koppula eshwar
-
నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఏవి?
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, 7 నెలలైందని, హామీల అమలు మాత్రం నీటిమూటగా మిగిలిపోయందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఎంత వరకు వచ్చిందని, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయని ప్రశ్నించారు.ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భతి రూ.4,000 ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తామని, కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటర్లు ఇస్తామన్న హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. గత ప్రభుత్వంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు మాత్రం కొన్ని పోస్టులు కలుపుతూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.మాజీ సీఎం కేసీఆర్ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై న అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి, నియామక పత్రాలు ఇచ్చి, నిరుద్యోగుల చెవులో పూలు పెట్టారన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో 1.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు.నిరుద్యోగుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్‌ను పరామర్శించేందుకు గాంధీ హాస్పిటల్‌కు వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాకేశ్ రెడ్డితోపాటు పలువురు విద్యార్థి ఉద్యమ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. -
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి : కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి: ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్లీ ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఓదెల, ఎలిగేడు మండల కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రసాధనలో ముందుండి పోరాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. 10ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేని అద్భుత పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఐటీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి 18 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్దే అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను వివరిస్తూ, కాంగ్రెస్ విధానాలను ఎండగడుతూ గ్రామాల్లో ప్రజలకు తెలియజేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, నియోజకవర్గ నాయకురాలు దాసరి ఉష, ఎంపీపీ తానిపర్తి స్రవంతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి, బైరెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: అభ్యర్థుల ఖరారు పూర్తితో.. వ్యూహాలకు కసరత్తు! -
పంటలు ఎండుతున్నా పట్టించుకోరా..?
కరీంనగర్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించా రు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజంపల్లి, మారేడ్‌పల్లి గ్రామాల్లో సాగునీరు అందక ఎండిపోయిన వరి పొలాలను ఆదివారం పరిశీలించా రు. ఎస్సారెస్పీ పంప్‌హౌజ్ ద్వారా సాగునీరు వ స్తుందనే ఆశతో రెండు గ్రామాల రైతులు సుమారు 1800 ఎకరాల్లో వరి సాగుచేశారని, పొట్టదశలో సా గునీరు అందక ఎండిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. సుందిల్ల, మేడిగడ్డ అన్నారం బ్యారేజీల నుంచి లక్ష ఎకరాలకు నీరిచ్చే పరిస్థితి ఉన్నా.. ప్ర భుత్వం పట్టించుకోకుండా గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే అక్కసుతోనే రైతులకు నీరివ్వడం లేదని ఆరోపించారు. కోపముంటే బీఆర్ఎస్ నాయకులపై తీర్చుకోవాలేగానీ రైతులపై కాదన్నారు. ప దేళ్లలో ఎన్నడూ గుంట భూమి కూడా ఎండిపోలేద ని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే 1800 ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇరవై ఏళ్లుగా తాను ప్రాతినిధ్యం వహించిన ఈ ప్రాంతంలో ఏ రోజూ ఇలాంటి పరి స్థితి రాలేదన్నారు. వేంనూర్ పంప్‌హౌజ్ నుంచి నందిమేడారం రిజర్వాయర్ ద్వారా రైతులకు నీరందించి పంటలను కాపాడామని గుర్తు చేశారు. వెంటనే వేంనూర్ పంపులను ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. ఆయన వెంట జె డ్పీ చైర్పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్, ఎంపీటీసీ మల్లేశం, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
పాత.. కొత్త.. ‘కారు’ అభ్యర్థులు ఖరారు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. అభ్యర్థుల ఎంపిక ప్రారంభించింది. మొదటి జాబితాలోనే ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల క్యాండిడేట్ల జాబితా విడుదల చేసింది. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు గులాబీ దళపతి మరోసారి అవకాశం కల్పించారు. పెద్దపల్లి నుంచి కొత్తగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు అవకాశం కల్పించారు. బీజేపీ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడిని పెంచే వ్యూహాన్ని అమలు చేస్తుండటంతో బీఆర్ఎస్ సైతం తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల హీట్‌ను పెంచింది. మరోవారం పదిరోజుల్లో కాంగ్రెస్ పార్టీ సైతం తొలిజాబితాను విడుదల చేసేందుకు కసరుత్తు చేస్తోంది. బోయినపల్లి వినోద్‌కుమార్ పుట్టిన తేదీ: 1959 జూలై 22 విద్యార్హతలు: ఎల్ఎల్బీ (కేయూ) అనుభవం: టీఆర్ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యులు, లోక్‌సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అదనపు సమాచారం: సీపీఐలో వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభంతో టీఆర్ఎస్లో చేరి 2004–09 మధ్యలో వరంగల్ ఎంపీగా, 2014–19లో కరీంనగర్ ఎంపీగా పని చేశారు. 2019లో బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. సామాజిక వర్గం: వెలమ (ఓసీ) కొప్పుల ఈశ్వర్ పుట్టిన తేదీ: 1959 ఏప్రిల్ 20 విద్యార్హతలు: బీఏ అనుభవం: సాంఘిక, సంక్షేమశాఖ మంత్రిగా పని చేశారు. అదనపు సమాచారం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో మేడారం నుంచి తొలిసారిగా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2004, 08లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 2009, 10, 14, 18లో ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు. 2014–18 వరకు ప్రభుత్వ చీఫ్ విప్‌గా పని చేశారు. 2019 నుంచి మంత్రిగా పని చేశారు. సామాజిక వర్గం: ఎస్సీ (మాల) ఇవి చదవండి: నేడు సికింద్రాబాద్, సంగారెడ్డిలలో మోదీ పర్యటన -
TS:మాజీ మంత్రికి పెద్దపల్లి ఎంపీ టికెట్!
సాక్షి, పెద్దపల్లి: ఆ మాజీ మంత్రి ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఏడోసారి ఓడిపోయారు. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ సీటుపై కన్నేశారట ఆ మాజీ మంత్రి. మరి గులాబీ బాస్ ఆయనకు క్లియరెన్స్ ఇచ్చేశారా? మాజీ మంత్రికి కాదంటే పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? అసలు అక్కడ నుంచి పోటీ చేయడానికి పోటీ పడుతున్న నేతలెవరు? పెద్దపెల్లి ఎంపీ సీటుకు గులాబీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు తెరపైకొస్తోంది. సౌమ్యుడిగా, సీనియర్ నాయకుడిగా పేరున్న ఈశ్వర్ అయితేనే పెద్దపల్లి సీటు కచ్చితంగా గులాబీ పార్టీకి దక్కుతుందని పార్టీ అధినేత ఆలోచిస్తున్నాట్లు చెబుతున్నారు. ధర్మపురి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఓటమిపాలైన ఈశ్వర్ ను ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని అధిష్ఠానం గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా వెంకటేశ్ నేతకాని ఉండగా.. చెన్నూరు అసెంబ్లీ బరిలో ఓటమిపాలైన బాల్కసుమన్ పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే, వీరిద్దరి కంటే కూడా బెస్ట్ ఛాయిస్ గా గులాబీ బాస్ మాత్రం కొప్పుల ఈశ్వర్ అయితేనే బెటరని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పెద్దపెల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పెద్దఎత్తున సింగరేణి కార్మికుల ఓట్లుండటం... ఆయా ప్రాంతాలన్నింటా ఈశ్వర్ కు పట్టుండటంతో పాటు.. ధర్మపురి నుంచి ఆరుసార్లు గెలిచి ఏడోసారి ఓటమిపాలైన కొప్పులను రాజకీయంగా ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా పెద్దపెల్లి పార్లమెంట్ బరిలో నిలపాల్సిందేనని పార్టీ అగ్ర నాయకులంతా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఈశ్వర్‌ను పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని గులాబీ అధిష్ఠానం యోచిస్తుంటే... యవనేతగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు.. వంశీని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ యోచిస్తున్నట్టుగా సమాచారం. బీజేపీ నుంచి ఎస్ కుమార్ పేరు వినిపిస్తోంది. అయితే, బీజేపీ నుంచి ఈసారి కొత్త ముఖాన్ని పెద్దపెల్లి పార్లమెంట్ బరిలో దింపే అవకాశాలూ లేకపోలేదని..ఇప్పటికే ఎస్. కుమార్‌ను ధర్మపురి అసెంబ్లీ బరిలో నిలిపినందున ఆయనకు అవకాశం దక్కకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంకోవైపు కాశిపేట లింగయ్య వంటివారు కూడా ప్రయత్నాలు చేస్తుండగా.. ఆయన్ను కమలం పార్టీ అధిష్ఠానం యాక్సెప్ట్ చేస్తుందో, లేదోనన్న భావన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఎవరైనా బలమైన నేత వస్తే తప్ప.. ఇప్పటికైతే ప్రచారం జరుగుతున్నట్టుగా బీఆర్ఎస్ నుంచి అనుభవజ్ఞుడైన కొప్పుల ఈశ్వర్.. కాంగ్రెస్ నుంచి యువకుడైన వంశీ గనుక బరిలోకి దిగితే.. ఈ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ కు తెర లేవనుంది. మొత్తంమీద అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయో లేదో.. అప్పుడే వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. పొల్టీషియన్స్ అంతా ఎవరి ప్లాన్లల్లో వారు పడ్డారు. అలాగే పార్టీలు కూడా ఏ అభ్యర్థైతే బెటర్.. ఎవరైతే ప్లస్.. ఎవరైతే మైనస్ అనే లెక్కలు వేసుకుంటున్నాయి. ఇదీచదవండి..గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా? -
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఊరట లభించింది. ఎమ్మెల్యేగా తన ఎన్నికల చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కాగా కొప్పుల ఈశ్వర్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనపై అనర్హత విధించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఎమ్మెల్యేగా ఆయనపై వేటు వేయాలని పిటిషన్లు వేశారు. ధర్మపురి ఎన్నికపై రీకౌంటింగ్ జరపాలని కోరారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కాంగ్రెస్‌నేత పిటిషన్‌ను కొట్టివేసింది. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో కరీంనగర్ జల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేసి కేవలం 441 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌పై గెలిచారు. దీంతో వీవీ ప్యాట్ల ఓట్లను లెక్కించకముందే కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారని, అధికారులు ఆయనకు మద్దతిచ్చారని లక్ష్మణ్ ఆరోపించారు. ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ధర్మపురి నియోజవకవర్గం నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి మళ్లీ ఈ ఇద్దరు నేతలే తలపడుతున్నారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో ఈసారి గెలుపెవరిదో తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. -
telangana: శాసనసభకు అయిదు కంటే ఎక్కువసార్లు ఎన్నికైంది వీరే..
తెలంగాణ నుంచి శాసనసభకు ఐదు లేదా అంతకన్నా ఎక్కువగా ఎన్నికైనవారి సంఖ్య నలబై అయిదు వరకు ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి ఎనిమిదిసార్లు శాసనసభకు ఎన్నికై రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన తర్వాత ఏడుసార్లు శాసనసభకు ఎన్నికైన వారు ఇద్దరు ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి , ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈటెల రాజేందర్ ఈ ఘనత పొందారు. జానారెడ్డి 1983,1985 లలో టీడీపీ పక్షాన, 1989,1999,2004,2009,2014లలో కాంగ్రెస్ పక్షాన గెలుపొందారు. ఈటెల రాజేందర్ 2004 ,2008 ఉప ఎన్నిక, 2009, 2010 ఉప ఎన్నిక, 2014,2 018లలో టిఆర్ఎస్ పక్షాన, 2021 ఉప ఎన్నికలో బీజేపీ తరపున ఆయన గెలుపొందారు. ఆరుసార్లు గెలిచినవారిలో జి.గడ్డెన్న, టీ.జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సీ రాజేశ్వరరావు, తన్నీరు హరీష్ రావు, డాక్టర్ ఎమ్.చెన్నారెడ్డి, ముంతాజ్ అహ్మద్ ఖాన్, నర్రా రాఘవరెడ్డి ఉన్నారు. ఇక ఐదుసార్లు గెలిచిన నేతలలో జి.రాజారాం, గంపా గోవర్దన్, మండవ వెంకటేశ్వరరావు, కరణం రామచంద్రరావు, సి.విఠల్ రెడ్డి, కె.హరీశ్వర్ రెడ్డి, పి.జనార్ధనరెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, దానం నాగేందర్, అక్బరుద్దీన్ ఒవైసి, సలావుద్దీన్ ఒవైసి, అమానుల్లాఖాన్, జి.సాయన్న, డాక్టర్ పి.శంకరరావు, గురునాధరెడ్డి, జె.కృష్ణారావు, ఎన్.ఉత్తం కుమార్ రెడ్డి, పి.గోవర్దనరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉన్నారు -
మానవీయ కోణంలో సంక్షేమానికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి అన్నివర్గాలను పేదరికం నుంచి బయటపడేసేందుకు వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ.. వారికి సమానంగా సంక్షేమాన్ని అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలో మైనారిటీలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించే పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగిస్తూ ముస్లిం, క్రైస్తవ మైనారిటీల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో మైనారిటీల సంక్షేమం కోసం సుమారు రూ.15 వేల కోట్లను ఖర్చు చేశామని తెలిపారు. మైనారిటీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధికి వంద శాతం సబ్సిడీ కింద ఒక్కో లబ్ధి దారుడికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఈ పథకం కింద రాష్ట్రం మొత్తం మీద 27 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. తొలివిడతగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది వేల మందికి రూ.లక్ష చొప్పున అందిస్తున్నామని తెలిపారు. మైనారిటీలకు కార్పొరేట్ స్థాయి విద్య.. మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సుమారు 204 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ విద్య అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుతం లక్షకు పైగా విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నామని చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు అబ్దుల్ అహ్మద్ బిన్ బలాలా, జాఫర్ హుస్సేన్, కాలేరు వెంకటేశ్, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు షాక్.. మధ్యంతర పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్యంతర పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ కొప్పల ఈశ్వర్.. కోర్టుకు విన్నవించారు. మూడేళ్ల పాటు విచారణ జరిగి.. అడ్వకేట్ కమిషన్ దగ్గర వాదనలు ముగిశాక ఇప్పుడు సాధ్యం కాదన్న హైకోర్టు.. తుది వాదనలు వినాల్సి ఉందని పేర్కొంది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కొప్పుల ఈశ్వర్ ఎన్నిక సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి లక్షణ కుమార్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈశ్వర్ స్థానంలో తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరారు. లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించాలంటూ మంత్రి మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. చదవండి: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు కలకలం.. 15 బృందాలతో దాడులు -
ధర్మపురి ఎస్సీ నియోజకవర్గ రాజకీయ చరిత్ర
ధర్మపురి (ఎస్సి) నియోజకవర్గం టిఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ దర్మపురి రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచారు. ఆయన టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి గెలుస్తున్నారు.రెండు ఉప ఎన్నికలతో సహా మొత్తం ఆరుసార్లు గెలిచారు. 2014లోనే ఆయన మంత్రి అవుతారని అనుకున్నారుకాని ఛీప్ విప్ పదవిని మాత్రమే పొందగలిగారు. 2018లో గెలిచిన తర్వాత కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. కాగా 2018లో అత్యంత తీవ్రమైన పోటీని ఆయన ఎదుర్కున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఎ.లక్ష్మణకుమార్‌ను కేవలం 441 ఓట్ల తేడాతో ఈశ్వర్ ఓడిరచారు. ఈయనకు 70579 ఓట్లు రాగా, లక్ష్మణ్ కుమార్‌కు 70138 ఓట్లు వచ్చాయి. కాగా స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసిన కె.నరసయ్యకు 13వేల కు పైగా ఓట్లు రావడం విశేషం. 2004లో, ఆ తర్వాత ఒక ఉప ఎన్నికలో మేడారం నుంచి గెలిచిన ఈశ్వర్, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత దర్మపురి నుంచి 2009 సాధారణ ఎన్నికలోను,ఉప ఎన్నికలోను గెలుపొంది, ఆరేళ్లలో నాలుగుసార్లు ఎన్నికై రికార్డు సృష్టించారు. రెండుసార్లు తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామా చేసి ఉప ఎన్నికలలో గెలుపొందారు. 2014, 2018తో సహా మొత్తం ఆరుసార్లు గెలిచారు. ఆరేళ్ళ వ్యవధిలో నాలుగుసార్లు గెలిచిన ముగ్గురు టిఆర్ఎస్ నేతల్లో ఈశ్వర్ ఒకరు కావడం విశేషం. టి. హరీష్‌రావు, ఈటెల రాజేందర్లు కూడా ఇదే విధంగా గెలిచారు. ధర్మపురి (ఎస్సి)లో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
దళితులు ధనికులు కావాలె.. ఏ పార్టీ వాళ్లయినా దళితబంధు ఇద్దాం
సిరిసిల్ల: సమాజంలో అణచివేతకు గురై, అట్టడుగున ఉన్న దళితులను ధనికులను చేసే లక్ష్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పోడుభూములకు పట్టాలు, ఎస్సీ చిరువ్యాపారులకు ఆర్థిక సాయం అందించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దళితబంధులో తొలి విడతలో ప్రతి నియోజ కవర్గానికి 100 కుటుంబాలకు అందించామని, విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్లు అందిస్తామని తెలిపారు. ఏ పార్టీ వారైనా అందరికీ దళితబంధు ఇస్తామన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ధనికులు ఏ నీళ్లు తాగుతారో.. వీర్నపల్లి తండాలోనూ అవే నీళ్లు తాగేలా ఇంటి ముందు నల్లా పెట్టి నీళ్లు అందిస్తున్నామన్నారు. కొమురం భీమ్ స్ఫూర్తితో జల్, జమీన్, జంగల్ నినాదాలతో నీళ్లు సాధించి, పోడుభూములకు పట్టాలిచ్చి, కొత్తగా 5 లక్షల ఎకరాల్లో 8 శాతం పచ్చదనాన్ని పెంచామన్నారు. 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం 9 ఏళ్లలో చేసి చూపించామని, తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ వివరించారు. రైతులకు బీమా చేయిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అన్నారు. సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికి మోడల్‌గా మారిందని రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. వ్యవసాయ కాలేజీకి బాబూ జగ్జీవన్‌రామ్ పేరు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వ్యవసాయ కళాశాలకు బాబూ జగ్జీవన్‌రామ్ కళాశాలగా నామకరణం చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. 128 మంది ఎస్సీ చిరువ్యాపారులకు రూ.62 లక్షల మేరకు ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. జిల్లాలో 1,614 మంది గిరిజనులకు 2,558.34 ఎకరాల పోడు భూములకు పట్టాలను అందించారు. జెడ్పీ చైర్పర్సన్ అరుణ, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, కలెక్టర్ అనురాగ్ జయంతి, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
ధర్మపురి స్ట్రాంగ్ రూమ్: 17 గంటలు పరిశీలన.. 26 దాకా ఉత్కంఠ
సాక్షి, జగిత్యాల: తాళాలు మిస్సింగ్ లాంటి అనేక మలుపుల మధ్య సాగిన ధర్మపురి స్ట్రాంగ్ రూం ఎపిసోడ్ ఓ కొలిక్కికి వచ్చింది. నాలుగున్నరేండ్ల గది తెరిచిన అధికారులు.. సుమారు 17 గంటలపాటు స్ట్రాంగ్ రూమ్ డాక్యుమెంట్స్‌ను పరిశీలించారు. హైకోర్ట్ ఆదేశాలతో నిన్న (ఏప్రిల్ 23 ఆదివారం) ఉదయం 11 గంటలకు తాళాలు పగులగొట్టి స్ట్రాంగ్ రూమ్ తెరవగా.. ఇవాళ(సోమవారం) ఉదయం 4 గంటల 50 నిమిషాలకు డాక్యుమెంట్ల పరిశీలన ముగిసింది. గత అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు వీఆర్కే కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా అధికారులు పరిశీలించారు. సేకరించిన డాక్యుమెంట్స్ ను నివేదిక రూపంలో ఈనెల 26 లోపు హైకోర్టుకు సమర్పించనున్నారు జగిత్యాల జిల్లా అధికారులు. డాక్యుమెంట్ల పరిశీలన ముగింపుతో హైడ్రామాకు తెర పడగా హైకోర్ట్ తీర్పుపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అడ్లూరి అభ్యంతరాలు.. 👉హై కోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు ఎన్నికల అధికారుల పర్యవేక్షణ లో 17A మరియు 17 c కి సంబందించిన డాక్యుమెంట్స్ సేకరించడం జరిగింది 👉కౌంటింగ్ సమయంలో రికార్డ్ చేసిన విడియో ఫుటేజ్, సీసీ ఫుటేజ్ లేవు అని అధికారులు చెప్పడం జరిగింది. 👉ఎలక్షన్ పోలింగ్ అయిన తరువాత ఈవీఎంలను ప్రభుత్వం నోటిఫైడ్ చేసిన ప్రాంతంలో ఉంచాలి. కానీ, ధర్మపురి జూనియర్ కాలేజి లో ఈవీఎంలను ఉంచడం జరిగింది. అది ప్రభుత్వం నోటిఫైడ్ చెయ్యని ప్రాంతం!. 👉పోలింగ్ అయిన దగ్గర నుండి ఈవీఎంలను భద్రపరిచే వరకు అధికారులు ఎక్కడ నిబంధనలు పాటించలేదు.. 👉 నాలుగున్నర సంత్సరాలుగా స్ట్రాంగ్ రూం తాళాలు మిస్సింగ్ అయిన పరిస్థితి లోపల కోర్టు ఆదేశాల ప్రకారం తాళాలు పగలగొట్టి స్ట్రాంగ్ రూం ఓపెన్ చేస్తే పోలింగ్ కి సంబంధించిన పత్రలు సీల్ లేకుండా, ఒక క్రమ పద్దతిలో లేకుండా ఉన్నాయి. 👉209 కి సంబంధించిన పోలింగ్ బూత్ కి సంబందించిన 17C డాక్యుమెంట్స్ కి సీల్ వేసి లేదు. 👉ఒక క్యాబినెట్ మంత్రి కి సంబంధించిన ఎన్నికల పోలింగ్ లో ఇన్ని అవకతవకలు జరిగాయి అయినప్పటికీ మేము కోరెది రికౌంటిన్ మాత్రమే.. 👉స్ట్రాంగ్ రూం తాళాలు పోయాయి అని అధికారికంగా ప్రకటించారు.దానికి కారణం అయిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి,వారి పైన క్రిమినల్ కేసు ఫైల్ చెయ్యాలి, వారిని వెంటనే సస్పెండ్ చేయాలి. 👉అదే విధంగా 17c కి సంబంధించిన ఈవీఎంలను మళ్ళీ లెక్కించాలి.. 👉ఇదంతా మంత్రి కొప్పుల ఈశ్వర్ కుట్రరపూరితంగ చేస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. 👉దీనిపై హైకోర్టు కి మా అడ్వకేట్ ద్వారా విన్నవిస్తం. మరోవైపు కోర్ట్ ఆదేశాల మేరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రక్రియ సజావుగా సాగుతోందని, నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్టు వెల్లడించిన మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రతినిధులు. ► గత అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ► కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 10న స్ట్రాంగ్ రూం ఓపెన్ చేసి 17ఏ, 17సీ డాక్యుమెంట్లు, సీసీటీవీ ఫుటేజీలు, సంబంధిత డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉండగా, స్ట్రాంగ్ రూం నంబర్ 786051 నంబర్ తాళాలు మిస్ అయినట్లు ఆఫీసర్లు గుర్తించారు. ► సుమారు ఐదు గంటల పాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. దీంతో తాళాన్ని బ్రేక్ చేయాలని ఆఫీసర్లు నిర్ణయించగా, కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఢిల్లీ నుంచి త్రీమెన్ కమిటీ సభ్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీలను సమగ్ర నివేదిక అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ► దీంతో రంగంలోకి దిగిన త్రీమెన్ కమిటీ సభ్యులు ఈ నెల 17న కొండగట్టులోని జేఎన్టీయూలో గతంలో కలెక్టర్లుగా పనిచేసిన శరత్, రవితో పాటు అడిషనల్ కలెక్టర్లు రాజేశం, అరుణశ్రీ, ధర్మపురి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ భిక్షపతిలను ఎంక్వయిరీ చేశారు. ఆ ఎంక్వయిరీకి సంబంధించిన వివరాలను వారు కోర్టుకు నివేదించారు. ► దీంతో ఈ నెల 23న ధర్మపురి స్ట్రాంగ్ రూం లాక్ పగలగొట్టాలని లేదా టెక్నీషియన్ తో తీయాలని, ప్రతి ఘటనను కెమెరాలో రికార్డు చేయాలని కోర్టు సూచించింది. అందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 26న కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ► అయితే, ఈ కేసు రెండున్నరేళ్ల పాటు పెండింగ్ లో ఉండగా, ధర్మపురి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ భిక్షపతి కోర్టుకు హాజరుకాకపోవడం.. అరెస్ట్ వారంట్ రావడంతో మళ్లీ కొంత పురోగతి కనిపించింది. ► కోర్టు ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా నూకపల్లిలో వీఆర్కే కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్‌ను ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ యాస్మిన్ బాషా, ఆయా పార్టీల, స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో ఆదివారం ఉదయం 11 గంటలకు లాక్ పగలగొట్టి ఓపెన్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను, సీసీటీవీ ఫుటేజీలకు చెందిన జిరాక్స్ లను అటెస్ట్ చేసి వాటిని ఈ నెల 26న అధికారులు కోర్టుకు అందజేయనున్నారు. -
ధర్మపురి ఎన్నిక వివాదం.. హైకోర్టు సంచలన ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. బుధవారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్ సీల్ పగలగొట్టాలని జిల్లా కలెక్టర్‌కు అనుమతిచ్చింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంలో రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. 2019లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ విజయం సాధించారు. అయితే, ఆయన ఎన్నిక చెల్లదని.. అందులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఉన్నత న్యాయస్థానంలో కేసు విచారణ కొనసాగుతోంది. కాగా, ఈ ఎన్నిక వివాదంపై బుధవారం హైకోర్టులో విచారణ సందర్భంగా.. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉద్దేశ పూర్వకంగానే తాళం చెవి మాయం చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో.. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. స్ట్రాంగ్ రూమ్ సీల్ పగలగొట్టేందుకు జగిత్యాల కలెక్టర్‌కు అనుమతించింది. అన్ని పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరవాలని సూచించింది. రిటర్నింగ్ అధికారి కోరితే వాహనం, తగిన భద్రత ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైతే వడ్రంగి, లాక్స్మిత్ సహకారం తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతిచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 24కి వాయిదా వేసింది. అంతకు ముందు, ఎన్నికలకు సంబంధించిన డాక్యుమెంట్లు, వీవీ ప్యాట్లు, సీసీ ఫుటేజీ కావాలని లక్ష్మణ్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. లక్ష్మణ్ అడిగిన సమాచారం ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. అవన్నీ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచి ఉన్నాయని రిటర్నింగ్ అధికారి చెప్పడంతో స్ట్రాంగ్ రూమ్ తెరిచి రిటర్నింగ్ అధికారి అడిగిన డాక్యుమెంట్లు మొత్తం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇటీవల ధర్మపురిలో ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచేందుకు కలెక్టర్ ప్రయత్నించారు. మొత్తం 3 గదుల్లో ఎన్నికల సామగ్రి ఉండగా ఒక గది తాళాలు తెరవలేపోయారు. -
తాళాల పంచాయతీ.. ‘ఇది కుట్ర ప్రకారమే జరిగింది..’
జగిత్యాల/జగిత్యాలటౌన్: జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వీఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల సామగ్రి భద్రపర్చిన స్ట్రాంగ్‌రూం తాళపు చెవులు మాయం కావడంపై సోమవారం విచారణ జరగనుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) నుంచి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేశారు. ఇందులో 441 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలిచారు. అయితే ఈ ఫలితాలను సవాల్ చేస్తూ లక్ష్మణ్ కుమార్ అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీంతో ఎన్నికలకు సంబంధించిన సామగ్రి మొత్తం జగిత్యాలలోని వీఆర్కే కళాశాలలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపర్చారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచి అందులోని డాక్యుమెంట్స్‌ను నిర్ణీత తేదీలోగా తమకు అందించాలని హైకోర్టు కలెక్టర్, ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ యాస్మిన్ బాషా, అప్పటి ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలిసి స్ట్రాంగ్‌రూమ్ తాళం తెరిచేందుకు ఈనెల 12న ప్రయత్నించారు. అయితే మూడు గదుల్లో రెండో గది తాళం తెరచుకోవడంతో అందులో పత్రాలు పరిశీలించి వీడియో తీశారు. ఇక మిగతా రెండు గదుల తాళాలు కనిపించలేదు. ఆ తాళాలను పగులగొట్టడం లేదా మారుతాళంతో తీయాలని ప్రయత్నాలు చేయగా వాటికి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ అంగీకరించలేదు. దీంతో తెరచిన గదులతో పాటు మిగతా రెండు గదులకు సీల్ వేశారు. తాళాలు తెరచుకోలేని విషయాన్ని కోర్టుకు విన్నవిస్తామని కలెక్టర్ తెలిపారు. కాగా ఈ తాళాలు తెరచుకోకపోవడంపై లక్ష్మణ్ కుమార్ తప్పుబట్టారు. ఓటింగ్ యంత్రాల స్ట్రాంగ్ రూమ్ తాళాలను కుట్ర ప్రకారమే తీయలేదని లక్ష్మణ్ ఆరోపించారు. కలెక్టర్ లేదా, అదనపు కలెక్టర్ వద్ద ఉండాల్సిన తాళం చెవులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కోర్టు ఆదేశించి ఆరు రోజులు గడిచినా అధికారులు స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు లేవని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. -
ధర్మపురి: స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్/ కరీంనగర్: ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతు వివాదంపై తెలంగాణలో ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతుపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో తెలపాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించింది. ఈ సందర్బంగా తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. 2018లో లక్ష్మణ్ కుమార్(కాంగ్రెస్)పై 441 ఓట్ల తేడాతో కొప్పుల ఈశ్వర్ గెలుపొందారు. కాగా, కొప్పుల విజయంపై లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు.. 2018 ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయని.. ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ రీకౌంటింగ్ కోసం కోర్టును ఆశ్రయించారు. 441 ఓట్ల తేడాతో తాను ఓటమిపాలు కావడంతో అవకతవకలు జరిగినట్టు ఆరోపించారు. దీంతో, మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని కోరారు. -
Karimnagar: ఉగాది వేళ.. జాతకాల్లో అదృష్టం వెతుక్కుంటున్న నేతలు
సాక్షి, కరీంనగర్: తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది. శోభకృత్ నామ సంవత్సరం సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ జాతకాన్ని కొత్త పంచాంగంలో వెతుక్కుంటున్నారు. ఈ ఉగాది సాధారణ ప్రజల కంటే.. రాజకీయ నాయకులకు ఎంతో కీలకమైంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థులు, ఈసారి ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకునే ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అధికార–ప్రతిపక్ష నేతలంతా నూతన పంచాంగంలో తమ జాతకాలలో ఆదాయ వ్యయాల మాట ఎలా ఉన్నా.. రాజ్యపూజ్యంపైనే కన్నేశారు. అవమానాల మాట పక్కనబెట్టి.. రాజ్యపూజ్యం దక్కుతుందా? లేదా అన్న అంశంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే.. కరీంనగర్: బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ తీగల వంతెన, ఎమ్మారెఫ్, స్మార్ట్ సిటీ పనులతో కరీంనగర్‌పై ఫోకస్ పెట్టారు. హిందుత్వం, మార్పు అన్న ఎజెండాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి పోటీ ఎదరవనుంది. బీజేపీ నుంచి కొత్త జయపాల్‌రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనవడు రోహిత్, నగరాధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వైస్సార్టీపీ నుంచి డాక్టర్ నగేశ్ బరిలో నిలవనున్నారు. చొప్పదండి: ప్రస్తుతం ఎమ్మెల్యే రవిశంకర్ (బీఆర్ఎస్)కు ఇంటిపోరు తప్పేలా లేదు. అదేపార్టీ నుంచి గజ్జెల కాంతం, కత్తెరపాక కొండయ్య, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ టికెట్ రేసులో ఉన్నారు. ఈసారి మేడిపల్లి సత్యం (కాంగ్రెస్) నుంచి గట్టి పోటీ ఇవ్వనున్నారు. బీజేపీ నుంచి బొడిగె శోభ, సుద్దాల దేవయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైఎస్సార్టీపీ నుంచి అక్కెనపల్లి కుమార్ బరిలో నిలవనున్నారు. మానకొండూరు: ఇక్కడ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్‌కు ఈసారి ఇంటి పోరు తీవ్రంగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఇక్కడే నుంచే పోటీ చేసిన ఓరుగంటి ఆనంద్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, బీజేపీ గడ్డం నాగరాజు, దరువు ఎల్లన్న బరిలో నిలవనున్నారు. హుజూరాబాద్: గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఈసారి బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సిరిసిల్ల: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌కు ప్రత్యర్థులు పెద్దగా లేరు. కాంగ్రెస్ నుంచి కె.కె.మహేందర్‌రెడ్డి మినహా ఇక్కడ ఆయనకు గట్టి వైరిపక్షం కానరావడం లేదు. ఈసారి బీజేపీ మాత్రం సెలబ్రెటీని రంగంలోకి దించుతారన్న ప్రచారం సాగుతోంది. రామగుండం: ప్రస్తుతం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు, ఈసారి కాంగ్రెస్ నేత ఠాకూర్ మక్కాన్ సింగ్ (కాంగ్రెస్) గట్టి పోటీ ఎదురవనుంది. వీరితోపాటు సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ (బీజేపీ) కూడా బరిలో ఉండటంతో పోరు రసవత్తరంగా మారనుంది. వేములవాడ: ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (బీఆర్ఎస్)కు చిరకాల ప్రత్యర్థి ఈసారి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ పేరు వినిపిస్తుండగా.. తాను స్వతంత్రంగానైనా పోటీచేస్తానని అదే పార్టీ నేత తుల ఉమ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నారైలు గోలి మోహన్ (ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు), మరో ఎన్నారై తోట రాంకుమార్ కూడా బరిలో నిలిచేందుకు ఆసక్తిగా ఉన్నారు. జగిత్యాల: డాక్టర్ సంజయ్ ఇప్పటికే వరుసగా గ్రామాల్లో పర్యటిస్తూ.. పల్లె నిద్ర పేరుతో ప్రజలకు చేరవవుతున్నారు. ఇక మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) కూడా పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల భోగశ్రావణి బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నారు. కోరుట్ల: ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు(బీఆర్ఎస్) వరుసగా అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు అంటూ పర్యటిస్తున్నారు. ఈసారి జువ్వాడి నర్సింగరావు (కాంగ్రెస్) గట్టి పోటీ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు. మార్పులు జరిగితే వీరిద్దరు కుమారులను బరిలో దింపుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ధర్మపురి: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)కు ఈసారి గట్టి పోటీ ఉంది. ఇక్కడ నుంచి అడ్లూరి లక్ష్మణ్ (కాంగ్రెస్), మాజీ ఎంపీ గడ్డం వివేక్ (బీజేపీ) కూడా బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. పెద్దపల్లి: ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి (బీఆర్ఎస్)కి సొంత పార్టీ నుంచే తీవ్ర పోటీ ఉంది. ఎమ్మెల్యే టికెట్ కోసం.. సొంత పార్టీకే చెందిన ఎన్నారై నల్ల మనోహర్‌రెడ్డి, జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత విజయరమణారావు నుంచి వీరికి గట్టి పోటీ ఎదురవనుంది. బీజేపీ నుంచి గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌రావు, గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీఎస్పీ నుంచి దాసరి ఉష బరిలో ఉన్నారు. మంథని: ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు (కాంగ్రెస్)కు, పుట్ట మధు (బీఆర్ఎస్)కు ఈసారి హోరాహోరీ పోరు నడవనుంది. ఇక్కడ వీరిద్దరు మినహా మూడో పార్టీ అభ్యర్థులెవరూ ఇంతవరకూ ఆసక్తి చూపలేదు. -
80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: కొప్పుల
హసన్‌పర్తి: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 80 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఆదివారం హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల రోస్టర్ విధానంలో మార్పు చేసి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో లూయిస్ బ్రెయిలీ విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, రాష్ట్ర దివ్యాంగుల సంస్థల చైర్మన్ కేతిరి వాసుదేవరెడ్డి, కుడా చైర్మన్ సుందర్రాజ్, జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు: కొప్పుల
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): ఎల్బీ స్టేడియంలో ఈనెల 21న క్రి స్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రి స్మస్ వేడుకలను తిలకించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కాగా, ఈ వేడుకల్లో పాల్గొనాలని మెథడిస్ట్ బిషప్ ఎంఏ డేనియల్ను కొప్పుల ఈశ్వర్ ఆహ్వానించారు. ఈ మేరకు అబిడ్స్ చాపల్ రోడ్డులోని బిషప్ హౌస్‌కు మంత్రి హాజరై ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. క్రైస్తవుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలపట్ల బిషప్ డేనియల్ సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజుసాగర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనార్టీ కార్పొరేషన్ ఎండీ క్రాంతి వెస్లీ, చర్చి ఫాదర్లు పాల్గొన్నారు. -
CM KCR: జగిత్యాలకు సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు(బుధవారం) జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు కేసీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్‌రావు, గంగుల కమలాకర్ పూర్తిచేశారు. సాయంత్రం ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపుగా 2 లక్షల మందిని సీఎం సభకు సమీకరించేందుకు స్థానిక నేతలు ఏర్పాట్లు చేశారు. జగిత్యాల సభలో సీఎం కేసీఆర్ చేసే ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు వరుసగా దాడులు, నోటీసులు జారీ చేయడంపై ముఖ్యమంత్రి మండిపడే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 11న కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణను ఎదుర్కోనున్న నేపథ్యంలో ఈ సభలో సీఎం ఏం మాట్లాడబోతున్నారన్న దానిపై నాయకులు, ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. జగిత్యాల అసెంబ్లీ స్థానం కూడా నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంటు పరిధిలో వస్తుండటంతో సభకు సంబంధించిన ఏర్పాట్లలో ఎమ్మెల్సీ కవిత కూడా తలమునకలయ్యారు. సీఎం కేసీఆర్ పర్యటన వివరాలు ►బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరుతారు. ►12.35 గంటలకు జగిత్యాల సమీకృత కలెక్టరేట్ సమీపంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►12.40 గంటలకు జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం ►ఒంటి గంటకు మెడికల్ కళాశాల భవనం, మధ్యాహ్నం 1.15 గంటలకు జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం ప్రారంభం ►3.10 గంటలకు మోతె గ్రామంలో బహిరంగసభ ►సాయంత్రం 6 గంటలకు కరీంనగర్‌కు బయలుదేరి తీగలగుట్టపల్లిలోని ఆయన నివాసానికి చేరుకుంటారు. ►మరునాడు ఉదయం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌ను ప్రారంభించి, అనంతరం మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూతురు వివాహవేడుకకు హాజరుకానున్నారు. ఆ తరువాత కరీంనగర్‌లోని తీగలబ్రిడ్జి, మానేరు రివర్‌ఫ్రంట్ పనులను పరిశీలిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు హెలికాప్టర్లో తిరుగుప్రయాణం కానున్నారు. -
ఏప్రిల్‌లో అంబేడ్కర్ భారీ విగ్రహం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ తీరంలో నిర్మిస్తున్న 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని వచ్చే ఏప్రిల్‌లో ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి నాటికి విగ్రహం ఏర్పాటు పనులు పూర్తి అవుతున్నందున, ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున పర్యాటకుల వీక్షణకు వీలుగా విగ్రహాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. సోమవారం విగ్రహం ఏర్పాటు పనులను మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ భారీ విగ్రహాన్ని ఢిల్లీలో పద్మభూషణ్ పురస్కార గ్రహీత, శిల్పి రాంసుతార ఆధ్వర్యంలో తయారు చేసినట్లు చెప్పారు. తరలింపునకు వీలుగా ముక్కలుగా రూపొందించిన విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడి వేదికపై పేర్చి అతికిస్తున్నట్లు తెలిపారు. మొత్తం పదకొండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందని మంత్రులు వెల్లడించారు. దిగువ పార్లమెంటు ఆకృతిలో నిర్మించిన భవనంలో అంబేడ్కర్ జీవిత చరిత్రను ప్రతిబింబించే ఫొటో గ్యాలరీ, ఆడిటోరియం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఇంకా అంబేడ్కర్‌కు సంబంధించిన చిత్రాలు, పార్లమెంటులో ఆయన ప్రసంగించిన వీడియోలను ప్రదర్శించేందుకు మినీ థియేటర్ కూడా ఉంటుందని తెలిపారు. ఈ భవనం మీద అంబేడ్కర్ విగ్రహం ఉంటుందని చెప్పారు. -
నిజాన్కి నేనే గెల్సిన.. రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే..
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ల బొందలగడ్డ దిక్కు బోయిండు. గాడ రొండం త్రాల బంగ్లల బేతాలుడుంటున్నడు. గా బంగ్ల ముంగట విక్రమార్కుడు మోటరాపిండు. ఆపి హారన్ గొట్టిండు. హారన్ సప్పుడినంగనే బేతా లుడు బంగ్లకెల్లి ఇవుతల కొచ్చిండు. మోట రెక్కి ఎన్క సీట్ల ఆరాంగ గూసున్నడు. గూసోంగనే విక్రమార్కుడు మోటర్ నడ్ప బట్టిండు. గప్పుడు ఎన్క సీట్ల గూసున్న బేతాలుడు – ‘‘నన్ను గూసుండ బెట్టుకోని గుంతలు, ఎత్తు గడ్డలు, కంకర తేలిన తొవ్వలని సూడకుంట మోటర్ నడ్పుతవు. ఒక్కోపారి ట్రాఫిక్ల ఇర్కపోతవు. కోపం గినొస్తె నువ్వు గాన్ని గీన్ని తిట్టొచ్చు. నీకు ఎటూ సుద్రాయించక పోవచ్చు. నీకు యాస్ట రాకుంట ఉండెతంద్కు గిప్పుడు నడుస్తున్న ఒక కత జెప్త ఇను. ‘‘నెల దినాల సంది మునుగోడుల నడ్సిన బైఎలచ్చన్ల బాగో తంకు పర్ద బడ్డది. పది మంత్రులు, తొంబైమంది ఎమ్మెల్యేలే గాకుంట ముక్యమంత్రి గుడ్క బాగోతమాడితె పదివేల చిల్లర ఓట్లతోని టీఆర్ఎస్ దిక్కుకెల్లి పోటి జేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెల్సిండు. అన్నా! నువ్వు గెల్సినందుకు పటాకులు గాలుస్తం. లడ్లు, కోవపేడలు పంచిపెడ్తం. మందు గొడ్తం. కోల్లు, మేకలు గోసి దావత్ జేసుకుంటం. పది లచ్చల రూపాయలు ఇయ్యే అని గాయిన దిక్కుకెల్లి పని జేసిన టీఆర్‌ఎసోల్లు అడిగిండ్ర’’ ని బేతాలుడు అన్నడు. ‘‘గాల్లు అడిగితె కూసుకుంట్ల రూపాయ లిచ్చిండా?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘వందల కోట్ల రూపాయలు కర్సు జేస్తె కింద మీద బడి బై ఎలచ్చన్ల గెల్సిన. ఇంతకుముందు మీరు అడి గట్లిస్తె కడిగి నట్లయింది. ఇంక పైసలు యాడికెల్లి దేవాలె. ఎంత గనం తన్లాడినా కమస్కం నల్ఫై వేల ఓట్ల మెజార్టి రానందుకు కేసీఆర్ నారాజైండు అన్కుంట గాయిన మొత్తుకుండు.’’ ‘‘బీజేపీ దిక్కు కెల్లి నిలబడ్డ రాజగోపాల్ రెడ్డి ఏమన్నడు?’’ ‘‘కింద బడ్డా మీది కాలు నాదే. న్యాయం నా దిక్కే ఉన్నది. టీఆర్ఎస్కు ఓటు ఎయ్యకుంటె పింఛన్లు ఇయ్యమని బెదిరిచ్చిండ్రు. తొండి జేసి గెల్సిండ్రు. నిజం జెప్పాలంటె నేనే గెల్సిన అన్నడు.’’ ‘‘గీ ఎలచ్చన్ల బాగోతంల బుడ్డర్ ఖాన సుంటి కె.ఎ. పాల్ ఏమన్న అన్నడా?’’ ‘‘నూరుకు అర్వై ఓట్ల లెక్కన నాకు ఓట్లు వొస్తయి. గని టీఆర్ఎస్, బీజేపీలు ఈవీఎంల తోని తోతిరి జేసినయి. ఈవీఎంలు వొద్దంటె గా రొండు పార్టిలు అడ్డంబడి నన్ను గెల్వకుంట జేసినయి. నిజాన్కి నేనే గెల్సిన. ఇయ్యాల గాకున్నా రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే అని కె.ఎ. పాల్ అన్నడు. ఎలచ్చన్లు గిప్పటి తీర్గ గాకుంట హర్రాజ్ తోని బెట్టాలె. ఎవ్వలు అందరికన్న ఎక్వ కోట్లు పంచి పెట్టుడే గాకుంట కోట్ల రూపాయల మందు బోపిచ్చెతందుకు ముంగట్కి వొస్తరో గాల్లే గెల్సినట్లు సాటి య్యాలని సర్కార్ అనుకుంటున్నది. కోట్ల రూపాయలు కర్సు బెట్ట కుండుడే గాకుంట మందు బోపియ్యనోల్లకు ఎలచ్చన్ల పోటి జేసే హక్కు ఉండదని జెబ్దామనుకుంటున్నరు. ఓటుకు నాల్గు వేలు ఇస్త మని మూడు వేలే ఇచ్చిండ్రు. కడ్మ వెయ్యి ఎప్పుడిస్తరని కొందరు లొల్లి బెట్ట బట్టిండ్రు’’ ‘‘గింతేనా ఇంకేమన్న ఉన్నదా?’’ ‘‘సార్ మీరు రాజినామ జెయ్యుండ్రి. రాజినామ జేస్తె మును గోడు లెక్క బై ఎలచ్చన్లొస్తయి. సర్కార్ పైసలు మంజూరు జేస్తది. దాంతోని మా పరిగి మంచిగైతది అన్కుంట పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డికి ఒకడు ఫోన్ గొట్టిండు. అన్నా! పౌరన్ నువ్వు మంత్రి కుర్సికే గాకుంట ఎమ్మెల్యేకు నువ్వు రాజినామ జేసి బై ఎలచ్చన్లు తేయే. నువ్వు రాజినామ జేస్తె ధర్మపురి నియోజక వర్గమే గాకుంట మా బత్కులు బాగై తయే అన్కుంట బతికెపల్లి కెల్లి రమేశ్ అనెటోడు మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఫోన్ గొట్టిండు. అచ్చెమ్మ పెండ్లి బుచ్చెమ్మ సావు కొచ్చిన తీర్గ మునుగోడు బై ఎలచ్చన్లు మా పానం మీదికొ చ్చిందే అన్కుంట మంత్రి మొత్తుకుండు. మునుగోడు ఎలచ్చన్ల నేనే గెల్సిన అని కూసుకుంట్ల అన్నడు. న్యాయంగ జూస్తె నేనే గెల్సిన అని రాజ గోపాల్ రెడ్డి అంటె గీల్లిద్దరు గాదు నేనే గెల్సిన అని కె.ఎ. పాల్ అంటున్నడు. ఇంతకు ఎవ్వలు గెల్సిండ్రు. ఎవ్వలు ఓడిపోయిండ్రు . గీ సవాల్‌కు జవాబ్ జెప్పకుంటివా అంటె నీ మోటర్ గుంతల బడ్తది’’ అని బేతాలుడన్నాడు. ‘‘మునుగోడుల మందు, మనీ గెల్సింది. జెనం ఓడి పోయిండ్రు’’ అని విక్రమార్కుడు జెప్పిండ్రు. బొందల గడ్డ రాంగనే బేతాలుడు మోటర్ దిగి ఇంటికి బోయిండు. (క్లిక్: ఓట్ల పండ్గ ఎట్లైంది.. మునుగోడుల ధూమ్‌దామ్గ జేస్కుండ్రు) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
డిసెంబర్ నాటికి అంబేడ్కర్ విగ్రహ పనులు పూర్తి
ఖైరతాబాద్: నగరంలో ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో నిర్మించ తలపెట్టిన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ తయారీ పనులను సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో శాసన సభ్యుల బృందం బుధవారం పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించనున్న గౌరవమన్నారు. డిసెంబర్ నాటికి విగ్రహ తయారీ పనులు పూర్తవుతాయన్నారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదన అభినందనీయమన్నారు. అందుకు అనుకూలంగా తెలంగాణ శాసనమండలి తీర్మానం హర్షనీయమన్నారు. పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టే విషయంపై బీజేపీ క్లారిటీ ఇవ్వాలన్నారు. ఇదే అంశంపై బీజేపీ పాలిత రాష్ట్రాల వైఖరిని వెల్లడించాలన్నారు. రాష్ట్రానికి వచ్చిన బీజేపీ కేంద్ర మంత్రులు తమ వెంట తెచ్చుకున్న ఆహారం తిన్నారు తప్పితే దళితుల ఇంట్లో అన్నం తినలేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలు అంబేద్కర్ విగ్రహానికి దండలు వేయడం తప్ప దళిత వర్గాలకు చేసింది ఏమీ లేదన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, చిరుమర్తి లింగయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
దళితబంధుతో నిరుపేదల జీవితాల్లో వెలుగు
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం మరిన్ని కుటుంబాలకు వర్తించేలా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం.. నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ ఎల్.రమణతో కలసి మీడియాతో మాట్లాడారు. దళితబంధు పథకం అమలుకోసం ఇప్పటి వరకు రూ. 3,249 కోట్లను వెచ్చించామని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న దళితబంధును దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని, దేశంలోని దళితులందరికీ ఈ పథకాన్ని అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితబంధుపై దుష్ప్రచారం చేయడం సరికాదని, బీజేపీ ఉచితాల రద్దు పేరుతో దళితబంధును కూడా లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తమ మేనిఫెస్టోలో దళితబంధు పథకాన్ని పెట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్న హామీ ఇవ్వాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగి పోయాయని, సామాజిక బహిష్కరణలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో దళితులపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. -
మంత్రి కొప్పుల పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: ధర్మపురి శాసనసభ ఎన్నికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మంత్రి ఈశ్వర్ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈశ్వర్ తరఫు న్యాయ వాదుల వాదనతో ఏకీభవించని ధర్మాసనం పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. 2018లో ధర్మపురి ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో వీవీ ప్యాట్లు లెక్కించకుండానే కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు ప్రకటించడం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకమంటూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కొట్టివేయాలన్న ఈశ్వర్ అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు జూన్ 28, 2022న కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ ఈశ్వర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా తెలంగాణ మంత్రికి నిరాశ మిగిలింది. సుప్రీంకోర్టు తీర్పుపై అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కేబినెట్ హోదా మంత్రికి ప్రజలపై బాధ్యత ఉండాలని లక్ష్మణ్ తెలిపారు. కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి అనుభవించే హక్కు లేదని.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
దళితబంధుతో 17లక్షల కుటుంబాల్లో వెలుగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధుతో రాష్ట్రంలోని 17 లక్షల కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళితబంధు లాంటి బృహత్తరమైన, విప్లవాత్మకమైన పథకం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదన్నారు. ఈ పథకం అమలు విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని, ఎవరూ కూడా అయోమయానికి, గందరగోళానికి గురి కావొద్దని సూచించారు. దళితబంధును ముఖ్యమంత్రి కేసీఆర్ యజ్ఞంలా దృఢ సంకల్పంతో అమలు చేస్తున్నారన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 యూనిట్లకు సంబంధించి మొత్తం 11 వేల 500 పూర్తి కాగా, మిగిలిన 335 యూనిట్ల గ్రౌండింగ్ నాలుగైదు రోజుల్లో పూర్తవుతుందని, అసెంబ్లీ నియోజకవర్గానికి 1,500 యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని కొప్పుల తెలిపారు. వచ్చే ఎనిమిదేళ్లలో మొత్తం 17 లక్షల ఎస్సీ కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని, వారి జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయని ఆకాంక్షించారు. -
పొలం బాట పట్టిన మంత్రి కొప్పుల ఈశ్వర్.. ఎరువు చల్లి, నారు వేసి
సాక్షి, పెద్దపల్లి: సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం పొలంబాట పట్టారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి శివారులో గాగిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి తన పొలంలో నాటు వేస్తుండగా.. అటుగా వెళ్తున్న మంత్రి నేరుగా ఆయన పొలంలో దిగారు. లుంగి ధరించి రైతుతో కలిసి గొర్రు (జంబూ) కొట్టారు. పొలం మడిలో రసాయన ఎరువు చల్లారు. నారును మహిళా కూలీలకు అందించారు. మహిళలతో కలిసి సుమారు అరగంటపాటు నాటు వేశారు. అప్పటికే మధ్యాహ్నం కావటంతో కూలీలతోనే కలిసి భోజనం చేశారు. అక్కడినుంచి ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన ఎర్రగుంటను పరిశీలించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ రైతుల కోసం రాష్ట్రప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తోందని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతోందని, పెట్టుబడి సాయం కింద రైతుబంధు అందిస్తున్నామని వెల్లడించారు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ ఎంపీ అరెస్ట్ -
సీఎం ప్రశ్నలకు బీజేపీ బదులివ్వాలి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు లేవనెత్తిన ప్రశ్నలకు ముందుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం బదులివ్వాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఆ తర్వాతే ఇతర అంశాలపై మాట్లాడాలని హితవు పలికారు. సీఎం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా, ఆలయాల అంశాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ నాయకులు అర్థంపర్థం లేకుండా మాట్లాడటాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ నేతలకు క్షుద్ర రాజకీయాలు తప్ప, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల బాగోగుల గురించి ఏ మాత్రం పట్టింపు లేదని విమర్శించారు. కేంద్రం నుంచి రూపాయి కూడా తెచ్చే తెలివి లేని నేతలు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. తమకు గిట్టని నాయకులపై ఐటీ, ఈడీ, ఐబీ, సీబీఐలను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేయడం బీజేపీకి పరిపాటి అయ్యిందన్నారు. దాడులతో నేతలను లొంగదీసుకోవడం, ప్రభుత్వాలను పడగొట్టడమే ఆ పార్టీ జాతీయ నాయకత్వం లక్ష్యమని మండిపడ్డారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసిన బీజేపీ నాయకులకు ప్రజాస్వామ్యమంటే కనీస గౌరవం లేదన్నారు. -
విద్య, వైద్యంలో అద్భుతాలే లక్ష్యం
సిరిసిల్ల/మెట్పల్లి(కోరుట్ల): విద్య, వైద్యరంగాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మూడేళ్లలో అద్భుత ఫలితాలు సాధిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో చల్మెడ జానకీదేవి పేరుతో రూ.2కోట్లతో నిర్మించిన స్కూల్ భవనాన్ని శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలసి ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ‘మన ఊరు.. మన బడి’లో రూ.7,300 కోట్లతో 2,600 స్కూళ్లలో 12 రకాల వసతులు కల్పించి ఇంగ్లిష్ మీడియంగా మార్చుతున్నామని వివరించారు. ఇటీ వల అమెరికా వెళ్లినప్పుడు అనేక మంది ప్రవా సులు సొంతూళ్లలో తమ పూర్వీకుల పేరిట స్కూల్ భవనాలు కట్టించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పా రన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్ ఆర్)లో భాగంగా అనేక కార్పొరేట్ సంస్థలు పేద లకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్ల డించారు. కాగా, వేములవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మధ్యమానేరు ముంపు గ్రామాల్లో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు డెక్కన్ అగ్రి రిసోర్సెస్ కంపెనీతో ఎంవోయూ పూర్తిచేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్దే విజయం రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్దే విజయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌తో కలసి పాల్గొన్నా రు. కాంగ్రెస్‌కు కుల, బీజేపీకి మత రాజకీయాలు చేయడం తప్ప అభివృద్ధిపై వాటికి చిత్తశుద్ధి లేదని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ చిల్లర మాటలతో గల్ఫ్ దేశాల్లోని లక్షలాది మంది భారతీయుల జీవి తాలు ప్రమాదంలో పడ్డాయన్నారు. కాగా, మెట్లచి ట్టాపూర్లో రూ.160 కోట్ల పెట్టుబడితో ధాత్రి, రూ.1,060 కోట్ల పెట్టుబడితో భువి బయో సంస్థలు ఏర్పాటు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోరుట్ల లో వీఫై ఐటీ సంస్థ ఏర్పాటు చేసే కాల్‌సెంటర్ ఒప్పందపత్రాలను యజమానులకు అందజేశారు. -
చిన్న చిన్న రోల్స్ చేసుకునే నన్ను హీరోగా చేశారు
‘‘ధర్మపురి పేరుతో జగత్గారు సినిమా తీశారని తెలియగానే ఆశ్చర్యం కలిగింది. గోదావరి తీరాన పురాతనమైన ధర్మపురి గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఆలయం పేరుతో వస్తున్న ‘1996 ధర్మపురి’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘1996 ధర్మపురి’. శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి దర్శకుడు మారుతి, నిర్మాతలు వై.రవి శంకర్, యస్.కె.యన్, సెవెన్ హిల్స్ సతీష్, రచయిత డార్లింగ్ స్వామి, నటుడు జీవీ అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘‘జగత్ కథ చెప్పిన రోజే ఈ సినిమా అందరి హృదయాలకి దగ్గరవుతుందనిపించింది’’ అన్నారు. ‘‘మా సినిమాను సపోర్ట్ చేస్తూ రిలీజ్ చేస్తున్న ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ వారికి, గీతా ఆర్ట్స్ వారికి థ్యాంక్స్’’ అన్నారు చిత్ర నిర్మాత భాస్కర్. ‘‘ప్రస్థానం’తో నా జర్నీ స్టార్ట్ అయ్యింది. ‘1996 ధర్మపురి’ చాలా బాగా వచ్చింది’’ అన్నారు జగత్. ‘‘చిన్న చిన్న రోల్స్ చేసుకునే నన్ను హీరోగా చేసి, నా ప్రతిభని బయటకు తీసిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు గగన్. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1271266370.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: మాటల్లో చెప్పలేని తిట్లు, భౌతిక దాడి చేసింది.. వాపోయిన హీరో నన్ను గర్భవతిని చేసి మోసం చేసింది ఆ డైరెక్టర్ కాదు! -
మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ లౌకికవాద రాష్ట్రంగా విరాజిల్లుతోందని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రంజాన్ మాసంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకొనేలా ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో... మంత్రులు, ఎమ్మెల్యేలు, పలు ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెల 3నుంచి మొదలయ్యే రంజాన్ మాసం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, మసీదులు, ఈద్గాలకు మరమ్మతులు చేసి, అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఉపవాస దీక్షల్లో ఉండే వారికి అవసరమైన నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చూడాలని, రాత్రి వేళల్లో హోటళ్లు, దుకాణాలను మూసేయించొద్దని సూచించారు. -
17 లక్షల కుటుంబాలకు దళితబంధు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోని దాదాపు 17 లక్షల కుటుంబాలకు దళితబంధు పథకం అందుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని అంబేద్కర్ మైదానంలో 393 మంది దళితబంధు లబ్ధిదారులకు 202 వాహనాల (202 యూనిట్లుగా, 76 హార్వెస్టర్లు, 12 జేసీబీలు, 15 డీసీఎం వ్యాన్లు, 10 వరినాటు యంత్రాలు, 4 టిప్పర్లు, 3 మినీ బస్సులు, 2 టాటా హిటాచీ ఎక్స్కెవేటర్లు, 1 మహీంద్రా స్కార్పియో, 79 గూడ్స్ వాహనాలు)ను మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ దళితుడు లక్షాధికారి కావాలన్న కేసీఆర్ సంకల్పానికి ఈ పథకం నిదర్శనమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రూ.38 కోట్లకుపైగా విలువైన వాహనాలను కానుకగా ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్‌జెండర్లలో మార్పు రావాలి: కొప్పుల
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్జెండర్ల వ్యవహార శైలిలో మార్పు రావాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ట్రాన్స్జెండర్ల సంక్షేమంపై వివిధ స్వచ్ఛంద సంస్థలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తల్లిదండ్రులు, కుటుంబానికి దూరంగా ఉంటూ కష్టాలు పడుతున్న ట్రాన్స్జెండర్లపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారన్నారు. భిక్షాటన నివారణకు, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రత్యేక కార్యక్రమాల ద్వారా స్వయం ఉపాధిని పెంపొందిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. -
దళితబంధును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి: మంత్రులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. అరణ్యభవన్‌లో ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల అధికారులతో ఆయన గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గానికి దళితబంధు పథకం కింద వంద యూనిట్లు మంజూరు చేశామన్నారు. ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక వేగంగా పూర్తి చేసి, జాబితాలను ఉన్నతాధికారులకు ఇవ్వాలన్నారు. పథకం పురోగతిపై రాష్ట్రస్థాయిలో, జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని, లబ్ధిదారుల పరిస్థితి, యూనిట్ల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. మార్చి నెలాఖరు నాటికి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వక్ఫ్ బోర్డ్, ఎస్సీ కార్పొరేషన్ల చైర్మన్లు మహ్మద్ సలీం, బండా శ్రీనివాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, కమిషనర్ యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ స్మృతివనాన్ని అపవిత్రం చేశారు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని (125 అడుగులు) నిర్మించే ప్రాంతాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శించి అపవిత్రం చేశారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. దళిత వ్యతిరేక విధానంతో మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న అగ్రవర్ణాల పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. అంబేడ్కర్ స్మృతివనాన్ని సంజయ్ సందర్శించి వెళ్లాక పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, టీఆర్ఎస్ సీనియర్ నేత నారదాసు లక్ష్మణ్ రావులతో కలిసి కొప్పుల మీడియాతో మాట్లాడారు. ఒకవైపు 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణ దశలో ఉంటే ఇక్కడికి వచ్చి తలతోక లేకుండా సంజయ్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఈ ఏడాది ఆఖరులోగా అంబేడ్కర్ విగ్రహంతో పాటు లైబ్రరీని ప్రారంభిస్తామని పునరుద్ఘాటించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై కేసులు పెరిగాయన్నారు. ‘రాష్ట్రంలో ప్రతి దళితుడి గుండెచప్పుడు కేసీఆర్. దళితబంధు పథకంతో 15 లక్షల దళిత కుటుంబాల దారిద్య్రాన్ని పోగొట్టేందుకు కృషి చేస్తున్నారు’అని చెప్పారు. అంబేడ్కర్‌ను అవమానించిన చరిత్ర బీజేపీదని వెంకటేశ్ నేత విమర్శించారు. ఎంపీలు అరవింద్, రవికిషన్ (గోరఖ్‌పూర్) దళితులను అవమానపరుస్తూ మాట్లాడారని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ పేరెత్తే అర్హత సంజయ్‌కు లేదన్నారు. దేశంలో దళితుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. -
తెలంగాణ గొప్ప లౌకిక రాష్ట్రం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే గొప్ప లౌకిక రాష్ట్రంగా తెలంగాణ ముందుకెళ్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతోపాటు పలు అంశాల్లో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ యజ్ఞయాగాలు చేస్తున్నా, యాదాద్రి ఆలయాన్ని గొప్పగా నిర్మిస్తున్నా, అన్ని కులాలు, మతాలు, వర్గాలపట్ల ఏ మాత్రం వివక్ష కనబర్చకుండా సమదృష్టితో ముందుకు సాగుతున్నారని అన్నారు. పలువురు క్రిస్టియన్ ప్రముఖులు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ నాయకత్వంలో మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏడున్నరేళ్ల ఈ చిన్న రాష్ట్రంలో శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, వాతావరణంపట్ల ఆకర్షితులైన పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం పైసా నిధులివ్వకుండా, కేవలం మాటలు, ప్రశంసలతోనే కాలం వెళ్లదీయడమేకాకుండా పలు విషయాల్లో అడ్డుతగులుతోందని విమర్శించారు. కేటీఆర్‌ను కలిసినవారిలో ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, స్టీఫెన్సన్, ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్‌రావు, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ఫుడ్ కమిషన్ సభ్యుడు ఆనంద్, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎం.డి. కాంతివెస్లీ తదితరులు ఉన్నారు. -
‘లాభాల్లో ఉన్న సింగరేణిని ప్రైవేటుపరం చేస్తారా?’
సాక్షి, హైదరాబాద్: లాభాలు, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో బీజేపీ చెప్పాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి కొప్పుల మీడియాతో మాట్లాడారు. కొత్త బ్లాకులు తవ్వుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోగా.. ఉన్న బ్లాకులను ప్రైవేటు పరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సింగరేణి కార్మికులు పోరాడాలని కొప్పుల పిలుపునిచ్చారు. బాల్క సుమన్ మాట్లాడుతూ సింగరేణిని బొంద పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, సింగరేణిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రధానికి లేఖ రాసినా స్పందన లేదన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని గండ్ర డిమాండ్ చేశారు. -
దివ్యాంగులకు ప్రభుత్వం పూర్తి భరోసా
గన్‌ఫౌండ్రీ: రాష్ట్రప్రభుత్వం దివ్యాంగులకు పూర్తి భరోసా ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రవీంద్రభారతిలో వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా అత్యధిక పెన్షన్లను దివ్యాంగులకు అందజేస్తున్నట్లు చెప్పారు. అలాగే పలు సంక్షేమ పథకాలు, క్రీడారంగం, పలు విభాగాల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్రంలో 5 లక్షలకు పైగా వికలాంగులకు రూ.18 కోట్లతో ఏటా పెన్షన్లను అందిస్తున్నట్లు తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ, వికలాంగుల సంక్షేమ శాఖను వేరు చేయాలనే ప్రతిపాదనను మంత్రిమండలికి సిఫారసు చేస్తానని కొప్పుల హామీ ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ వికలాంగులకు అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజ్ పాల్గొన్నారు. -
గురుకులాల్లో ‘పాఠశాల ప్రగతి’
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించే దిశగా సంక్షేమశాఖలు నడుంబిగించాయి. చెట్లు నాటడం, పారిశుధ్యం, వ్యర్థాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు వచ్చే శనివారం నుంచి కార్యాచరణ మొదలుపెట్టనున్నాయి. ఇందులో భాగంగా ‘పాఠశాల ప్రగతి’పేరిట కొత్త కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. ముందుగా మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 204 మైనార్టీ గురుకుల విద్యాసంస్థల్లో ప్రతి శనివారం ‘పాఠశాల ప్రగతి’పేరిట కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ప్రతి విద్యార్థికి ్రప్రకృతిపట్ల అవగాహన, వనరుల ఆవశ్యకతపై చైతన్యాన్ని కలిగిస్తారు. చెట్లు నాటడం, వాటిని సంరక్షించడం, పారిశుధ్యం, వ్యర్థాల వినియోగంపై అవగాహన కల్పించడంతోపాటు ప్రయోగాత్మక కార్యక్రమాలు చేపడతారు. ప్రతి విద్యార్థికి సామాజిక స్పృహపట్ల విశ్వాసాన్ని కల్పిస్తారు. దీనికిగాను ప్రత్యేకంగా ఓ ఉపాధ్యాయుడికి బాధ్యత అప్పగించాలని మంత్రి ఈశ్వర్ సొసైటీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్సీ గురుకుల సొసైటీలో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి ‘సాక్షి’కి తెలిపారు. -
ఈటల వంద శాతం గెలవడు: కొప్పుల ఈశ్వర్
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): సీఎం కేసీఆర్ పాలనలో రైతుల సాగునీటి, కరెంటు కష్టాలు తీరాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలోని కేశవాపూర్‌లో కౌన్సిలర్ పాతకాల రమేశ్ ఆధ్వర్యంలో కనకదుర్గా మాత దేవాలయ నిర్మాణానికి మంత్రి ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పనులకు అవసరమైన రూ.10 లక్షల ప్రొసీడింగ్స్ అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ వంద శాతం గెలవడని, ఒకవేళ గెలిచినా ఉత్త ఎమ్మెల్యేనే అవుతారని పేర్కొన్నారు. రైతులు సీఎం కేసీఆర్‌కు మద్దతుగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించాలని కోరారు. ఈసారి రాష్ట్రంలో అన్నదాతలు 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, భారీగా వరి ధాన్యం చేతికి వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులకు లబ్ధి చేయని బీజేపీలో ఈటల చేరారని పేర్కొన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జమ్మికుంట పట్టణంలో చేయని అభివృద్ధిని తాజాగా చేసి చూపించామని తెలిపారు. అభివృద్ధి పనులే లక్ష్యంగా తాను జమ్మికుంటలోని ప్రతీ వార్డులో తిరుగుతున్నానని చెప్పారు. సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పురపాలక సంఘం చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు టంగుటూరి రాజ్‌కుమార్, కౌన్సిలర్లు రావికంటి రాజ్‌కుమార్, పొనగంటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. చదవండి: సెంటిమెంట్ డైలాగులు కడుపు నింపవు -
కోపంతో చేతిలోని ఫోన్ విసిరిన మంత్రి కొప్పుల ఈశ్వర్
హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 21వ వార్డులో సోమవారం దళితబంధు సర్వే పర్యవేక్షణకు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓ అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మంత్రుల కన్నా మీరే బిజీగా ఉంటున్నారా..? మంత్రి రాకపై ముందే సమాచారం ఇచ్చినా.. కనీస ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటారా’అని అసహనం వ్యక్తం చేశారు. ముందుగానే సమాచారం ఇచ్చి, దళితబంధు గురించి మాట్లాడడానికి వస్తున్నానని తెలిపినా.. పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. అధికారులు ఇచ్చిన వివరణ సరిగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ఏర్పాట్లు సరిగా చేయలేదని ఒకవైపు కొప్పుల నిలదీస్తుండగానే ఆ అధికారి మంత్రి మాటలను పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతుండడంతో కొప్పుల మరింత సీరియస్ అయ్యారు. చేతిలోని సెల్‌ఫోన్‌ను విసిరి సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మంత్రి కొప్పుల ఒక్కసారిగా అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేతిలోని ఫోన్ విసిరివేయడం చర్చనీయాంశంగా మారింది. (చదవండి: ఉద్రిక్తతకు దారితీసిన ‘జెండా గద్దె పంచాయితీ’) (చదవండి: ‘దళితబంధు’ను అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటా) -
బహిరంగ చర్చకు సిద్ధమా..? మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్
సాక్షి, కరీంనగర్: బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టే బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలు వారి పార్టీలకు అధ్యక్షులు అయ్యారన్నారు. సంక్షేమ ఫలాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మంత్రి సవాల్ విసిరారు. అధికారం కోసం బీజేపీ పాకులాడుతుందని ఆయన దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడతారో ఆయనకు కూడా తెలియదని నిప్పులు చెరిగారు. గతంలో తెలంగాణ కోసం తాము రాజీనామా చేస్తే.. బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పదవులు ముఖ్యం అయ్యాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఇవీ చదవండి: క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పదవికి కోదండరెడ్డి రాజీనామా మన బడి నాడు-నేడు: టీచర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా -
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరోనా బారిన పడ్డారు. ఆదివారం నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. పాజిటివ్‌గా తేలిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన తన భార్యతో కలిసి హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని, పరీక్షలు చేయించుకుని జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. తెలంగాణలో కొత్తగా 4,976 కేసులు తెలంగాణలో కొత్తగా 4,976 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది. గత 24 గంటల్లో కోవిడ్ నుంచి 7,646 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 60,757 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక 24 గంటల్లో కరోనాతో 35 మరణాలు చోటు చేసుకోగా.. మొత్తంగా 2,739 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీలో 851, రంగారెడ్డి జిల్లాలో 417 ఉన్నాయి. -
వాలెంటైన్స్ డే: మంత్రి కొప్పుల ఈశ్వర్ లవ్ స్టోరీ
► జగిత్యాల జిల్లాలో.. ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే, ప్రేమ విషయం పెద్దలకు చెప్పలేక యువతి ఉరివేసుకుంది. ఇది తెలిసి.. దుబాయ్‌లో ఉన్న ప్రియుడు ‘నువ్వు లేక నేను లేను’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ► పెద్దలు పెళ్లికి అంగీకరించరనే కారణంతో ఆ ప్రేమికులిద్దరూ కలిసి బావిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం వడ్లతండాలో చోటుచేసుకున్న ఘటన ఇది. ► నిజామాబాద్ జిల్లాలో.. వారిద్దరివీ వేర్వేరు కులాలు.. ప్రేమతో ఒక్కటవ్వాలనుకున్నారు. కానీ, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఒకరు.. కాదని మరొకరు అభిప్రాయ భేదాలకు గురై.. చివరకు ఇద్దరూ ఉరివేసుకున్నారు. కేవలం పెద్దలు పెళ్లికి అంగీకరించరనే భయంతోనే గడిచిన మూడు నెలల్లో పదిహేనుకుపైగా ప్రేమజంటలు ఆత్మహత్యలకు పాల్పడ్డాయి. చనిపోవడానికి కూడా ధైర్యం కావాలి.. అదే ధైర్యాన్ని వారు పెద్దల్ని ఒప్పించడానికి లేదా కలిసి బతకడానికి చూపాలని అంటున్నారు ఒకప్పటి ప్రేమికులు. కులమతాలు వేరైనా.. ‘ప్రేమ కోసం ధైర్యంగా నిలబడ్డాం. ఆ ధైర్యంతోనే ఇరుపక్షాల పెద్దల్ని ఒప్పించాం. ఇప్పుడెలాంటి స్పర్థలు లేకుండా ఆనందంగా ఉన్నాం’ అంటున్నాయి ‘ప్రేమ–పెళ్లి’లో సక్సెస్ అయిన జంటలు. నొప్పించకుండా పెద్దలను ఒప్పించగలగాలి.. అందుకోసం ఎన్నాళ్లైనా వేచిచూడగలగాలి.. ఇలాంటివి లోపించే నేటి ప్రేమలు విషాదాంతమవుతున్నాయని చెబుతున్న వీరు.. నాడు తామేం చేశామన్న సంగతిని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ తో పంచుకున్నారు. చనిపోవడానికైనా ధైర్యం కావాలి.. ఆ ధైర్యంతోనే కలిసి బతకొచ్చు ప్రేమలో సఫలం కావడానికి మేం చేసింది ఇదీ.. ‘ప్రేమికుల దినోత్సవం’ సందర్భంగా నాటి ప్రేమజంటలు చెబుతున్న సక్సెస్ స్టోరీస్ పెద్దల అంగీకారంతో.. జగిత్యాల: ‘ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. పెద్దల్ని ఒప్పించి చేసుకున్నా.. ఒకరినొకరు అర్థం చేసుకోవడమనేది ముఖ్యం’ అంటున్నారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు. 37 ఏళ్ల కిందట వీరు పెద్దల సమక్షంలో ఆషాఢమాసంలో కులాంతర వివాహం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన స్నేహలత తండ్రి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ఆ సమయంలో సింగరేణిలో పనిచేస్తూ కమ్యూనిస్ట్ పారీ్టలో ఉన్న కొప్పుల ఈశ్వర్ స్నేహలతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె అసలు పేరు కోకిలాదేవి. కమ్యూనిస్ట్ ఉద్యమ సమయంలో చనిపోయిన తన తోటి సహచరి స్నేహలత పేరును ఈశ్వర్ తన సతీమణికి పెట్టుకున్నారు. ఉద్యమం కలిపింది.. తొర్రూరు: ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు చెందిన సబీహాబాను, మహబాబూబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మంగళపల్లి శ్రీనివాస్ 25 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆదివాసీలు, గిరిజనుల సమస్యలపై శ్రీనివాస్‌తో కలిసి సబీహాబాను ఉద్యమాలు చేపట్టింది. ఆ ఉద్యమ సాహచర్యం కాస్తా ప్రేమ.. పెళ్లికి దారితీసింది. ఇంటర్ వరకు చదివిన సబీహాబానును హిందీలో పీజీ చదివించి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించేలా శ్రీనివాస్ సహకరించాడు. ప్రస్తుతం ఆమె చెర్లపాలెం ప్రభుత్వ పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేస్తున్నారు. శ్రీనివాస్ ప్రత్యక్ష రాజకీయాల్లో చేరి తొర్రూరు జెడ్పీటీసీగా గెలుపొందారు. వీరికి ఇంజనీరింగ్ చదివే వాసే, 9వ తరగతి చదివే అమన్ సంతానం. ‘ప్రేమించడం తప్పుకాదు. నేడు దాన్ని సాధించేందుకు ఎంచుకునే మార్గాలే అభ్యంతరకరంగా ఉంటున్నా’యనేది వీరిమాట. ఒప్పించే చేసుకున్నాం మంచిర్యాలటౌన్: ‘మాది ప్రేమ వివాహమే. అయితే పెద్దల్ని ఒప్పించి చేసుకున్నాం’ అంటున్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి. ‘మాది కర్ణాటకలోని బెల్గాం జిల్లా గోకాక్ గ్రామం. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్ ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీసర్కిల్‌లో 2002లో చేరాను. అప్పుడే ఏపీలోని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన సీవీ శంకర్‌రెడ్డి పరిచయమయ్యారు. మా ఇద్దరి భాషలు, రాష్ట్రాలు వేరు. అయినా ప్రేమ చిగురించింది. అయితే అది చదువుకు, లక్ష్యానికి అడ్డురాకూడదని నిర్ణయించుకున్నాం. 2002–03లో కోచింగ్ పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లాం. ప్రేమ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పాం. అలా పెద్దలను ఒప్పించి 2007లో పెళ్లి చేసుకున్నాం. 2009లో ఐపీఎస్‌కు, 2010లో ఐఏఎస్‌కు ఎంపికయ్యా. ఆయనకు తెలంగాణ టూరిజంలో ఉద్యోగం వచి్చంది. ప్రస్తుతం ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరక్టర్. ఇప్పుడు మాకో పాప. పేరు ఆధ్య. మా అత్తగారు నన్ను కోడలిగా కాకుండా కూతురుగా చూసుకుంటుంది. అలాంటి మంచి కుటుంబాన్ని నా భర్త అందించారు. ఒప్పించడానికి నాలుగేళ్లు.. కోదాడ: ‘ప్రేమించినంత తేలిక్కాదు తల్లిదండ్రులను ఒప్పించడం. అందుకు ఓపికుండాలి.. నమ్మివచ్చిన భాగస్వామికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. మేం ప్రేమ వివాహం చేసుకున్నాక తల్లిదండ్రులను ఒప్పించడానికి నాలుగేళ్లు పట్టింది. అందరం కలిసిపోయాం. పిల్లలతో ఆనందంగా ఉన్నా’మని చెబుతున్నారు కోదాడకు చెందిన కందుల మధు– విజయలక్ష్మి దంపతులు. ఉస్మానియా యూనివర్సిటీలో 2010లో ఎంబీఏ చదివే రోజుల్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సామాజికవర్గాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల తరువాత వీరి అన్యోన్య దాంపత్యాన్ని చూసిన ఇరుపక్షాల పెద్దలు ఇప్పుడు దగ్గరయ్యారు. నలభై ఐదేళ్ల క్రితం.. డోర్నకల్: ‘నలభై ఐదేళ్ల క్రితం.. ఇప్పటితో పోలిస్తే ఆ కాలంలో కట్టుబాట్లు ఎక్కువ. పెద్దలు కొందరు సరేనన్నారు. మరికొందరు కాదన్నారు. అయినా ధైర్యంగా పెళ్లి చేసుకుని నిలబడ్డాం’ అంటున్నారు డోర్నకల్ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన దేవకృపామణి, ఉప్పరి నారాయణ. వీరి కులమతాలు వేర్వేరు. పక్కపక్కిళ్లలో ఉండటం, ఒకే పాఠశాల, కళాశాలలో చదువుతున్న క్రమంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటామంటే ఇరుపక్షాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పెళ్లి చేసుకుని ఒక్కటవ్వడమే కాక.. అందరినీ మెప్పించాలని ధైర్యంచేసి 1976, నవంబర్ 19న పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇరు కుటుంబాలు కలసిపోయాయి. పిల్లల్లేకున్నా ఒకరికొకరుగా జీవితం సాగిస్తున్నారు నారాయణ, కృపామణి దంపతులు. ‘ప్రస్తుతం ప్రేమ పేరుతో జరుగుతున్న హింస, పెళ్లి చేసుకోలేమనే భయంతో ప్రాణాలు తీసుకోవడం వంటి సంఘటనలు వింటుంటే బాధ కలుగుతుంది. ధైర్యంగా ముందడుగు వేస్తే అన్నీ సర్దుకుంటాయి’ అంటున్నారు వీరు. నాలుగేళ్లకు ఒప్పించాం.. మహబూబాబాద్: తమ ప్రేమ.. పెళ్లి వైపు నడిపించిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్. ‘32 ఏళ్ల క్రితం నేను వరంగల్ ఆర్ఈసీ (ప్రస్తుతం నిట్)లో చదువుకుంటున్న సమయంలో ఒక ఫెస్ట్‌లో మెడిసిన్ చదువుతున్న సీతామహాలక్ష్మి (గుంటూరు జిల్లా తెనాలి) పరిచయమైంది. అదికాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేర్వేరు. ఆమె ఇంట్లో విషయం తెలియడంతో.. మా ఇద్దరి మధ్య మాటలు బందయ్యాయి. అప్పట్లో ఇప్పటి మాదిరి సమాచార వ్యవస్థ లేదు. మా ప్రేమను కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇబ్బంది పడేవాళ్లం. ఇద్దరం ప్రభుత్వోద్యోగాలు సాధించి పెద్దల్ని ఒప్పిద్దామనుకుంటే అప్పుడూ నిరాకరణే ఎదురైంది. వాళ్ల అంగీకారం కోసం నాలుగేళ్లు వేచిచూశాం. అయితే, మా ప్రేమలోని నిజాయితీని తరువాత పెద్దలు గుర్తించారు. చివరకు 1994లో వారే దగ్గరుండి పెళ్లి చేశారు. నేను ఆర్అండ్బీ డీఈగా ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సీతామహాలక్ష్మి ఎంతో సహకరించింది. ఆమె డాక్టర్. సూర్యచంద్ర, తేజస్వి.. మాపిల్లలు. ప్రేమకు కులమతాలు అడ్డుకాదు. కాకపోతే, జీవితంలో స్థిరపడి, పరస్పరం నమ్మకం, భరోసా ఏర్పడ్డాకే పెళ్లి చేసుకోవాలి. తొందరపడి ప్రేమలోకి దిగి.. పెద్దల భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రేమికులను చూస్తే బాధ కలుగుతుంది’. ఒప్పించి.. మెప్పించాం కోల్‌సిటీ (రామగుండం): ‘మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే కనుక పెద్దలను ఒప్పించాలి’ అంటున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన డాక్టర్లు మహేందర్‌కుమార్, లావణ్య. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన మహేందర్కుమార్కు, గోదావరిఖని లక్ష్మీనగర్‌కు చెందిన లావణ్యకు సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో 2006లో సీటొచి్చంది. చదువులో చురుగ్గా ఉండే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే కులాలు వేర్వేరు. మహేందర్ దాపరికం లేకుండా ఇంట్లో విషయం చెప్పి ఒప్పించాడు. లావణ్యా అలాగే చేసింది. చదువుకు తమ ప్రేమ అడ్డుకాకుండా.. ఇద్దరూ డాక్టర్లయ్యాక 2012 నవంబర్ 29న పెద్దల సమక్షంలో ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులు నేటి ప్రేమల గురించి మాట్లాడుతూ– ‘ప్రేమలో పరిపక్వత ఉండాలి. పేరెంట్స్‌ను ఒప్పించి పెళ్లి చేసుకోగలమనే నమ్మకం ఉండాలి. మా కాలేజీలో దాదాపు 50 ప్రేమజంటల్ని చూశాం. కేవలం ఆరుజంటలే పెళ్లి చేసుకున్నాయి’ అని చెప్పారీ దంపతులు. మహేందర్ ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్, డీడీవోగా, డాక్టర్ లావణ్య జగిత్యాల జిల్లా మల్యాల పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్, డీడీవోగా పని చేస్తున్నారు. -
దివ్యాంగులకు 5 శాతం ‘డబుల్’ ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూమ్ పథకంలో దివ్యాంగులకు 5 శాతం ఇళ్లు కేటాయిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. దివ్యాంగుల పరికరాల పంపిణీ ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్‌లో వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని, విద్య, ఉపాధి పథకాల్లో 5 శాతం, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దివ్యాంగులకు పరికరాలను అందిస్తున్నామని, ఇందుకు సంబంధించి దరఖాస్తులు ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో ఫిబ్రవరి ఆరో తేదీ వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఎంపికైన లబ్ధిదారులకు ఫిబ్రవరి 15 నుంచి పరికరాలను అందజేయనున్నట్లు వెల్లడించారు. -
మంత్రి ‘కొప్పుల’కు మేయర్ శస్త్రచికిత్స
సాక్షి, కరీనంగర్/గోదావరిఖని: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్ మంగళవారం శస్త్రచికిత్స చేశారు. గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య శస్త్రచికిత్స పూర్తి చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈశ్వర్ కడుపు ఎడమవైపు పైభాగంలో కణతి ఏర్పడింది. శస్త్రచికిత్స చేసి దానిని తొలగించాలని వైద్యులు ఇదివరకే సూచించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటనలో ఈశ్వర్ పాల్గొని తిరిగి వస్తుండగా కడుపులో నొప్పి ఎక్కువైంది. మార్గమధ్యంలో గోదావరిఖని మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్‌ను ఆశ్రయించగా విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ చేస్తున్నంత సేపు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆపరేషన్ చేసిన అరగంట తర్వాత ఆసుపత్రి నుంచి మంత్రి డిశ్చార్జి అయ్యారు. అనంతరం అధికారిక కార్యక్రమాల్లో ఆయన యథావిధిగా పాల్గొన్నట్లు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. -
అవినీతి జరిగితే కోర్టుకెళ్లు..
సాక్షి, జగిత్యాల: ప్రతి మంచి పనిని విమర్శించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిర్మలాపూర్ లో నూతనంగా నిర్మించిన రైతు వేదికను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కౌంటర్ ఇచ్చారు. అవినీతి ముఖ్యమంత్రి జైలుకు వెళ్లక తప్పదంటున్న బండి సంజయ్.. అవినీతి జరిగితే కోర్టుకు వెళోచ్చని సూచించారు. (చదవండి: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు) అవినీతి లేని రాష్ట్రం ఒక్క తెలంగాణానేనని స్పష్టం చేశారు. చేయచేతకాదు, చేస్తే ఓర్వ లేరని, దుర్మార్గంగా మాట్లాడతారని ఆరోపించారు. వేలాది టీఎంసీల నీరు ప్రతిఏటా వృధాగా పోతుంటే కళ్ళప్పగించి చూశారే తప్ప.. ఎవరు ప్రాజెక్టు నిర్మించలేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టు నిర్మిస్తే అవినీతి అంటారని విమర్శించారు. విమర్శించే ముందు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, రిజర్వాయర్లు, పంప్ హౌస్‌లను చూడాలని మంత్రి హితవు పలికారు. (చదవండి: ఆహా.. అల్లం చాయ్.. ఇంకేం కావాలి: కవిత) -
లిఫ్టులో ఇరుక్కుపోయిన మంత్రి
సాక్షి, హైదరాబాద్ : మంత్రి కొప్పుల ఈశ్వర్ లిఫ్టులో ఇరుక్కుపోయారు. సిబ్బంది తీవ్రంగా శ్రమించిన అనంతరం 30 నిమిషాల తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. శుక్రవారం సైఫాబాద్‌లోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి కొప్పుల ఈశ్వర్. కార్యక్రమం ముగించుకుని తిరిగివస్తూ అక్కడి లిఫ్ట్‌లోకి ఎక్కారు. అయితే ఆ లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. అందులోనుంచి మంత్రిని బయటకు తీసుకువచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. దాదాపు 30 నిమిషాలు కష్టం అనంతరం లిఫ్ట్ లాక్ ఓపెన్ అయింది. దీంతో మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. చదవండి : తెలంగాణాలో అమెజాన్ భారీ పెట్టుబడులు -
త్వరలో క్రిస్టియన్ భవన్ నిర్మాణం పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం సలహా సంఘం ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. సీఎం కేసీఆర్ కేవలం మాటల సెక్యూలరిస్ట్ కాదని, ఆచరణలో గుండెల నిండా లౌకికవాదాన్ని నింపుకున్నారన్నారు. మంత్రుల నివాస ప్రాం గణంలోని క్లబ్‌హౌజ్‌లో శుక్రవారం జరిగిన క్రైస్తవ మత పెద్దల ఆత్మీయ సమ్మేళనంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. దేశ, రాష్ట్రాభివృద్ధిలో మిషనరీల పాత్ర ఎవరూ కాదనలేరని, కరోనా పరిస్థితుల్లో మిషనరీ ఆసుపత్రుల సేవలు మరువలేనివని కేటీఆర్ ప్రశంసించారు. సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, క్రైస్తవ భవన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని హామీనిచ్చారు. 8 వేల మందికి విద్యాబోధన: కొప్పుల రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 204 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 8 వేల మంది క్రైస్తవ విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. క్రైస్తవ శ్మశాన వాటికల కోసం స్థలాలు కేటాయించడంతో పాటు, వాటిని అభివృద్ధి కూడా చేస్తున్నామన్నారు. క్రైస్తవ సంస్థల ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన హామీనిచ్చారు. కోవిడ్ పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ అన్నారు. వంద దేశాల కంటే ఎక్కువ జనాభాను కలిగి ఉన్న హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్, సికింద్రాబాద్ బిషప్ తుమ్మ బాల తదితరులు పాల్గొన్నారు. -
‘క్రైస్తవ సోదరులను ప్రభుత్వం ఆదుకుంటుంది’
సాక్షి, హైదరాబాద్ : క్రైస్తవుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపాడుతోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వారి కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చదువుకొని ఉద్యోగాలు లేని వారికి లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కోసం ఆదుకుంటున్నామన్నారు. నగరంలోని మినిస్టర్స్ క్వాటర్స్‌లో శుక్రవారం క్రిస్టియన్ మత పెద్దల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని క్రైస్తవులు కోరుకున్నారన్నారు. (అంబేడ్కర్ విగ్రహం నమూనా విడుదల) ‘ఈ ఆరేళ్లలో ఎక్కడ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. అన్ని వర్గాలకు ప్రభుత్వం చేయుతనందిస్తోంది. క్రైస్తవుల స్మశాన వాటిక కోసం స్థలం కూడా కేటాయించి అన్ని సదుపాయాలు ఉండేలా చూస్తాం. కోవిడ్ కారణంగా మరణించిన క్రిస్టియన్ సోదరులను ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రభుత్వ పథకాలను కూడా క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. ఈ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ఉద్దేశ్యంతో సమూల మార్పులు జరుగుతున్నాయి’. అని పేర్కొన్నారు.(‘డబుల్ ఇళ్లు చూపిస్తామని పారిపోయారు’) -
అంబేడ్కర్ విగ్రహం నమూనా విడుదల
సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసినట్లు సాంఘిక సం క్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు విడుదలైనట్లు తెలిపారు. మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్‌తో కలసి బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో విగ్రహం నమూ నాను కొప్పుల ఈశ్వర్ విడుదల చేశారు. హుస్సేన్‌సాగర్ తీరంలో రూ.140 కోట్ల వ్య యంతో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పా టు చేస్తామన్నారు. 45.5 అడుగుల వెడల్పుతో ఏర్పాటయ్యే విగ్రహానికి 791 టన్ను ల స్టీలు, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడి వినియోగిస్తామని తెలిపారు. 11 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే పార్కులో అంబేడ్కర్ విగ్రహంతో పాటు మ్యూజియం, లైబ్రరీ ఉంటాయన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొన్నారు. -
భూమి లభించనందునే పంపిణీ ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: సాగుకు యోగ్యమైన భూమి లభించనందునే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూపంపిణీ పక్రి య నెమ్మదిగా సాగుతోందని రాష్ట్ర మం త్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇప్పటి వర కు ఈ పథకం కింద రాష్ట్రంలో 15వేల ఎకరాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. శనివారం శాసనసభ ఆవరణలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుతో కలిసి కొప్పుల మీడియాతో మాట్లా డారు.దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు. మంథని ఘటనపై కాంగ్రెస్‌ది రాద్ధాంతం.. మంథనిలో కొందరు వ్యక్తుల నడుమ చోటు చేసుకున్న ఘటనలపై కాంగ్రెస్ పార్టీ రెండు నెలలుగా ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. నలభై ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దళితులకోసం చేసిందేమీ లేదన్నారు. చలో మల్లారం పేరిట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు పిలుపునివ్వడాన్ని కొప్పుల ప్రశ్నిస్తూ, ఒక గ్రామంలో జరిగిన ఘటనను టీఆర్ఎస్ పార్టీకి అంటగట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏం చేయాలో అర్థం కాక తమ పార్టీపై అనవసర రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అన్నారు. రంగయ్య అనే వ్యక్తి మరణానికి సంబంధించి మంథనిలో ఇద్దరు వ్యక్తుల నడుమ జరిగిన గొడవను కాంగ్రెస్ పార్టీ భూతద్దంలో పెట్టి చూపుతోందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వంటి వారి మాటలు విని కాంగ్రెస్ నేతలు దళితుల కోసం పోరాటం అంటూ హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు. -
టెన్త్ పరీక్షలు రాసే గురుకుల విద్యార్థులకు వైద్య పరీక్షలు: కొప్పుల
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల 8 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు రాసే గురుకుల విద్యార్థులు జూన్ 1వ తేదీ కల్లా రెసిడెన్షియల్ పాఠశాలలకు చేరుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. ఆ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన పదో తరగతి పరీక్షలను పునఃప్రారంభం చేస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం మంత్రి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కరోనా వైరస్ పట్ల ఆందోళన చెందకుండా ప్రిన్సిపల్, స్టాఫ్ నర్సులు సూచనలు చేయాలన్నారు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత, భౌతిక దూరం తదితర అంశాలపై అవగాహన పెంచాలన్నారు. ప్రతి పాఠశాల ప్రాంగణంలో థర్మల్ స్క్రీనింగ్ సిస్టం ఏర్పాటు, విద్యార్థులకు ఉచితంగా శానిటైజర్లు, మాస్కులు అందించాలన్నారు. తరగతి గదిలో, డైనింగ్ హాలులో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలని, తరగతి గదులను, విద్యార్థులు కూర్చునే బెంచీలను, బల్లాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని, ముఖ్యంగా విద్యార్థులు ఎలాంటి మానసిక ఆందోళనకు గురికాకుండా చదువుపైనే ధ్యాసపెట్టేలా చూడాలన్నారు. ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తమ సొసైటీ పరిధిలో 173 పాఠశాలల్లో మొత్తం 12,163 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు. -
'నీళ్ల కోసం ఆకాశం వైపు చూడనవసరం లేదు'
సాక్షి, జాగిత్యాల : జిల్లాలోని ఎస్సారెస్పీ కాలువలో పూడిక తీత పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మపురి మండలం గాదెపెల్లిలో సీఎం కేసిఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో రైతులు సన్నం రకం వడ్లను సాగు చేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. వేసవిలోనూ మత్తడి దుంకడం కేసీఆర్ గొప్పతనానికి మారుపేరన్నారు. రైతులు ఇకపై నీళ్ల కోసం ఆకాశం వైపు చూడాల్సిన అవసరం లేదన్నారు. పుష్కలంగా నీళ్లు.. భూమి నిండా పంట ఉంటుదన్నారు. కాగా పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. -
నల్లమల పర్యాటకానికి రూ.56.84 కోట్లు
సాక్షి, హైదరాబాద్: నల్లమలలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అక్కడ ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు అవకాశముందని, ఆ దిశగా ప్రణాళిక లు రూపొందిస్తున్నట్లు చెప్పారు. మల్లెల తీర్థం వెళ్లడానికి రహదారి నిర్మించాల్సి ఉన్నా.. అటవీ చట్టాలు ప్రతిబంధకంగా ఉన్నా యన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. నల్లమల పర్యాటకాభివృద్ధికి రూ.56.84 కోట్లు మంజూరు చేశామని, ఇందులో అక్క మహాదేవి గుహలకు రూ.1.25 కోట్లు, కడలివనం కోసం రూ.11.04 లక్షలు, ఈగలపెంటకు రూ.25.94 కోట్లు, ఫర్హాబాద్‌కు రూ.13.81 కోట్లు, మల్లెల తీర్థానికి రూ.5.35 కోట్లు, ఉమామహేశ్వర దేవాలయానికి రూ.10.35 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఓవర్సీస్ విద్యానిధికి ఆర్థిక సాయం పెంచం ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఆర్థిక సాయం పెంచే యోచన లేదని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. అలాగే సీఎం ఓవర్సీస్ విద్యానిధి కింద నిర్దేశించిన కోటాను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలేదని, దీంతో కొత్తగా పెంచాల్సిన ఆవశ్యకత లేదన్నారు. సభ్యులు షకీల్ అమీర్ మహ్మద్, మెతుకు అనంద్, స్టీఫెన్సన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. లాభాల బాట పడితే కొత్త డిపోల మాట ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందని, ఇదే ఒరవడిని కొనసాగిస్తే కొత్త డిపోలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. గత మూడు నెలలుగా అనేక సంస్కరణలు తీసుకురావడంతో ఆర్టీసీ క్రమంగా లాభాల్లోకి వస్తోందని, నిర్వహణావ్యయం తగ్గించడానికి ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సుల స్థానంలో 1,334 అద్దెబస్సులను ప్రవేశపెడుతామన్నారు. ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసాలను తొలగించడానికి ఇటీవల చార్జీలను పెంచామని నష్టాలనుంచి గట్టెక్కామని చెప్పారు. -
‘మైనారిటీ గురుకులాలకు జూనియర్ కాలేజీ హోదా’
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 71 మైనారిటీ గురుకుల విద్యాలయాలను జూనియర్ కళాశాలలుగా స్థాయి పెంచనున్నట్టు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శాసనసభలో బుధవారం షకీల్ అహ్మద్, విద్యాసాగరరావు, స్టీఫెన్సన్, గాదరి కిషోర్‌కుమార్, హరిప్రియ, సురేందర్, బాల్క సుమన్ తదితరులు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా వివరాలు వెల్లడించారు. దేశంలో మరెక్కడా లేని తరహాలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకులాలను అద్భుతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీటిల్లో ఒక్కో విద్యార్థిపై సగటున రూ.50,686 చొప్పున ఖర్చు చేస్తున్నామన్నారు. కొన్ని గురుకులాలు అద్దె భవనాల్లో ఉన్నా.. వసతులపరంగా ఎలాంటి లోపాలు లేకుండా చూస్తున్నామన్నారు. భవిష్యత్తులో వీలైనన్ని సొంత భవనాలు నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. -
బీసీ రిజర్వేషన్‌పై కేటీఆర్‌కు కృతజ్ఞతలు
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించినందుకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీమంత్రి కేటీఆర్, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్లకు తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఆదివారం కమిటీ సభ్యులు చైర్మన్ బాలగౌని బాలరాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో మంత్రులను కలసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గీత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. -
కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడని, ఆయన సీఎం అయితే తప్పేమీ లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆదివారం విలేకరులతో ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ సీఎం చేయని పనులు సీఎం కేసీఆర్ చేసి తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారన్నారు. తాను అనుకున్న లక్ష్యాలను కూడా ఇప్పటికే చాలా వరకు నెరవేర్చారని, కేసీఆర్ ఆలోచనా విధానం ఏదైనా తాము స్వాగతిస్తామని చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ తన సమర్థతను నిరూపించుకున్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని ఒంటిచేత్తో గెలిపించారని, కేటీఆర్ రూపంలో తెలంగాణకు యువనాయకత్వం రావడం హర్షించదగిన పరిణామమని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ చావుదెబ్బ తిన్నదని, ఈ ఎన్నికల్లో ప్రజలు అదే తీర్పు ఇస్తారని చెప్పారు. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడంలో కాంగ్రెస్ విఫలమయిందని, ఓడిపోతామనే భయంతోనే రిజర్వేషన్లు, షెడ్యూల్ అంటూ కోర్టులను ఆశ్రయించారన్నారు. బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలిస్తేనే ఆగడం లేదని, ఊహల్లో విహరిస్తోందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ మత ఎజెండాతోనే ముందుకెళుతోందని, హుజూర్నగర్ ఉప ఎన్నికల్లోనే బీజేపీ సత్తా ఏంటో తేలిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. జెడ్పీ ఎన్నికల్లో వంద శాతం స్థానాలు గెలిచామని, ఈ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో నీచ రాజకీయాలు టీఆర్ఎస్లో లేవని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల రీడిజైన్ ఆపార్టీ నేతలకు అర్థం కావడం లేదని, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టుల్లో నీరు పూర్తి సామర్థ్యానికి చేరాయని, కాళేశ్వరం లేకపోతే ఇది సాధ్యపడేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా తీరు మార్చుకుని మతిలేని మాటలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. -
17న అంబేడ్కర్ సమతా యాత్ర
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్ నుంచి ఈ నెల 17న అంబేడ్కర్ సమతా యాత్ర ప్రారంభిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీలో టీఆర్ఎస్వీ, దళిత బహుజన విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2001 డిసెంబర్ 18న అప్పటి రాష్ట్రపతి నాగ్‌పూర్‌లోని అంబేడ్కర్ దీక్షా భూమి వద్ద బౌద్ధ స్తూపాన్ని ఆవిష్కరించారని, అప్పట్నుంచి ఆ తేదీన దీక్ష భూమికి వెళ్లి దర్శించుకోవడం ఆనవాయితీగా మారిందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17న జింఖానా గ్రౌండ్స్ నుంచి 1,000 వాహనాల్లో దీక్షా భూమికి పయనమవుతారని, దళిత, బహుజన యువతీ యువకులు, విద్యార్థులు, మేధావులు ఇందులో పాల్గొంటారన్నారు. ఈ నెల 18న వీరంతా దీక్షా భూమిని సందర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారన్నారు. ఈ సందర్భంగా సమతా యాత్ర వాల్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో జాతీయ మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఆవుల బాలనాథం, మాల జన సమితి అధ్యక్ష, కార్యదర్శులు మాందాల భాస్కర్, గడ్డం శ్రీనివాస్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శోభన్‌బాబు, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి జిల్లాకు ఓ స్టడీ సర్కిల్!
సాక్షి, హైదరాబాద్: ప్రతి జిల్లాలో ఓ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాలో ఈ కేంద్రాలున్నాయి. కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు కావడంతో అన్ని జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈమేరకు కార్యాచరణ రూపొందించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసే అవకాశముందనే అంశంపై కసరత్తు చేపట్టింది. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో ప్రధాన స్టడీ సర్కిళ్లను హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. దీంతోపాటు నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, సిద్దిపేట, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్, గ్రూప్ సర్వీసులు తదితర ప్రధాన శిక్షణ కార్యక్రమాలకు హైదరాబాద్ స్టడీ సర్కిల్లో శిక్షణ ఇస్తుండగా.. మిగతా చోట్ల ఇతర కేటగిరీల్లోని ఉద్యోగాలకు శిక్షణ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పలు రకాల శిక్షణలు ఇవ్వగా.. దాదాపు 2వేల మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారిలో దాదాపు 15% మందికి కొలువులు వచ్చాయి. స్టడీ సర్కిల్ శిక్షణలతో సత్ఫలితాలు వస్తుండటంతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు డిమాండ్ పెరిగింది. ఈనేపథ్యంలో స్టడీ సర్కిళ్ల ఏర్పాటు, ఆవశ్యకతను పరిశీలించాలని ఈశ్వర్ ఆదేశించడంతో ఆ శాఖ చర్యలకు ఉపక్రమించింది. స్టడీ సర్కిళ్ల ద్వారా ఎస్సీ నిరుద్యోగ యువతకు వివిధ రకాల పోటీ పరీక్షలకు శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఎస్సీ అభివృద్ధి శాఖ..వీటిని మరింత విస్తృతం చేయాలని నిర్ణయిం చింది. ఇకపై ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన శిక్షణే కాకుండా ప్రైవేటు రంగంలో కీలక ఉద్యోగాలకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టే అంశంతో పాటు డిమాండ్ ఉన్న ఉద్యోగాలకు ఎలా శిక్షణ ఇవ్వొచ్చనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. -
స్పీకర్‌కు ప్రివిలేజ్‌మోషన్ ఇస్తా: శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్ : సింగరేణి యాజమాన్య సమావేశానికి తనను పిలవకపోవడంలో ఆంతర్యమేమిటని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, సింగరేణి సీఎండీ తన హక్కులను కాలరాశారని, దీనిపై తాను స్పీకర్‌కు ప్రివిలేజ్‌మోషన్ ఇస్తానని తెలిపారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలందరితో మాట్లాడేవాళ్లమని, ఇప్పుడు అదే సింగరేణి ఎమ్మెల్యేనైనా తనను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. అండర్‌గ్రౌండ్ మైనింగ్ ఓపెన్‌కాస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతోందని, సింగరేణి యాజమాన్యం ఒక పార్టీకి తొత్తులుగా పని చేస్తోందని ఆరోపించారు. -
దేశంలోనే ‘హరితహారం’ సరికొత్త రికార్డు
సాక్షి, ధర్మారం(ధర్మపురి): దేశంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ‘హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టి రికార్డు సృష్టించిందని రాష్ట్ర సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామ శివారులో వానరవనంలో ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ‘30 రోజుల ప్రణాళిక’ను గ్రామగ్రామాన అమలు చేయటం జరుగుతోందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను ఆయా గ్రామాల పాలకవర్గాలతో పాటుగా అధికారులకు అప్పగించి ప్రభుత్వం పకడ్బందీగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటుందన్నారు. నాలుగేళ్లలో కోటి 50 లక్షల మొక్కలను నాటడం జరిగిందన్నారు. కోతుల విధ్వంసంతో పంటలు నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో వనారవనాన్ని ఏర్పాటు చేసి పండ్ల మొక్కలను పెంచుతుందన్నారు. దీంతో గ్రామాల్లో ఉన్న కోతులు అడవిలోకి వెళతాయన్నారు. ఈ వనంలో 180 రకాల పండ్ల మొక్కలను నాటుతున్నామన్నారు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో ఈ కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఫొటోలకు పోజులివ్వటం కాదు.. ‘మొక్కలను నాటి వెళ్ళి పోవటం కాదు.. పెట్టిన ప్రతి మొక్కను రక్షించాలి.. నేను మొక్కను నాటుతుంటే నా వెంట ఉంటూ నిలపడితే సరికాదు. నా వద్ద బెల్లం లేదు.’ అన్నారు. మంత్రి ఈశ్వర్ ఖిలావనపర్తి వానరవనంలో మొక్కలు నాటేందుకు వచ్చిన మంత్రి ఈశ్వర్‌కు మొక్కను నాటిన తర్వాత సరిపడు మట్టి అందుబాటులో లేకపోవటంతో మంత్రికి కోపాన్ని తెప్పించింది. గుంతలు ఎందుకు తీయలేదని గ్రామస్తులను ప్రశ్నించారు. తాను వెళ్లిన తర్వాత ఇంతే సంగతా అని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం ఎంతో గొప్పదని ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని ఆయా గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలన్నారు. ఎంపీపీ కరుణశ్రీ, జెడ్పీటీసీ పద్మజ, సర్పంచ్ కనకతార, ఎంపీటీసీ సుజాత, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జితేందర్‌రావు, నాయకులు బలరాంరెడ్డి, రాజేశం, రాజయ్య, బుచ్చిరెడ్డి, మల్లేశం, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాలు దేశానికే ఆదర్శం: మంత్రి కొప్పుల
సాక్షి, హైదరాబాద్ : గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం వేలాది మంది పోటీ పడడం ఏ రాష్ట్రంలో లేదని, ఈ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. మంగళవారం ఖైరతాబాద్ బాలికలు, సనత్‌నగర్‌లో బాలుర మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను మంత్రి తనిఖీ చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వారితో కలిసి భోజ నం చేశారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకుల పాఠశాలల్లో విద్యను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. -
మిగులు నిధులు క్యారీఫార్వర్డ్ చేశాం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తుందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం పద్దులపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడారు. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద కేటాయించిన మొత్తాన్ని ఖర్చు చేయకుంటే వాటిని క్యారీఫార్వర్డ్ చేయాలని చట్టంలో పొందుపర్చామన్నారు. అందులో భాగంగా తాజా బడ్జెట్లో రూ.419.94 కోట్లు క్యారీఫార్వర్డ్ చేసినట్లు చెప్పారు. 2017–18 సంవత్సరానికి సంబంధించి రూ.134 కోట్లు, 2018–19 సంవత్సరానికి సంబంధించి రూ.285.94 కోట్లు మిగిలిపోయాయని, వీటిని తాజా బడ్జెట్లో క్యారీఫార్వర్డ్ చేసినట్లు చెప్పారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులు తగ్గినప్పటికీ ఎస్సీ అభివృద్ధి శాఖకు మాత్రం అదనంగా రూ.350 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం ప్రకారం 15.45 శాతం నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 16.48 శాతం నిధులు కేటాయించిందని వెల్లడించారు. రియల్‌బూమ్ నేపథ్యంలో భూముల ధరలు పెరిగిపోయినందున భూపంపిణీ కోసం భూమిని కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. ఈ పరిమితిని పెంచాలని సభ్యులు కోరినందున ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రతి జిల్లాకో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశామని, వీటికి పూర్తిస్థాయి భవనాలను నిర్మించి మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి వెల్లడించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కమిటీ రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని మంత్రి చెప్పారు. దాదాపు 70వేల ఎకరాల భూములు వక్ఫ్‌బోర్డు పరిధిలో ఉన్నాయని, వీటి పరిరక్షణకు ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏజెన్సీలో పోలీసు, రెవెన్యూ, స్థానిక అధికారులను నియమించనున్నట్లు వివరించారు. ఈ కమిటీతో నిరంతర పర్యవేక్షణ చేయిస్తామని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో మంత్రి కొప్పుల
సాక్షి, విజయవాడ: తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కృష్ణా జిల్లాలోని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 35 ఏళ్లుగా అమ్మవారిని దర్శించుకోవటం తమ కుటుంబ సంప్రదాయంగా వస్తోందని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నానని అన్నారు. తెలుగు రాష్ట్రాలు ఆదర్శవంతమైన రాష్ట్రాలుగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించానని ఆయన పేర్కొన్నారు. -
జాతీయ పండుగగా గుర్తించండి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు రావాల్సిందిగా కేంద్ర మంత్రి అర్జున్‌ముండాను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆహ్వానించారు. ఈమేరకు గురువారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలసి ఆహ్వానపత్రాన్ని అందించారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్కండ్ రాష్ట్రాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారని మంత్రి వివరించారు. దక్షిణ కుంభమేళాగా భావిస్తున్న మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా ప్రకటించాలని కోరారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారం జాతర జరుగుతుందన్నారు. దీని నిర్వహణకు దాదాపు రూ.110 కోట్లు అవసరమవుతాయని, రాష్ట్ర గిరిజన శాఖ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలను కేంద్రమంత్రికి అందజేశారు. ఈ జాతర నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం తనవంతు బాధ్యతగా ముందుకొచ్చి నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వసతి గృహ నిర్మాణాలకు నిధులివ్వండి ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని వసతి గృహాల నిర్మాణాలు, సౌకర్యాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలతో కలసి కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకు వినతిపత్రం సమర్పించారు. -
మంత్రులు ఈటల, కొప్పుల మానవత్వం
కొడిమ్యాల(చొప్పదండి) : అధికారిక కార్యక్రమం కంటే ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడటమే ప్రథమ కర్తవ్యంగా భావించారు మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముగ్గురు బాధితులను తమ కాన్వాయ్‌లోని వాహనంలో ఆస్పత్రికి పంపించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గోపాల్‌రావుపేటకు చెందిన కోమటి శేఖర్, భార్య నళిని, కుమారుడు చందూతో కలసి శనివారం కరీంనగర్‌లోని కూతురు ఇంటికి బైక్‌పై బయలుదేరారు. ఆరెపేట శివారులో వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు జగిత్యాలలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను ప్రారంభించేందుకు కరీంనగర్ నుంచి వస్తున్నారు. రోడ్డుపక్కన విలపిస్తున్న ప్రమాద బాధితులను చూసి వాహనాలు ఆపి వారి వద్దకు వచ్చారు. క్షతగాత్రులను తమ కాన్వాయ్‌లోని ఓ వాహనంలో కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. మానవత్వంతో స్పందించిన మంత్రులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. -
కొలువుదీరిన కొత్త జెడ్పీ
సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా పరిషత్ పాలకవర్గం శుక్రవారం కొలువుదీరింది. నూతనంగా ఎంపిక చేసిన జిల్లాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేదర్, కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారీ సమక్షంలో కమాన్‌పూర్ జెడ్పీటీసీ పుట్టమధుతో కలెక్టర్ శ్రీదేవసేన జెడ్పీ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేయించారు. దైవసాక్షిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని మధు ప్రమాణం చేశారు. అనంతరం వైస్ చైర్పర్సన్ మండిగ రేణుకతో కలెక్టర్ ప్రమాణస్వీకారం చేయించారు. తర్వాత 9 మంది జెడ్పీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. జెడ్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు.. పెద్దపల్లిలోని రైల్వేస్టేషన్ సమీపంలోని నూతన జిల్లాపరిషత్ కార్యాలయాన్ని మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ మొదట ప్రారంభించారు. అనంతరం జోడ్పీ చైర్మన్, వైస్‌చైర్‌పర్సన్‌తోపాటు 9 మంది సభ్యులు ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు పుట్టమధును ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రుల సమక్షంలో జెడ్పీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించి కుర్చీలో కూర్చున్నారు. అనంతరం నాయకులు కార్యకర్తలు గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, టీఎస్టీఎస్ చైర్మన్ రాకేష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, జాయింట్ కలెక్టర్ వనజాదేవి, పోలీస్‌హౌసింగ్‌బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి సీఈవో వినోద్‌కుమార్, పంచాయితీ అధికారి సుదర్శన్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. సమాజానికి మేలు చేసే నాయకుడు.. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి జెడ్పీ చైర్మన్ పుట్టమధు సమాజానికి మేలు చేసే నాయకుడిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి కావడానికి భూసేకరణ సమయంలో ఎమ్మెల్యేగా పుట్టమధు పాత్రను గుర్తు చేశారు. ప్రజలు మెచ్చిన నాయకుడిగా కేసీఆర్ గుర్తించి అవకాశం కల్పించారన్నారు. స్వచ్ఛ జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈసందర్భంగా ఎమ్మెల్యే కోరారు. రాష్ట్రంలో అన్నింటి కంటే ముందు పెద్దపల్లి జిల్లా స్వచ్ఛ జిల్లాగా ఏర్పాటవుతుందనే ధీమా వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో ఉంటే అవకాశాలెన్నో..ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజల మధ్య ఉన్న నాయకులకు అవకాశాలు ఎదురుగా వస్తాయని పుట్టమధు ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా రాష్ట్రాన్ని సాధించడంతోపాటు అదే స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే శాసనసభ్యులుగా, జెడ్పీ చైర్మన్లుగా ఎన్నికయ్యారన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలమైంది.. ఈదశంకర్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్ 1952లో మొదలైన పంచాయతీరాజ్ చట్టం వివిధ కోణాల్లో బలోపేతం చేశారన్నారు. గాంధీజయంతి రోజు ఆరంభించిన పంచాయతీరాజ్ వ్యవస్థలో 30 లక్షల మంది ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారని ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి అన్నారు. మూడంచెల విధానంతో దేశంలో 2,34,674 గ్రామపంచాయతీలు, సమితులు, మండలాలు, జిల్లా పరిషత్‌లు ప్రజలకు సేవలందిస్తున్నయన్నారు. ఇలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీరాజ్ వ్యవస్థకు మరింత పదును పెట్టారన్నారు. కార్యక్రమంలో చిరుమల్ల రాకేశ్, జెడ్పీ వైస్‌చైర్మన్ మండిగ రేణుక, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్‌సింగ్, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి సుదర్శన్, జిల్లాలోని జెడ్పీపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలే దేవుళ్లు.. జెడ్పీ చైర్మన్ పుట్టమధు తనకు అమ్మ నాన్నలు ఎలా ఉంటారో తెలియదు.. బాల్యంలోనే వారిని కోల్పోయిన నాకు ప్రజలే అమ్మానాన్న, దేవుళ్లు అని జెడ్పీ చైర్మన్ పుట్టమధు అన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పుట్టమధు మాట్లాడారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తాను పేదరికాన్ని చూశానన్నారు. అన్న య్య సహకారంతో పెరిగి పెద్దయ్యాను. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చేరి జెండా మోసి ఇప్పుడు జెడ్పీ చైర్మన్‌గా జనం ఆదరణతో ఎన్నికయ్యానని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి ముందు వరుసలో ఉంటానని తెలిపారు. పెద్దపల్లి జిల్లాను ప్రగతిపథంలో నడిపించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశం, జనం దీవెనలతో వచ్చిన పదవిని ప్రజాసేవకే ఉపయోగిస్తానని స్పష్టం చేశారు. -
వేల రూపాయల ఫీజులు కట్టలేని పేదలకు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికి ఉచిత విద్య అందించ సంకల్పించారని, అందుకే మహాత్మా జ్యోతిరావ్ పూలే బీసీ గురుకులాలు ప్రారంభం కాబోతున్నాయని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. వేల రూపాలయల ఫీజులు కట్టలేని పేదలకు ఈ పాఠశాలలు నిర్మించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించినట్లు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 17న 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. మొత్తం 119 గురుకుల పాఠశాలలతో కలుపుకుని మొత్తం 162 గురుకుల పాఠశాలలు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో గురుకుల పాఠశాల ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు అన్నీ ప్రజల ముందుకు వస్తున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డ నాటికి 19 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు మొత్తం162 పాఠశాలలు ప్రారంభం అయ్యాయన్నారు. ఇంగ్లీష్ విద్య, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి విద్యార్థి భవిష్యత్తు ప్రగతే లక్ష్యంగా తెలంగాణ ముందుకెళ్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులకు వరంగా ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి వీటిని ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. గురుకులాల్లో అడ్మిషన్ కోసం పోటీ పడుతున్నారని, గతంలో సీటు ఇస్తామన్నా వచ్చే వారు కాదన్నారు. సీట్ల పెంపుపైన సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. -
ప్రతి ఒక్కరి సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఒక్కరి సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా తలపెట్టిన గురుకుల పాఠశాలలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని, విద్యార్థుల సంఖ్యకు తగినట్లు కొత్త గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు. సోమవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. అంతకుముందు బీసీ గురుకుల సొసైటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 17 నుంచి కొత్తగా 119 గురుకుల పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. గురుకుల బోధన ఉన్నతంగా ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆశయమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేవలం 19 బీసీ గురుకులాలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు వీటిసంఖ్య 257కు పెరిగిందన్నారు. 2017–18 విద్యా సంవత్సరంలో 119 గురుకుల పాఠశాలలు ప్రారంభించగా 2019– 20 విద్యాసంవత్సరంలో మరో 119 గురుకులాలు అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. అలాగే 19 జూనియర్ కాలేజీలు, ఒక మహిళా డిగ్రీ కాలేజీని ప్రారంభించినట్లు చెప్పారు. కొత్త గురుకులాలకు భవనాలు సిద్ధం కొత్తగా ఏర్పాటయ్యే 119 గురుకుల పాఠశాలలకు భవనాలు సిద్ధం చేశామని మంత్రి ఈశ్వర్ చెప్పారు. ఈ పాఠశాలల్లో 2019–20 విద్యాసంవత్సరంలో 5, 6, 7 తరగతులు ప్రారంభిస్తున్నామని, ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ప్రిన్సిపాళ్ల బాధ్యతల విషయంలో పాత స్కూల్లో పనిచేస్తున్నవారికి కొత్త స్కూళ్ల అదనపు బాధ్యతలు ఇచ్చామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు ఈ బాధ్యతల్లో కొనసాగాల్సి ఉంటుందని చెప్పారు. కొత్త స్కూళ్లకు 3,689 పోస్టులు ప్రభుత్వం మంజూరు చేసిందని, వీటిని వివిధ దశల్లో భర్తీ చేస్తామన్నారు. అప్పటి వరకు పాత పాఠశాలల నుంచి ఇద్దరు టీచర్ల చొప్పున కొత్త పాఠశాలలకు డిప్యుటేషన్ మీద పంపు తున్నట్లు చెప్పారు. అవసరమున్నచోట పీఈటీ, స్టాఫ్ నర్సులు, బోధనేతర సిబ్బందిని ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకునేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 98 శాతం పాఠశాలలకు నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాల సరఫరా పూర్తి అయిందని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల ప్రిన్సిపాళ్లకు రూ.2 లక్షలు ప్రొవిజన్స్ కోసం మంజూరు చేశామన్నారు. సమావేశంలో మల్లయ్యభట్టు, వీవీ రమణారెడ్డి, బాలాచారి తదితరులు పాల్గొన్నారు. -
2019 మంది తల్లులకు పాదపూజ
గోదావరిఖని(రామగుండం): అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆదివారం 2019 మంది మాతృమూర్తులకు పాదపూజ చేశారు. కోరుకంటి విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా పెద్దసంఖ్యలో మాతృమూర్తులు హాజరయ్యారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన తల్లి పాదాలను కడిగి ఆశీర్వాదం అందుకున్నారు. రామగుండం నియోజకవర్గంలోని 2019 మంది తల్లులకు వారి పిల్లలు పాదాభిషేకం నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్దగా ఈ తరహా కార్యక్రమం నిర్వహించిన విజయమ్మ ఫౌండేషన్‌కు వండర్బుక్ రికార్డును సంస్థ ప్రతినిధులు బింగి నరేందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా అందజేశారు. -
‘కుట్రలో భాగంగానే వందల కొద్దీ నామినేషన్లు’
సాక్షి, జగిత్యాల : జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఏనాడు తెలంగాణ సమస్యలను పట్టించుకోలేదని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడేది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఈ విషయం గురించి యువత ఆలోచించి ఓటువేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారమిక్కడ ఆమె మాట్లాడుతూ.. బీజేపీ అంటే ప్రస్తుతం భారతీయ జూట్ పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీకి ఓటు వేయమని చెప్తున్నారని.. రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. టీఆర్ఎస్ని ఓడించడానికి ఈ రెండు జాతీయ పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. కశ్మీర్ సమస్యను పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం.. కేవలం రాజకీయ లబ్ది కోసమే దేవుడి పేరు చెప్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి తనను ఎంపీగా ఆశీర్వదించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 2 సంవత్సరాల్లో పూర్తవుతుందని.. దీనితో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కుట్రలో భాగంగానే నామినేషన్లు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ కాంగ్రెస్ ,బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో కవితపైన కుట్రపూరితంగా వందల కొద్దీ నామినేషన్లు వేయించారని ఆరోపించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పలుమార్లు కవిత ప్రధాని మోదీకి విన్నవించినా ఆయన పెడచెవిన పెట్టారని.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్లు అధికారంలో ఉండి బీజేపీ ప్రభుత్వం పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ‘తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంగా ఉన్నారు. భారీ మెజార్టీతో కవిత విజయం సాధిస్తారు. గతంలో ఎంపీగా కవిత చేసిన అభివృద్ధిని చూడండి. బీజేపీ అభ్యర్థి అరవింద్ అనుభవం లేని నాయకుడు. గడిచిన ఐదేళ్ల కాలంలో అరవింద్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ తెలంగాణగా అభివృద్ధి చేయడంలో కేసీఆర్ కృషి అభినందనీయమమని.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
సముచిత స్థానం కల్పిస్తే ద్రోహం చేస్తావా?
గోదావరిఖని/మంచిర్యాల: మాజీ ఎంపీ వివేక్‌కు టీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేయలేదని, ఆయన పార్టీకి తీరని ద్రోహం చేశారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విలేకరులతో, మంచిర్యాలలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి వివేక్ కుట్ర చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులతో టచ్‌లోనే ఉంటూ, వారికి ఆర్థికంగా సాయం చేయడం వల్లనే ధర్మపురిలో తన గెలుపు కష్టసాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయమై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అందుకే సీఎంతో మాట్లాడి, పార్టీ ద్రోహులకు టికెట్టు ఇవ్వొద్దని కోరినట్లు చెప్పా రు. 2013లో టీఆర్ఎస్లోకి వచ్చిన వివేక్.. 2014లో కాంగ్రెస్‌లోకి జంపు చేశారని, ఎంపీగా ఓడిపోయిన ఆయన్ను , సీఎం కేసీఆర్ పార్టీలోకి చేర్చుకుని గౌరవప్రదమైన ప్రభుత్వ సలహాదారు పదవిని ఇచ్చి సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. దళితుడివి కాదు ధనికుడివి: సుమన్ ‘వివేక్..నీవు దళితుడివి కాదు ధనికుడివి.. నీవు దళితులకు ఏమి చేశావు? డబ్బు ఉందనే అహంకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించావ్. నిజమైన దళితులం మేమే’అని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. వివేక్‌కు టీఆర్ఎస్ పార్టీ ఏం ద్రోహం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. -
16 ఎంపీ స్థానాలు గెలిచే సత్తా టీఆర్ఎస్దే..
కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 స్థానాలు గెలువబోతుందని, కేంద్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం శ్వేత హోటల్లో కరీంనగర్ నియోజకవర్గస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనెల 17న సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగసభకు కనీవినీ ఎరుగని రీతిలో జనసమీకరణ చేయాలని కోరారు. రెండున్నర లక్షల మందితో పార్లమెంటరీ నియోజకవర్గస్థాయి బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. కరీంనగర్ నియోజకవర్గం నుంచి 50 వేల మందికిపైగా కార్యకర్తలను సమీకరించాలని సూచించారు. అన్నివర్గాలు టీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకత గురించి నిర్ణయానికి వచ్చాయని అన్నారు. దేశరాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని, కాంగ్రెస్, బీ జేపీలు సొంతగా అధికారంలోకి వచ్చే పరిస్థితి అ సలే లేదని చెప్పారు. 16 సీట్లు గెలిస్తే ఢిల్లీలో టీఆ ర్ఎస్ చక్రం తిప్పే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ 70 ఏళ్లల్లో చేయని అభివృద్ధి నాలుగున్నరేళ్లల్లో చేసి చూపించిన ఘనత టీఆర్ఎస్దేనన్నారు. ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆ ర్కు కరీంనగర్ సెంటిమెంట్ జిల్లా అని, మొదటి బహిరంగసభను కరీంనగర్ గడ్డపై నుంచే మొదలు పెట్టారని, ఐదు లక్షల పైచిలుకు మెజార్టీతో కరీంనగర్ ఎంపీగా వినోద్‌కుమార్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మేయర్ రవీందర్‌సింగ్, ఎంపీపీ వాసాల రమేశ్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, నియోజకవర్గ ముఖ్య నాయకులు జమీలోద్దీన్, కాశెట్టి శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, తుల బాలయ్య, సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు హాజరయ్యారు. -
మొక్కుబడి పథకాలు వద్దు: కొప్పుల
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వాల్లో ప్రవేశపెట్టిన మాదిరిగా మొక్కుబడి పథకాలు కాకుండా ప్రజల సంక్షేమానికి దోహదపడే పథకాలను అమలు చేయాలని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఆయా శాఖల పనితీరును తెలుసుకోవడంతో పాటు వివిధ పథకాల పురోగతిని గురించి సమీక్షించిన తర్వాత భవిష్యత్ ప్రణాళికల అమలుపై నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి చెప్పారు. -
మంత్రులు ఇద్దరు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరికీ మంత్రుల అవకాశం దక్కింది. ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మాజీమంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు మరోమారు మంత్రి పదవి దక్కింది. ప్రభుత్వ మాజీ విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు తొలిసారి మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఈ ఇద్దరు నేతలు మంగళవారం ఉదయం 11.30 గంటలకు కుటుంబసభ్యులతో ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సోమవారం సమాచారం అందింది. ఈసారి మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరిగింది. సీఎం తనయుడు, మాజీమంత్రి కేటీఆర్ పూర్తిస్థాయిలో పార్టీ బాధ్యతలు చూస్తుండటంతో ఆయనను కేబినెట్లోకి తీసుకోలేదంటున్నారు. ఈనేపథ్యంలో మాజీమంత్రి ఈటల రాజేందర్, మాజీ విప్ కొప్పులకు మంత్రులకు అవకాశం కల్పించినట్లు చెప్తున్నారు. తమ అభిమాన నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారన్న సమాచారం అందుకున్న ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ అభిమానులు, బంధువులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం రాత్రే హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఓటమెరుగని నేత ‘ఈటల’.. ఆరుసార్లు గెలిచిన ‘కొప్పుల’ ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరించిన ఈటల రాజేందర్ వరుస విజయాలతో ఓటమెరుగని నేతగా నిలిచారు. ఈటల రాజేందర్ 2004లో కమలాపూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత 2008 ఉప ఎన్నికల్లోనూ విజేతగా నిలిచారు. ఆ తర్వాత అనూహ్యంగా హుజురాబాద్ నియోజకవర్గానికి రాజకీయ మకాం మార్చిన ఈయన 2009, 2010 (ఉప ఎన్నిక), 2014, 2019 ఎన్నికలవరకు వరుస విజయాలతో సత్తా చాటారు. 2019 ఎన్నికల్లో బరిలో నిలిచి గెలిచిన రాజేందర్ డబుల్ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. తెలంగాణ మొదటి కేబినెట్లో ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు చేపట్టి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావడంలో కీలకంగా వ్యవహరించారు. మాజీ విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఏడుసార్లు పోటీచేసి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి ఓడిన ఈయన ఆ తర్వాత వరుస విజయాలు సాధించారు. రద్దైన మేడారం నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ తరఫున 1994లో తొలిసారి పోటీచేసి ఓటమిపాలయ్యారు. తర్వాత 2004లో మేడారం టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత 2008 ఉప ఎన్నికలో విజేతగా నిలిచారు. తరువాత ధర్మపురి నియోజకవర్గానికి మారిన ఆయన 2009, 2010 (ఉప ఎన్నిక), 2014, 2019లో వరుస విజయాలతో దూసుకెళ్లారు. ఏడుసార్లు పోటీ ఆరుసార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్‌ను ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈయన గత కేబినెట్లోనే మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగినా.. సమీకరణలు, సామాజిక కోణాల సర్దుబాటులో తృటిలో తప్పింది. ఈసారి ఈటల రాజేందర్‌తోపాటు కొప్పుల ఈశ్వర్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. శాఖల కేటాయింపుపై సస్పెన్స్.. ప్రమాణ స్వీకారం తర్వాతే బాధ్యతలు మాజీమంత్రి ఈటల రాజేందర్, మాజీ విప్ కొప్పుల ఈశ్వర్‌కు ఈ మంత్రివర్గంలో స్థానం లభించగా.. ఈ ఇద్దరు నేతలకు ఏయే శాఖలు కేటాయిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సీఎంగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 16 మందిని భర్తీ చేయాల్సి ఉంది. ఈసారి 10 మందినే భర్తీ చేస్తున్నందున.. ఉమ్మడి జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలకు ఏ శాఖలు కేటాయిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈసారి కొందరి శాఖల మార్పులు ఖాయమన్న ప్రచారం బలంగా ఉంది. ఈ మంత్రివర్గంలో కేటీఆర్ లేకపోగా.. మిగిలింది ఈటల రాజేందర్. సీఎంవో కార్యాలయం నుంచి ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని మాత్రమే సమాచారం అందగా.. కేటాయించే శాఖల ప్రస్తావన లేదు. గత ప్రభుత్వంలో రాజేందర్ ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ సారి ఏ శాఖ కేటాయిస్తారనేది చర్చనీయాంశం అయ్యింది. కొత్తగా మంత్రివర్గంలో చేరుతున్న కొప్పుల ఈశ్వర్‌కు కేటాయించే శాఖపైనా చర్చ జరుగుతోంది. ఈ విషయమై అధినేత కేసీఆర్ ఏం యోచిస్తున్నారు? అయన మదిలో ఏముంది..? అనేది ప్రమాణ స్వీకారం తర్వాతే తేలనుందంటున్నారు. ‘ఈటల’ బయోడేటా.. పేరు : ఈటల రాజేందర్ పుట్టినతేదీ : 24–03–1964 తల్లిదండ్రులు : ఈటల వెంకటమ్మ, మల్లయ్య స్వగ్రామం : కమలాపూర్ విద్యాభ్యాసం : బీఎస్సీ(బీజెడ్సీ), ఎల్ఎల్బీ డిస్కంటిన్యూ వ్యాపారం : 1986 నుండి కోళ్ళపరిశ్రమ వ్యాపారం కుటుంబం : భార్య జమునారెడ్డి, కూతురు నీత్, ఒక కొడుకు నితిన్ రాజకీయ నేపథ్యం 2002లో టీఆర్ఎస్లో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2004లో మెుదటిసారిగా కమలాపూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2008 ఉప ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా, టీఆర్ఎస్ లెజిస్లెషన్ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ శాసనసభ పక్షనేతగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి వకుళాభరణం కృష్ణమోహన్‌రావుపై 15,035 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2010 ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎం.దామోదర్‌రెడ్డి, 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డిపై విజయం సాధించిన రాజేందర్, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డిని ఓడించారు. 2014లో కేసీఆర్ కేబినేట్లో ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రిగా వ్యవహరించిన ఈయనకు రెండోసారి కేసీఆర్ కొలువులో మంత్రిగా అవకాశం దక్కింది. ‘కొప్పుల’ బయోడేటా.. పేరు : కొప్పుల ఈశ్వర్ పుట్టిన తేదీ : 1959 ఏప్రిల్ 20 తల్లిదండ్రులు : మల్లమ్మ, లింగయ్య విద్యార్హతలు : డిగ్రీ స్వగ్రామం : కుమ్మరికుంట, జూలపల్లి మండలం భార్య : స్నేహలత పిల్లలు : కూతురు నందిని, అల్లుడు అనిల్, మనుమడు భవానీనిశ్చల్ రాజకీయ నేపథ్యం సింగరేణి సంస్థలో 20ఏళ్లపాటు ఉద్యోగిగా పనిచేశారు. 1983లో టీడీపీలో చేరిన ఈశ్వర్ రాష్ట్ర మిడ్‌క్యాప్ సంస్థ డైరెక్టర్‌గా.. మినిమమ్ వేజ్ అడ్వైజరీ బోర్డ్ డైరెక్టర్‌గా.. మేడారం నియోజకవర్గం దేశం పార్టీ ఇన్చార్జిగా పనిచేశారు. 1994లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. 2001 టీఆర్ఎస్లో చేరారు. 2004 జనవరిలో జరిగిన ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి 56 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో 28వేల ఓట్ల మెజార్టీతో అదేస్థానం నుంచి ఎన్నికయ్యారు. నియోజకవర్గ పునర్విభజనలో మేడారం నియోజకవర్గం రద్దు కావడంతో ధర్మపురి నియోజకవర్గం నుంచి 2009 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. 2009, 2010 ఉప ఎన్నిక, 2014 సాధారణ, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను వరుసగా ఓడించారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్‌కు ఈసారి మంత్రిపదవి దక్కింది. -
అధినేత మదిలో ఏముందో..?!
మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ముంచుకొస్తోంది. అమాత్య పదవులు ఎవరినీ వరించనున్నాయోనన్న ఊహాగానాలకు త్వరలోనే తెరపడనుంది. ఈనెల 18న మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని కొందరు కొత్తగా ప్రయత్నాలు చేస్తుండగా.. ఈసారి కూడా అనుకున్న శాఖను దక్కించుకోవాలని గతంలో మంత్రివర్గంలో పనిచేసిన వారు పావులు కదుపుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణతోపాటు పార్లమెంటరీ కార్యదర్శి పదవులను కూడా మరోసారి తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. 2014 ఎన్నికల తర్వాత పార్లమెంటరీ కార్యదర్శి పదవులను తెరపైకి తెచ్చి ఐదుగురికి పదవులు కట్టబెట్టారు. అయితే పార్లమెంటరీ కార్యదర్శి, ఇతర నానినేటెడ్ పోస్టుల కోసం పోటాపోటీగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేటాయింపు కోసం అధినేత మదిలో ఎవరున్నారో..? ఏముందో..? అర్థంగాక ఆందోళన చెందుతున్నారు. – సాక్షిప్రతినిధి, కరీంనగర్ సాక్షి, కరీంనగర్ : గతంలో ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్య వహించిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు మళ్లీ మంత్రివర్గంలో చోటు దక్కనుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే మరో మంత్రి పదవి కూడా జిల్లాకు దక్కనుండడంతో ఆ పదవి ఎవరికి దక్కుతుందోననే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో డబుల్ హ్యాట్రిక్ సాధించిన ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ గతంలో ప్రభుత్వ విప్‌తో సరిపెట్టుకోగా.. ఈ సారి ఎస్సీ సామాజికవర్గం కోటాలో మంత్రి పదవి కావాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఇదే కోవలో హ్యాట్రిక్ సాధించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీసీ కోటాలో.. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సైతం జనరల్ కోటాలో మంత్రి పదవి కోసం గట్టి పట్టుబట్టుతున్నారు. కేసీఆర్‌కు ఎంతో ఇష్టమైన కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి గెలిచిన అభ్యర్థికి మంత్రి పదవి ఇచ్చే ఆలోచన కూడా ఉండడం బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో మంత్రి పదవిపై గంగుల గంపెడాశలు పెంచుకున్నారు. పార్లమెంటరీ కార్యదర్శి పదవులు ఓకే అయితే పక్కాగా మూడు మంత్రి పదవులు జిల్లాకు దక్కుతాయని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. గతంలో ఇద్దరితోపాటు కొత్తగా ఎస్సీ కోటాలో కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి దక్కేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయంటున్నారు. అధినేత కసరత్తు.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రిపదవులపై కసరత్తు చేస్తున్నారు. కులాలవారీగా సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని జాబితా తయారు చేస్తున్నారు. జాబితాలో ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురికి తప్పనిసరిగా చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. మాజీ మంత్రి కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కట్టబెట్టడంతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులైన వొడితెల సతీష్‌బాబుకు ఈసారి కూడా ఆ పదవి దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి పదవులను కేటాయించడంతో అధినేత కేసీఆర్ చెప్పిందే వేదం కావడంతో అధినేతను ప్రసన్నం చేసుకునేందకు ఆశావహులు రాజధానిలోనే చక్కర్లు కొడుతున్నారు. అధినేతకు టచ్‌లో ఉంటూ తమకు మంత్రి పదవులు కేటాయించాలని కోరుతున్నారు. అయితే ఈ సారి కొత్తవారిని, పాతవారిని కలుపుకొని మంత్రి పదవులు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు మంత్రి పదవులకు సామాజిక, జిల్లాల కోణం అడ్డుగా వస్తే రెండు మంత్రి పదవులు ఇచ్చి, స్పీకర్, పార్లమెంటరీ సెక్రటరీ పదవులు ఇస్తారని తెలుస్తోంది. ఇలా జరిగితే ఉమ్మడి జిల్లాను నాలుగు పదవులు వరిస్తాయని తెలుస్తోంది. కేసీఆర్ మదిలో ఏముందో..? రెండు రోజుల్లో తేటతెల్లం కానుంది. ఈ సారి విస్తరణలో మొత్తం మిగిలిన 16 మందిని తీసుకుంటారా? లేక ప్రచారం జరుగుతున్నట్లు 6 నుంచి 8 మందిని చేర్చుకుంటారా? అన్న అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం మందిని తీసుకుంటేనే ఉమ్మడి జిల్లాలో ముగ్గురిని మంత్రి పదవులు వరించనున్నాయన్న ప్రచారం జరుగుతుండగా... అధినేత మనసులో ఏముందనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. -
‘కొప్పుల’ను ఓడించేందుకు వివేక్ ప్రోద్బలం, 3 కోట్లు..!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో రాజకీయం రంగులు మారుతోంది. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీలో అంతర్మథనం మొదలైంది. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని రెండు స్థానాల్లో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. మంథనిలో పుట్ట మధు, రామగుండంలో సోమారపు సత్యనారాయణ భారీ తేడాతో ఓటమి పాలుకాగా, ధర్మపురిలో సీనియర్ శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్ అతి కష్టంగా విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిస్తే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే ఇలాంటి ఫలితాలు రావడానికి ‘బలమైన’ శక్తులు పనిచేశాయని ఓడిన ఇద్దరితోపాటు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నారు. భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగంగానే మాజీ ఎంపీ జి.వివేక్ లోక్‌సభ పరిధిలో ఫలితాలను శాసించేందుకు యత్నించారని వారు భావిస్తున్నారు. భగ్గుమంటున్న పార్టీ శ్రేణులు ఇటీవల దర్మపురి నియోజకవర్గం టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు వివేక్‌పై బాహాటంగానే విమర్శలు చేశారు. పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను ఓడించేందుకు వివేక్ వర్గీయులు రూ.3 కోట్లు ఖర్చు చేశారని, వివేక్ ప్రోద్బలంతోనే ఇది జరిగిందని వారి ఆరోపణ. బెల్లంపల్లి నుంచి తన సోదరుడు వినోద్‌ను బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దింపి, తమ నేతను ఓడించేందుకు విచ్చలవిడిగా ఖర్చు చేశారని చిన్నయ్య వర్గీయులు ఆరోపిస్తున్నారు. చెన్నూరులో వివేక్ ఆఖరులో మాత్రమే ప్రచారానికి వచ్చారని బాల్క సుమన్ అనుచరులు గుర్తు చేస్తున్నారు. రామగుండంలో రెబెల్‌గా పోటీ చేసిన కోరుకంటి చందర్‌కు వివేక్ వర్గీయులు మద్ధతుగా నిలిచినట్లు సోమారపు అనుచరుల ఆరోపణ. వివేక్ కారణంగా భారీ మెజారిటీ కోల్పోయినట్లు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అనుచరులు చెబుతున్నారు. మంథనిలో పుట్టా మధు కోసం వివేక్ ప్రచారం చేసినా, ఫలితమివ్వలేదు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని దాదాపు ఐదు సెగ్మెంట్లలో పోటీ చేసిన అభ్యర్థులు, వారి అనుచరు ల్లో వివేక్ పట్ల అసంతృప్తి పెల్లుబుకుతోంది. దీంతో పెద్దపల్లి ఎంపీ సీటుపై సందిగ్ధం నెలకొంది. వివేక్‌కు లోక్‌సభ సీటిస్తే ఒప్పుకునేది లేదని సగానికి పైగా ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. -
‘నేరెళ్ల ఘటనపై కాంగ్రెస్ కృత్రిమ రాజకీయం’
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఏడాది క్రితం జరిగిన నేరెళ్ల ఘటనపై కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకుని, కృత్రిమ రాజకీయం చేస్తోందని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. అబద్ధాల పునాదుల మీద ఆందోళనలు చేయాలనుకుని, మంత్రి కేటీఆర్‌పై బట్టకాల్చి మీదేసే విధంగా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ చేస్తున్న రాజకీయాలు శవాలపై పేలాలు ఏరుకుంటున్నట్టుగా ఉందన్నారు. కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేని నేరెళ్ల ఘటనను అడ్డంపెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలకు సంబంధించిన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తూ, ఓటుబ్యాంకు స్వార్థ రాజకీయాలకు తమను వాడుకుంటున్నదని దళితులు, నేరెళ్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇసుక మాఫియాను కేటీఆర్‌కు అంటగట్టడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఇసుకమాఫియాను పెంచి పోషించారని, 23 జిల్లాల ఉమ్మడి రాష్ట్రంలోనే రూ.10 కోట్లు ఖజానాకు రాలేదన్నారు. తెలంగాణ ఇసుక పాలసీ దేశానికి ఆదర్శంగా నిలిచిందని వివరించారు. -
కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలం
సారంగాపూర్: కాళేశ్వరం ప్రాజెక్టుతో సగం తెలంగాణ సస్యశ్యామలం కానుందని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. సారంగాపూర్ మండలం పోతారం గ్రామ మహాలక్ష్మీ అమ్మవారి ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొని మాట్లాడారు. గోదావరి నుంచి వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలనే సీఎం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారన్నారు. ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ పనులు సైతం వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కాళేశ్వరం ద్వారా తెలంగాణలోని 13 జిల్లాల్లోని రూ.38లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రోల్లవాగు ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.62కోట్లు వెచ్చిస్తుందన్నారు. రివర్స్ పం పింగ్ ద్వారా ఏడాది పొడవునా నీరు ఉంటుందని తెలిపారు. ఎంపీపీ కొల్ముల శారద, ధర్మపరి జెడ్పీటీసీ బాదినేని రాజమణి, సర్పంచులు తోడేట శేఖర్, భైరి మల్లేశం, గుర్రం స్వామి, ఎంపీటీసీ మల్యాల సత్తెమ్మ, విండోచైర్మన్ సాగి సత్యంరావు, బాదినేని రాజేందర్, మాజీ జెడ్పీటీసీ కొల్ముల రమణ పాల్గొన్నారు. -
'డబుల్’ ఇళ్ల నిర్మాణంలో విజన్ ఉంది
జగిత్యాల: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నారనీ, 2 లక్షల ఇళ్ల నిర్మాణం ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని.. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, పెగడపల్లి, గొల్లపల్లి, వెల్గటూర్, మండలాలకు సంబంధించిన గ్రామాల డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
దొంగ రాజీనామాల సంస్కృతి కాంగ్రెస్‌దే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో దొంగ రాజీనామాలు, దొంగ దీక్షలు చేసిన చరిత్ర కాంగ్రెస్ నాయకులదేనని, అది వారి సంస్కృతి అని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌పై కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నా మన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్‌రెడ్డి ఒక్కరోజు కూడా ఉద్యమకారులకు అండగా నిలవలేదని ఆరోపించారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సమయంలో విద్యార్థుల ఆత్మహత్య లు పెరిగి, ఉద్యమకారులపై అక్రమ కేసులు, పోలీసు నిర్బంధం పెరిగినప్పుడు కూడా ఆయన స్పందించక పోగా అవహేళన చేయలేదా అని ప్రశ్నించారు. జాతీయవాదిని, దేశ మంత్రిని అని చెప్పుకునే ఆ పెద్ద మనిషికి తెలంగాణను సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. -
'ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా'
హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్. జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ గురించి సోనియా గాంధీతో జైపాల్ రెడ్డి ఎప్పుడైనా చర్చించారా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంతో రాజీనామా చేయకుండా కాంగ్రెస్ నేతలు పారిపోయారని, ఆ విషయం జైపాల్ రెడ్డికి తెలియదా అని నిలదీశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన ఉపవాస దీక్ష ఒట్టి బూటకం అని జైపాల్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగాల భర్తీపై తెలంగాణ జేఏసీ విషప్రచారం చేస్తోందని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. -
తేనెటీగల దాడి.. నేతలు పరుగో పరుగు!
గొల్లపల్లి: తేనెటీగలు దాడిచేయడంతో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్క సుమన్ సహా పలువురు స్వల్పంగా గాయపడ్డారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి శివారులోని మామిడితోటలో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలను ప్రారంభించడానికి కొప్పుల ఈశ్వర్, బాల్కసుమన్ వెళ్లగా అకస్మాత్తుగా తేనెటీగలు విజృంభించడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్ఎస్ ఎంపీ, స్థానిక సీఐ శరత్, ఎస్ఐ ఉపేంద్రచారి సమా పలువురు టీఆర్ఎస్ నాయకులు తేనెటీగల దాడిలో స్వల్పంగా గాయపడ్డారు. క్రీడాపోటీల వేదిక వద్ద తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేయడంతో రాజకీయ నాయకులు తమ కార్లలోకి పరుగులు పెట్టారు. తేనెటీగలు వెళ్లిపోయి అంతా మామూలు పరిస్థితి ఏర్పడ్డాక గాయపడిన వారు స్థానిక ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. అనంతరం అక్కడే భోజనాలు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పేదల ఎజెండాగా అసెంబ్లీ నడిపాం
► విలేకరుల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు ► 18 రోజులపాటు నిర్వహించి రికార్డు సృష్టించాం ► చిత్తశుద్ధితో ప్రతిఅంశంపై చర్చించాం.. ► సభ నిర్వహణపై ప్రతిపక్షాలు శభాష్ అన్నాయి ► తొలిసారిగా మత్స్యకారుల గురించి చర్చించామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 18 రోజులపాటు నిర్వహించి రికార్డు సృష్టించాం. విపక్షాలతో సభలో శభాష్ అనిపించుకున్నాం. జాతీయ స్థాయిలో సభల నిర్వహణకు తెలంగాణ అసెంబ్లీ ఆదర్శంగా నిలిచింది. సభానాయకుడిగా కేసీఆర్ ఉదార వాదిగా, మానవతావాదిగా వ్యవహరించారు కాబట్టే సమావేశాలు సజావుగా నడిచాయి. ప్రజా సమస్యలే ఎజెండాగా అసెంబ్లీని నడిపించాం’ అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కోరినంత సమయం ఇచ్చామని, ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతీ అంశంపై చర్చ జరిపిందని తెలిపారు. బుధవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్‌లు గొంగిడి సునీత, నల్లాల ఓదెలు, ఎమ్మెల్యే పుట్టు మధులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. చట్టసభలపై దేశవ్యాప్తంగా ప్రజల్లో అసహనం పెరుగుతున్న సమయంలో తెలంగాణ అసెంబ్లీ ప్రజాస్వామ్య విలువలను పెంచిందని, అర్థవంతమైన చర్చ జరిగిందని తెలిపారు. గతంలో సభా నాయకుల సంకుచిత మనస్తత్వం, అహంభావంతో సభలు సరిగా నడిచేవి కావని, కానీ సీఎం కేసీఆర్ అందుకు భిన్నంగా వ్యవహరించారని పేర్కొన్నారు. సమయంతో నిమిత్తం లేకుండా చర్చలు అర్థవంతంగా, మూస ధోరణికి భిన్నంగా నడిచాయని వివరించారు. ప్రతిపక్షాలు స్వేచ్ఛగా ప్రశ్నించేలా.. గతంలో సమావేశాల్లో విలువలకు శిలువలు పడిన పరిస్థితిని చూశామని, ప్రతిపక్షాలు స్వేచ్ఛగా ప్రశ్నించేలా, అధికార పక్షం సమస్యలు పరిష్కరించేలా సమావేశాలు జరిగాయని హరీశ్ తెలిపారు. సభ్యులు అడిగిన దాంట్లో న్యాయం ఉందనుకుంటే ప్రతిపక్షం, అధికార పక్షం అనే తేడా లేకుండా కేసీఆర్ అంగీకారం తెలిపారని, విపక్షాలు సభ బయట చెప్పినవన్నీ అబద్ధమని అసెంబ్లీలో నిరూపించగలిగామని చెప్పారు. 15 అంశాలపై స్వల్ప కాలిక చర్చ జరగడం తనకు తెలిసి ఇదే మొదటిసారని వివరించారు. గతంలో ఎప్పుడూ శీతాకాల సమావేశాలు ఇన్ని రోజులపాటు జరగలేదని, అత్యధికంగా 1999లో 10 రోజులు, 2005లో 13 రోజులు జరగడమేనని పేర్కొన్నారు. ఇక 2011–12లో కేవలం 3 రోజులు మాత్రమే శీతాకాల సమావేశాలు జరిగాయన్నారు. సభ హుందాతనం పెంచిన సీఎం సభలో విధాన పరమైన ప్రకటనలు చేసి సీఎం కేసీఆర్ అసెంబ్లీ హుందాతనం పెంచారని, హౌసింగ్‌పై చర్చ సందర్భంగా రూ.36 వేల కోట్ల బకాయిలు మాఫీ చేస్తామని ప్రకటించి విపక్షాలను సైతం ఆశ్చర్యానికి గురి చేశారని హరీశ్‌రావు అన్నారు. తొలిసారిగా మత్స్యకారుల గురించి సభలో చర్చించి వారికి భరోసా ఇచ్చారన్నారు. గతంలో సమావేశాల్లో విద్యుత్ అంశంపై రచ్చ జరిగేదని, కానీ ఈసారి ఆ పరిస్థితే ఎదురు కాలేదని, అన్న ప్రకారం రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నందునే ఇది సాధ్యమైందని తెలిపారు. సింగరేణి అంశంపై జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి చేసిన సూచనలనూ సీఎం ఆమోదించారని గుర్తు చేశారు. అభినందనలు తెలపడం మినహా ప్రతిపక్షాలు ఏం చేయలేకపోయాయని వ్యాఖ్యానించారు. శాసన మండలిలోనూ అర్థవంతమైన చర్చ జరిగిందని తెలిపారు. మంత్రి లక్ష్మారెడ్డికి కితాబు సమావేశాల్లో ఎక్కువ ప్రశ్నలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి జవాబిచ్చారని హరీశ్ కొనియాడారు. అర్థవంతమైన చర్చ జరిపితే ఎన్ని రోజులైనా సభ జరపడానికి సిద్ధమని ఈ సమావేశాల ద్వారా రుజువు చేశామని, పోడియంలోకి వస్తే సస్పెండ్ చేస్తామని ముందే చెప్పామని, ఒక రోజు ఆ పరిస్థితి కూడా వచ్చిందని తెలిపారు. సభా నేతకు ఇచ్చిన గౌరవమే ప్రతిపక్ష నేతకూ ఇచ్చామని, ఆయన మాట్లాడటానికి లేస్తే, మంత్రులం కూర్చుని అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. పొరుగున ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలుసని, దానికి భిన్నంగా సమావేశాలు జరిగాయని తెలిపారు. తాము మొండితనానికి పోలేదు కాబట్టే సమావేశాలు హుందాగా జరిగాయని, సహకరించిన విపక్షాలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. -
భట్టివి అసందర్భ వ్యాఖ్యలు: కొప్పుల
-
భట్టివి అసందర్భ వ్యాఖ్యలు: కొప్పుల
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వాయిదాపై కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క అసందర్భమైన వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సభలో అన్ని పార్టీల సభ్యుల దృష్టికి తీసుకువెళ్లి, వారి అభి ప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే ఒక గంట ముందుగా సభను వాయిదా వేశామని తెలిపారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత కొప్పుల మీడియా పాయింట్లో మాట్లా డారు. చర్చలో పాల్గొనే శక్తి లేని కాంగ్రెస్, ఒక గంట ముందుగా సభను వాయిదా వేస్తే ప్రభుత్వం పారిపోయిం దని అనడం అవివేకమని తెలిపారు. అందరి అవ సరాల మేరకే సభను వాయిదా వేశామని, కాంగ్రెస్ సభ్యులు చిన్నారెడ్డి, జీవన్‌రెడ్డి, సంపత్‌లకు ఈ విషయం తెలుసన్నారు. కాంగ్రెస్ హయాంలో రోజులకు రోజులు సభను వాయిదా వేసిన విషయాన్ని భట్టి మరిచిపోయారా అని ప్రశ్నించారు. సభలో మాట్లాడే సత్తా లేకే భట్టి అన్యాయంగా బయట మాట్లాడుతున్నారని విమర్శించారు. శుక్రవారం టీఎస్ ఐపాస్ పైనే చర్చ సాగుతుందని, కాంగ్రెస్ సభ్యులకు దిమ్మతిరిగే సమాధానం ఇస్తామన్నారు. -
'కాంగ్రెస్ పార్టీ బాధ్యతను విస్మరించింది'
హైదరాబాద్ : ఇరిగేషన్ ప్రాజెక్టులపై నిర్మాణాత్మక సలహాలివ్వడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని తెలంగాణ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ...అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కాంగ్రెస్ పార్టీ బాధ్యతను విస్మరించి పారిపోయిందన్నారు. తమ్మిడిహెట్టి కంటే మేడిగడ్డ వద్దే ఎక్కువ నీటి లభ్యత ఉంటుందన్నారు. ప్రాజెక్టులపై వాస్తవాలను తెలుసుకోకుండా కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు
కాంగ్రెస్‌పై ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే కాం గ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కొప్పుల కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ విఫలమైందన్న కాంగ్రెస్ నేతలు ఉత్తమ కుమార్, షబ్బీర్ అలీ వ్యాఖ్యలకు కొప్పుల ఘాటుగా సమాధానమిచ్చారు. ఏడాదిన్నర కాలంగా దేశంలో, ఏరాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, ఆ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేన న్నారు. ఇకనైనా కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని కొప్పుల హితవు పలికారు. -
ఆ ఇద్దరికి మంత్రి పదవులు సాధ్యమేనా?
కొప్పులను మంత్రిని చేస్తానన్న సీఎం ఇటీవల రసమయిని కేబినెట్లోకి తీసుకుంటానని హామీ ఇప్పటికే జిల్లా నుంచి ఇద్దరు మంత్రుల ప్రాతినిధ్యం ఈటల, కేటీఆర్ ఇద్దరూ కీలకమైన వారే మరో ఇద్దరికి ఎలా సాధ్యం? సిట్టింగ్ మంత్రుల్లో పదవి కోల్పోయేదెవరు? టీఆర్ఎస్లో చర్చనీయాంశమైన సీఎం హామీ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్‌ను కేబినెట్లోకి తీసుకుంటానంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరీంనగర్ జిల్లా ధర్మారంలో ఆదివారం చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, శ్రేణుల మధ్య విస్తృత చర్చకు దారి తీశాయి. సరిగ్గా నెల రోజుల క్రితం రాష్ర్ట సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్‌ను సైతం కేబినెట్లోకి తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారు. అప్పట్లో హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి కేసీఆర్ హాజైరె ప్రజలు, మీడియా సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్ ఇద్దరూ కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే. కొప్పుల ధర్మపురి, రసమయి మానకొండూరు నియోజకవర్గాలకు ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. అందులోనూ ఇద్దరు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారే. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఈటల రాజేందర్, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు కొనసాగుతున్నారు. ప్రభుత్వంలో, పార్టీలో ఇద్దరూ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నవారే. ఇప్పుడు కొప్పుల ఈశ్వర్, రసమయిలను కేబినెట్లోకి తీసుకుంటే ఒకే జిల్లాకు నాలుగు మంత్రి పదవులు ఇవ్వడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే సీఎంతో కలిపి రాష్ర్ట కేబినెట్ మంత్రుల సంఖ్య 18కి మించకూడదు. ఇప్పటికే ఆ సంఖ్యతో కేబినెట్ కొనసాగుతోంది. అందులోంచి ఇద్దరిని పక్కనపెడితే తప్ప ఈశ్వర్, రసమయిలకు అవకాశం దక్కడం అసాధ్యం. ప్రస్తుతం కేబినెట్లో కొనసాగుతున్న ఏకైక ఎస్సీ నేత కడియం శ్రీహరి. కొద్ది నెలల క్రితమే ఆయనకు డిప్యూటీ సీఎం పగ్గాలు అప్పగించారు. ఈ పరిస్థితుల్లో ఆయనను పక్కనపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. అయినప్పటికీ కేసీఆర్ ఆ ఇద్దరికీ కేబినెట్ బెర్త్ హామీలు ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటో గులాబీ శ్రేణులకు బోధపడటం లేదు. పార్టీ సీనియర్ నేతలు మాత్రం కేబినెట్లో కొత్త వారికి అవకాశం ఇస్తానని సీఎం అన్నారంటే... సరిగా పనిచేయని మంత్రులు తీరు మార్చుకోకుంటే తప్పిస్తానని హెచ్చరికలు పంపడమేనని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా మంత్రి పదవి రాలేదని బాధపడుతున్న వారికి కేసీఆర్ వ్యాఖ్యలు టానిక్‌లా ఉపయోగపడతాయని చెబుతున్నారు. కొందరు నేతలైతే కేసీఆర్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, గతంలో పలు సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. గత సాధారణ ఎన్నికల సమయంలో ధర్మపురి బహిరంగ సభలో కేసీఆర్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి 'కొప్పుల ఈశ్వర్‌ను మీరు గెలిపిస్తే... అధికారంలోకి రాగానే మంత్రిని చేస్తా'నంటూ బహిరంగంగానే హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందేననని, ఇప్పటికి రెండుసార్లు కేబినెట్లో మార్పులు చేసినా ఈశ్వర్‌కు మాత్రం చోటు దక్కలేదని చెబుతున్నారు. పంచాయతీ వ్యవస్థపై సీఎం విమర్శల మర్మమేమి? ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్ది రోజులుగా రాష్ర్టంలో పంచాయతీ వ్యవస్థ దారుణంగా విఫలమైందని బహిరంగ వేదికలపైనే వ్యాఖ్యానిస్తున్నారు. పంచాయతీ అధికారుల పనితీరు ఏమాత్రం బాగోలేదని చెబుతున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జి ల్లాలో రెండ్రోజులు పర్యటించిన కేసీఆర్ పంచాయతీ వ్యవస్థ దారుణంగా విఫలమైంది. సర్పంచులు, ఎంపీటీసీలు తమ బాధ్యతలను విస్మరించి పైరవీలకోసం పట్టణాలకే పరిమితమవుతున్నారు. పంచాయతీ అధికారుల పనితీ రు ఏమాత్రం బాగోలేదు అని ఘాటుగా వ్యా ఖ్యానించారు. వాస్తవానికి కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారకరామారావే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఆ శాఖ పనితీరు ఏమాత్రం బాగోలేదని కేసీఆర్ బహిరంగ వ్యాఖ్యలు చేయడం వెనుక మర్మమేమిటనే దానిపై గులాబీ నేతల్లో చర్చ జరుగుతోంది. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని గత కొంత కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గత ఏప్రిల్‌లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలోనే కేటీఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తూ అధికారికంగా ప్రకటిస్తారని భావించారు. కానీ ఆనాడు కొన్ని రాజకీయ కారణాల వల్ల కేసీఆర్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈసారి కేబినెట్లో మార్పులు చేస్తే కేటీఆర్‌ను కేబినెట్ నుంచి తప్పించి కీలకమైన పార్టీ పగ్గాలు అప్పగిస్తారని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు కేటీఆర్ నిర్వహిస్తున్న శాఖపై విమర్శలు చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నిస్తే తప్పు చేస్తే కుటుంబ సభ్యులెవరైనా ఒకటేనని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారని, కేబినెట్ సహచరులకు నిరంతరం హెచ్చరికలా పనిచేసేందుకే పంచాయతీరాజ్ శాఖ పనితీరుపై నిర్మొహమాటంగా మాట్లాడుతున్నారని విశ్లేషిస్తున్నారు. సామాజిక సమతుల్యం లోపించిన కేబినెట్ ప్రస్తుత కేబినెట్లో సీఎంతో కలుపుకుని 11 మంది అగ్రకులాలకు చెందిన మంత్రులున్నారు. వీరిలో ఆరుగురు రెడ్డి, నలుగురు వెలమ, ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. మిగిలిన నలుగురు బీసీలు కాగా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గానికి చెందిన వారు ఒక్కొక్కరు కొనసాగుతున్నారు. కేసీఆర్ కేబినెట్లో ఒక మహిళకు కూడా చోటు దక్కలేదు. మొత్తంగా చూస్తే కేబినెట్లో సామాజిక సమతుల్యం లోపించిందని సొంత పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. గిరిజన, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ ఎన్నికల ప్రణాళికలోనే ప్రకటించిన నేపథ్యంలో ఈ సామాజికవర్గాలకు చెందిన చెరో ఇద్దరినీ కేబినెట్లోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కేబినెట్లో మహిళలకు మూడో వంతు చోటు కల్పించాల్సి ఉన్నప్పటికీ, కనీసం ఒక్క స్థానమైనా దక్కితే చాలని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ జరగాలంటే కేబినెట్లో ఓసీల సంఖ్యను కుదించాల్సిన అవసరముందని చెబుతున్నారు. అదే జరిగితే ఓసీ మంత్రుల్లో ఎవరికి ఎసరొస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
'కొప్పుల ఈశ్వర్ ను మంత్రిని చేస్తా'
-
కొప్పుల ఈశ్వర్ కు బుజ్జగింపు
హైదరాబాద్: మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ను బుజ్జగించేందుకు టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. ఆయనకు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, సీఎం కేసీఆర్ తో భేటీ కావాలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు ఆదివారం ఆయన కరీంనగర్ లో ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న కొప్పుల ఈశ్వర్ కు సీఎం కేసీఆర్... చీఫ్ విప్ పదవి కేటాయించడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. మొదట్లో ఆయనకు డిప్యూటీ సీఎం దక్కుతుందని ప్రచారం జరిగినా ఫలించలేదు. మలి విడతలోనూ మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు రుగైయ్యారు. -
'చీఫ్ విప్ ఇచ్చి అన్యాయం చేయొద్దు'
-
'చీఫ్ విప్ ఇచ్చి అన్యాయం చేయొద్దు'
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్లో తొలి విస్తరణలో స్థానం దక్కక పోయినా రెండోసారి విస్తరణలోనైనా చోటు దక్కుతుందని కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ భావించారు. కానీ సీఎం కేసీఆర్... చీఫ్ విప్ పదవి కేటాయించడంతో కొప్పుల ఈశ్వర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. చీఫ్ విప్ పదవిని నిరాకరిస్తున్నట్లు కొప్పుల ఈశ్వర్... కేసీఆర్ సన్నిహితుల వద్ద తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం. అయితే కొప్పుల ఈశ్వర్‌కు చీఫ్ విప్ పదవిని కేటాయించడంపై మాలమహానాడు కార్యకర్తలు కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. చీఫ్ విప్ పదవి తీసుకోవద్దంటూ కరీంనగర్‌లోని కొప్పుల ఈశ్వర్ నివాసం వద్ద ఆదివారం మాల మహానాడు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈశ్వర్‌కు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి వద్దు ... 16వ తేదీన జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో మీ వెన్నంటి ఉన్న తమ నాయకుడు ఈశ్వర్‌కు చీఫ్ విప్ పదవి ఇచ్చి అన్యాయం చేయొద్దని వారు సీఎం కేసీఆర్‌కు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. అయితే ఇదే అంశంపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కొప్పుల ఈశ్వర్‌ను కోరగా... అందుకు స్పందించేందుకు ఆయన నిరాకరించారు. -
టీడీపీ చెల్లని పైసా: టీఆర్ఎస్
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ చెల్లని పైసాగా మారిందని టీఆర్ఎస్ శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్, అధికార ప్రతినిధి కె.రాజయ్య యాదవ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. శాసనసభాపక్ష కార్యాలయంలో విలేకరులతో ఈశ్వర్ మాట్లాడుతూ మద్యం విధానం, శాసనసభ సమావేశాల తీరుపై టీడీపీ తెలంగాణ అధ్యక్షులు ఎల్.రమణ చేసిన ఆరోపణలు దారుణమన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు హూందాగా వ్యవహరించారన్నారు. టీడీపీ సభ్యులకు పోలవరం ఆర్డినెన్సుపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ చవకబారు విమర్శలకు దిగడం మంచిది కాదన్నారు. అబద్దాలు మాట్లాడితే కోర్టుకీడుస్తాం: రాజయ్య యాదవ్ టీఆర్ఎస్ను, కేసీఆర్‌ను అప్రతిష్ట పాల్జేయడానికి అబద్దాలు మాట్లాడితే తెలంగాణ టీడీపీ నేతలను కోర్టుకు ఈడుస్తామని అధికార ప్రతినిధి కె.రాజయ్య యాదవ్ హెచ్చరించారు. తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ మద్యం విధానం, రైతు రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అయినా టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటం దారుణమన్నారు. అందుకే టీడీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తెలంగాణ ప్రజలు బుద్డి చెప్పారని గుర్తుచేశారు. -
కేసీఆర్ హామీ.. చంద్రబాబు కమిటీ: కొప్పుల
-
కేసీఆర్ హామీ.. చంద్రబాబు కమిటీ: కొప్పుల
హైదరాబాద్: రైతు పంట రుణాల మాఫీపై తమ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన హామీ ఇస్తే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రుణమాఫీపై ఎవరి చిత్తశుద్ధి ఏంటో దీన్నిబట్టే అర్ధమవుతోందని అన్నారు. ఈ వాస్తవాన్ని విస్మరించి తెలంగాణ టీడీపీ నేతలు సీఎం కేసీఆర్‌పై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ఆర్డినెన్స్ పాపం చంద్రబాబుదేనని అన్నారు. టీటీడీపీ నేతలు ఈ అంశంపై చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని ప్రశంసించారు. ఆయనకు యేడాది గడువిస్తే ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా అమలుచేస్తారని కొప్పుల ఈశ్వర్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
విస్తరణపైనే ఆశలు
ఉత్కంఠలో ‘కొప్పుల’మంత్రా.. చీఫ్ విప్పా.. ఈశ్వర్ వర్గీయుల్లో టెన్షన్ కరీంనగర్ సిటీ : ఒకటి తను వద్దన్నాడు... మరొకటి పార్టీ ఇవ్వనంది.. అన్నట్లు తయారైంది ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ పరిస్థితి. తనకు వస్తుందనుకున్న డెప్యూటీ సీఎం పదవిరాకపోగా, అధినేత ఆఫర్ చేసిన స్పీకర్ పదవి పట్ల ఆయన విముఖత చూ పారు. అయినప్పటికీ స్పీకర్, డెప్యూటీ స్పీకర్లలో ఏదో ఒక పదవి వస్తుంద నే అంతా భావించారు. చివరకు స్పీకర్‌గా మధుసూదనాచారి, డెప్యూటీ స్పీకర్‌గా పద్మాదేవేందర్‌రెడ్డి పేర్లు ఖరారు అయ్యాయి. దీంతో కొప్పులకు దక్కే పదవిపై మళ్లీ చర్చ మొదలైంది. తనకు ఏ ఇతర పదవులు వద్దని, మంత్రి పద వే కావాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి చెప్పిన ఈశ్వర్, అందుకు అనుగుణంగా హామీ పొందినట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. తనకు కచ్చితంగా మంత్రి పదవే వస్తుందనే భరోసాతో ఉన్న కొప్పుల, మంత్రివర్గ విస్తరణపైనే ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ఆయనకు కచ్చితంగా స్థానం లభిస్తుందనే భరోసాతో ఆయన వర్గీయులు ఉన్నారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి, పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్‌కు పదవి లభిస్తుందని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. అయితే మంత్రి పదవి లభిస్తుందా, అంతే స్థాయిలో ఉన్న మరో పదవి వరిస్తుందా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. ఆయనకు కేబినెట్ ర్యాంకుతో సమానమైన చీఫ్ విప్ పదవి వస్తుందనే ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే జిల్లాకు రెండు మంత్రి పదవులు ఇవ్వగా, కొప్పులకు చీఫ్ విప్ కట్టబెట్టాలని సీఎం ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. డెప్యూటీ సీఎం, స్పీకర్, డెప్యూటీ స్పీకర్ పదవులకు కొప్పుల పేరు వినపడినా ఆ పదవులు దక్కకపోవడం, ప్రస్తుతం ఏ పదవి వస్తుందో అంచనా వేయలేకపోతుండడంతో ఈశ్వర్ వర్గీయుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈశ్వర్ మాత్రం మంత్రివర్గ విస్తర ణపైనే ఆశలు పెట్టుకున్నారు. -
9 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9 నుండి ప్రారంభం కానున్నాయి. ఈలోపే శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, ముగ్గురు విప్‌లు వంటివాటిపై ఒక నిర్ణయానికి రానున్నారు. 12 మందితో కొలువైన మంత్రివర్గంలో అవకాశం రాని సీనియర్లను శాసనసభ పదవుల్లో భర్తీ చేయనున్నారు. పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు అసెంబ్లీ స్పీకర్ పదవిని ఇవ్వాలని నిర్ణయించారు. ఆయనకు మంత్రివర్గంలోనే అవకాశం ఇవ్వాలని అనుకున్నా స్పీకర్‌గా చేయాలనే నిర్ణయం వల్ల ఇవ్వలేకపోయారు. స్పీకర్ పదవి కోసం పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేరును కేసీఆర్ ముందుగా అనుకున్నారు. కేబినెట్లోనే అవకాశం కావాలని, స్పీకర్‌గా చేయలేనని పోచారం చెప్పడంతో కొప్పుల ఈశ్వర్‌ను నిర్ణయించినట్టుతెలిసింది. అంతకుముందు జూపల్లి కృష్ణారావు, అజ్మీరా చందూలాల్, సిరికొండ మధుసూదనాచారి పేర్లను కూడా కేసీఆర్ పరిశీలించారు. కీలకమైన సభాధ్యక్ష పదవిని కూడా ‘వెలమ’ సామాజికవర్గానికే ఇస్తే విమర్శలు వస్తాయనే కారణంతో జూపల్లి పేరును విరమించుకున్నారు. చందూలాల్, మధుుసూదనాచారి స్పీకర్ పదవిపై విముఖంగా ఉన్నారు. దీనితో కొప్పుల పేరును దాదాపుగా ఖరారు చేశారు. చీఫ్‌విప్ పదవిని మధుసూదనాచారికి ఇవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఈ పదవులను మెదక్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల ఎమ్మెల్యేలతో భర్తీ చేయాలనుకుంటున్నారు. అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన ఆరు పదవులను భర్తీ చేయడం ద్వారా మంత్రివర్గ ఆశావహుల జాబితాను కుదించాలని కేసీఆర్ వ్యూహంతో ఉన్నారు. సీనియర్లను, మంత్రివర్గంలో బెర్తును ఆశించి భంగపడేవారిని అసెంబ్లీకి సంబంధించిన పదవులతో సంతృప్తి పరిచిన తర్వాతనే మంత్రివర్గ విస్తరణను చేపట్టాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారు. -
మాది విధేయత: టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలు
హైదరాబాద్: పార్టీ అధినేతకు విధేయతగా ఉన్నామని, అది బానిసత్వం కిందకు రాదని టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యే లు టి.రాజయ్య, కొప్పుల ఈశ్వర్ అన్నా రు. హైదరాబాద్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాజకీయ అవినీతి అంతం కావాలంటున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచినందుకు గర్వపడుతున్నామన్నారు. దళితులు కోరుకునే సామాజిక న్యాయం, రాజ్యాధికారంలో వాటా టీఆర్ఎస్లో, కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమన్నారు. బాబు చేతిలో పావుగా మారి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన మంద కృష్ణ లాంటివారు టీఆర్ఎస్పై విమర్శలు చేయడం సరికాదన్నారు. మాదిగలు ఎక్కువగా ఉన్న నియోజవర్గాలను చూసుకుని మూడుసార్లు పోటీచేసినా గెలవలేని మంద కృష్ణ వంటివారు బ్లాక్మెయిల్ రాజకీయాలతో ఆస్తులు పెంచుకోవడం తప్ప మాదిగ జాతి అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. -
ఆ మాట వాస్తమే...అయితే....
హైదరాబాద్: గతంలో దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ చెప్పిన మాట వాస్తవమేనని టీఆర్ఎస్ ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అంగీకరించారు. అయితే ఇప్పుడున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే కేసీఆర్‌కే సాధ్యం అని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్‌ను ఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. దళితులకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీలేదని విమర్శించారు. అందుకే దళితులు టీఆర్ఎస్కు పట్టం కట్టారని చెప్పారు. దళితుల కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని ఈశ్వర్ హామీ ఇచ్చారు. -
ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం: హరీష్‌రావు
తెలంగాణవాదులపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహారిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగిపై సీమాంధ్ర ఉద్యోగుల దాడిని నిరసిస్తూ సోమవారం విద్యుత్ సౌథ వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం తెలంగాణవాదులను రెచ్చగొడుతుందని అన్నారు. ఆ ప్రభుత్వానికి తగిన సమయంలో గుణపాఠం చెబుతామని హరీష్‌రావు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్ తదితరులు ఆ ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం వారు విద్యుత్ సౌథలోకి ప్రవేశించేందుకు యత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. -
కేసీఆర్ హత్యకు కుట్రపై దర్యాప్తు జరపాలి: టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు హత్యకు జరుగుతున్న కుట్రపై దర్యాప్తు జరిపించాలని టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేత కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పదవులే కాకుండా, ప్రాణాలను కూడా పణంగా పెట్టిన నాయకుడి హత్యకు కుట్రజరుగుతున్న విషయంతో ఇక్కడి ప్రజలు కలత చెందుతున్నారన్నారు. కేసీఆర్‌పై జరుగుతున్న హత్య కుట్రపై ముఖ్యమంత్రి, డీజీపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ కుట్రపై దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేశారు. నేడు టీఆర్ఎస్ఎల్పీ భేటీ నేడు: టీఆర్ఎస్ శాసనసభాపక్షం హైదరాబాద్‌లో గురువారం జరుగనుంది. అసెంబ్లీలోని పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో టీఆర్ఎస్ పక్షనేత ఈటెల రాజేందర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. సీమాంధ్రలోని ఉద్యమం, వివిధ పార్టీల తీరు, భవిష్యత్ కార్యాచరణతో పాటు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్తున్నారంటూ జరిగిన ప్రచారంపై సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ రాజకీయ భవితవ్యంపైనా పార్టీ అధినేత కేసీఆర్‌కే పూర్తి అధికారాలు ఇచ్చే అవకాశముందని తెలిసింది. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలెవరూ బయటకు వెళ్లబోరని ఈ సమావేశం తర్వాత సమష్టిగా ప్రకటన చేయనున్నారు.