Jarkhand CM
-
కేంద్రంలో కూటమిదే విజయం: జార్ఖండ్ సీఎం
2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అయితే దీనికి ముందే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం దేశంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశం లేదు. అయితే ఎగ్జిట్ పోల్ కరెక్ట్ కాదని ఇండీయా కూటమి నేతలు అంటున్నారు. తాము 295 సీట్లు గెలుచుకుని, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వారు చెబుతున్నారు.జార్ఖండ్ ముక్తి మోర్చా ఇండయా కూటమిలో భాగం. రాష్ట్రంలో ఇండియా కూటమి 10కి పైగా సీట్లను గెలుచుకుంటుందని జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై సోరెన్ అన్నారు. ఇతర రాష్ట్రాల సీట్లతో కలిపి తాము మొత్తం 295 సీట్లు గెలుస్తామన్నారు. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నదానిలో వాస్తవం లేదు. జార్ఖండ్‌లో కూటమి పరిస్థితి బాగానే ఉందన్నారు. కాగా మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇండియా కూటమి లోక్‌సభలో 295 సీట్లు గెలవడం ఖాయమన్నారు. -
సోరెస్ అరెస్టుకు నిరసనగా జార్ఖండ్ బంద్!
బీహార్ తర్వాత జార్ఖండ్‌లో రాజకీయ గందరగోళం నెలకొంది. భూ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. హేమంత్ సోరెన్ అరెస్టుకు నిరసనగా జార్ఖండ్‌కు చెందిన పలు సంస్థలు గురువారం జార్ఖండ్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈరోజు (గురువారం) హైకోర్టులో హేమంత్ సోరెన్ పిటిషన్‌పై విచారణ జరగనుండగా, మరోవైపు చంపై సోరెన్ పట్టాభిషేకంపై చర్చలు జరుగుతున్నాయి. జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఈడీ కార్యాలయంలో నేటి (గురువారం) ఉదయం నుంచి దర్యాప్తు సంస్థ అధికారులు హేమంత్ సోరెన్‌ను విచారిస్తున్నారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నలు సంధిస్తున్నారు. కాగా ఈడీ తనను అరెస్ట్ చేయడంపై హేమంత్ సోరెన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన పిటిషన్‌పై ఈరోజు (గురువారం) ఉదయం 10.30 గంటలకు హైకోర్టులో విచారణ జరగనుంది. यह एक विराम है जीवन महासंग्राम है हर पल लड़ा हूं, हर पल लड़ूंगा पर समझौते की भीख मैं लूंगा नहीं क्या हार में, क्या जीत में किंचित नहीं भयभीत मैं लघुता न अब मेरी छुओ तुम हो महान, बने रहो अपने लोगों के हृदय की वेदना मैं व्यर्थ त्यागूंगा नहीं हार मानूंगा नहीं... जय झारखण्ड! pic.twitter.com/oduWMRGOmQ — Hemant Soren (@HemantSorenJMM) January 31, 2024 ఈడీ అరెస్టుకు ముందు హేమంత్ సోరెన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక కవితను పోస్ట్ చేసి.. ఇది తనకు కేవలం విరామమేనని రాశారు. తాను ఎప్పుడూ పోరాడుతుంటానని, భవిష్యత్తులో పోరాటం కొనసాగిస్తానని, ఎప్పుడూ రాజీ కోసం వేడుకోననని దానిలో పేర్కొన్నారు. #WATCH | Jharkhand: Morning visuals from Enforcement Directorate's office, in Ranchi where the ED is interrogating Hemant Soren in a money laundering case related to the alleged land scam. Hemant Soren stepped down as the Chief Minister of Jharkhand yesterday. pic.twitter.com/681hhYs5sy — ANI (@ANI) February 1, 2024 హేమంత్ సోరెన్ అరెస్టుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి ఒకటిన రాష్ట్రంలో బంద్ పాటించనున్నట్లు గిరిజన సంస్థలు ప్రకటించాయి. మరోవైపు శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్ ఎన్నికయ్యారు. అనంతరం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనను సమర్పించారు. జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రి చంపై సోరెన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. #WATCH | On Jharkhand CM Hemant Soren, state BJP spokesperson Pratul Shah Deo says, "...This was bound to happen in Jharkhand. CM was accused of being involved in a Rs 70,000 Crore scam. After selling everything, he sold defence land in Ranchi too. His problems increased after… pic.twitter.com/Na8fQ6Xmux — ANI (@ANI) February 1, 2024 హేమంత్ సోరెన్ గురించి బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షా దేవ్ మాట్లాడుతూ హేమంత్ సోరెన్ రూ. 70 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, చివరికి రాంచీలోని డిఫెన్స్ భూమిని కూడా అమ్మేశారని ఆరోపించారు. హేమంత్ సోరెన్ చట్టమే అత్యున్నతమనే విషయాన్ని మర్చిపోయారని, 40 గంటల పాటు కనిపించకుండా పోయారని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జార్ఖండ్‌కు మచ్చతెచ్చారని ఆరోపించారు. -
చంపై సోరెన్‌ను ‘జార్ఖండ్ టైగర్’ అని ఎందుకంటారు?
చంపై సోరెన్ జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా నిర్ణయం తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా .. చంపై సోరెన్ తదుపరి ముఖ్యమంత్రి అని ప్రకటించింది. చంపై.. హేమంత్ సోరెన్‌కు దగ్గరి బంధువని చెబుతారు. చంపై ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేఎంఎంతో పాటు కాంగ్రెస్ కూడా ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉంది. చంపై సోరెన్ ‘జార్ఖండ్ టైగర్’గా పేరొందారు. చంపై సోరెన్ జార్ఖండ్ శాసనసభ సభ్యుడు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నుంచి సెరైకెలా అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. చంపై క్యాబినెట్ మంత్రిగా హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగలు,షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. బీహార్ నుండి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం డిమాండ్ వచ్చినప్పుడు చంపై పేరు వార్తల్లో నిలిచింది. శిబు సోరెన్‌తో పాటు చంపై కూడా జార్ఖండ్ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రజలు చంపైని ‘జార్ఖండ్ టైగర్’ అని పిలవడం ప్రారంభించారు. చంపై 2005లో తొలిసారిగా జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. సెప్టెంబర్ 2010 నుండి జనవరి 2013 వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ, లేబర్, హౌసింగ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. చంపై.. జూలై 2013 నుండి డిసెంబర్ 2014 వరకు ఆహార, పౌర సరఫరాలు, రవాణా కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. 2014లో జార్ఖండ్ అసెంబ్లీకి మూడోసారి ఎన్నికయ్యారు. 2019లో నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. దీనితో పాటు హేమంత్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్రమ భూ కుంభకోణం కేసులో చిక్కుకున్న హేమంత్ సోరెన్ బుధవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కాంగ్రెస్ కూటమి సోరెన్ ప్రభుత్వంలో శాసనసభా పక్ష నేతగా రవాణా మంత్రి చంపై సోరెన్‌ను ఎన్నుకున్నాయి. హేమంత్ సోరెన్‌కు చంపై అత్యంత సన్నిహితుడని చెబుతారు. -
ఈడీ అధికారులపై కేసు పెట్టిన సీఎం సొరెన్
రాంచీ: తనపై విచారణ చేపడుతున్న ఈడీ అధికారులపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కేసు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో సొరెన్‌ను ప్రశ్నించడానికి బుధవారం ఆయన నివాసానికి ఈడీ బృందాలు వెళ్లాయి. కేవలం 10 రోజుల వ్యవధిలో ఆయనపై ఈడీ దర్యాప్తు చేయడం ఇది రెండోసారి. నేడు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న తరుణంలో సొరెన్ అరెస్టు కానున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. సొరెన్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో 144 సెక్షన్‌ను పోలీసులు విధించారు. అటు.. అరెస్టు వార్తల నేపథ్యంలో ఆయన భార్య కల్పనా సొరెన్‌ను ముఖ్యమంత్రిని చేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. అటు సొరెన్‌పై ఈడీ దాడులు రాజకీయంగానూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జార్ఖండ్‌లో భారీ భూకుంభకోణంలో హేమంత్ సొరెన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా భూమి యాజమాన్యాన్ని మార్చే మాఫియాకు సహకరించారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని సొరెన్ ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.36 లక్షలు, ఒక కారు, కొన్ని విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పనితీరుకు అంతరాయం కలిగించేందుకే ఈడీ తనను టార్గెట్ చేసిందని సొరెన్ ఆరోపిస్తున్నారు. ఇదీ చదవండి: హేమంత్ సోరెన్ తర్వాత జార్ఖండ్ సీఎం.. కల్పనా సోరెన్ ఎవరు? -
జార్ఖండ్ సీఎం సోరేన్‌కు ఆరోసారి ఈడీ సమన్లు..
రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ఆరోసారి సమన్లు జారీ చేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు లావాదేవీలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ సోరేన్‌పై కేసు నమోదు చేసింది.ఈ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందుకు రావాల్సిందిగా ఈడీ హేమంత్ సోరెన్‌కు వరుసగా ఆరోసారి సమన్లు పంపింది. సోరేన్ మంగళవారం తమ ముందు హాజరయ్యే అవకాశం ఉందని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. రాంచీలోని జోనల్ ఆఫీసులో ఆయనను విచారించనున్నట్లు చెప్పారు. గతంలో ఇదే కేసులో ఐదోసారి ఈడీ పంపిన సమన్లపై సోరేన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈడీ పంపిన సమన్లపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఇదీచదవండి..ఎదురెదురుగా ఢీకొన్న హైస్పీడ్,ఎక్స్‌ప్రెస్ రైళ్లు -
ఈడీ విచారణకు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్
-
జార్ఖండ్ సీఎం కు ఈడీ నోటీసులు..
-
జార్ఖండ్ సీఎం రాజీనామాపై కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ్యతం రద్దుపై సస్పెన్స్ కొనసాగుతోంది. గవర్నర్ నిర్ణయానికి ముందే సోరెన్ రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి చెందిన నేతలు రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్‌ను గురువారం సాయంత్రం కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం హేమంత్ సోరెన్ రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చీఫ్ బంధు టిర్కే. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేయట్లేదని స్పష్టం చేశారు. ‘ఆయన రాజీనామా చేయటం లేదు. గవర్నర్ న్యాయ సలహా కోసం వేచిచూస్తున్నారు. రెండు రోజుల్లో నిర్ణయం వెలువరుస్తామని మాకు చెప్పారు. మీడియాకు సమాచారం లీకవటంపై గవర్నర్‌ను ప్రశ్నించాం. అయితే, సమాచారం బయటకి వస్తోంది తన కార్యాలయం నుంచి కాదని చెప్పారు.’ అని పేర్కొన్నారు రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చీఫ్ బంధు టిర్కే. జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని గత మంగళవారం 32మంది శాసనసభ్యులను ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. ఈ క్రమంలో.. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎమ్మెల్యేలు వ్యూహాలు రచిస్తున్నట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు. ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తోందన్న ఆరోపణలతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌కు తరలించటం ఏడాదిన్నరలో ఇది మూడోసారి. ఈ ఏడాది జూన్‌లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా.. హరియాణా కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను రాయ్‌పుర్‌కు తరలించింది. 2021, ఏప్రిల్‌లో బీపీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి సైతం ఎమ్మెల్యేలను తీసుకెళ్లింది. ఇదీ చదవండి: Jharkhand Crisis: గవర్నర్‌ను కలవనున్న అధికార కూటమి నేతలు -
ధోని వీడ్కోలు మ్యాచ్ అక్కడే జరగాలి: సీఎం
న్యూఢిల్లీ : టీమీండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ తప్పుకుంటున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. అయితే గతేడాది న్యూడిలాండ్‌తో చివరి మ్యాచ్ ఆడిన ధోని ఆ తర్వాత జట్టుకు దూరంగా ఉంటూ ఏ స్థాయి క్రికెట్లో కూడా పాల్గొనలేదు. దీంతో ధోనికి గొప్పగా వీడ్కోలు పలికేందుకు అతని స్వస్థలం రాంచీలో ఓ ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించాలంటూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బీసీసీఐని కోరారు. జార్ఖండ్ ఆతిథ్యం ఇవ్వబోయే ఈ చివరి మ్యాచ్ కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తుందని ధోనికి ఫేర్వెల్ మ్యాచ్ రాంచీలో నిర్వహించాలని కోరుతూ ఆయన లేఖ రాశారు. ‘ఇక 7వ నెంబర్ జెర్సీలో హెలికాప్టర్ షాట్లు క్రికెట్ స్టేడియంలో కనిపించవు. దేశానికి, జార్ఖండ్‌కు ఎన్నో గర్వించదగ్గ విజయాలను ఇచ్చిన ధోనికి గొప్పగా విడ్కోలు పలుకుదాం అంటూ’ సీఎం హేమంత్ సోరెన్ బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. (3 కోట్ల వ్యూస్‌కు చేరువలో ధోని వీడ్కోలు పాట) గతేడాది కాలంగా ధోని రిటైర్మెంట్పై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత ధోనీ మళ్లీ క్లబ్ స్థాయి క్రికెట్ కూడా ఆడలేదు. కోట్లాది అభిమానుల్ని నిరాశకు గురిచేస్తూ టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు 16 ఏళ్ళ పాటు టీం ఇండియాకు సేవలు అందించిన ధోనీ.. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించి మరపురాని విజయాలు అందించాడు. 2007లో టి20 ప్రపంచ కప్, ఆ తర్వాత భారత అభిమానులంతా కలలు గన్న వన్డే వరల్డ్ కప్ (2011)తో పాటు 2013లో చాంపియన్ ట్రోఫీని కూడా సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మూడు ఐసీసీ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిపోయాడు. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వరకు ఐపీఎల్ 2020 జరుగనున్న సంగతి తెలిసిందే. (‘నీతోపాటు ఉన్నందుకు ఎంతో ఆనందించా ధోని’ ) देश और झारखण्ड को गर्व और उत्साह के अनेक क्षण देने वाले माही ने आज अंतराष्ट्रीय क्रिकेट से सन्यास ले लिया है।हम सबके चहेते झारखण्ड का लाल माही को नीली जर्सी पहने नहीं देख पायेंगे।पर देशवासियों का दिल अभी भरा नहीं। मैं मानता हूँ हमारे माही का एक फ़ेयरवेल मैच राँची में हो जिसका 1/2 pic.twitter.com/XFt5zBSvG8 — Hemant Soren (घर में रहें - सुरक्षित रहें) (@HemantSorenJMM) August 15, 2020 -
హోం క్వారంటైన్లోకి జార్ఖండ్ సీఎం
రాంచీ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం హోం క్వారంటైన్లోకి వెళ్లారు. పార్టీ ఎమ్మెల్యే మథుర మహతో, రాష్ట్ర మంత్రి మిథిలేష్ ఠాకూర్లకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సీఎం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే కరోనా వైరస్‌తో బాధపడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ముందుజాగ్రత్త చర్యగా తాను బుధవారం నుంచి కొన్నిరోజులు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నానని సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు. తన కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది అందరూ హోం క్వారంటైన్‌కు వెళ్లాలని ఆయన కోరారు. ముఖ్యమైన పనులను తాను ఇంటినుంచే నిర్వర్తిస్తానని చెప్పారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లోకి రావడం మానుకోవాలని, అత్యవసరమైతే మాస్క్‌లు ధరించే బయటకు రావాలని కోరారు. సీఎం సోరెన్ నివాసానికి వెళ్లే మార్గాలను అధికారులు మూసివేశారు.ఇక దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 22,752 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజే 482 మంది మరణించారు. చదవండి : జార్ఖండ్: హేమంత్ సొరేన్ ముందున్న సవాళ్లు -
జార్ఖండ్ 11వ సీఎంగా హేమంత్
రాంచీ: జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష నాయకులు, కేంద్రంలో అధికార బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల అధినేతలు ఎందరో తరలిరాగా అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. తెల్లరంగు కుర్తా పైజామా, ముదురు నీలం రంగు నెహ్రూ జాకెట్ ధరించి వచ్చిన 44 ఏళ్ల ఈ ఆదివాసీ నేత అందరినీ ఆకర్షించారు. గవర్నర్ ద్రౌపది ముర్ము ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఆరు నెలలు తిరక్కముందే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవడంతో విపక్షాల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి 47 స్థానాలతో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ప్రమాణ స్వీకారానికి హాజరైన వారిలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆయన సోదరి కనిమొళి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌లు ఉన్నారు. విపక్షాల బలం పెరుగుతూ ఉండడంతో వీరంతా చిరునవ్వుతో ఒకరినొకరు పలకరించుకున్నారు. సోరెన్‌తో పాటు కాంగ్రెస్ నాయకుడు అలంఘీర్ ఆలమ్, జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు రామేశ్వర్ ఒరాయన్, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద భోక్త కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రధాని అభినందనలు జార్ఖండ్ సీఎంగా పదవీ ప్రమాణం చేసిన సోరెన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తరఫు నుంచి వీలైనంత సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీఎంగా రెండోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన శిబూసోరెన్ వారసుడిగా హేమంత్ సోరెన్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఆయన రాష్ట్ర పగ్గాలను చేపట్టడం ఇది రెండోసారి. సోరెన్ గతంలో ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే సీఎంగా కేవలం 14 నెలలు మాత్రమే ఉన్నారు. బీజేపీయేతర పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి హేమంత్ పకడ్బందీ వ్యూహాలనే రచించారు. -
నేడు సీఎంగా హేమంత్ ప్రమాణం
న్యూఢిల్లీ/రాంచీ: హేమంత్ సోరెన్ నేతృత్వంలో జార్ఖండ్‌లో నూతన ప్రభుత్వం ఆదివారం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్‌తో పాటు కాంగ్రెస్, ఆర్జేడీల నుంచి ఒక్కొక్క మంత్రి చొప్పున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా, (జేఎంఎం) దాని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)ల్లో మంత్రుల ఎంపిక ఖరారైనట్లు తెలిసింది. దీని ప్రకారం జేఎంఎం నుంచి ఆరుగురికి, కాంగ్రెస్ నుంచి నలుగురికి, ఆర్జేడీ నుంచి ఒకరికి మంత్రి పదవులు ఖరారయ్యాయి. కాంగ్రెస్‌కు అసెంబ్లీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం. లేదా మరో మంత్రి పదవి వరించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో జేఎంఎం 30 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 స్థానం గెలుచుకున్నాయి. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని వెల్లడించాయి. కాగా, కాంగ్రెస్‌లో ఆ పార్టీ సీనియర్ నేతలు అలాంగిర్ ఆలం, రామేశ్వర్ ఓరాన్, రాజేంద్ర ప్రసాద్ సింగ్‌లకు మంత్రి పదవులు దాదాపు ఖరారయ్యారని, మరొకరిని ఎంపిక చేయాల్సి ఉందన్నాయి. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ముఖ్యమంత్రులు కమల్‌నాథ్ (మధ్యప్రదేశ్), భూపేశ్ బఘేల్ (ఛత్తీస్‌గఢ్), అశోక్ గెహ్లోత్ (రాజస్తాన్), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), ఉద్ధవ్ ఠాక్రే (మహారాష్ట్ర), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), హాజరుకానున్నారు. -
‘మూక దాడులకు పాల్పడితే సహించం’
రాంచీ : మూక దాడులకు పాల్పడే వారు ఏ కులం, మతానికి చెందిన వారైనా ఉపేక్షించబోమని జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్ స్పష్టం చేశారు. బైక్‌ను చోరీ చేశాడనే ఆరోపణలపై ముస్లిం యువకుడిపై ఇటీవల జరిగిన మూక దాడిని ప్రస్తావిస్తూ ఈ ఘటనను తమ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని, నేరగాళ్లను కఠినంగా శిక్షించడంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ తరహా కేసులను ఫాస్ట్‌ట్రాక్ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడం జార్ఖండ్ దేశంలోనే తొలి రాష్ట్రమని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ జార్ఖండ్ ఘటనపై రాజ్యసభలో స్పందిస్తూ ఈ తరహా చర్యలు తనను బాధించాయని, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. తబ్రేజ్ అన్సారీ అనే వ్యక్తిని అల్లరి మూకలు చుట్టుముట్టి జై శ్రీరాం, జై హనుమాన్ అని నినదించాలని కోరుతూ దాడికి పాల్పడిన వీడియో కలకలం రేపింది. మూక దాడికి గురైన అన్సారీ ఆ తర్వాత మరణించారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని తమ ప్రభుత్వం నేరగాళ్లపై చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని జార్ఖండ్ సీఎం దాస్ కోరారు. -
ఒడిశాలో ‘రైతుబంధు’
భువనేశ్వర్: రైతులకు అండగా నిలిచేందుకు ఒడిశా ప్రభుత్వం ఓ భారీ పథకాన్ని ప్రారంభించింది. రైతులకు పెట్టుబడి వ్యయం, భూముల్లేని వారికి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రోత్సాహం, వృద్ధాప్యం, అంగవైకల్యం తదితర కారణాలతో వ్యవసాయం చేయలేని స్థితిలో ఉన్న రైతులకు ఆర్థిక సహాయం తదితరాలు ఈ పథకంలో ఉన్నాయి. కలియా (కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్‌కం ఆగ్మెంటేషన్) పేరుతో కొత్త పథకాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శుక్రవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రకటించారు. ఈ పథకం కింద 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. 10,180 కోట్లను ఒడిశా ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న రుణమాఫీ హామీలు అర్థరహితమని నవీన్ పట్నాయక్ అన్నారు. రుణమాఫీ కన్నా తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకంతోనే రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందనీ, అధిక శాతం మందికి ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన తెలిపారు. ఒడిశాలో దాదాపు 32 లక్షల మంది రైతులుంటే కేవలం 20 లక్షల మందే పంటరుణాలను తీసుకున్నారనీ, రుణమాఫీ ప్రకటిస్తే మిగిలిన 12 లక్షల మందికి ప్రయోజనం ఉండదనీ, తమ కలియా పథకం మాత్రం 30 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తుందని పట్నాయక్ వివరించారు. ఇవీ పథకం ప్రయోజనాలు ► భూ విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా వ్యవసాయం చేసే ప్రతీ కుటుంబానికి ఒక్కో సీజన్లో (ఖరీఫ్, రబీ) పెట్టుబడి కోసం రూ. 5,000 ఆర్థిక సాయం. కౌలు రైతులు కూడా ఈ మొత్తం పొందడానికి అర్హులే. ► గొర్రెలు, కోళ్లు, బాతులు, తేనెటీగల పెంపకం దార్లకు, చేపలు పట్టే వారికి అవసరమైన సామగ్రిని సమకూర్చుకునేందుకు రూ. 12,500 ఆర్థిక సాయం. భూమి లేని వారే ఇందుకు అర్హులు. వీటిలో ఏదో ఒక దాన్నే ఎంచుకోవాలి. ► వృద్ధాప్యం, అంగవైకల్యం, రోగాలు తదితర కారణాల వల్ల వ్యవసాయం చేయలేకపోతున్న రైతులకు ఒక్కో ఇంటికి ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం. లబ్ధిదారులను గ్రామ పంచాయతీలు ఎంపిక చేస్తాయి. ► భూమి ఉన్న, లేని రైతులనే భేదం లేకుండా అందరికీ రూ. 2 లక్షల జీవిత బీమా, మరో రూ. 2 లక్షల ప్రమాద బీమా ► 50 వేల వరకు రుణాలపై వడ్డీ ఉండదు. జార్ఖండ్‌లోనూ కొత్త పథకం ఒడిశా తరహాలోనే జార్ఖండ్‌లోనూ ఓ పథకాన్ని రైతుల కోసం సీఎం రఘుబర్‌దాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం కింద రూ. 2,250 కోట్లను ఖర్చు చేయనుండగా, 22.76 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు లబ్ధి పొందనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు ప్రభుత్వం ఏడాదికి రూ. 5,000 ఆర్థిక సాయం అందజేయనుంది. గరిష్టంగా ఐదెకరాల వరకు భూమి ఉన్న రైతులు ఈ సాయం పొందేందుకు అర్హులు. రైతులు విత్తనాలు, ఎరువులు, తదితరాలను సమకూర్చుకునేందుకు ఈ పథకం సాయపడుతుంది. -
23న ‘ఆయుష్మాన్ భారత్’
రాంచీ/న్యూఢిల్లీ: ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ఈ నెల 23న ప్రధాని మోదీ జార్ఖండ్ నుంచి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని జార్ఖండ్ ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాన్ని జార్ఖండ్ నుంచి ప్రారంభించాలని ప్రధాని నిర్ణయించడం మాకు గర్వకారణం’ అని జార్ఖండ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలోని 3.25 కోట్ల మంది ప్రజలతో సహా భారతీయులంతా ఈ చారిత్రక సందర్భం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చైనా పర్యటనలో ఉన్న జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్ ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 23న ఈ కార్యక్రమం సందర్భంగా.. కోడర్మాలో మెడికల్ కాలేజీకి, చాయ్‌బాసాలో కేన్సర్ ఆసుపత్రికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. బిర్సాముండా జైలు పునరుద్ధరణ పనులనూ మోదీ ప్రారంభిస్తారు. ఆయుష్మాన్ భారత్ భేష్! కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించింది. 50 కోట్ల మంది పేదలకు (10కోట్ల కుటుంబాలకు) ఏడాదికి రూ.5లక్షల ఆరోగ్య బీమా అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చొరవ భేష్ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అభినందించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకమని.. ప్రధాని చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘సార్వత్రిక ఆరోగ్య బీమా కార్యక్రమమైన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప మార్పుకు సంకేతం. ప్రధానికి కృతజ్ఞతలు. ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు కృతజ్ఞతలు’ అని టెడ్రోస్ గురువారం ీæ్వట్ చేశారు. డబ్ల్యూహెచ్‌వో డీజీకి కేంద్ర మంత్రి నడ్డా ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ అందరికీ అందాలనేదే మోదీ లక్ష్యమన్నారు. ‘డాక్టర్ టెడ్రోస్ మీతో సమావేశం ఫలప్రదంగా జరిగింది. అందరికీ ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండాలని మోదీ సంకల్పించారు. 50 కోట్ల మందికి (అమెరికా, కేనడా, మెక్సికో దేశాల జనాభా కలిపితే) ఒక్కొక్కరికి రూ. 5లక్షల ఆరోగ్య బీమా అందుబాటులో ఉంటుంది’ అని నడ్డా ట్వీట్ చేశారు. -
జార్ఖండ్ సీఎం హెల్మెట్ లేకుండానే...
-
కోర్టుకు హాజరైన ముఖ్యమంత్రి
ఏవైనా కేసులు నమోదైతే చాలు.. వాటికి వెంటనే బెయిల్ తెచ్చుకోవడం, కోర్టు మెట్లు ఎక్కకుండా జాగ్రత్తగా తప్పించుకోవడం కొందరు ముఖ్యమంత్రులకు ఉన్న అలవాటు. కానీ జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ మాత్రం అలా చేయలేదు. 2009 నాటి లోక్‌సభ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఆయన స్వయంగా ఓ స్థానిక కోర్టుకు హాజరయ్యారు. ఇదే కేసులో ఉన్న మరో సహ నిందితుడితో కలిసి ఆయన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్ఘేట్ జీకే తివారీ ఎదుట హాజరయ్యారు. బిస్తుపూర్ సమీపంలో జిల్లా అధికార యంత్రాంగం నుంచి ముందస్తు అనుమతి లేకుండా దాస్‌తో పాటు మరో 12 మంది బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ జెండాలను ఎగరేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితులందరి వాంగ్మూలాలను నమోదు చేసిన కోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది. మరో కేసులో కూడా సీఎం రఘువర్ దాస్, మరో 22 మంది నిందితులు కలిసి 2007లో నమోదైన కేసు విచారణకు సబ్ డివిజనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అశోక్‌కుమార్ ఎదుట హాజరయ్యారు. అధికారుల అనుమతి లేకుండా ఓ ఆలయానికి ప్రహరీ నిర్మించిన కేసులో అరెస్టయిన నిందితులను బలవంతంగా తీసుకెళ్లిపోయినట్లు దాస్, 22 మంది బీజేపీ కార్యకర్తలతో పాటు 500 మంది గుర్తు తెలియని వ్యక్తుల మీద కేసు నమోదైంది. ఈ కేసులో కూడా దాస్ చెప్పిన విషయాలను నమోదు చేసిన కోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసింది. ఈ రెండు కేసులలోనూ తాను నిర్దోషినని, నాటి అధికార పార్టీలు తనను తప్పుడు కేసుల్లో ఇరికించాయని దాస్ అన్నారు. -
జార్ఖండ్ సీఎం పీఠంపై హేమంత్ సోరెన్