sp tyagi
-
అగస్టా కేసు: త్యాగికి బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్‌లాండ్ మనీ ల్యాండరింగ్ కేసులో వైమానిక దళ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి, ఆయన సోదరులకు పటియాలా హౌస్ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. రూ లక్ష వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు కోరింది. రూ 3600 కోట్ల అగస్టా ఒప్పందంలో పలు అక్రమ మార్గాల్లో కాంట్రాక్టును పొందేందుకు కోట్ల మొత్తం చేతులు మారాయని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో దాఖలైన చార్జిషీట్‌ను పరిశీలించిన అనంతరం కోర్టు ఎదుట హాజరు కావాలని 30 మందికి పైగా నిందితులకు ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ సమన్లు జారీ చేశారు. కాగా అగస్టా స్కామ్‌తో సంబంధం ఉన్న విదేశీ సంస్థలు, వ్యక్తులు బుధవారం కోర్టు ఎదుట హాజరుకాలేదు. భారత వైమానిక దళానికి 12 ఏడబ్ల్యూ-101 హెలికాఫ్టర్లను సరఫరా చేసేందుకు భారత ప్రభుత్వంతో 2010లో అగస్టావెస్ట్‌ల్యాండ్ రూ 3546 కోట్ల కాంట్రాక్టుపై సంతకాలు చేసింది. వీటిలో ఎనిమిది హెలికాఫ్టర్లు రాష్ట్రపతి, ప్రధాని వంటి వీవీఐపీల ప్రయాణానికి ఉద్దేశించినవి కావడం గమనార్హం. ఈ ఒప్పందంలో 34 మంది వ్యక్తులు, సంస్థలు అక్రమ పద్ధతుల్లో పాలుపంచుకున్నారని మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది. త్యాగి భాగస్వామిగా ఉన్న కంపెనీ ఈ ఒప్పందంలో రూ కోటి ముడుపులు అందుకుందని ఈడీ చార్జిషీట్లో ఆరోపించింది. -
త్యాగికి ఊరట!
న్యూఢిల్లీ: వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో అరెస్టయిన మాజీ ఐఏఎఫ్ చీఫ్ ఎస్పీ త్యాగికి ఊరట లభించింది. ఆయనకు సోమవారం ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, మరొకరి ష్యూరిటీపై ఆయనకు ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి అరవింద్ కుమార్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తుకు ఆటంకం కల్పించవద్దని, సాక్షులను ప్రభావితం చేయకూదని షరతులు విధించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాపర్ల కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న త్యాగిని, అతని సోదరుడు సంజీవ్ త్యాగిని, లాయర్ గౌతం ఖైతాన్‌ని సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. త్యాగీ సోదరుడు, లాయర్ బెయిల్ పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయి. -
అగస్టా స్కాంలో మాజీ ఎయిర్ చీఫ్ త్యాగికి ఊరట!
-
అగస్టాలో ఆమ్యామ్యాలు
-
ఆ స్కాంలో పీఎంవో హస్తముంది!
యూపీఏ హయాంలో పీఎంవో చెప్పడంతోనే.. వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందంలో మార్పులు కోర్టుకు తెలిపిన ఎస్పీ త్యాగీ న్యూఢిల్లీ: యూపీఏ–2 హయాంలో జరిగిన అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి కోర్టులో సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి ప్రధానమంత్రి (మన్మోహన్ సింగ్) కార్యాలయం (పీవోఎం) ప్రమేయం కారణంగానే బ్రిటన్‌కు చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి అనుకూలంగా ఒప్పందంలోని నిబంధనలు మార్చినట్టు ఆయన పేర్కొన్నారు. 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి ఒప్పందంలో మార్పులు చేసి రూ.450 కోట్ల ముడుపులు తీసుకున్న ఈ కేసులో శుక్రవారం ఎయిర్ ఫోర్సు మాజీ చీఫ్ ఎస్పీ త్యాగితోపాటు అతని సోదరుడు సంజయ్, లాయర్ గౌతమ్ ఖైతాన్ ను సీబీఐ అరెస్టు చేసింది. శుక్రవారం వీరిని విచారణకు పిలిచిన అధికారులు.. నాలుగు గంటల విచారణ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. వారిని శనివారం కోర్టులో హాజరుపరుచగా.. విచారణ కోసం నాలుగురోజులపాటు వారిని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. వీవీఐపీ హెలికాప్టర్లలో మార్పులు తన ఒక్కడి నిర్ణయం ప్రకారం జరగలేదని, ఈ కొనుగోలు ఒప్పందంలో పాలుపంచుకోవాలని 2003లో అప్పటి పీఎంవో కోరిందని, 2004లో పీఎంవో హెలికాప్టర్ల ఒప్పందంలో మార్పులు కోరిందని ఆయన చెప్పుకొచ్చారు. వీఐపీ హెలికాప్టర్లు ఎగరాల్సిన ఎత్తును 6వేల అడుగుల నుంచి తగ్గించేలా నిబంధనలు మార్చేలా 2005లో త్యాగి అంగీకరిచారని, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు రూ. 450 కోట్ల ముడుపులు తీసుకుని త్యాగి నిబంధనలు మార్చేలా అధికారులను ప్రభావితం చేశారని సీబీఐ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి త్యాగితోపాటు మరో 18 మందిపై (అతని సోదరులు, యురోపియ¯ŒS మధ్యవర్తులు, కంపెనీలు) సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణకు సహకరించేందుకు పలు దేశాలకు రొగేటరీ లెటర్ల (న్యాయపరమైన అభ్యర్థనలు)ను జారీ చేసింది. వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందంపై ఆరోపణలు రావటంతో 2014 జనవరిలో అప్పటి ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దుచేసింది. -
అగస్టా కేసులో తొలి వికెట్
వాయుసేన మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి అరెస్టు ► విచారణకు పిలిచి అరెస్టు చేసిన సీబీఐ న్యూఢిల్లీ: యూపీఏ–2 హయాంలో సంచలనం రేపిన అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో అరెస్టుల పర్వం మొదలైంది. 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి రూ.450 కోట్ల ముడుపులు తీసుకున్న కేసులో 2013లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. శుక్రవారం ఎయిర్ ఫోర్సు మాజీ చీఫ్ ఎస్పీ త్యాగితోపాటు అతని సోదరుడు సంజయ్, లాయర్ గౌతమ్ ఖైతాన్ ను సీబీఐ అరెస్టు చేసింది. శుక్రవారం వీరిని విచారణకు పిలిచిన అధికారులు.. నాలుగు గంటల విచారణ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇదే తొలి అరెస్టు. ‘ఈ కుంభకోణానికి సంబంధించిన వ్యక్తులతో కలిసి 2005లో అప్పటి వైమానిక దళ అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణ సందర్భంగా పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. అరెస్టు చేసిన వారందరినీ.. శనివారం కోర్టులో ప్రవేశపెడతాం. తర్వాత రిమాండ్ కోరతాం’ అని సీబీఐ అధికార ప్రతినిధి దెవ్ప్రీత్ సింగ్ తెలిపారు. కాగా, ఇటలీ మధ్యవర్తి గుయిడో హ్యాష్కే, కార్లో గెరోసా నుంచి ముడుపులు తీసుకున్నట్లు అంగీకరించిన ఖైతా¯ŒS.. ఈ ముడుపులు డీల్‌ను ప్రభావితం చేసేందుకు మాత్రం కాదని వెల్లడించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. వీవీఐపీ హెలికాప్టర్లు ఎగరాల్సిన ఎత్తును 6వేల అడుగుల నుంచి తగ్గించేలా నిబంధనలు మార్చేలా 2005లో త్యాగి అంగీకరిచినట్లు తెలిపాయి. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు రూ. 450 కోట్ల ముడుపులు తీసుకుని త్యాగి నిబంధనలు మార్చేలా అధికారులను ప్రభావితం చేశారని సీబీఐ పేర్కొంది. కాగా, ఈ కేసుకు సంబంధించి త్యాగితోపాటు మరో 18 మందిపై (అతని సోదరులు, యురోపియ¯ŒS మధ్యవర్తులు, కంపెనీలు) సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణకు సహకరించేందుకు పలు దేశాలకు రొగేటరీ లెటర్ల (న్యాయపరమైన అభ్యర్థనలు)ను జారీ చేసింది. వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందంపై ఆరోపణలు రావటంతో 2014 జనవరిలో అప్పటి ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దుచేసింది. -
‘త్యాగిని అస్సలు కలవలేదు.. జూలీని పార్టీలో..’
న్యూఢిల్లీ: తాను వైమానిక దళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగిని అస్సలు కలవలేదని దేశంలో సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోళ్ల కుంభకోణం మధ్యవర్తి బ్రిటన్ పౌరుడు క్రిస్టియన్ మైఖెల్ తెలిపాడు. అయితే, త్యాగి కజిన్ సంజీవ్ అలియాస్ జూలీ త్యాగిని మాత్రమే ఓ పార్టీలో కలిశానని చెప్పాడు. ఆ సమయంలోనే జూలీ త్యాగి తనకు శక్తి వనరుల రంగంలో పనిచేస్తున్న ఓ ప్రభావవంతమైన వ్యక్తిని పరిచయం చేసినట్లు తెలిపాడు. అగస్టా కంపెనీ తరుపున తాను మధ్యవర్తిగా పని చేస్తున్న సమయంలో త్యాగితో అధికారికంగా అస్సలు మాట్లాడనే లేదని, కలవలేదని వివరించారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోళ్ల కుంభకోణం కేసు విషయంలో వైమానికదళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగిని శుక్రవారం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీకి చెందిన న్యాయవాది గౌతమ్ ఖైతాన్, సంజీవ్ త్యాగి అలియాస్ జూలీ త్యాగిని కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ ఒప్పందంలో ఈ ముగ్గురు అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ ఆరోపించింది. దీంతో త్యాగి అరెస్టు నేపథ్యంలో ఈ కుంభకోణం బప్పందంలో కీలక మధ్యవర్తిగా పనిచేసిన క్రిస్టియన్ మైఖెల్‌ను ఓ మీడియా సంప్రదించగా ఆయన ఈ వివరాలు తెలియజేశారు. -
‘అగస్టా వెస్ట్ ల్యాండ్’ కేసులో కీలక మలుపు
-
వాయు సేన మాజీ చీఫ్‌కు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాఫ్టర్ల కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) వాయు సేన మాజీ చీఫ్ ఎస్పీ త్యాగికి మంగళవారం సమన్లు జారీచేసింది. ఈనెల 5 వ తేది లోగా తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆదేశింది. మరోవైపు ఈ కేసు వ్యవహారాల్లో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న త్యాగి సోదరులను మే 6న ఈడీ ప్రశ్నించనుంది. భారత ప్రభుత్వం మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నపుడు ఉన్నతస్థాయి రాజకీయ నేతల వినియోగం కోసం 2010లో రూ. 3,600 కోట్లతో 12 హెలికాప్టర్ల కొనుగోలుకు ఆదేశమిచ్చింది. ఆ చాపర్లను అగస్టావెస్ట్‌ల్యాండ్ సరఫరా చేసింది. దాని మాతృ సంస్థ ఫిన్మెక్కానికా ఇటలీలో ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలన్నాయి. దర్యాప్తులో భారత్‌లోనూ ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
చాపర్ల కొనుగోలులో అవినీతి నిజమే!
► స్పష్టం చేసిన ఇటాలియన్ హైకోర్టు ► ఎస్పీ త్యాగి హస్తం ఉందని వెల్లడి రోమ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో అవినీతి చోటుచేసుకుందని, అందులో భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి హస్తం కూడా ఉందని ఇటాలియన్ హైకోర్టు స్పష్టం చేసింది. 2010లో జరిగిన ఈ ఒప్పందంలో 66-99 కోట్ల రూపాయల వరకు నిధులను అక్రమంగా భారతీయ అధికారుల ఖాతాల్లోకి మళ్లించినట్లు రుజువైందని కోర్టు చెప్పింది. మిలన్ హైకోర్టు ఇచ్చిన 225 పేజీల తీర్పులో, ప్రత్యేకంగా త్యాగి పాత్ర గురించి 17 పేజీలలో వివరించారు. వీవీఐపీల కోసం అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్లనే కొనుగోలు చేయాలని వైమానిక దళం నిర్ణయం తీసుకోవడంలో త్యాగి పాత్ర చాలా ఉందని కోర్టు చెప్పింది. అయితే దీనిపై స్పందించేందుకు త్యాగి నిరాకరించారు. ఇటాలియన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి పాఠాన్ని ఇంగ్లీషులో చూసిన తర్వాతే తాను మాట్లాడతాన్నారు. ఈ కేసులో తాను నిర్దోషినని ఆయన అంటున్నారు. అయితే అసలు ఆ కోర్టు ఎదుట త్యాగి విచారణకు హాజరు కాలేదు. ప్రస్తుతం ఆయనపై భారతదేశంలో సీబీఐ, ఈడీ కూడా విచారణ జరుపుతున్నాయి. రూ. 3,565 కోట్ల విలువైన అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు విషయంలో భారతీయ అధికారులకు లంచాలు ముట్టాయని మిలన్ హైకోర్టు స్పష్టం చేసింది. లంచాలు, అవినీతి వ్యవహారాలను రుజువు చేయలేమంటూ అంతకుముందు ఇదే విషయమై ఇటలీలోని దిగువకోర్టు ఇచ్చి తీర్పును మిలన్ హైకోర్టు కొట్టేసింది. నగదుతో పాటు ఆన్లైన్ నగదు బదిలీలు కూడా త్యాగి, ఆయన కుటుంబ సభ్యులకు చేరాయని తెలిపింది. 2005-07 సంవత్సరాల మధ్యకాలంలో త్యాగి భారత వైమానిక దళం అధిపతిగా ఉన్నారు. అప్పుడే వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందం జరిగింది.