ప్రత్యర్థులతో పోటీ పడలేక.. అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే సాగడంచేత అమెరికన్ కంపెనీ 'ఫోర్డ్' భారతదేశంలో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇండియాలోకి అడుగుపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
భారత్‌ను వీడిన మూడేళ్ళ తరువాత ఫోర్డ్ కంపెనీ మళ్ళీ తన కార్యకలాపాలను దేశంలో ప్రారభించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ తమిళనాడు ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారికంగా వెల్లడించారు.
ఇదీ చదవండి: ఆధార్ ఫ్రీ అప్‌డేట్: యూఐడీఏఐ కీలక నిర్ణయం
ఇండియాలో కేవలం ఎగుమతుల కోసం మాత్రమే తన తయారీ కర్మాగారాన్ని పునఃప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే వాహనాలను మళ్ళీ భారతదేశంలో విక్రయిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే తమిళనాడు సదుపాయంతో ఫోర్డ్ తయారు చేయాలనుకుంటున్న కార్లు, ఇతర వాహనాల వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment