italian court
-
సమాచారం ఎలా వచ్చింది?
* రాజ్యసభలో స్వామిపై కాంగ్రెస్ ధ్వజం * సోనియా, మన్మోహన్‌లను సీబీఐ ప్రశ్నించాలన్న స్వామి న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్ వివాదంలో తమను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. విచారణ సంస్థల దర్యాప్తులో వెల్లడైన విశ్వసనీయ సమాచారం ఓ ఎంపీ చేతికి ఎలా వచ్చిందని ప్రశ్నించింది. ‘స్వామికి సీబీఐ, ఈడీ నుంచి కచ్చితమైన సమాచారం ఎలా వచ్చింది? అంతకుమించిన విశ్వసనీయ దస్తావేజులేమైనా ఆయన దగ్గర ఉన్నాయా?’ అని రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ ప్రశ్నించారు. స్వామి ఈ సమాచారం ఎక్కడినుంచి తీసుకున్నారో వెల్లడించాలన్నారు. కాంగ్రెస్ ఆందోళన చేస్తుండగానే మంత్రి నక్వీ జోక్యం చేసుకుని.. బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలు కురియన్ ముందు పెట్టినట్లు వెల్లడించారు. అనంతరం జైరాం రమేశ్ ఈ ఆధారాలు విశ్వసనీయమైనవా? కాదా? చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ పత్రాలను పరీశీలిస్తున్నట్లు కురియన్ వెల్లడించారు. బుధవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. ‘ఇటాలియన్ కోర్టు వెల్లడించిన వివరాల ఆధారంగా.. ఈ కుంభకోణంలో ఐఏఎఫ్ అధికారులకు 6 మిలియన్ యూరోలు (రూ.45.5 కోట్లు), అధికారులకు 8.4 మిలియన్ యూరోలు (రూ.63.7కోట్లు), ఏపీ అనే వ్యక్తికి రూ. 125 కోట్లు ముట్టాయి’ అని వెల్లడించారు. గురువారం కూడా ఈ విషయంపై స్వామి మాట్లాడుతూ.. సోనియా, మన్మోహన్‌లతోపాటు అహ్మద్ పటేల్, ఆస్కార్ ఫెర్నాండెజ్‌లకు సీబీఐ సమన్లు జారీ చేయాలన్నారు. -
ఆ భారీ స్కాంలో టార్గెట్ సోనియా!
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీతో అమీతుమీ తేల్చుకోవడానికి బీజేపీ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ కుంభకోణంలో సోనియాగాంధీ ప్రమేయముందని వెల్లడించడం ద్వారా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో హస్తాన్ని ఇరుకున పెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటులో ఈ అంశంపై చర్చ సందర్భంగా సోనియాగాంధీ పేరును ప్రస్తావించే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీతో వీఐపీ హెలికాప్టర్ల కోసం గత యూపీఏ ప్రభుత్వం రూ. 3,600 కోట్ల ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో అవినీతి చోటుచేసుకుందని, అందులో భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి హస్తం కూడా ఉందని ఇటాలియన్ హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. 2010లో జరిగిన ఈ ఒప్పందంలో 66-99 కోట్ల రూపాయల వరకు నిధులను అక్రమంగా భారతీయ అధికారుల ఖాతాల్లోకి మళ్లించినట్లు రుజువైందని కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల స్కాంపై, ఇష్రత్ జహాన్ కేసుపై పార్లమెంటులో చర్చకు బీజేపీ అనురాగ్ ఠాకూర్ నోటీసులు ఇచ్చారు. ఈ అంశంపై చర్చ సందర్భంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర వాగ్వాదానికి దిగే అవకాశం కనిపిస్తోంది. ఈ కుంభకోణంలో సోనియాగాంధీ స్వయంగా అక్రమాలకు పాల్పడినట్టు పేర్కొనకపోయినప్పటికీ, ఈ ఒప్పందం కుదరడంలో ఆమె ప్రధాన డ్రైవింగ్ ఫోర్స్ (తెరవెనుక శక్తి)గా ఉన్నారని ఇటలీ కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు తీర్పులో సోనియా, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్లను ఇటలీ కోర్టు ప్రస్తావించినప్పటికీ, వారి గురించి ఎలాంటి ఆధారాలు ఉన్నట్టు పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో సోనియా పేరుతో కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలని బీజేపీ భావిస్తున్నది. మరోవైపు అప్పట్లో ఈ ఒప్పందాన్ని రద్దుచేసిన అప్పటి రక్షణశాఖ మంత్రి ఆంటోనీ మాట్లాడుతూ కేంద్రం తొందరగా దర్యాప్తుచేసి.. దోషులను శిక్షించాలని కోరారు. -
చాపర్ల కొనుగోలులో అవినీతి నిజమే!
► స్పష్టం చేసిన ఇటాలియన్ హైకోర్టు ► ఎస్పీ త్యాగి హస్తం ఉందని వెల్లడి రోమ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో అవినీతి చోటుచేసుకుందని, అందులో భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి హస్తం కూడా ఉందని ఇటాలియన్ హైకోర్టు స్పష్టం చేసింది. 2010లో జరిగిన ఈ ఒప్పందంలో 66-99 కోట్ల రూపాయల వరకు నిధులను అక్రమంగా భారతీయ అధికారుల ఖాతాల్లోకి మళ్లించినట్లు రుజువైందని కోర్టు చెప్పింది. మిలన్ హైకోర్టు ఇచ్చిన 225 పేజీల తీర్పులో, ప్రత్యేకంగా త్యాగి పాత్ర గురించి 17 పేజీలలో వివరించారు. వీవీఐపీల కోసం అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్లనే కొనుగోలు చేయాలని వైమానిక దళం నిర్ణయం తీసుకోవడంలో త్యాగి పాత్ర చాలా ఉందని కోర్టు చెప్పింది. అయితే దీనిపై స్పందించేందుకు త్యాగి నిరాకరించారు. ఇటాలియన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి పాఠాన్ని ఇంగ్లీషులో చూసిన తర్వాతే తాను మాట్లాడతాన్నారు. ఈ కేసులో తాను నిర్దోషినని ఆయన అంటున్నారు. అయితే అసలు ఆ కోర్టు ఎదుట త్యాగి విచారణకు హాజరు కాలేదు. ప్రస్తుతం ఆయనపై భారతదేశంలో సీబీఐ, ఈడీ కూడా విచారణ జరుపుతున్నాయి. రూ. 3,565 కోట్ల విలువైన అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు విషయంలో భారతీయ అధికారులకు లంచాలు ముట్టాయని మిలన్ హైకోర్టు స్పష్టం చేసింది. లంచాలు, అవినీతి వ్యవహారాలను రుజువు చేయలేమంటూ అంతకుముందు ఇదే విషయమై ఇటలీలోని దిగువకోర్టు ఇచ్చి తీర్పును మిలన్ హైకోర్టు కొట్టేసింది. నగదుతో పాటు ఆన్లైన్ నగదు బదిలీలు కూడా త్యాగి, ఆయన కుటుంబ సభ్యులకు చేరాయని తెలిపింది. 2005-07 సంవత్సరాల మధ్యకాలంలో త్యాగి భారత వైమానిక దళం అధిపతిగా ఉన్నారు. అప్పుడే వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందం జరిగింది.