
సాక్షి, హైదరాబాద్ : సింగరేణి యాజమాన్య సమావేశానికి తనను పిలవకపోవడంలో ఆంతర్యమేమిటని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, సింగరేణి సీఎండీ తన హక్కులను కాలరాశారని, దీనిపై తాను స్పీకర్‌కు ప్రివిలేజ్‌మోషన్ ఇస్తానని తెలిపారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలందరితో మాట్లాడేవాళ్లమని, ఇప్పుడు అదే సింగరేణి ఎమ్మెల్యేనైనా తనను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. అండర్‌గ్రౌండ్ మైనింగ్ ఓపెన్‌కాస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతోందని, సింగరేణి యాజమాన్యం ఒక పార్టీకి తొత్తులుగా పని చేస్తోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment