తమిళనాడుకు అమెరికన్ కంపెనీ: మూడేళ్ళ తరువాత.. | Ford Discusses Export Plans From India | Sakshi
Sakshi News home page

తమిళనాడుకు అమెరికన్ కంపెనీ: మూడేళ్ళ తరువాత..

Published Thu, Sep 12 2024 9:07 PM | Last Updated on Thu, Sep 12 2024 9:07 PM

Ford Discusses Export Plans From India

అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'ఫోర్డ్' భారతదేశంలో చాలారోజుల క్రితమే తన కార్యకలాపాలను నిలిపివేసింది. భారతదేశ ఉత్పత్తిని ముగించిన మూడేళ్ళ తర్వాత, గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీ.. చెన్నై సమీపంలోని మరైమలై నగర్‌లో కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది, అక్కడ నుంచి తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం ఉంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం మిచిగాన్‌లోని ఫోర్డ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, ఉత్పత్తిని పునఃప్రారంభించాలని కోరుతూ దాని ఉన్నత యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ.. ఫోటోలు కూడా షేర్ చేసారు.

ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రమే కాకుండా.. ఫోర్డ్ ఐఎంజీ ప్రెసిడెంట్ కె హార్ట్, వైస్ ప్రెసిడెంట్ మాథ్యూ కొట్లోవ్స్కీ, ఫోర్డ్ ఇండియా డైరెక్టర్ శ్రీపత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: భారత్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు!.. చైనా ఉద్దేశ్యం ఏంటి?

ఫోర్డ్ ఇండియా సెప్టెంబర్ 9, 2021న తన యూనిట్‌లను దశలవారీగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత 2022 ఆగస్టులో చెన్నైలో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. ఆ తరువాత ఫోర్డ్ భారతదేశంలోని రెండు ప్లాంట్‌లలో ఒకదాన్ని 2023లో టాటా మోటార్స్‌కు విక్రయించింది. మరో ప్లాంట్‌ను మూసివేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement