ఫ్రీస్టయిలీని విడుదల చేస్తున్న కురియన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ దేశంలోనే తొలి కాంపాక్ట్ యుటిలిటీ వెహికల్ (సీయూవీ) ఫ్రీస్టయిల్‌ని విపణిలోకి విడుదల చేసింది. స్పోర్టీ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) డిజైన్‌తో, సాంకేతికత, అత్యుత్తమ ఇంధన సామర్థ్యంతో దీనిని అభివృద్ధి చేశామని ఫోర్డ్ సేల్స్ ప్రొడక్షన్ జీఎం ఆంటోని చీరియన్ కురియన్ గురువారమిక్కడ జరిగిన విలేకరులకు తెలిపారు.
ఫ్రీస్టయిల్ పెట్రోల్, డీజిల్ రెండు వెర్షన్లలో నాలుగు వేరియంట్లలో 6 రంగుల్లో అందుబాటులో ఉంది. ధరల శ్రేణి రూ.5.09–7.89 లక్షల మధ్య ఉంది. దీన్ని గుజరాత్‌లోని సాణంద్ ప్లాంట్‌లో అభివృద్ధి చేశామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment