రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ఆరోసారి సమన్లు జారీ చేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు లావాదేవీలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ సోరేన్‌పై కేసు నమోదు చేసింది.ఈ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందుకు రావాల్సిందిగా ఈడీ హేమంత్ సోరెన్‌కు వరుసగా ఆరోసారి సమన్లు పంపింది.
సోరేన్ మంగళవారం తమ ముందు హాజరయ్యే అవకాశం ఉందని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. రాంచీలోని జోనల్ ఆఫీసులో ఆయనను విచారించనున్నట్లు చెప్పారు. గతంలో ఇదే కేసులో ఐదోసారి ఈడీ పంపిన సమన్లపై సోరేన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈడీ పంపిన సమన్లపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.
ఇదీచదవండి..ఎదురెదురుగా ఢీకొన్న హైస్పీడ్,ఎక్స్‌ప్రెస్ రైళ్లు
Comments
Please login to add a commentAdd a comment