Privilege motion
-
Dharmendra Pradhan: కేంద్ర మంత్రిపై ప్రివిలేజ్ మోషన్
న్యూఢిల్లీ: తమిళుల మనోభావాలు దెబ్బతీశారంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై మండిపడుతున్న డీఎంకే పార్టీ.. ఆయనపై ప్రివిలేజ్ మోషన్(Privilege motion) ఇచ్చింది. ఆయన చట్ట సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో ఈ తీర్మానం దాఖలు చేశారు.తమిళనాడు.. అక్కడి ప్రజలు అనాగరికులు(Uncivilized) అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని డీఎంకే, 8 కోట్ల మంది తమిళుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా అని అన్నారామె.జాతీయ విద్యా విధానం విషయంలో తమిళనాడు ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని.. ఈ విషయంలో ఏమాత్రం నిజాయితీ లేకుండా వ్యవహరించిందని ధర్మేంద్ర ప్రధాన్(dharmendra pradhan) మండిపడిన సంగతి తెలిసిందే. ‘‘వాళ్లకు ఏమాత్రం నిజాయితీ లేదు. విద్యార్థుల జీవితాలు నాశనం చేసేలా రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ సోమవారం బడ్జెట్ మలివిడత సమావేశాల సందర్భంగా లోక్‌సభ వ్యాఖ్యలు చేశారు. దీంతో డీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగగా.. సభ వాయిదా పడింది.అయితే కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై డీఎంకే భగ్గుమంది. ధర్మేంద్ర ప్రధాన్వి తలపొగరు వ్యాఖ్యలని డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఇది తమిళులను అవమానించడమేనని,ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరిస్తారా? అంటూ మండిపడ్డారు.మరోవైపు.. పీఎం శ్రీ(PM SHRI) పథకం విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఎంవోయూపై సంతకాలకు అంగీకరించి.. ఆపై వెనక్కి తగ్గిందని ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. అయితే ఇది ఏమాత్రం నిజం కాదని.. ఈ ప్రకటన పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించేదేనని.. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని డీఎంకే అంటోంది. ఈ నేపథ్యంలో ఎంపీ కనిమొళి ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయగా.. ఆ తీర్మానాన్నిస్పీకర్ ఓం బిర్లా పరిశీలించనున్నారు. ఒకవేళ స్పీకర్ గనుక ఆ తీర్మానాన్ని అంగీకరిస్తే దర్యాప్తునకు ఆదేశిస్తారు. అందులో ఉల్లంఘన జరిగినట్లు తేలితే క్రమశిక్షణా ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటారు. -
అమిత్ షాపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్
ఢిల్లీ : కేరళ వయనాడ్ విషాదంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షాపై పార్టీ తరుఫున కాంగ్రెస్ ఎంపీ జయరామ్ రమేష్ ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టారు.వయనాడ్ విలయంపై బుధవారం రాజ్యసభలో అమిత్ షా మాట్లాడారు. జులై 23నే వయనాడ్ విలయంపై కేరళ సీఎం పినరయ్ విజయన్‌కి కేంద్ర బలగాలు హెచ్చరించాయని, అయితే ఆ హెచ్చరికలను పట్టించుకోలేదని అన్నారు. Jairam Ramesh moves Privilege Motion notice in RS against Amit Shah for his "Early Warning" claims on Wayanad landslidesRead @ANI Story | https://t.co/CxdeAeJx55#AmitShah #Congress #Wayanad #Kerala #landslides pic.twitter.com/fL7FrNmIKj— ANI Digital (@ani_digital) August 2, 2024అమిత్‌షా వ్యాఖ్యాల్ని జైరామ్ రమేష్ ఖండించారు.‘ వయనాడ్ విపత్తు గురించి కేంద్రం ముందే కేరళ రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసిందంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యసభను, సభ సభ్యుల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని స్పష్టమైంది.’ అని జైరామ్ జారీ చేసిన ప్రివిలేజ్ మోషన్ నోటీసుల్లో పేర్కొన్నారు. అమిత్‌షా వ్యాఖ్యలు బుధవారం (జూలై 31న) రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ జూలై 23న కేరళ ప్రభుత్వానికి కొండచరియలు విరిగిపడతాయనే ముందస్తు హెచ్చరిక జారీ చేసినట్లు పేర్కొన్నారు . జూలై 23న, ఘటన జరగడానికి ఏడు రోజుల ముందు కేరళ ప్రభుత్వానికి కేంద్రం ముందస్తు హెచ్చరికలు చేసిందని, ఆ తర్వాత జూలై 24, 25 తేదీల్లో మరోసారి హెచ్చరించామని, జూలై 26న సైతం మరోసారి అప్రమత్తం చేశామని పునరుద్ఘాటించారు. 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. #WATCH। केरल में हुई घटना में जितने भी लोग हताहत हुए हैं, उनके परिवार के प्रति मैं संवेदना प्रकट करता हूं। @AmitShah #Budget2024 #WayanadLandslide #RajyaSabha @mygovindia @AmitShahOffice pic.twitter.com/4Hfrrk335E— SansadTV (@sansad_tv) July 31, 2024 సహాయక చర్యలకు ఆటంకంవాయనాడ్లో కొండచరియలు విరిగిపడటంతో 300 మందికి పైగా మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికీ కూలిపోయిన భవనాలలో, శిధిలాల కింద చిక్కుకున్న వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితులు ఇళ్లు, ఇతర భవనాలపై పడిన మట్టి, నేలకూలిన చెట్లను తొలగించడం అత్యవసర సిబ్బందికి కష్టతరం చేసింది. #WATCH | Search and rescue operations continue in landslide-affected areas in Kerala's Wayanad. Drone visuals from the Chooralmala area.The death toll stands at 308. pic.twitter.com/cCuYjVpE9A— ANI (@ANI) August 2, 2024 -
బియ్యం ఎగుమతులపై.. తప్పుదోవ పట్టించారు
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాలకు ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) ఎగుమతులకు సంబంధించి ఈ నెల 1న రాజ్యసభలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానం దేశ ప్రజలను తప్పు దోవ పట్టించేలా ఉందని టీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. ఈ మేరకు ఉభయ సభల్లో ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చా రు. నామా నాగేశ్వర్రావు, రంజిత్‌రెడ్డి, బీబీ పాటి ల్, ఎంఎస్ఎన్ రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కవిత, రాములు, నేతకాని వెంకటేశ్, పసునూరి దయాకర్ లు సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లాకు నోటీసులు అందజేశారు. రాజ్యసభలో టీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్‌లు నోటీసులిచ్చారు. రాష్ట్రాల్లో అధికంగా ఉన్న బాయిల్డ్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రైతులను ఆదుకోవాలని పార్లమెంటు సభ్యుడొకరు కోరగా.. కేంద్రమంత్రి స్పందిస్తూ డబ్ల్యూటీఓ నిబంధనల కారణం గా కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగమతులు చేయలేదని వివరణ ఇచ్చారని నోటీసుల్లో ఎంపీలు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లోని గణాం కాలను పరిశీలిస్తే మిలియన్ల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లుగా ఉందని తెలి పారు. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేంద్రమంత్రి జవాబివ్వడం సభా హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. ఉభయ సభల నుంచి వాకౌట్ ప్రివిలేజ్ నోటీసులపై చర్చించాలని పట్టుబడుతూ టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో నిరసనకు దిగారు. ‘రైతులను కాపాడండి, రాష్ట్రానికి న్యాయం చేయండి’అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేశారు. అయినా స్పీకర్ ప్రశ్నోత్తరాలు కొనసాగించడంతో నిరసన వ్యక్తం చేస్తూ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇదే అంశమై రాజ్యసభ నుంచి కూడా ఎంపీలు వాకౌట్ చేశారు. 110 దేశాలకు ఎగుమతులు: ఎంపీలు కేకే, నామా వాణిజ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారమే కేంద్రం 110 దేశాలకు బాయిల్డ్ బియ్యాన్ని ఎగుమ తి చేస్తోందని ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్రావు తెలిపారు. ప్రపంచంలోని పలు దేశాలు బియ్యం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నా, తెలంగా ణ బాయిల్డ్ రైస్ ఎందుకు పంపడం లేదని ప్రశ్నిం చారు. బియ్యం సేకరించలేమని కేంద్రం పార్లమెంట్లో చెబితే రాష్ట్ర ప్రభుత్వమే రైతులను కాపాడు కుంటుందని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. -
మోదీకి షాకిచ్చిన టీఆర్ఎస్ ఎంపీలు..
-
ప్రధాని మోదీపై టీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్
న్యూఢిల్లీ: ఏపీ విభజన, తెలంగాణ ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. 187వ నిబంధన (సభా హక్కుల ఉల్లంఘన) కింద రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు నోటీసులు అందజేశారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్, సురేశ్ రెడ్డి కలిసి నోటీసులో పేర్కొన్నారు. అదే విధంగా మోదీ వ్యాఖ్యలకు నిరసనగా రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. కాగా మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానమిచ్చిన మోదీ, కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వం పార్లమెంటులో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును తొందరపడి ఆమోదించిందని వ్యాఖ్యానించారు. ఎలాంటి చర్చ జరపకుండానే ఫిబ్రవరి 2014 రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. అయితే తెలంగాణ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యతిరేకం కాదని చెబుతూనే, లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మైకులు కట్ చేశారని, తలుపులు మూసివేశారని, కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రేలు ప్రయోగించారని ప్రధాని ప్రస్తావించారు. దీని కారణంగా రెండు రాష్ట్రాలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మోదీ అన్నారు. చదవండి: ‘మోదీ హేట్స్ తెలంగాణ’: రేవంత్‌రెడ్డి -
అచ్చెన్నాయుడుపై ప్రివిలేజ్ మోషన్
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై ప్రివిలేజ్‌మోషన్ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అచ్చెన్నాయుడు తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ఆయనపై ప్రివిలైజ్ మోష్ మూవ్ చేస్తున్నామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మోషన్‌ను ప్రివిలైజ్ కమిటీకి స్పీకర్ తమ్మినేని సీతారామ్ సిఫారసు చేశారు. టీడీపీ తీరును తప్పుబట్టిన రాపాక టీడీపీ సభ్యుల తీరును జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తప్పుపట్టారు. ఎలాంటి కారణాలు లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలు సభలో రాద్ధాంతం సృష్టిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ నిధులను టీడీపీ ఎమ్మెల్యేలు స్వాహా చేశారని రాపాక ఆరోపించారు. రాజోలు నియోజకవర్గంలో గత టీడీపీ ఎమ్మెల్యే భారీ ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారన్నారు -
స్పీకర్‌కు ప్రివిలేజ్‌మోషన్ ఇస్తా: శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్ : సింగరేణి యాజమాన్య సమావేశానికి తనను పిలవకపోవడంలో ఆంతర్యమేమిటని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, సింగరేణి సీఎండీ తన హక్కులను కాలరాశారని, దీనిపై తాను స్పీకర్‌కు ప్రివిలేజ్‌మోషన్ ఇస్తానని తెలిపారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలందరితో మాట్లాడేవాళ్లమని, ఇప్పుడు అదే సింగరేణి ఎమ్మెల్యేనైనా తనను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. అండర్‌గ్రౌండ్ మైనింగ్ ఓపెన్‌కాస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతోందని, సింగరేణి యాజమాన్యం ఒక పార్టీకి తొత్తులుగా పని చేస్తోందని ఆరోపించారు. -
భావ ప్రకటనా స్వేచ్ఛే ఓ జోక్!
సాక్షి, న్యూఢిల్లీ : ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయంపైనున్న శిల్పాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రక్షణ శాఖ విశ్లేషకుడు అభిజిత్ ఐయ్యర్ మిత్రాపై ఒడిశా అసెంబ్లీలో పెద్ద దుమారం రేగడం, ఆయనపై రాష్ట్ర అసెంబ్లీ సభా హక్కుల నోటీసు జారీ చేయడం, రాష్ట్ర పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఆయన్ని అరెస్ట్ చేయడం, తక్షణమే అభిజిత్‌కు బెయిల్ మంజూరవడం గురువారం ఒక్క రోజే వేగంగా జరిగిన పరిణామాలు. ఒడిశా పాలకపక్ష బిజూ జనతాదళ్ నుంచి ఇటీవలనే బయటకు వచ్చిన మాజీ పార్లమెంట్ సభ్యుడు బైజయంత్ జైపాండేకు చెందిన హెలికాప్టర్లో అభిజిత్ ఐయ్యర్ మిత్రా, జర్నలిస్ట్ ఆర్తి టికూ సింగ్ కొణార్క్ పర్యటనకు వెళ్లారు. బుధవారం కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించిన అభిజిత్ ఐయ్యర్, అక్కడి ఆలయ గోడలపై అసభ్య భంగిమల్లో ఉన్న దేవతా విగ్రహాలను చూసి ‘ఇదేమీ విగ్రహాలు! హిందువులను అవమానించేందుకే ముస్లింలు ఈ విగ్రహాలను ఇలా చెక్కించారేమో (అసభ్య పదాలను మినహాయించాం). రేపు కట్టబోయే మా రామమందిరంలో ఇలాంటి విగ్రహాలు ఉండవు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం తన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై ఒడిశా అసెంబ్లీ, ఒడిశా పోలీసులు తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్ర అసెంబ్లీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసును జారీ చేయగా, పోలీసులు భిన్న మతాల మధ్యన వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారంటూ భారతీయ శిక్షాస్మృతిలోని 153ఏ సెక్షన్ కింద, వ్యక్తుల మత విశ్వాసాలను కించపరిచారంటూ 295ఏ, 298 సెక్షన్ల కింద అభిజిత్‌పై కేసులు నమోదు చేశారు. సాహితీవేత్తలు, విద్యావేత్తలు, కళాకారుల సృజనాత్మక చర్యలను అణచివేసేందుకు ప్రభుత్వాలు ఎక్కువగా 295ఏ, 298 సెక్షన్లను ఉపయోగిస్తాయి. ఇక ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తే 12ఏ సెక్షన్ కింద ఏకంగా దేశద్రోహం కేసులనే పెడతాయి. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛను హరించి వేస్తున్న ఈ సెక్షన్లు బ్రిటీష్ కాలం నాటివి. రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం ప్రభుత్వాలు ఈ సెక్షన్లను ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నాయి. పార్టీని విడిచిపెట్టి వెళ్లిన బైజయంత్ జయ్ పాండే అతిథిగా వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే ఒడిశా ప్రభుత్వానికి ఎక్కువ కోపం వచ్చినట్లుంది. చిలికీ సరస్సు మీదుగా వెళ్లిందన్న కారణంగా పాండే హెలికాప్టర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పర్యావరన పరిస్థితుల పరిరక్షణలో భాగంగా చిలికీ సరస్సు మీదుగా హెలికాప్టర్‌ను అనుమతించమని ప్రభుత్వం చెబుతోంది. తన వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించరాదని, జోక్ చేశానని అభిజిత్ సమర్థించుకునేందుకు ఎంత ప్రయత్నించినా పోలీసులుగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ ఆయన్ని వదిలి పెట్టడం లేదు. ఈ నెల 28వ తేదీన ఆయన విచారణకు హాజరుకావాల్సిందే. నిజంగా అభిజిత్ వ్యాఖ్యల్లో జోక్ లేదుగానీ దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందనుకోవడం మాత్రం పెద్ద జోకే! -
సుష్మా స్వరాజ్‌కు కాంగ్రెస్ ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌కు కాంగ్రెస్ పార్టీ ఝలక్ ఇచ్చింది. సుష్మాకు వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘటన నోటీసులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గురువారం కాంగ్రెస్ సీనియర్ నేత అంబికా సోని ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఐసిస్ చేతిలో బంధీలైన 39 మంది భారతీయ విషయంలో సుష్మా పార్లమెంట్‌ను, వారి బంధువులను మోసం చేశారు. ఇంతకాలం వారు బతికే ఉన్నారంటూ ప్రకటనలు చేస్తూ కుటుంబ సభ్యులను పక్కదారి పట్టించారు. అందుకే ఈ నోటీసులు అని అంబికా సోని తెలిపారు. రాజ్యసభలో ఈ తీర్మాన నోటీసులు ప్రవేశపెట్టనున్నట్లు అంబికా వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు శశిథరూర్, గులాం నబీ ఆజాద్‌లు విదేశాంగ శాఖపై మండిపడ్డారు. మరోవైపు కేంద్రం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తోందని అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే.. ఈ నోటీసుల అంశం తెరపైకి రావటం విశేషం. కాగా, పంజాబ్‌కు చెందిన 39 మంది భారతీయ కూలీలు.. 2014లో ఇరాక్ రెండో అతిపెద్ద నగరం మోసుల్ లో కిడ్నాప్‌కు గురయ్యారు. ఇంతకాలం వారు క్షేమంగానే ఉన్నారంటూ ప్రకటనలు చేస్తూ వస్తున్న కేంద్రం.. చివరకు మంగళవారం వారంతా ప్రాణాలతో లేరనే విషయాన్ని ప్రకటించింది. ఆ 39 మందిని చంపేశారు.. వాళ్లను చంపటం అతను చూడలేదు -
కేసీఆర్ పై హక్కుల ఉల్లంఘన నోటీసు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. సింగరేణి విషయంలో సీఎం కేసీఆర్ శాసనసభను పక్కదారి పట్టించారని పేర్కొంటూ బీజేపీ నేతలు ఈ నోటీస్ ను ఇచ్చారు . జనవరి 5 న కేసీఆర్ అసెంబ్లీ లో మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగులు లేరని అవాస్తవాలు చెప్పినట్టు ఆ నోటీసులో పేర్కొన్నారు. అనంతరం బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 26 వేల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉన్నారన్నారు. ఓపెన్ మైన్, అండర్ గ్రౌండ్ మైన్స్ తో పాటు అన్నింటిలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ సభను, ప్రజలను తప్పు దారి పట్టించి కార్మికుల నోట్లో మట్టి కోడుతున్నారని మండిపడ్డారు. కార్మికులను మోసం చేస్తే సింగరేణి బంగారు గని ఎలా అవుతుంది.. బంగారు తెలంగాణ ఎలా అవుతుందని ప్రశ్నించారు. సభను తప్పుదారి పట్టించిన సీఎంపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు రావాల్సిన రూ. 500 కోట్లను సింగరేణి యాజమాన్యం తొక్కిపెట్టిందన్నారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయకపోవడంతో వాళ్ళు వాళ్ళ హక్కులు కోల్పోతున్నారన్నారు. 4 రోజుల పాటు సింగరేణి యాత్ర చేసి అనంతరం సీఎం కేసీఆర్‌కు కూడా నివేదికను ఇస్తామని తెలిపారు. ఈ నోటీసుపై కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎస్ కుమార్ తదితరులు సంతకాలు చేశారు. -
కేసీఆర్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ శాసనసభాపక్షం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. శాసనసభను పక్కదారి పట్టిస్తున్నారని పేర్కొంటూ అసెంబ్లీ నిబంధన 168 కింద నోటీసును స్పీకర్ కు అందజేసింది. 2016 మార్చి 29 న శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్ మెంట్ పై సభను తప్పుదారి పట్టించారని ఆ నోటీసులో పేర్కొన్నారు. 2016 ఏప్రిల్ నాటికి మొత్తం ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు చెల్లిస్తామని సభకు సీఎం హామీ ఇచ్చారని ఆ నోటీసులో గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు ప్రతి నెలా చెల్లింపులు చేస్తామని సభలో చెప్పారని, అయితే ఈ నెల 4 వ తేదీన ఇదే అంశంపై కేసీఆర్ సభలో మాట్లాడుతూ, వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం సాధ్యం కాదని చెప్పారని, గతంలో చెప్పిందానికి ఇప్పుడు చెబుతున్నదానికి పొంతన లేదన్నారు. ఈ రకంగా శాసనసభను ముఖ్యమంత్రి తప్పుదారి పట్టించారని స్పీకర్ కు అందజేసిన నోటీసులో వారు పేర్కొన్నారు. ఈ నోటీసుపై టీ కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత కె. జానారెడ్డి ఎమ్మెల్యేలు జి. చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి, సంపత్ కుమార్, ఎన్ పద్మావతీ రెడ్డి, వంశీచంద్ రెడ్డి తదితరులు సంతకాలు చేశారు. -
'జైట్లీపై హక్కుల ఉల్లంఘన నోటీసు'
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ సోమవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నారు. రాజ్యసభలో శుక్రవారం కేవీపీ రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లుపై చర్చ ముగిసిన తర్వాత ఈ విషయాన్ని జైరాం రమేశ్ విలేకరులకు చెప్పారు. వాస్తవానికి ఈ విషయాన్ని జైరాం రమేశ్ రాజ్యసభలో ప్రస్తావించారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14 వ ఆర్థి సంఘం చెప్పిందంటూ జైట్లీ సభను తప్పుదోవ పట్టించారని, ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని జైరాం రమేశ్ పేర్కొన్నారు. అందుకు స్పందించిన డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభా హక్కుల తీర్మానం ప్రతిపాదించాల్సిందిగా సూచించారు. -
కాంగ్రెస్ కు రాజ్యాంగంపై పాఠాలు చెబుతాను: స్వామి
న్యూఢిల్లీ: రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ తనపై సభా హక్కుల తీర్మానం ప్రవేశ పెట్టడుతానని చెప్పడంపై బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఘాటుగా స్పందించారు. ఆపార్టీకి రాజ్యాంగంపై పాఠాలు చెబుతాననిక విమర్శించారు. అగస్టా వెస్ట్ లాండ్ కు సంబందించి తాను సభలో ప్రవేశ పెట్టిన పత్రాలు నిజమైనవేనని స్పష్టం చేశారు. ఈ ఒప్పందమే బోగస్ అని ఆయన ఆరోపించారు. అతి పెద్ద రాజకీయ పార్టీ తన పరువును పూర్తిగా కోల్పోయిందని ఎద్దేవా చేశారు. నేషనల్ హెరాల్డ్ ,అగస్టా కేసుల్లో కాంగ్రెస్ బండారాన్ని బయటపెట్టినందుకే ఆపార్టీ తనను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఎప్పుడు తీర్మానం పెట్టినా తన వద్ద ఉన్న డాక్యుమెంట్లు ఇవ్వడానికి సిధ్దంగా ఉన్నానని తెలిపారు. ముందు నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు నిజమైనవి కావని ఆరోపించారని, ఇప్పడు అందులోని సమాచారం తప్పు అని ఆరోపిస్తున్నారని తెలిపారు. వారికి రాజ్యాంగ నిబందనలపై పాఠాలు చెబుతానని స్పష్టం చేశారు. సుబ్రమణ్య స్వామి కి సమాచారం అందిచిన వెబ్ సైట్ లపై పరువు నష్టం దావా వేస్తామని, వాటికి సంఘ్ పరివార్ సంస్థలతో సంబంధం ఉందని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. -
చంద్రబాబుపై సభాహక్కుల ఉల్లంఘన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ముగ్గురు మంత్రులపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘటన నోటీసు ఇచ్చారు. శుక్రవారం శాసనసభ కార్యదర్శిని కలిసి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు నోటీసులు అందజేశారు. సీఎంతో పాటు మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. బడ్జెట్ సమర్పణ, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానం సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు తమపై సీఎం, మంత్రులు దూషణలకు దిగారని తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యవహారంపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ రేపు(శనివారం) అత్యవసరంగా భేటీ కానుంది. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలపై ప్రివిలేజ్ మోషన్
-
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలపై ప్రివిలేజ్ మోషన్
హైదరాబాద్ : స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచారంటూ పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత బుధవారం తొమ్మిదిమంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. సభాపతిని కించపరిచే విధంగా మాట్లాడినందున ఆ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సభా హక్కుల తీర్మానంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ఈ అంశంపై చర్చకు వచ్చినప్పుడు మాట్లాడేందుకు అవకాశమిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, కె.శ్రీధర్ రెడ్డి, ఆర్.శివప్రసాద్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బి.ముత్యాల నాయుడు, ఆర్.కె.రోజాలపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇచ్చారు. -
సీఎం చంద్రబాబుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. పట్టిసీమ ప్రాజెక్టు అంశంపై మంగళవారం నాడు అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా ప్రతిపక్ష నేత సహా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరిపైనా బాబు బెదిరింపులకు దిగారని నోటీసులో పేర్కొన్నారు. అప్రజాస్వామిక భాషను వినియోగించాని కూడా తెలిపారు. తమను ఉద్దేశించి.. మీ అంతు చూస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారని అన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గిడ్డి ఈశ్వరి, అశోక్ రెడ్డి తదితర ఎమ్మెల్యేలు ఈ నోటీసును స్పీకర్ శివప్రసాదరావుకు అందజేశారు. -
'ఇవాళ నాకు...రేపు మరొకరికి జరుగుతుంది'
-
'ఇవాళ నాకు...రేపు మరొకరికి జరుగుతుంది'
హైదరాబాద్ : నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసును స్పీకర్ కోడెల శివప్రసాద్ సోమవారం తిరస్కరించారు. నియమాల ప్రకారం, సభ్యుల మద్దతు ఉన్నందున నోటీసును అంగీకరించాలని భూమా నాగిరెడ్డి కోరారు. ఎమ్మెల్యేనని కూడా చూడకుండా తనపై రౌడీషీ తెరిచారని.. ఇవాళ తనకు జరిగిందని....రేపు మరొకరికి జరుగుతుందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై తాము ప్రశ్నిస్తే..ఇలాంటి కేసులు పెడుతున్నారన్నారు. అలాగే నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులపైనా ఇలాంటి కేసులే పెడుతున్నారని అన్నారు. తనపై కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని సభ దృష్టికి తీసుకు వచ్చారు. అయితే నంద్యాల మున్సిపాలిటీలో జరిగిన వివాదానికి అసెంబ్లీకి సంబంధం లేదని స్పీకర్ స్పష్టం చేశారు. తమ బాధ వినాలని భూమ నాగిరెడ్డి పదేపదే స్పీకర్‌ను కోరారు. పోడియం ముందుకు వచ్చిన మరీ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ మాత్రం నిబంధనల ప్రకారం తాను నడుచుకుంటున్నానని అన్నారు. దీనిపై సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఈ క్రమంలో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత స్పీకర్...భూమా నాగిరెడ్డి విజ్ఞప్తి మేరకు... ప్రివిలేజ్ మోషన్‌ను... ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేస్తానని ప్రకటించారు. -
చెవిరెడ్డికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
-
చెవిరెడ్డికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
హైదరాబాద్ : సభలో స్పీకర్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రివిలేజ్ మోషన్ కోరిన చీఫ్ విప్.. కాలువ శ్రీనివాసులు ఆ మేరకు ప్రతిపాదించారు. ఈ అంశాన్ని స్వీకరించామని.. తరువాత చూద్దామని.. బడ్జెట్‌పై చర్చను మొదలు పెట్టాలని స్పీకర్ కోరారు. దీంతో గొల్లపల్లి సూర్యారావు మరోసారి తన ప్రసంగం మొదలు పెట్టినా.. ముందుకు సాగలేదు.