
'జైట్లీపై హక్కుల ఉల్లంఘన నోటీసు'
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ సోమవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నారు. రాజ్యసభలో శుక్రవారం కేవీపీ రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లుపై చర్చ ముగిసిన తర్వాత ఈ విషయాన్ని జైరాం రమేశ్ విలేకరులకు చెప్పారు.
వాస్తవానికి ఈ విషయాన్ని జైరాం రమేశ్ రాజ్యసభలో ప్రస్తావించారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14 వ ఆర్థి సంఘం చెప్పిందంటూ జైట్లీ సభను తప్పుదోవ పట్టించారని, ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని జైరాం రమేశ్ పేర్కొన్నారు. అందుకు స్పందించిన డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభా హక్కుల తీర్మానం ప్రతిపాదించాల్సిందిగా సూచించారు.