదేశించారు. -
అలా చేస్తే మోదీకి పాలాభిషేకం చేస్తాం: హరీశ్‌రావు
సాక్షి, హుజూరాబాద్: హుజూరాబాద్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక.. యావత్ తెలంగాణ ఎన్నికగా మారింది. ఈ క్రమంలో అధికార, విపక్షాలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మతకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి పార్టీలు. హుజూరాబాద్ ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ ఎలక్షన్‌గా మారింది. ఇప్పటికే టీఆర్ఎస్ తరఫున రంగంలోకి దిగిన హరీశ్‌రావు.. బీజేపీపై భారీ ఎత్తున విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరఫున రంగంలోకి దిగిన మంత్రి హరీశ్‌రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు భారీ సవాల్ విసిరారు హరీశ్‌రావు. దళితబంధుకు కేంద్రం నుంచి నిధులు తెస్తే.. మోదీ ఫోటోకు పాలాభిషేకం చేస్తానన్నారు హరీశ్‌రావు. శనివారం ఎన్నికల ప్రచారంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘‘ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు ఇస్తాం. రైతుబంధుపై దుష్ప్రచారం చేసినట్లే.. దళితబంధుపై కూడా చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా.. దళితబంధు ఇచ్చి తీరుతాం. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇవ్వాలి.. దళితబంధుకు కేంద్రం నిధులు ఇస్తే మోదీకి పాలాభిషేకం చేస్తాం’’ అన్నారు మంత్రి హరీశ్‌రావు -
దళిత బంధు: ‘ఆలస్యమవుతుంది, రాదు అనే అనుమానాలొద్దు’
సాక్షి, కరీంనగర్: జిల్లా కలెక్టరేట్లో దళిత బంధుపై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మమాట్లాడుతూ.. దళిత బంధు అద్భుతమైన పథకమని కొనియాడారు. పథకం కింద 10 లక్షల రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందనన్నారు. స్వేచ్ఛగా ఏ ఉపాధి పొందుతారో ఆ రంగంలో డబ్బులు ఇస్తారని తెలిపారు. దళిత బంధు రాష్ట్రం మొత్తం అమలు జరుగుతుందని, అనుమానాలు ఏమీ అవసరం లేదని స్పష్టం చేశారు. ఈనెల 16న సీఎం సభలో 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందిస్తారని పేర్కొన్నారు. ఇంకా ఎవరిని కూడా లబ్ధిదారులను ఎంపిక చేయలేదని అన్నారు. అందరికీ అమలు అవుతుందని, తమకు ఆలస్యమవుతుందని, మాకు రాదు అనే అనుమానాలు అవసరం లేదన్నారు. దళిత బంధు హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకుంటున్నామమని రాహుల్ బొజ్జా అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా వచ్చిన దళితుల జాబితా తమ వద్ద ఉందని, వివరాలు లేని వారిని కూడా నమోదు చేస్తారని వెల్లడించారు. ప్రతీ గ్రామం నుంచి నలుగురు కో ఆర్డినేటర్లు ఉంటారని, గ్రామ సభ ద్వారా అందరి ముందు లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందన్నారు. ప్రతీ కుటుంబంతో మాట్లాడి ఏ స్కీం తీసుకుంటారో చర్చించి అవగాహన కల్పించి పథకాన్ని గ్రౌండ్ చేస్తారని తెలిపారు ఏడాది నుంచి రెండేళ్ల వరకూ కూడా స్కీం తీరును అధికారులు మానిటర్ చేస్తారని పేర్కొన్నారు. దళిత రక్షక నిధి కూడా ఉంటుందని అన్నారు. సాక్షి, కరీంనగర్: ఇళ్ళందకుంట మండలం కనగర్తి గ్రామంలో దళిత బంధు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దళితులు పురుగుల మందు డబ్బాలతో ధర్నా నిర్వహించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
దళితబంధు జాబితాలో అనర్హులా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో దళితబంధు పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక సరిగా జరగలేదని పలువురు ఆందోళనకు దిగడం కలకలం రేపింది. ఈనెల 16వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి సభకు లబ్ధిదారులను తీసుకువచ్చేందుకు శుక్రవారం అధికారులు సర్వే చేపట్టారు. ఆ సమయంలో జాబితాలో ఉన్న వారి వివరాలు తెలుసుకున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీణవంకలో పేదలకు కాకుండా అనర్హులకు జాబితాలో చోటు కల్పించారని ఆరోపిస్తూ పలువురు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వారిని, స్థానికంగా లేని వారిని ఎలా ఎంపిక చేస్తారని తహసీల్దార్ సరిత దృష్టికి తీసుకెళ్లారు. మళ్లీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో ప్రధాన రహదారిపై దళితులు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో 250 దళిత కుటుంబాలు ఉంటే.. కేవలం ఏడుగురిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. అలాగే ప్రగతి భవన్‌కు తమ గ్రామం నుంచి నలుగురు వెళ్తే.. ఇద్దరిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించారు. జమ్మికుంటలో కూడా పలువురు దళితులు తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసుల జోక్యంతో వారంతా ఆందోళన విరమించారు. ఇంకా ఎవరికీ మంజూరు చేయలేదు: కలెక్టర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికకు సర్వే పూర్తయిందని. అయితే ఇంతవరకూ ఎవరికీ మంజూరు చేయలేదని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఈ నెల 16న హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారని.. అనంతరం ప్రతి ఒక్కరికీ ఈ పథకం మంజూరుచేస్తామని చెప్పారు. లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందవద్దని, వదంతులను నమ్మవద్దని కోరారు. సమాచార లోపం వల్లే.. దీనిపై కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు నాయకులను ‘సాక్షి’ సంప్రదించింది. లబ్ధిదారుల ఎంపికలో ఎవరికీ అన్యాయం జరగదని వారు స్పష్టంచేశారు. 2015లో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఆ సర్వే సమయంలో కుటుంబ ఆర్థిక, సామాజిక పరిస్థితులు తెలుసుకునేందుకు 24 గడులు పెట్టిందన్నారు. అవి నింపే క్రమంలో కొందరు సొంతిళ్లు, వాహనాల విషయంలో వాస్తవాలు దాచారన్నారు. తాజా జాబితాలో అలాంటి వారు కనిపించే సరికి, వారికి రూ.10 లక్షల సాయం ఎలా చేస్తారని స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని వివరించారు. సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా లబ్ధిదారులందరికీ న్యాయం జరుగుతుందని స్పష్టంచేశారు. ఇదే తుది జాబితా కాదని, మరిన్ని జాబితాలు ఉంటాయని వెల్లడించారు. -
దళితబంధులో మొత్తం 30 పథకాలు.. జాబితా ఇదే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దళితబంధు కింద లబ్ధిదారులకు ఉపయోగపడే పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దళితులకు స్వయం ఉపాధి కల్పన కోసం మొత్తం 30 రకాల పథకాలు/కార్యక్రమాల జాబితాను విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో సర్వే అనంతరం మినీ డెయిరీ యూనిట్ నుంచి మినీ సూపర్ బజార్ వరకు వివిధ రకాల స్వయం ఉపాధి పథకాలను ఇందులో చేర్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారిని దృష్టిలో పెట్టుకుని వీటిని ఎంపిక చేసింది. దళితుల అభ్యున్నతికి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ఈ పథకం కింద ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సహాయంతో లబ్ధిదారులు.. ప్రభుత్వం ఎంపిక చేసిన ఈ 30 పథకాల్లో తమకు నచ్చిన ఒక దానిని ఎంపిక చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల 16న హుజూరాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఈ పథకం అమలుపై మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. -
ప్రత్యేక ఆకర్షణగా ‘హుజూరాబాద్’.. ఊహించని విధంగా పదవులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: హుజూరాబాద్.. ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇక్కడే దృష్టి పెట్టాయి. ఉప ఎన్నికకు తెరలేపిన హుజూరాబాద్ రాజకీయాలు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమయ్యాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఏ క్షణమైనా వెలువడవచ్చన్న సంకేతాలు అందడంతో పార్టీలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పకడ్బందీ వ్యూహంతో టీఆర్ఎస్ గత వారం రోజులుగా అన్ని పార్టీలు ఎన్నికల కసరత్తులో మరింతగా మునిగిపోయాయి. అభ్యర్థుల అన్వేషణలో తీరిక లేకుండా ఉన్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ దూకుడు మరింత పెంచింది. పకడ్బందీ వ్యూహంతో పావులు కదుపుతోంది. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదనే గట్టి పట్టుదలతో వ్యవహరిస్తోంది. నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వం ఉప ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పలు చర్యలు చేపడుతోంది. ‘దళిత బంధు’పథకానికి శ్రీకారం చుట్టడమే కాకుండా పైలట్ ప్రాజెక్టుగా హజూరాబాద్ను ప్రకటించింది. ఇందులో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఖాతాలోకి ఇందుకోసం రూ.500 కోట్లు విడుదల చేసింది. మరోవైపు ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్కు చెందిన కొందరు నాయకులను వారు కలలో కూడా ఊహించని పదవులు వరిస్తున్నాయి. రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ టీఎస్ ఎస్సీడీసీఎల్ చైర్మన్ కాగా, ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. సీఎం రాకతో మరింత ఊపు ముఖ్యమంత్రి, అధికార పార్టీ అధినేత కేసీఆర్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి దళితబంధు పథకం ఈ నెల 16న హుజూరాబాద్ వేదికగా ప్రారంభం కావాలి. కానీ.. బుధవారం వాసాలమర్రి దళితవాడను సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరూ ఊహించని విధంగా అక్కడే పథకాన్ని ప్రారంభించారు. దీని కొనసాగింపుగా సోమవారం రూ.500 కోట్లను కరీంనగర్ కలెక్టర్, ఎస్పీ కార్పొరేషన్ ఈడీల ఖాతాలకు ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అవుతుందనే సంకేతాలు అందడమే ఇందుకు కారణమనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్‌కు రానుండగా, ఈ సందర్భంగా దళిత బంధుపై సమీక్ష, లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చని అధికార వర్గాలు ఇదివరకే ప్రకటించాయి. రంగంలో అతిరథ మహారథులు మరోవైపు పార్టీ ముఖ్య నేతలు పలువురిని టీఆర్ఎస్ రంగంలోకి దింపింది. హుజూరాబాద్‌లో పార్టీ సమన్వయంపై దృష్టి పెట్టిన మంత్రి హరీశ్‌రావు పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్లు, పాత వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలోనే మకాం వేశారు. కేడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ, ప్రభుత్వ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అందుతున్నాయో లేదో పరిశీలిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈటలకు గెలుపు తప్పనిసరి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు కూడా ఈ ఎన్నిక మరింత కీలకంగా మారింది. రాజకీయాలలో మనుగడ సాగించాలంటే గెలుపు తప్పనిసరి అయ్యింది. తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికపై ఈటల సీరియస్‌గా దృష్టి పెట్టారు. వ్యక్తిగతంగా నియోజకవర్గంలో తనకున్న ఇమేజ్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాదీవెన యాత్ర పేరిట మొన్నటి వరకు నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. మోకాలికి శస్త్రచికిత్సతో తాత్కాలికంగా పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన ఈటల నియోజకర్గ నేతలు, కార్యకర్తలతో నిరంతర సమావేశాలు, సంప్రదింపులతో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కూడా హుజూరాబాద్‌పై దృష్టి కేంద్రీకరించి ఉప ఎన్నిక వ్యూహాలకు పదును పెడుతున్నాయి. -
‘దళిత బంధు’ ఆగయా.. ఎవరి అకౌంట్లో పడతాయో తెలుసా
సాక్షి, కరీంనగర్: దళిత జీవితాల్లో వెలుగులు నింపే దళితబంధు పథకానికి శ్రీకారం పడింది. దీర్ఘకాల ఉపాధి, ప్రయోజనం దృష్ట్యా పథకం రపొందించగా వేల కుటుంబాల్లో వెలుగులు నింపనున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన దళితులను యజమానులను చేయడమే ప్రధాన ఉద్దేశం. కాగా అతివ పేరునే నగదు జమ కానుంది. మహిళలలైతేనే ప్రతీ రుపాయిని పొదుపుగా వాడుతారనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా తొలి సారిగా వాసాలమర్రికి నిధులు కేటాయించారు. తదుపరి మన జిల్లాలోని హుజూరాబాద్‌కు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం రూ.500 కోట్లు విడుదల కాగా.. 5 వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. లబ్ధిదారుల ఎంపికలో యంత్రాంగం తలమునకలవగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక దృష్టిసారించారు. దళిత బంధు నిధులు తొలుత హుజూరాబాద్‌కే వినియోగిస్తామని కలెక్టర్ వివరించారు. లబ్ధిదారుల ఎంపికలో యంత్రాంగం ప్రభుత్వ మార్గదర్శకాల క్రమంలో లబ్ధిదారులను ఎంపిక చేయనుండగా ఇప్పటికే యంత్రాంగం సర్వే నిర్వహించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎస్సీలు ఎన్ని కుటుంబాలున్నాయి, మాదిగ, మాల సామాజికవర్గాల కుటుంబాల వారీగా లెక్కలు తీశారు. నియోజకవర్గంలో జమ్మికుంట, ఇల్లందకుంట, హుజూరాబాద్, వీణవంక, కమలాపూర్ మండలాలుండగా గ్రామాల వారీగా వివరాలు నమోదు చేశారు. 20,929 కుటుంబాలున్నాయని తేల్చగా గైడ్‌లైన్స్ ప్రకారం మళ్లీ లబ్ధిదారులను వడబోయనున్నారు. కొలువుంటే బంద్ ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కుటుంబానికి పథకం వర్తించదు. లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో ప్రతీ దశలోనూ ప్రభుత్వ యంత్రాంగం సహకారం అందించనుంది. దళిత బంధును సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా, మండల, గ్రామ పంచాయతీ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కమిటీలో కలెక్టర్, అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈవో, డీపీవో, డీఆర్డీవో, వ్యవసాయ, రవాణా, పారిశ్రామిక విభాగాల నుంచి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఎస్సీ సొసై టీ ఈడీ, ఇద్దరు నామినేటెడ్ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. మండలస్థాయి కమిటీలో ఎంపీడీవో, తహసీల్దార్, రవాణా, వ్యవసాయ శాఖ అధికారులు, ఒక్కొక్కరు ఇద్దరు నామినేటేడ్ వ్యక్తులు, పంచాయతీ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏ, ఇద్దరు నామినేటేడ్ వ్యక్తులు ఉంటారు. అర్హులైన వారు నమోదు చేసుకునేలా చూడటం వారు అనువైన వ్యాపారం ఎంచుకోవడంలో సహకరిండం ఈ కమిటీల బాధ్యత. లబ్ధిదారుల వివరాలను జిల్లా కలెక్టర్‌కు అందజేసి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందేలా చేస్తారు. ఈ మేరకు ఎంపిక చేసిన దళిత కుటుంబంలో మహిళా పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలో నగదును జమ చేస్తారు. లబ్ధిదారులు చేయాల్సిన వ్యాపారానికి సంబంధించి ఇప్పటికే పలు అంశాలతో జాబితా రూపొందించినట్లు సమాచారం. ఏ వ్యాపారం చేయాలనే దానిపై లబ్ధిదారుడిదే తుది నిర్ణయం. వ్యాపారం మొదలు పెట్టాక కమిటీలు ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తాయి. వ్యాపార తీరుతెన్నులు, ఆదాయంపై ఆరా తీస్తాయి. ఎప్పటికప్పుడు లబ్ధిదారుల వివరాలను డేటాబేస్‌లో నమోదు చేస్తాయి. అంతా ఆన్లైన్లోనే దళితబంధు పథకం దరఖాస్తుల స్వీకరణ మొదలు, పరిశీలన, అర్హత నిర్ధారణ, ఆర్థిక సాయం అందజేత తదితర ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే కొనసాగనుంది. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సీజీజీ ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను రపొందించింది. దీనికి సవంతరంగా యాప్‌ను కూడా తయారు చేసింది. ప్రస్తుతం ఇది ప్రయాగదశలో ఉంది. వీలైనంత త్వరలో వెబ్‌పోర్టల్‌తోపాటు యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. క్షేత్రస్థాయి అధికారులు మొదలు జిల్లా అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు ఈయా ద్వారా నిరంతరం పథకం అమలు తీరును పర్యవేక్షిస్తారు. ఇందుకు సంబంధిత అధికారులకు ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను సీజీజీ కేటాయిస్తుంది. విద్యార్థుల కోసం అమలు చేస్తున్న విదేశీ విద్యా నిధి పథకంలో గరిష్ఠ లబ్ధి రూ. 20 లక్షలు కాగా.. దాని తరువాత దళిత బంధు పథకం కిందే అధిక మొత్తంలో అందనుంది. లబ్ధిపొందని కుటుంబానికి ప్రాధాన్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటివరకు లబ్ధి పొందని కుటుంబానికి ఈ పథకంలో తొలి ప్రాధాన్యతనివ్వనున్నారు. అదే విధంగా కుటుంబ వార్షిక ఆదాయం రూ.2లక్షలలోపు ఉన్న భూమి లేని పేద కుటుంబాన్ని ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారు కుటుంబంలోని మహిళా పేరిట పథకం మంజూరు చేస్తారు. ఒకవేళ ఆ కుటుంబంలో అర్హురాలైన మహిళా లేనప్పుడు పురుషుడికి అవకాశం కల్పిస్తారు. ఈ పథకం కింద లబ్ధి పొందే కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దరఖాస్తుదారులు తాము ఏర్పాటు చేసే యూనిట్‌కు సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్టును పక్కాగా సమర్పించాలి. అన్ని కోణాల్లో వడబోసిన తరువాతే ఎస్సీ కార్పొరేషన్ అర్హులను ఖరారు చేస్తుంది. అయితే.. ప్రభుత్వ మార్గదర్శకాలు వచ్చిన వెంటనే లబ్ధిదారులకు నగదు జమ చేస్తామని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ‘సాక్షి’కి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. హుజూరాబాద్‌లో సంబరాలు హుజూరాబాద్: హుజూరాబాద్‌కు దళితబంధు నిధులు విడుదల చేయడంతో నియోజకవర్గ దళిత ప్రజలు సంబరాలు చేసుకున్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దళితులు రుణపడి ఉంటారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేశారు. డప్పు చప్పుళ్లతో రంగులు చల్లుకున్నారు. బాణాసంచా కాల్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ నెల 16న సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం ప్రారంభానికి వస్తారని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. మొదటి విడుతగా మంజూరైన రూ.500 కోట్లు అర్హులైన వారికి అందజేసేందుకు జాబితా సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. నాయకులు మొలుగూరి ప్రభాకర్, సందమల్ల బాబు, మొలుగు పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత కుటుంబాల సంఖ్య ఇల్లందకుంట 2,586 హుజూరాబాద్ 5,323 జమ్మికుంట 4,346 కమలాపూర్ 4,996 వీణవంక 3,678 మొత్తం 20,929 నియోజకవర్గంలో ఎస్సీ ఓటర్ల సంఖ్య మండలం మాదిగ మాల ఇతర మొత్తం ఇల్లందకుంట 6,786 1,846 534 9,166 హుజూరాబాద్ 7,810 1,844 516 10,170 జమ్మికుంట 6,745 1,807 470 9,022 కమలాపూర్ 6,820 1,857 537 9,214 వీణవంక 4,851 1,390 453 6,694 మొత్తం 33,012 8,744 2,510 44,266 -
హుజూరాబాద్‌లో దళితబంధుకు 500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దళితబంధు పథకం అమలు మరింత వేగవంతమైంది. గతవారం ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన భువనగిరి జిల్లా వాసాలమర్రిలోని 76 కుటుంబాలకు ప్రభుత్వం రూ.7.6 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు అమలు కోసం రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈమేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాసాలమర్రి గ్రామం వరకు ప్రాథమికంగా విడుదల చేసిన మార్గదర్శకాలనే ఇక్కడ కూడా అమలు చేయాలని సూచించారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్‌ను ఆదేశించారు. దీంతో కార్పొరేషన్ వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (వీసీఎండీ) బీఎస్ఎస్ భవన్‌లోని భారతీయ స్టేట్ బ్యాంకుకు లేఖ రాశారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు రూ.500 కోట్లు ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ పద్ధతిలో విడుదల చేయాలంటూ రెండు చెక్కులతో కూడిన లేఖను సమర్పించారు. దీంతో బ్యాంకు నుంచి నిధులు జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయి. -
హుజురాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్: దళిత బంధు అమలు
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గంలో 'దళితబంధు' అమలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. పథకం కింద రూ.500 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. కాగా హుజురాబాద్‌లో ‘దళిత బంధు’ పైలెట్ ప్రాజెక్టును నిలుపుదల చేయాలంటూ జనవాహిని పార్టీ, జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఉప ఎన్నిక నేపథ్యంలో హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వం, ఈసీతో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తదితరులను పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దళితబంధు అమలుకు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. -
రూ.10 లక్షల చొప్పున ఇస్తే పదవికి రాజీనామా: కోమటిరెడ్డి
చౌటుప్పల్: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7లక్షల మంది దళిత, గిరి జనులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఇస్తే తన పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అలాగే 2024 ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం కృషి చే స్తానని పేర్కొన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రకటించారన్నారు. దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన రోజునే కేసీఆర్ ఓడిపోయినట్టని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా పని చేస్తున్నానని, ఇప్పటికే రెండుసార్లు ప్రధాని మోదీని కలిశానని, రూ.3 వేల కోట్లకు పైగా నిధులు రాబట్టానని తెలిపారు. ఎల్బీనగర్ నుంచి మల్కాపురం వరకు రూ.600 కోట్లతో నిర్మించనున్న ఆరు వరుసల రహదారి పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు కోమటిరెడ్డి వెల్లడించారు.