కాంగ్రెస్‌పై అమిత్ షా ధ్వజం
పార్లమెంటునే మోసగించింది
రాజకీయ స్వార్థం కోసం ముస్లిం రిజర్వేషన్లకు పాకులాడుతోంది
ఆ ప్రయత్నాలను సాగనివ్వబోం
రాజ్యాంగంపై చర్చలో మంత్రి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై, నెహ్రూ– గాంధీ కుటుంబంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం రాజ్యసభలో నిప్పులు చెరిగారు. ‘‘కాంగ్రెస్ పార్టీతో పాటు రాజ్యాంగాన్ని కూడా తమ వ్యక్తిగత జాగీరుగా ఆ కుటుంబం పరిగణించింది. అందుకే కనీసం పార్లమెంటు అనుమతి కూడా లేకుండానే రాజ్యాంగంలోకి ఆర్టీకల్ 35ఏను చొప్పించే దుస్సాహసానికి తెగబడింది. చివరికి పార్లమెంటును కూడా మోసగించిన చరిత్ర కాంగ్రెస్‌ది!
రాజ్యాంగం పేరిట 75 ఏళ్లుగా లెక్కలేనన్ని ద్రోహాలకు పాల్పడుతూ వస్తోంది’’ అంటూ మండిపడ్డారు. స్వీయ రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఇష్టానికి సవరించిందంటూ పలు ఉదంతాలను ఉటంకించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు గండికొట్టే తొలి రాజ్యాంగ సవరణతో దేశ మొదటి ప్రధాని నెహ్రూయే ఇందుకు తెర తీశారని ఆరోపించారు. ‘‘సంతుష్టికరణ రాజకీయాలకు కాంగ్రెస్ చిరునామా.
తన ఓటు బ్యాంకుకు భంగం కలుగుతుందని ముస్లిం మహిళలకు ఏళ్ల తరబడి హక్కులను నిరాకరించిన చరిత్ర ఆ పార్టీది. ముస్లింలకు రిజర్వేషన్లు కలి్పచేందుకు 50 శాతం పరిమితిని అతిక్రమించేందుకు కూడా వెనకాడలేదు! తన పాలనలోని రెండు రాష్ట్రాల్లో రాజ్యాంగ విరుద్ధంగా మతాధారిత రిజర్వేషన్లు తెచి్చంది’’ అంటూ ఆరోపించారు. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా రాజ్యసభలో జరిగిన రెండు రోజుల చర్చకు మంత్రి బదులిచ్చారు.
బీజేపీకి పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్నంత కాలం మతాధారిత రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ప్రకటించారు. వెనకబడ్డ వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ఏనాడూ ప్రయతి్నంచలేదని షా ఆరోపించారు. ఎన్నికల ఓటమికి ఈవీఎంలను సాకుగా చూపడం ఇప్పటికైనా కాంగ్రెస్ మానుకోవాలని సూచించారు. ఉత్తరాఖండ్‌లో మాదిరిగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.
జమిలి బిల్లు కాంగ్రెస్ పుణ్యమే: నడ్డా
కేంద్రంలో దశాబ్దాల పాటు అధికారంలో ఉండగా కాంగ్రెస్ చేసిన నిర్వాకాల వల్లే మోదీ సర్కారు జమిలి ఎన్నికల బిల్లు తేవాల్సిన అవసరం ఏర్పడిందని రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా అన్నారు. మంగళవారం రాజ్యాంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకూ తొలుత ఒకేసారి ఎన్నికలు జరిగేవి. అప్పట్లో కాంగ్రెస్ పాలకులు తమకు ఇష్టం లేని రాష్ట్ర ప్రభుత్వాలను యథేచ్ఛగా కూలదోయడంతో జమిలికి బ్రేక్ పడింది’’ అని చెప్పారు.
‘‘ఎమర్జెన్సీ కాంగ్రెస్ చరిత్రపై చెరగని మచ్చ. అందుకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పిందనడం పచ్చి అబద్ధం. మైనారిటీల సంతుïÙ్టకరణ రాజకీయాల్లో భాగంగా మతాధారిత రిజర్వేషన్లకు కాంగ్రెస్ తెర తీయజూస్తోంది. ఆ ప్రయత్నాలను పలుమార్లు కోర్టులు అడ్డుకున్నా దాని తీరు మారడం లేదు. ట్రిపుల్ తలాక్, ఆర్టీకల్ 370పై కాంగ్రెస్ వైఖరి మొదలుకుని షాబానో తీర్పును నిర్వీర్యం చేసేందుకు రాజ్యాంగ సవరణ దాకా ఇందుకు ఉదాహరణలెన్నో’’ అని నడ్డా ఆరోపించారు.
వాటిపై ఆ పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల మాటేమిటని కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేశ్ ప్రశ్నించారు. అవి కేవలం ఆర్థిక వెనకబాటు ప్రాతిపదికన కలి్పంచినవంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలి్పంచుకున్నారు. సభను జైరాం తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కూడా సామాజిక, ఆర్థిక వెనకబాటు ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించింది తప్ప మతాధారితంగా కాదంటూ జైరాం బదులిచ్చారు. వారిద్దరి మధ్య వాడివేడి చర్చ సాగింది.
Comments
Please login to add a commentAdd a comment