సభలో కేవీపీ నిరసన; నోరుజారిన కురియన్‌ | MP KVP protest against Center on Budget allocation to AP | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో కేవీపీ నిరసన; నోరుజారిన కురియన్‌

Published Fri, Feb 2 2018 1:39 PM | Last Updated on Fri, Feb 2 2018 4:30 PM

MP KVP protest against Center on Budget allocation to AP - Sakshi

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌, ఫ్లకార్డుతో కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ ఆందోళన

సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిన తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పార్లమెంటులో ఆందోళన చేశారు. శుక్రవారం రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆయన చైర్మన్‌ వెల్‌లోకి చొచ్చుకెళ్లారు. ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని రాసున్న ఫ్లకార్డును ఎత్తిపట్టుకుని అక్కడే నిలబడ్డారు.

నిరసన విరమించి, సీట్లో కూర్చోవానలి డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ ఎంత చెప్పినా కేవీపీ వెనక్కి తగ్గలేదు. దీంతో సహనం కోల్పోయిన కురియన్‌ నోరుజారారు. ‘ఈయనకు ఏమైంది? పిచ్చిపట్టిందా?’ (what is wrong with him and is he mad) అని కేవీపీని ఉద్దేశించి అన్నారు. గురువారం వెలువడిన కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement