
'జైట్లీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై సభను తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై రాజ్యసభ ఛైర్మన్ కురియన్కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చామని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో జైరాం రమేష్ విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై జైట్లీ సభను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. 14వ ఆర్థిక సంఘానికి, ప్రత్యేక హోదాకు లింకు పెట్టడం ఆయన సరికాదన్నారు.