త్యాగికి ఊరట!
న్యూఢిల్లీ: వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో అరెస్టయిన మాజీ ఐఏఎఫ్ చీఫ్ ఎస్పీ త్యాగికి ఊరట లభించింది. ఆయనకు సోమవారం ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, మరొకరి ష్యూరిటీపై ఆయనకు ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి అరవింద్ కుమార్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు.
ఈ కేసులో సీబీఐ దర్యాప్తుకు ఆటంకం కల్పించవద్దని, సాక్షులను ప్రభావితం చేయకూదని షరతులు విధించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాపర్ల కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న త్యాగిని, అతని సోదరుడు సంజీవ్ త్యాగిని, లాయర్ గౌతం ఖైతాన్‌ని సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. త్యాగీ సోదరుడు, లాయర్ బెయిల్ పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయి.