చాపర్ల కొనుగోలులో అవినీతి నిజమే! | Chopper Deal: Italian court confirms graft of tyagi | Sakshi
Sakshi News home page

చాపర్ల కొనుగోలులో అవినీతి నిజమే!

Published Tue, Apr 26 2016 3:08 PM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

చాపర్ల కొనుగోలులో అవినీతి నిజమే!

చాపర్ల కొనుగోలులో అవినీతి నిజమే!

స్పష్టం చేసిన ఇటాలియన్ హైకోర్టు
ఎస్‌పీ త్యాగి హస్తం ఉందని వెల్లడి
రోమ్

వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో అవినీతి చోటుచేసుకుందని, అందులో భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్‌పీ త్యాగి హస్తం కూడా ఉందని ఇటాలియన్ హైకోర్టు స్పష్టం చేసింది. 2010లో జరిగిన ఈ ఒప్పందంలో 66-99 కోట్ల రూపాయల వరకు నిధులను అక్రమంగా భారతీయ అధికారుల ఖాతాల్లోకి మళ్లించినట్లు రుజువైందని కోర్టు చెప్పింది. మిలన్ హైకోర్టు ఇచ్చిన 225 పేజీల తీర్పులో, ప్రత్యేకంగా త్యాగి పాత్ర గురించి 17 పేజీలలో వివరించారు. వీవీఐపీల కోసం అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్లనే కొనుగోలు చేయాలని వైమానిక దళం నిర్ణయం తీసుకోవడంలో త్యాగి పాత్ర చాలా ఉందని కోర్టు చెప్పింది. అయితే దీనిపై స్పందించేందుకు త్యాగి నిరాకరించారు. ఇటాలియన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి పాఠాన్ని ఇంగ్లీషులో చూసిన తర్వాతే తాను మాట్లాడతాన్నారు. ఈ కేసులో తాను నిర్దోషినని ఆయన అంటున్నారు.

అయితే అసలు ఆ కోర్టు ఎదుట త్యాగి విచారణకు హాజరు కాలేదు. ప్రస్తుతం ఆయనపై భారతదేశంలో సీబీఐ, ఈడీ కూడా విచారణ జరుపుతున్నాయి. రూ. 3,565 కోట్ల విలువైన అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు విషయంలో భారతీయ అధికారులకు లంచాలు ముట్టాయని మిలన్ హైకోర్టు స్పష్టం చేసింది. లంచాలు, అవినీతి వ్యవహారాలను రుజువు చేయలేమంటూ అంతకుముందు ఇదే విషయమై ఇటలీలోని దిగువకోర్టు ఇచ్చి తీర్పును మిలన్ హైకోర్టు కొట్టేసింది. నగదుతో పాటు ఆన్‌లైన్ నగదు బదిలీలు కూడా త్యాగి, ఆయన కుటుంబ సభ్యులకు చేరాయని తెలిపింది. 2005-07 సంవత్సరాల మధ్యకాలంలో త్యాగి భారత వైమానిక దళం అధిపతిగా ఉన్నారు. అప్పుడే వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement