వాయు సేన మాజీ చీఫ్కు ఈడీ సమన్లు | ED summons ex-IAF chief SP Tyagi in connection with money laundering probe | Sakshi
Sakshi News home page

వాయు సేన మాజీ చీఫ్కు ఈడీ సమన్లు

Published Tue, May 3 2016 11:50 AM | Last Updated on Thu, Sep 27 2018 5:03 PM

వాయు సేన మాజీ చీఫ్కు ఈడీ సమన్లు - Sakshi

వాయు సేన మాజీ చీఫ్కు ఈడీ సమన్లు

న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాఫ్టర్ల కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) వాయు సేన మాజీ చీఫ్ ఎస్‌పీ త్యాగికి మంగళవారం సమన్లు జారీచేసింది. ఈనెల 5 వ తేది లోగా తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆదేశింది. మరోవైపు ఈ కేసు వ్యవహారాల్లో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న త్యాగి సోదరులను మే 6న ఈడీ ప్రశ్నించనుంది.

భారత ప్రభుత్వం మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నపుడు ఉన్నతస్థాయి రాజకీయ నేతల వినియోగం కోసం 2010లో రూ. 3,600 కోట్లతో 12 హెలికాప్టర్ల కొనుగోలుకు ఆదేశమిచ్చింది. ఆ చాపర్లను అగస్టావెస్ట్‌ల్యాండ్ సరఫరా చేసింది. దాని మాతృ సంస్థ ఫిన్‌మెక్కానికా ఇటలీలో ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలన్నాయి. దర్యాప్తులో భారత్‌లోనూ ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement