సమాచారం ఎలా వచ్చింది? | Swamy's remarks cause uproar in Rajya Sabha | Sakshi
Sakshi News home page

సమాచారం ఎలా వచ్చింది?

Published Fri, May 6 2016 5:15 AM | Last Updated on Fri, Mar 29 2019 8:33 PM

సమాచారం ఎలా వచ్చింది? - Sakshi

సమాచారం ఎలా వచ్చింది?

* రాజ్యసభలో స్వామిపై కాంగ్రెస్ ధ్వజం
* సోనియా, మన్మోహన్‌లను సీబీఐ ప్రశ్నించాలన్న స్వామి

న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్ వివాదంలో తమను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. విచారణ సంస్థల దర్యాప్తులో వెల్లడైన విశ్వసనీయ సమాచారం ఓ ఎంపీ చేతికి ఎలా వచ్చిందని ప్రశ్నించింది. ‘స్వామికి సీబీఐ, ఈడీ నుంచి కచ్చితమైన సమాచారం ఎలా వచ్చింది? అంతకుమించిన విశ్వసనీయ దస్తావేజులేమైనా ఆయన దగ్గర ఉన్నాయా?’ అని రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ ప్రశ్నించారు. స్వామి ఈ సమాచారం ఎక్కడినుంచి తీసుకున్నారో వెల్లడించాలన్నారు.

కాంగ్రెస్ ఆందోళన చేస్తుండగానే మంత్రి నక్వీ జోక్యం చేసుకుని.. బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలు కురియన్ ముందు పెట్టినట్లు వెల్లడించారు. అనంతరం జైరాం రమేశ్ ఈ ఆధారాలు విశ్వసనీయమైనవా? కాదా? చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ పత్రాలను పరీశీలిస్తున్నట్లు కురియన్ వెల్లడించారు.

బుధవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. ‘ఇటాలియన్ కోర్టు వెల్లడించిన వివరాల ఆధారంగా.. ఈ కుంభకోణంలో ఐఏఎఫ్ అధికారులకు 6 మిలియన్ యూరోలు (రూ.45.5 కోట్లు), అధికారులకు 8.4 మిలియన్ యూరోలు (రూ.63.7కోట్లు), ఏపీ అనే వ్యక్తికి రూ. 125 కోట్లు ముట్టాయి’ అని వెల్లడించారు. గురువారం కూడా ఈ విషయంపై స్వామి మాట్లాడుతూ.. సోనియా, మన్మోహన్‌లతోపాటు అహ్మద్ పటేల్, ఆస్కార్ ఫెర్నాండెజ్‌లకు సీబీఐ సమన్లు జారీ చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement