Kurien
-
చైతన్య భారతి: క్షీర సాగరుడు
సాంకేతిక పరిజ్ఞానాన్ని చిన్న, సన్నకారు రైతుల వద్దకు తీసుకెళ్లాలన్న కురియన్ ఆలోచనను 1978లో ఎఫ్.ఎ.ఓ. తోసిపుచ్చింది. పాల ఉత్పత్తులపై లాభాలు గడించడం కార్పోరేటర్లకే పనికొస్తుందని ఆ సంస్థ వాదన. చిన్న కమతాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం సాధారణ విషయం కాదని నిరుత్సాహ పరిచారు. అయితే వాళ్లెవరూ కురియన్ను ఆపలేకపోయారు. చివరకు కురియన్ ఆచరణలో పెట్టిన అసాధారణ ఆలోచన ఫలితంగా జాతీయ పాల ఉత్పత్తుల అభివృద్ధి బోర్డు (ఎన్.డి.డి.బి) భారతదేశ పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. పాల ఉత్పత్తుల వార్షిక అభివృద్ధి రేటును 0.5 శాతం నుంచి 5 శాతానికి తీసుకెళ్లింది. 1998 నాటి కల్లా ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారతదేశం అవతరించింది. అమెరికాలో చదువుకుని పట్టా సాధించిన కురియన్ 1949 మే నెలలో కొంత అయిష్టంగా గుజరాత్‌లోని ఆనంద్ కు వెళ్లారు. అయితే ఆ తరువాత ఆయన సాధించిన విజయాలు, సృష్టించిన చరిత్ర అందరికీ తెలిసినవే. గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య ఏర్పాటుకు 1973లో ఎన్.డి.డి.బి. సహాయం చేసింది. అమూల్, సాగర్ లాంటి బ్రాండ్ల పేర్లతో సహకార పాల సంఘాలు అందించే పాల ఉత్పత్తుల అమ్మకానికి తోడ్పడటం కోసం అది ఏర్పాటైంది. భారతదేశ సరికొత్త ఆర్థిక విధానాల్లోని భ్రాంతుల పైన అందరి దృష్టి పడేలా చేసేందుకు కురియన్ ఎప్పుడూ కృషి చేస్తూ వచ్చారు. ధనిక, బీద దేశాల మధ్య సహకారం, ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలలో వ్యావసాయిక పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పడటం లాంటివి ఆయన ప్రపంచీకరణ దృక్పథంలో భాగాలు. ప్రపంచ వ్యాప్త క్షీర విప్లవం గురించి ఆయన కలలు కన్నారు. గ్రామీణులకు మరింతగా ఆదాయం కావలసి వచ్చిన సమయంలో మన భారతీయ క్షీర విప్లవకారుడైన కురియన్ అందుకు తగినట్లు చేయడం ప్రారంభించారు. కృషి, పట్టుదల వల్ల ఆయన అందరికీ ఆదర్శప్రాయుడయ్యారు. – యోగిందర్ కె.అలఘ్, ఆర్థికవేత్త, కేంద్ర మాజీ మంత్రి (చదవండి: మహోద్యమ వైద్యులు) -
గ్రామీణాభివృద్ధిలో మానవ వనరులే కీలకం
సాక్షి, హైదరాబాద్: గ్రామీణాభివృద్ధిలో మానవ వనరులే కీలకమని కేరళ ప్రభుత్వ అదనపు ప్రధానకార్యదర్శి పి.హెచ్.కురియన్ అన్నారు. శనివారం జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ)లో జరిగిన స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒడిశాలోని కలహందిలో పనిచేసిన సమయంలో తాను ఎదుర్కొన్న అను భవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కోర్సులు పూర్తిచేసిన 52 మందికి పట్టాలు ప్రదా నం చేశారు. కార్యక్రమంలో ఎన్ఐఆర్డీ (పీఆర్) డైరెక్టర్ జనరల్ డబ్లు్య.ఆర్.రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాధికా రస్తోగి, అసోసియేట్ ప్రొఫెసర్లు ఎ.దేవీప్రియ, ఆకాంక్షాశుక్లా పాల్గొన్నారు. -
ఫోర్డ్ తొలి సీయూవీ ‘ఫ్రీస్టయిల్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ దేశంలోనే తొలి కాంపాక్ట్ యుటిలిటీ వెహికల్ (సీయూవీ) ఫ్రీస్టయిల్‌ని విపణిలోకి విడుదల చేసింది. స్పోర్టీ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) డిజైన్‌తో, సాంకేతికత, అత్యుత్తమ ఇంధన సామర్థ్యంతో దీనిని అభివృద్ధి చేశామని ఫోర్డ్ సేల్స్ ప్రొడక్షన్ జీఎం ఆంటోని చీరియన్ కురియన్ గురువారమిక్కడ జరిగిన విలేకరులకు తెలిపారు. ఫ్రీస్టయిల్ పెట్రోల్, డీజిల్ రెండు వెర్షన్లలో నాలుగు వేరియంట్లలో 6 రంగుల్లో అందుబాటులో ఉంది. ధరల శ్రేణి రూ.5.09–7.89 లక్షల మధ్య ఉంది. దీన్ని గుజరాత్‌లోని సాణంద్ ప్లాంట్‌లో అభివృద్ధి చేశామని ఆయన పేర్కొన్నారు. -
సభలో కేవీపీ నిరసన; నోరుజారిన కురియన్
సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిన తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పార్లమెంటులో ఆందోళన చేశారు. శుక్రవారం రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆయన చైర్మన్ వెల్‌లోకి చొచ్చుకెళ్లారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అని రాసున్న ఫ్లకార్డును ఎత్తిపట్టుకుని అక్కడే నిలబడ్డారు. నిరసన విరమించి, సీట్లో కూర్చోవానలి డిప్యూటీ చైర్మన్ కురియన్ ఎంత చెప్పినా కేవీపీ వెనక్కి తగ్గలేదు. దీంతో సహనం కోల్పోయిన కురియన్ నోరుజారారు. ‘ఈయనకు ఏమైంది? పిచ్చిపట్టిందా?’ (what is wrong with him and is he mad) అని కేవీపీని ఉద్దేశించి అన్నారు. గురువారం వెలువడిన కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. -
'జైట్లీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై సభను తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై రాజ్యసభ ఛైర్మన్ కురియన్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చామని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో జైరాం రమేష్ విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై జైట్లీ సభను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. 14వ ఆర్థిక సంఘానికి, ప్రత్యేక హోదాకు లింకు పెట్టడం ఆయన సరికాదన్నారు. -
సమాచారం ఎలా వచ్చింది?
* రాజ్యసభలో స్వామిపై కాంగ్రెస్ ధ్వజం * సోనియా, మన్మోహన్‌లను సీబీఐ ప్రశ్నించాలన్న స్వామి న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్ వివాదంలో తమను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. విచారణ సంస్థల దర్యాప్తులో వెల్లడైన విశ్వసనీయ సమాచారం ఓ ఎంపీ చేతికి ఎలా వచ్చిందని ప్రశ్నించింది. ‘స్వామికి సీబీఐ, ఈడీ నుంచి కచ్చితమైన సమాచారం ఎలా వచ్చింది? అంతకుమించిన విశ్వసనీయ దస్తావేజులేమైనా ఆయన దగ్గర ఉన్నాయా?’ అని రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ ప్రశ్నించారు. స్వామి ఈ సమాచారం ఎక్కడినుంచి తీసుకున్నారో వెల్లడించాలన్నారు. కాంగ్రెస్ ఆందోళన చేస్తుండగానే మంత్రి నక్వీ జోక్యం చేసుకుని.. బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలు కురియన్ ముందు పెట్టినట్లు వెల్లడించారు. అనంతరం జైరాం రమేశ్ ఈ ఆధారాలు విశ్వసనీయమైనవా? కాదా? చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ పత్రాలను పరీశీలిస్తున్నట్లు కురియన్ వెల్లడించారు. బుధవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. ‘ఇటాలియన్ కోర్టు వెల్లడించిన వివరాల ఆధారంగా.. ఈ కుంభకోణంలో ఐఏఎఫ్ అధికారులకు 6 మిలియన్ యూరోలు (రూ.45.5 కోట్లు), అధికారులకు 8.4 మిలియన్ యూరోలు (రూ.63.7కోట్లు), ఏపీ అనే వ్యక్తికి రూ. 125 కోట్లు ముట్టాయి’ అని వెల్లడించారు. గురువారం కూడా ఈ విషయంపై స్వామి మాట్లాడుతూ.. సోనియా, మన్మోహన్‌లతోపాటు అహ్మద్ పటేల్, ఆస్కార్ ఫెర్నాండెజ్‌లకు సీబీఐ సమన్లు జారీ చేయాలన్నారు.