రాంచీ: తనపై విచారణ చేపడుతున్న ఈడీ అధికారులపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కేసు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో సొరెన్‌ను ప్రశ్నించడానికి బుధవారం ఆయన నివాసానికి ఈడీ బృందాలు వెళ్లాయి. కేవలం 10 రోజుల వ్యవధిలో ఆయనపై ఈడీ దర్యాప్తు చేయడం ఇది రెండోసారి.
నేడు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న తరుణంలో సొరెన్ అరెస్టు కానున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. సొరెన్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో 144 సెక్షన్‌ను పోలీసులు విధించారు. అటు.. అరెస్టు వార్తల నేపథ్యంలో ఆయన భార్య కల్పనా సొరెన్‌ను ముఖ్యమంత్రిని చేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. అటు సొరెన్‌పై ఈడీ దాడులు రాజకీయంగానూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
జార్ఖండ్‌లో భారీ భూకుంభకోణంలో హేమంత్ సొరెన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా భూమి యాజమాన్యాన్ని మార్చే మాఫియాకు సహకరించారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని సొరెన్ ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.36 లక్షలు, ఒక కారు, కొన్ని విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పనితీరుకు అంతరాయం కలిగించేందుకే ఈడీ తనను టార్గెట్ చేసిందని సొరెన్ ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: హేమంత్ సోరెన్ తర్వాత జార్ఖండ్ సీఎం.. కల్పనా సోరెన్ ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment