హరీశ్‌రావు కొప్పుల ఈశ్వర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. అరణ్యభవన్‌లో ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల అధికారులతో ఆయన గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రతి నియోజకవర్గానికి దళితబంధు పథకం కింద వంద యూనిట్లు మంజూరు చేశామన్నారు. ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక వేగంగా పూర్తి చేసి, జాబితాలను ఉన్నతాధికారులకు ఇవ్వాలన్నారు. పథకం పురోగతిపై రాష్ట్రస్థాయిలో, జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని, లబ్ధిదారుల పరిస్థితి, యూనిట్ల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. మార్చి నెలాఖరు నాటికి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వక్ఫ్ బోర్డ్, ఎస్సీ కార్పొరేషన్ల చైర్మన్లు మహ్మద్ సలీం, బండా శ్రీనివాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, కమిషనర్ యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment