ఢిల్లీ : సుదీర్ఘ సమయంపాటు దేశాన్ని కాంగ్రెస్ పాలించింది. అంతపెద్ద పార్టీ ఒక కుటుంబానికి పరిమితమైంది. అందుకే ఆ పార్టీలో సబ్ కా సాత్..సబ్‌కా సాత్ వికాస్ సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభ (Rajya Sabha)లో ప్రసంగించారు.
ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘దేశానికి ఎదురయ్యే సమస్యలను చాలా తెలివిగా పరిష్కరించాలి.పదేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నాం. దేశ ప్రజలు మాకు మూడోసారి అవకాశం ఇచ్చారు. మా డెవలప్‌మెంట్ మెడల్‌ను సమర్థించారు. సబ్ కా సాత్.. సబ్‌కా వికాస్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. ప్రజల కళ్లకు గంతలు పాలించింది. ఇంతపెద్ద దేశంలో మాకు మూడోసారి అవకాశం దక్కిందంటే మా అభివృద్ధిని ప్రజలు అర్థం చేసుకున్నారు. బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల కళ్లకు గంతలు కట్టి తమ అధికారాన్ని కాపాడుకున్నారు.
మా హయాంలో సమయమంతా దేశ ప్రగత కోసం వినియోగిస్తున్నాం. దేశంలో చివరి వ్యక్తికి సంక్షేమం అందించడం మా లక్ష్యం. నేషన్ ఫస్ట్ అనేది మా విధానం. సుదీర్ఘ సమయంపాటు దేశాన్ని కాంగ్రెస్ పాలించింది. దేశ ప్రజలందరికి సేవ చేసేందుకు మనం ఇక్కడున్నాం. అంతపెద్ద పార్టీ ఒక కుటుంబానికి పరిమితమైంది. అందుకే ఆ పార్టీలో సబ్ కా సాత్.. సబ్‌కా సాత్ వికాస్ సాధ్యం కాదు. పదేళ్లలో సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ మార్పును గమనిస్తున్నాం.ఎస్సీ,ఎస్టీలను బలోపేతం చేస్తున్నాం. ఓబీసీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇవ్వలేదు.
భారత వికాస యాత్రలో మహిళల పాత్ర ఎంతో కీలకం. నారీశక్తి వందన్‌ను మొదటగా అమలు చేస్తూ ఈ కొత్త భవనాన్ని ప్రారంభించాం. బీఆర్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదు. అంబేద్కర్‌ను ఓడించేందుకే ప్రయత్నించింది. దేశంలో దివ్యాంగుల గురించి మిషన్ మోడ్‌లో పనిచేస్తున్నాం. దివ్యాంగుల కోసం ఎన్నో రకాల పథకాలు చేపట్టాం. ట్రాన్స్‌జెండర్స్ గౌరవంతో బతికేలా చర్యలు తీసుకున్నామని’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment