![Privilege Motion Against Atchannaidu - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/17/Atchannaidu.jpg.webp?itok=mubRtPh-)
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై ప్రివిలేజ్‌మోషన్ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అచ్చెన్నాయుడు తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ఆయనపై ప్రివిలైజ్ మోష్ మూవ్ చేస్తున్నామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మోషన్‌ను ప్రివిలైజ్ కమిటీకి స్పీకర్ తమ్మినేని సీతారామ్ సిఫారసు చేశారు.
టీడీపీ తీరును తప్పుబట్టిన రాపాక
టీడీపీ సభ్యుల తీరును జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తప్పుపట్టారు. ఎలాంటి కారణాలు లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలు సభలో రాద్ధాంతం సృష్టిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ నిధులను టీడీపీ ఎమ్మెల్యేలు స్వాహా చేశారని రాపాక ఆరోపించారు. రాజోలు నియోజకవర్గంలో గత టీడీపీ ఎమ్మెల్యే భారీ ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారన్నారు
Comments
Please login to add a commentAdd a comment