సుష్మా స్వరాజ్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌కు కాంగ్రెస్ పార్టీ ఝలక్ ఇచ్చింది. సుష్మాకు వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘటన నోటీసులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గురువారం కాంగ్రెస్ సీనియర్ నేత అంబికా సోని ఈ విషయాన్ని వెల్లడించారు.
‘ఐసిస్ చేతిలో బంధీలైన 39 మంది భారతీయ విషయంలో సుష్మా పార్లమెంట్‌ను, వారి బంధువులను మోసం చేశారు. ఇంతకాలం వారు బతికే ఉన్నారంటూ ప్రకటనలు చేస్తూ కుటుంబ సభ్యులను పక్కదారి పట్టించారు. అందుకే ఈ నోటీసులు అని అంబికా సోని తెలిపారు. రాజ్యసభలో ఈ తీర్మాన నోటీసులు ప్రవేశపెట్టనున్నట్లు అంబికా వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు శశిథరూర్, గులాం నబీ ఆజాద్‌లు విదేశాంగ శాఖపై మండిపడ్డారు.
మరోవైపు కేంద్రం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తోందని అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే.. ఈ నోటీసుల అంశం తెరపైకి రావటం విశేషం. కాగా, పంజాబ్‌కు చెందిన 39 మంది భారతీయ కూలీలు.. 2014లో ఇరాక్ రెండో అతిపెద్ద నగరం మోసుల్ లో కిడ్నాప్‌కు గురయ్యారు. ఇంతకాలం వారు క్షేమంగానే ఉన్నారంటూ ప్రకటనలు చేస్తూ వస్తున్న కేంద్రం.. చివరకు మంగళవారం వారంతా ప్రాణాలతో లేరనే విషయాన్ని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment